సాక్షి,న్యూఢిల్లీ : ఐఆర్‌సీటీసీ స్కామ్ కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్, ఆయన భార్య రబ్రీ దేవి, కుమారుడు తేజస్వి యాద్ సహా ఇతర నిందితులకు ఢిల్లీ కోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది. ఓ ప్రైవేట్ సంస్థకు రెండు ఐఆర్‌సీటీసీ హోటళ్ల కాంట్రాక్టు కేటాయింపులో అక్రమాలు చోటుచేసుకున్న కేసులో ఆగస్టు 31న కోర్టు ఎదుట హాజరు కావాలని నిందితులను ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్ ఆదేశించారు.
కేసుకు సంబంధించి నిందితులపై తగిన సాక్ష్యాధారాలున్నాయని ఏప్రిల్ 16న చార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ పేర్కొంది. లాలూ కుటుంబ సభ్యులతో పాటు మాజీ కేంద్ర మంత్రి ప్రేమ్ చంద్ గుప్తా, ఆయన భార్య సరళా గుప్తా, బీకే అగర్వాల్, అప్పటి ఐఆర్‌సీటీసీ ఎండీ, డైరెక్టర్ రాకేష్ సక్సేనాల పేర్లు చార్జిషీట్‌లో పొందుపరిచారు. ఐఆర్‌సీటీసీ అప్పటి గ్రూప్ జనరల్ మేనేజర్లు వీకే ఆస్ధానా, ఆర్‌కే గోయల్, విజయ్ కొచ్చర్, వినయ్ కొచ్చర్, సుతాజా హోటల్స్ డైరెక్టర్లు, చాణక్య హోటల్ అధినేతల పేర్లు సైతం చార్జిషీట్‌లో నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment