pappu yadav
-
పప్పూ యాదవ్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హెచ్చరికలు
పట్నా: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ విషయంలో దూరంగా ఉండకపోతే.. హత్య చేస్తామని బీహార్ ఎంపీ పప్పూ యాదవ్‌ను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హెచ్చరించింది. ఈ మేరకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సోమవారం ఓ ఆడియో క్లిప్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఆ ఆడియో బిహార్‌లో కలకలం రేపుతోంది.‘‘ఎంపీ పప్పూ యాదవ్ కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నాం. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు సంబంధించిన విషయాల నుంచి ఆయన దూరంగా ఉండాలి. అలా ఉండకపోతే హత్య చేయడానికి కూడా వెనకాడము. అహ్మదాబాద్‌లోని సబర్మతి జైలులో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ సిగ్నల్ జామర్లను డిసేబుల్ చేయడానికి గంటకు రూ.1 లక్ష చెల్లిస్తున్నారు. పప్పూ యాదవ్‌తో నేరుగా కమ్యూనికేషన్‌ను ఏర్పాటు చేసుకునేందుకు అనుమతిస్తున్నారు. అయితే ఆయన మాత్రం మా కాల్స్‌కు స్పందించటం లేదు’’ అని ఆడియోలో క్లిప్‌లో ఓ వ్యక్తి మాట్లాడారు.ఇక.. ఇటీవల లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ముంబైలో ఎన్సీపీ( అజిత్ పవార్ వర్గం) నేత బాబా సిద్ధిఖీని హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ హత్యపై బిహార్‌లోని పూర్నియా నియోజకవర్గం ఎంపీ (స్వతంత్ర) పప్పూ యాదవ్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు అనుమతి ఇస్తే.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కేవలం 24 గంటల్లో అంతం చేస్తానని సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి హెచ్చరికలు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. సోమవారం వచ్చిన బెదిరింపులపై పప్పూ యాదవ్ బిహార్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)కి ఫిర్యాదు చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.చదవండి: చొరబాట్లకు మమత సర్కారే కారణం: అమిత్‌షా -
ఆర్జేడీతో పొత్తు వద్దు.. మీరే గెలుస్తారు: కాంగ్రెస్‌కు సూచన
ఢిల్లీ: ఏడు రాష్ట్రాల్లో జరిగిన 13 అసెంబ్లీ ఉప ఎన్నికల స్థానాల్లో ఇండియా కూటమి 10 స్థానాల్లో విజయం సాధించింది. ఎన్డీయే కూటమి రెండు చోట్ల, స్వతంత్ర అభ్యర్థి ఒక సీటులో గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి నేత, స్వతంత్ర ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పూ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బిహార్‌లో ఆర్జేడీ పార్టీ ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీగా ఉండటంపై కాంగ్రెస్ పార్టీ పునరాలోచించాలని కోరారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.‘‘అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఫలితాలు ఇండియా కూటమికి అనుకూలంగా వచ్చాయి. వచ్చే జార్ఖండ్, మహారాష్ట్ర, హార్యానా ఎన్నికల్లో కూడా ఇదే విధమైన ఫలితాలను ఇండియా కూటమి సొంతం చేసుకుంటుంది. అయితే బిహార్‌లో ప్రజలంతా.. జేడి(యూ) , ఆర్జేడీపై చాలా కొపంతో ఉన్నారు. దీంతో రాష్ట్రం రాజకీయంలో కొత్త పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాలి. ఆర్జేడీతో కూటమిపై కాంగ్రెస్ పునరాలోచించాలి. నేను, కాంగ్రెస్ పార్టీ కలిసి బిహార్‌లో కొత్త కూటమిల ఏర్పాటు చేస్తాం’’ అని పప్పూ యాదవ్ అన్నారు.పప్పూ యాదవ్ లోక్‌సభ ఎన్నికలకు ముందు తన జన్ అధికార్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి.. పూర్ణియీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఆర్జేడీ అభ్యర్థి బీమా భారతిపై విజయం సాధించారు. -
రూ. కోటి డిమాండ్ చేసిన ఎంపీపై కేసు నమోదు
బీహార్‌లోని పూర్ణియా లోక్‌సభ స్థానం నుంచి ఇటీవలే ఎన్నికైన ఎంపీ కొత్త చిక్కుల్లో పడ్డాడు. ఎన్నిక అయ్యాడో లేదో.. బెదిరింపులకు, బలవంతపు వసూళ్లకు దిగినట్లు పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు.. ఇవే ఆరోపణలపై ఆయనపై పోలీసు కేసు కూడా నమోదైంది. వివరాలు ఇలా ఉన్నాయి... పూర్ణియా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు జూన్ నాలుగున వెలువడిన విషయం మనకు తెలిసిందే. అయితే అదే రోజున ఆ నియోజకవర్గ అభ్యర్థి, రాజేశ్ రంజన్ అలియాస్ పప్పూ యాదవ్ బలవంతపు వసూళ్లు మొదలుపెట్టాడు. స్థానిక ఫర్నీచర్ వ్యాపారి ఒకరిని తన ఇంటికి పిలిపించుకుని రూ.కోటి ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. డబ్బులివ్వకుంటే చంపేస్తానని కూడా పప్పూయాదవ్ ఆ ఫర్నీచర్ వ్యాపారిని బెదిరించినట్లు సమాచారం. వచ్చే ఐదేళ్లు ప్రశాంతంగా బతకాలంటే తనకు కోటి రూపాయలు ఇవ్వాల్సిందేనని పప్పూ యాదవ్ తనను బెదిరించారని ఆ వ్యాపారి తెలిపారు. అయితే ఆ వ్యాపారి పప్పూ యాదవ్ బెదిరింపులకు లొంగలేదు సరికదా.. ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో పోలీసులు జూన్ 10వ పూర్నియాలోని ముఫాసిల్ పోలీస్ స్టేషన్లో పప్పు యాదవ్‌తో పాటు అతని స్నేహితునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్ణియా ఎంపీ తనను గతంలోనూ డబ్బుల కోసం బెదిరించినట్లు ఆ వ్యాపారి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 2021 ఏప్రిల్ 2న పప్పూ యాదవ్ తన నుంచి రూ.10 లక్షల సొమ్ము డిమాండ్ చేశాడని, 2023లోనూ దుర్గాపూజ సందర్భంగా రూ.15 లక్షల నగదుతోపాటు రెండు సోఫా సెట్లు కావాలని కోరినట్లు ఆ వ్యాపారి తన ఫిర్యాదులో వివరించారు. కాగా ఈ వ్యవహారంపై ఎంపీ పప్పూ యాదవ్ నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి స్పందన లేదు. పప్పూ యాదవ్ ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పూర్నియా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, విజయం సాధించారు. ఆయనకు 5.67 లక్షలకు పైగా ఓట్లు రాగా, జేడీయూ అభ్యర్థికి 5.43 లక్షల ఓట్లు వచ్చాయి. -
నాకే ఎందుకిలా జరుగుతోంది.. ఏడ్చేసిన పప్పూ యాదవ్
పాట్నా: మాజీ ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్, కాంగ్రెస్‌లో కొనసాగుతున్నప్పటికీ బీహార్‌లోని పూర్నియా స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వేదికపై ఆయన తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. తనకు పదేపదే టికెట్ ఎందుకు దక్కడం లేదంటూ బోరున ఏడ్చేశారు.వేదికపై ఏడుస్తూనే ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్, తేజస్వి యాదవ్‌లపై పప్పూ యాదవ్ విరుచుకుపడ్డారు. పూర్నియాకు ప్రాతినిధ్యం వహించాలనే తన కోరికను వ్యక్తం చేసినప్పటికీ ఆర్జేడీ తమ అభ్యర్థిని బరిలో నిలిపిందన్నారు. తనలో ఏం లోపముందని పూర్ణియాను విడిచిపెట్టి మరో స్థానానికి వెళ్లమంటున్నారని ప్రశ్నించారు. 'నాలో ఏమి లోటు ఉంది? మధేపురా లేదా సుపాల్‌కి వెళ్లమని నాకు మళ్లీ మళ్లీ ఎందుకు చెబుతున్నారు? కాంగ్రెస్‌లో నా పార్టీ విలీనానికి ముందు కూడా లాలూ యాదవ్‌ను కలిశాను. పూర్ణియాను వదిలి ఎక్కడికీ వెళ్లలేనని చెప్పాను' అని యాదవ్ కన్నీళ్లతో చెప్పారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్‌తో పాటు తనపై నామినేషన్ వేస్తున్న తన ప్రత్యర్థి భీమా భారతిపై కూడా పప్పు యాదవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.चाहे जितना कर लो जुल्मों सितमपूर्णिया का जन जन है तैयारस्वाभिमान जीतेगा इस बार #पूर्णिया_मांगे_पप्पू_यादव #PappuYadav #प्रणाम_पूर्णिया pic.twitter.com/GBi0lLFGqI— Jan Adhikar Party (Loktantrik) Fan Club (@jap4bihar) April 4, 2024 -
నాకే ఎందుకిలా జరుగుతోంది.. ఏడ్చేసిన పప్పూ యాదవ్
పాట్నా: మాజీ ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్, కాంగ్రెస్‌లో కొనసాగుతున్నప్పటికీ బీహార్‌లోని పూర్నియా స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వేదికపై ఆయన తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. తనకు పదేపదే టికెట్ ఎందుకు దక్కడం లేదంటూ బోరున ఏడ్చేశారు. వేదికపై ఏడుస్తూనే ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్, తేజస్వి యాదవ్‌లపై పప్పూ యాదవ్ విరుచుకుపడ్డారు. పూర్నియాకు ప్రాతినిధ్యం వహించాలనే తన కోరికను వ్యక్తం చేసినప్పటికీ ఆర్జేడీ తమ అభ్యర్థిని బరిలో నిలిపిందన్నారు. తనలో ఏం లోపముందని పూర్ణియాను విడిచిపెట్టి మరో స్థానానికి వెళ్లమంటున్నారని ప్రశ్నించారు. 'నాలో ఏమి లోటు ఉంది? మధేపురా లేదా సుపాల్‌కి వెళ్లమని నాకు మళ్లీ మళ్లీ ఎందుకు చెబుతున్నారు? కాంగ్రెస్‌లో నా పార్టీ విలీనానికి ముందు కూడా లాలూ యాదవ్‌ను కలిశాను. పూర్ణియాను వదిలి ఎక్కడికీ వెళ్లలేనని చెప్పాను' అని యాదవ్ కన్నీళ్లతో చెప్పారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్‌తో పాటు తనపై నామినేషన్ వేస్తున్న తన ప్రత్యర్థి భీమా భారతిపై కూడా పప్పు యాదవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. चाहे जितना कर लो जुल्मों सितम पूर्णिया का जन जन है तैयार स्वाभिमान जीतेगा इस बार #पूर्णिया_मांगे_पप्पू_यादव #PappuYadav #प्रणाम_पूर्णिया pic.twitter.com/GBi0lLFGqI — Jan Adhikar Party (Loktantrik) Fan Club (@jap4bihar) April 4, 2024 -
పట్టు వదలని పప్పూ యాదవ్.. లాలూకు రిక్వెస్ట్!
పాట్నా: కాంగ్రెస్‌లో తన జన్ అధికార్ పార్టీ (జేఏపీ)ని విలీనం చేసిన మాజీ ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్.. పూర్నియా లోక్‌సభ సీటుపై పట్టు వదిలేలా కనిపించడం లేదు. నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని పట్టుదలతో ఉన్న ఆయన వైఖరి బిహార్‌లో మహాకూటమిపై ఒత్తిడి తెస్తోంది. రాష్ట్రీయ జనతాదళ్ ( ఆర్జేడీ ) , కాంగ్రెస్, వామపక్షాలతో సహా బిహార్‌లో విపక్షాల కూటమి మహాఘట్బంధన్ ఏర్పడింది. ఈ కూటమి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పూర్నియాతో సహా రాష్ట్రంలోని 40 లోక్‌సభ స్థానాల్లో 26 స్థానాలను తమ అతిపెద్ద మిత్రపక్షమైన ఆర్జేడీకి కేటాయిస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. కాంగ్రెస్ తొమ్మిది స్థానాల్లో, సీపీఐ (ఎంఎల్) 3 స్థానాల్లో, సీపీఐ, సీపీఎం ఒక్కో స్థానంలో పోటీ చేయనున్నాయి. ఏప్రిల్ 2న నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమైన పప్పు యాదవ్ తాజగా ఏప్రిల్ 4న నామినేషన్ దాఖలు చేయనున్నట్టు ప్రకటించారు. పూర్ణియాకు సంబంధించి తన నిర్ణయాన్ని పునరాలోచించి ఆ సీటును కాంగ్రెస్‌కు ఇవ్వాలని ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్‌ను పప్పు యాదవ్ కోరారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’(ట్విటర్)లో పోస్ట్‌లో పేర్కొన్నారు. -
వెనక్కి తగ్గిన పప్పూ యాదవ్
బిహార్‌లోని పూర్నియా లోక్‌సభ స్థానంపై కాంగ్రెస్ నేత పప్పూ యాదవ్ వెనక్కి తగ్గారు. ఇటీవలే కాంగ్రెస్‌లో తనపార్టీని విలీనం చేసిన మాజీ ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ పూర్నియా స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే ఆ స్థానం మిత్రపక్షమైన ఆర్జేడీకి దక్కింది. దీంతో రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తారన్న ఊహాగానాలను ఆయన తోసిపుచ్చారు. "రాహుల్ గాంధీని దేశానికి ప్రధానమంత్రిని చేయడానికి, బిహార్‌లో కాంగ్రెస్ పార్టీనీ పునరుజ్జీవింపజేయడానికి కట్టుబడి ఉన్నాను. ఐదేళ్లలో ఇక్కడి మొత్తం 40 లోక్‌సభ నియోజకవర్గాలలో కాంగ్రెస్ ఒక శక్తిగా ఎదుగుతుంది" అని పప్పు యాదవ్ విలేకరులతో అన్నారు. తన జన్ అధికార్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినప్పుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తనకు పూర్నియా టిక్కెట్టు హామీ ఇచ్చారని పేర్కొన్న పప్పు యాదవ్.. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారా అని అడిగగా ప్రతికూలంగా సమాధానం ఇచ్చారు. తన చేతుల్లో కాంగ్రెస్ జెండాను పట్టుకున్నానని, తన చివరి శ్వాస వరకు దానిని ఎప్పటికీ వదలనని, పూర్నియాలో కాంగ్రెస్‌ను బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. -
‘నేను సైన్స్ టాపర్‌ని.. కోవిడ్ వైరస్‌కే వణుకు పుట్టించాను’
ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసి కాంగ్రెస్ నేతగా మారిన బిహార్‌కు చెందిన పప్పు యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆయన కోవిడ్‌కి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘న్యూస్ 24’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పప్పు యాదవ్ మాట్లాడుతూ కోవిడ్ సమయంలో మహమ్మారికి అందరూ భయపడుతుంటే తాను మాత్రం ఆ వైరస్‌నే భయపెట్టానని పేర్కొన్నారు. ‘కోవిడ్ సమయంలో మాస్క్, చేతికి గ్లోవ్స్ ధరించని ఏకైక వ్యక్తని నేనే. నేను సైన్స్ టాపర్‌ని’ అన్నారాయన. బిహార్ నుంచి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న పప్పు యాదవ్ ప్రపంచ రాజకీయాలు, తత్వాలు, ఆర్థిక వ్యవస్థతో సహా తనకు అన్ని విషయాలు తెలుసునని పేర్కొన్నారు. పప్పు యాదవ్ 2015 బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ కూటమికి వ్యతిరేకంగా 2015లో జన్ అధికార్ పార్టీని స్థాపించారు. పప్పు యాదవ్‌ను బిహార్ బాహుబలిగా వ్యవహరిస్తారు. ఆయన ఇటీవలే తన జన్ అధికార్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి అధికారికంగా ఆ పార్టీలో చేరారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆయన బిహార్‌లోని పూర్నియా లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. -
‘చావనైనా చస్తాను కానీ.. ఆ స్థానాన్ని వీడను’
బిహార్‌లో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఎన్డీయే పరస్పర అంగీకారంతో సీట్లను పంచుకుంది. కానీ మహాకూటమిలో సీట్ల పంపకాల సమస్య మరింత జఠిలమయ్యేలా కనిపిస్తోంది. మొదట ఔరంగాబాద్ సీటు విషయంలో కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి వెల్లువెత్తగా ఇప్పుడు పూర్నియా లోక్‌సభ సీటు విషయంలోనూ అదే పరిస్థితి నెలకొంది. తాజగా బిహార్ మాజీ మంత్రి బీమా భారతి జేడీయూను వీడి ఆర్జేడీలో చేరారు. అయితే ఆమె పూర్నియా లోక్‌సభ స్థానం నుండి ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. దీంతో ఇప్పటికే ఆ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమైన కాంగ్రెస్ నాయకుడు పప్పు యాదవ్‌కు చిక్కు ఎదురైంది. ఎందుకంటే ఆర్జేడీ కాంగ్రెస్ నేతృత్వంలోని మహా కూటమిలో మిత్ర పక్షంగా ఉంది. పూర్నియా నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన పప్పు యాదవ్.. తాను ఈ లోకాన్ని అయినా విడిచిపెడతాను కానీ.. పూర్నియా లోక్‌సభ స్థానాన్ని మాత్రం వదిలి వెళ్లలేనని సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. #WATCH | On his tweet on Purnea, Congress leader Pappu Yadav says, "I merged with the trust and blessings of a family, and the ideology of a party. All these responsibilities now lie with the leadership of that party. I have been working in Kosi-Seemanchal for the past 2 years… pic.twitter.com/h0xT2qholN — ANI (@ANI) March 24, 2024 -
హస్తం గూటికి ‘బిహార్ బాహుబలి’.. కాంగ్రెస్‌లో ఆ పార్టీ విలీనం
బిహార్‌కు చెందిన జేఏపీ నాయకుడు పప్పు యాదవ్ హస్తం గూటికి చేరారు. తన జన్ అధికార్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి న్యూఢిల్లీలో అధికారికంగా పార్టీలో చేరారు. తన కుమారుడు సార్థక్ రంజన్, ఇతర పార్టీ నాయకులతో కలిసి, యాదవ్ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) ప్రధాన కార్యాలయంలో ప్రకటన చేశారు. పప్పు యాదవ్ ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌తో భేటీ అయిన తర్వాత విలీనంపై ఊహాగానాలు చెలరేగాయి. 2015 బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ కూటమికి వ్యతిరేకంగా పప్పు యాదవ్ 2015లో జన్ అధికార్ పార్టీని స్థాపించారు. పప్పు యాదవ్‌ను బిహార్ బాహుబలిగా వ్యవహరిస్తారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల ఆశీస్సులతోనే తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయశానని పప్పు యాదవ్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపించిన పప్పు యాదవ్ ఇప్పుడు దేశంలో రాహుల్ గాంధీని మించిన ప్రత్యామ్నాయం లేదన్నారు. లాలూ, కాంగ్రెస్‌తో కలిసి రానున్న ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తన జన్ అధికార్ పార్టీని ప్రారంభించడానికి ముందు, పప్పు యాదవ్ ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీ, లోక్ జనశక్తి పార్టీలో ఉన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కారణంగా ఆర్జేడీ నుంచి పప్పు యాదవ్ బహిష్కరణకు గురైన తర్వాత జన్ అధికార్ పార్టీ ప్రస్థానం ప్రారంభమైంది. -
‘అమిత్‌షా మీరు తలుచుకుంటే నిమిషం చాలు’
పాట్నా: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యపై సీబీఐ విచారణ చేపట్టాల్సిందిగా బిహార్ జన్ అధికార్ పార్టీ అధ్యక్షుడు పప్పు యాదవ్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖను కోరిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి హోం మంత్రిత్వ శాఖ ఆయనకు సమాధానం ఇచ్చింది. హోం మంత్రిత్వ శాఖ రిప్లైని పప్పు యాదవ్ తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు. ఈ లేఖ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్‌కు సరిపోతుంది. మేం దీనిని ఆ శాఖకు పంపిస్తున్నాం అని సమాధానం ఇచ్చారు. దీనిపై పప్పు యాదవ్ స్పందిస్తూ, అమిత్‌షా మీరు అనుకుంటే ఈ కేసులో ఒక్క నిమిషంలో సీబీఐ విచారణ మొదలవుతుంది. దయచేసి దీనిని పక్కన పెట్టొద్దు అని పేర్కొన్నారు. చదవండి: ఎందుకీ ఆత్మహత్యలు ఇక పప్పు యాదవ్‌తో పాటు నటుడు శేఖర్ సుమన్ కూడా సుశాంత్ ఆత్మహత్య విషయంలో పోరాటం మొదలు పెట్టాడు. అయితే ఆయన ఈ విషయంలో వెనక్కు తగ్గినట్టు తెలుస్తోంది. సుశాంత్ కుటుంబం నుంచి ఎటువంటి ప్రోత్సాహం లేకపోవడంతో వెనక్కు తగ్గతున్నట్లు ఆయన ప్రకటించారు. వాళ్ల అభిప్రాయాలకు మనందరం గౌరవమివ్వాలి అని ఆయన కోరారు. చదవండి: ‘సుశాంత్ కోసం తన జీవితాన్నే ఇచ్చేసింది’ ఇక సుశాంత్ చిన్నతనంలో గడిపిన పాట్నాలోని రాజీవ్‌నగర్‌లో ఉన్న ఇంటిని మెమొరియల్‌గా మార్చనున్నట్లు అతని కుటుంబం తెలిపింది. ఇందులో ఆయన అభిమానుల కోసం సుశాంత్ దగ్గర ఉన్న బుక్స్, ఆయన వాడిన టెలిస్కోప్ ఇంకా ఇతర వస్తువులు అందుబాటులో ఉంచనున్నారు. అదేవిధంగా ఆయన సోషల్‌మీడియా అకౌంట్లను కూడా కొనసాగిస్తామని ఆయన కుటుంబం తెలిపింది. జూన్ 14 వ తేదీన సుశాంత్ బాంద్రాలోని తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. చదవండి: ‘సుశాంత్‌తో నేను మాట్లాడితే అలా జరిగేది కాదేమో’ -
సుశాంత్ మృతిపై అనుమానం: సీబీఐ విచారణ
పట్నా : బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యపై మాజీ ఎంపీ, జన్ అధికార్ పార్టీ (జేఏపీ) చీఫ్ పప్పు యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనది ఆత్మహత్య కాదని, హత్య అని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై సీబీఐ విచారణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం సుశాంత్ కుటుంబ సభ్యులతో భేటీ అయిన పప్పు యాదవ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు మృతిపై కుటుంబ సభ్యులు కూడా సీబీఐ విచారణకు పట్టుపడుతున్నారని తెలిపారు. ఆయన మరణంతో కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచుసుకుందని, హత్యా..? ఆత్మహత్యా? అనేది తేలాల్సిందని పేర్కొన్నారు. (సుశాంత్‌సింగ్ ఆత్మహత్య) ఇక సుశాంత్ రాజ్‌పూత్ మృతిపై బిహార్‌లోని ఆయన నివాసప్రాంతంలో ఉండే సన్నిహతులు సైతం పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకునేంత పరికివాడు కాదని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సుశాంత్ మృతిలో ఎవరికీ తెలియని కుట్రదాగి ఉందని సందేహించారు. కాగా ముంబైలోని బాంద్రాలో తన నివాసంలో ఆదివారం సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆయన మృతిపై యావత్ సినీ, క్రీడాలోకం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మరోవైపు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఆయన మృతదేహానికి నిర్వహించిన పోస్ట్‌మార్టం రిపోర్టును బట్టి విచారణలో ముందుకు వెళ్తామని చెబుతున్నారు. (తొందరగా వెళ్లిపోయావ్ మిత్రమా!) -
ప్రత్యేక హోదాపై నోటీసులిచ్చిన ‘పప్పు’
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం పోరాటం ఉధృతంగా జరుగుతున్న నేపథ్యంలో బిహార్ ఎంపీ పప్పు యాదవ్ ఈ అంశాన్ని మరోసారి తెరమీదకు తెచ్చారు. బిహార్‌కు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. బిహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు లోక్‌సభలో అత్యవసర చర్చ జరపాలని కోరుతూ జన్ అధికార్ పార్టీ(జేఏపీ) అధ్యక్షుడైన పప్పు యాదవ్ బుధవారం లోక్‌సభ సెకట్రరీ జనరల్‌కు నోటీసు ఇచ్చారు. తమ రాష్ట్రాభివృద్ధికి కేంద్ర తగిన నిధులు ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. బీజేపీయేతర రాష్ట్రాలను ఎన్డీఏ సర్కారు నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. కేంద్రంపై వైఎస్సార్సీపీ, టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకుండా గత నాలుగు రోజులు పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడుతున్నాయి. వాయిదా పడుతున్న సభ సక్రమంగా జరిగితే ఈ అంశం కూడా చర్చకు రావచ్చు. దేశంలోనే వెనుక బడ్డ రాష్ట్రం బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని జేఏపీ చాలా కాలంగా పోరాటం చేస్తోంది. బిహార్ ప్రత్యేక హోదా అంశం కూడా తెరపైకి రావడంతో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయంపై ఎలా స్పందిస్తారో చూడాలి. అయితే బిహార్‌కి ప్రత్యేక హోదా విషయమై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా స్పందించారు. సోమవారం ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తూ.. బిహార్ రాష్ట్రనికి ప్రత్యేక హోదా విషయాన్ని ఒక్క నిమిషం కూడా మర్చిపోలేదని, ప్రత్యేక హోదా అనే అంశాన్ని 13 ఏళ్ల క్రితమే తాను ప్రస్తావించానని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో చర్చలు జరుపుతానని తెలిపారు. -
ఒక్క మ్యాచ్ ఆడకుండానే టీ20లో స్థానం
ఓ పార్లమెంట్ సభ్యుడి కుమారుడు ఢిల్లీ టీ20 జట్టులో స్థానం సంపాదించాడు. ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఎలా సాధ్యం అంటే.. అది అంతే. వివరాల్లోకి వెళ్తే మాదేపురా ఎంపీ రాజేష్ రంజన్ (పప్పుయాదవ్) కుమారుడు సర్థాక్ రంజన్ గత ఏడాది ఒక్క మ్యాచ్ ఆడకుండానే ఢిల్లీ టీ20 జట్టుకు ఎంపికయ్యాడు . అతుల్ వాసన్, హరి గిద్వానీ, జూనియర్ రాబిన్ సింగ్‌లతో కూడిన సెలక్షన్ కమిటీ గత ఏడాది నుంచి నిలకడగా రాణిస్తున్న ఇతర ఆటగాళ్లను పక్కన పెట్టీ మరీ సర్థాక్ను టీ20 జట్టుకు ఎంపిక చేసింది. గతంలో కూడా సర్థాక్ ఎంపిక వివాదాస్పదమైంది. మూడు మ్యాచ్‌ల్లో కలిపి కేవలం 10 పరుగులు చేశాడు. ముస్తాక్ అలీ ట్రోఫీ సమయంలోను ఇదే విధంగా ఎంపిక చేశారు. ఆ తరువాత రంజీ ట్రోఫీ ప్రాబుల్స్లో స్థానం లభించినా సర్థాక్ రంజన్ మాత్రం స్వతంత్రంగానే ఆ రంజీ ట్రోఫీ నుంచి తప్పుకున్నాడు. క్రికెట్‌పై ఆసక్తి తగ్గిపోతోందంటూ బాడీ బిల్డింగ్ వైపు దృష్టి సారించాడు. అయితే ఆశ్చర్యకరంగా సార్థక్ తల్లి రంజీత్ రాజన్ తన కుమారుడు ఇప్పుడు క్రికెట్ ఆడటానికి ఫిట్‌గా ఉన్నాడంటూ ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోషియేషన్‌కు ఈమెయిల్ రాశారు. దీంతో గత సీజన్ సీకే నాయుడు ట్రోఫీలో 91.58 స్టైక్ రేట్‌తో 468పరుగులు చేసిన హిటెన్ దళాల్ అనే ఆటగాడిని పక్కన పెట్టిమరీ సార్థక్ రంజన్‌ను జట్టులోకి తీసుకున్నారు. సీకే నాయుడు ట్రోపీలో దళాల్ ఒక సెంచరీ, మూడు అర్ధ సెంచరీలతో 468 పరుగులు చేశాడు. సగటు 52 కాగా, స్టైక్ రేటు 91.58 గా ఉంది. -
కావాలంటే నాయకులను చంపేయండి: ఎంపీ
ఆయన స్వయానా ఎంపీ. నిన్న మొన్నటివరకు జైల్లో ఉండి, ఈ మధ్యే బయటకు వచ్చారు. కానీ ఇప్పుడు ఓ సరికొత్త వివాదానికి తావిచ్చారు. జన అధికార్ పార్టీ ఎంపీ అయిన రాజేశ్ రంజన్ అలియాస్ పప్పూ యాదవ్ దేశవ్యాప్తంగా చాలా ఫేమస్. మావోయిస్టులు కావాలంటే రాజకీయ నాయకులను చంపేయొచ్చు గానీ, భద్రతా దళాల సిబ్బందిని ఏమీ చేయొద్దని కోరారు. నాయకులు దేశాన్ని దోచేసుకుంటున్నారని, భద్రతా దళాలు దేశానికి రక్షణ కల్పిస్తున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. అందువల్ల మావోయిస్టులు ముందుగా నాయకులను చంపేయాలని కోరారు. గతంలో రాష్ట్రీయ జనతాదళ్ పార్టీలో ఉండి.. తర్వాత బహిష్కరణకు గురైన ఆయన తాజాగా హాజీపూర్ పట్టణంలో మాట్లాడుతూ ఇలా వ్యాఖ్యానించారు. పెద్దనోట్ల రద్దు తర్వాత దేశంలో తీవ్రవాదం కూడా తగ్గిపోతుందని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారని, కానీ నోట్ల రద్దు జరిగి ఇన్నాళ్లయిన తర్వాత కూడా ఎందుకు మావోయిస్టుల దాడులు కొనసాగుతున్నాయని పప్పు యాదవ్ ప్రశ్నించారు. ఇంతకుముందు కూడా పప్పూ యాదవ్ తీవ్రస్థాయిలోనే వ్యాఖ్యలు చేశారు. అవినీతిపరులైన రాజకీయ నాయకులు, అధికారులను ఎవరైనా కొట్టిచంపితే వారికి రూ. 10 లక్షలు నజరానాగా ఇస్తానని గతంలో ప్రకటించారు. అవినీతిపరులకు వ్యతిరేకంగా స్టింగ్ ఆపరేషన్లు చేసినా, ఆధారాలు సంపాదించినా వారికి రూ. 25వేలు నజరానాగా ఇస్తానని చెప్పారు. అవినీతిపరుల్ని ప్రభుత్వం అణచివేయకపోతే దళితులు, సమాజంలోని అట్టడుగు వర్గాలవారికి తుపాకులు ఇవ్వాల్సి వస్తుందని గతంలో హెచ్చరించారు. -
జైలు నుంచి బయటకొచ్చిన పప్పు యాదవ్
పట్నా: బీజేడీ బహిష్కృత నేత జనాధికార్ పార్టీ వ్యవస్థాపకుడు రాజేశ్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ జైలు నుంచి విడుదలయ్యాడు. 25 రోజులపాటు బియుర్ జైలులో గడిపిన ఆయన పట్నా హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో శుక్రవారం విడుదలయ్యాడు. ఈ సందర్భంగా జైలు వెలుపల ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మిఠాయిలు పంచుకున్నారు. మాదేపురా నుంచి ఎంపీగా పనిచేస్తున్న పప్పును శాంతిభద్రతలకు భంగంకలిగించాడనే కేసులో పోలీసులు మార్చి 27న అరెస్టు చేశారు. ప్రస్తుతం విడుదలైన నేపథ్యంలో నేరుగా మోతిహారి వెళ్లి అక్కడ షుగర్ మిల్లులో పనిచేస్తూ ఏరియర్స్‌కోసం ఆందోళన చేసి నిరసనగా ఆత్మహత్యకు పాల్పడిన ఇద్దరు ప్రైవేటు యూనియన్ నాయకుల కుటుంబాలను కలవనున్నారట. తన పార్టీ తరుపున ఆ రెండు కుటుంబాలకు చెరో రూ.50వేలు ఆర్థిక సహాయం చేయనున్నట్లు తెలిపాడు. రెండు కుటుంబాలు ఆగమై పోయినా కనీసం ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పట్టించుకోలేదని మండిపడ్డారు. అందుకే తాను వారి కుటుంబాలకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. పప్పుయాదవ్ అరెస్టు, చేతికి బేడీలు ఉంచే కోర్టుకు తీసుకెళ్లడంపై ఆయన భార్య కాంగ్రెస్ ఎంపీ రంజీత్ రంజన్ లోక్‌సభలో లేవనెత్తారు. -
హిందూ సన్యాసులందరూ జాతి వ్యతిరేకులే
పట్నా: విదాస్పద బిహార్ నేత, మధేపురా ఎంపీ రాజేశ్ రంజన్ అలియాస్ పప్పూ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతి రాజకీయ నాయకులు, అధికారులను ఎవరైనా కొట్టి చంపితే వారికి రూ. 10 లక్షలు నజరానా ఇస్తానని ప్రకటించిన ఆయన ఈ సారి తన మాటల యుద్ధాన్ని హిందు సాధువులు, సన్యాసులపై ఎక్కుపెట్టారు. హిందూ సన్యాసులందరూ జాతి వ్యతిరేకులే అంటూ వివాదాన్ని రగిలించారు. దీంతోపాటుగా జాతి వ్యతిరేక నినాదాలు చేయడం, జమ్ము కశ్మీర్ లో జాతీయ పతాకాన్ని తగుల బెట్టడం తప్పుకాదని వ్యాఖ్యానించి రాజేశ్ రంజన్ మరో వివాదానికి తెరలేపారు. బిహార్ లో సోమవారం మీడియాతో మాట్లాడిన పప్పూ హిందూ సన్యాసులు, సాధువులపై ధ్వజమెత్తారు. హిందూ సాధువులందరూ జాతి వ్యతిరేకులనీ, అందుకే పేదలు దేవాలయాలకు వెళ్లడం మానుకోవాలని పిలుపునిచ్చారు. వారి దోపిడీ దౌర్జన్యాల నుంచి కాపాడుకునేందుకు పేదలు గుళ్లకు వెళ్లకుండా వుండాలన్నారు. కాగా అయిదుసార్లు ఎంపీగా గెలిచిన పప్పూ యాదవ్ పై పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. అటు సౌపాల్ నియోజకవర్గం నుంచి ఆయన భార్య రంజీత్ రంజన్ కాంగ్రెస్ ఎంపీగా గెలుపొందారు. లాలూతో విభేదించిన రాజేశ్ రంజన్ ఆర్జేడీ నుంచి బయటకొచ్చి 2015 అసెంబ్లీ ఎన్నికల్లో మధేపురా ఎంపీగా ఎన్నికయ్యారు. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన పప్పూ యాదవ్ జన అధికార పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. -
'అవినీతిపరులను కొట్టిచంపితే.. పదిలక్షలిస్తా'
పట్నా: బిహార్ మాధేపూర్ ఎంపీ పప్పూ యాదవ్ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అవినీతి రాజకీయ నాయకులు, అధికారులను ఎవరైనా కొట్టిచంపితే వారికి రూ. 10 లక్షలు నజరానాగా ఇస్తానని ఆయన ప్రకటించారు. దర్భాంగాలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. అవినీతి పరులకు వ్యతిరేకంగా స్టింగ్ ఆపరేషన్లు చేసినా, ఆధారాలు సంపాదించినా వారికి రూ. 25వేలు నజరానాగా ఇస్తానని చెప్పారు. అవినీతిపరుల్ని ప్రభుత్వం అణచివేయకపోతే, దళితులు, సమాజంలోని అట్టడుగు వర్గాలవారికి తుపాకులు ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించారు. గతంలో ఆర్జేడీ నేత లాలూప్రసాద్ యాదవ్‌ను ఉద్దేశించి పప్పూ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బిహార్‌ను దోపిడి చేస్తున్న వారిని విషమిచ్చి లేదా ఉరితీసి చంపాలని అన్నారు. జెఎన్యూ వివాదం వంటి అంశాలు లాలూకు పట్టడం లేదని, ఆయన కేవలం ఓట్ల కోసమే రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. రోహిత్ వేముల ఆత్మహత్య అంశాన్ని ప్రస్తావిస్తూ.. అవినీతి అధికారులను పట్టపగలు కాల్చి చంపాలని డిమాండ్ చేశారు. -
డీజిల్ దొంగ అరెస్ట్
రోడ్లపై పార్క్ చేసి ఉన్న లారీలను లక్ష్యంగా చేసుకోని డీజిల్ దొంగతనాలకు పాల్పడుతున్న ఓ ముఠా గుట్టును మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు రట్టు చేశారు. ఎస్సై వెంకటేశం తెలిపిన వివరాల ప్రకారం మధ్యప్రదేశ్ ప్రాంతానికి చెందిన సలీమ్ ఖాన్(37), జాఖీర్ ఖాన్(35), పప్పు యాదవ్ (20), అనీఫ్ ఖాన్ (25), లతీఫ్ ఖాన్(30)లు నగరానికి వలస వచ్చి శాస్త్రీపురంలో ఉంటు నేరాల బాట పట్టారు. గత కొంత కాలంగా రోడ్లపై ఆగి ఉన్న లారీలలోంచి డిజిల్‌ను దొంగిలించి అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. కాగా వీరి దృష్టి కాటేదాన్ పారిశ్రామిక వాడకు వచ్చే లారీలపై పడింది. ఎవరికి అనుమానం రాకుండా స్కార్పియో వాహనంలో తిరుగుతూ గత కొంత కాలంగా రోడ్లపై పార్క్ చేసి ఉన్న లారీల నుంచి డిజిల్ దొంగిలిస్తున్నారు. నిత్యం ఈ కేసులు పోలీసుల దృష్టికి వస్తుండడంతో డిజిల్ చోరీలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. బుద్వేల్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఆగి ఉన్న ఓ లారీ నుంచి ముఠా సభ్యులు డిజిల్ చోరీ చేస్తుండగా పోలీసులు నిందితులను పట్టుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి 200 లీటర్ల డిజిల్‌తో పాటు ఏపీ 07 ఏబీ 8480 నెంబర్ గల స్కార్పియో వాహనాన్ని స్వాదీనం చేసుకోని సీజ్ చేశారు. -
'లాలూ నకిలీ యాదవ్.. నేనే ఒరిజినల్'
పట్నా: పప్పూ యాదవ్.. బిహార్ ఎన్నికలు అనగానే లాలాప్రసాద్ యాదవ్‌తోపాటు గుర్తొచ్చే మరో యాదవ్ సామాజిక వర్గం నాయకుడు ఈయన. పేరొందిన నేరచరితుడు. మధేపురా ప్రాంతానికి రాబిన్‌హుడ్. రాజకీయాల్లో బాహుబలిలా పేరొందిన ఆయన ప్రస్తుతం జన్ అధికార్ పార్టీ పేరుతో సొంత కుంపటి పెట్టుకొని బిహార్ ఎన్నికల్లో తలపడుతున్నారు. ఒకప్పుడు లాలూకు సన్నిహితుడైన పప్పూ ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ప్రధానంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. యాదవ్ సామాజిక వర్గంలో లాలూ తర్వాత అంతటి నాయకుడు అనిపించుకోవాలని తాపత్రయ పడుతున్నారు. మాధేపురా నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన ఆయన ప్రధానంగా ఐదో దశ ఎన్నికలు జరుగనున్న సీమాంచల్ ప్రాంతంపై దృష్టి పెట్టారు. ఇక్కడ యాదవ సామాజిక వర్గం ఎక్కువ. ఇక్కడ అత్యధిక సీట్లు కొల్లగొట్టాలని లాలూ నేతృత్వంలోని ఆర్జేడీ గట్టి ప్రయత్నాలు చేస్తున్నది. లాలూ ప్రయత్నాలకు గండి కొట్టేందుకు పప్పూ ప్రయత్నిస్తున్నారు. ఎయిర్‌బస్ 130 హెలికాప్టర్లో ఈ ప్రాంతంలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్న ఆయన ప్రధానంగా లాలూపైనే గురిపెడుతున్నారు. 'లాలూ నకిలీ యాదవ్. నేను అసలైన యాదవ్‌ను' అని చెప్తున్నారు. యాదవ్ సామాజిక వర్గంలో లాలూ ఓటుబ్యాంకును దెబ్బతీయడానికే బీజేపీ వ్యూహాత్మకంగా పప్పూ రంగంలోకి దింపినట్టు భావిస్తున్నారు. దీనిపై ఆయన స్పందిస్తూ "లాలూ తన చుట్టూ భజనపరులనే ఉంచుకుంటారు. ఒకప్పుడు ఆయనకు సన్నిహితంగా ఉన్న యాదవ్‌లను ఇప్పుడు పార్టీ నుంచి గెంటేశారు. యాదవ్‌లను ఆయన ఓటుబ్యాంకుగానే చూస్తున్నారు. కానీ యాదవ్ సామాజికవర్గం అభ్యున్నతి కృషి చేస్తున్నాను' అని చెప్తున్నారు. అదే సమయంలో ప్రధాని నరేంద్రమోదీపైనా ప్రశంసలు కురిపిస్తున్నారు. -
పప్పూ యాదవ్ పడిపోయారు!
పార్టీతో పనిలేదు.. క్యారెక్టర్ అంతకన్నా అవసరం లేదు.. చాంతాడంత కేసుల సంగతీ అక్కర్లేదు. కేవలం పాపులారిటీనే కొలమానంగా తీసుకుంటే ప్రముఖ నేతల జాబితాలో పప్పు యాదవ్ పేరు తప్పక ఉంటుంది. లాలూ ప్రసాద్ యాదవ్ సమీప బంధువుగా, ఆర్జేడీ కీలక నేతగా చాలాకాలంపాటు బిహార్ లో 'రాజ్ నీతి' లో ఆరితేరిన రాజేశ్ రంజన్ అలియాస్ పప్పూ యాదవ్ అత్యంత వివాదాస్పద నాయకుడని తెలిసిందే. లాలూకు దూరమైన తర్వాత సొంతగా జన్ అధికార్ పార్టీ (జేఏపీ)ని స్థాపించి, అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టారు. సోమవారం సీతామర్తీ జిల్లాలోని పరిహార్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న పప్పూ యాదవ్ వేదిక కూలి కిందపడిపోయారు. దీంతో ఆయన కాలికి స్వల్పగాయాలయ్యాయి. పలువురు నేతలు తీవ్రంగా గాయపడ్డారు. 'నారంగా గ్రామంలో ఏర్పాటుచేసిన ప్రచార సభా వేదికపై జనం ఎక్కువ కావడంతో ఒక్కసారిగా కూలిపోయింది. పప్పూ యాదవ్ కాలికి గాయమైంది. ప్రాథమిక చికిత్స అనంతరం కోలుకున్న ఆయన.. పక్కగ్రామంలో మరో సభలో పాల్గొన్నారు' అని పప్పూ వ్యక్తిగత సహాయకుడు తెలిపారు. ములాయం సింగ్ యాదవ్, శరద్ పవార్ లతో కలిసి మూడో ఫ్రంట్ ను ఏర్పాటుచేసిన పప్పూయాదవ్.. మహాకూటమి, ఎన్డీఏలను ఎదుర్కొంటున్నారు. అయితే, సమాజ్ వాదీ పార్టీ.. బీజేపీ అనుకూల వ్యాఖ్యలు చేస్తోందని పవార్ ధర్డ్ ఫ్రంట్ కు దూరమయ్యారు. సమాజ్ వాదీ పార్టీకి బిహార్ లో ఆదరణలేదు. దీంతో థర్డ్ ఫ్రంట్ కు.. ఫ్రెంటు, బ్యాకూ తానే అయి పోరాడుతున్నారు పప్పూ యాదవ్. -
వివాదంలో మరో ఎంపీ
న్యూఢిల్లీ: బీహార్‌కు చెందిన ఎంపి పప్పూ యాదవ్ విమాన సిబ్బందిని వేధించిన వివాదంలో ఇరుక్కున్నారు. పాట్నా నుండి ఢిల్లీకి బయలుదేరిన జెట్ ఎయిర్ వేస్‌లో ప్రయాణిస్తున్న సమయంలో ఆయన ఎయిర్ హోస్టెస్ పట్ల అనుచితంగా ప్రవర్తించాడన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. మిగిలిన ఆహార పదార్థాలను కింద వేయొద్దు అని ఎంపీని వారించినందుకు తనపై అన్యాయంగా విరుచుకు పడ్డారని, వేధించారని ఎయిర్ హోస్టెస్ ఆరోపించారు. దీనిని జెట్ ఇండియా వర్గాలు వర్గాలు ధృవీకరించాయి. విమానం ఢిల్లీలో దిగేముందు రక్షణ కావాలని కెప్టెన్ తమకు సమాచారం అందించారని తెలిపాయి. ఓ ప్రయాణీకుడు అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నాడని..సెక్యూరిటీ సాయం కావాలనే కోరడంతో అప్రమత్తమైనట్లు వెల్లడించాయి. అయితే ఈ వివాదంలో ఇంతవరకు ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదని సమాచారం. కాగా ఈ ఆరోపణలను ఎంపీ పప్పూ యాదవ్ ఖండించారు. ఇదంతా తనపై రాజకీయంగా జరుగుతున్న కుట్ర అన్నారు. కాగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో రాష్ట్రీయ జనతాదళ్ గత మే నెలలో పప్పూని పార్టీని తొలగించింది. -
ఆర్జేడీ నుంచి పప్పూ యాదవ్ బహిష్కరణ
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌తో ఆర్జేడీ చేతులు కలపడాన్ని వ్యతిరేకిస్తున్న ఆ పార్టీ ఎంపీ పప్పూ యాదవ్‌ను గురువారం పార్టీనుంచి బహిష్కరించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు పప్పూయాదవ్‌ను ఆరేళ్లపాటు బహిష్కరిస్తున్నట్లు ఆర్జేడీ ప్రధాన కార్యదర్శి రామ్‌దేవ్ భండారీ మీడియాకు తెలిపారు. జనతా పరివార్ పార్టీల విలీనం అంశంపై పప్పూ యాదవ్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌తో తీవ్రస్థాయిలో విభేదించారు. పప్పూ యాదవ్‌కు గత నెలలోనే షోకాజ్ నోటీసు జారీ చేశామని, ఆయన ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో కోర్ కమిటీలో చర్చించి బహిష్కరణ నిర్ణయం తీసుకున్నామని ఆర్జేడీ ఎంపీ జయ్‌ప్రకాశ్ వెల్లడించారు. -
డాక్టర్లు దెయ్యాలు
ఆర్జేడీ ఎంపీ పప్పుయాదవ్ వ్యాఖ్య పాట్నా: వైద్యులపై ఆర్జేడీ ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పూ యాదవ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైద్యుల్లో నిజాయితీగా పనిచేసే 10 నుంచి 15 శాతం మందిని మినహాయిస్తే... మిగిలిన వారందరినీ తలారులు, తాజా మాంసాన్ని తినే దెయ్యాలుగా పేర్కొన్నారు. వారు పూర్తిగా అవినీతిలో మునిగిపోయారని, దళారులుగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల పొట్టలను కోస్తూ డబ్బులు గడిస్తున్నారని మండిపడ్డారు. వారికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని అక్టోబర్ 13న సహస్ర నుంచి మొదలు పెడుతున్నట్లు ఆదివారమిక్కడ తెలిపారు. వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీహార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైద్యులు ప్రైవేటుగా వైద్యసేవలు అందించడాన్ని నిషేధించాలన్నారు.రోగుల సంక్షేమం కోసం నూతన నర్సింగ్ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. పప్పూ యాదవ్ వైద్యులకు వ్యతిరేకంగా మాట్లాడడం ఇదే మొదటిసారి కాదు. వైద్యుల అర్హతల ఆధారంగా వారి ఫీజును రూ.100 నుంచి రూ.300 మధ్య ప్రభుత్వమే నిర్ణయించాలని ఆయన గతంలో డిమాండ్ చేశారు. -
లోక్‌సభలో భార్యాభర్తల ప్రమాణ స్వీకారం
న్యూఢిల్లీ: లోక్‌సభ సభ్యుల ప్రమాణ స్వీకారం దాదాపుగా ముగిసింది. నిన్న ఒక్కరోజే 510 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. మిగిలిన సభ్యులు నేడు ప్రమాణం స్వీకారం చేశారు. రాజేష్ రాజన్ అలియాస్ పప్పు యాదవ్(ఆర్జేడీ), ఆయన భార్య రంజిత రాజన్(కాంగ్రెస్) నేడు పమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి చిత్తూరు ఎంపీ ఎన్. శివప్రసాద్, తెలంగాణ నుంచి జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్(టీఆర్ఎస్) ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం సాఫీగా సాగడానికి సహకరించిన ప్రొటెం స్పీకర్ కమల్ నాథన్, లోక్‌సభ సెక్రటరీ జనరల్ పి. శ్రీధరన్ కు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు ధన్యవాదాలు తెలిపారు.