Lalu Yadav
-
Bihar: ‘టైగర్ జిందా హై’.. రబ్రీ ఇంటి ముందు హోర్డింగ్ కలకలం
పట్నా: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్(RJD chief Lalu Yadav) మరోమారు ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. సుమారు నాలుగు గంటల పాటు ఈడీ అధికారులు ఆయనను విచారించారు. ఈ సమయంలో వందలాందిమంది ఆర్జేడీ నేతలు, కార్యకర్తలు ఈడీ కార్యాలయం ముందు లాలూ విచారణకు నిరసనగా ఆందోళన చేపట్టారు. #WATCH | Bihar | Posters in support of RJD chief and former Bihar CM Lalu Yadav put up outside his residence in Patna The posters read, "Na jhuka hun, na jhukunga, Tiger abhi Zinda hai." pic.twitter.com/r3I9WJICd9— ANI (@ANI) March 20, 2025ఇదిలావుంటే ఇప్పుడు ఒక హోర్డింగ్(Hoarding) కలకలం సృష్టిస్తోంది. ఇది ఈడీ అధికారులను ప్రశ్నించేదిగా ఉందని పలువురు అంటున్నారు. ఈ హోర్డింగ్‌ను లాలూ యాదవ్ భార్య రబ్రీదేవి ఇంటి ముందు ఏర్పాటు చేశారు. ఈ హోర్టింగ్పై ‘టైగర్ జిందా హై’(టైగర్ బతికేవుంది) అని రాసివుంది. అలాగే ‘నా ఝుకాహూ, నా ఝుకూంగా’ (తగ్గేదే లే) అని ఉంది. ఈ హోర్డింగ్‌లో ఒకవైపు లాలూ యాదవ్ ఫొటో ఉంది. మరోవైపు ఒక వ్యక్తి కాళ్లు, చేతులు కట్టేసి కొందరు లాగుతున్నట్లు ఫొటోవుంది. ఆ ఫొటోలో వ్యక్తి లాలూ అని, అతనిని దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీలతో పాటు పీఎంఓ, ఆర్ఎస్ఎస్లు తాళ్లతో లాగుతున్నాయని పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. లాలూ యాదవ్‌కు సంబంధించిన ఈ పోస్టర్‌ను ఆర్జేడీ నేతలు నిషాంత్ మండల్, రాజూ కోహ్లీ రూపొందించారు. ఈ హోర్డింగ్‌లో బీజేపీ దిగ్గజ నేతలను పోలిన చిత్రాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం లాలూ యాదవ్ ‘ల్యాండ్ ఫర్ జాబ్’ కేసులో ఈ విచారణను ఎదుర్కొంటున్నారు. ఇది కూడా చదవండి: రూ. 200కి మనుమడిని అమ్మేసిన నాన్నమ్మ -
లాలూ, రబ్రీ, తేజ్ ప్రతాప్‌లకు ఈడీ సమన్లు
పట్నా: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav)కు ఇప్పట్లో కష్టాలు తీరేలా కనిపించడంలేదు. లాలూ యాదవ్, అతని కుటుంబ సభ్యులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసి, విచారణకు పిలిచింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం భూమికి ప్రతిగా ఉద్యోగం కుంభకోణానికి సంబంధించిన కేసులో వారిని విచారించేందుకు ఈడీ సమన్లు జారీ చేసింది. వీరిని పట్నాలో విచారించనున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్‌తో పాటు అతని భార్య రబ్రీ దేవి(Rabri Devi), పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ లకు ఈడీ సమన్లు జారీ చేసింది. మార్చి 19న లాలూ యాదవ్‌ను విచారణకు పిలిచారు. ఈ విచారణ పట్నా జోనల్ కార్యాలయంలో జరగనుంది. ‘భూమికి ప్రతిగా ఉద్యోగం’ కుంభకోణంపై లాలూను విచారించనున్నారు. ఈ ఉదంతంలో మనీలాండరింగ్ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేసులో లాలూ యాదవ్, అతని కుటుంబ సభ్యులపై గత ఏడాది ఈడీ ఢిల్లీ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ చార్జిషీట్లో లాలూ యాదవ్ భార్య రబ్రీ దేవి, ఆయన కుమార్తెలు మిసా భారతి, హేమా యాదవ్‌లతో పాటు మరికొందరిని కూడా నిందితులుగా చేర్చారు.ఇది కూడా చదవండి: దర్గాలోకి బూట్లతో వచ్చిన విదేశీ విద్యార్థులపై దాడి -
ఈడీ ముందుకు లాలూ కొడుకు
పాట్నా: ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ముందు లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వి యాదవ్ హాజరయ్యారు. పాట్నాలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో ఈడీ కార్యాలయం ముందు ఆర్జేడీ కార్యకర్తలు భారీగా గుమిగూడారు. ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. లాలూ కొడుకు తేజస్వీ యాదవ్ ఇంట్లోనూ ఈడీ దాడులు జరిపింది. నిన్న లాలూని 9 గంటలపాటు ఈడీ అధికారులు ప్రశ్నించారు. ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో తమ ఆరోపణలు నిజమేనని స్పష్టం చేసింది. అక్రమంగా రైల్వే ఉద్యోగాలు ఇచ్చి లంచాలు తీసుకున్నట్లు ఈడీ అధికారులు ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి, లాలూ ప్రసాద్ భార్య రబ్రి దేవి గోశాలలో పనిచేసే వ్యక్తి పేరుపై మొదట రైల్వే ఉద్యోగుల నుంచి లంచాలు పుచ్చుకున్నారని ఈడీ దర్యాప్తులో తేలింది. అనంతరం ఆ ఆస్తుల్ని లాలూ కూతురు హేమా యాదవ్‌కు బదిలీ చేశారని వెల్లడైంది. ఏకే ఇన్ఫోసిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏబీ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ షెల్ కంపెనీలకు నిధుల్ని బదిలీ చేశారని ఈడీ అధికారులు గుర్తించారు. ఆయా కంపెనీల షేర్లు లాలూ కుటుంబ సభ్యులకు బదిలీ అయ్యాయని పేర్కొన్నారు. అమిత్ కత్యాల్ అనే వ్యక్తి లాలూ ప్రసాద్ యాదవ్ కోసం ఈ కంపెనీలను నిర్వహించాడని ఈడీ దర్యాప్తులో బయటపడింది. ఇదీ చదవండి: Jharkhand CM Hemant Soren: జార్ఖండ్ సీఎం ఎక్కడ? 18 గంటలుగా మాయం? -
సరదా సన్నివేశం.. రాహుల్‌కు మటన్ కర్రీ వండటం నేర్పిన లాలూ
పాట్నా: బిహార్‌లో ప్రసిద్ధి చెందిన 'చంపారన్ మటన్' ను ఏవిధంగా వండించాలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి లాలూ ప్రసాద్ యాదవ్ నేర్పించారు. లాలూ సూచనలు ఇస్తుండగా.. రాహుల్ మటన్ కర్రీని వండారు. ఈ వీడియోను రాహల్ తన ట్విట్టర్(ఎక్స్) లో షేర్ చేశారు. 'నాకు వంట చేయడం వచ్చు. కానీ పూర్తి నైపుణ్యం లేదు. యూరప్‌లో ఉండేప్పుడు ఒంటరిగా ఉండేవాన్ని. ఆ క్రమంలో వండటం నేర్చుకున్నాను. కొన్ని ప్రాథమిక వంటలు చేస్తాను.' అని రాహుల్ గాంధీ ట్విట్టర్ లో తెలుపుతూ.. నేడు లాలూ యాదవ్ నేతృత్వంలో మంచి వంటకాన్ని వండాను అని రాసుకొచ్చారు. మటన్ వండే క్రమంలో నేతలిద్దరు ముచ్చటించుకున్నారు. వంట వండటం ఎప్పుడు నేర్చుకున్నారని రాహుల్ అడిగిన ప్రశ్నకు లాలూ సమాధానమిచ్చారు. ' 7వ తరగతి చదివే క్రమంలో నేను అన్నయ్యల వద్దకు పాట్నా వెళ్లాను. అక్కడ వారు ఉద్యోగం చేసేవారు. అక్కడే వారికి వండిపెట్టేవాడిని. కట్టెలు ఎలా సమకూర్చుకోవాలి..? వంట పాత్రలు ఎలా శుభ్రపరుచుకోవాలి..? మసాలాలు ఎలా రుబ్బుకోవాలో? నేర్చుకున్నాను.' అని లాలూ చెప్పారు. ఏడు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో లాలూ.. రాహల్‌కు మటన్ ఎలా చేయాలో నేర్పించారు. మసాలాలతో సహా అన్ని రకాలను ఎలా కలపాలో చెప్పారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య రాజకీయాలపై ఆసక్తికర ప్రశ్నోత్తరాల చర్చ సాగింది. రాహుల్: రాజకీయాల్లో సీక్రెట్ మసాలాలు ఎంటి? లాలూ: కష్టపడి పనిచేయడమే, అన్నాయానికి వ్యతిరేకంగా పోరాడాలి. రాహుల్: మటన్ కర్రీని తయారు చేయడం.. రాజకీయాలు రెండింటి మధ్య తేడా ఏంటి? నాకు అన్ని కలపడం ఇష్టం.. లాలూ: అవును, కొంచమైనా కలపకుండా రాజకీయాలు చేయలేం. నాకూ రాజకీయం అంటే ఇష్టం. రాహుల్: మాలాంటి వచ్చే తరానికి మీరిచ్చే సలహా ఏంటీ? లాలూ: మీ పూర్వికులు ఈ దేశాన్ని కొత్త మార్గంలో నడిపించారు. ధర్మాన్ని కాపాడారు. మీరు దాన్ని మరిచిపోకూడదు. మటన్ కర్రీ తయారు చేసేప్పుడు బిహార్ డిప్యూటీ చీఫ్ తేజస్వీ యాదవ్, ఆయన సోదరి మిసా భారతి అక్కడే ఉన్నారు. వంట పూర్తి అయిన తర్వాత డైనింగ్ టేబుల్ వద్దకు అందరూ రావడాన్ని గమనించవచ్చు. ఆ తర్వాత రాహుల్ ఆ మటన్ కర్రీని తన సోదరి ప్రియాంకకు కూడా ప్యాక్ చేసుకుని తీసుకువెళ్లారు. ఇదీ చదవండి: సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి వివాదాస్పద వ్యాఖ్యలు.. -
Fodder Scam Case: దాణా స్కాంలో లాలూకు షాక్
పాట్నా: ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్‌కు దానా కుంభకోణం కేసులో ఎదురుదెబ్బ తగిలింది. లాలూకు జార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సవాలు చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు సీబీఐ దాఖలు చేసిన పిటీషన్‌ను సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వలోని ధర్మాసనం ఆగష్టు 25న విచారణ చేపట్టనుంది. లాలూ ప్రసాద్ యాదవ్ విభజన చెందని బిహార్‌కు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ ట్రెజరీ నుంచి దాదాపు 950 కోట్ల రూపాయలను అక్రమంగా బయటకు తీశారని సీబీఐ అభియోగాలు మోపింది. ఈ వ్యవహారంలో మొత్తం ఐదు కేసులు ఉండగా.. దుమ్కా, చైబాసా, డోరాండా, డియోగర్ ట్రెజరీలకు సంబంధించిన కేసుల్లో రాంచీలోని సీబీఐ కోర్టు దోషిగా తేల్చి మొత్తం 14 ఏళ్ల జైలు శిక్షను విధించింది. ఐదో కేసులో ఐదేళ్ల శిక్షను ఖరారు చేసి, రూ.60 లక్షల జరిమానా కూడా విధించింది. తాజాగా ఆయన ఆరోగ్యం బాగులేని కారణంగా జార్ఖండ్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనకు సింగపూర్‌లో చికిత్స పూర్తయింది. తన కూతురు ఓ కిడ్నీని దానం చేయగా.. లాలూ విజయవంతంగా అనారోగ్యం నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం ఇండియా కూటమి తరపున కూడ సమావేశాల్లో పాల్గొన్నారు. తాజా పరిణామంతో మరోసారి ఆయన కోర్టు మెట్లెక్కనున్న పరిస్థితి ఎదురైంది. ఇదీ చదవండి: అఫీషియల్ ప్రకటన: పరాభవం పాలైన చోటు నుంచే రాహుల్ గాంధీ పోటీ -
లాలూ ఫ్యామిలీకి ఈడీ షాక్.. రూ.6 కోట్ల విలువైన ఆస్తుల అటాచ్..
పాట్నా: ల్యాండ్ ఫర్ జాబ్ స్కాంలో బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు చిక్కెదురైంది. ఈ మేరకు లాలూ కుటుంబానికి సంబంధించిన రూ.6కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. 2004 నుంచి 2009 మధ్య లాలూ ప్రసాద్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు రైల్వే ఉద్యోగాల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఈ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి రబ్రీ దేవీని ఈడీ గత మేలోనే ప్రశ్నించింది. ఆమెతో పాటు వరుసగా బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, ఆర్జేడీ ఎంపీలు మిసా భారతి, చండ యాదవ్, రాగిని యాదవ్‌ల నుంచి కూడా సమాచారాన్ని ఈడీ రాబట్టింది. ఈ కేసులో గత జులైలోనే దాదాపు 18 మందిపై సీబీఐ ఛార్జ్‌షీటును దాఖలు చేసింది. 2004 నుంచి 2009 మధ్య రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు లాలూ ప్రసాద్ రైల్వేలో గ్రూప్ డీ ఉద్యోగాల్లో అక్రమాలకు పాల్పడ్డారనేది ప్రధాన ఆరోపణ. బిహార్‌కు చెందిన అభ్యర్థులకు ఉద్యోగాలను అక్రమంగా కేటాయించారని, బదులుగా ఉద్యోగం పొందిన అభ్యర్థులు తమ భూములను లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి రాసి ఇచ్చారనేది ఆరోపణ. దీనిపై కొన్నేళ్లుగా దర్యాప్తు నడుస్తోంది. ప్రస్తుతం ఈ కేసులో లాలూకు చెందిన రూ.6 కోట్ల ఆస్తులను అటాచ్ చేయడం గమనార్హం. ఇదీ చదవండి: జైపూర్ ఎక్స్‌ప్రెస్ ఘటన: చేతన్ షార్ట్ టెంపర్.. అందుకే ఈ ఘోరం! -
అనారోగ్యం నుంచి కోలుకున్న లాలూ.. బ్యాడ్మింటన్ ఆడుతూ..
ఢిల్లీ: ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ అనారోగ్యం నుంచి కోలుకున్నారు. నవ్వుతూ ఉత్సాహంగా బ్యాడ్మింటన్ ఆడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన కుమారుడు, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. తన తండ్రి దేనికి తలవంచరని పేర్కొన్నారు. ఈ మేరకు భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రశ్నించకుండా ఉండేందుకే తన తండ్రిపై కేంద్ర ప్రభుత్వం అవినీతి కేసులను మోపిందని ఆరోపించారు. 'ఆయనకు భయం అంటే ఎంటో తెలియదు. దేనికీ భయపడరు. ఆయన తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటారు. చివరికి తప్పక విజయం సాధిస్తారు' అని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. View this post on Instagram A post shared by Tejashwi Yadav (@tejashwipdyadav) పశుగ్రాసం కుంభకోణంలో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్ అనారోగ్య కారణాల వల్ల బెయిల్‌పై విడుదలయ్యారు. కిడ్నీ సంబంధింత వ్యాధితో బాధపడుతున్న ఆయన చికిత్స కోసం సింగపూర్ వెళ్లారు. ఆయన కుమార్తె ఒక కిడ్నీని దానం చేయగా చికిత్స పూర్తి అయింది. గతేడాది డిసెంబరులో శస్ర్త చికిత్స అనంతరం దిల్లీకి తిరిగి వచ్చారు. ఇదీ చదవండి: కేరళ గవర్నర్ కాన్వాయ్‌లోకి దూసుకొచ్చిన కారు.. -
కొత్త పార్లమెంట్ భవనంపై లాలు యాదవ్ పార్టీ వివాదాస్పద ట్వీట్
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం అట్టహాసంగా ప్రారంభించిన కొత్త పార్లమెంట్ భవనంపై పెను రాజకీయ దుమారం రేగుతోంది. ఇప్పటికే 19 ప్రతిపక్ష పార్టీలు బైకాట్ చేసిన సంగతి తెలిసిందే. ఐతే సరిగ్గా పార్లమెంట్ ప్రారంభోత్సవ వేళ.. బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత లాలు యాదవ్ పార్టీ రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) చేసిన ట్వీట్ పెను వివాదాని దారితీసింది. కొత్త పార్లమెంట్ భవనాన్ని శవపేటికతో పోలుస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది ఆర్జేడీ. ఈ భవనం శవపేటిక మాదిరిగా సమాధి చేసిన ప్రజాస్వామ్యానికి ప్రాతినిధ్యం వహిస్తుందని, దీన్ని దేశం అంగీకరించదంటూ ఆర్జేడీ పార్టీ బీజేపీని విమర్శిస్తూ ట్వీట్ చేసింది. వాస్తవానికి పార్లమెంట్ ప్రజాస్వామ్య దేవాలయం, చర్చల వేదిక కానీ దాన్ని బీజేపీ అవమానపర్చిలే ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేసిందని ట్విట్టర్ వేదికగా ఆరోపణలు చేసింది ఆర్జేడీ. దీంతో ఈ ట్వీట్‌పై స్పందించిన బీజేపీ నేత సుశీల్ మోదీ ఇలా పార్లమెంట్ కొత్త భవనాన్ని శవపేటికతో పోల్చిన వారిపై దేశ ద్రోహం కేసు పెట్టాలంటూ మండిపడ్డారు. మరో బీజేపీ నేత దుష్యంత్ గౌతమ్ ఇలాంటి వ్యాఖ్యలు చాలా దురదృష్టకరం అన్నారు. కొత్త పార్లమెంట్‌ని శవపేటికతో పోల్చారు, పాత భవనాన్ని జీరోతో పోల్చారా? ఎందుకంటే మనం అప్పుడూ జీరోలానే కూర్చొన్నాం కదా అని చురకలంటించారు. ఇదిలా ఉండగా బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సైతం కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని చరిత్రలో అవమానకరంగా లిఖించబుడుతుందని విమర్శించారు. కాగా, ఈ పరిణామాలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. ఆయా నాయకులెవరూ ఆ కొత్త పార్లమెంట్ భవనంలోకి అడుగు పెట్టకుండా రాజీనామే చేయడమే ఉత్తమమని గట్టి కౌంటరిచ్చింది. ये क्या है? pic.twitter.com/9NF9iSqh4L — Rashtriya Janata Dal (@RJDforIndia) May 28, 2023 (చదవండి: కొత్త పార్లమెంట్ భవనం కోసం షారూఖ్, అక్షయ్ కూమార్‌ల వాయిస్ ఓవర్) -
Disqualification: చట్టసభల సభ్యత్వం కోల్పోయిన నేతలు వీరే!
కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీపై లోకసభ ఎంపీగా అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యపై పరువు నష్టం కేసులో దోషిగా తేలడంతో రాహుల్‌కి రెండేళ్లు జైలు శిక్షపడింది. ఈ నేపథ్యంలో శుక్రవారం పార్లమెంట్లో ఆయన సభ్యత్వంపై వేటు పడింది. అయితే సూరత్ కోర్టు తాజా తీర్పుపై అభ్యర్థన పిటిషన్‌కు 30 రోజుల గడువు ఉంది. కాబట్టి అందుకు అనుగుణంగా మళ్లీ రాహుల్ అర్హత పొందే అవకాశాలు ఆధారపడి ఉంటాయి. ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 8(3) ప్రకారం.. పార్లమెంట్ సభ్యుడు ఎవరికైనా సరే.. ఏదైనా కేసులో రెండేళ్ల కనీస శిక్ష, ఆపై శిక్ష పడితే.. అనర్హత వేటు పడి పదవీ కోల్పోతారు. అలా జైలు శిక్షపడి రాహుల్ గాంధీలా చట్ట సభ సభ్యుత్వాన్ని కోల్పోయిన నేతలు అనేకమంది ఉన్నారు. ఇలా గతంలో తమ సభ్యుత్వాన్ని కోల్పోయిన ఎంపీలు, ఎమ్మెల్యేలను పరిశీలిస్తే.. లాలూ ప్రసాద్ యాదవ్: రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్జేడీ) అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ 2013లో కోట్లాది రూపాయల దాణా కుంభకోణంలో దోషిగా తేలడంతో లోక్ సభకు అనర్హుడయ్యాడు. ఐతే చట్టసభ సభ్యులను అనర్హత నుంచి రక్షించే నిబంధనను 2013లో సుప్రీంకోర్టు కొట్టివేసిన తర్వాత లోక్‌సభ నుంచి మొదటి అనర్హత అతనిది. ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నారు. జే జయలలిత: 2014లో, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలి పార్లమెంటు నుంచి అనర్హత వేటు పడిన మొదటి సీఎంగా నిలిచారు. ఈ కేసుకు సంబంధించి కోర్టు ఆమెకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధించింది. రషీద్ మసూద్: 2013లో, ఎంబీబీఎస్ సీట్ల కుంభకోణంలో నాలుగేళ్ల శిక్ష పడింది. దీంతో రాజ్యసభ సభ్యుడిగా అర్హత కోల్పోయారు. ఆజం ఖాన్: అక్టోబర్ 2022లో, 2019 ద్వేషపూరిత ప్రసంగం కేసుకు సంబంధించి సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు, రాంపూర్ మాజీ ఎమ్మెల్యే ఆజం ఖాన్‌కు యుపి కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది.ఆ తర్వాత ఆయన్నురాష్ట్ర అసెంబ్లీకి అనర్హుడిగా ప్రకటించి..ఎన్నికల సంఘం (ఈసీ) రాంపూర్ స్థానానికి ఉప ఎన్నికను ప్రకటించింది. అంతకుముందు ఎంపీగా ఉన్న ఆయన ఇటీవల ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అబ్దుల్లా ఆజం ఖాన్: ఫిబ్రవరి 2023లో, ఆజం ఖాన్ కుమారుడు రాంపూర్ జిల్లాలోని సువార్ అసెంబ్లీ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అబ్దుల్లా ఆజం ఖాన్ ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ నుంచి రెండవసారి అనర్హుడయ్యాడు, కోర్టు అతనికి రెండు రోజుల శిక్ష విధించిన తర్వాత మొరాదాబాద్‌లోని ఛజ్‌లెట్ ప్రాంతంలో రోడ్డుకు సంబంధించిన 15 ఏళ్ల నాటి కేసులో ఏడాది జైలు శిక్ష పడింది. అదీగాక అంతకుముందు వయసు సంబంధించిన సర్టిఫికేట్ ఫోర్జరీ కేసులో కూడా రాంపూర్ కోర్టు అతనికి జైలు శిక్ష విధించింది. దీంతో ఫిబ్రవరి 2020లో ఆయనపై మరోసారి అనర్హత వేటు పడింది. అనిల్ కుమార్ సాహ్ని: ఆర్జేడీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ సాహ్ని చీటింగ్ కేసులో మూడేళ్ల జైలు శిక్ష అనుభవించిన తర్వాత 2022 అక్టోబర్‌లో బీహార్ అసెంబ్లీ నుంచి అనర్హుడయ్యారు. ఆయన కుర్హానీ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. విక్రమ్ సింగ్ సైనీ: 2013 ముజఫర్‌నగర్ అల్లర్ల కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడిన తర్వాత బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సింగ్ సైనీ అక్టోబర్ 2022 నుంచి ఉత్తరప్రదేశ్ శాసనసభకు అనర్హుడయ్యారు. సైనీ ముజఫర్‌నగర్‌లోని ఖతౌలీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రదీప్ చౌదరి: కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ చౌదరిపై దాడి కేసులో మూడేళ్ల జైలు శిక్ష పడిన తర్వాత జనవరి 2021లో హర్యానా అసెంబ్లీ నుంచి అనర్హత వేటు పడింది. ఆయన కలక నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. కుల్దీప్ సింగ్ సెంగార్: అత్యాచారం కేసులో దోషిగా తేలిన కారణంగా కులదీప్ సింగ్ సెంగార్ ఫిబ్రవరి 2020లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి అనర్హుడయ్యారు. ఉన్నావ్‌లోని బంగార్మౌ నియోజకవర్గం నుంచి ఎన్నికైన సెంగార్‌ను గతంలో బీజేపీ బహిష్కరించింది. అనంత్ సింగ్: ఆర్జేడీ ఎమ్మెల్యే అనంత్ సింగ్ తన నివాసం నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్న కేసులో దోషిగా తేలడంతో జూలై 2022లో బీహార్ అసెంబ్లీ నుంచి అనర్హుత వేటు పడింది. సింగ్ పాట్నా జిల్లాలోని మొకామా నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇదిలా ఉండగా..వాస్తవానికి సుప్రీం కోర్టు లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేసులో ప్రజాప్రాతినిధ్య చట్టం (ఆర్పీ చట్టం)లోని సెక్షన్ 8(4)ని కొట్టివేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8(3) ప్రకారం దోషిగా తేలిన వ్యక్తి మూడు నెలల తర్వాత పార్లమెంట్ సభ్యుత్వం కోల్పోయి అనర్హత వేటు విధించడం జరుగుతుంది. అలాగే మూడు నెలల వ్యవధిలో సదరు వ్యక్తి శిక్షకు వ్యతిరేకంగా అప్పీలు దాఖలు చేసుకోవచ్చు. ఐతే ఆసక్తికరంగా 2013లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ప్రభుత్వం దోషులుగా ఉన్న చట్టసభ సభ్యులను సభ నుంచి తక్షణం అనర్హత వేటు పడకుండా కాపాడేందుకు ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. అప్పుడు రాహుల్ గాంధీనే తన సొంత పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పత్రికా సమావేశంలో ఆ ఆర్డినెన్స్‌ను చించివేయడం గమనార్హం. (చదవండి: బ్రిటీష్ పాలకుల కంటే బీజేపీ ప్రభుత్వమే ఎక్కువ ప్రమాదకరం: ఢిల్లీ సీఎం) -
లాలు యాదవ్‌కు ఊరట....అనుకూలంగా కోర్టు ఆదేశాలు
పట్నా: దాణా కుంభకోణానికి సంబంధించి ఐదు వేర్వేరు కేసుల్లో రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు, బిహార్ మాజీ సీఎం లాలు ప్రసాద్ యాదవ్ దోషిగా తేలిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు కొంత ఊరట లభించింది. లాలు సెప్టంబర్13న పాస్‌పోర్ట్ తిరిగి ఇవ్వాలని కోరతూ కోర్టుకి దరఖాస్తు పెట్టుకున్నారు. ఐతే సెంట్రల్ బ్యూర్ ఇన్వెస్టిగేషన్ ప్రత్యేక కోర్టు ఆయనకు అనుకూలంగా పాస్‌పోర్ట్ తిరిగి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడూ పాస్‌పోర్ట్ వెనక్కి తీసుకోవాలంటే యాదవ్ కోర్టులో అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుందని యాదవ్ తరుఫు న్యాయవాది ప్రభాత కుమార్ అన్నారు. ఇదిలా ఉండగా సింగపూర్ వైద్యుడు సెప్టెంబర్24న లాలు యాదవ్‌కు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఐతే ఆయన ఆ తేదికి ముందుగానే సింగపూర్ చేరుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఆయనకు త్వరితగతిన పాస్‌పోర్ట్‌ని తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. అంతేగాదు రెండు నెలల పాటు సింగపూర్‌లో ఉండేలా కూడా పాస్‌పోర్ట్ జారీ చేయాలని న్యాయవాది అభ్యర్థించారు. లాలు దరఖాస్తును విచారించిన కోర్టు...అతడికి పాస్‌పోర్టు జారీ చేయాలని ఆదేశించింది. వాస్తవానికి 1996 దాణా కుంభకోణం కేసులో 900 కోట్ల కుంభ కోణం జరిగిందని, దీనికి సంబందించి మొత్తం ఆరు కేసులు లాలుపై ఉన్నాయి. అందులో ఒక కేసులో లాలుకు 2013లో ఐదేళ్ల శిక్ష పడింది. దీంతో ఆయన ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై బయట ఉన్నారు. ఇదిలా ఉండగా లాలు దాణా కుంభకోణానిక సంబంధించి అన్ని కేసులను విచారించాలని లాలు కోర్టుకి విజ్క్షప్తి కూడా చేసుకున్నారు. కానీ సుప్రీం కోర్టు ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ప్రతికేసు విచారణను విడివిడిగా నిర్వహించాలని ఆదేశించింది. (చదవండి: మోదీకి ఇంతకు గొప్ప గిఫ్ట్ మరొకటి లేదు) -
లాలు యాదవ్ కుమార్తె ట్వీట్... బలపడనున్న 'గత బంధం'
పాట్నా: బిహార్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తిన సంగతి తెలిసిందే. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నిష్క్రమణతో బీజేపీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఈ మేరకు జేడీయూ బీజేపీతో తెగతెంపులు చేసుకోవడం తోపాటు మళ్లీ నితీష్ కుమార్ లాలు యాదవ్ భాగస్వామ్యం రానునుంది. అంతేకాదు నితీష్ కుమార్ మంగళవారం సాయంత్ర 4 గం.లకు గవర్నర్ ఫాగు చౌహాన్‌తో సమావేశం అవ్వాలని కోరినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. మరోవైపు నితీష్‌కి మద్దతుగా దాదాపు 160 మంది ఎమ్మెల్యేలు అధికార సంకీర్ణానికి విధేయత చూపుతామని ప్రమాణం చేశారు. పైగా మంగళవారం ఉదయమే నితీష్ తన అధికారికి నివాసంలో జేడీయే ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు కూడా. దీంతో నితీష్ తన సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో లాలు యాదవ్ కుమార్తె రోహిణి యాదవ్ ఆ మాటలకు బలం చేకూరుస్తూ ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టారు. ఈ మేరుకు ఆమె ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ... వెలుగులోకి రావలనుకున్నావారు త్వరపడండి, ఏకగ్రీవంగా సీఎంని ఎన్నుకునేందుకు సిద్దంగా ఉండండి అని ట్వీట్ చేశారు. పైగా నితీష్ లాలుల గత బంధ బలపడునుందని, ఈ మహా గతబంధన్ ఎమ్మెల్యేల ప్రత్యేక సమావేశానికి సంబంధించిన వీడియోను కూడా ట్విట్టర్లో పోస్ట్ చేసింది. వాస్తవానికి నితీష్ కుమార్ 2017లో బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు మహాకూటమి నుంచి వైదొలిగారు. బిహార్‌లో దాదాపు 243 మంది సభ్యుల అసెంబ్లీ ఉంది. ఐతే మొత్తం ఎమ్మెల్యేల్లో బిజేపీకి 77, జేడీయేకి 45 మంది సభ్యులు ఉండగా, ఆర్జేడీ సుమారు 127 మంది సభ్యులతో అతి పెద్ద పార్టీగా అవతరించింది. అదీగాక జేడీయూలో సీనియర్ నాయకుడు ఆర్సీపీ సింగ్ వైదొలగడం, అతనికి మాత్రమే మంత్రి పదవి ఇవ్వడం తదితర కారణాలే బిహార్‌లో రాజకీయ అస్థిరత ఏర్పడటానికి కారణం. తాను సీఎం అయినప్పటికీ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లేకపోవడంతో తీవ్ర అసంతృప్తకి లోనైన సీఎం నితీష్ కుమార్ తప్పుకునేందుకు రెడీ అయ్యారు. "राजतिलक की करो तैयारी आ रहे हैं , लालटेन धारी "✌️ pic.twitter.com/R0pYeaU2mN — Rohini Acharya (@RohiniAcharya2) August 9, 2022 (చదవండి: సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా? -
అవినీతి కేసులో లాలూకు సమన్లు
సాక్షి,న్యూఢిల్లీ : ఐఆర్సీటీసీ స్కామ్ కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్, ఆయన భార్య రబ్రీ దేవి, కుమారుడు తేజస్వి యాద్ సహా ఇతర నిందితులకు ఢిల్లీ కోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది. ఓ ప్రైవేట్ సంస్థకు రెండు ఐఆర్సీటీసీ హోటళ్ల కాంట్రాక్టు కేటాయింపులో అక్రమాలు చోటుచేసుకున్న కేసులో ఆగస్టు 31న కోర్టు ఎదుట హాజరు కావాలని నిందితులను ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్ ఆదేశించారు. కేసుకు సంబంధించి నిందితులపై తగిన సాక్ష్యాధారాలున్నాయని ఏప్రిల్ 16న చార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ పేర్కొంది. లాలూ కుటుంబ సభ్యులతో పాటు మాజీ కేంద్ర మంత్రి ప్రేమ్ చంద్ గుప్తా, ఆయన భార్య సరళా గుప్తా, బీకే అగర్వాల్, అప్పటి ఐఆర్సీటీసీ ఎండీ, డైరెక్టర్ రాకేష్ సక్సేనాల పేర్లు చార్జిషీట్లో పొందుపరిచారు. ఐఆర్సీటీసీ అప్పటి గ్రూప్ జనరల్ మేనేజర్లు వీకే ఆస్ధానా, ఆర్కే గోయల్, విజయ్ కొచ్చర్, వినయ్ కొచ్చర్, సుతాజా హోటల్స్ డైరెక్టర్లు, చాణక్య హోటల్ అధినేతల పేర్లు సైతం చార్జిషీట్లో నమోదయ్యాయి. -
బీజేపీకి తిప్పలు.. విపక్షాల మెప్పులు
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగలడంతో కమలనాథులు ఇరుకునపడ్డారు. ఇదే అదునుగా మిత్రపక్షాలు, విపక్షాలు కాషాయ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. బీజేపీ, నరేంద్ర మోదీ పనైపోయిందని ఎద్దేవా చేశాయి. మరోవైపు విపక్షాలు పరస్పరం ప్రశంసించుకున్నాయి. శివసేన విసుర్లు ఆదిత్యనాథ్ యోగి పాలనను ఉత్తరప్రదేశ్ ప్రజలు తిరస్కరించారని బీజేపీ మిత్రపక్షం శివసేన వ్యాఖ్యానించింది. బీజేపీ గొప్పలు చెప్పుకోవడం మానేయాలని, ఒక్క నరేంద్ర మోదీ చరిష్మాతోనే ఎన్నికల్లో గెలవలేరని హితవు పలికింది. రోజులు దగ్గరపడ్డాయి: కాంగ్రెస్ రైతులు, యువత, మహిళా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నాయకులు జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. దీనికి యూపీ, బిహార్ లోక్‌సభ ఉప ఎన్నికల ఫలితానే నిదర్శనమని పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. మమత అభినందనలు అఖిలేశ్‌యాదవ్, మాయావతికి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభినందనలు తెలిపారు. బీజేపీ పాలనకు చరమగీతం పాడేందుకు ముందడుగు పడిందని ఆమె ట్వీట్ చేశారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు కూడా మమత అభినందనలు తెలిపారు. బీఎస్పీకి థ్యాంక్స్ ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్, పూల్పూర్లో తమ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడంలో బహుజనసమాజ్వాదీ పార్టీ కార్యకర్తల పాత్ర ఎంతో ఉందని సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు రాంగోపాల్ యాదవ్ ప్రశంసించారు. బీఎస్పీ నాయకత్వానికి ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. -
'లాలూజీ.. మీరో విషయం అర్థం చేసుకోవాలి'
పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఓ నిరుద్యోగి(పరోక్షంగా పని పాట లేని వ్యక్తి) అని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. అందుకే మరో పనిలేక తనపై కట్టుకథలు అల్లుతూ దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. తనకు రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించడం తప్ప మరో పని గురించి ఆలోచించే తీరికే లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీలోని ఎమ్మెల్యేలను తన పార్టీలోకి లాగేసుకునే ప్రయత్నాల్లో నితీశ్ కుమార్ ఉన్నారంటూ ఆర్జేడీ అధినేత లాలూ చేసిన వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. 'లాలూజీ మీరో విషయం అర్థం చేసుకోవాలి. మీరు (మీడియా ప్రతినిధులు) కూడా ఓ విషయం తెలుసుకోవాలి. ఎప్పుడు కొంతమందిని తన జేబులో పెట్టుకోవడం లాలూకు అలవాటు. అలా ఉండటానికి కొంతమంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు నచ్చక బయటకు వెళుతున్నారు. దీంతో వారిని నైతికత లేనివారిగా అభివర్ణించడమే కాకుండా, మమ్మల్ని తప్పుబడుతున్నారు. కానీ, ఇందులో మా ప్రమేయం లేదు. బిహార్ అభివృద్ధికే మేం కట్టుబడి ఉన్నాం. ఆ విషయం అర్థం చేసుకుంటే మంచిది' అని నితీశ్ హితవు పలికారు. -
రగులుతున్న జ్వాల.. డిప్యూటీ సీఎం డుమ్మా!
పట్నా: బిహార్‌లోని మహాకూటమి సంకీర్ణ సర్కారులో అసమ్మతిజ్వాల ఎగిసిపడుతోంది. అధికార కూటమి మిత్రపక్షాలైన జేడీయూ, ఆర్జేడీ మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్జేడీ అధినేత లాలూ తనయుడు తేజస్వి డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయాల్సిందేనని సీఎం నితీశ్ కోరుతుండగా.. అందుకు లాలూ ససేమిరా అంటున్నారు. ఈ నేపథ్యంలో పట్నాలో సీఎం నితీశ్‌కుమార్ పాల్గొన్న అధికారిక కార్యక్రమంలో డిప్యూటీ సీఎం తేజస్వి పాల్గొనాల్సి ఉండగా.. ఆయన డుమ్మా కొట్టారు. నితీశ్‌తోపాటు తేజస్వి కూడా ఈ కార్యక్రమంలో వేదిక పంచుకోవాల్సి ఉంది. ఆయన రాకపోవడంతో ఆయన నేమ్‌ప్లేట్‌ను మొదట కనపడకుండా కవర్ చేసిన అధికారులు.. ఆ తర్వాత తొలగించారు. ఇక అవినీతి ఆరోపణలు, సీబీఐ కేసు నేపథ్యంలో లాలూ కుటుంబం తమ ఆస్తుల వివరాలు, ఆదాయమార్గాలను వెల్లడించాలని సీఎం నితీశ్ డిమాండ్ చేస్తున్నారు. శనివారం సాయంత్రంలోగా ఈ వివరాలు వెల్లడించాలని జేడీయూ డెడ్‌లైన్ విధించిన నేపథ్యంలో ఈ విషయంలో లాలూ కుటుంబంపై ఒత్తిడి పెరుగుతోంది. జేడీయూ డిమాండ్‌పై సాయంత్రంలోగా లాలూ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. -
సీఎం నితీశ్‌కు లాలూ షాక్!
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌కు మిత్రపక్ష నేత లాలూప్రసాద్ యాదవ్ షాక్ ఇచ్చారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న తన తనయుడు తేజస్వీ యాదవ్ నాలుగురోజుల్లోగా డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయలన్న నితీశ్ అల్టిమేటంను లాలూ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. ల్యాండ్ ఫర్ హోటల్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ నాలుగురోజుల్లో రాజీనామా చేయాలని సీఎం నితీశ్‌కుమార్ అల్టిమేటం ఇచ్చిన సంగతి తెలిసిందే. లాలూ, ఆయన కుటుంబసభ్యులు, అనుచరులపై సీబీఐ దాడులు నిర్వహించిన నేపథ్యంలో లాలూ తొలిసారి 'ఇండియా టుడే'కు ఇంటర్వ్యూ ఇచ్చారు. నితీశ్‌కుమార్ క్యాబినెట్ నుంచి డిప్యూటీ సీఎంగా తేజస్వి తప్పుకునే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. తనను, తన పార్టీ ఆర్జేడీని ఫినిష్ చేసేందుకే ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కుట్ర పన్నారని, అందులో భాగంగానే కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలు తమపై దాడులు చేస్తున్నాయని లాలూ ఆరోపించారు. ' హోటల్ ఒప్పందం కుదిరినప్పుడు తేజస్వి మైనర్. క్రికెట్ ప్లేయర్‌గా ఉన్నాడు. అతనిపై ఆరోపణలు ఆధారరహితం' అని లాలూ కొట్టిపారేశారు. -
రాష్ట్రపతి ఎన్నిక: నితీశ్‌కు లాలూ విజ్ఞప్తి!
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల కోసం తమ అభ్యర్థిగా దళిత మహిళ, మాజీ లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ను ప్రకటించిన ప్రతిపక్షాలు.. విపక్షాల ఐక్యత కోసం వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. విపక్షం గూటి నుంచి జారుకొని అధికార ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతు తెలిపిన బిహార్ సీఎం, జేడీయూ అధినేత నితీశ్‌కుమార్‌ను తిరిగి తమవైపు తిప్పుకునే దిశగా అడుగులు వేశాయి. ప్రతిపక్షాల అభ్యర్థి మీరాకుమార్‌కు మద్దతు తెలుపాల్సిందిగా నితీశ్‌ను విజ్ఞప్తి చేశాయి. 'మేం నితీశ్‌తో శుక్రవారం భేటీ అయి.. బిహార్ బిడ్డ అయిన మీరాకుమార్‌కు మద్దతు తెలుపాల్సిందిగా ఆయనకు విజ్ఞప్తి చేస్తాం' అని లాలూ రాష్ట్రపతి అభ్యర్థిపై ప్రతిపక్షాల భేటీ అనంతరం తెలిపారు. 'మేం నితీశ్‌తో భేటీలో చారిత్రక తప్పిదాన్ని చేయొద్దంటూ ఆయనకు విజ్ఞప్తి చేస్తాం. ఆయన నిర్ణయం తప్పు. పునరాలోచన చేయాల్సిందిగా ఆయనను కోరుతున్నాం. ఆయన ప్రతిపక్ష కూటమిని విచ్ఛిన్నం చేయకూడదు' అని లాలూ అన్నారు. నితీశ్ సంకీర్ణ ప్రభుత్వంలో లాలూ ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలుగా ఉన్న సంగతి తెలిసిందే. మిత్రపక్షాల షాక్ ఇస్తూ ఆయన బీజేపీ అభ్యర్థి కోవింద్‌కు మద్దతు పలుకడంతో లాలూ, నితీశ్ మధ్య మాటలు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో తిరిగి తమ గూటికే రావాల్సిందిగా లాలూ నితీశ్‌ను కోరుతున్నారు. -
సీబీఐ కోర్టు మెట్లెక్కిన లాలూ
పాట్నా: దాణా కుంభకోణం కేసుకు సంబంధించి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మంగళవారం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి హాజరయ్యారు. బిహార్ మరో మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా కూడా సీబీఐ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి దేవ్‌రాజ్ త్రిపాఠి కూడా కోర్టుకు వచ్చారు. దాణా పంపిణీకి సంబంధించి కోట్లలో కుంభకోణం జరిగినట్లు బయటపడటంతో 45మందిని నిందితులుగా చేర్చిన విషయం తెలిసిందే. ఇందులో పలువురు చనిపోగా.. ప్రస్తుతం 27మంది విచారణను ఎదుర్కొంటున్నారు. గతంలో జార్కండ్ కోర్టు లాలూ ప్రసాద్ యాదవ్‌పై నమోదైన కుట్రపూరిత ఆరోపణలన్నింటిని కొట్టి వేయగా.. ఇటీవల విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు లాలూ విచారణ ఎదుర్కోవాల్సిందేనని ఆదేశించిన విషయం తెలిసిందే. -
ఔను! ఆ ఆస్తులు మావే.. అంగీకరించిన లాలూ
పట్నా: బినామీల పేరిట ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం భారీగా ఆస్తులు పోగేసుకుంటున్నదంటూ బీజేపీ నేత సుశీల్‌కుమార్ మోదీ చేసిన ఆరోపణలపై తాజాగా లాలూ స్పందించారు. బిహార్‌లోనే అతిపెద్ద షాపింగ్ మాల్‌ను నిర్మిస్తున్న పట్నాలోని రెండు ఎకరాల భూమి తమ కుటుంబానిదేనని లాలూ అంగీకరించారు. అంతేకాకుండా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న షాపింగ్ మాల్లో కూడా తమకు 50శాతం వాటా ఉందని ఆయన కుండబద్దలు కొట్టారు. ‘మాల్ నిర్మాణంలో ఉన్న భూమి లారా ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పీకి చెందినది. ఈ కంపెనీలో రబ్రీదేవికి, తేజ్ ప్రతాప్‌కు, తేజస్వికి వాటాదారులు. మేమే మా భూమిని మెరిడియన్ కన్‌స్ట్రక్చన్ కంపెనీకి మాల్ నిర్మాణానికి ఇచ్చాం. మా కుటుంబానికి కొంత భూమి ఉన్నప్పుడు దానిని వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించుకోకూడదా? ఏం ’ అంటూ ఆయన ప్రశ్నించారు. నిర్మాణంలో ఉన్న మాల్లో 50శాతం వాటా తమదని, మిగతా 50శాతం బిల్డర్దని చెప్పుకొచ్చారు. 2005లో లాలూ రైల్వేమంత్రిగా ఉన్నప్పుడు రైల్వేశాఖకు చెందిన రెండు హోటళ్లను హర్ష్ కొచర్ అనే వ్యాపారవేత్తకు ఇచ్చారని, అందుకు ప్రతిఫలంగానే పట్నాలోని ఈ ఖరీదైన భూమిని ఆయనకు ముట్టజెప్పారని బీజేపీ ఆరోపించగా.. ఆ ఆరోపణల్ని లాలూ తోసిపుచ్చారు. -
నితీశ్ ఆహ్వానం.. బీజేపీలో చీలిక!
పట్నా: బిహార్ సీఎం నితీశ్‌కుమార్ తాజాగా ఇచ్చిన అధికారిక విందు.. బీజేపీలో పెద్ద చీలికనే తెచ్చింది. ఈ విందుకు కొందరు సీనియర్ నేతలు కొందరు హాజరుకాగా.. మరికొందరు డుమ్మా కొట్టారు. బీజేపీతో రెండు దశాబ్దాలకుపైగా ఉన్న అనుబంధాన్ని నితీశ్ తెగదెంపులు చేసుకున్న తర్వాత బీజేపీ నేతలు ఆయన ఇచ్చిన విందుకు హాజరుకావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. బిహార్ బీజేపీ ముఖ్యనేత అయిన సుశీల్‌కుమార్ మోదీతోపాటు పలువురు ఈ విందులో దర్శనమిచ్చారు. అయితే, బీజేపీ రాష్ట్ర అగ్రనేతలైన ప్రేమ్‌కుమార్, నందకిషోర్ యాదవ్ తదితరులు ఈ విందుకు దూరంగా ఉన్నారు. నితీశ్ ఆహ్వానం బీజేపీలో చీలిక తెచ్చిందన్న అంశం రాజకీయంగా చర్ఛనీయాంశం కాగా.. 'ఒక విందు కోసం పార్టీ విప్‌ను జారీచేయలేదు కదా. ఒక ఆహ్వాన్నాన్ని మన్నించాలా? వద్దా? అన్నది వ్యక్తిగత అభీష్టం' అని ఈ విషయాన్ని సుశీల్ మోదీ తోసిపుచ్చారు. అయితే, సోమవారం రాత్రి నితీశ్ ఇచ్చిన ఈ డిన్నర్ పార్టీకి ఆయన ప్రస్తుత మిత్రపక్షం లాలూప్రసాద్ యాదవ్ కూడా రాలేదు. అయినా, ప్రజాప్రతినిధి కాకపోవడంతో ఆహ్వానించలేదని తెలుస్తోంది. ఆయన తనయులు తేజస్వి, తేజ్ ప్రతాప్ సింగ్ మాత్రం హాజరయ్యారు. ఇటీవల బిహార్ రాజకీయ పరిణామాలు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. నితీశ్ తీరుపై లాలూ అసంతృప్తితో ఉన్నారని వినిపిస్తోంది. నితీశ్ సంకీర్ణ ప్రభుత్వంలో లాలూ కీలక భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే. తన అసంతృప్తినే చాటేందుకే నితీశ్ అధికారిక కార్యక్రమాలకు మంత్రులైన తన తనయులను దూరంగా ఉంచుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల నితీశ్ పాల్గొన్న పలు కార్యక్రమాలకు లాలూ తనయులు డుమ్మా కొట్టారు. మరోవైపు నితీశ్ మళ్లీ బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బిహార్ రాజకీయ పరిణామాలు ఆసక్తికర మలుపులు తిరుగుతాయా? అని పరిశీలకులు వేచిచూస్తున్నారు. -
వాళ్లు పిండి తింటారా, డేటా తింటారా?
న్యూఢిల్లీ: జియో 4జీ డేటా సర్వీసులకు సంబంధించి రిలయన్స్ ప్రకటనల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోను వాడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మిస్టర్ రిలయన్స్ అంటూ మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఈ వ్యవహారంపై తనదైన శైలిలో మోదీపై విరుచుకుపడ్డారు. 'పేదవాళ్లు ఏం తింటారు. డేటానా లేక గోధుమ పిండా?. డేటా చౌకగా లభిస్తుంటే, గోధుమ పిండి ధరలు మాత్రం ప్రియమయ్యాయి. దేశాన్ని మారుస్తున్నామనడానికి ఇదేనా మీరిచ్చే నిర్వచనం. కాల్ డ్రాప్ సమస్యను ఎవరు పరిష్కరిస్తారో మీరే చెప్పండి' అంటూ హిందీలో లాలూ ట్విట్ చేశారు. गरीब डाटा खायेगा या आटा? डाटा सस्ता,आटा मंहगा यही इनकी देश बदलने की परिभाषा है।लगे हाथ ये भी बता दो, काल ड्रॉप की समस्या कौन सुलझाएगा? — Lalu Prasad Yadav (@laluprasadrjd) 3 September 2016 -
బిహార్ సీఎంగా లాలూ కొడుకు!!
పాట్నా: అక్కడ రోడ్డుపై వందల సంఖ్యలో జనం ఆందోళన చేస్తున్నారు. ఇంతలో కుర్తాపైజామా ధరించిన ముఖ్యమంత్రి ఎస్యూవీ వాహనంలో అక్కడికి వచ్చారు. ఆందోళన చేస్తున్నవారి దగ్గరికి వెళ్లి సర్దిచెప్పారు. దోషులకు శిక్ష వేస్తామని హామీ కూడా ఇచ్చారు. ఆందోళనకారులు శాంతించారు. ఇలా బిహార్ సీఎంగా కనిపించి ఆందోళనకారులను శాంతింపజేసింది ఎవరో కాదు.. లాలూ ప్రసాద్ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్. ప్రస్తుతం బిహార్ ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న ఆయన ముఖ్యమంత్రి ఎప్పుడు అయ్యారని ఆశ్చర్యపోకండి. ఇదంతా సినిమా కోసమే. 'అపహరణ్ ఉద్యోగ్' (కిడ్నాప్ ఇండస్ట్రి) పేరిట రూపొందుతున్న ఓ సినిమాలో లాలూ తనయుడు తేజ్‌ప్రతాప్ బిహార్ ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్నారు. 1990లో బిహార్‌లో సంభవించిన కిడ్నాప్‌లు నేపథ్యంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. అప్పట్లో బిహార్ సీఎం లాలూ ఉన్నారు. అంధకారంలో ఉన్న బిహార్‌ను వెలుగులోకి తీసుకొచ్చే చక్కని కథతో రూపొందిన సినిమా కావడంతో తాను నటించానని, ఇందులో ఓ పాత్రలో లాలూ యాదవ్ కూడా కనిపిస్తారని షూటింగ్ అనంతరం తేజ్‌ప్రతాప్ తెలిపారు. తేజ్ తమ్ముడు తేజస్వి డిప్యూటీ సీఎంగా బిజీగా ఉండగా, ఆయన మాత్రం ఆరోగ్యశాఖను గాలికి వదిలేసి సినిమాలు, షూటింగ్‌లు అంటూ తిరుగుతున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. -
'అవినీతిపరులను కొట్టిచంపితే.. పదిలక్షలిస్తా'
పట్నా: బిహార్ మాధేపూర్ ఎంపీ పప్పూ యాదవ్ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అవినీతి రాజకీయ నాయకులు, అధికారులను ఎవరైనా కొట్టిచంపితే వారికి రూ. 10 లక్షలు నజరానాగా ఇస్తానని ఆయన ప్రకటించారు. దర్భాంగాలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. అవినీతి పరులకు వ్యతిరేకంగా స్టింగ్ ఆపరేషన్లు చేసినా, ఆధారాలు సంపాదించినా వారికి రూ. 25వేలు నజరానాగా ఇస్తానని చెప్పారు. అవినీతిపరుల్ని ప్రభుత్వం అణచివేయకపోతే, దళితులు, సమాజంలోని అట్టడుగు వర్గాలవారికి తుపాకులు ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించారు. గతంలో ఆర్జేడీ నేత లాలూప్రసాద్ యాదవ్‌ను ఉద్దేశించి పప్పూ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బిహార్‌ను దోపిడి చేస్తున్న వారిని విషమిచ్చి లేదా ఉరితీసి చంపాలని అన్నారు. జెఎన్యూ వివాదం వంటి అంశాలు లాలూకు పట్టడం లేదని, ఆయన కేవలం ఓట్ల కోసమే రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. రోహిత్ వేముల ఆత్మహత్య అంశాన్ని ప్రస్తావిస్తూ.. అవినీతి అధికారులను పట్టపగలు కాల్చి చంపాలని డిమాండ్ చేశారు. -
'మోదీ ప్రధానిగా మళ్లీ ప్రమాణం చేయాలి'
పట్నా: ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి పదవీ ప్రమాణం చేయాలంటూ ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ ఓ డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. బిహార్ మంత్రిగా లాలూ తనయుడు తేజ్‌ప్రతాప్ యాదవ్ ప్రమాణం చేస్తూ తడబడటంతో ఆయనను మరోసారి ప్రమాణం స్వీకరించాల్సిందిగా ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లాలూ గత ఏడాది మేలో ప్రధాని మోదీ ప్రమాణం చేసిన వీడియో లింకును ట్విట్టర్లో పోస్టు చేశారు. ప్రమాణంలో భాగంగా మోదీ భారత సార్వభౌమాధికారం, సమగ్రతను నిలబెడతానని చెప్పాల్సిండగా.. ఆయన హిందీలో 'అక్షున్' (నిలబెట్టడం)కు బదులు 'అక్షాన్' అన్నారని లాలూ తెలిపారు. 'ఆయన 'అక్షున్' అనలేదంటే.. ప్రమాణం అర్థం లేనిది అవుతుంది. కాబట్టి ప్రధాని మరోసారి ప్రమాణం చేయాల్సిందే. అక్షాన్ పదానికి హిందీలో ఎలాంటి అర్థం లేదు' అని ఆయన చెప్పారు. 'ప్రధాని అజెండా దేశాన్ని విడగొట్టడమే. అందుకే ఆయన దేశ సమగ్రతను నిలబెడతానని ప్రమాణం చేయలేదు' అని లాలూ విమర్శించారు. గత శుక్రవారం లాలూ కొడుకు తేజ్‌ప్రతాప్ ప్రమాణంలో 'ఆపేక్షిత్' (అంచనా) పదానికి బదులుగా 'ఉపేక్షిత్' (ఉపేక్షించడం) అనడంతో ఆయనను మరోసారి ప్రమాణం చేయాల్సిందిగా గవర్నర్ రామ్‌నాథ్ గోవింద్ సూచించారు. రెండోసారి ప్రమాణంలో కూడా తేజ్‌ప్రతాప్ తడబడ్డారు. లాలూ రెండు కొడుకు తేజస్వి బిహార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. -
లాలు తనయుడికి డిప్యూటీ సీఎం పదవి?
పట్నా: ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్‌కు బిహార్ ఉప ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయి. ఆర్జేడీ శాసనసభ పక్ష నాయకుడిగా తేజస్వి యాదవ్‌ను నియమించవచ్చని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శుక్రవారం బిహార్ ముఖమంత్రిగా జేడీయూ నేత నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నారు. నితీశ్ కేబినెట్లో లాలు కుమారులు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్‌లకు బెర్తులు దక్కనున్నట్టు సమాచారం. లాలు చిన్న కొడుకు తేజస్వికి డిప్యూటీ సీఎం పదవి దక్కే చాన్స్ ఉంది. లాలు ఈ విషయంపై నితీష్‌తో చర్చించినట్టు ఆర్జేడీ వర్గాలు వెల్లడించాయి. లాలు కొడుకులు తాజా ఎన్నికల్లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కాగా లాలు ఎన్నికల్లో పోటీ చేయలేదు. బిహార్ ఎన్నికల్లో మహాకూటమి పార్టీలు జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌లు ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆర్జేడీ 80, జేడీయూ 71, కాంగ్రెస్ 27 సీట్లు గెల్చుకున్నాయి. -
'లాలూ నకిలీ యాదవ్.. నేనే ఒరిజినల్'
పట్నా: పప్పూ యాదవ్.. బిహార్ ఎన్నికలు అనగానే లాలాప్రసాద్ యాదవ్‌తోపాటు గుర్తొచ్చే మరో యాదవ్ సామాజిక వర్గం నాయకుడు ఈయన. పేరొందిన నేరచరితుడు. మధేపురా ప్రాంతానికి రాబిన్‌హుడ్. రాజకీయాల్లో బాహుబలిలా పేరొందిన ఆయన ప్రస్తుతం జన్ అధికార్ పార్టీ పేరుతో సొంత కుంపటి పెట్టుకొని బిహార్ ఎన్నికల్లో తలపడుతున్నారు. ఒకప్పుడు లాలూకు సన్నిహితుడైన పప్పూ ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ప్రధానంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. యాదవ్ సామాజిక వర్గంలో లాలూ తర్వాత అంతటి నాయకుడు అనిపించుకోవాలని తాపత్రయ పడుతున్నారు. మాధేపురా నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన ఆయన ప్రధానంగా ఐదో దశ ఎన్నికలు జరుగనున్న సీమాంచల్ ప్రాంతంపై దృష్టి పెట్టారు. ఇక్కడ యాదవ సామాజిక వర్గం ఎక్కువ. ఇక్కడ అత్యధిక సీట్లు కొల్లగొట్టాలని లాలూ నేతృత్వంలోని ఆర్జేడీ గట్టి ప్రయత్నాలు చేస్తున్నది. లాలూ ప్రయత్నాలకు గండి కొట్టేందుకు పప్పూ ప్రయత్నిస్తున్నారు. ఎయిర్‌బస్ 130 హెలికాప్టర్లో ఈ ప్రాంతంలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్న ఆయన ప్రధానంగా లాలూపైనే గురిపెడుతున్నారు. 'లాలూ నకిలీ యాదవ్. నేను అసలైన యాదవ్‌ను' అని చెప్తున్నారు. యాదవ్ సామాజిక వర్గంలో లాలూ ఓటుబ్యాంకును దెబ్బతీయడానికే బీజేపీ వ్యూహాత్మకంగా పప్పూ రంగంలోకి దింపినట్టు భావిస్తున్నారు. దీనిపై ఆయన స్పందిస్తూ "లాలూ తన చుట్టూ భజనపరులనే ఉంచుకుంటారు. ఒకప్పుడు ఆయనకు సన్నిహితంగా ఉన్న యాదవ్‌లను ఇప్పుడు పార్టీ నుంచి గెంటేశారు. యాదవ్‌లను ఆయన ఓటుబ్యాంకుగానే చూస్తున్నారు. కానీ యాదవ్ సామాజికవర్గం అభ్యున్నతి కృషి చేస్తున్నాను' అని చెప్తున్నారు. అదే సమయంలో ప్రధాని నరేంద్రమోదీపైనా ప్రశంసలు కురిపిస్తున్నారు. -
నన్ను ఉరితీసినా.. అందుకు అంగీకరించను
-
నన్ను ఉరితీసినా.. అందుకు అంగీకరించను
పట్నా: రిజర్వేషన్లను సమీక్షించాలన్న ఆర్ఎస్ఎస్ నేత వ్యాఖ్యలపై ఆర్జేడీ నేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ విరుచుకుపడ్డారు. తనను ఉరి తీసినా రిజర్వేషన్లను ఎత్తివేయడానికి చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా పోరాడతానని ఆయన స్పష్టం చేశారు. పేదలు, వెనకబడిన వర్గాల వారికి రాజ్యాంగం కల్పిస్తున్న రిజర్వేషన్లను రద్దు చేసే ప్రయత్నాలను తాను గానీ, తన పార్టీగాని ఒప్పుకునేది లేదని లాలూ తెగేసి చెప్పారు. బీసీ వర్గాలకు, పేదలకు రాజ్యాంగం కల్పించిన హక్కులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. లౌకికవాదానికి తూట్లు పొడిచే ప్రయత్నాలను తాను ఎట్టి పరిస్థితిల్లోనూ ఉపేక్షించబోనని లాలూ అన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆర్ఎస్ఎస్ నేత మోహన్ భగవత్‌పై లాలూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ విషయంలో మోదీ ...యునైటెడ్ నేషన్స్ కు తన మీద పిటిషన్ ఇచ్చినా ఇస్తారంటూ ఎద్దేవా చేశారు. దీంతో పాటు రిజర్వేషన్లకు ఎత్తివేతకు ప్రయత్నిస్తున్న భగవత్‌కు భారతరత్న ఇచ్చి గౌరవించండంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇటీవల ఎస్టీ, ఎస్టీ, బిసి వర్గాలకు అమలు చేస్తున్న రిజర్వేషన్లను సమీక్షించాలని ఆర్ఎస్ఎస్ చీప్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీంతో ఆ ప్రకటనపై దుమారం చెలరేగింది. ఆర్ఎస్ఎస్, బిజెపి కుట్రలో భాగంగానే అగ్రకులాల పెత్తనాన్ని మరింత పెంచేందుకు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి వాటిని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని పలు సంఘాలు మండిపడుతున్నాయి.