బిహార్‌లోని పూర్నియా లోక్‌సభ స్థానంపై కాంగ్రెస్ నేత పప్పూ యాదవ్ వెనక్కి తగ్గారు. ఇటీవలే కాంగ్రెస్‌లో తనపార్టీని విలీనం చేసిన మాజీ ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ పూర్నియా స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే ఆ స్థానం మిత్రపక్షమైన ఆర్జేడీకి దక్కింది. దీంతో రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తారన్న ఊహాగానాలను ఆయన తోసిపుచ్చారు.
"రాహుల్ గాంధీని దేశానికి ప్రధానమంత్రిని చేయడానికి, బిహార్‌లో కాంగ్రెస్ పార్టీనీ పునరుజ్జీవింపజేయడానికి కట్టుబడి ఉన్నాను. ఐదేళ్లలో ఇక్కడి మొత్తం 40 లోక్‌సభ నియోజకవర్గాలలో కాంగ్రెస్ ఒక శక్తిగా ఎదుగుతుంది" అని పప్పు యాదవ్ విలేకరులతో అన్నారు.
తన జన్ అధికార్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినప్పుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తనకు పూర్నియా టిక్కెట్టు హామీ ఇచ్చారని పేర్కొన్న పప్పు యాదవ్.. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారా అని అడిగగా ప్రతికూలంగా సమాధానం ఇచ్చారు. తన చేతుల్లో కాంగ్రెస్ జెండాను పట్టుకున్నానని, తన చివరి శ్వాస వరకు దానిని ఎప్పటికీ వదలనని, పూర్నియాలో కాంగ్రెస్‌ను బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment