Delivery centre
-
హైదరాబాద్‌లో టాచ్యోన్ గ్లోబల్ డెలివరీ సెంటర్
డల్లాస్ ప్రధాన కార్యాలయంగా కలిగిన ఐటీ కన్సల్టింగ్ కంపెనీ 'టాచ్యోన్ టెక్నాలజీస్' (Tachyon Technologies) హైదరాబాద్‌లో గ్లోబల్ డెలివరీ సెంటర్‌ను ప్రారంభించింది. దీనిని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఐటీ రంగంలో ముఖ్యమైన సేవలు అందిస్తూ ఈ సంస్థ ఎంతో మంది నిపుణులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని ఆయన ఆకాంక్షించారు.ఇదీ చదవండి: బంగారం, వెండి ధరల అప్డేట్.. తులం ఎంతంటే..35000వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సంస్థ వందలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ఐటీ రంగంలో మెరుగైన సేవలు అందించేలా పనిచేయాలని మంత్రి సూచించారు. ఐటీ రంగంలో రానున్న ఆరు నెలల్లో శాప్(SAAP), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI), సాఫ్ట్వేర్ టెస్టింగ్‌ల్లో అత్యంత నైపుణ్యం కలిగిన 500 మంది నిపుణులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కంపెనీ సీఈవో వెంకట్ కొల్లి చెప్పారు. తమ సంస్థకు డల్లాస్‌లో ప్రధాన కార్యాలయం ఉందని అమెరికా, కెనడా, మెక్సికో, యూకేలో బ్రాంచ్‌లు ఉన్నాయన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన గ్లోబల్ డెలివరీ సెంటర్ సరికొత్త ఆవిష్కరణలు చేస్తూ క్లయింట్‌కు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పని చేస్తుందని అధికారులు తెలిపారు. -
హైదరాబాద్‌లో భారీ సాఫ్ట్వేర్ డెలివరీ సెంటర్
హైదరాబాద్: సాఫ్ట్వేర్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ (టీసీఎస్) హైదరాబాద్‌లోని ఆదిభట్లలో భారీ సాఫ్ట్వేర్ డెలివరీ సెంటర్‌ని ఏర్పాటు చేస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఇది మొదలు కావొచ్చని సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అజయేంద్ర ముఖర్జీ తెలిపారు. 79 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ సెంటర్లో సుమారు 26,000 మంది ఉద్యోగులు ఉండగలరని పేర్కొన్నారు. అయితే, దీనిపై ఎంత పెట్టుబడి పెడుతున్నదీ వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని వివిధ డెలివరీ సెంటర్లలో 24,000 మంది పైచిలుకు సిబ్బంది ఉన్నారని ఆయన వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా టీసీఎస్‌లో 27,000 మంది ఉద్యోగులు చేరారని, మిగతా వ్యవధిలో మరో 23,000 మంది చేరొచ్చని ముఖర్జీ పేర్కొన్నారు. మరోవైపు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 25,000 మందిని తీసుకోవచ్చని, ఇందులో సుమారు 75% మంది చేరొచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ క్యాంపస్‌లకు సంబంధించి వచ్చే ఏడాది దాదాపు 3,000-3,500 దాకా ఉద్యోగులను తీసుకునే అవకాశం ఉందన్నారు.