బంగారం, వెండి ధరల అప్‌డేట్‌.. తులం ఎంతంటే.. | today gold and silver price updates | Sakshi
Sakshi News home page

బంగారం, వెండి ధరల అప్‌డేట్‌.. తులం ఎంతంటే..

Published Tue, Jan 21 2025 12:07 PM | Last Updated on Tue, Jan 21 2025 12:45 PM

today gold and silver price updates

ఈక్విటీ మార్కెట్లు ఇటీవల ఒడిదొడుకుల్లో కదలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో సేఫ్డ్‌ అసెట్‌గా భావించే బంగారం(Gold)లో పెట్టుబడులు కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. నిన్నటి ధరతో పోలిస్తే మంగళవారం బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు గోల్డ్ రేట్లు(Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.

హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.74,500 (22 క్యారెట్స్), రూ.81,230 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవారం ధరలతో పోలిస్తే ఈ రోజు బంగారం ధర స్థిరంగానే కొనసాగుతుంది. చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు వరుసగా రూ.74,500 రూ.81,230గా ఉంది.

దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే ఎలాంటి మార్పులేదు. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.74,650గా ఉండగా, 24 క్యారెట్‌ బంగారం ధర రూ.81,380గా ఉంది. మంగళవారం బంగారం ధరల మాదిరిగానే వెండి ధర(Silver Price)ల్లో మార్పులు ఏవీ లేవు. ఈ రోజు వెండి ధర కేజీకి రూ.1.04,000గా ఉంది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement