మంత్రి కొడుకు ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి.. అతడిని అరెస్ట్ చేసేందుకు వెళ్లారు. తీరా అక్కడికి వెళ్లాక.. నిందితుడు ఇంట్లో లేకపోవడంతో ఇంటికి పోలీసులు సమన్లు అంటించారు. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది.
వివరాల ప‍్రకారం.. కాంగ్రెస్ పార్టీ మంత్రి మహేష్ జోషి కుమారుడు రోహిత్ జోషి(23) తనపై లైంగిక దాడి చేశాడని ఓ మహిళ ఢిల్లీ పోలీసులను ఆశ్రయించింది. గత ఏడాది జనవరి 8 నుంచి ఏప్రిల్ 17 వరకు పలుమార్లు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అయితే, జనవరి 8వ తేదీన రోహిత్ జోషిని ఆమె కలిసినప్పడు డ్రింక్‌లో మత్తు మందు కలిపి తనపై లైంగికదాడికి పాల్పడినట్లు తెలిపింది. ఆ సమయంలో తన నగ్న ఫొటోలు, వీడియోలు చూపించి బెదిరించి, బ్లాక్‌మెయిల్ చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. అనంతరం గతేదాడి ఆగస్ట్ 11న గర్భం దాల్చినట్లు తెలియడంతో అబార్షన్ మాత్ర వేసుకోవాలని రోహిత్ జోషి.. తనను బెదిరించినట్లు తెలిపింది.
దీంతో, జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు.. ఆదివారం రాజస్థాన్‌లోని రోహిత్ జోషి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఇంటికి తాళం వేసి ఉండటంతో పోలీసులు.. అరెస్ట్ చేసేందుకు సమన్ల నోటీసును ఇంటి డోర్‌కు అంటించారు. లైంగిక దాడి కేసుపై విచారణకు మే 18లోగా హాజరుకావాలని అందులో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: నువ్వు లేకపోతే చచ్చిపోతానని నమ్మించి.. పలుమార్లు లైంగిక దాడి
Comments
Please login to add a commentAdd a comment