
సీబీఐ కోర్టు మెట్లెక్కిన లాలూ
పాట్నా: దాణా కుంభకోణం కేసుకు సంబంధించి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మంగళవారం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి హాజరయ్యారు. బిహార్ మరో మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా కూడా సీబీఐ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి దేవ్‌రాజ్ త్రిపాఠి కూడా కోర్టుకు వచ్చారు.
దాణా పంపిణీకి సంబంధించి కోట్లలో కుంభకోణం జరిగినట్లు బయటపడటంతో 45మందిని నిందితులుగా చేర్చిన విషయం తెలిసిందే. ఇందులో పలువురు చనిపోగా.. ప్రస్తుతం 27మంది విచారణను ఎదుర్కొంటున్నారు. గతంలో జార్కండ్ కోర్టు లాలూ ప్రసాద్ యాదవ్‌పై నమోదైన కుట్రపూరిత ఆరోపణలన్నింటిని కొట్టి వేయగా.. ఇటీవల విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు లాలూ విచారణ ఎదుర్కోవాల్సిందేనని ఆదేశించిన విషయం తెలిసిందే.