Rebel Candidate
-
రెబల్ ఎంపీ మద్దతు.. వందకు చేరిన కాంగ్రెస్ బలం!
ముంబై: కాంగ్రెస్ పార్టీ ఎంపీల సంఖ్య 100కు చేరనుంది. మహారాష్ట్రలోని సాంగ్లీ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థిగా బరిలోకి దిగిన విశాల్ పాటిల్ గెలుపొందిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీకి తన పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లీకార్జున ఖర్గేను కలిసి తాను మద్దతు ఇస్తున్నట్లు తెలిపే లేటర్‌ను అందజేశారు. ఈ విషయాన్ని ఖర్గే ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడాన్ని అధ్యక్షడు ఖర్గే స్వాగతించారు. మహారాష్ట్ర మాజీ సీఎం వసంత్‌దాదా పాటిల్ మనవుడు విశాల్ పాటిల్. ఇక లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల ఒప్పందాని కంటే ముందే శివసేన(యూబీటీ) కూటమి తరఫున తమ అభ్యర్థిని పోటీకి నిలిపింది. దీంతో కాంగ్రెస్ పునరాలోచించాలని శివసేన(యూబీటీ)ని కోరినా ఫలితం లేకుండా పోయింది.People of Maharashtra defeated the politics of treachery, arrogance and division. It is a fitting tribute to our inspiring stalwarts like Chhatrapati Shivaji Maharaj, Mahatma Jyotiba Phule and Babasaheb Dr Ambedkar who fought for social justice, equality and freedom.… pic.twitter.com/lOn3uYZIFk— Mallikarjun Kharge (@kharge) June 6, 2024 దీంతో విశాల్ పాటిల్.. సాంగ్లీలో స్వతంత్రంగా బరిలోకి దిగి గెలుపొందారు. ఆయన బీజేపీ అభ్యర్థి సంజయ్ కాకాపై విజయం సాధించారు. విశాల్ పాటిల్ గురువారమే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి మద్దతు తెలిపే లెటర్‌ను అందజేశారు. లోక్‌సభ సెక్రటరీ అనుమతి ఇస్తే.. విశాల్ పాటిల్ కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చిన ఎంపీగా కొనసాగుతారు. దీంతో కాంగ్రెస్ అభ్యుర్థులు సంఖ్య కూడా 99 నుంచి 100కు పెరుగుతుంది. మరోవైపు.. బిహార్‌లో పూర్ణియా లోక్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన పప్పు యాదవ్ సైతం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు తన పార్టీని కాంగ్రెస్‌లో కలిపిన పప్పు యాదవ్.. ఆర్జేడీతో సీట్ల ఒప్పందంతో టికెట్ లభించకపోవటంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. -
Yalamanchili: సుందరానికి షాక్
విశాఖ సిటీ: నోటి దురదతో అందరినీ దుర్భాషలాడడం.. వ్యాపారం పేరుతో మహిళకు మోసం.. నిరసనల పేరుతో పరిశ్రమలకు బ్లాక్‌మెయిలింగ్.. తాజాగా మత్స్యకార నాయకుడిపై హత్యాయత్నం.. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. యలమంచిలి నియోజకవర్గం జనసేన అభ్యర్థి సుందరపు విజయ్‌కుమార్‌పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. స్థానికంగా ప్రజాబలం లేనప్పటికీ.. మత్స్యకారులపై దాడులకు పాల్పడినప్పటికీ.. ఐవీఆర్ఎస్ సర్వేలో అతడికి వ్యతిరేకంగా వచ్చినప్పటికీ.. ఆయనకు జనసేనకు టికెట్ ఇవ్వడంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రజల్లోనే కాకుండా.. సొంత పార్టీ నేతలు సైతం విజయ్ అభ్యరి్థత్వాన్ని గట్టిగా వ్యతిరేకిస్తుండడం గమనార్హం. అతడికి వ్యతిరేకంగా జనసేన పార్టీ రెబల్ అభ్యరి్థగా మత్స్యకార నాయకుడు ఎర్రిపల్లి కిరణ్ నామినేషన్ వేశారు. విజయ్‌కు వ్యతిరేకంగా పూడిమడకతో పాటు మరికొన్ని గ్రామాల్లో జనసేన నాయకులు, అభిమానులు తిరుగుబాటుకు సన్నద్ధమవుతున్నారు.సుందరపు సోదరులపై సీపీకి ఫిర్యాదు సుందరపు సోదరులు వ్యాపారం పేరుతో ఒక మహిళను దారుణంగా మోసం చేశారు. ముందు సుందరపు సతీష్ రూ.23 లక్షలు, తరువాత సుందరపు విజయ్‌కుమార్ రూ.17 లక్షలు పెట్టుబడులు రూపంలో తీసుకొని తిరిగి ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని సదరు మహిళ 2020లో అప్పటి నగర పోలీస్ కమిషనర్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఇప్పుడు సుందరపు వ్యతిరేక వర్గీయులు తెరపైకి తీసుకువస్తున్నారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ జనరల్ హాస్పిటల్లో కార్డియాలజిస్ట్‌గా పనిచేస్తున్న డాక్టర్ రమేష్ ముద్దాడ 2012లో మరణించారు. అతని మరణం అనంతరం వచ్చిన డబ్బుతో భార్య శ్రీదేవి ముద్దాడ, ఇద్దరి పిల్లలను చూసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆ కుటుంబానికి పరిచయం ఉన్న సుందరపు సతీ‹Ùకుమార్(సుందరపు విజయ్‌కుమార్ సొదరుడు) 2013లో కలిసి ఒక వ్యాపారం కోసం చెప్పాడు.ఆమెను అక్కా అని పిలిచే సతీష్ కర్నాటకలో బల్లారి హెవీ మోటల్ వెహికల్ వ్యాపారంలో రూ.23 లక్షలు పెట్టుబడి పెడితే నెలకు రూ.1.8 లక్షలు రిటర్న్స్ వస్తాయని నమ్మించారు. దీనికి 2013, ఫిబ్రవరిలో ఆమె తన వద్ద ఉన్న బంగారాన్ని తనఖా పెట్టి రూ.23 లక్షలు ఎటువంటి ఒప్పంద పత్రాలు లేకుండానే సతీష్‌కు డబ్బులు ఇచ్చారు. తొలి నాలుగు నెలలు రిటర్న్స్ ఇవ్వని సతీష్ ఆ తరువాత ఒక ఏడాది పాటు కేవలం 80 వేలు మాత్రమే ఇచ్చాడు. మిగిలిన డబ్బులు జీతాలు, వాహనాలకు ఖర్చు అవుతుందని చెప్పేవాడు. ఆ తరువాత నుంచి అది కూడా ఇవ్వడం మానేశాడు. డబ్బులు కోసం అతడికి ఆడగగా వ్యాపారంలో నష్టం వచ్చిందని, అసలు కూడా రాదని తేల్చి చెప్పేశాడు. దీంతో ఆమె తీసుకున్న రుణం తీర్చడానికి చాలా ఇబ్బందులు పడ్డారు.కొద్ది రోజులకు విజయ్‌కుమార్.. కొద్ది రోజులకు విజయ్‌కుమార్.. శ్రీదేవిని కలిసి రిలయన్స్ టెలీకాంలో 4జీ కేబుల్ ప్రాజెక్టుకు రూ.40 లక్షలు పెట్టుబడి పెట్టాలని కోరాడు. ముందు అతని సోదరుడు చేసిన మోసం కారణంగా ఆ ప్రతిపాదనను శ్రీదేవి తిరస్కరించారు. అయితే విజయ్‌కుమార్ ఆమెను రిలయన్స్ ఆఫీస్‌కు తీసుకువెళ్లి అక్కడి ప్రతినిధులతో మాట్లాడించాడు. మంచి ఆదాయం వస్తుందని, గత వ్యాపారంలో వచ్చిన నష్టాల నుంచి బయటపడడానికి మంచి అవకాశమని, సంస్థ నుంచి బిల్లులు కూడా నేరుగా ఆమె అకౌంట్లోనే పడతాయని నమ్మించాడు. దీంతో ఆమె మరోసారి నమ్మి తన భర్త ఫ్లాట్‌పై లోన్ తీసుకొని రూ.17 లక్షలు సుందరపు విజయ్‌కుమార్‌కు ఇచ్చారు.విజయ్‌కుమార్ జనసేన పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉండడంతో శ్రీదేవి ఆ పనులు చూసుకోవడం ప్రారంభించారు. మొత్తం ప్రాజెక్ట్ వర్క్ పూర్తయినప్పటికీ.. ఆమె ఖాతాలో డబ్బులు పడలేదు. దీంతో ఆమె నేరుగా రిలయన్స్ ఆఫీస్‌కు వెళ్లి వాకబు చేయగా ఆ పనులకు సంబంధించి బిల్స్ విజయ్‌కుమార్ అకౌంట్‌కు రిలీజ్ చేసినట్లు చెప్పారు. దీంతో డబ్బు కోసం శ్రీదేవి.. సుందరపు విజయ్‌కుమార్‌ను అడిగారు. దీనికి ఆయన చెప్పిన సమాధానం విని షాక్‌కు గురయ్యారు. పనులు చేయించిన ఉద్యోగికి రూ.10 వేలు మాత్రమే ఇస్తామని, మహిళ కాబట్టి ఆమెకు నెలకు రూ.20 వేలు చొప్పున ఎన్ని నెలలు పనిచేస్తే అంత డబ్బు ఇవ్వాలని విజయ్ తన మనిíÙకి పురమాయించాడు. దీంతో పెట్టుబడి డబ్బులు ఇవ్వాలని అడిగినా విజయ్‌కుమార్ ఆమెను పట్టించుకోలేదు. ఎప్పటికప్పుడు ఆమె అతడిని డబ్బు కోసం అడగగా కొద్ది నెలల్లో ఇస్తానని రాతపూర్వకంగా హామీ ఇచ్చాడు. అయినప్పటికీ డబ్బు తిరిగి చెల్లించలేదు. దీంతో శ్రీదేవి అప్పటి నగర పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.మత్స్యకార నేతపై హత్యాయత్నంయలమంచిలి జనసేన అభ్యర్థి సుందరపు విజయ్‌కుమార్ పూడిమడక గ్రామ నివాసి, అదే పార్టీకి చెందిన మత్స్యకారుడు ఎర్రిçపల్లి కిరణ్‌పై దాడి, హత్యా ప్రయత్నాలు చేసినట్లు ఆరోపణలు ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ ఘటనతో పూడిమాడకతో పాటు తీర ప్రాంతవాసులు, ఉమ్మడి విశాఖలో మత్స్యకారులు సుందరపు విజయ్‌కుమార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూడిమడకకు చెందిన కిరణ్ చురుగ్గా జనసేన పారీ్టలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. దీంతో జనసేన అధినాయకులు సైతం అతడిని అభినందించారు. అయితే సుందరపు విజయ్‌కుమార్ మాత్రం కిరణ్‌పై కక్ష గట్టి దాడికి పాల్పడినట్లు ఆరోపిస్తున్నారు. దీనిపై కిరణ్, అతని కుటుంబ సభ్యులు, పూడిమడక గ్రామస్తులు పలుమార్లు మీడియా సమావేశాలు నిర్వహించి సుందరపు విజయ్‌కుమార్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. తాజాగా మత్స్యకార నేత కిరణ్ జనసేన రెబల్ అభ్యరి్థగా నామినేషన్ వేశారు. సుందరపు విజయ్‌కుమార్‌కు జనసేన టికెట్ ఇవ్వడం పట్ల మత్స్యకారులు తీవ్రస్థాయి మండిపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయ్‌కు గట్టి బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో సుందరపు వర్గీయులలో ఆందోళన వ్యక్తమవుతోంది. -
వెనక్కి తగ్గిన పప్పూ యాదవ్
బిహార్‌లోని పూర్నియా లోక్‌సభ స్థానంపై కాంగ్రెస్ నేత పప్పూ యాదవ్ వెనక్కి తగ్గారు. ఇటీవలే కాంగ్రెస్‌లో తనపార్టీని విలీనం చేసిన మాజీ ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ పూర్నియా స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే ఆ స్థానం మిత్రపక్షమైన ఆర్జేడీకి దక్కింది. దీంతో రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తారన్న ఊహాగానాలను ఆయన తోసిపుచ్చారు. "రాహుల్ గాంధీని దేశానికి ప్రధానమంత్రిని చేయడానికి, బిహార్‌లో కాంగ్రెస్ పార్టీనీ పునరుజ్జీవింపజేయడానికి కట్టుబడి ఉన్నాను. ఐదేళ్లలో ఇక్కడి మొత్తం 40 లోక్‌సభ నియోజకవర్గాలలో కాంగ్రెస్ ఒక శక్తిగా ఎదుగుతుంది" అని పప్పు యాదవ్ విలేకరులతో అన్నారు. తన జన్ అధికార్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినప్పుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తనకు పూర్నియా టిక్కెట్టు హామీ ఇచ్చారని పేర్కొన్న పప్పు యాదవ్.. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారా అని అడిగగా ప్రతికూలంగా సమాధానం ఇచ్చారు. తన చేతుల్లో కాంగ్రెస్ జెండాను పట్టుకున్నానని, తన చివరి శ్వాస వరకు దానిని ఎప్పటికీ వదలనని, పూర్నియాలో కాంగ్రెస్‌ను బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. -
మార్పుకే జనం ఓటు: బీజేపీ, కాంగ్రెస్‌కు షాకిస్తున్న రెబల్ అభ్యర్థి
రాజస్థాన్‌లో బీజేపీ హవా కొనసాగుతోంది.30 ఏళ్ల నుంచి కొనసాగుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా రాష్ట్ర ప్రజలు తీర్పునిచ్చినట్టు కనిపిస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని కోల్పోతూ ఓటమి దిశగా జారుకుంటోంది. భారత ఆదివాసీ పార్టీ తొలి బోణీ కొట్టింది. రాజస్థాన్‌లో 119 సీట్లకు గాను నవంబర్ 25న ఎన్నికలు జరగ్గా, ప్రస్తుతం ఓట్ల లెక్కింపు జరుగుతోంది. భారత ఎన్నికల సంఘం సమాచారం ప్రకారం ఈ క్రమంలో షియో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన 26 ఏళ్ల రవీంద్ర సింగ్ భాటి 32వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. విద్యార్థి నాయకుడిగా ఉన్న భాటీ ఈ ఎన్నికల్లో సీటు దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. విద్యార్థి హక్కుల కోసం పోరాటిన భాటికి యూత్ మద్దతు భారీగా లభించినట్టు తెలుస్తోంది. తాను గులకరాయినని, కుండ బద్దలుకొడతానని చెప్పిన భాటీ చెప్పినట్లే చేస్తున్నట్టుంది. జోధ్‌పూర్‌కు చెందిన భాటీ ప్రస్తుతం బీజేపీకి, కాంగ్రెస్‌కు చెమటలు పట్టిస్తున్నాడు. ఇక్కడ బీజేపీ స్వరూప్సింగ్కు సీటు ఇచ్చింది. దీంతో తిరుగుబాటు అభ్యర్థిగా నిలిచిన భాటీ తన హవాను చాటుకుంటూ ఆధిక్యంలో ఉన్నారు. చతుర్ముఖ పోరులో బీజేపీ స్వరూప్ సింగ్, కాంగ్రెస్ అమీన్ ఖాన్ , మరొక స్వతంత్ర అభ్యర్థి ఫతే ఖాన్ ఇక్కడ పోటీచేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో షీయో నుంచి కాంగ్రెస్‌కు చెందిన అమీన్ ఖాన్ విజయం సాధించారు. ఇది ఇలా ఉంటే ఒకవేళ రాష్ట్రంలో హంగ్ వస్తే ఏంటి అన్న అంచనాల మధ్య పార్టీని వీడి రెబల్స్‌గా మారిన బుజ్జగించేందుకు ఇరు పార్టీలు తమ తమ ప్రయత్నాల్లో ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు ఉంటుంది. ప్రాంతీయ పార్టీలు రాష్ట్రంలో కింగ్‌మేకర్‌గా అవతరించవచ్చు. రాజస్థాన్‌లో కొత్త ప్రభుత్వాన్ని నిర్ణయించడంలో చిన్న పార్టీలు ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉందని భావించారు. అయితే తాజా ట్రెండ్ ప్రకారం బీజేపీ 111 స్థానాలకుపైగాఆధిక్యం ప్రదర్శిస్తుండటంతో మేజిక్ ఫిగర్ సాధిస్తే, సింగిల్ లార్జెస్ట్పార్టీగా ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ మార్గం సుగమమవుతుంది. రాజస్థాన్‌లో ఆధిక్యంలో ఉన్న సీనియర్లు బీజేపీనేత మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే 51,484 ఓట్ల ఆధిక్యం కాంగ్రెస్ నుంచి సీఎంగా ఉన్న అశోక్ గెహ్లోత్ 14,231 ఓట్ల ఆధిక్యం బీజేపీ ఎంపీ, తిజారా అభ్యర్థి బాబా బాలక్ నాథ్ 4807 ఓట్ల ఆధిక్యం బీజేపీ ఎంపీ, విద్యాధర్ నగర్ అభ్యర్థి దియా కుమారి 56,025 ఓట్ల ఆధిక్యం బీజేపీ ఎంపీ, Jhotwara అభ్యర్థి, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ పదిహేనవ రౌండ్ కౌంటింగ్ తర్వాత 11,732 ఓట్ల ఆధిక్యం రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, లచ్మాన్‌గఢ్ అభ్యర్థి గోవింద్ సింగ్ దోతస్రా ఆధిక్యం టోంక్ , కాంగ్రెస్ అభ్యర్థి సచిన్ పైలట్ 5702 ఓట్ల ఆధిక్యం -
కులం మీద బతికేవాడు అయ్యన్నపాత్రుడు
సాక్షి,అనకాపల్లి: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు వెలమ కుల ద్రోహి అని టీడీపీ సీనియర్ నేత, ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ స్థానానికి పోటీపడుతున్న టీడీపీ రెబల్ అభ్యర్థి ఈర్లె శ్రీరామ్మూర్తి విమర్శించారు. కులం కోసం కాదు.. కులం మీద బతికేవాడే అయ్యన్నపాత్రుడు అని, తాను తప్ప ఎవరూ ఎదగకూడదని అనుకునే వాడని మండిపడ్డారు. రాజకీయంగా తన ఎదుగుదలను అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ వస్తున్నారని ఆరోపించారు. ఆదివారం అనకాపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను 2018లో రెవెన్యూ ఉద్యోగానికి రాజీనామా చేసి టీడీపీకి సేవలు చేస్తున్నానని తెలిపారు. బీసీ వర్గానికి చెందిన తనకు గతంలో చంద్రబాబు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారని.. కానీ మాట తప్పారని ధ్వజమెత్తారు. బీసీ కులాలంటే టీడీపీ అధిష్టానానికి గౌరవం ఎక్కడ ఉందని ప్రశ్నించారు. తనకు ఉపాధ్యాయ సంఘాలు, పట్టభద్రులతో మంచి సన్నిహితం ఉందని, టీడీపీ రెబల్ అభ్యర్థిగా, ఇండిపెండెంట్‌గానైనా నామినేషన్ వేసి గెలుస్తానని శ్రీరామ్మూర్తి ధీమా వ్యక్తం చేశారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో సన్నిహితంగా ఉంటాననే అక్కసుతోనే అయ్యన్నపాత్రుడు అడుగడుగునా తనపై కక్షసాధింపు చర్యలు చేపడుతున్నారని మండిపడ్డారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం అల్లిపూడి అయ్యన్నపాత్రుడి స్వగ్రామమని, ఆయనది ఉత్తరాంధ్ర కాదని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని వలస నేతలు పాలిస్తున్నారనే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న అయ్యన్నకు ఆ అర్హత లేదన్నారు. -
మోదీతో 25 ఏళ్ల పరిచయం.. అయినా వెనక్కి తగ్గను
సిమ్లా: ప్రధాని స్వయంగా ఫోన్ చేసినా వెనక్కి తగ్గేది లేదని తెగేసి చెప్పారు బీజేపీ మాజీ ఎంపీ కృపాల్ పర్మార్. హిమచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఫతేపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు. బీజేపీ తనకు టికెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగారు. గతేడాది జరిగిన ఫతేపూర్ ఉప ఎన్నికలో తనకు అవకాశం ఇవ్వకపోవడంతో అప్పటి నుంచి ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తాజా ఎన్నికల్లోనూ మొండిచేయి చూపడంతో తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ‘నేను పోటీలో ఉన్నాను. బీజేపీ అధికారిక అభ్యర్థిని కాదు. ఇది నాకు, కాంగ్రెస్ అభ్యర్థికి మధ్య జరుగుతున్న పోటీ’ అని వ్యాఖ్యానించారు. తనకు టికెట్ రాకపోవడానికి పాఠశాలలో తనతో కలిసి చదువుకున్న ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కారణమని పర్మార్ ఆరోపించారు. 15 ఏళ్లుగా తనను నడ్డా అవమానిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీతో చెప్పినట్టు వెల్లడించారు. పర్మార్‌తో ఫోన్లో మోదీ మాట్లాడిన ఆడియో కాల్ వైరల్ అయింది. ఈ ఫోన్ కాల్‌ను బీజేపీ, ప్రధాని కార్యాలయం ధ్రువీకరించలేదు. అక్టోబర్ 30న తనకు ప్రధాని మోదీ ఫోన్ చేశారని కృపాల్ పర్మార్ వెల్లడించారు. ‘మోదీతో 25 ఏళ్లుగా పరిచయం ఉంది. హిమచల్‌ప్రదేశ్ ఇన్‌ఛార్జ్‌గా ఆయన ఉన్నప్పుడు, నేను ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. మేమిద్దరం కలిసి రాష్ట్రమంతా పర్యటించాం. ఆయనతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. మోదీని నేను దేవుడిగా భావిస్తాను. స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నానని ఆయనతో చెప్పాను. ఒక్కరోజు ముందుగా ఫోన్ చేసినా పోటీ నుంచి తప్పుకునే వాడినని ఆయనతో చెప్పాన’ని 63 ఏళ్ల పర్మార్ వివరించారు. 68 స్థానాలున్న హిమచల్‌ప్రదేశ్ అసెంబ్లీకి నవంబర్ 12న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 8న ఫలితాలు ప్రకటిస్తారు. ఈ ఎన్నికల్లో అధికార బీజేపీకి రెబల్స్ బెడద ఎక్కువగా ఉంది. దాదాపు 30 మంది తిరుగుబాటు అభ్యర్థులు బరిలో ఉన్నారు. (క్లిక్: అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆమే' కీలకం.. హామీల వర్షం కురిపిస్తున్న పార్టీలు) -
అభ్యర్థులకు తప్పని రెబెల్స్ కష్టాలు
సాక్షిప్రతినిధి, సూర్యాపేట: మహాకూటమిలో రె‘బెల్స్’ షురూ అయ్యాయి. చివరి దాకా ప్రయత్నించి టికెట్ దక్కని ఆశావహులు రెబల్స్‌గా బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలోని నాలుగు స్థానాల్లో మూడు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో రెండు స్థానాల్లో అసమ్మతి నెలకొంది. కార్యకర్తల నిర్ణయం మేరకు అడుగులు వేస్తామని టికెట్ దక్కని వారు ప్రకటించారు. మహాకూటమిలో భాగంగా టికెట్ దక్కకపోవడంతో కోదాడ నుంచి బొల్లం మల్లయ్యయాదవ్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు నిర్ణయించుకున్నారు. సూర్యాపేట టికెట్ రాకపోవడంతో ఈనెల 15న భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం ఉంటుందని పటేల్ రమేష్‌రెడ్డి ప్రకటించారు. ఉత్తమ్ పై.. బొల్ల మల్లయ్య ఫైర్ తాజాగా కోదాడ నుంచి మహాకూటమిలో భాగంగా టికెట్ వస్తుందనుకున్న టీడీపీ నేత బొల్లం మల్లయ్య.. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉత్తమ్ తన సతీమణి పద్మావతికి టికెట్ కోసం.. తనకు టికెట్ రాకుండా అడ్డుకున్నారని మల్లయ్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోమవారం కోదాడలో నిర్వహించిన టీడీపీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన ఆవేదనతో మాట్లాడుతూ ఇండిపెండింట్‌గా బరిలో దిగుతానని ప్రకటించారు. కేసీఆర్‌ది కుటుంబ పాలనని విమర్శిస్తున్న ఉత్తమ్ కోదాడలో చేస్తుంది కుటుంబ పాలన కాదా ..? అని బొల్లం మల్లయ్య కార్యకర్తల సమావేశంలో ప్రశ్నించారు. మహాకూటమిలో అగ్రవర్ణాలు .. బీసీలకు అన్యాయం చేశాయని, తనకు టికెట్ రాకుండా ఉత్తమ్ అడ్డుకున్నారన్నారు. ఉత్తమ్, ఆయన సతీమణి హుజూర్నగర్, కోదాడలలో పోటీ చేస్తూ,కోదాడలో తనకు వచ్చిన అవకాశాలపై దెబ్బ తీశారని, తన నోటికాడి కూడును లాక్కున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. సతీమణి కోసం 2014లో మహబూబ్‌జానీని, ఇప్పుడు తనను ఉత్తమ్ మోసం చేశాడని అన్నారు. చందర్రావు, ఉత్తమ్‌ల మధ్య చీకటి ఒప్పందం ఉందని వారిద్దరు తప్పా ఇతరులను కోదాడలో గెలవనీయకుండా చూసుకుంటున్నారని ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు. తన రాజకీయ భవిష్యత్తు కోసం నియోజకవర్గంలో బీసీలను ఏకం చేసి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానన్నారు. పటేల్ పయనం ఏటు..? టికెట్ రాకపోవడంతో మంగళవారం ఢిల్లీ నుంచి పటేల్ రమేశ్‌రెడ్డి సూర్యాపేటకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అనుచరగణం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించింది. అనంతరం ఇంటికిచేరుకున్న రమేష్‌రెడ్డిని చూసి ఆయన సతీమణి లావణ్య బంధువులు కంటితడిపెట్టారు. వారందరిని చూడడంతో రమేష్‌రెడ్డి కూడా కన్నీరుమున్నీరయ్యారు. టికెట్ రాలేదని అభిమానులు కూడా కంటతడి పెట్టారు. ఆతర్వాత ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాను 25 ఏళ్లు మచ్చలేకుండా రాజకీయం చేశానని, ఇప్పటికీ తనకే టికెట్ వస్తుందన్నారు. పార్టీలో ఏ వర్గం లేదని, అంతా రాహుల్‌గాంధీ వర్గమేనన్నారు. ఈనెల 15న జిల్లా కేంద్రంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. కార్యకర్తలు ఎవ్వరూ అధైర్య పడవద్దన్నారు. అయితే ఆరోజు రమేష్‌రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటాడని నియోజకవర్గ వ్యాప్తంగా జోరుగా చర్చ సాగుతోంది. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతాడా..?, లేక ఆయనకు ఇంకా టికెట్‌పై ఏమైనా ఆశలు ఉన్నాయా..?, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థితో కలిసి పనిచేస్తారా..? అని చర్చించుకుంటున్నారు. -
నేతల రివర్స్ గేర్..!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి–హైదరాబాద్ : రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల షెడ్యూల్ ఇంకా వెలువడక ముందే అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్‌లో వలసలు తీవ్రమయ్యాయి. ముందుగానే అభ్యర్థులను ప్రకటించి టీఆర్ఎస్... టీడీపీ, సీపీఐ, జన సమితితో పొత్తుల కారణంగా కాంగ్రెస్ తీవ్ర అసమ్మతిని ఎదుర్కొంటున్నాయి. దీంతో టికెట్ల ప్రాతిపదికగా నేతలు పార్టీలు మారే వ్యూహాల్లో తలమునకలయ్యారు. ఇరు పార్టీల్లోనూ అసమ్మతి... టీఆర్ఎస్లో తాము కోరిన వారికే టికెట్లు ఇవ్వాలని పలువురు మంత్రులే పట్టుబడుతుండగా మరోవైపు టికెట్ కోసం కొందరు ఆశావహులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో టికెట్ రాదని భావిస్తున్న నేతలంతా పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సైతం ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటోంది. పొత్తుల్లో భాగంగా హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్, ఉప్పల్ నియోజకవర్గాలను టీడీపీకి కేటాయిస్తారన్న సమాచారంతో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే డి. సుధీర్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. మరో మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి సోదరుడు బండారి లక్ష్మారెడ్డి ఉప్పల్ నుంచి పోటీ చేయాలని యోచిస్తున్నారు. ఆ సీటును టీడీపీ గట్టిగా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో లక్ష్మారెడ్డి సైతం టీఆర్ఎస్లో చేరేందుకు పావులు కదుపుతున్నారు. అయితే ఈ రెండు నియోజకవర్గాలకు టీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. ఇక మల్కాజ్గిరి టికెట్ ఆశించిన టీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరడం దాదాపుగా ఖాయమైంది. మల్కాజ్గిరి నుంచి పార్టీ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి కోడలు విజయశాంతికి టికెట్ ఖాయమైనట్లు తెలిసింది. అదే నిజమైతే పార్టీ వీడటానికి వెనుకాడబోనని గ్రేటర్ హైదరాబాద్ మాజీ అధ్యక్షుడు మైనంపల్లి హన్మంతరావు తన సన్నిహితులతో చెప్పారు. ఈ కారణంగానే మల్కాజ్గిరి టికెట్‌ను అధికారికంగా ప్రకటించకుండా పార్టీ నాయకత్వం తాత్సరం చేస్తోందని సమాచారం. ఎల్బీ నగర్, ఉప్పల్ నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్లో చేరడానికి గ్రీన్‌సిగ్నల్ ఇస్తే ఆ నియోజవర్గాల్లో టీఆర్ఎస్ నేతలు పార్టీ మారే అవకాశాన్ని నాయకత్వం అంచనా వేస్తోంది. ముందుగా అక్కడి నేతలతో సంప్రదింపులు జరిపి ఒప్పించాకే నిర్ణయానికి రావాలని భావిస్తోంది. ఇటీవలటీఆర్ఎస్లో చేరతానని ప్రకటించిన మాజీ స్పీకర్ కె.ఆర్. సురేశ్‌రెడ్డి బుధవారం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరతారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. కరీంనగర్, నిజామాబాద్‌ల నుంచి ఎక్కువ వలసలు... ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన చాలా మంది టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు వలసలకు సిద్ధమవుతున్నారు. టీఆర్ఎస్ నాయకత్వంతో మింగుడుపడని సీనియర్ నేత డి. శ్రీనివాస్, ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, నందీశ్వర్‌గౌడ్, ఆకుల రాజేందర్ బుధవారం హైదరాబాద్ పర్యటనకు వచ్చే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గులాం నబీ ఆజాద్ సమక్షంలో కాంగ్రెస్ గూటికి వస్తారని తెలుస్తోంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ వర్గాలు ధ్రువీకరించాయి. కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత సుద్దాల దేవయ్య పార్టీ మారుతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. త్వరలో ఆయన టీఆర్ఎస్లో చేరుతారని, చొప్పదండి నియోజకవర్గం టికెట్ ఆయనకు ఇచ్చే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెప్పాయి. కాంగ్రెస్‌లోకి కొండా దంపతులు! వరంగల్ తూర్పు టికెట్ పెండింగ్‌లో పెట్టడం ద్వారా తనను అవమానించారంటూ టీఆర్ఎస్ నాయకత్వంపై తీవ్ర ఆరోపణలు చేసిన తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ, ఎమ్మెల్సీ మురళీ దంపతులు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌తో చర్చలు జరిపినట్లు తెలియవచ్చింది. వరంగల్ తూర్పు, పరకాల సీట్లు వారికి ఖాయమయ్యాయని, ఆ నియోజకవర్గాల నుంచి సురేఖ, ఆమె కుమార్తె సుస్మితా పటేల్ పోటీకి కాంగ్రెస్ ఆమోదం తెలిపినట్లేనని విశ్వసనీయ సమాచారం. భూపాలపల్లి సీటును కూడా కొండా దంపతులు కోరినా ఇవ్వడం కుదరదని ఉత్తమ్ తేల్చిచెప్పినట్లు తెలిసింది. సొంత గూటికి జలగం, బాలూ నాయక్... ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి జలగం ప్రసాదరావు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. పార్టీలో చేరాలంటూ ఇటీవల జలగం ఇంటికి వెళ్లి ఉత్తమ్ కోరడంతో ఆయన చేరేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఆయనకు ఖమ్మం లేదా కొత్తగూడెం స్థానాల నుంచి పోటీ చేసేందుకు అవకాశం లభించొచ్చని భావిస్తున్నారు. కొత్తగూడెం నుంచి పోటీకి అంగీకరిస్తే అక్కడ అన్నదమ్ముల సవాల్‌గా పోటీ రసవత్తరం కానుంది. తాజా మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు కొత్తగూడెం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన దేవరకొండ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత జిల్లా పరిషత్ చైర్మన్ బాలూనాయక్ కాంగ్రెస్‌లో చేరాలని భావిస్తున్నారు. తనకు దేవరకొండ టికెట్ కేటాయిస్తే పార్టీలో చేరతానని ఆయన ఇప్పటికే కాంగ్రెస్ ముఖ్యులకు వర్తమానం పంపారు. ప్రస్తుతం మిర్యాలగూడ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే విజయసింహారెడ్డిని పార్టీలో చేరాల్సిందిగా టీపీసీసీ ముఖ్యులు కోరినట్లు తెలిసింది. అయితే ఆయన్ను హుజూర్నగర్ నుంచి పార్టీ అభ్యర్థిగా నిలిపే అంశాన్ని టీఆర్ఎస్ నాయకత్వం పరిశీలిస్తోంది. టీపీసీసీ చీఫ్‌ను కలిసిన దానం? కాంగ్రెస్‌కు ఇటీవలే రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరిన మాజీ మంత్రి దానం నాగేందర్ ఆదివారం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌ను కలిశారని, ఖైరతాబాద్ టికెట్ ఇస్తే కాంగ్రెస్‌లో చేరతానని చెప్పారంటూ సోషల్ మీడియాలో విస్తృ ప్రచారం జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నేత సమక్షంలో ఉత్తమ్‌తో దానం సమావేశమైనట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం ధ్రువీకరించినట్లు టీఆర్ఎస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే ఈ వార్తలను దానం తీవ్రంగా ఖండించారు. తనపై కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని, తనకు టికెట్ రాకున్నా టీఆర్ఎస్లోనే కొనసాగుతానని దానం సోమవారం మీడియాకు చెప్పారు. -
ముదురుతున్న ముసలం
సాక్షి, మంచిర్యాల : కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు రసవత్తరంగా మారుతోంది. రెబెల్ అభ్యర్థిని ఒక పార్టీ బరిలో ఉంచితే.. మరో పార్టీ శ్రేణులు తమను పట్టించుకోని వారిని తామెందుకు గౌరవిస్తామని వ్యాఖ్యానిస్తున్నాయి. వెరసి జిల్లాలోని పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో పొత్తు కత్తులు నూరుతోంది. కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థి చిలుముల శంకర్‌పై సీపీఐ రాష్ర్ట నేతలు కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేయడం తాజా పరిస్థితికి అద్దంపడుతోంది. రాష్ట్రస్థాయిలో కాంగ్రెస్, సీపీఐల మధ్య కుదిరన పొత్తుతో బెల్లంపల్లి స్థానం నుంచి గుండా మల్లేశ్‌ను సీపీఐ బరిలోకి దింపింది. చిలుముల శంకర్ కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆయనను ఉపసంహరింపచేయాలని సీపీఐ కాంగ్రెస్‌ను కోరినా ఆయన వెనక్కి తగ్గలేదు. ఇటీవల గుండా మల్లేశ్ నియోజకవర్గంలో సమావేశం ఏర్పాటు చేసి సీపీఐ-కాంగ్రెస్ కార్యకర్తలు పొత్తు ధర్మం పాటించాలని, తన గెలుపునకు సహకరించాలని కోరారు. ఈ ప్రయత్నం ఫలించినట్లుగా కనిపించడం లేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. బెల్లంపల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు సమావేశం ఏర్పాటు చేసుకుని శంకర్‌కే తాము మద్దతిస్తామని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇదంతా కాంగ్రెస్‌లోని ఓ బలమైన నాయకుడి అండతో సాగుతోందని సీపీఐ వర్గాలు ఆరోపిస్తున్నాయి. దీంతో గుండా మల్లేశ్ పరిస్థితి సంకటంలో పడిందని నియోజకవర్గ కమ్యూనిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల నియోజకవర్గంలోనూ కాంగ్రెస్-సీపీఐ శ్రేణుల మధ్య సయోధ్య కుదిరినట్లు కనిపించడం లేదు. కాంగ్రెస్ నేతల సమావేశాలు, ప్రచారంలో ఎక్కడా సీపీఐ వర్గాలు కానరావడం లేదు. బెల్లంపల్లిలో తమకు కాంగ్రెస్ సహకరించిడం లేదని అలాంటపుడు తాము వినోద్‌కు మద్దతుగా ఎలా ఉంటామని చెన్నూర్ సీపీఐ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. రామగుండం, పెద్దపల్లి, ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు సీపీఐ అనుబంధ కార్మిక సంఘం ఏఐటీయూసీ శ్రేణులను కాంగ్రెస్ ప్రచారంలో ఆహ్వానించడం లేదు. శంకర్‌పై ఫిర్యాదు శంకర్‌పై చర్యలు తీసుకోవాలని సీపీఐ ఎన్నికల కమిటీ కన్వీనర్ చాడా వెంకటరెడ్డి తెలంగాణ పీసీసీ అగ్రనేతలకు బుధవారం హైదరాబాద్‌లో ఫిర్యాదు చేశారు. నేడు(గురువారం)సమావేశం కానున్న టీపీసీసీ శంకర్‌ను సస్పెండ్ చేసే అవకాశాలున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా తమ రెండు పార్టీల మధ్య పొత్తు అనేది ఉందా అనే సందేహాలు తమకే కలుగుతున్నాయని ఇరు పార్టీల నేతలే చర్చించుకుంటున్నారు. -
కాంగ్రెస్.. రెబల్ డ్రామా
' టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు మార్గం సుగమం చేసిన సీఎం కిరణ్ ' రాజ్యసభ బరిలోంచి తప్పుకుంటున్నట్టు ప్రకటన చేసిన ఆదాల ' విరమణ వెనుక భారీ ప్యాకేజీ, లావాదేవీలు జరిగినట్టు సమాచారం ' వైఎస్సార్ సీపీ సహకరించని కారణంగా వైదొలుగుతున్నట్టు ఆదాల ప్రకటన ' నామినేషన్ల పర్వం ప్రారంభం కాకముందే ఎన్నికలకు దూరంగా ఉంటామని ప్రకటించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల్లో రెబల్ అభ్యర్థిని రంగంలోకి దింపి ఇంతకాలం హైడ్రామా నడిపిన కాంగ్రెస్ బండారం బయటపడింది. సమైక్యవాదం కోసమంటూ కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిగా రంగంలో నిలిచిన ఆ పార్టీ ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డిని పోలింగ్‌కు ఒకరోజు ముందు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి.. బరి నుంచి వైదొలిగేలా చేశారు. ముఖ్యమంత్రి సూచన మేరకు తాను పోటీ నుంచి తప్పుకుంటున్నానని ఆదాల గురువారం ప్రకటన చేశారు. ఆయన గురువారం ఎమ్మెల్యేలు జేసీ దివాకర్‌రెడ్డి, శ్రీధర్కృష్ణారెడ్డిలతో కలిసి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో సమావేశమయ్యారు. పోటీనుంచి తప్పుకునే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం జేసీ, శ్రీధర్కృష్ణారెడ్డిలతో కలిసి సీఎల్పీ కార్యాలయం వద్దకు చేరుకుని తాను పోటీనుంచి విరమించుకుంటున్నట్టు ప్రకటించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు సహకరించబోమన్నారని, అందువల్లే బరినుంచి తప్పుకుంటున్నానని ఆదాల చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా విలేక రులడిగిన పలు ప్రశ్నలకు జవాబు చెప్పకుండా పక్కనున్న జేసీని మాట్లాడాలంటూ సూచించి పక్కకు తప్పుకున్నారు. ఎన్నికల్లో సమైక్యవాదులంతా తనకు ఓటు వేస్తారని, 42 మంది ఎమ్మెల్యేల మద్దతుందని చెప్పిన ఆదాల చివరి నిమిషంలో ఇలా తప్పుకోవడానికిగాను భారీ ప్యాకేజీలతో అవగాహన కుదిరినట్టు సమాచారం. మరోవైపు టీఆర్ఎస్ అభ్యర్థి కె. కేశవరావు గెలుపునకు ముఖ్యమంత్రి మార్గం సుగమం చేయడంతో రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ప్యాకేజీలో.. రికవరీ మాఫీ ఆదాల నెల్లూరు జిల్లాలోని ఒక ప్రాజెక్టు అధునీకరణ పనుల కాంట్రాక్టు పొందగా, ఆ పనులు నాసిరకంగా ఉన్నాయని, దానిపై చెల్లించిన మొత్తంలో రూ.25 కోట్లను కాంట్రాక్టర్ నుంచి రికవరీ చేయాల్సిందిగా విజిలెన్స్ నిగ్గుతేల్చిందని చెబుతున్నారు. ఇప్పుడు రాజ్యసభ బరిలో నుంచి తప్పుకోవడం ద్వారా ఆ రికవరీని మాఫీ చేయడానికి అంగీకారం కుదిరిందని సమాచారం. అలాగే జిల్లాలో వరద నివారణకు సంబంధించి రూ.68 కోట్ల విలువైన ఎత్తిపోతల పథకాన్ని నామినేషన్‌పై కట్టబెట్టడానికి కూడా అవగాహనకొచ్చారని కాంగ్రెస్‌లో బలంగా వినిపిస్తోంది. ఎత్తిపోతల ఫైలు ప్రస్తుతం ఆర్థిక శాఖలో పెండింగ్‌లో ఉందని సమాచారం. మొదటి నుంచి ప్లాన్ ప్రకారమే... అసెంబ్లీలో విభజన బిల్లుపై చర్చ సాగుతున్న తరుణంలో సమైక్యవాదం కోసం పోరాడుతున్నట్లు ఎమ్మెల్యేలను భ్రమల్లో ఉంచడం, చివరి నిమిషంలో రంగం నుంచి తప్పించడం ద్వారా సీఎం రెండు రకాల ప్రయోజనాలను నెరవేర్చుకునేందుకు ఆదాలతో రెబల్‌గా నామినేషన్ వేయించారని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే తనకు 20 మంది ఎమ్మెల్యేల బలం ఉందని స్వతంత్ర ఎమ్మెల్సీ చైతన్యరాజు నామినేషన్ వే యడంతో సీఎం ఇరకాటంలో పడ్డారు. చైతన్యరాజు బరిలో ఉంటే చివర్లో పోటీనుంచి తప్పుకొనే పరిస్థితి ఉండదని, దీంతో ఓటమి తప్పదన్న అంచనాకు వచ్చారు. దీంతో పార్టీ రెబెల్ అభ్యర్థి ఆదాలను తప్పించే బదులు పార్టీకి సంబంధం లేని స్వతంత్ర అభ్యర్థి బరి నుంచి వైదొలగేలా చేయడానికి ఆయన అనేకరకాల ఒత్తిళ్లు చేశారని అంటున్నారు. నెపం వైఎస్సార్ కాంగ్రెస్‌పై.. - ప్రాజెక్టు ప్యాకేజీల విషయం బయటికి రాకుండా ఆదాలను తప్పించే విషయంలో వ్యూహాత్మకంగానే కాంగ్రెస్ నేతలు నిందను వైఎస్సార్ కాంగ్రెస్‌పై నెట్టేందుకు ప్రయత్నించినట్టు స్పష్టమైంది. - వాస్తవానికి సంఖ్యాబలంలేనందున తాము పోటీ చేయబోమని, ఏ అభ్యర్థికీ మద్దతు ఇవ్వబోమని వైఎస్సార్ కాంగ్రెస్ రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే ప్రకటించింది. పైగా ఎమ్మెల్యేలకు విప్ కూడా జారీ చేసింది. - గురువారం ఉదయం సీఎం తన క్యాంపు కార్యాలయంలో తన పార్టీకి చెందిన 27 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. పార్టీ అభ్యర్థుల గెలుపునకు వీలుగా పోటీ నుంచి తప్పుకోవాలని, వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతు ఇవ్వకపోవడం వల్లనే తాను వైదొలగుతున్నట్లు చెప్పాలని ఆదాలకు సీఎం ఈ సమావేశంలో సూచించినట్లు సమాచారం. - ఈ సమావేశంలోనే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌తో సీఎం ఫోన్లో సంప్రదింపులు జరిపి వారిచ్చిన సూచనల మేరకు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. - ఆదాలకు ఓటు వేయాలని పార్టీ ఎమ్మెల్యేలను అడిగితే సీఎం చెబితే వేస్తామంటున్నారని, సీఎం మాత్రం ఆదాలనే తప్పుకోమని చెబుతున్నారని సీనియర్ ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి సీఎల్పీలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ పేర్కొన్నారు. కాగా, ఎవరు ఎవరికి ఓటు వేయాలన్నదానిపై శుక్ర వారం ఉదయం పార్టీ ఎమ్మెల్యేలకు ఏర్పాటు చేసిన తేనీటి విందులో సీఎం వివరించనున్నారని పార్టీ వర్గాలు చెప్పాయి. - అదనపు ఓట్లు కేకేకు: సీఎం సహాతెలంగాణ నేతలతో చర్చించిన అధిష్టానం అదనపు ఓట్లను టీఆర్ఎస్ అభ్యర్థికి అనధికారికంగా కేటాయించేలా సూచనలు అందించినట్లు తెలుస్తోంది. -
ఆదాలకు కాంగ్రెస్, టీడీపీ అండ!
సమైక్యాంధ్ర వాదన వెనుక వేరే మతలబు రెబెల్‌గా ఆదాల బరిలో దిగేందుకు కాంగ్రెస్ ముఖ్యనేత సహకారం ఓ కాంగ్రెస్ అభ్యర్థికి పొగ.. టీడీపీ మద్దతుపై ప్రభాకర్‌రెడ్డి ఆందోళన సాక్షి, హైద రాబాద్: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిగా రంగంలో నిలిచిన ఆదాల ప్రభాకర్‌రెడ్డికి సొంత పార్టీ నుంచే కాకుండా ప్రధాన ప్రతిపక్ష టీడీపీ నుంచి కూడా అండదండలు ఉన్నట్టు తెలుస్తోంది. సమైక్యాంధ్రకు కట్టుబడిన వారంతా తనకు ఓటు వేస్తారంటూ రెబెల్ అభ్యర్థిగా ఆదాల రంగంలోకి దిగినప్పటికీ తెరవెనుక రాజకీయ మతలబు వేరే ఉందని సర్వత్రా వినిపిస్తోంది. ఇప్పటికే కుదుర్చుకున్న ప్యాకేజీ మేరకు త్వరలోనే టీడీపీలో చేరాలని భావించిన కొందరు నేతలు కూడా రెబెల్‌గా ఆదాలను రంగప్రవేశం చేయించారని తెలుస్తోంది. అందుకు కాంగ్రెస్‌లోని ముఖ్యనేత ఒకరు కూడా సంపూర్ణంగా సహకరిస్తున్నట్టు బలంగా వినిపిస్తోంది. ఆదాల అభ్యర్థిత్వానికి మద్దతు తెలుపుతూ నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసిన వారిలో చాలామంది నేతలు టీడీపీలో చేరడానికి ఇప్పటికే తెరవెనుక ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థిగా రంగంలోకి దిగిన కె.కేశ వరావు టార్గెట్‌గా వ్యూహాత్మకంగానే కాంగ్రెస్, టీడీపీల్లోని ముఖ్యులు ఆదాలను రంగంలోకి దించినట్టు చెబుతున్నప్పటికీ కాంగ్రెస్‌కు చెందిన ఒక అభ్యర్థికి గండి కొట్టడానికి ప్రయత్నాలు ముమ్మరమైనట్టు తెలుస్తోంది. తెరవెనుక లావాదేవీలు ముమ్మరం కావడం, ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ సూచించిన వారికే కచ్చితంగా ఓటు వేస్తారన్న నమ్మకం లేకపోవడం రంగంలో మిగిలిన అభ్యర్థుల్లో ఆందోళన పెంచుతోంది. మరోవైపు రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఉన్న బీజేపీతో చేతులు కలపాలని తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్న టీడీపీ మద్దతు ఉన్నట్టు ప్రచారం జరిగితే సీమాంధ్ర ఎమ్మెల్యేలు తనకు ఓటు వేయకపోవచ్చన్న ఆందోళన ఆదాలలో ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ ముఖ్య నేత తెరవెనుక మద్దతునిస్తున్నప్పటికీ ఆ పార్టీలో ఎవరి నుంచి ఓట్లు వేయిస్తారన్న విషయంలో స్పష్టత లేకపోవడం కూడా ఆదాలను కలవరానికి గురిచేస్తున్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే శుక్రవారం ఆయన నామినేషన్ ఉపసంహరించుకోవాలని భావించిన ప్పటికీ రెండు పార్టీల్లోని ముఖ్య నేతల ఒత్తిడితోనే చివరకు బరిలో మిగిలారని అంటున్నారు.