
డల్లాస్ ప్రధాన కార్యాలయంగా కలిగిన ఐటీ కన్సల్టింగ్ కంపెనీ 'టాచ్యోన్ టెక్నాలజీస్' (Tachyon Technologies) హైదరాబాద్‌లో గ్లోబల్ డెలివరీ సెంటర్‌ను ప్రారంభించింది. దీనిని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఐటీ రంగంలో ముఖ్యమైన సేవలు అందిస్తూ ఈ సంస్థ ఎంతో మంది నిపుణులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని ఆయన ఆకాంక్షించారు.
ఇదీ చదవండి: బంగారం, వెండి ధరల అప్‌డేట్.. తులం ఎంతంటే..
35000వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సంస్థ వందలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ఐటీ రంగంలో మెరుగైన సేవలు అందించేలా పనిచేయాలని మంత్రి సూచించారు. ఐటీ రంగంలో రానున్న ఆరు నెలల్లో శాప్(SAAP), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI), సాఫ్ట్‌వేర్ టెస్టింగ్‌ల్లో అత్యంత నైపుణ్యం కలిగిన 500 మంది నిపుణులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కంపెనీ సీఈవో వెంకట్ కొల్లి చెప్పారు. తమ సంస్థకు డల్లాస్‌లో ప్రధాన కార్యాలయం ఉందని అమెరికా, కెనడా, మెక్సికో, యూకేలో బ్రాంచ్‌లు ఉన్నాయన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన గ్లోబల్ డెలివరీ సెంటర్ సరికొత్త ఆవిష్కరణలు చేస్తూ క్లయింట్‌కు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పని చేస్తుందని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment