సాక్షి, హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, వెంకటదత్త సాయి వివాహ వేడుకల్లో భాగంగా నేడు మరో కార్యక్రమం హైదరాబాద్ నగరంలో జరగనుంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న అన్వయ కన్వెన్షన్స్ వేదికగా మంగళవారం రిసెప్షన్ జరుగుతుంది. దీనికి పెద్ద ఎత్తున క్రీడా, సినిమా, రాజకీయ రంగ ప్రముఖులు హాజరు కానున్నారు. ప్రధాని, ముఖ్యమంత్రి మొదలు సచిన్ టెండూల్కర్ తదితరులను సింధు ఆహ్వానించింది.
కుటుంబ సభ్యులు, ఆత్మీయుల మధ్య ఆదివారం రాత్రి రాజస్తాన్‌లోని ఉదయపూర్‌లో సింధు పెళ్లి జరిగింది. అత్యంత సన్నిహితులైన కొందరు అతిథులు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివాహానికి హాజరైన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ వధూవరులను ఆశీర్వదించారు. రెండు ఒలింపిక్ స్వర్ణాలు, ఐదు ప్రపంచ చాంపియన్‌షిప్ పతకాలు సహా పలు గొప్ప విజయాలతో భారత అత్యుత్తమ ప్లేయర్లలో ఒకరిగా సింధు గుర్తింపు తెచ్చుకోగా... పొసిడెక్స్ టెక్నాలజీస్ కంపెనీకి దత్తసాయి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment