'అవినీతిపరులను కొట్టిచంపితే.. పదిలక్షలిస్తా' | Pappu Yadav promises Rs 10 lakh to anyone who kills corrupt politicians, officers | Sakshi
Sakshi News home page

'అవినీతిపరులను కొట్టిచంపితే.. పదిలక్షలిస్తా'

Published Sun, Mar 6 2016 11:31 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

'అవినీతిపరులను కొట్టిచంపితే.. పదిలక్షలిస్తా' - Sakshi

'అవినీతిపరులను కొట్టిచంపితే.. పదిలక్షలిస్తా'

పట్నా: బిహార్‌ మాధేపూర్‌ ఎంపీ పప్పూ యాదవ్ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అవినీతి రాజకీయ నాయకులు, అధికారులను ఎవరైనా కొట్టిచంపితే వారికి రూ. 10 లక్షలు నజరానాగా ఇస్తానని ఆయన ప్రకటించారు. దర్భాంగాలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. అవినీతి పరులకు వ్యతిరేకంగా స్టింగ్ ఆపరేషన్లు చేసినా, ఆధారాలు సంపాదించినా వారికి రూ. 25వేలు నజరానాగా ఇస్తానని చెప్పారు. అవినీతిపరుల్ని ప్రభుత్వం అణచివేయకపోతే, దళితులు, సమాజంలోని అట్టడుగు వర్గాలవారికి తుపాకులు ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించారు.

గతంలో ఆర్జేడీ నేత లాలూప్రసాద్ యాదవ్‌ను ఉద్దేశించి పప్పూ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బిహార్‌ను దోపిడి చేస్తున్న వారిని విషమిచ్చి లేదా ఉరితీసి చంపాలని అన్నారు. జెఎన్‌యూ వివాదం వంటి అంశాలు లాలూకు పట్టడం లేదని, ఆయన కేవలం ఓట్ల కోసమే రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. రోహిత్ వేముల ఆత్మహత్య అంశాన్ని ప్రస్తావిస్తూ.. అవినీతి అధికారులను పట్టపగలు కాల్చి చంపాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement