women harrassement
-
మేడారం అటవీ ప్రాంతంలో దారుణం..
వరంగల్: పని కోసం రోడ్డుపై వెళ్తున్న ఓ వివాహితను కారులో ఎక్కించుకుని ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారం చేసిన ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. వరంగల్ నగరంలోని 3వ డివిజన్ పరిధిలోని పైడిపల్లి గ్రామానికి చెందిన ఓ వివాహిత అదే గ్రామానికి చెందిన మరో మహిళతో పని నిమిత్తం ఏప్రిల్ నెల 20వ తేదీ ఉదయం ఆరెపల్లి గ్రామ సమీపంలో రోడ్డుపై వెళ్తుండగా.. ములుగు జిల్లా జంగాలపల్లికి చెందిన ఎస్.రవి అనేవ్యక్తి ఎ.రమేశ్ అనే వ్యక్తితో కలసి కారులో (తెల్లరంగు బ్రెజా) వచ్చి మహిళలిద్దర్నీ ఎక్కించుకుని ములుగు వైపు బయల్దేరారు. ఓ మహిళ మార్గమధ్యంలోనే దిగిపోగా, కొంతదూరం వెళ్లాక ములుగు జిల్లాకు చెందిన డి.నాగరాజు, హన్మకొండకు చెందిన బి.లక్ష్మణ్, వర్ధన్నపేటకు చెందిన బి.సుధాకర్ అనే యువకులు కారులో ఎక్కారు. ఈ ఐదుగురు కలసి కారులో ఉన్న మహిళను బెదిరిస్తూ మేడారం అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ ముగ్గురు యువకులు అత్యాచారం చేయగా మిగిలిన ఇద్దరు యువకులు సహకరించారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని ఆ మహిళను బెదిరించి ములుగు తీసుకొచ్చి అక్కడ బస్సు ఎక్కించి వెళ్లిపోయారు. సదరు బాధితురాలు ములుగురోడ్డు వద్ద బస్సుదిగి తన భర్తకు ఫోన్ చేసింది. ఎక్కడికి వెళ్లావని నిలదీయడంతో ఆమె భయపడి కరీంనగర్ జిల్లాలోని పుట్టింటికి వెళ్లిపోయింది. గత నెల 29న ఫిర్యాదు చేసిన భర్త.. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు ఏప్రిల్ 25న ఏనుమాముల పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. పుట్టింటి దగ్గర ఉన్నట్లు భార్య చెప్పడంతో అక్కడకు వెళ్లిన భర్తకు సామూహిక అత్యాచారం సంగతి తెలిసింది. దీంతో బాధితురాలు, ఆమె భర్త ఏప్రిల్ 29న కలసి ఫిర్యాదు చేయగా పోలీసులు ఐదుగురు యువకులతోపాటు సామూహిక అత్యాచారానికి సహకరించిన మరో మహిళపై కూడా గ్యాంగ్‌రేప్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అనంతరం ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. మరో మహిళ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, బాధితురాలిని భరోసా కేంద్రానికి తరలించారు. ఇది కూడా చదవండి: నేను నిర్దోషిని.. దేవ్, సీతలు పిలిచారనే వెళ్లా.. థాయ్ పేకాట వ్యవహారంపై చికోటి స్పందన -
HCU: విదేశీ విద్యార్థినిపై లైంగికదాడియత్నం.. ప్రొఫెసర్ సస్పెండ్
సాక్షి, హైదరాబాద్: నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో థాయిలాండ్ విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారయత్నం చేసిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. కాగా, ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ప్రొఫెసర్ రవిరంజన్‌పై కేసు నమోదు చేశారు. ఈ సందర్బంగా పోలీసులు సెంట్రల్ యూనివర్సిటీకి చేరుకున్నారు. ఈ క్రమంలో ఏసీపీ రఘునందన్ మీడియాతో మాట్లాడుతూ.. బాధిత విద్యార్థిని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నాము. హిందీ నేర్పిస్తానని థాయ్‌లాండ్ విద్యార్థిని ఇంటికి పిలిచి ప్రొఫెసర్ రవిరంజన్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. సాఫ్ట్ డ్రింక్‌లో లిక్కర్ కలిపి అత్యాచారం చేయబోయాడు. విద్యార్థిని ప్రతిఘటించి పోలీసులకు ఫిర్యాదు చేసిందని తెలిపారు. మరోవైపు.. విద్యార్థినిపై అత్యాచార ఘటన నేపథ్యంలో హిందీ ప్రొఫెసర్ రవిరంజన్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. ఇక, దారుణ ఘటన నేపథ్యంలో సెంట్రల్ యూనివర్శిటీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గేట్ ముందు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. రవిరంజన్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. -
అలర్ట్: సరుకుల డెలివరీ కోసం వచ్చి.. మహిళతో అసభ్యకర ప్రవర్తన..
ఇటీవలే కొరియాకు చెందిన ఓ యూట్యూబర్‌తో కొందరు యువకులు అనుచితంగా ప్రవర్తించిన ఘటన మరువకముందే మహారాష్ట్రలో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సరుకులు డెలివరీ చేసేందుకు ఓ కస్టమర్ట్ ఇంటికి వెళ్లిన డెలివరీ బాయ్.. మహిళను లైంగిక వేధింపులకు గురిచేశాడు. అంతటితో ఆగకుండా ఈ ఘటనను వీడియో తీసేందుకు ప్రయత్నించాడు. ఈ షాకింగ్ ఘటన ఖర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఖర్ పశ్చిమ ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో సబీనా ఆమె కుటుంబంలో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో సరుకుల డెలివరీ కోసం ఆన్లైన్ డెలివరీ సంస్థను ఆశ్రయించింది. దీంతో, ఆన్లైన్ సంస్థకు చెందిన షాజాదే షేక్ సరుకులను తీసుకుని ఆమె ఇంటికి వెళ్లాడు. ఈ సందర్భంగా ఇంట్లో ఎవరూ లేకపోవడాన్ని డెలివరీ బాయ్ గమనించాడు. ఈ క్రమంలోనే సరుకుల డెలివరీ తర్వాత.. వీడియో తీయాలని చెప్పి ఫోన్లో వీడియో మోడ్ ఆన్‌చేశాడు. అనంతరం.. ఆమె చేయి పట్టుకుని అనుచితంగా, అసభ్యకరంగా ప్రవర్తిస్తూ లైంగికంగా వేధింపులకు గురిచేశాడు. Another #Mumbai molestation horror as a delivery boy molests a girl who had ordered groceries via #Zepto App. The delivery boy entered the house forcefully.@AtkareSrushti reports | @ZeptoNow @zeptocares pic.twitter.com/vvNYbRD1rV — Mirror Now (@MirrorNow) December 2, 2022 దీంతో, ఒక్కసారిగా షాకైన బాధితురాలు.. వెంటనే కిచెన్‌లో ఉన్న ల్యాండ్‌లైన్ ఫోన్ సాయంతో సెక్యూర్టీకి కాల్ చేసింది. వెంటనే స్పందించిన అక్కడికి వచ్చిన సెక్యూర్టీగార్డ్ అతడిని అడ్డుకున్నాడు. అనంతరం, అతడిలో చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని బాధితురాలు వీడియోను డిలీట్ చేసింది. ఇక, తనకు జరిగిన చేదు అనుభవాన్ని ట్విట్టర్ వేదికగా ఆమె తెలిపింది. ఈ క్రమంలో సదరు డెలివరి సంస్థపై బాధితురాలు సీరియస్ కామెంట్స్ చేసింది. ఇలాంటి వారితో రోజు ఇంకెంత మంది మహిళలు వేధింపులు ఎదుర్కొంటున్నారో అని ఆవేదన వ్యక్తం చేసింది. తర్వాత, సదరు బాధితురాలు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు. @CPMumbaiPolice @bombaytimes @timesofindia @MumbaiPolice @ZeptoNow #harssment #WomenSafety #womenharssment #justice #mumbai #zepto #harssment pic.twitter.com/gJop6NAk6T — Sabeena (@sabeenasyed8) December 1, 2022 ఇక, ఘటనపై సదరు డెలివరీ సంస్థ స్పందించింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది. ‘మేము ఇలాంటి విషయాలను సీరియస్‌గా తీసుకుంటాము. స్థానిక చట్టాన్ని అమలు చేసే సంస్థలతో ఘటనపై సమగ్ర విచారణ జరిపించి.. విచారణలో మేము కూడా పాల్గొంటున్నాము. ఇలాంటి ప్రవర్తనను త్రీవంగా ఖండిస్తున్నాము. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము’ అని తెలిపారు. Hi Sabeena, We take such matters with utmost seriousness. We are partaking in a thorough investigation of the incident with the local law enforcement bodies. We condemn such behavior. Stringent action will be taken on perpetrators based on facts. — Zepto Cares (@zeptocares) December 1, 2022 -
పట్టపగలే యూపీలో దారుణం.. షాకింగ్ వీడియో
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో రోజురోజుకూ మహిళలపై దాడులు, హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయి. రెండు క్రితమే యూపీలో కొందరు వ్యక్తులు ఓ మహిళకు మద్యం తాగించి సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన మరువకముందే మరో దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మతిస్థిమితం సరిగాలేని ఓ యువతి పట్ల కొందరు వ్యక్తులు అనుచితంగా ప్రవర్తించారు. ఈ ఘటనపై మీరట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దౌరాలా పోలీస్ స్టేషన్ పరిధిలో సెప్టెంబర్ 19వ తేదీన కొందరు వ్యక్తులు పట్టపగలే ఓ యువతిని దారుణంగా కొట్టారు. ఇద్దరు వ్యక్తులు.. ఆమె కాళ్లు, చేతులను పట్టుకుని ఈడ్చుకెళ్లారు. అనంతరం, వారు ఆమెపై దాడి చేశారు. ఈ క్రమంలోనే బాధితురాలు సహాయం కోసం వేడుకుంది. తనను వదిలేయాలని గట్టిగా అరుస్తూ కేకలు వేసింది. ఈ ఘటన సందర్భంగా చుట్టుపక్కలు చాలా మంది ఉన్నప్పటికీ ఆమెను ఎవరూ కాపాడలేదు. ఆమెపై దాడిని కొందరు మొబైల్ ఫోన్లలో రికార్డు చేశారు. తాజాగా ఈ వీడియో పోలీసులకు చేరింది. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం బాధితురాలికి బరేలీలోని ఆసుప్రతిలో వైద్య చికిత్సలు అందిస్తున్నామని అన్నారు. ఇదిలా ఉండగా.. రెండు రోజుల క్రితమే యూపీలోని బదోస్ రాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళపై సామూహిక లైంగిక దాడి జరిగింది. బాధితురాలికి తెలిసిన వ్యక్తి ఆమెను.. తన భర్త పిలుస్తున్నాడని చెప్పి ఆమెను గ్రామ శివారులోని చెరువు వద్దకు తీసుకువెళ్లాడు.అప్పటికే అక్కడ మరో ముగ్గురు యువకులు ఉన్నారు. వారంతా తనకు తెలిసిన వారే కావడంతో మాట్లాడింది. అనంతరం, నిందితులు ఆమెతో బలవంతంగా మద్యం తాగించారు. ఆ తరువాత వరుసగా ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించారు. దీంతో, కొన్ని రోజులు మౌనంగా బాధను దిగమింగిన మహిళ.. చివరకు ధైర్యం చేసి భర్తకు జరిగిన విషయం చెప్పింది. అనంతరం, వారు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు. మిగతా ముగ్గురి కోసం గాలిస్తున్నారు. మరోవైపు.. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) తాజా డేటా ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లో 2022 జనవరి నుండి ఆగస్టు వరకు మహిళలపై నేరాలకు సంబంధించి మొత్తం 56,083 కేసులను నమోదు చేసింది, ప్రతి లక్ష జనాభాకు 50.5 నేరాల రేటుగా నమోదైంది. మహిళలపై నేరాలకు సంబంధించి దాదాపు 31,000 ఫిర్యాదులు గత ఏడాది జాతీయ మహిళా కమిషన్ (NCW)కి అందాయి. యూపీలో 2020తో పోలిస్తే 2021లో మహిళలపై నేరాల ఫిర్యాదులు 30 శాతం పెరిగాయి. -
విజయవాడలో దారుణం.. స్నేహితుల పనేనా..?
‘‘విజయవాడ పటమటలో నివసించే ఓ వివాహిత ఫొటోలను ఓ ఆగంతకుడు అసభ్యంగా మార్ఫింగ్ చేసి ఆమె వాట్సాప్కే పోస్ట్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. పలు దఫాలుగా రూ.25 వేలు వసూలు చేశాడు. ఆ తరువాత ఆమె వద్ద డబ్బులు లేవని తెలుసుకున్న ఆ కీచకుడు అవే ఫొటోలను ఆమె భర్తతో పాటు మరికొందరికి పోస్ట్ చేశాడు. బాధిత మహిళ భర్త సహకారంతో ఇటీవల సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండేళ్ల క్రితం ఆమెతో పాటు కాలేజీలో చదువుకున్న ఇద్దరు వ్యక్తులు ఈ సైబర్ నేరానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించి నిందితులను అరెస్ట్ చేశారు. విజయవాడ కృష్ణలంకకు చెందిన మహిళ సోషల్ మీడియా మాయగాళ్ల వేధింపులతో కొన్ని నెలలు మానసిక వేదన అనుభవించింది. ఆ వేధింపులను తాళలేక ఈ గండం నుంచి కాపాడాలంటూ ఓ స్నేహితుడిని సాయం కోరింది. అయినా ఫలితం లేకపోవడంతో చేసేది ఏమీలేక ఆమె సైబర్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల విచారణలో ఆ మహిళ సాయం కోరిన వ్యక్తే ఈ నేరానికి పాల్పడ్డాడని వెల్లడైంది. దీంతో ఆమె అవాక్కయింది. స్నేహంగా ఉన్నట్లు నటిస్తూనే ఆమె ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్‌కు పాల్పడ్డాడు ఆ కీచకుడు’’. విజయవాడ : ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాల్లో సైబర్ నేరాల పరంపర కొనసాగుతోంది. విద్యార్థునులు, యువ తులు, గృహిణులను లక్ష్యంగా చేసుకుని కొందరు కీచకులు వేధింపులకు పాల్పడుతున్నారు. బాధితులకు తెలిసిన వ్యక్తులే ఈ తరహా నేరాలకు పాల్పడుతుండటం గమనార్హం. యువతులు, మహిళలతో చనువుగా ఉంటూ వారి ఫొటోలను సేకరించి అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. డబ్బులు పోగొట్టుకుని, కొన్నాళ్లు మానసిక వేదన అనుభవించాక బాధితులు సైబర్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. పోలీసుల విచారణలో తమతో అత్యంత సన్నిహితంగా ఉంటున్న వ్యక్తులే ఈ దారుణాలకు పాల్పడినట్లు తెలుసుకుని కంగుతింటున్నారు. గడిచిన 15 నెలల్లో ఒక్క విజయవాడలో 210 కేసులు వెలుగులోకి వచ్చాయి. స్వయంకృపరాధమే.. గృహిణులు, యువతులు, విద్యారి్థనులు అధిక సమయం స్మార్ట్ ఫోన్‌తోనే గడిపేస్తున్నారు. ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చే వీడియోలు, షార్ట్ వీడియోలను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆ తరహాలో తాము సైతం గుర్తింపు తెచ్చుకోవాలనే కోరికతో వ్యక్తిగత ఫొటోలు, భర్త, పిల్లలతో సరదాగా తీసుకున్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. పరిచయాలను పెంచుకునే ప్రయత్నంలో తెలియని వారి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను కూడా ఆమోదిస్తున్నారు. అదును కోసం మాటు వేసిన సైబర్ నేరగాళ్లు వారితో పరిచయం పెంచుకుని మరిన్ని వీడియోలు, ఫొటోలను సేకరించి, ఆన్లైన్లో అందుబాటులో ఉన్న ఎడిటింగ్ యాప్‌ల సాయంతో అసభ్యకరంగా మారి్ఫంగ్ చేసి వేధింపులకు దిగుతున్నారు. ఇటీవల పెనమలూరు మండలం పోరంకి ప్రాంతానికి చెందిన ఓ వివాహిత ఇదే తరహాలో మోసపోయింది. తనతో పాటే చదువుకుంటున్న యువకుడు తన వీడియోను మారి్ఫంగ్ చేశాడని తెలియక సింగ్‌నగర్‌కు చెందిన మరో విద్యారి్థని మూడు నెలల పాటు మానసిక వేదన అనుభవించింది. మారి్ఫంగ్ వీడియోలు, ఫొటోల విషయం ఇంట్లో చెబితే ఏమంటారోనే భయంతో కీచకులు అడిగిన డబ్బు ఇవ్వడం, వారు చెప్పినట్లు చేస్తూ నరకయాతన అనుభవిస్తున్నారు. గతంతో నగరాలకే పరిమితమైన ఈ నేరాలు ప్రస్తుతం పల్లెలకూ పాకాయని సైబర్ పోలీసులు చెబుతున్నారు. ఈ తరహా నేరాల్లో బాధితులు అధికంగా విద్యావంతులే ఉంటున్నా, 25 శాతం మంది బాధితులే పోలీసులను ఆశ్రయిస్తున్నారని సమాచారం. పరువు పోతుందని కొందరు, సైబర్ నేరాలపై అవగాహన లేక మరి కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదు. అప్రమత్తంగా ఉండాలి ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రా మ్లో ఎంతో మంది మోసగాళ్లు ఉంటారు. కొందరు మహిళలు పరిచయాలు పెంచుకునే క్రమంలో ఇబ్బందులు కొనితెచ్చుకుంటున్నారు. సైబర్ నేరాల కట్టడికి కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. ‘చేరువ’ వాహనం ద్వారా అన్ని ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నాం. ఫేస్బుక్, ఇన్‌స్టా గ్రామ్ ప్రొఫైల్‌కు లాక్ చేస్తే మంచిది. మన నుంచి వెళ్లిన ఫొటోలను మాత్రమే మోసగాళ్లు మారి్ఫంగ్ చేసి వేధిస్తారు. మన నుంచి మన ఫొటోలు వెళ్లకపోతే వారు ఏమీ చేయలేరు. – టి.కె.రాణా, పోలీస్ కమిషనర్, ఎన్టీఆర్ జిల్లా -
ఇండియాలో కంపెనీ పేరుతో దారుణం.. మహిళా ఉద్యోగుల ఇంటికి వెళ్లి..
తిరువళ్లూరు: కార్లకు కీ తయారు చేసే కంపెనీలో మహిళ ఉద్యోగినులపై తరచూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కంపెనీ డైరెక్టర్ కియాంగ్ జూ లీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి ప్రత్యేక విభాగానికి బాధితులు ఫిర్యాదు చేసిన ఘటన తమిళనాడులో కలకలం రేపింది. వివరాల ప్రకారం.. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ తొడుగాడులో కార్లకు కీ తయారు చేసే పరిశ్రమ ఉంది. కాగా, ఈ కంపెనీలో 300 మంది పని చేస్తున్నారు. కంపెనీ డైరెక్టర్‌గా దక్షణ కొరియాకు చెందిన కియాంగ్ జూ లీ, హెచ్ఆర్గా రాము పని చేస్తున్నారు. కంపెనీలో పనిచేసే యువతులకు డైరెక్టర్ కియాంగ్ జూ లీ, హెచ్ఆర్ రాము సాయంతో తరచూ లైగింక వేధింపులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయంపై బాధిత యువతులు మప్పేడు పోలీసులకు, మేనేజ్మెంట్కు గతంలో ఫిర్యాదు చేయగా పోలీసులు రాజీకుదిర్చినట్లు తెలిసింది. దీంతో కక్ష్యకట్టిన డైరెక్టర్ లీ, తనపై ఫిర్యాదు చేసిన వారిలో కొందరిని ఉద్యోగం నుంచి తొలగించాడు. మరికొందరిని అక్కడి నుంచి వేరే బ్రాంచీకి బదిలీ చేసినట్లు తెలిసింది. పోలీసుల హెచ్చరికతో కొద్ది రోజులు మౌనంగా ఉన్న లీ, ఇటీవల వేధింపుల పర్వానికి తెరతీశాడు. కంపెనీలో పనిచేసే యువతులతో అసభ్యకరంగా ప్రవర్తించడం, నేరుగా యువతులు నివాసం ఉండే రూమ్‌లకు వెళ్లి వేధింపులకు గురిచేయడం ప్రారంభించాడు. దీంతో వేధింపులు తాళలేక బాధిత యవతులు స్థానిక పోలీసులు, పంచాయతీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ప్రత్యేక విభాగానికి ఫిర్యాదులు చేశారు. తమపై లైగింక వేధింపులకు గురిచేస్తున్న కియాంగ్ జూ లీపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆడియో వైరల్ కంపెనీలో పనిచేసే 27 ఏళ్ల యువతిపై రెండు నెలల నుంచి లీ వేధింపుల ఎక్కువైనట్లు తెలిసింది. యువతి నివాసం ఉండే ప్రాంతానికి వెళ్లిన లీ తనతో సహాజీవనం చేయాలని, లేనిపక్షంలో ఉద్యోగం నుంచి బయటకు పంపుతానని బెదిరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో లీ బెదిరింపులపై యువతి కంపెనీ యాజమాన్యానికి ఫోన్ ద్వారా చేసిన ఫిర్యాదు ఆడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. “నాకు త్వరలోనే వివాహం కానుంది. ఈ సమయంలో లీ వేధింపులు ఎక్కువయ్యాయి. ఇంటికి వచ్చి మరీ వేధింపులకు గురి చేస్తున్నాడు. ఇదే పరిస్థితి కొనసాగితే ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదని’ యువతి యాజమాన్యంతో మాట్లాడిన ఆడియో వైరల్‌గా మారింది. -
విధి వంచితురాలు!
తుమకూరు: భర్త మరణించడంతో అతని భార్య దళితురాలు అన్న కారణంతో భర్త కుటుంబ సభ్యులు ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో ఆమె రెండున్నర ఏళ్ల కూతురితో కలిసి అత్తవారింటి ముందు ధర్నాకు దిగిన దారుణ ఘటన కర్నాటకలోని తుమకూరు నగరంలోని విద్యా నగరలో జరిగింది. అగ్రవర్ణాలకు చెందిన జితేంద్ర, బోవి సముదాయంకు చెందిన మంజుళ ప్రేమించి 2019 సెప్టెంబర్ 13వ పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకున్నారు. అయితే, భర్త జితేంద్ర అక్కలు తీవ్రంగా వ్యతిరేకించారు. విధి చిన్న చూపు చూసి.. జితేంద్ర నగరంలోని శ్రీశైల ఆగ్రో రైస్ మిల్లును నడిపించేవారు. అయితే ఈ జంటపై విధి చిన్నచూపు చూసింది. కామెర్ల వ్యాధితో జితేంద్ర 4 నెలల కిందట కన్నుమూశాడు. ఆ వెంటనే మంజుళను ఆడపడుచులు, అత్త బలవంతంగా ఇంటి నుంచి గెంటేశారు. నగరంలోని ఓ అద్దె ఇంట్లో తలదాచుకోగా ఆ యజమాని కూడా ఆమెను వెళ్లిపోవాలని కోరాడు. గత్యంతరం లేని ఆమె మళ్లీ భర్త ఇంటికి వెళ్లగా నువ్వు ఇంట్లోకి రావద్దు అని ఐదు మంది ఆడపడుచులు ఆమెను అడ్డుకున్నారు. తనకు న్యాయం చేయాలని ఆ ఇంటి ముందే ఫ్లెక్సీ కట్టుకుని ధర్నా చేపట్టింది. మంజుళకు మద్దతుగా ఆమె కుటుంబ సభ్యులతో పాటు దళిత సంఘాలవారు వచ్చారు. -
కూతురుపైనే 32 ఏళ్లుగా తండ్రి అఘాయిత్యం.. పెళ్లైన తర్వాత కూడా..
దేశంలో మహిళలు, యువతులపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కుటుంబ సభ్యులే ఇలాంటి దారుణాలకు ఒడిగట్టడంతో ఏళ్లు గడిచినా బాధితులు తమ ఆవేదనను బయటకి చెప్పుకోలేకపోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి యూపీలో చోటుచేసుకుంది. తండ్రే.. తన కూతురుపై 32 ఏళ్లుగా లైంగిక దాడికి పాల్పడుతున్న ఘటన కలకలం సృష్టించింది. వివరాల ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్‌కు చెందిన బాధితురాలు తండ్రి తన చిన్నతనంలోనే మరణించారు. దీంతో, తల్లి రెండో పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు బాధితురాలి వయస్సు ఏడేళ్లు. అనంతరం.. ఆమెపై కన్నేసిన తండ్రి.. బెదిరించి బలాత్కారానికి పాల్పడ్డాడు. జరిగిన విషయం తల్లికి చెబితే ఊరుకొమ్మని నోరు మూయించేది. దీన్ని ఆసరాగా తీసుకున్న కసాయి తండ్రి.. మరింత రెచ్చిపోయి ప్రవర్తించేవాడు. ఈ క్రమంలో 2011లో ఆమెకు అలిగఢ్‌కు చెందిన ఓ జవానుతో వివాహం జరిగింది. తనకు వివాహం జరిగిన తర్వాతైన విముక్తి కలుగుతుందని భావించిన ఆమెకు మరోసారి నిరాశే ఎదురైంది. ఆమె.. పుట్టింటికి వచ్చిన ప్రతీసారి తన లైంగిక వాంఛను తీర్చుకుంటూనే ఉన్నాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే భర్తపై తప్పుడు కేసులు బనాయించి జైలుపాలు చేస్తానని బెదిరించేవాడు. దీంతో, తన భర్త ఆమెను.. పుట్టింటికి వెళ్తావా అని అడిగిన ప్రతిసారీ భయంతో వణికిపోయేది. ఇదిలా ఉండగా.. ఇటీవలే తన భర్త ఆర్మీ నుంచి వీఆర్ఎస్ తీసుకొని అలిగఢ్‌లోనే ఓ చిన్న వ్యాపారం ప్రారంభించాడు. ఈ క్రమంలో ఓరోజున తనకు జరిగిన దారుణాన్ని భర్తకు చెప్పి బోరున ఏడ్చేసింది. ఆమె మాటలు విని షాకైన భర్త.. భార్యకు సపోర్టుగా నిలిచాడు. అనంతరం, వారిద్దరూ కలిసి పోలీసులను ఆశ్రయించారు. ఈ సందర్భంగా మహిళా పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సవితా ద్వివేది మాట్లాడుతూ.. మహిళ ఫిర్యాదులో కేసు నమోదు చేసుకున్నాము. కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
కాబోయే భర్తే కదా అని శారీరకంగా దగ్గరైంది.. కానీ, ఆ తర్వాతే..
అతనో పోలీస్.. ప్రేమ పేరుతో యువతిని మోసం చేశాడు. ఐ లవ్ యూ అంటూ ఆమెకు దగ్గరయ్యాడు. నిన్నే పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకున్నాడు. తీరా పెళ్లి విషయం ఎత్తగానే ముఖం చాటేశాడు. దీంతో బాధిత కుటుంబ పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఫిరోజాబాద్‌కు చెందిన యువతి(24)తో కానిస్టేబుట్ అమిత్ యాదవ్‌కు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో యువతిని ప్రేమిస్తున్నాని, పెళ్లి చేసుకుంటానని అమిత్ తెలిపాడు. ఈ క్రమంలో కాబోయే భర్తే కదా అని ఆమె శారీరకంగా దగ్గరైంది. కాగా, పెళ్లి విషయం ఎత్తగానే పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చాడు. దీంతో, బాధితురాలు.. అమిత్ యాదవ్ ఇంటికి వెళ్లి అతడి తల్లిని అడుగగా.. 2021లో పెళ్లి చేసేందుకు ముహుర్తం ఫిక్స్ చేశారు. కానీ, కట్నం కారణంగా వాయిదా వేశారు. ఈ క్రమంలో మరోసారి పెళ్లి విషయమై అమిత్‌ను నిలదీయగా అదనపు కట్నం కావాలని కోరినట్టు తెలిపింది. ఈ సందర్బంగా బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ.. ‘అమిత్, అతని తల్లి కూడా కట్నం డిమాండ్ చేసింది. అతని కుటుంబం రూ. 14 లక్షల కట్నం డిమాండ్ చేసింది. అమిత్‌తో నా వివాహం ఆగస్టు 2021కి నిర్ణయించారు. కట్నం కోసం అమిత్ పెళ్లిని వాయిదా వేయడమే కాకుండా, కట్నంగా రూ. 19 లక్షల ఇవ్వాలని కోరుతున్నాడు. ఇప్పుడు మా కుటుంబాన్ని చంపేస్తానని బెదిరిస్తున్నాడు’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో, ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారుకు తెలపడంతో కేసు నమోదు చేసినట్టు తెలిపారు. దర్యాప్తు ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఫిరోజాబాద్ రూరల్ ఎస్పీ రణ్విజయ్ సింగ్ వెల్లడించారు. -
మహిళపై అత్యాచారం.. బీజేపీ నేతపై కేసు నమోదు చేయాలని కోర్టు సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ నేతకు బిగ్ షాక్ తగిలింది. ఓ మహిళపై లైంగిక దాడి కేసులో బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. దీంతో, ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ 2018లో తనపై లైంగిక దాడికి పాల్పడినట్టు ఢిల్లీకి చెందిన ఓ మహిళ దిగువ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బీజేపీ నేత తనపై అత్యాచారం చేశాడని, చంపేస్తానని బెదిరించాడని ఆమె ఆరోపించింది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు పోలీసులు విముఖంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో, బాధితురాలు హైకోర్టును ఆశ్రయించింది. కాగా, ఈ కేసులో విచారణలో భాగంగా గురువారం ఢిల్లీ హైకోర్టు.. షానవాజ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. అలాగే, 3 నెలల్లో పోలీసులు విచారణ పూర్తి చేయాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు పోలీసులు విముఖంగా ఉన్నారని వాస్తవాలను పరిశీలిస్తే స్పష్టమవుతోందని ఢిల్లీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. Delhi HC orders FIR against BJP leader Shahnawaz Hussain in rape case, chides police for ‘complete reluctance’https://t.co/kmI5D1X4TO pic.twitter.com/lRH46nmDqQ — Shining India News (@shiningindnews) August 18, 2022 ఇది కూడా చదవండి: కరోనా అలర్ట్.. భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు, మరణాలు -
అప్పు కావాలి.. జూనియర్ ఆర్టిస్ట్‌ను నమ్మించి రూమ్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి..
బంజారాహిల్స్: అప్పు కోసం వెళ్లిన జూనియర్ ఆర్టిస్ట్‌పై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని ఇందిరానగర్‌లో నివసించే యువతి(22) సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేస్తూ జీవనం సాగిస్తోంది. కాగా, ఆదివారం మధ్యాహ్నం తనకు డబ్బులు అవసరమై బాలు నాయక్ అనే యువకుడిని అడిగింది. డబ్బులు ఇస్తానని లోపలికి పిలిచిన బాలు నాయక్ ఆమెను గదిలో బంధించి లైంగికదాడికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న తన స్నేహితుడితో కూడా గడిపితే రూ. 5 వేలు ఇస్తానంటూ షరతు విధించాడు. బాధితురాలు వారి బారి నుంచి తప్పించుకుని బయటికి వచ్చి తన బంధువుకు ఫోన్ చేసింది. ఇద్దరూ వెళ్లి అడిగేందుకు ప్రయత్నించగా అప్పటికే నిందితుడు గదికి తాళం వేసి ఉడాయించాడు. బాధితురాలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఇది కూడా చదవండి: బెంగళూరు యువతులతో హైటెక్ వ్యభిచారం -
ధర్మవరంలో టీడీపీ నేతపై లైంగిక వేధింపుల ఆరోపణలు
-
టీడీపీ నేత అకృత్యాలు.. వివాహితపై లైంగిక వేధింపులు
సాక్షి, శ్రీసత్యసాయి: టీడీపీ నేత రెచ్చిపోయాడు. ధర్మవరంలో చారుగుండ్ల ఓబిలేసు ఓ వివాహితను లైంగిక వేధింపులకు గురిచేశాడు. అంతేకాకుండా ఆమె భర్తను బెదిరింపులకు గురిచేశాడు. ఈ క్రమంలో వివాహిత భర్త భాషా.. మనస్థాపంతో ఆత్మహత్యయత్నం చేశాడు. రైల్వే ట్రాక్‌పై సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. తనను చారుగుండ్ల ఓబిలేసు.. చంపేస్తానని బెదిరించినట్టు భాషా తెలిపాడు. -
మెట్రో స్టేషన్లో వికృత చేష్టలు.. మహిళ దగ్గరకు వచ్చి..
ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా.. యువతులు, మహిళలపై లైంగిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కాగా, దేశ రాజధాని ఢిల్లీలో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. మెట్రో రైల్వే స్టేషన్లో మహిళ పట్ల ఓ ప్రయాణికుడు అనుచితంగా ప్రవర్తించాడు. ఈ ఘటన జూన్ 2వ తేదీన చోటుచేసుకోగా.. 100 గంటలపాటు సీసీ ఫుటేజీని పరిశీలించిన తర్వాత నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. వివరాల ప్రకారం.. ఢిల్లీ మెట్రో స్టేషన్లో ఎల్లో లైన్లో జూన్ 2న ఒక మహిళ మెట్రో రైలులో ప్రయాణించింది. ఆమె స్టేషన్లో కూర్చుని ఉండగా.. ఒక వ్యక్తి ఆమె వద్దకు వచ్చి ఒక అడ్రస్ గురించి అడిగాడు. ఆ అడ్రస్ గురించి చెప్పిన ఆమె జోర్ భాగ్ మెట్రో స్టేషన్లో దిగింది. ఫ్లాట్‌ఫామ్‌పై ఒక చోట కూర్చొని క్యాబ్ బుక్ చేస్తున్నది. నిందితుడు కూడా.. అదే స్టేషన్లో దిగాడు. అనంతరం.. అతడు మళ్లీ ఆమె వద్దకు వచ్చి.. అడ్రస్ అడిగాడు. దీంతో, ఆమె.. అతడికి అడ్రస్ చెబుతుండగా.. నిందితుడు ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. లైంగికంగా వేధింపులకు గురి చేశాడు. దీంతో షాకైన బాధితురాలు.. అక్కడి నుంచి వెళ్లిపోయింది. అనంతరం, ఈ ఘటన గురించి సిబ్బందికి చెప్పింది. కానీ, వారు పట్టించుకోకపోవడంతో ట్విట్టర్ వేదికగా.. వరుస ట్వీట్స్ చేసింది. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. దాదాపు 100 గంటలు సీసీ ఫుటేజీని చెక్ చేసిన పోలీసులు.. ఎట్టకేలకు నిందితుడిని పట్టుకున్నారు. అతడిని కోట్లా ముబారక్‌పూర్‌లో నివాసం ఉంటున్న మానవ్ అగర్వాల్(40)గా గుర్తించామని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటన అనంతరం నిందితుడు.. నేపాల్‌కు పారిపోయాడని తెలిపారు. Woman Molested Inside Delhi Metro Station, Horrific Act Caught on CCTV#DelhiMetro #JorBagh pic.twitter.com/iHKP2nMWwl — TIMES NOW (@TimesNow) July 6, 2022 ఇది కూడా చదవండి: మెట్రో స్టేషన్లో యువతిపై లైంగిక వేధింపులు.. మరీ ఇంత దారుణమా..? -
భువనగిరిలో దారుణం.. మహిళ ఫొటోలు తీసి బెదిరింపులు
సాక్షి, యాదాద్రి భువనగిరి: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సంస్థాన్ నారాయణపురం మండలంలోని కొర్ర తండాలో ఇద్దరు మైనర్ బాలురు దారుణానికి ఒడిగట్టారు. రెండు రోజుల క్రితం ఇంటి ముందు నిద్రిస్తున్న ఓ మహిళ(40) వస్త్రాలను తొలగించి ఇద్దరు మైనర్లు.. ఆమె నగ్న చిత్రాలను తీశారు. అనంతరం ఆ ఫొటోలను ఆమెకు చూపించి బెదిరింపులకు పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా.. నగ్నచిత్రాలను సోషల్ మీడియాలో వారి మిత్రులకు షేర్ చేశారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఒక మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: సూర్యాపేటలో ప్రైవేట్ ఆసుపత్రి సీజ్.. ఎందుకో తెలుసా..? -
మసాజ్ పేరుతో దారుణం.. భారత్ పరువు తీస్తున్నారు కదరా అయ్యా..
దేశంలో రోజురోజుకు మహిళలు, యువతులుపై లైంగిక దాడులు పెరుగుతున్నాయి. కొందరు మృగాలు భారత్ పరువును తీస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన పర్యాటకులపై లైంగిక దాడులకు పాల్పడుతూ.. అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను దెబ్బతిస్తున్నారు. తాజాగా గోవా ట్రిప్ కోసం వచ్చిన ఓ బ్రిటిష్ జంటకు చేదు అనుభవం ఎదురైంది. వివరాల ప్రకారం.. గోవాలోని అరాంబోల్ బీచ్‌కు బ్రిటన్‌కు చెందిన కపుల్స్ వచ్చారు. ఈ క్రమంలో వారికి టూరిస్ట్ గైడ్‌గా విన్సెంట్ డిసౌజా పరిచయం చేసుకుని బీచ్‌లు తిప్పాడు. అనంతరం.. అంతర్జాతీయ పర్యాటకులతో బాగా ప్రాచుర్యం పొందిన ఉత్తర గోవా జిల్లాలోని అరాంబోల్ బీచ్ సమీపంలో మసాజ్ చేపిస్తానంటూ వారిని అక్కడికి తీసుకెళ్లాడు. మసాజ్ చేస్తున్న క్రమంలో డిసౌజా.. భర్త కళ్ల ముందే ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన జూన్ 2వ తేదీన చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే, ఈ దారుణ ఘటన అనంతరం బాధితులు.. బ్రిటన్‌లో ఉన్న తమ కుటుంబ సభ్యులను సంప్రదించి.. భారత్‌లోని బ్రిటిష్ రాయబార కార్యాలయం నుంచి సహాయం కోరిన తర్వాత బాధితులురాలు పెర్నెమ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడిని పట్టుకుని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. కాగా. నిందితుడు గతంలో ఓ పాఠశాలలో లైబ్రేరియన్‌గా కూడా పనిచేశాడని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఇదిలా ఉండగా.. కొద్ది రోజుల క్రితం రష్యా దేశానికి చెందిన యువతిపై ఓ భారతీయుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇది కూడా చదవండి: ఆన్లైన్లో రమ్మీకి బానిసై.. ఇంట్లో భర్త లేనప్పుడు.. -
జూబ్లీహిల్స్ పబ్ కేసు: చిక్కిన నిందితులు.. వారి బ్యాక్ గ్రౌండ్ ఇదే..
జూబ్లీహిల్స్‌లో ఓ మైనర్‌పై అత్యాచార ఘటన దేశంలోనే సంచలనంగా మారింది. పోలీసులే నిందితులకు అండగా ఉన్నారని బీజేపీ, కాంగ్రెస్ నేతల ఆరోపణల నేపథ్యంలో ఈ కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇదిలా ఉండగా.. ఆదివారం ఈ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అమ్నీషియా పబ్ కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మరో మైనర్‌తో పాటు ఉమేర్‌ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఇప్పటికే అరెస్ట్ అయిన వారిలో ఇద్దరు మైనర్లు, ఒక మేజర్ ఉన్నారు. కాగా, నిందితులంతా రాజకీయ నేతల కొడుకులుగా పోలీసులు గుర్తించారు. నిందితులు వీరే.. A1.. సాదుద్దీన్(ఎంఐఎం నేత కొడుకు) A2.. ఉమేర్‌ఖాన్(ఎమ్మెల్యే సోదరుడి కొడుకు) మైనర్-1.. వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు మైనర్-2.. ఎంఐఎం కార్పొరేటర్ కొడుకు మైనర్-3.. సంగారెడ్డి మున్సిపల్ కో-ఆప్షన్ మెంబర్ కొడుకు ఉన్నారు. ఇదిలా ఉండగా.. మైనర్‌పై అత్యాచార కేసుపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరా రాజన్ స్పందించారు. ఈ ఘటనపై నివేదికను సమర్పించాలని సీఎస్, డీజీపీని ఆదేశించారు. 2 రోజుల్లో నివేదికను అందించాలని ఆదేశించారు. మరోవైపు.. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితులు.. లైంగిక దాడి అనంతరం కారులో మొయినాబాద్‌కు వెళ్లారు. అక్కడ ఓ రాజకీయ నేతకు చెందిన ఫాంహౌస్‌లో ఆశ్రయం పొందారని తెలుస్తోంది. ఇది కూడా చదవండి: అత్యాచారం ఘటనపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కేసీఆర్‌కు బండి లేఖ -
మెట్రో స్టేషన్లో యువతిపై లైంగిక వేధింపులు
దేశంలో యువతులు, మహిళలపై లైంగిక వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. బస్సుల్లో, రైళ్లలో ప్రయాణించే సమయంలో కొందరు ఆకతాయిలు మహిళలను లైంగికంగా వేధిస్తూనే ఉన్నారు. తాజాగా మెట్రో స్టేషన్లో ఓ యువతికి చేదు అనుభవం ఎదురైంది. ఓ యువకుడు.. ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చేటుచేసుకుంది. వివరాల ప్రకారం.. బాధిత యువతి ఢిల్లీలోని జోర్‌బాగ్ మెట్రో స్టేషన్లో రైలు ఎక్కింది. అనంతరం రైలులో ఉన్న ఓ వ్యక్తి ఆమె వద్దకు వచ్చి ఓ అడ్రస్ గురించి అడిగాడు. ఈ క్రమంలో ఆమె అతడికి అడ్రస్ చెప్పింది. అనంతరం ఆమె దిగిపోవాల్సిన స్టేషన్ రాగా.. రైలు దిగి మరో రైలు కోసం ఎదురు చూస్తూ ప్లాట్‌ఫామ్ మీద ఉన్న బెంచి మీద కూర్చుంది. ఇంతలో అడ్రస్ అడిగిన వ్యక్తి మళ్లీ ఆమె వద్దకు వచ్చి.. మరోసారి అడ్రస్‌ను కోరి.. క్లియర్ చెప్పమని అడిగాడు. ఈ క్రమంలో సదరు వ్యక్తి.. బాధితురాలి పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. తన శారీరక అవయవాలను ఆమెకు తాకిస్తూ దారుణంగా ప్రవర్తించాడు. దీంతో బాధితురాలు.. అతను ఏం చేస్తున్నాడో గమనించి.. ప్లాట్‌ఫామ్ మీది ఉన్న సీఐఎస్ఎఫ్ సిబ్బందికి ఫిర్యాదు చేసింది. ఆమె చెప్పింది అతను పట్టించుకోకుండా పై ఫ్లోర్లో ఉన్న స్టేషన్లో ఫిర్యాదు చేయమన్నాడు. దీంతో షాకైన యువతి.. మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితుడిని కూడా గుర్తించింది. అయితే పోలీసులు కేసు నమోదు చేసుకునేందుకు నిరాకరించారు. దానిని పెద్ద సీన్ చేయవద్దని ఆమెకు నచ్చ చెప్పేందుకు ప్రయత్నించారు. దీంతో, బాధితురాలు తనకు జరిగిన చేదు అనుభవాన్ని ట్విట్టర్ ద్వారా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌కు ఫిర్యాదు చేసింది. ఆమె ట్వీట్‌కు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు స్పందించారు. ఆ ఘటనపై తగు చర్యలు తీసుకుంటున్నట్టు స్పష్టం చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితుడిని గుర్తిస్తున్నట్టు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని వెల్లడించారు. ఇక, ఈ ఘటనపై సీరియస్ అయిన ఢిల్లీ మహిళా కమిషన్.. కేసు సుమోటోగా స్వీకరిస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. Zero-tolerance for any indecent behaviour, sexual harassment: DMRC on Jor Bagh station case In a statement, it also asserted that the Delhi Metro Rail Corporation, as an organisation has "zero-tolerance for any act amount... #News by #EconomicTimes https://t.co/wOyd25dCYK — Market’s Cafe (@MarketsCafe) June 4, 2022 In the context of the recent incident reported at Jorbagh, we have already taken up the issue with the concerned security agencies. Delhi Police has already taken cognizance of the complaint and are investigating into the matter. — Delhi Metro Rail Corporation I कृपया मास्क पहनें😷 (@OfficialDMRC) June 3, 2022 ఇది కూడా చదవండి: ‘ఆర్య సమాజ్’ మ్యారేజ్ సర్టిఫికెట్లు చెల్లవు -
తమ్ముడి భార్యపై కన్నేసిన అన్న.. ఎవరూ లేని సమయంలో..
తమ్ముడి భార్యపై కన్నేసిన అన్న దారుణానికి ఒడిగట్టాడు. అన్నాదమ్ములు ఇద్దరూ కవలలు కావడంతో.. దీన్ని ఆసరాగా తీసుకున్న అన్న.. మరదాలిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఒకే రూపంతో ఉన్న అతడి విషయంలో మోసపోయిన ఆమె.. విషయం భర్తకు చెప్పడంతో అతడి సమాధానం విని షాకైంది. వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా కేంద్రం శివాజీనగర్‌లో ఓ కుటుంబం నివసిస్తోంది. వారి కుటుంబంలో ఇద్దరు కవలసోదరులు ఉన్నారు. వారిని ఎవరు అని గుర్తించడమే పేరెంట్స్‌కే కొన్నిసార్లు సాధ్యపడేది కాదు. ఇదిలా ఉండగా.. వాళ్లకు పెళ్లీడు రావడంతో కుటుంబీకులు కవలలైన అమ్మాయిల జంట కోసం వెతికారు. అలా దొరక్కపోవడంతో ఎవరో ఒకరికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. కొద్దిరోజులు గడిచాక.. తనకు ఇప్పుడే పెళ్లి వద్దని పెద్దోడు చెప్పడంతో ఆరు నెలల కిందట చిన్నోడికి ఓ అమ్మాయితో వివాహం జరిపించారు. ఇప్పటి వరకు అంతా బాగానే సాగిన వ్యవహారం.. ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఓ సమయంలో అత్తారింట్లో కాపురానికి వచ్చిన మరదలిపై.. అన్న కన్నేశాడు. అన్నదమ్ములిద్దరూ ఒకేలా ఉండటంతో అతడికి అది వరమైంది. ఓ రోజు తమ్ముడు లేని సమయం చూసుకొని అతనిలా గదిలోకి దూరి మరదలితో లైంగిక దాడికి పాల్పడ్డాడు. భర్తే కదానే నమ్మకంతో ఆమె కూడా అడ్డుచెప్పలేదు. ఇలా ఆరు నెలలుగా వికృత ఉదంతం కొనసాగుతుండగా.. అనుమానం వచ్చిన ఆమె.. అసలు విషయం తెలుసుకుని షాకైంది. ఈ విషయాన్ని వెంటనే.. తన భర్త, అత్తమామలకు చెప్పేసింది. ఈ క్రమంలో భర్తతో సహా కుటుంభ సభ్యులందరూ అన్నకే మద్దతిచ్చారు. విషయం బయటికి తెలిస్తే కుటుంబం పరువు పోతుందని, కాబట్టి నోరు మూసుకుని మునుపటిలా సాగిపోమని భర్తతోపాటు మిగతా అందరూ ఆమెను బెదిరించారు. వారి బెదిరింపులను లెక్కచేయని బాధితురాలు.. తన పుట్టింటివాళ్లను పిలిపించి, వారి సాయంతో పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయం చెప్పి ఫిర్యాదు చేసింది. బాధితురాల ఫిర్యాదుతో పోలీసులు కవల సోదరుడిపై ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. అరెస్ట్ చేసి విచారిస్తున్నట్టు శివాజీనగర్ పోలీస్ స్టేషన్ ఇంచార్జి దిలీప్ దొలారే తెలిపారు. ఇది కూడా చదవండి: ప్రేమ పెళ్లి.. నా భర్త దగ్గరికి వెళ్లిపోతా.. ఇంతలోనే ఘోరం.. -
‘లవ్ యూ’ అంటూ దగ్గరయ్యాడు.. శారీరకంగా ఒక్కటయ్యాక..
ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంటపడ్డాడు. అతడి మాటలు నమ్మిన ఆమె.. శారీరకంగా దగ్గరైంది. తీరా పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చాక.. అతడి నిజస్వరూపం తెలుసుకొని బాధితురాలు షాకైంది. అనంతరం ఆమెను మతం మార్చుకోవాలని ఒత్తిడి చేయడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసుల అధికారి అలోక్ శ్రీ వాస్తవ తెలిపిన వివరాల ప్రకారం.. భోపాల్‌లోని అశోకనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో నిహల్ ఖాన్(30) అనే వ్యక్తి ఆసుపత్రిని రన్ చేస్తున్నాడు. ఆసుపత్రిలో బాధితురాలు(28) ఫిజియోథెరిపిస్టుగా పని చేస్తోంది. కాగా, కుటుంబ కలహాల కారణంగా బాధితురాలు 2018లో తన భర్త నుంచి విడిపోయి ఒంటరిగా బ్రతుకుతోంది. అయితే, ఆమె ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న క్రమంలో నిహల్ ఖాన్‌లో క్లోజ్‌నెస్ ఏర్పడింది. ఈ క్రమంలో ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో వారిద్దరూ శారీరంగా ఒక్కటయ్యారు. తీరా పెళ్లి ప్రస్తావన తెచ్చాక.. తాను హిందు కాదని ముస్లిం అని చెప్పడంతో ఆమె ఒక్కసారిగా షాకైంది. నిహల్ ఖాన్ తనను మోసం చేశాడని గుర్తించింది. అనంతరం అతడిని ఎందుకిలా చేశావని నిలదీయగా.. మతం మార్చుకుంటే తనను పెళ్లి చేసుకుంటానని నిహల్ చెప్పడంతో ఖంగుతింది. ఈ క్రమంలో ఆమెను మతం మారాలని అతడు ఒత్తిడి చేస్తున్నాడని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు నిహాల్ ఖాన్‌పై మధ్యప్రదేశ్ మత స్వేచ్ఛ చట్టం, భారతీయ శిక్షాస్మృతి ప్రకారం అత్యాచారం ఆరోపణలపై ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) నమోదు చేసినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: పచ్చటి సంసారంలో చిచ్చు పెట్టిన మామిడికాయ పచ్చడి.. క్షణికావేశంలో -
మంత్రి కొడుకు అరాచకం.. మహిళపై అత్యాచారం చేసి..
మంత్రి కొడుకు ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. అతడిని అరెస్ట్ చేసేందుకు వెళ్లారు. తీరా అక్కడికి వెళ్లాక.. నిందితుడు ఇంట్లో లేకపోవడంతో ఇంటికి పోలీసులు సమన్లు అంటించారు. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. కాంగ్రెస్ పార్టీ మంత్రి మహేష్ జోషి కుమారుడు రోహిత్ జోషి(23) తనపై లైంగిక దాడి చేశాడని ఓ మహిళ ఢిల్లీ పోలీసులను ఆశ్రయించింది. గత ఏడాది జనవరి 8 నుంచి ఏప్రిల్ 17 వరకు పలుమార్లు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అయితే, జనవరి 8వ తేదీన రోహిత్ జోషిని ఆమె కలిసినప్పడు డ్రింక్‌లో మత్తు మందు కలిపి తనపై లైంగికదాడికి పాల్పడినట్లు తెలిపింది. ఆ సమయంలో తన నగ్న ఫొటోలు, వీడియోలు చూపించి బెదిరించి, బ్లాక్మెయిల్ చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. అనంతరం గతేదాడి ఆగస్ట్ 11న గర్భం దాల్చినట్లు తెలియడంతో అబార్షన్ మాత్ర వేసుకోవాలని రోహిత్ జోషి.. తనను బెదిరించినట్లు తెలిపింది. దీంతో, జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు.. ఆదివారం రాజస్థాన్‌లోని రోహిత్ జోషి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఇంటికి తాళం వేసి ఉండటంతో పోలీసులు.. అరెస్ట్ చేసేందుకు సమన్ల నోటీసును ఇంటి డోర్‌కు అంటించారు. లైంగిక దాడి కేసుపై విచారణకు మే 18లోగా హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: నువ్వు లేకపోతే చచ్చిపోతానని నమ్మించి.. పలుమార్లు లైంగిక దాడి -
లిఫ్ట్ పేరుతో టీచర్‌పై లైంగిక దాడి.. వీడియోలు తీసి ఆ తర్వాత..
దేశంలో ప్రతీరోజు ఎక్కడో ఒక చోట మహిళలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ ముస్లిం వ్యక్తి.. టీచర్‌పై లైంగిక దాడి చేసి వీడియోలు తీసి అనంతరం పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. షహజాన్‌పూర్‌లో లిఫ్ట్ పేరుతో అమీర్ అనే వ్యక్తి గవర్నమెంట్ టీచర్(28) బైకుపై ఎక్కించుకున్నాడు. అనంతరం ఆమెకు మత్తుమందు వాసన చూపించి స్పృహ కోల్పోయేలా చేశారు. ఆ తర్వాత అమీర్.. టీచర్‌పై అత్యాచారం చేసి వీడియోలు తీశాడు. ఇదిలా ఉండగా.. తమ కుమారుడిని కాపాడుకునేందు టీచర్‌ను మతం మారాలని, తనను పెళ్లి చేసుకోవాలని అమీర్ కుటుంబ సభ్యులు టీచర్‌ను బెదిరింపులకు గురిచేశారు. దీంతో.. సదరు మహిళ జరిగిన విషయాన్ని పోలీసులు తెలిపి అమీర్‌పై ఫిర్యాదు చేసింది. నిందితుడు అమీర్‌తో సహా ఐదుగురిపై ఉత్తరప్రదేశ్‌లో తీసుకువచ్చిన మత మార్పిడి నిషేధ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. కాగా, ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఎస్పీ తెలిపారు. ఇది కూడా చదవండి: నరకం చూపించారు, బర్త్‌డే రోజే చంపేశారు: మోడల్ తల్లి -
బాలుడిపై మహిళ లైంగిక దాడి.. చివరకు భలే ట్విస్టు
బాలుడిని లైంగికంగా వేధించినందుకు ఓ మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె తనపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడినట్టు బాధితుడు పోలీసులకు వివరించాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ధారావికి చెందిన ఓ మహిళ(20)కు ఓ బాలుడి(17)తో సోషల్ మీడియాతో 2020లో పరిచయం ఏర్పడింది. దీంతో వారిద్దరూ చాటింగ్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఆమె.. అతడికి తన లవ్ ప్రపోజ్‌చేసింది. కానీ, బాలుడు ఆమె ప్రపోజల్‌ను తిరస్కరించాడు. అనంతరం ఆమె ఫోన్ నెంబర్, సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేశాడు. ఆమె మాత్రం వేరే ఫోన్ నెంబర్లు, ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేసి అతడిని వేధించింది. ఇదిలా ఉండగా.. బాధిత బాలుడు జనవరి 19న ఉద్యోగం వెతుక్కుంటూ ముంబైలోని తన బంధువుల ఇంటికి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న మహిళ, అతడిని కలవాలని ధారవిలోని తన బాలుడిని ఇంటికి ఆహ్వానించింది. దీంతో ఆ బాలుడు ఆమె ఇంటికి రాగా.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అతడిపై లైంగిక దాడికి పాల్పడింది. అంతేకాకుండా తర్వాత కూడా వాషిలోని ఓ లాడ్జితో పాటు పలు ప్రాంతాలకు బాలుడిని పిలిపించుకొని ఆమె లైంగిక వేధింపులకు పాల్పడిందని బాధితుడు పోలీసుల వద్ద ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో బాలుడి ఫిర్యాదు మేరకు ఆమెపై పోక్సో చట్లంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. మరోవైపు.. బాలుడి కుటుంబానికి ఆమె మరో షాకిచ్చింది. బాలుడితో పాటు అతని తండ్రి, నలుగురు మేనమామలు, బంధువు.. తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేస్తూ నవీ ముంబై పోలీసులను ఆశ్రయించింది. నవీ ముంబై పోలీసులు కేసును ధారవి పోలీసులకు బదిలీ చేశారని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఇది కూడా చదవండి: మాజీ ప్రేయసి ఇంకొకరితో చనువుగా ఉందని.. -
టీడీపీ నేతల అకృత్యాలు.. నిద్రిస్తున్న మహిళ, యువతిపై అత్యాచారం
సాక్షి, తాడేపల్లి రూరల్/పీఎంపాలెం (భీమిలి): మహిళలపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దాష్టీకాలు కొనసాగుతున్నాయి. నిన్నటికి నిన్న గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో వివాహిత హత్య వ్యవహారంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యూత్ సభ్యుడు సతీష్‌చౌదరి, అతడి స్నేహితుడు సాయిరామ్‌లు నిందితులన్న విషయం తెలిసిందే. ఈ దారుణాన్ని మరువక ముందే తాజాగా దుగ్గిరాల మండలం శృంగారపురంలో మరో టీడీపీ కార్యకర్త బరితెగించి మహిళపై లైంగికదాడికి యత్నించాడు. నిద్రిస్తున్న వివాహితపై అఘాయిత్యానికి యత్నం అనకాపల్లి జిల్లా నుంచి పనుల కోసం వలస వచ్చిన ఓ మహిళా కూలీ గురువారం అర్ధరాత్రి శృంగారపురంలోని తిరుపతమ్మ తల్లి గుడిలో నిద్రిస్తోంది. ఆ సమయంలో పూటుగా మద్యం తాగి వచ్చిన టీడీపీ కార్యకర్త మల్లెల కిరణ్ ఆమెను నిద్రలేపి.. నోరు మూసి.. పక్కకు లాక్కెళ్లేందుకు ప్రయత్నం చేశాడు. ఆ పెనుగులాటలో ఆ మహిళ భర్తతోపాటు బంధువులు నిద్రలేవడంతో ఆమెను అక్కడే వదిలి పారిపోయేందుకు ప్రయత్నించాడు. వారంతా అతడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఇంతలో మల్లెల కిరణ్ అనుచరులు, స్థానిక టీడీపీ నేతలు వచ్చి మహిళ భర్తకు నచ్చజెప్పి కిరణ్‌ను ఇంటికి తీసుకువెళ్లారు. జరిగిన ఘటనపై మహిళ శుక్రవారం తెల్లవారుజామున 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో విషయం బయటకొచ్చింది. ఆమె ఫిర్యాదుతో దుగ్గిరాల ఎస్ఐ శ్రీనివాసరెడ్డి కిరణ్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. మైనర్‌పై లైంగికదాడి.. ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై తెలుగుదేశం పార్టీ నేతను పోలీసులు అరెస్టు చేశారు. పీఎంపాలెం పోలీస్ స్టేషన్ సీఐ రవికుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జీవీఎంసీ 5వ వార్డు పరిధి కొమ్మాది రాజీవ్ గృహకల్ప 130వ బ్లాకులో నివసిస్తున్న టీడీపీ నేత తోట నరేంద్ర (33) అదే కాలనీలో నివసిస్తున్న మైనర్(17)కు మాయమాటలు చెప్పి ఈనెల 12వ తేదీన లైంగికదాడికి పాల్పడ్డాడు. ఘటన వల్ల ఆరోగ్యపరంగా కొన్ని రోజులుగా బాలిక ఇబ్బంది పడుతుండడంతో తల్లిదండ్రులు ప్రశ్నించారు. దీంతో లైంగికదాడి విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లి శుక్రవారం ఉదయం పోలీసులకు నరేంద్రపై ఫిర్యాదు చేసింది. కాగా, నిందితుడ్ని అరెస్టు చేశామని సీఐ రవికుమార్ స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: బాలికను గర్భవతిని చేసిన యువకుడిపై పోక్సో కేసు -
టీడీపీ కార్యకర్త అరాచకం.. మహిళపై అత్యాచారయత్నం
సాక్షి, గుంటూరు: టీడీపీ క్రియాశీలక కార్యకర్త మల్లెల కిరణ్ దారుణానికి ఒడిగట్టాడు. ఓ మహిళా కూలీపై అత్యాచారానికి ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయాడు. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. దుగ్గిరాల మండలం శృంగారపురంలో కిరణ్ శుక్రవారం.. ఓ మహిళా కూలీపై అత్యాచారయత్నం చేశాడు. బాధితురాలిని పొలాల్లోకి లాక్కెళ్తుండగా తోటి కూలీలు గమనించారు. ఈ క్రమంలో డయల్ 100కు కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు అక్కడికి చేరుకుని కిరణ్‌ను అరెస్ట్ చేశారు.