రాజస్థాన్‌లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు మరో వారం రోజుల్లో (నవంబర్ 13న) ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన పార్టీ రెబల్ నేత నరేష్ మీనాను కాంగ్రెస్ గురువారం సస్పెండ్ చేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి సుఖ్‌జీందర్ సింగ్ రంధావా ఉత్తర్వులు జారీ చేశారు.
ఉప ఎన్నికల్లో డియోలి-ఉనియారా అసెంబ్లీ స్థానం నుంచి నరేష్ మీనా పోటీ చేయాలని భావించారు. కానీ అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ కేసీ మీనాను బరిలోకి దింపింది. దీంతో పార్టీ టికెట్‌నిరాకరించడంతో తీవ్ర అసంతృప్తి చెందిన నరేష్ మీనా.. భారత్ ఆదివాసీ పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన హస్తం పార్టీ నరేష్ మీనాపై సస్పెండ్ వేటు వేసింది .
ఇదిలా ఉండగా కాగా రాజస్థాన్‌తోపాటు తొ మ్మిది రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న48 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13, 20న ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment