రాంచీ: అనారోగ్యం, వయోభారం దృష్టిలో ఉంచుకుని మానవీయ కోణంలో తనకు తక్కువ శిక్ష విధించాలని బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ సీబీఐ కోర్టు న్యాయమూర్తిని కోరారు. దాణా కుంభకోణం కేసులో డిసెంబర్ 23 నుంచి బిర్సా ముండా జైలులో ఉంటున్న లాలూను సీబీఐ జడ్జి శివపాల్ సింగ్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించారు. తుది తీర్పు శనివారం చెప్తామని జడ్జి తమకు తెలియజేసినట్లు లాలూ తరఫు న్యాయవాది చిత్తరంజన్ చెప్పారు. అయితే, తనకు తక్కువ శిక్ష విధించాలంటూ జడ్జికి లాలూ లిఖితపూర్వకంగా విజ్ఞప్తి పంపారని లాయర్ తెలిపారు. దియోగర్ ట్రెజరీ నుంచి రూ.89.27లక్షలు అక్రమంగా డ్రా చేసిన కేసుకు సంబంధించి లాలూతోపాటు మరో 10 మందిపై కోర్టు విచారణ ఇప్పటికే పూర్తి చేసింది.
Comments
Please login to add a commentAdd a comment