
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో దళితులపై అత్యాచార ఘటనలు పెరుగిపోతున్నాయని, వారిపై అత్యాచారాల విషయంలో ఉత్తర ప్రదేశ్ కన్నా ఘోరంగా తెలంగాణ మారిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. దళితులపై అత్యాచారాలు, హింసకు రాష్ట్రం కేంద్రబిందువుగా మారుతోందన్నారు. టీపీసీసీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో గాంధీ భవన్లో ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా పలు అత్యాచార ఘటనల్లోని ఎనిమిది బాధిత కుటుంబాలను ఉత్తమ్‌తోపాటు పార్టీ నేతలు పరామర్శించారు. అనంతరం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న అత్యాచార ఘటనలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ బాధిత కుటుంబాలకు అన్ని విధాలా న్యాయం జరిగేంతవరకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గాంధీ భవన్లో దళిత కుటుంబాల పరామర్శ సందర్భంగా ఒక్కో కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ తరఫున రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని ఉత్తమ్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment