CBI court
-
వైఎస్ జగన్‌పై కేసుల విచారణ.. మరో రాష్ట్రానికి బదిలీ అవసరం లేదు
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకున్న మాజీ ఎంపీ, శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టు గట్టి షాక్‌నిచ్చింది. వైఎస్ జగన్ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసులపై సీబీఐ ప్రత్యేక కోర్టులో జరుగుతున్న విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు నిర్ద్వందంగా తోసిపుచ్చింది. అలాగే వైఎస్ జగన్ బెయిల్‌ను రద్దు చేసేందుకు సైతం సుప్రీంకోర్టు నిరాకరించింది. జగన్‌పై రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్రశర్మ ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. వైఎస్ జగన్ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి దాఖలైన కేసులపై సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ జరుపుతోందని, దీన్ని తెలంగాణ హైకోర్టు పర్యవేక్షిస్తోందని ధర్మాసనం పేర్కొంది. రోజూ వారీ విచారణకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు సైతం జారీ చేసిందని గుర్తు చేసింది. ఓ దశలో రఘురామకృష్ణరాజుపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. కింది కోర్టులో జరిగే విచారణను మమ్మల్ని పర్యవేక్షించమంటారా? అంటూ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘సీబీఐ కోర్టు విచారణను తెలంగాణ హైకోర్టు పర్యవేక్షిస్తోంది. రోజూవారీ విధానంలో విచారణ జరపాలని సీబీఐ ప్రత్యేక కోర్టుకి ఆదేశాలు కూడా జారీ చేసింది. హైకోర్టు స్పష్టమైన ఆదేశాల తరువాత కూడా పిటిషనర్ (రఘురామకృష్ణరాజు) సీబీఐ కోర్టు విచారణలో జాప్యం జరుగుతోందని చెబుతున్నారు. కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతున్నారు. వాస్తవానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం ఏమీ మాకు కనిపించడం లేదు’ ధర్మాసనం తన తీర్పులో స్పష్టం చేసింది.సీబీఐ కోర్టు, హైకోర్టుల్లో రఘురామకు ఎదురుదెబ్బ..వైఎస్ జగన్ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి సీబీఐ, ఈడీ పలువురిపై కేసులు నమోదు చేసింది. ఈ కేసుల్లో జగన్‌కు సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయనపై నమోదైన కేసుల్లో సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా జగన్ బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ రఘురామకృష్ణరాజు సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా కోర్టు కొట్టివేసింది. అటు తరువాత ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టులో సైతం రఘురామకృష్ణరాజుకు చుక్కెదురైంది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వైఎస్ జగన్ బెయిల్‌ను రద్దు చేయడంతో పాటు ఆయనపై నమోదైన కేసులను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ 2023లో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సుప్రీంకోర్టు పలుమార్లు విచారణ జరిపింది. ఈ నెల 20న విచారణ సందర్భంగా అసలు జగన్ కేసులతో మీకేం సంబంధమని రఘురామకృష్ణరాజుని జస్టిస్ నాగరత్న ధర్మాసనం నిలదీసిన సంగతి తెలిసిందే.జగన్ బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదు...వాదన సందర్భంగా వైఎస్ జగన్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ స్పందిస్తూ.. సీబీఐ ప్రత్యేక కోర్టులో జరుగుతున్న కేసుల విచారణను తెలంగాణ హైకోర్టు పర్యవేక్షిస్తోందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. జగన్ బెయిల్‌ను రద్దు చేయాల్సిన అవసరం ఏదీ కనిపించడం లేదంది. అలాగే సీబీఐ కోర్టు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం కూడా లేదని పేర్కొంది. హైకోర్టు పరిధిలోకి జోక్యం చేసుకోవడం దాని పనితీరును ప్రభావితం చేయడమేనని ధర్మాసనం అభిప్రాయపడింది. అందువల్ల పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సమయంలో రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాదులు జగన్‌పై తాము దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని, అందుకు అనుమతినివ్వాలని అభ్యర్థించడంతో అందుకు ధర్మాసనం అంగీకరిస్తూ ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. -
బొగ్గు స్కామ్‌లో ఢిల్లీ కోర్టు కీలక తీర్పు
సాక్షి,ఢిల్లీ: యూపీఏ ప్రభుత్వ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బొగ్గు స్కామ్ కేసులో ఢిల్లీ రౌస్ అవెన్యూ సీబీఐ కోర్టు బుధవారం(డిసెంబర్11) కీలక తీర్పిచ్చింది. యూపీఏ హయాంలో జరిగిన బొగ్గు బ్లాకుల కేటాయింపులో అవకతవకలున్నాయన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేసింది.ఈ కేసులో విచారణ అనంతరం నవభారత్ పవర్ ఎండీ హరిశ్చంద్రప్రసాద్, నవభారత్ పవర్ చైర్మన్ త్రివిక్రమప్రసాద్, హరిశ్చంద్ర గుప్తా,సమారియా సహా మొత్తం ఐదుగురు నిందితులను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.ఈ మేరకు 341 పేజీల తీర్పును ప్రత్యేక కోర్టు వెలువరించడం గమనార్హం. -
సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసు.. కాంగ్రెస్ నేతపై హత్యాభియోగం
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులు కాంగ్రెస్ నేత జగదీష్ టైట్లర్‌ను వదిలేలా లేవు. ఈ కేసుల్లో భాగమైన గురుద్వారా పుల్ బంగశ్ హత్యల కేసులో టైట్లర్‌పై హత్యా నేరం అభియోగాలు నమోదు చేయాలని ఢిల్లీ రౌస్ఎవెన్యూ ప్రత్యేక కోర్టు సీబీఐని ఆదేశించింది. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి రాకేశ్ సియాల్ ఆదేశాలు జారీ చేశారు. టైట్లర్‌పై విచారణ చేపట్టేందుకు సరిపడా సాక్ష్యాధారాలు ఉన్నాయని తెలిపారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య తర్వాత ఢిల్లీలో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లపై గతంలో ప్రత్యక్ష సాక్షి ఒకరు వాంగ్మూలం ఇచ్చారు. ఈ వాంగ్మూలం ఆధారంగా టైట్లర్‌పై అభియోగాల నమోదుకు కోర్టు ఆదేశించింది. కేసు తదుపరి విచారణ సెప్టెంబర్ 13కు వాయిదా వేశారు. -
ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్‌లో ఏపీ సీఐడీ ఛార్జ్ షీట్ దాఖలు
సాక్షి, అమరావతి: ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్‌లో సీఐడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఏపీ సీఐడీ ఏసీబీ కోర్టులో గురువారం ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ప్రధాన ముద్దాయిలుగా ఏ 1 గా చంద్రబాబు, ఏ 2 గా మాజీ మంత్రి నారాయణ ఉన్నారు. వీరితో పాటు నారా లోకేష్, లింగమనేని రాజశేఖర్, లింగమనేని రమేష్‌లను ముద్దాయిలుగా సీఐడీ పేర్కొంది. సింగపూర్‌తో చంద్రబాబు ప్రభుత్వం చేసుకున్నది తప్పుడు ఒప్పందమని సీఐడీ తేల్చింది. గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఒప్పందం అంటూ తప్పుదారి పట్టించినట్టు సీఐడీ తెలిపింది. అయితే జీ 2 జీ ఒప్పందమే జరగలేదని సీఐడీ నిర్ధారించింది. సింగపూర్‌తో చేసిన ఒప్పందానికి కేంద్ర ప్రభుత్వ అనుమతిలేదని సీఐడీ తేల్చింది. చట్టవిరుద్ధంగా మాస్టర్ ప్లాన్ పేరుతో సుర్బానా జురాంగ్‌కు డబ్బులు చెల్లింపులు జరిగినట్టు నిర్ధారణ చేసింది. నిందితులకు మేలు చేసేలా ఇన్నర్ రింగ్ రోడ్, సీడ్ క్యాపిటల్, మాస్టర్ ప్లాన్ లు రూపొందించినట్టు సీఐడీ పేర్కొంది. ఇన్నర్ రింగ్ రోడ్ని లింగమనేని భూములు, హెరిటేజ్ భూములు, నారాయణ భూములకు అనుగుణంగా మార్చినట్టు సీఐడీ చార్జ్ షీట్లో వెల్లడించింది. 58 ఎకరాల భూములను బంధువుల పేరుతో మాజీ మంత్రి నారాయణ కొన్నారు. లింగమనేని 340 ఎకరాల ల్యాండ్ బ్యాంకుకి మేలు చేసేలా అలైన్ మెంట్ మార్పులు చేశారు. లింగమనేని నుండి చంద్రబాబుకు ఇంటిని ఇచ్చినట్టు సీఐడీ పేర్కొంది. లింగమనేని ల్యాండ్ బ్యాంక్ పక్కనే హెరిటేజ్ 14 ఎకరాల భూములు కొన్నట్టు సీఐడీ పేర్కొంది. ఈభూములకు విలువ పెరిగేలా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ మార్చినట్టు సీఐడీ నిర్ధారించింది. -
బాబు కస్టడీకి మరో పిటిషన్: కరకట్ట రీఅలైన్మెంట్ స్కాం ఏంటీ?
సాక్షి, అమరావతి: విజయవాడ ACB కోర్టులో చంద్రబాబు కస్టడీకి మరో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణం కేసులో కస్టడీ కావాలని ఏపీ సీఐడీ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వమని పిటీషన్లో కోరింది. ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్మెంట్ కేసులో చంద్రబాబును A1 ముద్దాయిగా సీఐడీ పేర్కొంది. కరకట్ట ఇన్నర్ రింగ్ స్కాం అసలు కథ ఇదే? టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో జరిగిన అమరావతి భూకుంభకోణానికి కర్త, కర్మ, క్రియ అంతా నాటి సీఎం చంద్రబాబే అని దర్యాప్తులో తేటతెల్లమవుతోంది. లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కోలో భాగంగానే ఏ–1 చంద్రబాబుకు కరకట్ట నివాసం, ఏ–2 పొంగూరు నారాయణకు సీడ్ క్యాపిటల్‌లో భూములు దక్కాయని తేలిపోయింది. అసలేం జరిగింది? అమరావతి మాస్టర్‌ప్లాన్, ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ అంతా నాటి సీఎం, ఈ కేసులో ఏ–1 చంద్రబాబు కనుసన్నల్లోనే సాగింది. అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిన సమయంలో సీఆర్డీయే ఎక్స్ అఫీషియో చైర్మన్‌గా వ్యవహరించిన చంద్రబాబుకు మాస్టర్‌ప్లాన్ గురించి మొత్తం ముందే తెలుసు. మాస్టర్‌ప్లాన్‌పై తుది నిర్ణయం తీసుకుంది చంద్రబాబే అని పేర్కొంది. అంతేకాదు రాజధాని ఎంపిక, ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారు ప్రక్రియలో ఆయనకు పూర్తి భాగస్వామ్యం ఉంది. అలైన్మెంట్ మూడుసార్లు మార్పు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పుల ద్వారా లింగమనేని రమేశ్ కుటుంబంతో చంద్రబాబు, నారాయణ క్విడ్‌ప్రోకోకు పాల్పడ్డారని స్పష్టమయింది. టీడీపీ ప్రభుత్వంలో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను మూడుసార్లు మార్చారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయి. 2015 జూలై 22, 2017 ఏప్రిల్ 4, 2018 అక్టోబరు 31న ఇన్నర్‌రింగ్ అలైన్మెంట్లో మార్పులు జరిగాయి. ఆనుకుని లింగమనేనికి 168.45 ఎకరాలు ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి టీడీపీ ప్రభుత్వం ప్రయోజనం కల్పించిందన్నది ప్రధాన అభియోగం. ఈ కేసులో ఏ–3గా ఉన్న లింగమనేని రమేశ్ కుటుంబానికి ఇన్నర్‌రింగ్ రోడ్డు తుది అలైన్‌మెంట్‌ను ఆనుకునే 168.45 ఎకరాలు ఉన్నాయి. అయితే ఇన్నర్‌రింగ్ రోడ్డు నిర్మించారా లేదా అన్నదానితో నిమిత్తం లేదని, లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కల్పించే రీతిలోనే అలైన్‌మెంట్‌ను ఖరారు చేసినట్లు దర్యాప్తులో తేలింది. కరకట్ట కట్టడం.. క్విడ్‌ప్రోకో కిందే చంద్రబాబు ఉంటున్న కరకట్ట నివాసాన్ని నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మించారని తేలింది. ఏ–3గా ఉన్న లింగమనేని రమేశ్ ఆ ఇంటికి టైటిల్‌దారుగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఆ నివాసంలో ఏడేళ్లుగా నివసిస్తున్నారు. సీఎం హోదాలోనూ, ప్రతిపక్ష నేత హోదాలోనూ అదే నివాసంలో చంద్రబాబు నివసిస్తున్నారు. ఆ నివాసం గురించి ప్రభుత్వంతో లింగమనేని అధికారికంగా ఎలాంటి వ్యవహారాలు నెరపలేదు. అంటే ఆ నివాసాన్ని లింగమనేని రమేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వలేదు. కరకట్ట నివాసాన్ని లింగమనేని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారంటూ టీడీపీ చేస్తున్న వాదన పూర్తిగా అవాస్తవం. ఆ నివాసాన్ని లింగమనేని రమేశ్ చంద్రబాబుకు వ్యక్తిగతంగానే ఇచ్చారు. రాజధాని మాస్టర్‌ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లలో కుంభకోణం ద్వారా భారీగా ప్రయోజనం కల్పించినందున క్విడ్ ప్రోకోలో భాగంగానే కరకట్ట నివాసాన్ని చంద్రబాబుకు ఇచ్చినట్టు స్పష్టమవుతోంది. హెరిటేజ్ భూముల లావాదేవీలు గోప్యం లింగమనేని కుటుంబం నుంచి హెరిటేజ్ ఫుడ్స్ కొనుగోలు చేస్తున్నట్టు చూపిస్తున్న భూముల బాగోతం కూడా బట్టబయలైంది. చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థకు లింగమనేని కుటుంబం భూములు అమ్మినట్టు ఎలాంటి లావాదేవీలను చూపించలేదు. రాజధాని ప్రాంతంలో లింగమనేని కుటుంబం నుంచి హెరిటేజ్ ఫుడ్స్ కొనుగోలు చేసిన భూములకు సంబంధించి లావాదేవీలను చంద్రబాబు వెల్లడించలేదని తేలింది. లోకేశ్‌దీ కీలక పాత్రే... క్విడ్ ప్రోకో కింద అమరావతిలో లింగమనేని కుటుంబం భూములను హెరిటేజ్‌కు బదలాయించడంలో నారా లోకేశ్ కీలక పాత్ర పోషించారన్నది బట్టబయలైంది. లింగమనేని కుటుంబం నుంచి భూములు తీసుకునేందుకు హెరిటేజ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో తీర్మానించారు. హెరిటేజ్ డైరెక్టర్‌గా లోకేశ్ ఆ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మంత్రిగా ఉంటూ చంద్రబాబుతో కరకట్ట నివాసంలోనే నివసించారు. అంటే లింగమనేని కుటుంబానికి భారీగా ప్రయోజనం కల్పించి క్విడ్ ప్రోకో కింద హెరిటేజ్ భూములు దక్కించుకోవడంలో, కరకట్ట నివాసాన్ని సొంతం చేసుకోవడంలోనూ లోకేశ్ క్రియాశీల పాత్ర పోషించారన్నది స్పష్టమైంది. కథ నడిపిన ఏ–2 నారాయణ అమరావతి మాస్టర్‌ప్లాన్, ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పుల ద్వారా నారాయణ కుటుంబం నిబంధనలకు విరుద్ధంగా ప్రయోజనం పొందినట్లు స్పష్టమైంది. మాస్టర్‌ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పుల వ్యవహారాలన్నీ నారాయణకు పూర్తిగా తెలుసని, అంతా ఆయన ఆధ్వర్యంలోనే సాగిందని దర్యాప్తులో వెల్లడయింది. ఈ కేసులో ఇప్పటికే నారాయణ కుటుంబ సభ్యులు, సమీప బంధువులు సీడ్ క్యాపిటల్‌లో భూములు కొనుగోలు చేశారనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయి. తద్వారా సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో కొనుగోలు చేసిన భూములు సీఆర్డీయేకే భూసమీకరణ కింద ఇచ్చి 75,888 చ.గజాల ప్లాట్లు పొందారని తేలింది. ఆ భూములపై కౌలు కింద రూ.1.92కోట్లు కూడా పొందారని పేర్కొంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కరకట్ట నివాసం, సీడ్ క్యాపిటల్‌లో నారాయణ కుటుంబ సభ్యులకు కేటాయించిన 75,888 చ.గజాల ప్లాట్లు, కౌలు మొత్తంగా పొందిన రూ.1.92 కోట్లను అటాచ్ చేసేందుకు కోర్టు కూడా అనుమతినిచ్చింది. -
వివేకా కేసు.. వైఎస్ భాస్కర్‌రెడ్డికి ఎస్కార్ట్ బెయిల్
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డికి బెయిల్ లభించింది. అనారోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని ఆయన సీబీఐ కోర్టును ఆశ్రయించారు. ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న సీబీఐ కోర్టు.. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు 12 రోజులపాటు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేస్తూ బుధవారం ఆదేశాలు ఇచ్చింది. ఎస్కార్ట్ బెయిల్లో భాగంగా ముగ్గురు పోలీసులు, ఒక పోలీస్ వెహికిల్ ఉంటాయి. ఎస్కార్ట్ బెయిల్లో వీళ్లు భాస్కర్ రెడ్డి వెంటే ఉంటారు. ఇదిలా ఉంటే వివేకా హత్య కేసులో.. ఈ ఏప్రిల్‌లో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డిని పులివెందులలో విచారించి.. నాటకీయ పరిణామాల నడుమ అదుపులోకి తీసుకున్నారు తెలంగాణ సీబీఐ అధికారులు. అప్పటి నుంచి ఆయన చంచల్‌గూడ జైల్లో ఉన్నారు. మధ్యంతర బెయిల్ కోరుతూ ఆయన పిటిషన్ వేయగా.. ఇవాళ ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం. అంతకు ముందు ఉదయ్ కుమార్‌రెడ్డికి కూడా సీబీఐ కోర్టు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది. ఉదయ్ భార్య గర్భవతిగా ఉండడంతో ఆమెను కలిసేందుకు 14 నుంచి 16వ తేదీ వరకు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది. ఇదీ చదవండి: Viveka Caseలో దారి తప్పిన 'సీబీఐ దర్యాప్తు' -
ఇదో పబ్లిక్ న్యూసెన్స్ పిటిషన్..హరిరామ జోగయ్యపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: మాజీ ఎంపీ హరిరామ జోగయ్యపై తెలంగాణ హైకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం జగన్మోహన్రెడ్డికి వ్యతిరేకంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన నేపథ్యంలో.. ఆయన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తీవ్రంగా మందలించింది. ఇలాంటి పిటిషన్లు వేసి కోర్టు విలువైన సమయాన్ని వృధా చేసేందుకు యత్నించారంటూ మండిపడింది చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం. సోమవారం పిటిషనర్ హరిరామ జోగయ్య తరఫు న్యాయవాది వాదనలకు సిద్ధం కాగా.. ఆ వెంటనే బెంచ్ కలుగజేసుకుంది. ‘‘ఇదో పబ్లిక్ న్యూసెన్స్. ఇందులో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏముందసలు?. వ్యక్తిగత కక్షతోనే పిల్ దాఖలు చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఓ మాజీ ఎంపీ అయ్యి ఉండి మీరు ఇలా వ్యవహరించడం ఆమోద యోగ్యం కాద’’ని తెలిపింది. ‘‘సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసుల విచారణ త్వరగా పూర్తి చేసేలా చూడాలని పిటిషన్ వేశారు. రాష్ట్రపతి లేఖ రాశాం.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశాం.. అని అంటారా!. ఇది ఏం పద్ధతి?. ఉన్నత స్థానాల్లో ఉన్న వారికి చెప్పినంత మాత్రాన కింది స్థాయి కోర్టు భయపడి పనిచేయవన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఓ బాధ్యత గల మాజీ పార్లమెంట్ సభ్యుడైన మీరు ఇలా వ్యవహరించడం ఆమోదయోగ్యం కాదు. మీరు దాఖలు చేసిన పిటిషన్లో అసలు ఎక్కడన్నా ప్రజాసక్తి ఉంది అని మీకైనా అనిపిస్తోందా?. వ్యక్తిగత ద్వేషంతో కోర్టులను ఆశ్రయించి.. మా విలువైన సమయాన్ని వృధా చేయొద్దు. ఈ మధ్య తెలంగాణ గవర్నర్ చెప్పినట్లు ఇలాంటి పబ్లిక్ న్యూసెన్స్ కేసులు ఎక్కువయ్యాయి. కొందరికి ఇలాంటి పిటిషన్లు వేయడమే పరిపాటిగా మారింది. మీరు అడిగారు కదా అని వెంటనే విచారణ చేపట్టలేం అని బెంచ్ పిటిషనర్‌కు స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. సీఎం జగన్‌పై కేసుల్ని త్వరగతిన విచారణ పూర్తి చేయాలని, 2024 సాధారణ ఎన్నికలకు ముందే తీర్పు వెలువరించాలని, ఆ మేరకు సీబీఐకోర్టుకు ఆదేశించాలని జోగయ్య తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే.. ఈ పిల్ పైఅభ్యంతరం లేవనెత్తిన రిజిస్ట్రీ.. కేసు నంబర్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఫైలింగ్ నంబర్‌పైనే విచారణ మొదలైంది. రిజిస్ట్రీ అభ్యంతరం లేవనెత్తిన అంశాల కాపీని పిటిషనర్‌కు ఇవ్వాలని ఆదేశిస్తూ, విచారణను జూలై 6కు వాయిదా వేసింది ధర్మాసనం. ఇదీ చదవండి: కాపు ఉద్యమకారుడి కుటుంబానికి సీఎం జగన్ బాసట -
సీబీఐ కోర్టులో భాస్కర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు
హైదరాబాద్: వివేకా కేసుకు సంబంధించి భాస్కర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో వాదనలు ముగిసాయి. భాస్కర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై ఈనెల9వ తేదీన తీర్పు ఇస్తామని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. దీనిలో భాగంగా తదుపరి విచారణను ఈనెల 9వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో సునీత ఇంప్లీడ్ పిటిషన్‌ను సీబీఐ కోర్టు అనుమతించింది. ఈ మేరకు లిఖిత పూర్వక వాదనలు సమర్పించాలని సునీతకు సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి సంబంధం లేని వ్యక్తిని అరెస్ట్ చేశారు సీబీఐ కోర్టులో బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా భాస్కర్‌రెడ్డి తరఫున న్యాయవాది ఉమా మహేశ్వర్‌రావు వాదనలు వినిపించారు. ‘ఎలాంటి సంబంధం లేని వ్యక్తి ని సిబిఐ అధికారులు ఆరెస్ట్ చేశారు. ఆరోపణలు మాత్రమే సిబిఐ పరిగణలోకి తీసుకుంది. భాస్కర్ రెడ్డి సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తి. ఒక సీనియర్ సిటిజన్‌ను అక్రమ కేసులో సీబీఐ ఇరికించింది. ఎలాంటి నేర చరిత్ర లేనటువంటి వ్యక్తి భాస్కర్ రెడ్డి. భాస్కర్ రెడ్డి నేరం చేసాడు అనడానికి ఎక్కడ సరైన సాక్ష్యాలు లేవు. ఎర్ర గంగిరెడ్డి ఎక్కడ కూడా భాస్కర్ రెడ్డి పేరు ప్రస్థావించలేదు’ అని కోర్టుకు తెలిపారు. -
ప్రత్యేక కేటగిరీ విచారణ ఖైదీగా భాస్కర్‌రెడ్డి.. సీబీఐ కోర్టు సిఫార్సు
సాక్షి, హైదరాబాద్: వైఎస్ భాస్కర్‌రెడ్డిని ప్రత్యేక కేటగిరీ విచారణ ఖైదీగా పరిగణించాలని హైదరాబాద్ జిల్లా మెజిస్ట్రేట్‌కు సీబీఐ కోర్టు సిఫార్సు చేసింది. ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలన్న భాస్కర్ రెడ్డి అభ్యర్థనకు సీబీఐ కోర్టు అంగీకారం తెలిపింది. కాగా, వివేకా లేఖపై నిన్ హైడ్రిన్ పరీక్షకు అనుమతించాలన్న పిటిషన్‌పై సీబీఐ కోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. సీబీఐ పిటిషన్‌పై గంగిరెడ్డి, సునీల్ యాదవ్ కౌంటర్లు దాఖలు చేశారు. తన వైపు కౌంటరు లేదని సీబీఐ కోర్టుకు దస్తగిరి తెలిపారు. సీబీఐ వాదనలు వినడానికి విచారణను ఈ నెల 5కు కోర్టు వాయిదా వేసింది. వివేకా హత్య కేసులో సునీత పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ వివేకా హత్య కేసులో సునీత పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. కోర్టు విచారణలో సీబీఐ పీపీకి సహకరించేందుకు అనుమతివ్వాలన్న సునీత కోరగా, ఆమె పిటిషన్ పై శివశంకర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషన్‌పై భాస్కర్ రెడ్డి, ఉదయ్ శంకర్ రెడ్డి తమ కౌంటర్లు దాఖలు చేయలేదు. సునీత వాదనల కోసం పిటిషన్ విచారణ ఈ నెల 5కు కోర్టు వాయిదా వేసింది. -
వివేకా కేసు: కోర్టుకు హాజరుకాని దస్తగిరి.. విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వివేకా హత్య కేసులో ఉన్న ఐదుగురు నిందితులను సీబీఐ అధికారులు కోర్టు ముందు హాజరుపరిచారు. ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, శివశంకర్ రెడ్డిని హాజరుపరిచారు. అయితే, వివేకా కేసులో కీలక నిందితుడు దస్తగిరి ఈరోజు కూడా కోర్టులో హాజరు కాలేదు. దీంతో, కోర్టు.. కేసు విచారణను ఈనెల 16వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా.. వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి సీబీఐ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ క్రమంలో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి కోర్టు ఆదేశించింది. అనంతరం విచారణను జూన్ 5వ తేదీకి వాయిదా వేసింది. ఇది కూడా చదవండి: వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా -
వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్: వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి సీబీఐ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ క్రమంలో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. అనంతరం విచారణను జూన్ 5వ తేదీకి వాయిదా వేసింది. అంతకుముందు, వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్టయిన వైఎస్ భాస్కర్‌రెడ్డి బెయిల్ కోరుతూ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్నానని.. దాదాపు నెలన్నర రోజులుగా జైలులో ఉంటున్నానని, కస్టడీ విచారణ కూడా ముగిసిందని భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని బెయిల్ ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. వివేకా హత్య కేసులో ఏప్రిల్ 16న భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ.. ఏప్రిల్ 19 నుంచి 24 వరకు కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపింది. ఏప్రిల్ 24 నుంచి చంచల్‌గూడ జైలులో ఉంటున్న భాస్కర్‌రెడ్డి గత వారం అస్వస్థతకు గురవ్వగా.. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స అందించారు. అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు ఆయనకు హృదయ సంబంధ సమస్యలున్నట్లు గుర్తించారు. దీంతో నిమ్స్‌కు తరలించి.. పలు పరీక్షలు చేశారు. అనంతరం మళ్లీ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో బెయిల్ కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఇది కూడా చదవండి: అనుమతి లేకుండానే విదేశాలకు మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ -
వివేకా లేఖకు నిన్‌హైడ్రేట్ పరీక్ష.. సీబీఐ పిటిషన్
సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు ప్రక్రియలో.. సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వివేకా రాసిన లేఖపై వేలిముద్రలను గుర్తించేందుకు సీబీఐ కసరత్తు చేపట్టింది. ఈ మేరకు లేఖపై వేలిముద్రలను గుర్తించేందుకు అవసరమైన నిన్‌హైడ్రేట్ (Ninhydrin Test) పరీక్ష నిర్వహించాలని నిర్ణయించుకుంది. అయితే.. ఈ పరీక్ష ద్వారా లేఖ పాడైపోయే అవకాశం ఉన్నందున.. పరీక్షకు అనుమతి కోరుతూ కోర్టును ఆశ్రయించింది దర్యాప్తు సంస్థ. వివేకా హత్య జరిగిన ఘటనాస్థలంలో దొరికిన లేఖను 2021 ఫిబ్రవరి 11వ తేదీన ఢిల్లీ సీఎఫ్ఎస్ఎల్కు పంపింది సీబీఐ. అయితే తీవ్ర ఒత్తిడిలోనే వివేకా ఆ లేఖ రాసినట్లుగా సీఎఫ్ఎస్ఎల్ తేల్చి చెప్పింది. ఇక ఇప్పుడు.. లేఖపై వేలిముద్రలు కూడా గుర్తించాలని సీఎఫ్ఎస్ఎల్ను కోరింది సీబీఐ. అయితే.. లేఖపై వేలిముద్రలు గుర్తించేందుకు నిన్‌హైడ్రేట్ పరీక్ష నిర్వహించాలని సీఎఫ్ఎస్ఎల్ చెప్పింది. నిన్‌హైడ్రేట్ పరీక్ష చేస్తే లేఖపై రాత, ఇంకు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇదే విషయాన్ని సీఎఫ్ఎస్ఎల్, సీబీఐకి స్పష్టం చేసింది. దీంతో.. ఒరిజినల్ లేఖపై చేతిరాత, ఇంకు దెబ్బతినే అవకాశం ఉన్నందున ఆ టెస్ట్ నిర్వహణ కోసం కోర్టును ఆశ్రయించించింది సీబీఐ. లేఖపై వేలిముద్రలను అనుమానితుల వేలిముద్రలతో పోల్చాల్సి ఉందని, అలాగే రికార్డుల్లో ఒరిజినల్ లేఖ బదులుగా కలర్ జిరాక్స్‌ను అనుమతించాలని కోర్టును కోరింది సీబీఐ. దీంతో సీబీఐ పిటిషన్‌పై నిందితుల స్పందన కోరింది సీబీఐ న్యాయస్థానం. ఈ పిటిషన్‌పై జూన్ 2వ తేదీన విచారణ జరపనుంది నాంపల్లి సీబీఐ కోర్టు. ఇదీ చదవండి: వివేకా పీఏ కృష్ణారెడ్డి సంచలన స్టేట్మెంట్ -
వివేకా హత్య కేసు: దోషులని నిర్ణయించుకుని.. అదే లక్ష్యంగా దర్యాప్తు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కొందరిని దోషులుగా నిర్ణయించుకుని, అదే లక్ష్యంగా దర్యాప్తు చేస్తోంది తప్ప.. అసలు నేరస్థులను పట్టుకునే ప్రయత్నం చేయడంలేదని మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అరెస్టయిన వైఎస్ భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌ల న్యాయవాదులు సీబీఐ కోర్టులో వాదనలు వినిపించారు. వాదనలు విన్న సీబీఐ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి సీహెచ్ రమేశ్‌బాబు తీర్పును మంగళవారానికి వాయిదా వేశారు. భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్ కస్టడీ పిటిషన్‌తో పాటు ఉదయ్‌కుమార్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సోమవారం కోర్టులో వాదనలు జరిగాయి. భాస్కర్‌రెడ్డి తరఫున ఉమామహేశ్వర్, ఉదయ్ తరఫున రవీందర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘ఏ–4 (దస్తగిరి) చెప్పాడని వైఎస్ భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేశారు. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల నాటి నుంచి భాస్కర్‌రెడ్డి, అవినాశ్, శివశంకర్‌రెడ్డితో వివేకాకు విభేదాలున్నాయని పేర్కొన్నారు. హత్య కోసం రూ.40 కోట్లకు ఒప్పందం కుదిరిందని, రూ.కోటి ఇచ్చారని చెప్పారు. ఈ ఆరోపణలకు ఎలాంటి సాక్ష్యాలు లేవు. రిమాండ్ పిటిషన్‌లోని సబ్జెక్ట్‌ను మార్చి కస్టడీ పిటిషన్‌గా వేశారు. దీనిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌ను పాటించకుండా ఇష్టం వచ్చినట్లు పిటిషన్ దాఖలు చేశారు. ఒక్క కస్టడీ అన్న పదం తప్ప రెండు పిటిషన్లు ఒక్కటే. 75 ఏళ్ల వృద్ధుడైన భాస్కర్‌రెడ్డిని పలుమార్లు విచారణకు పిలిచారు. విచారణలో ఏం అడిగారు, ఆయన ఏ ప్రశ్నలకు సమాధానం చెప్పలేదో తెలపకుండా.. సహకరించలేదని అనడం సరికాదు. సీబీఐ కోరుకున్న విధంగా ఆయన సమాధానాలు వెల్లడించరు. అలాగే సీబీఐ దాఖలు చేసిన రెండు చార్జీషీట్లలోనూ భాస్కర్‌రెడ్డి ప్రస్తావన కూడా లేదు. ఇష్టం వచ్చినట్లు అరెస్టు చేసి నిందితుల జాబితాలో చేరుస్తున్నారు. ఇంకా ఎంత మందిని కోర్టు అనుమతి లేకుండా ఇలా చేరుస్తారో తెలియదు. సాక్షులు ఎవరన్నది కూడా పిటిషన్లో లేదు. తప్పుడు సాక్ష్యాలు సృష్టించి కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. భాస్కర్‌రెడ్డి వెన్నెముకకు సర్జరీ జరిగింది. చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచించారు. భాస్కర్‌రెడ్డి కస్టడీ పిటిషన్‌ను కొట్టివేయాలి’ అని ఉమామహేశ్వర్ వాదించారు. అరెస్టులతో హడావుడి ‘ఉదయ్‌కుమార్‌ను ఏ నేరం కింద అరెస్టు చేశారో సీబీఐ ఎక్కడా చెప్పలేదు. సీఆర్పీసీ 173 ప్రకారం.. కోర్టు అనుమతి తీసుకున్న తర్వాతే ఏ–6 (ఉదయ్‌కుమార్), ఏ–7 (వైఎస్ భాస్కర్‌రెడ్డి)లను నిందితులుగా పేర్కొనాలి. కానీ కోర్టు నుంచి సీబీఐ ఎలాంటి అనుమతి తీసుకోలేదు. ఏ–6పై నమోదు చేసిన అన్ని సెక్షన్లు బెయిల్ ఇచ్చేవే. ఇప్పటికి 22 సార్లు సీబీఐ ఉదయ్‌కుమార్‌ను విచారించింది. అతని మొబైల్ తీసుకున్న అధికారులు రసీదు కూడా ఇవ్వలేదు. ఇన్నిసార్లు విచారణ జరిపి.. ఇంకా సహకరించలేదనడం హాస్యాస్పదం. తెలియని ప్రశ్నలకు సమా«దానం చెప్పకపోవడం అతని హక్కు. సీబీఐ మూడేళ్లుగా విచారణ చేస్తున్నా రెండు చార్జిషీట్లు వేయడం తప్ప సాధించిన పురోగతి లేదు. సుప్రీంకోర్టు ఆదేశించిన గడువు దగ్గరపడుతుండటంతో అరెస్టులు చేస్తున్నారు తప్ప ఆధారాలను సేకరించడంలేదు. చట్టాలను పాటించడం లేదు. సీబీఐ విచారణాధికారి రాంసింగ్‌పై ఉదయ్ ఫిర్యాదు చేశారు. ఈ కేసు ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతోంది. చదవండి: దస్తగిరితో డ్రామా! అప్రూవర్ వాంగ్మూలం ఉత్త కథే ఉదయ్‌ను చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఆయనపై మోపినవి నాన్–కాగ్నిజబుల్ నేరాలే. దీన్ని పరిగణనలోకి తీసుకుని ఉదయ్‌కి బెయిల్ ఇవ్వాలి’ అని రవీందర్‌రెడ్డి కోరారు. ‘2017 ఎమ్మెల్సీ ఎన్నికల నాటి నుంచి వివేకాతో వైఎస్ భాస్కర్‌రెడ్డికి, శివశంకర్‌రెడ్డికి పలు విభేదాలు ఉన్నాయి. 2017లో ఎమ్మెల్సీగా పోటీ చేసిన వివేకా ఓడిపోయారు. ఈ ఓటమికి భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి కారణమని వివేకా తీవ్ర ఆగ్రహంతో ఉండేవారు. హత్య చేసిన వారు కూడా భాస్కర్‌రెడ్డికి, శివశంకర్‌రెడ్డికి అత్యంత సన్నిహితులు’ అని సీబీఐ పీపీ వాదనలు వినిపించారు. -
Kothapalli Geetha: సీబీఐ కేసులో మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఊరట
సాక్షి, హైదరాబాద్: అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత దంపతులకు హైకోర్టులో ఊరట లభించింది. వారికి తెలంగాణ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా కొత్తపల్లి గీత దంపతులు రూ.25వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. కాగా, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను మోసం చేశారన్న కేసులో కొత్తపల్లి గీతకు సీబీఐ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో వారు సీబీఐ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన హైకోర్టు సీబీఐ కోర్టు తీర్పు అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి విచారణను డిసెంబర్ 16కి వాయిదా వేసింది. చదవండి: (దశదిన కర్మరోజు వద్దామనుకున్నా.. అందువల్లే ఈ రోజు వచ్చా: రాజ్‌నాథ్ సింగ్) -
ఐవోబీ మాజీ ఉద్యోగులకు ఐదేళ్ల జైలు
సాక్షి, హైదరాబాద్: తప్పుడు ఆదాయ పన్ను(ఐటీ) ధ్రువపత్రాలతో గృహ రుణాలు మంజూరు చేశారన్న కేసులో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐవోబీ) హైదరాబాద్ మాజీ చీఫ్ మేనేజర్ సౌమన్ చక్రవర్తి, మాజీ సీనియర్ మేనేజర్ శంకరన్ పద్మనాభన్‌కు సీబీఐ కోర్టు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరితో పాటు టి.సత్య వెంకట దివాకర్, జూలూరి లక్ష్మయ్యలకు ఐదేళ్ల జైలు, రూ.75,000 జరిమానా, సయ్యద్ ముస్తక్ అహ్మద్, బొర్ర చంద్రపాల్, తోట రవీందర్, ఎం.గోపాల్‌రావు, బసవన్న రవీంద్రలకు మూడేళ్లు జైలు, రూ.75,000 జరిమానా విధించింది. తప్పుడు పత్రాలు సృష్టించి గృహ రుణాలు ఇచ్చినట్లు ఆరోపణలు రావడంతో 2005లో బ్యాంక్ అధికారులిద్దరిపై సీబీఐ కేసు నమోదు చేసింది. నకిలీ సేల్ డీడ్లను, గడువు ముగిసిన ఎల్ఐసీ పాలసీలతో రుణాలు మంజూరు చేసినట్లు విచారణలో తేలింది. 2007, నవంబర్‌లో సీబీఐ కోర్టులో చార్జీషీట్ దాఖలు చేసింది. ఇలా అక్టోబర్ 2003 నుంచి జనవర్ 2004 వరకు ఈ రుణాలు మంజూరు చేసి.. బ్యాంక్‌కు రూ.2.21 కోట్ల నష్టం కలిగించినట్లు తేలడంతో సీబీఐ కోర్టు నిందితులకు శిక్షలు ఖరారు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. -
టీఎంసీ నేతకు బెయిల్ ఇవ్వాలని జడ్జికి బెదిరింపులు..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని ఆసన్సోల్ సీబీఐ కోర్టు ప్రత్యేక జడ్జికి బెదిరింపు లేఖ రావడం కలకలం రేపింది. గోవుల అక్రమ రవాణా కేసులో అరెస్టయిన టీఎంసీ నాయకుడు అనుబ్రత మండల్‌కు బెయిల్ ఇవ్వాలని, లేకపోతే జడ్డి కుటుంబసభ్యులపై నార్కొటిక్ డ్రగ్స్ కేసు పెడతామని ఓ వ్యక్తి బెదిరించాడు. ఈ విషయంపై జడ్జి రాజేశ్ చక్రవర్తి జిల్లా జడ్డికి ఫిర్యాదు చేశారు. బెదిరింపు లేఖను కూడా జత చేశారు. అనుబ్రత మండల్‌కు బెయిల్ ఇవ్వకపోతే తన కుటుంబసభ్యులందరిపై నార్కొటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్(NDPS) కింద కేసు పెడతామని బప్ప చటర్జీ అనే వ్యక్తిపేరుతో లేఖవచ్చిందని జడ్జి పేర్కొన్నారు. నిందితుడు పుర్వ వర్ధమాన్‌లోని ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కోర్టులో హెడ్ క్లర్క్ అని, టీఎంసీ లీడర్నని లేఖలో పేర్కొన్నాడని తెలిపారు. ఈ విషయాన్ని కోల్‌కతా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఈ వ్యవహారంపై బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ తీవ్రంగా స్పందించారు. అనుబ్రత మండల్ అరెస్టయినప్పటికీ సీఎం మమతా బెనర్జీ ఇంకా అతడ్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చదవండి: మా నాయకుడికి బెయిల్ ఇవ్వు లేకపోతే.. సీబీఐ జడ్జికి బెదిరింపులు -
బొగ్గు కుంభకోణంలో మాజీ కార్యదర్శి దోషే: కోర్టు
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంలో ఆ శాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సీ గుప్తా, మాజీ సంయుక్త కార్యదర్శి కేఎస్ క్రోఫాలను సీబీఐ ప్రత్యేక కోర్టు శుక్రవారం దోషులుగా తేల్చింది. మహారాష్ట్రలోని లొహారా ఈస్ట్ కోల్ బ్లాక్ కేటాయింపుల్లో వీరిద్దరూ నేరపూరిత కుట్రకు, మోసం, అవినీతికి పాల్పడ్డారని పేర్కొంది. గ్రేస్ ఇండస్ట్రీస్(జీఐఎల్)ను, ఆ కంపెనీ డైరెక్టర్ ముకేశ్ గుప్తాను కూడా ప్రత్యేక జడ్జి అరుణ్ భరద్వాజ్ దోషిగా పేర్కొన్నారు. వీరికి ఆగస్ట్ 4న శిక్షలు ఖరారు చేయనున్నారు. 2005–11 సంవత్సరాల మధ్య బొగ్గు బ్లాకుల కేటాయింపుల్లో చోటుచేసుకున్న అవకతవకలపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఇదీ చదవండి: ఫ్యామిలీ కోర్టుల్లో 11.4 లక్షల పెండింగ్ కేసులు -
వాన్‌పిక్ ప్రాజెక్ట్ లిమిటెడ్‌కు ఊరట
-
వాన్‌పిక్ ప్రాజెక్ట్స్‌పై కీలక తీర్పు వెలువరించిన సీజే జస్టిస్ ఉజ్జల్ భుయాన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు తాజాగా కీలక తీర్పు వెలువరించింది. వాన్‌పిక్ ద్వారా పలు ప్రయోజనాలు కల్పించినందుకు నిమ్మగడ్డ ప్రసాద్ జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు పెట్టారని ఆరోపిస్తూ వాన్‌పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై సీబీఐ నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టి వేసింది. చట్టం అనుమతినిస్తే మినహా కంపెనీపై వచ్చిన నేరారోపణలకు, కంపెనీ చర్యలకు దాని చైర్మన్‌నుగానీ, ఆ కంపెనీని నడుపుతున్న వ్యక్తులను గానీ బాధ్యులుగా చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. వాన్‌పిక్ ప్రాజెక్ట్స్పె సీబీఐ నమోదు చేసిన అభియోగ పత్రాన్ని (చార్జిషీట్) విచారణ నిమిత్తం పరిగణలోకి (కాగ్నిజెన్స్) తీసుకునేటప్పుడు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం యాంత్రికంగా వ్యవహరించిందని హైకోర్టు తేల్చి చెప్పింది. అభియోగపత్రాన్ని విచారణకు స్వీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసే సమయంలో సీబీఐ కోర్టు మెదడు ఉపయోగించలేదని ఘాటు వ్యాఖ్యలు చేసింది. వాన్‌పిక్ ప్రాజెక్ట్స్ అనేది ఓ వ్యక్తి కాదనే విషయాన్ని సీబీఐ కోర్టు పరిగణలోకి తీసుకోలేదని పేర్కొంది. అంతేకాక వాన్‌పిక్ ప్రాజెక్ట్స్పైగానీ, దానికి నేతృత్వం వహిస్తున్న నిమ్మగడ్డ ప్రసాద్పైగానీ సీబీఐ ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలున్నాయని సంతృప్తి చెందేందుకు సీబీఐ కోర్టు ఎలాంటి కారణాలను నమోదు చేయలేదని తేల్చి చెప్పింది. చార్జిషీటు, దానితో జత చేసిన డాక్యుమెంట్లు, ఆఫీసు నోటు, కోర్టు తీర్పులను మాత్రమే సీబీఐ కోర్టు పరిశీలించిందని తెలిపింది. సీబీఐ ఆరోపణలకు ఓ కార్పొరేట్ సంస్థగా వాన్పిక్స్ ప్రాజెక్ట్స్ లేదా దాని చైర్మన్‌గా ప్రాథమిక ఆధారాలున్నాయా? కార్పొరేట్ సంస్థ చేసినట్లు ఆరోపిస్తున్న నేరాలకు చైర్మన్ మాత్రమే బాధ్యత వహించాలా? అన్న విషయంలో సీబీఐ ఎలాంటి కారణాలను నమోదు చేయలేదని హైకోర్టు స్పష్టం చేసింది. కార్పొరేట్ సంస్థ ఓ వ్యక్తి కాదని, అలాంటి కంపెనీ లేదా కార్పొరేషన్ నేరస్తుడైతే, అందుకు సంబంధించిన బాధ్యతను దాని డైరెక్టర్లకు గానీ, ఆ కంపెనీని నడుపుతున్న వ్యక్తులకుగానీ యాంత్రికంగా ఆపాదించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. నేరస్తులు కంపెనీకి చెందిన వారన్న కారణంతో కంపెనీ తప్పులకు వారిని యాంత్రికంగా బాధ్యులుగా చేయడానికి వీల్లేదంది. చైర్మన్‌గా నిమ్మగడ్డ ప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పొరేట్ సంస్థ అయిన వాన్‌పిక్ ప్రాజెక్ట్స్‌పై క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు అనుమతినిచ్చినట్లయితే అంతిమ న్యాయం చేసినట్లు కాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ గురువారం కీలక తీర్పు వెలువరించారు. నిరంజన్‌రెడ్డి వాదనలతో ఏకీభవించిన సీజే... సీబీఐ తమపై నమోదు చేసిన కేసును కొట్టి వేయాలని కోరుతూ వాన్‌పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2016లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై ఇటీవల వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ గురువారం తీర్పు వెలువరించారు. సహేతుక కారణాలు చూపకుండానే సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌ను సీబీఐ కోర్టు కాగ్నిజెన్స్‌లోకి తీసుకుందన్న వాన్‌పిక్ ప్రాజెక్ట్స్ తరఫు సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భుయాన్ ఏకీభవించారు. వాన్‌పిక్ ప్రాజెక్టŠస్ లాంటి కృత్రిమ వ్యక్తిని ప్రాసిక్యూట్ చేసేందుకు అవసరమైన ప్రాథమిక ఆధారాలు లేవని, ఈ విషయాన్ని కింది కోర్టు పూర్తిగా విస్మరించిందన్న నిరంజన్‌రెడ్డి వాదనను సైతం జస్టిస్ భుయాన్ పరిగణలోకి తీసుకున్నారు. చార్జిషీట్‌ను కాగ్నిజెన్స్‌లోకి తీసుకోవడం అన్నది మెదడు ఉపయోగించి చేయాల్సిన ప్రక్రియ అని, అది యాంత్రికంగా చేసే ప్రక్రియ ఎంత మాత్రం కాదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని ప్రధాన న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. అలాంటప్పుడు నేరాన్ని ఆపాదించరాదు... ‘కాగ్నిజెన్స్ తీసుకునే విషయంలో మేజిస్ట్రేట్‌కు విస్తృత అధికారం ఉన్నప్పటికీ న్యాయపరంగా సహేతుక రీతిలో ఉపయోగించాలి. నేరం గురించి నిందితులకు అవగాహన కల్పించే విషయంలో కాగ్నిజెన్స్ అన్నది ఓ ప్రక్రియ అంటూ సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో స్పష్టంగా చెప్పింది. కాగ్నిజెన్స్ అన్నది మేజిస్ట్రేట్ ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలను, నమోదు చేసిన వాంగ్మూలాలను పరిగణలోకి తీసుకుని, నిందితులు చట్టాన్ని ఉల్లంఘించారా? లేదా? అన్న దానిపై దృష్టి సారించడానికే తప్ప, వ్యక్తులను కోర్టు ముందు హాజరుపరచడానికి, కోర్టు ముందుకు పిలిచేందుకు ఉపయోగించే యాంత్రిక ప్రక్రియ ఎంతమాత్రం కాదు. నేరపూరిత ఉద్దేశంతో కంపెనీ లేదా దానిని నడిపిస్తున్న వ్యక్తులు నేరం చేసినట్లైతే ఆ నేరానికి ఆ కంపెనీని, ఆ వ్యక్తులను బాధ్యులుగా చేయవచ్చు. అయితే ఏ ఏ సందర్బాల్లో అలా బాధ్యులుగా చేయవచ్చో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. కంపెనీ చేసిన నేరానికి ఆ కంపెనీని నడిపిస్తున్న వ్యక్తులను బాధ్యులుగా చేయాలంటే అందుకు చట్టం అనుమతినించి ఉండాలి. నేరంలో ఆ వ్యక్తుల పాత్ర ఉన్నట్లు నిర్దిష్ట ఆధారాలు ఉంటే, నేరానికి ఆ వ్యక్తులను బాధ్యులుగా చేయవచ్చు. ఈ సందర్భాల్లో మినహా మిగిలిన సందర్భాల్లో కంపెనీ చేసిన నేరానికి ఆ కంపెనీని నడిపిస్తున్న వ్యక్తులను యాంత్రికంగా బాధ్యులుగా చేయడానికి ఎంత మాత్రం వీల్లేదు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు తన తీర్పుల ద్వారా చాలా స్పష్టంగా చెప్పింది.’అని జస్టిస్ భుయాన్ స్పష్టం చేశారు. స్వతఃసిద్ధ అధికారాలను ఉపయోగించొచ్చు... ‘క్రిమినల్ కేసుల్లో నిందితులకు సమన్లు జారీ చేయడం అన్నది చాలా తీవ్రమైన విషయం. క్రిమినల్ లాను అమలు చేసే చర్య ఇది. సమన్లు జారీ చేయాలంటే, సంబంధిత మేజిస్ట్రేట్ నిందితులైన మేనేజింగ్ డైరెక్టర్, కంపెనీ సెక్రటరీ, ఇతర డైరెక్టర్లకు వ్యతిరేకంగా ప్రాథమికాధారాలు ఉన్నాయని సంతృప్తి చెందుతూ అందుకు కారణాలను నమోదు చేయాలి. ప్రస్తుత కేసులో కూడా సీబీఐ కోర్టు వాన్‌పిక్ ప్రాజెక్ట్స్, దాని చైర్మన్ నిమ్మగడ్డ ప్రసాద్‌కు వ్యతిరేకంగా ప్రాథమిక ఆధారాలున్నాయని సంతృప్తి చెందేందుకు ఎలాంటి కారణాలను నమోదు చేయలేదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కంపెనీ చేసిన నేరాన్ని దాని చైర్మన్‌కు ఆపాదించడానికి ఎంత మాత్రం వీల్లేదు. అంతిమ న్యాయం అందించేందుకు, న్యాయ ప్రక్రియ దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు హైకోర్టు సీఆర్పీసీ సెక్షన్ 482 కింద తనకున్న స్వతఃసిద్ధ అధికారాలను ఉపయోగించవచ్చు. ఈ అధికారాన్ని ఉపయోగించి క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను కొట్టేయవచ్చు. చైర్మన్‌గా నిమ్మగడ్డ ప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పొరేట్ సంస్థ అయిన వాన్‌పిక్ ప్రాజెక్టులపై క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు అనుమతినిచ్చినట్లయితే అంతిమ న్యాయం చేసినట్లు అవదు. అందువల్ల వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటూ నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో వాన్‌పిక్ ప్రాజెక్టులపై పెండింగ్‌లో ఉన్న కేసును కొట్టి వేస్తున్నాం’అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భుయాన్ తన తీర్పులో పేర్కొన్నారు. -
దాణ స్కాం కేసులో లాలూను దోషిగా తేల్చిన సీబీఐ కోర్టు
బిహార్: జార్ఖండ్‌లోని రాంచీలోని ప్రత్యేక సీబీఐ కోర్టు ఆర్జేడీ అధినేత బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌ను దాణా కుంభకోణానికి సంబంధించిన ఐదో కేసులో దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌తోసహా మొత్తం 110 మంది నిందితులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే జనవరి 29న డిఫెన్స్ తరపున వాదనలు పూర్తి చేసిన తర్వాత... సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. 1996లో వెలుగులోకి వచ్చిన ఈ దాణా కుంభకోణం కేసులో లాలు ప్రసాద్ యాదవ్‌ని సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా నిర్థారణ చేస్తూ తీర్పును వెలువరించింది. మంగళవారం సీబీఐ కోర్టు.. దాణ కుంభకోణంకి సంబంధించిన ఐదో కేసులో.. డోరాండా ట్రెజరీ నుండి రూ. 139.35 కోట్లు అక్రమంగా విత్‌డ్రా చేసిననట్లు నిర్ధారించింది. ఈ మేరకు సీబీఐ కోర్టు మొత్తం దాణా కుంభకోణానికి సంబంధించి ఐదు కేసుల్లో దోషిగా తేలిన లాలూ యాదవ్ మంగళవారం ఉదయం న్యాయమూర్తి సికె శశి తీర్పును చదివేటప్పుడు కోర్టు హాలులో ఉన్నారు. ఈ కేసులో మరో 98 మంది నిందితులు భౌతికంగా హాజరు కావాల్సి ఉండగా 24 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. మిగిలిన వారిలో మాజీ ఎంపీ జగదీష్ శర్మ, అప్పటి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్ ధ్రువ్ భగత్ సహా 35 మందికి మూడేళ్ల జైలు శిక్ష పడింది. ఈ కేసులో లాలూ యాదవ్‌తోపాటు మరో 39 మంది దోషులకు ఫిబ్రవరి 21న శిక్ష ఖరారు కానుంది. అయితే లాలు కి సంబంధించిన అన్ని కేసులు పశువుల మేత కోసం ఉద్దేశించిన ప్రభుత్వ నిధులను స్వాహా చేసినవే కావడం గమనార్హం. ఇప్పటివరకు ఆయన మొత్తం 14 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించారు. -
వామ్మో!! ఆరు టన్నుల లాంతర్ ఆవిష్కరణ!!
Lalu Prasad can inaugurate 6 ton lantern: ఈ రాజకీయ నాయకులు వినూత్నంగా చేసే కొన్ని పనులు భలే ఫేమస్ అవుతాయి. పైగా తమ అభిమాన నాయకుడే ఆవిష్కరించాలన్న ఉద్దేశంతో వారి పార్టీ శ్రేణులు కొన్నింటిని భలే విన్నూతన రీతిలో వస్తువులు లేదా భవనాలను తయారుచేయడం లేదా కట్టించడం వంటి పనులు చేస్తుంటారు. అచ్చం అలానే పాట్నాలోని ఆర్జేడీ ప్రధాన కార్యాలయంలో తమ అభిమాన నాయకుడు ఆవిష్కరించాలనే ఉద్దేశంతో ఒక భారీ లాంతరు ఏర్పాటు చేశారు. (చదవండి: 2070 నాటి కల్లా భారత్ కార్బన్ న్యూటల్ దేశంగా మారాలి: నితిన్ గడ్కరీ) అసలు విషయంలోకెళ్లితే....పాట్నాలోని ఆర్జేడీ ప్రధాన కార్యాలయంలో వారి పార్టీ చిహ్నం అయిన 6 టన్నుల కంటే ఎక్కువ బరువున్న ఒక భారీ లాంతరును ఏర్పాటు చేశారు. అంతేకాదు ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ త్వరలో లాంతరును ఆవిష్కరించే అవకాశం ఉన్నందున ఆ ప్రాంగణంలోకి ప్రవేశంపై నిషేధం కూడా విధించారు. అయితే ఈ లాంతర్ని తేజస్వి యాదవ్ అనే వ్యక్తి చొరవతోనే ఈ లాంతరును నిర్మించినట్లు ఆర్జేడీ కార్యకర్తలు చెబుతున్నారు. బంకా జిల్లా ట్రెజరీకి సంబంధించిన డబ్బు కుంభకోణం సంబంధించిన కేసు కోసం లాలు ప్రసాద్ యాదవ్ సీబీఐ అత్యున్నత న్యాయస్థానం ముందు హాజరై నిమిత్తం పాట్నా వస్తున్నారు. అందువల్ల ఆ సమయంలోనే ఈ ఆవిష్కరణ జరిగే అవకాశం ఉందని ఊహగానాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఆవిష్కరణతో పాటు పార్టీ అధినేత పాట్నా పర్యటన తర్వాత కుల గణన అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు. (చదవండి: ఇంట్లో వీల్‌చైర్‌లా... బయట స్కూటీలా) -
బెయిల్ రద్దు చేయలేం
సాక్షి, హైదరాబాద్: ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సీబీఐ ప్రత్యేక కోర్టులో చుక్కెదురైంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఎంపీ వి.విజయసాయిరెడ్డిల బెయిల్ రద్దు చేయలేమని ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. బెయిల్ మంజూరు సమయంలో విధించిన షరతులను వారు ఉల్లంఘించలేదని, బెయిల్ రద్దు చేసేందుకు సహేతుకమైన కారణాలేమీ లేవని తేల్చి చెప్పింది. ఈ మేరకు రఘురామ దాఖలు చేసిన రెండు పిటిషన్లను బుధవారం కొట్టివేసింది. గత మూడు నెలలుగా సుదీర్ఘ వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి బీఆర్ మధుసూదన్‌రావు ఈ మేరకు తీర్పునిచ్చారు. వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసమే.. ‘జగన్, సాయిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలంటూ తన వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసమే రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు. ఇది చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేయడమే. పిటిషన్ దాఖలు చేసిన తీరు, అందులో వాడిన బాష ఆయన దురుద్దేశాన్ని స్పష్టం చేస్తోంది. అవాస్తవాలు, తప్పుడు ఆరోపణలు, అభూత కల్పనలతో ఈ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టు రోజువారీ పద్ధతిలో కేసులను విచారిస్తోంది. నిందితులు దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటిషన్లపై వాదనలు వింటోంది. ఈ క్రమంలో విచారణను జాప్యం చేస్తున్నారంటూ రఘురామ పేర్కొనడం కోర్టు ధిక్కరణకు పాల్పడటమే అవుతుంది. అలాగే బెయిల్ మంజూరు సమయంలో ప్రత్యేక కోర్టు విధించిన షరతులను వారు ఎప్పుడూ ఉల్లంఘించలేదు. బెయిల్ షరతులు ఉల్లంఘించారని భావించినప్పుడు నిందితుల బెయిల్ రద్దు చేయాలని కోరే అధికారం ప్రాసిక్యూషన్ విభాగానికి మాత్రమే ఉంటుంది. థర్డ్‌పార్టీకి బెయిల్ రద్దు చేయాలని కోరే హక్కు లేదని అనేక కేసుల్లో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్‌ను కొట్టివేయండి..’అని జగన్, సాయిరెడ్డి తరఫు సీనియర్ న్యాయవాదులు ఎస్.నిరంజన్‌రెడ్డి, ఇ.ఉమామహేశ్వరరావు కోర్టును కోరారు. మరో కోర్టుకు బదిలీకి కారణాల్లేవు హైకోర్టులోనూ రఘురామకృష్ణరాజుకు ఎదురుదెబ్బ తగిలింది. వైఎస్ జగన్, విజయసాయిరెడ్డిల బెయిల్ రద్దు చేయాలంటూ తాను దాఖలు చేసిన పిటిషన్లను మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. బదిలీ చేయడానికి సహేతుకమైన కారణాలు లేవని స్పష్టం చేసింది. ఊహాగానాలతో రఘురామ ఈ పిటిషన్ దాఖలు చే శారని న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. రఘురామకృష్ణంరాజు పిటిషన్‌ను కొట్టివేస్తూ బుధవారం తీర్పునిచ్చారు. అలా చేయాలంటే నిర్దిష్టమైన కారణాలుండాలి ‘ఏదైనా పిటిషన్‌పై విచారణను ఒక కోర్టు నుంచి మరొక కోర్టుకు బదిలీ చేయాలంటే నేర విచారణ చట్టంలో పేర్కొన్న మేరకు నిర్దిష్టమైన కారణాలు ఉండాలి. జగన్ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన కేసులో రెండో నిందితునిగా ఉన్న విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చారన్న కారణాన్ని చూపుతూ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌ను మరో కోర్టుకు బదిలీ చేయాలని కోరడం సరికాదు. నిందితులు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ పిటిషన్లు దాఖలు చేసినప్పుడు అనుమతిస్తూ ఉండటం అనేది సహజంగా జరిగే ప్రక్రియ. బెయిల్ రద్దు కోరుతూ ఏప్రిల్‌లో సీబీఐ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే సీబీఐ కోర్టుపై నమ్మకం లేదంటూ ఆ పిటిషన్లపై ఆదేశాలు ఇవ్వడానికి ఒక రోజు ముందు హైకోర్టును ఆశ్రయించడం సరికాదు..’అని జస్టిస్ లక్ష్మణ్ స్పష్టం చేశారు. -
ఏసీబీ కోర్టులో ఓటుకు కోట్లు కేసు రేపటికి వాయిదా..
హైదరాబాద్: ఏసీబీ కోర్టులో ఓటుకు కోట్లు కేసు విచారణకు వచ్చింది. వేం నరేందర్‌రెడ్డి కుమారుడు కృష్ణ కీర్తన్‌రెడ్డి రేవంత్‌రెడ్డి మాజీ పీఏ సైదయ్య వాంగ్మూలం నమోదు చేశారు. తదుపరి విచారణ రేపటి(శుక్రవారం)కి వాయిదా వేశారు. కాగా తెలంగాణలో 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు కేసు వెలుగులోకి వచ్చింది. ఎన్నికల్లో తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిందిగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో టీడీపీ నేతలు బేరసారాలు సారించారనేది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. ఈ బేరసారాల్లో భాగంగా టీడీపీ నేత చంద్రబాబు మనవాళ్లు బ్రీఫ్డ్మీ అంటూ స్టీఫెన్‌సన్‌తో మాట్లాడినట్టు అభియోగాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి బయటికి వచ్చిన వీడియోలు అప్పట్లో సంచలనంగా మారాయి. ఈ కేసుకు సంబంధించి రేవంత్‌రెడ్డి కొద్ది రోజులు జైలులో ఉన్నారు. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల్లో రేవంత్‌రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. -
సిస్టర్ అభయ కేసు: దోషులకు జీవిత ఖైదు
తిరువనంతపురం: కేరళలోనే కాక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సిస్టర్ అభయ కేసులో సీబీఐ కోర్టు ఫాదర్ థామస్ కొట్టూర్, నన్ సెఫీని దోషులుగా తేల్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం సీబీఐ కోర్టు వీరికి శిక్ష ఖరారు చేసింది. ఫాదర్ థామస్ కొట్టూర్, నన్ సెఫీకి సీబీఐ కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెల్లడించింది. దాంతో పాటు చెరో ఐదు లక్షల రూపాలయ జరిమానా కూడా విధించింది. దాదాపు 28 ఏళ్ల పాటు కొనసాగిన ఈ కేసులో చివరికి నేడు కోర్టు దోషులకు శిక్ష విధించింది. 1993లో కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ ఘటన జరిగిన 12 ఏళ్ల తర్వాత సెయింట్ పియస్ కాన్వెంట్లో అధ్యాపకులుగా పనిచేస్తున్న థామస్ కొత్తూర్, జోస్ పుత్రుక్కయిల్‌తో పాటు ఓ సిస్టర్ను అరెస్ట్ చేసింది. ఇక నేడు సీబీఐ కోర్టు వారికి శిక్ష విధించింది. ఇక కుమార్తెకు న్యాయం జరగాలని పోరాడిన అభయ తలిదండ్రులు నాలుగేళ్ల క్రితమే మరణించారు. కోర్టు తీర్పుతో వారి ఆత్మలకు శాంతి చేకూరుతుందని స్నేహితులు భావిస్తున్నారు. (చదవండి: ‘ఉరి తీసినా ఆశీర్వాదంగానే భావిస్తాను’) ఇక సీబీఐ చార్జ్‌షీట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. మార్చి 27,1992న తెల్లవారుజామున 4.15గంటలకు సిస్టర్ అభయ తన హాస్టల్ గది నుంచి కిచెన్ వైపు వెళ్లింది. అక్కడ దోషులు థామస్ కొత్తూర్, జోస్ పుత్రుక్కయిల్ ఓ క్రైస్తవ సన్యాసినితో అభ్యంతరకర రీతిలో కనిపించారు. ఈ విషయం అభయ బయటపెడుతుందోమోనన్న భయంతో ఆమెపై దాడి చేసి హత్యకు పాల్పడ్డారు. అనంతరం మృతదేహాన్ని కాన్వెంట్ ప్రాంగణంలోని బావిలో పడేశారు. ప్రమాదవశాత్తు అభయ బావిలో పడి మరణించి ఉండవచ్చునని పోలీసులు తొలుత నిర్ధారించారు. కానీ మానవ హక్కుల కార్యకర్త జోమోన్ పుతెన్‌పురక్కల్ ఈ కేసును కోర్టులో సవాల్ చేయడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. -
28 ఏళ్ల తర్వాత సిస్టర్ అభయ హత్య కేసులో తీర్పు
సాక్షి, తిరువనంతపురం: కేరళలో 1992లో సంచలనం సృష్టించిన సిస్టర్ అభయ హత్య కేసులో సీబీఐ కోర్టు మంగళశారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఫాదర్ థామస్ కొట్టూర్, నన్ సెఫీని దోషులుగా తేల్చింది. రేపు(డిసెంబర్23) దోషులకు శిక్షలు ఖరారు చేయనున్నట్లు సీబీఐ కోర్టు వెల్లడించింది. 1992, మార్చి 27న కొట్టాయంలో సిస్టర్ అభయ హత్యకు గురైంది. సిస్టర్ అభయను ఫాదర్ థామస్, నన్ సెఫీ హత్య చేసినట్లు నికోర్టు నిర్ధారించింది. 28 ఏళ్ల తర్వాత అభయ హత్య కేసులో తీర్పు వెలువడింది. చదవండి: 9 కంపెనీలు.. 9 బ్యాంకులు.. రూ.9వేల కోట్లు కేసు వివరాలు.. 1992లో సిస్టర్ అభయ(21) కేరళలోని బీఎంసీ కళాశౠలలో సైకాలజీ కోర్సు చేస్తోంది. ఆ సమయంలో థామస్ కొట్టూరు సైకాలజీ అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో మార్చి 27న కొట్టాయంలోని సెయింట్ పియస్ ఎక్స్ కాన్వెంట్లో ఉన్న ఓ బావిలో అభయ శవమై తేలింది. ప్రమాదవశాత్తు అభయ బావిలో పడి మరణించి ఉండవచ్చునని పోలీసులు తొలుత నిర్దారించారు. కానీ మానవ హక్కుల కార్యకర్త జోమోన్ పుతెన్‌పురక్కల్ ఈ కేసును కోర్టులో సవాల్ చేయడంతో న్యాయస్థానం దీని విచారణను 1993లో సీబీఐకి అప్పగించింది. అనంతరం సిస్టర్ అభయ హత్యకు గురైందని సీబీఐ తేల్చింది. ఈ ఘటన జరిగిన 12 ఏళ్ల తర్వాత సెయింట్ పియస్ కాన్వెంట్లో అధ్యాపకులుగా పనిచేస్తున్న థామస్ కొత్తూర్, జోస్ పుత్రుక్కయిల్‌తో పాటు ఓ సిస్టర్ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. సీబీఐ చార్జిషీట్లో పేర్కొన్న వివరాల ప్రకారం... మార్చి 27,1992న తెల్లవారుజామున 4.15గంటలకు సిస్టర్ అభయ తన హాస్టల్ గది నుంచి కిచెన్ వైపు వెళ్లింది. అక్కడ థామస్ కొత్తూర్,జోస్ పుత్రుక్కయిల్ ఓ క్రైస్తవ సన్యాసినితో అభ్యంతరకర రీతిలో కనిపించారు. ఈ విషయం అభయ ఎక్కడ బయటపెడుతుందోమోనన్న భయంతో ఆమెపై దాడి చేసి హత్యకు పాల్పడ్డారు. అనంతరం మృతదేహాన్ని కాన్వెంట్ ప్రాంగణంలోని బావిలో విసిరేశారు. తమ కుమార్తెకు న్యాయం జరగాలని చాలాకాలంగా ఎదురుచూసిన అభయ తల్లిదండ్రులు నాలుగేళ్ల క్రితమే మరణించారు. ఎట్టకేలకు 28 ఏళ్ల తర్వాత ఈ కేసు ఓ కొలిక్కి వచ్చి థామస్. నన్ సెఫీని దోషులుగా తేల్చుతూ న్యాయస్థానం తీర్పిచ్చింది. -
‘అరుణ్ శౌరీపై క్రిమినల్ కేసు పెట్టండి’
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి అరుణ్ శౌరీతోపాటు, ప్రభుత్వ మాజీ ఉద్యోగి ప్రదీప్ బైజల్, హోటలియర్ జ్యోత్స్నా సూరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీబీఐ కోర్టు గురువారం ఆదేశాలిచ్చింది. రాజస్థాన్‌లోని ఉదయపూర్ లక్ష్మి విలాస్ ప్యాలెస్ హోటల్లో పెట్టుబడుల్లో అవినీతి జరిగిందన్న కేసులో అరుణ్ శౌరీని ప్రత్యేక సీబీఐ కోర్టు నిందితుడిగా పేర్కొంది. హోటల్ అమ్మకాన్ని తిరిగి ప్రారంభించాలని కోర్టు సూచించింది. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో పెట్టుబడుల మంత్రిగా అరుణ్ శౌరీ ఉన్న సమయంలో ప్రభుత్వానికి భారీ నష్టంతో ఈ హోటల్‌ను విక్రయించినట్లు గుర్తించింది. హోటల్ లక్ష్మి విలాస్ విలువ రూ.252 కోట్లకు పైగా ఉండగా.. కేవలం రూ.7.5 కోట్లకు అమ్ముడైందని కోర్టు తీర్పులో పేర్కొంది. కాగా, సీబీఐ కోర్టు తీర్పుపై రాష్ట్ర హైకోర్టుకు వెళ్తానని అరుణ్ శౌరీ స్పష్టం చేశారు. ప్యాలెస్ చరిత్ర ఇది ఫతే సాగర్ ఒడ్డున ఉన్నఈ ప్యాలెస్ ఉదయ్‌పూర్ రాజులకు చెందినది. రాజరిక పాలన చివరి రోజుల్లో ఈ ప్యాలెస్‌ని ప్రభుత్వానికి అప్పగించారు. భారత్ స్వతంత్ర దేశంగా మారిన తర్వాత ప్రభుత్వం దీనిని హోటల్‌గా నడిపింది. 2002లో దీనిని లలిత్ సూరి గ్రూప్ హోటల్స్ సంస్థ కొనుగోలు చేసింది. ఆసమయంలోనే కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని అభియోగాలు నమోదయ్యాయి. అయితే, సరైన ఆధారాలు లేవని 2019లో సీబీఐ కేసు మూసివేతకు నివేదిక సిద్ధం చేసింది. కానీ, జోధ్‌పూర్‌లోని ప్రత్యేక కోర్టు ఈ నివేదికను తిరస్కరించి తదుపరి దర్యాప్తునకు ఆదేశించింది. ప్రస్తుతం దీని లలిత్ లక్ష్మీ విలాస్ ప్యాలెస్ అని పిలుస్తున్నారు. లలిత్ సూరి మరణించడంతో సంస్థ బాధ్యతలు జ్యోత్స్నా సూరి నిర్వర్తిస్తున్నారు. (చదవండి: వైరల్: కూతురి డైట్‌పై తండ్రి సరదా కామెంట్) -
వీడని విధ్వంసం : బాబ్రీ కేసుకు డెడ్‌లైన్
సాక్షి, న్యూఢిల్లీ : హిందూవులు చిరకాల స్వప్నం అయోధ్య రామమందిర నిర్మాణానికి ఓ వైపు అడుగులు పడుతున్న వేళ.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీచేసింది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసును సెప్టెంబర్ 30లోపు పూర్తి చేయాలని లక్నో సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిని దేశ అత్యున్నత న్యాయస్థానం శనివారం ఆదేశించింది. విచారణ పూర్తి చేసి తుది తీర్పును కూడా వెలువరించాలని కోర్టు స్పష్టం చేసింది. కాగా గత ఏడాది ఇచ్చిన ఆగస్ట్ 31 వరకు గడువు ముగిస్తున్న నేపథ్యంలో సీబీఐ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి మరికొంత సమయం కావాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు. దీనికి సమ్మతించిన న్యాయస్థానం విచారణ గడువును మరో నెలపాటు పొడిగించింది. దీంతో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ కురు వృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ (92), అశోక్ సింఘాల్, మురళీ మనోహర్ జోషీ, ఉమాభారతి, వినయ్ కటియార్, గిరిరాజ్ కిషోర్, నాటి యూపీ సీఎం కళ్యాణ్సింగ్లకు కొంత ఊరట లభించింది. (బాబ్రీ కేసులో సీబీఐ కోర్టు ముందుకు అడ్వాణీ) కరసేవకులను రెచ్చగొట్టి కుట్రపూరితంగానే మసీదును కూల్చివేశారని (కుట్ర) ఆరోపణలు వీరు ఎదుర్కొంటున్నారు. దాదాపు 29 ఏళ్ల నుంచి కోర్టుల్లో విచారణ సాగుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీలతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరికొంత మంది వాగ్మూలాలను సీబీఐ నమోదు చేసింది. సుప్రీంకోర్టు తాజా ఉత్వర్వులతో విచారణ మరికొంత వేగంగా ముందుకు సాగనుంది. మరోవైపు 1992 నాటి బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో నిందితులుగా ఉన్న అద్వానీ.. ఆ కేసు నుంచి బయటపడేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. సీబీఐ కేసులో బీజేపీ అగ్రనేతలు.. 1992 డిసెంబర్ 6న సాయంత్రం (బాబ్రీ మసీదు కూల్చివేత) స్థానిక పోలీస్ స్టేషన్లో 198/92 నెంబర్‌తో మరో ఎఫ్ఐఆర్ నమోదైంది. వీరిలో బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ, అశోక్ సింఘాల్, మురళీ మనోహర్ జోషీ, ఉమాభారతి, వినయ్ కటియార్, గిరిరాజ్ కిషోర్, నాటి యూపీ సీఎం కళ్యాణ్‌సింగ్ కూడా ఉన్నారు. అయితే 2003 సెప్టెంబర్ 19న రాయ్‌బరేలీలోని స్పెషల్ మెడిస్ట్రేట్ అద్వానీ, జోషీలకు విచారణ నుంచి విముక్తి కల్పించింది. అయితే దీనిపై పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. 2017లో తీర్పును వెలువరిస్తూ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న అద్వానీ, జోషీ, ఉప భారతి, కళ్యాణ్ సింగ్‌లను కూడా విచారించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దీంతో సీబీఐ వీరందరినీ విచారిస్తోంది. కేసు విచారణ తుది దశతో ఉన్న నేపథ్యంలో.. నేరం రుజువైతే శిక్ష కూడా పడే అవకాశం ఉన్నట్లు న్యాయ నిపుణులు చెబుతున్నారు. తాజా ఆదేశాల ప్రకారం సెప్టెంబర్ 30న తుది తీర్పు వెలువడాల్సి ఉంది. -
‘ఉరి తీసినా ఆశీర్వాదంగానే భావిస్తాను’
న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తీర్పు గురించి తనకు ఎలాంటి పట్టింపు లేదన్నారు బీజేపీ నాయకురాలు ఉమా భారతి. తీర్పు ఎలా ఉన్నా.. దాన్ని అంగీకరిస్తానని ఆమె తెలిపారు. ఈ కేసులో కుట్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నాయకులలో ఉమా భారతి, ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఉమా భారతి మాట్లాడుతూ.. ‘నా స్టేట్మెంట్ కోసం కోర్టు నన్ను పిలిచింది. నిజం ఏంటో కోర్టుకు వెల్లడించాను. ఇక తీర్పు ఎలా వస్తుంది అనే దాని గురించి నాకు చింత లేదు. ఒక వేళ నన్ను ఉరి తీయాలనుకున్నా.. దాన్ని కూడా నేను ఆశీర్వాదంగానే భావిస్తాను. నా స్వస్థలంలో కూడా ఎంతో ఆనందిస్తారు’ అని తెలిపారు. (5 శతాబ్దాల సమస్య!) ఉమా భారతి ఈ నెల ప్రారంభంలో లక్నోలోని ప్రత్యేక సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ప్రముఖ బీజేపీ నాయకుడు ఎల్కే అడ్వాణీ (92) శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరుకాగా.. మురళీ మనోహర్ జోషి గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో తన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. సీబీఐ కోర్టు, రోజువారీ విచారణల ద్వారా, దర్యాప్తును పూర్తి చేసి, ఆగస్టు 31 లోగా తన తీర్పును ఇవ్వాలి.(బాబ్రీ మసీదు కేసులో కొత్త మలుపు) రామ మందిరం నిర్మాణం గురించి శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలపై ఉమా భారతి స్పందించారు. ‘కరోనా, మందిర నిర్మాణం ఈ రెండు అంశాలకు అసలు ఎలాంటి సంబంధం లేదు. వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు కోవిడ్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. వీరితో ఎలాంటి సంబధం లేని ట్రస్ట్ ఆలయ నిర్మాణం చేపడుతోంది. పవార్ వ్యాఖ్యలు వ్యతిరేక అర్థాన్ని సూచిస్తాయి. ఎలాంటి గొడవ జరగకుండా మందిర నిర్మాణం జరగడం వారికి నచ్చడం లేదు. ఆ ఆందోళనలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మోదీ జీ అయోధ్యలో ఉన్నప్పుడు పవార్ జీ.. ‘జై శ్రీరామ్.. జై రామ్’ అని పాడాలని నేను కోరుకుంటున్నాను’ అన్నారు ఉమా భారతి. -
బాబ్రీ కేసులో సీబీఐ కోర్టు ముందుకు అడ్వాణీ
న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రముఖ బీజేపీ నాయకుడు, మాజీ ఉప ప్రధాని, 92 ఏళ్ళ ఎల్కే అడ్వాణీ సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరవగా, ఆయన స్టేట్మెంట్ని రికార్డు చేశారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు, నాలుగున్నర గంటలపాటు జరిగిన ఈ విచారణలో, ఎల్కే అడ్వాణీని సీబీఐ ప్రత్యేక కోర్టు 100కు పైగా ప్రశ్నలను అడిగింది. అడ్వాణీ తనపై వచ్చిన అన్ని ఆరోపణలను తిరస్కరించారని, ఆయన తరఫు న్యాయవాది వెల్లడించారు. బుధవారం హోం మంత్రి అమిత్‌షా, ఎల్కే అడ్వాణీతో అరగంట పాటు సమావేశమయ్యారు. రోజువారీ విచారణ చేస్తున్న కోర్టు, ఆగస్టు 31లోగా తీర్పును ప్రకటించాల్సి ఉంది. -
సురేఖ హత్య కేసు.. హంతకునికి యావజ్జీవం
కర్ణాటక, యశవంతపుర: టెక్కీని హత్య చేసిన నిందితుడికి సీబీఐ కోర్టు యావజ్జీవ కారగార శిక్షతో పాటు రూ. లక్ష జరిమానా విధిస్తూ గురువారం తీర్పు చెప్పింది. 2010 డిసెంబర్ 17న టెక్కీ పాయల్ సురేఖను జిమ్ ఇన్స్ట్రక్టర్ జేమ్స్ కుమార్ రాయ్ జేపీ నగర 6వ స్టేజీ ఆర్బీఐ లేఔట్లో హత్య చేశాడు. వివరాలు... సురేఖ భర్త అనంత్‌నారాయణ మిశ్రా బెంగళూరు, భువనేశ్వర్‌లో జిమ్ నిర్వహిస్తున్నాడు. బెంగళూరులో పనిచేసే జిమ్‌లో రాయ్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేసేవాడు. సురేఖ సూచనల మేరకు రాయ్‌ను పనిలో నుంచి తొలగించాడు. దీంతో ఆమెపై ద్వేషం పెంచుకుని 2010 డిసెంబర్ 17న దంపతులు ఉంటున్న అపార్టుమెంట్‌కు వెళ్లి సురేఖను హత్య చేశాడు. హత్య చేయటానికి ముందు రెండు మూడు సార్లు నిందితుడు అపార్టుమెంట్‌కు వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఘటనా స్థలంలో సురేఖ వెంట్రుకలు, రక్తపు మరకలు నిందితుడు ఉపయోగించిన జాకెట్‌పై ఉండటంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే సురేఖను భర్త మిశ్రానే హత్య చేసి ఉంటాడని అనుమానించి బాధితురాలి కుటుంబ సభ్యులు ఆయనపై కూడా కేసు పెట్టారు. దీంతో కేసును సీబీఐకి అప్పగించాలని సురేఖ తల్లిదండ్రులు సుప్రీం కోర్టుకు వెళ్లారు. బెంగళూరులోనే చదువుకున్న సురేఖ, మిశ్రాలు 2008లో ప్రేమ వివాహం చేసుకున్నారు. సురేఖ ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ జేపీ నగరలో నివాసం ఉంటోంది. హత్యకేసును సీరియస్‌గా తీసుకున్న సీబీఐ అధికారులు అన్ని ఆధారాలు సేకరించి రాయ్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడికి సీబీఐ కోర్టు యావజ్జీవ శిక్షతో పాటు రూ. లక్ష జరిమానా విధించింది. -
‘ఇష్రాత్’ కేసులో మాజీ పోలీసులకు విముక్తి
అహ్మదాబాద్: ఇష్రాత్ జహన్‌ను బూటకపు ఎన్కౌంటర్ చేశారన్న ఆరోపణలపై దాఖలైన కేసులో మాజీ పోలీసు అధికారులు డీజీ వంజరా, ఎన్కే అమిన్‌లకు సీబీఐ ప్రత్యేక కోర్టులో ఊరట లభించింది. కేసు విచారణను నుంచి తమను తప్పించాలంటూ వంజరా, అమిన్‌లు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు అనుమతించింది. ఈ కేసులో విచారణ జరిపేందుకు గానూ సీబీఐకి గుజరాత్ ప్రభుత్వం అనుమతివ్వని నేపథ్యంలో కోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సీబీఐ విచారణకు ప్రభుత్వం అనుమతినివ్వలేదని.. దీంతో మాజీ పోలీసు అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు అనుమతిస్తున్నామని.. ఈ కేసులో వారికి వ్యతిరేకంగా ఏ చర్యలు తీసుకోరాదని ప్రత్యేక సీబీఐ కోర్టు న్యాయమూర్తి జేకే పాండ్యా చెప్పారు. -
సోహ్రబుద్దీన్ కేసు: నిందితులకు విముక్తి
సాక్షి, ముంబై : 2005లో సోహ్రబుద్దీన్ షేక్, తులసీరాం ప్రజాపతి ఎన్కౌంటర్ కేసులో మొత్తం 22 మంది నిందితులకు విముక్తి కల్పిస్తూ శుక్రవారం ముంబై కోర్టు తీర్పు వెలువరించింది. నిందితులపై నేరాన్ని రుజువు చేసేందుకు తగిన ఆధారాలు లేనందున వారిని కేసు నుంచి తప్పిస్తున్నట్టు సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి స్పష్టం చేశారు. గుజరాత్, రాజస్ధాన్‌లకు చెందిన పోలీస్ అధికారులే నిందితుల్లో అధికంగా ఉన్నారు. రాజకీయ, ఆర్థిక లబ్ధి కోసమే ఈ హత్యలకు కుట్ర జరిగిందని కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ ఆరోపించింది. ఇదే కేసులో సీబీఐ నిందితుడిగా చేర్చిన బీజేపీ చీఫ్ అమిత్ షాకు గతంలో కేసు నుంచి ఊరట లభించింది. ఆయన పాత్రపై ఆధారాలు లేనందున అమిత్ షాతో గుజరాత్ మాజీ డీజీపీ వంజరాలకు కేసు నుంచి కోర్టు విముక్తి కల్పించింది. ఈ కేసులో మొత్తం 210 మంది సాక్షులను కోర్టు విచారించగా వీరిలో 92 మంది అప్రూవర్లుగా మారారు. సోహ్రబుద్దీన్ అపహరణ, ఎన్కౌంటర్ బూటకమని నిరూపించేందుకు ప్రాసిక్యూషన్ గట్టిగా కృషి చేసినా సాక్షులు అప్రూవర్లుగా మారడంతో వారు నోరుమెదపలేదని, ఇందులో ప్రాసిక్యూషన్ తప్పేమీ లేదని కోర్టు పేర్కొంది. సోహ్రబుద్దీన్, తులసీరామ్ ప్రజాపతి కుటుంబాలకు న్యాయస్ధానం విచారం వెలిబుచ్చుతోందని, కోర్టులు కేవలం సాక్ష్యాల ఆధారంగానే పనిచేయాలని వ్యవస్థ, చట్టం నిర్దేశిస్తాయని తీర్పును చదువుతూ న్యాయమూర్తి జస్టిస్ ఎస్జే శర్మ వ్యాఖ్యానించారు. కాగా, ఈ కేసును తొలుత గుజరాత్ సీఐడీ విచారించగా తదుపరి 2010లో దర్యాప్తును సీబీఐకి బదలాయించారు. సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ సహా ఈ ఘటనలు జరిగిన సమయంలో గుజరాత్ హోంమంత్రిగా వ్యవహరించిన అమిత్ షాను నిందితుల్లో ఒకరిగా చేర్చగా ఆయనకు వ్యతిరేకంగా ఆధారాలు లేవంటూ 2014లో కేసు నుంచి విముక్తి కల్పించారు. అసలేం జరిగింది.. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ అప్పటి గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో ఆయన హత్యకు కుట్రపన్నిన సోహ్రబుద్దీన్ షేక్ 2005 నవంబర్‌లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించాడని గుజరాత్ పోలీసులు వెల్లడించారు. అదే ఏడాది నవంబర్ 22న సోహ్రబుద్దీన్, ఆయన భార్య కౌసర్ బి, సహచరుడు తులసీరాం ప్రజాపతిలు హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని సంగ్లీకి బస్సులో వెళుతుండగా గుజరాత్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సీబీఐ తెలిపింది. నాలుగు రోజుల తర్వాత సోహ్రబుద్దీన్‌ను అహ్మదాబాద్ వద్ద హతమార్చారని, అదృశ్యమైన కౌసర్ బీని నవంబర్ 29న బనస్కంత జిల్లాలోని ఓ గ్రామానికి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడి అనంతరం హతమార్చారని సీబీఐ ఆరోపించింది. ఇక 2006 డిసెంబర్ 27న గుజరాత్-రాజస్ధాన్ సరిహద్దుల్లో ఇరు రాష్ట్రాల పోలీసులు చాప్రి ప్రాంతం వద్ద కాల్చిచంపారని పేర్కొంది. అయితే ప్రజాపతిని ఓ కేసు విచారణ నిమిత్తం అహ్మదాబాద్ నుంచి రాజస్ధాన్‌కు తీసుకువెళుతుండగా పారిపోయేందుకు ప్రయత్నించగా అతడిని ఆపే క్రమంలో జరిపిన కాల్పుల్లో మరణించాడని పోలీసులు చెబుతున్నారు. నిర్ధోషులుగా బయటపడిన ప్రముఖులు సోహ్రబుద్దీన్ కేసులో బీజేపీ చీఫ్ అమిత్ షాతో పాటు గుజరాత్ పోలీసు అధికారి అభయ్ చుడాసమ, రాజస్ధాన్ మాజీ హోంమంత్రి గులాబ్‌చంద్ కటారియా, మాజీ గుజరాత్ డీజీపీ పీసీ పాండే, సీనియర్ పోలీస్ అధికారి గీతా జోహ్రి తదితరులున్నారు. ఇక తాజా తీర్పులో కేసు నుంచి విముక్తి పొందిన వారిలో అత్యధికులు గుజరాత్, రాజస్ధాన్‌లకు చెందిన దిగువస్ధాయి పోలీసు అధికారులే ఉండటం గమనార్హం. -
అగస్టా కేసు : సీబీఐ కస్టడీకి మైకేల్
సాక్షి, న్యూఢిల్లీ : అగస్టా వెస్ట్‌ల్యాండ్ కేసులో మధ్యవర్తిగా భావిస్తున్న క్రిస్టియన్ మైకేల్‌ను సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం బుధవారం ఐదు రోజుల పాటు సీబీఐ కస్టడీకి అనుమతించింది. అగస్టా కేసులో విచారణ కొనసాగుతోందని, ఈ డీల్‌లో రెండు దుబాయ్ ఖాతాలకు సొమ్మును చేరవేసినందున మైకేల్ కస్టడీ తమకు అవసరమని సీబీఐ న్యాయవాది కోర్టుకు నివేదించారు. మరోవైపు ప్రత్యేక న్యాయస్ధానంలో బెయిల్ కోరుతూ మైకేల్ పిటిషన్ దాఖలు చేసుకోగా ఆయనను ఐదు రోజులు సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ బెయిల్ పిటిషన్‌పై విచారణ తదుపరి చేపడతామని న్యాయస్ధానం పేర్కొంది. మైకేల్‌ను ఉదయం, సాయంత్రం గంట పాటు కలుసుకునేందుకు ఆయన న్యాయమూర్తికి కోర్టు అనుమతించింది. అగస్టా ఒప్పందంలో అభియోగాలు ఎదుర్కొంటున్న బ్రిటన్ పౌరుడు మైకేల్‌ను మంగళవారం రాత్రి దుబాయ్ ప్రభుత్వం భారత్‌కు అప్పగించిన సంగతి తెలిసిందే. అగస్టా కేసులో విచారణ జరుపుతున్న ముగ్గురు దళారీల్లో ఆయన ఒకరు. మరో ఇద్దరు మధ్యవర్తులు గైడో హస్కే, కార్లో గెరోసాలను ఈడీ, సీబీఐ విచారిస్తున్నాయి. మైకేల్‌కు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన తర్వాత ఆయనపై సీబీఐ, ఈడీ రెడ్‌కార్నర్ నోటీసు జారీచేయాలని కోరుతూ ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించాయి. కాగా, బ్రిటన్ జాతీయుడైన మైకేల్ అగస్టా వెస్ట్‌ల్యాండ్ కంపెనీ నుంచి రూ.225 కోట్ల ముడుపులు స్వీకరించినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) 2016లో చార్జిషీటు దాఖలు చేసింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పర్యవేక్షణలో చేపట్టిన ఆపరేషన్ మూలంగానే మైఖేల్‌ను భారత్‌కు అప్పగించేందుకు యూఏఈ అంగీకరించిందని సీబీఐ తెలిపింది -
బ్యాంక్ మేనేజర్‌కు జైలు
సాక్షి, హైదరాబాద్: బ్యాంకును మోసగించిన కేసులో హైదరాబాద్ అమీర్‌పేటలోని విజయా బ్యాంకు మేనేజర్ కె.దేవేందర్‌రావు, మరోవ్యక్తి ఎం.వెంకటేశ్వరరావుకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, భారీ జరిమానా విధిస్తూ సీబీఐ కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. ఈ మేరకు సీబీఐ కోర్టు అదనపు ప్రత్యేక జడ్జి బీవీఎల్ఎన్ చక్రవర్తి ఉత్తర్వులు జారీ చేశారు. బ్యాంక్ మేనేజర్ ఫోర్జరీ సంతకాలు, బోగస్ పత్రాల ఆధారంగా 12 మందికి ఇళ్ల రుణాలు మంజూరు చేశారు. రుణాల నిమిత్తం ఇచ్చిన బ్యాంక్ డ్రాఫ్ట్‌లను నగదుగా మార్పు చేసి రుణాలు పొందిన వారికి ఆ మొత్తాలను అందజేయడంలో వెంకటేశ్వరరావు సహకరించారు. ఫలితంగా బ్యాంకుకు రూ.90 లక్షలు నష్టం వచ్చిందంటూ 2006 జనవరి 4న సీబీఐ కేసు నమోదు చేసింది. విచారణ అనంతరం సీబీఐ కోర్టు బ్యాంక్ మేనేజర్ దేవేందర్‌రావు, వెంకటేశ్వరరావుకు ఐదేళ్ల కఠిన కారాగారం తోపాటుగా వీరిద్దరికీ వరుసగా రూ.3 లక్షలు, రూ.1.5లక్షల జరిమానాను విధించింది. అది చెల్లించకపోతే 6 నెలలు సాధారణ జైలు గడపాలని పేర్కొంటూ; 17 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. -
సీబీఐ కోర్టులో లొంగిపోయిన లాలూ
రాంచీ : పశుగ్రాస కుంభకోణం కేసుల్లో దోషిగా తేలడంతో జైలు శిక్ష అనుభవించేందుకు బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ గురువారం రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం ఎదుట లొంగిపోయారు. మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలు వెంటరాగా లాలూ సీబీఐ న్యాయస్ధానానికి చేరుకున్నారు. రాంచీ హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా ఆయన ఈ రోజు సీబీఐ న్యాయస్ధానంలో లొంగిపోయారు. లాలూకు వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం ఆసియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్ (ముంబై) వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై కోర్టుకు నివేదిస్తారని లాలూ న్యాయవాది ప్రభాత్ కుమార్ వెల్లడించారు. జార్ఖండ్ హైకోర్టు లాలూను త్వరగా ప్రత్యేక న్యాయస్ధానంలో లొంగిపోవాలని ఇటీవల ఆదేశించిన సంగతి తెలిసిందే. ముంబైలో మూడు వారాల పాటు వైద్య చికిత్సలు పొందిన లాలూ శనివారం అక్కడినుంచి పట్నా చేరుకున్నారు. లాలూ ప్రాధమిక బెయిల్‌ను పొడిగించేందుకు నిరాకరించిన జార్ఖండ్ హైకోర్టు ఆగస్ట్ 30లోగా సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానంలో లొంగిపోవాలని కోరింది. వైద్యపరమైన కారణాలతో మే 11న లాలూకు ఆరు వారాల ప్రాధమిక బెయిల్‌ను మంజూరు చేసిన హైకోర్టు ఆ తర్వాత పలు సందర్భాల్లో ఆగస్ట్ 27 వరకూ పొడిగించింది. మరోవైపు రాంచీ విమానాశ్రమయంలో పార్టీ అనుచరులతో కలిసి వెలుపలికి వచ్చిన లాలూ మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. తన ఆరోగ్యం బాగాలేదని, తానిప్పుడు మాట్లాడేదేమీ లేదన్నారు. -
30న సీబీఐ కోర్టులో లొంగిపోండి
రాంచీ: దాణా కుంభకోణం కేసుల్లో దోషి, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌కు జార్ఖండ్ హైకోర్టులో చుక్కెదురైంది. తాత్కాలిక బెయిల్‌ను పొడిగించేందుకు కోర్టు నిరాకరించింది. ఈనెల 30వ తేదీలోగా సీబీఐ కోర్టు ముందు లొంగిపోవాలని లాలూను ఆదేశించింది. దాణా కుంభకోణానికి సంబంధించిన 4 కేసుల్లో లాలూ దోషిగా తేలడంతో ఆయనకు సీబీఐ కోర్టు జైలు శిక్ష విధించడం తెల్సిందే. జైలులో లాలూ అనారోగ్యానికి గురి కావడంతో చికిత్సకోసం బెయిలివ్వాలంటూ హైకోర్టును కోరారు. దీంతో మే 11న ఆయనకు 6 వారాల తాత్కాలిక బెయిలిచ్చింది. తర్వాత ఆ బెయిల్‌ను పొడిగించింది. తాజాగా మరో 3 నెలలపాటు బెయిల్‌ను పొడిగించాలంటూ లాలూ కోరారు. అందుకు హైకోర్టు జడ్జి నిరాకరించారు. అవసరమైనప్పుడు వైద్యం అందించాలని జార్ఖండ్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. మరోవైపు, ఐఆర్సీటీసీ కుంభకోణం కేసులో లాలూ, ఆయన భార్య రబ్రీదేవిలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చార్జిషీట్ దాఖలు చేసింది. -
చిదంబరానికి ఊరట
న్యూఢిల్లీ: ఎయిర్‌సెల్–మ్యాక్సిస్ కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరంనకు ఊరట లభించింది. ఆయన్ను ఆగస్ట్ 7వ తేదీ వరకు అరెస్ట్ చేయరాదంటూ సీబీఐ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అదే విధంగా ఈ కేసుకు సంబంధించి చిదంబరం పెట్టుకున్న దరఖాస్తుకు 3 వారాల్లోగా బదులివ్వాలని స్పెషల్ కోర్టు జడ్జి సీబీఐను ఆదేశించారు. ఎయిర్‌సెల్–మ్యాక్సిస్ కేసులో చిదంబరంతోపాటు ఆయన కొడుకు కార్తీపై సీబీఐ చార్జిషీటు వేసింది. దీంతో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నందున ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. విదేశాలకు వెళ్లేందుకు కార్తీకి అనుమతి ఎయిర్‌సెల్–మ్యాక్సిస్, ఐఎన్ఎక్స్ మీడియా కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న చిదంబరం కొడుకు కార్తీ విదేశాలకు వెళ్లేందుకు సుప్రీంకోర్టు ఓకేచెప్పింది. వ్యక్తిగత కారణాల రీత్యా ఈనెల 23 నుంచి 31వ తేదీ వరకు బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికాలకు వెళ్లేందుకు కోర్టు షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేసింది. చిదంబరం కుటుంబంపై అసంతృప్తి సాక్షి ప్రతినిధి, చెన్నై: విదేశాల్లో ఉన్న ఆస్తుల వివరాలను దాచిన కేసులో చిదంబరం కుటుంబం విచారణకు హాజరు కాకపోవడాన్ని చెన్నై ఎగ్మూరు న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. భార్య నళిని, కొడుకు కార్తీ, కోడలు శ్రీనిధిలకు బ్రిటన్, అమెరికాలో ఉన్న ఆస్తులకు సంబంధించి నల్లధనం చట్టం కింద ఐటీ శాఖ కేసు వేసింది. ఈ కేసు సోమవారం విచారణకు రాగా ఆ ముగ్గురూ హాజరు కాలేదు. దీంతో వారిపై న్యాయమూర్తి మలర్విళి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈనెల 30వ తేదీన వారంతా తప్పనిసరిగా కోర్టుకు హాజరయ్యేలా చూడాలని ఆదేశించారు. -
యూరియా స్కాంలో 100 కోట్ల జరిమానా!
న్యూఢిల్లీ: 23 ఏళ్లనాటి రూ.133 కోట్ల యూరియా కుంభకోణంలో తీస్ హజారీ ప్రత్యేక సీబీఐ కోర్టు దోషులకు భారీ జరిమానాతోపాటు కఠిన కారాగార శిక్ష విధించింది. ఇద్దరు టర్కీ దేశస్తులకు ఆరేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.100 కోట్ల జరిమానా విధించింది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు బంధువు, మాజీ కేంద్ర మంత్రి తనయుడు సహా ఈ కేసుతో సంబంధమున్న భారతీయులకు భారీ జరిమానా విధించింది. టర్కీ దేశస్తులు టుంకే అలంకుస్, సిహాన్ కరాంచీ (వీరిద్దరూ కర్సాన్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు)లతోపాటు ఆ కంపెనీ భారతీయ ప్రతినిధి ఎం సాంబశివరావు, నేషనల్ ఫెర్టిలైజర్ లిమిటెడ్ (ఎన్ఎఫ్ఎల్) మాజీ సీఎండీ రామకృష్ణన్, ఎన్ఎఫ్ఎల్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దిల్బాగ్ సింగ్ కన్వర్, మల్లేశం గౌడ్, మాజీ కేంద్ర మంత్రి రామ్‌లఖన్ సింగ్ యాదవ్ కుమారుడు ప్రకాశ్ చంద్ర, మాజీ ప్రధాని పీవీ బంధువు సంజీవ రావు ఈ కేసులో దోషులుగా ఉన్నారు. రామకృష్ణ, కన్వర్‌లకు మూడేళ్ల జైలు, రూ.6లక్షల జరిమానా, సాంబశివరావుకు మూడేళ్ల జైలు, రూ.5కోట్ల జరిమానా, మల్లేశం గౌడ్‌కు మూడేళ్ల జైలు, రూ.5కోట్ల జరిమానా, సంజీవరావ్, యాదవ్‌లకు కోటి రూపాయల జరిమానా మూడేళ్ల జైలు శిక్ష విధించారు. కుంభకోణం కేసేంటి? ఈ కేసులో పేర్కొన్న వారంతా నేరపూరిత కుట్రతో ఎన్‌ఎఫ్‌ఎల్‌ను రూ.133 కోట్ల మేర మోసం చేశారంటూ 1996, మే 19న సీబీఐ కేసు నమోదు చేసింది. ‘టర్కీ దేశస్తుడైన అలంకుస్ ఎన్ఎఫ్ఎల్కు యూరియా సరఫరా చేసేందుకు కర్సాన్ లిమిటెడ్ కంపెనీ తరపున ఒప్పందం చేసుకున్నాడు. మెట్రిక్ టన్నుకు 190 డాలర్ల చొప్పున 2లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాకోసం ముందుగానే 100% చెల్లించాలని ఒప్పందంలో ఉంది. దీని విలువ దాదాపుగా రూ.133 కోట్లు. నవంబర్ 2, 1995న అలంకుస్కు 3.8లక్షల డాలర్లు బీమా అడ్వాన్స్‌గా చెల్లించారు. మిగిలిన 3.76 కోట్ల డాలర్లను కర్సాన్ కంపెనీ అకౌంట్లోకి 1995లో జమచేశారు. అయితే ఈ కంపెనీ ఎన్ఎఫ్ఎల్కు యూరియాను పంపలేదు. కుంభకోణం నేపథ్యం.. 1995,సెప్టెంబర్: యూరియా సరఫరాకు అంతర్జాతీయ టెండర్ల ఆహ్వానం 1996 మార్చి: టర్కీ కంపెనీ కార్సాన్కు రూ.133 కోట్ల చెల్లింపు 1996 మే: యూరియా సరఫరా చేయకపోవడంపై సీబీఐ విచారణకు ఆదేశం 1996 ఆగస్టు: కంభకోణంలో వెలుగులోకి పీవీ కొడుకు ప్రభాకర్ రావు పేరు 1998 నవంబర్: ప్రభాకర్ రావు అరెస్టు -
పీఎన్బీ స్కామ్ కేసు మోదీకి నాన్ బెయిలబుల్ వారెంట్
-
దినకరన్ సోదరి, బావలకు పీటీ వారెంట్
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే అమ్మ శిబిరం నేత, ఆర్కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ సోదరి సీతలాదేవి, బావ ఎస్ఆర్ భాస్కరన్లకు చెన్నై సిబిఐ కోర్టు పీటి వారెంట్ జారీ చేసింది. 2008లో సీతలాదేవి, భాస్కరన్‌లపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు అయింది. విచారణలో ఆధారాలతో సహా నిరూపితం కావడంతో సీతలాదేవికి మూడు, భాస్కరన్‌కు ఐదు సంవత్సరాల జైలు శిక్షను సిబిఐ కోర్టు విధించింది. దీనిపై వారు ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు చేసుకోగా చుక్కెదురైంది. దీంతో జైలు శిక్ష అనుభవించేందుకు కోర్టులో లొంగిపోయేందుకు వారికి అవకాశం కల్పించారు. అయితే, వారు లొంగిపోని దృష్ట్యా చెన్నై సిబిఐ కోర్టు శుక్రవారం సాయంత్రం పిటీ వారెంట్ జారీ చేసింది. ఆ ఇద్దరిని అరెస్టు చేయాలని సిబిఐను ఆదేశించింది. -
గడ్డిమేతకు మూడున్నరేళ్ల జైలు
రాంచీ: 21 ఏళ్ల నాటి దాణా కుంభకోణంలో బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్యాదవ్కు సీబీఐ కోర్టు మూడున్నరేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతోపాటుగా రూ.10 లక్షల జరిమానా కూడా లాలూ చెల్లించాలని సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి శివ్‌పాల్‌సింగ్ శనివారం తీర్పునిచ్చారు. లాలూ జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆర్నెల్లు అదనంగా జైల్లో గడపాల్సి ఉంటుంది. ఆర్జేడీ చీఫ్ సహా మరో ఏడుగురికి మూడున్నరేళ్ల పాటు జైలు శిక్ష, రూ. 10 లక్షల జరిమానా విధించారు. లాలూతోపాటుగా మరో 15 మంది దోషులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరయ్యారు. శనివారం మధ్యాహ్నం శిక్ష ఖరారుకు సంబంధించిన వాదనలు ముగియగా.. నాలుగు గంటలకు న్యాయమూర్తి శివ్‌పాల్‌సింగ్ తీర్పు చెప్పారు. ‘ఇటువంటి దోషులకు ఓపెన్ జైలు సరిగా సరిపోతుంది. ఎందుకంటే వాళ్లకు గతంలో ఆవులను పెంచిన అనుభవం ఉంది’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. డిసెంబర్ 23నే వీరిని కోర్టు దోషులుగా గుర్తించినప్పటికీ మూడ్రోజులుగా శిక్షల ఖరారు వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే. మరో 15 మందికీ శిక్షలు ఖరారు మోసం, నేరపూరిత కుట్ర, తప్పుడు పత్రాల వినియోగంతో నిధుల విడుదలతోపాటు ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద లాలూకు మూడున్నర ఏళ్ల జైలు శిక్ష విధించారని సీబీఐ న్యాయవాది వెల్లడించారు. అయితే, ఈ శిక్షను వచ్చే వారం జార్ఖండ్ హైకోర్టులో అప్పీలు చేయనున్నట్లు లాలూ తరపు న్యాయవాది చిత్తరంజన్ సిన్హా తెలిపారు. దేవ్‌గఢ్ ట్రెజరీకి సంబంధించిన కేసులో మరో 15 మందికీ ఐపీసీ, పీసీఏ (అవినీతి నిరోధక చట్టం) కింద ఆర్నెల్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్షలను కూడా న్యాయమూర్తి ప్రకటించారు. కుంభకోణం జరిగిన సమయంలో ప్రజాపద్దుల కమిటీ చైర్మన్‌గా ఉన్న జగదీశ్ శర్మకు ఏడేళ్ల జైలు, రూ. 20 లక్షల జరిమానా, ఆర్జేడీ నేత ఆర్కే రాణాకు ఆర్నెల్ల జైలు, రూ.10 లక్షల జరిమానా విధించారు. ముగ్గురు ఐఏఎస్ అధికారులు బెక్ జూలియస్, ఫూల్‌చంద్ సింగ్, మహేశ్ ప్రసాద్‌లకు మూడున్నరేళ్ల జైలు, రూ.5 లక్షల జరిమానాను న్యాయమూర్తి విధించారు. మాజీ ప్రభుత్వాధికారి కృష్ణ కుమార్‌కు ఏడేళ్ల జైలు, రూ. 20 లక్షల జరిమానా, మాజీ అధికారి సుబీర్ భట్టాచార్యకు మూడున్నరేళ్ల జైలు రూ. 10 లక్షల జరిమానా, సప్లయర్ మోహన్ ప్రసాద్‌కు ఏడేళ్ల జైలు, రూ. 10 లక్షల జరిమానా విధించారు. మిగిలిన వారికి కూడా దాదాపుగా ఇవే శిక్షలు పడ్డాయి. చట్టం ముందు అందరూ ఒకటే! లాలూ శిక్షపై బీజేపీ, జేడీయూ, కాంగ్రెస్‌లు స్పందించాయి. చట్టం ముందు అందరూ సమానులేనని బీజేపీ నేత షానవాజ్ వ్యాఖ్యానించారు. ‘కోర్టు తన పని తాను చేసింది. దేశ సంపదను దోచుకునే వారికి ఇదో కీలకమైన గుణపాఠం. ఎట్టకేలకు బిహార్ ప్రజలకు న్యాయం జరిగింది’ అని షానవాజ్ పేర్కొన్నారు. రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైందని.. రాజకీయ నేతలు ఇకపై తప్పు చేసేందుకు భయపడాల్సిందేనని జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగి పేర్కొన్నారు. లాలూ అరెస్టయినంత మాత్రాన ఆర్జేడీతో సంబంధాలు తగ్గే ప్రసక్తే లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. లౌకికవాదం, సామాజిక న్యాయం కోసం తమ పోరాటం సాగుతుందని వెల్లడించింది. కాగా, బీజేపీ, నితీశ్ కుమార్ కుట్రపన్ని మరీ లాలూను జైలుకు పంపారని ఆర్జేడీ ఆరోపించింది. బెయిల్ కోసం హైకోర్టుకెళ్తామని లాలూ కుమారుడు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తెలిపారు. జైలుకు రెండోసారి దాణా కుంభకోణంలో లాలూ జైలు శిక్ష అనుభవించటం ఇది రెండోసారి. 21 ఏళ్ల క్రితం దేవగఢ్ ట్రెజరీ నుంచి రూ.89.27 లక్షల నిధులను అక్రమంగా తీసుకున్నారనే కేసుపై లాలూ జైలుకెళ్తుండగా.. దంకా ట్రెజరీ నుంచి రూ.3.97 కోట్లు, చైబాసా ట్రెజరీ నుంచి రూ.36 కోట్లు, దోరండా ట్రెజరీ నుంచి రూ. 184 కోట్లు అక్రమంగా కొల్లగొట్టారనే 3 కేసుల్లోనూ లాలూ విచారణ ఎదుర్కొంటున్నారు. 1996లో పట్నా హైకోర్టు దాణా స్కామ్‌పై విచారణకు ఆదేశించగా.. దేవ్‌గఢ్ ట్రెజరీకి సంబంధించిన కేసులో 1997, అక్టోబర్ 27న 38 మందిపై సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. కాలక్రమేణా 11 మంది చనిపోగా, ముగ్గురు అప్రూవర్లుగా మారిపోయారు. -
ప్లీజ్.. తక్కువ శిక్ష విధించండి: లాలూ
రాంచీ: అనారోగ్యం, వయోభారం దృష్టిలో ఉంచుకుని మానవీయ కోణంలో తనకు తక్కువ శిక్ష విధించాలని బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ సీబీఐ కోర్టు న్యాయమూర్తిని కోరారు. దాణా కుంభకోణం కేసులో డిసెంబర్ 23 నుంచి బిర్సా ముండా జైలులో ఉంటున్న లాలూను సీబీఐ జడ్జి శివపాల్ సింగ్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించారు. తుది తీర్పు శనివారం చెప్తామని జడ్జి తమకు తెలియజేసినట్లు లాలూ తరఫు న్యాయవాది చిత్తరంజన్ చెప్పారు. అయితే, తనకు తక్కువ శిక్ష విధించాలంటూ జడ్జికి లాలూ లిఖితపూర్వకంగా విజ్ఞప్తి పంపారని లాయర్ తెలిపారు. దియోగర్ ట్రెజరీ నుంచి రూ.89.27లక్షలు అక్రమంగా డ్రా చేసిన కేసుకు సంబంధించి లాలూతోపాటు మరో 10 మందిపై కోర్టు విచారణ ఇప్పటికే పూర్తి చేసింది. -
సంచలన కేసు : లాలూకు శిక్ష ఖరారు వాయిదా
రాంచి : దావా కుంభకోణం కేసులో దోషిగా తేలిన బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ శిక్ష ఖరారు రేపటికి(గురువారానికి) వాయిదా పడింది. లాలూతో పాటు ఈ కుంభకోణంలో దోషిగా తేలిన 15 మందికి రేపే శిక్ష ఖరారు చేయనున్నట్టు సీబీఐ ప్రత్యేక కోర్టు పేర్కొంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దావా కుంభకోణం రెండో కేసులో వీరందరిని గతేడాది డిసెంబర్ 23న దోషులుగా తేలుస్తూ సీబీఐ స్పెషల్ కోర్టు తీర్పు ప్రకటించిన సంగతి తెలిసిందే. న్యాయవాది విందేశ్వరి ప్రసాద్ మరణించడంతో అతడి కేసు తీర్పును గురువారానికి వాయిదా వేస్తున్నట్లు రాంచీ స్పెషల్ సీబీఐ కోర్టు తెలిపింది. మరోవైపు ఈ కేసు విషయంలో కోర్టు ధిక్కార చర్యలకు పాల్పడ్డారంటూ రఘువన్ష్ ప్రసాద్ సింగ్, తేజస్వి యాదవ్, మనోజ్ ఝాలకు సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. వీరు ముగ్గురు ఈ నెల 23న కోర్టుకు హాజరుకావాలంటూ సీబీఐ ప్రత్యేక కోర్టు నోటీసులు పంపింది. దీనిపై స్పందించిన మనోజ్ ఝా ఈ కేసు తీర్పు గురించి తాము ఒక్క మాట మాట్లాడకపోయినా కోర్టు తమకు నోటీసులు పంపడం దారుణమని అన్నారు. దోషిగా తేలిన అనంతరం నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ రాంచిలోని బిర్సా ముంద్రా సెంట్రల్ జైలులో ఉన్నారు. దావా కుంభకోణం తొలి కేసులో కూడా లాలూ దోషిగా తేలారు. కానీ సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం రెండో కేసు విచారణలోనూ లాలూ దోషే అని తేలింది. మొత్తం ఈ కుంభకోణానికి సంబంధించి 5 కేసులు నమోదయ్యాయి. 1991-96 కాలంలో దియోగఢ్(ప్రస్తుతం జార్ఖండ్‌లో ఉంది) ట్రెజరీ నుంచి దాణా కోసం రూ.84.5 లక్షలకుపైగా అక్రమంగా డ్రాచేశారు. లాలూతో పాటు 22 మందిపై సీబీఐ అభియోగాలు దాఖలు చేసింది. 1997, అక్టోబర్ 27న దీనిపై సీబీఐ చార్జిషీట్ దాఖలుచేసింది. ఈ కేసు విచారణ జరుగుతున్న కాలంలో 11మంది చనిపోగా, ముగ్గురు అప్రూవర్లుగా మారిపోయారు. -
దాణా కేసులో లాలూ దోషి
-
సంచలన తీర్పుపై లాలూ స్పందన
రాంచీ : దాణా కుంభకోణం కేసులో సీబీఐ వెలువరిచిన సంచలన తీర్పుపై లాలూ ప్రసాద్ యాదవ్ స్పందించారు. తనను దోషిగా తేల్చడంపై లాలూ బీజేపీపై మండిపడ్డారు. బీజేపీ డర్టీ గేమ్ ఆడుతుందంటూ విమర్శల వర్షం కురిపించారు. కోర్టు తీర్పు ఏకపక్షంగా ఉందని.. న్యాయకోసం తమ పోరాటం కొనసాగిస్తామంటూ పేర్కొన్నారు. చివరికి న్యాయమే గెలుస్తుందంటూ చెప్పుకొచ్చారు. నిజం చెప్పులేసుకునే లోపే.. అబద్ధం సగం ప్రపంచాన్ని చుట్టి వస్తుందంటూ ఆరోపించారు. కోర్టు తీర్పు ఓ రాజకీయ ఎత్తుగడ మాత్రమే అంటూ లాలూ ప్రసాద్ పార్టీ ఆర్జేడీ కూడా మండిపడుతోంది. సాక్ష్యాలను తారుమారు చేశారని, ఈ కేసులో న్యాయం కోసం హైకోర్టుకు వెళ్తామంటూ పేర్కొంది. కాగ, నేడు వెలువరిచిన దాణ కుంభకోణం కేసులో లాలూని సీబీఐ స్పెషల్ కోర్టు దోషిగా తేల్చింది. లాలూతో పాటు 15 మందిని దోషులుగా తేల్చింది. లాలూ ప్రసాద్ యాదవ్‌ను కోర్టులోనే అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. రాంచీ జైలుకు ఆయన్ను తరలించనున్నారు. జనవరి 3న లాలూకు శిక్ష ఖరారు చేయనున్నారు. 1991-96 కాలంలో దియోగఢ్(ప్రస్తుతం జార్ఖండ్‌లో ఉంది) ట్రెజరీ నుంచి దాణా కోసం రూ.84.5 లక్షలకుపైగా అక్రమంగా డ్రా చేసిన క్రమంలో సీబీఐ ఈ కేసు నమోదుచేసింది. 1997, అక్టోబర్ 27న దీనిపై సీబీఐ చార్జిషీట్ దాఖలుచేసింది. ఈ కేసు విచారణ జరుగుతున్న కాలంలో 11మంది చనిపోగా, ముగ్గురు అప్రూవర్లుగా మారిపోయారు. -
దాణా స్కామ్ కేసులో సంచలన తీర్పు
-
దాణా కుంభకోణం కేసులో సంచలన తీర్పు
రాంచీ : దాణా కుంభకోణం కేసులో బిహార్ బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌ను దోషిగా తేల్చుతూ రాంచీలోని సీబీఐ స్పెషల్ కోర్టు శనివారం సంచలన తీర్పు వెలువరించింది. ఈ తీర్పు వెలువడే క్రమంలో లాలూ ప్రసాద్ యాదవ్, తన కొడుకు తేజస్వి యాదవ్‌తో కలిసి కోర్టుకు హాజరయ్యారు. ఆర్జేడీ కార్యకర్తలు కూడా భారీ ఎత్తున్న కోర్టు వచ్చారు. రెండు దశాబ్దాల అనంతరం ఈ కేసుపై నేడు సీబీఐ కోర్టు ఈ తీర్పు వెలువరించింది. అయితే బిహార్ మరో మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రను సీబీఐ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. జగన్నాథ్ మిశ్రాతో పాటు ఏడుగురిని నిర్దోషులు ప్రకటించగా.. లాలూతో సహా 15 మందిని దోషులుగా తేల్చింది. లాలూ ప్రసాద్ యాదవ్‌ను కోర్టులోనే అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. రాంచీ జైలుకు ఆయన్ను తరలించనున్నారు. జనవరి 3న లాలూకు శిక్ష ఖరారు చేయనున్నారు. 2013లో ఓ కేసులో లాలూకు ఐదేళ్ల జైలు శిక్ష పడగా.. ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనపై అనర్హత వేటు పడింది. ఇప్పటికే అనర్హత వేటు ఎదుర్కొంటున్న లాలూకు ఈ తీర్పు మరింత ప్రతికూలంగా మారింది. 1991-96 కాలంలో దియోగఢ్(ప్రస్తుతం జార్ఖండ్‌లో ఉంది) ట్రెజరీ నుంచి దాణా కోసం రూ.84.5 లక్షలకుపైగా అక్రమంగా డ్రాచేసినట్లు బిహార్ మాజీ సీఎంలు లాలూ, జగన్నాథ మిశ్రాలతో సహా 22 మందిపై సీబీఐ అభియోగాలు దాఖలు చేసింది. 1997, అక్టోబర్ 27న దీనిపై సీబీఐ చార్జిషీట్ దాఖలుచేసింది. ఈ కేసు విచారణ జరుగుతున్న కాలంలో 11మంది చనిపోగా, ముగ్గురు అప్రూవర్లుగా మారిపోయారు. -
కేంద్రం మెడకు '2జీ'!
న్యూఢిల్లీ: తాజాగా 2జీ స్పెక్ట్రమ్ కేసు తీర్పుతో కేంద్ర ప్రభుత్వం చిక్కుల్లో పడేటట్లు కనిపిస్తోంది. 2జీ కుంభకోణం కేసు అంతా ఊహాజనితమేనని, అభియోగాలకు సంబంధించి ఎలాంటి ఆధారాలూ లేనందున అందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ ఢిల్లీలోని ప్రత్యేక సీబీఐ కోర్టు తీర్పునివ్వటం తెలిసిందే. దీంతో 2జీ కుంభకోణం కేసులో అభియోగాలు ఎదుర్కొన్న వారితోపాటు, సుప్రీంకోర్టు తీర్పు కారణంగా టెలికం లైసెన్స్‌లు కోల్పోయిన కంపెనీలు పరిహారం కోరుతూ న్యాయబాట పట్టే అవకాశాలు లేకపోలేదని న్యాయనిపుణులు అంటున్నారు. టెలికం వివాదాల పరిష్కార అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు (టీడీ శాట్) లేదా అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ను ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. లూప్ టెలికం... 2జీ కేసులో వాదించిన న్యాయనిపుణుల అభిప్రాయాల ప్రకారం... లూప్ టెలికం కంపెనీ తాను దేశవ్యాప్త లైసెన్స్ కోసం చెల్లించిన రూ.1,658 కోట్లను తిరిగి చెల్లించాలని కోరుతూ 2012లోనే టీడీ శాట్‌ను ఆశ్రయించింది. 22 టెలికం సర్కిళ్లకూ కలిపి దేశవ్యాప్త లైసెన్స్ ఫీజు రూ.1,658 కోట్లుగా ఉంది. ఈ ఫీజుతోపాటు లైసెన్స్ రద్దు చేసిన దరిమిలా తమ ప్రతిష్టకు జరిగిన నష్టానికి గాను మరో రూ.1,000 కోట్లు కూడా ఇప్పించాలని లూప్ టెలికం డిమాండ్ చేసింది. ఈ వాదనను టీడీ శాట్ కొట్టేసింది. ‘మీపై నేరపూరిత విచారణ’ పెండింగ్‌లో ఉందని టీyీ శాట్ నాడు పేర్కొంది. నిర్ధోషులు అంటూ ఇప్పుడు సీబీఐ ప్రత్యేక కోర్టు క్లీన్చిట్ ఇచ్చినందున ఈ సంస్థ మరోసారి పరిహారం కోసం డిమాండ్ చేసే అవకాశాలున్నాయి. టెలినార్, ఎతిసలాట్ కూడా... విదేశీ టెలికం సంస్థలైన టెలినార్, ఎతిసలాట్, లూప్ టెలికంలో ఇన్వెస్ట్ చేసిన విదేశీ సంస్థలు (ఇందులో కొన్ని గతంలో ఆర్బిట్రేషన్‌కు ప్రయత్నించాయి) కూడా పరిహారం కోరే అవకాశాలున్నాయని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ద్వైపాక్షిక పెట్టుబడుల ఒడంబడికలకు లోబడి ఆర్బిట్రేషన్ మార్గాన్ని చాలా వరకు విదేశీ కంపెనీలు ఎంచుకునే అవకాశాలున్నాయని ఓ న్యాయవాది అభిప్రాయం తెలిపారు. టెలికం కార్యకలాపాల కోసం చేసిన పెట్టుబడులు, గడువు ప్రకారం కార్యకలాపాలు ప్రారంభించలేకపోయినందున ప్రభుత్వానికి చెల్లించిన పెనాల్టీలతోపాటు పరిహారం కూడా చెల్లించాలని డిమాండ్ చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. భారత్‌లో టెలికం వ్యాపారంపై భారీగా ఇన్వెస్ట్ చేసిన టెలినార్ కూడా గతంలో కేంద్ర సర్కారుకు నోటీసులు జారీ చేసింది. 1.4 బిలియన్ డాలర్ల నష్ట పరిహారం చెల్లించాలని సింగపూర్‌తో మన దేశం చేసుకున్న సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం కింద కోరింది. రద్దయిన స్పెక్ట్రమ్ కోసం చేసిన చెల్లింపులను తిరిగి వెనక్కిచ్చేందుకు కేంద్రం అంగీకరించడంతో నోటీసును వెనక్కి తీసుకుంది. ఆ తర్వాత టెలినార్ పలు సర్కిళ్లలో మళ్లీ లైసెన్స్‌లు దక్కించుకుంది. చివరికి తన వ్యాపారాన్ని భారతీ ఎయిర్‌టెల్‌కు అమ్మేసి వెళ్లిపోయిన టెలినార్ భారత్‌లో వ్యాపారం కారణంగా రూ.10,000 కోట్లను నష్టం కింద రద్దు చేసుకుంది. అలాగే, లూప్ టెలికంలో పెట్టుబడులు పెట్టిన ఖైతాన్ హోల్డింగ్స్ అయితే, 2జీ లైసెన్స్‌లను రద్దు చేసిన కారణంగా తమకు 2.5 బిలియన్ డాలర్లను నష్ట పరిహారం కింద చెల్లించాలని కోరుతూ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ను ఆశ్రయించింది. తుది తీర్పు అనంతరమే... ‘‘పరిహారం కోసం కేసుల నమోదుకు ఈ తీర్పు వీలు కల్పిస్తుంది. కాకపోతే, అదంతా తుది తీర్పు తర్వాతే వీలవుతుంది. ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని ఇప్పటికే నిర్ణయించింది. కనుక కంపెనీలు దేశంలో వ్యాపార ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్లే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించొచ్చు’’ అని ఓ టెలికం కంపెనీకి చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ పేర్కొన్నారు. సుప్రీం తీర్పునకు భిన్నంగా... ఐదేళ్ల క్రితం సుప్రీంకోర్టు 122 లైసెన్స్‌లను రద్దు చేసింది. అయితే, తాజాగా సీబీఐ కోర్టు తీర్పు, సుప్రీం తీర్పులోని అంశాలను ప్రతిఫలించడం లేదని మరి కొందరు న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. మొదట వచ్చిన వారికి మొదట ప్రాతిపదికన లైసెన్స్‌ల కేటాయింపు అన్నది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ఉల్లంఘన అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నిష్పక్షపాతంగా ఉందని అద్వైతా లీగల్ సంస్థ పార్ట్నర్ అతుల్‌దువా అన్నారు. ప్రజలకు ధర్మకర్త అయిన ప్రభుత్వం సహజన వనరులను మొదట వచ్చిన వారికి మొదట ప్రాతిపదిక పేరుతో అసమంజసంగా పంపిణీ చేసిందని సుప్రీంకోర్టు నాటి తీర్పులో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. -
2జీ స్కామ్ లేకపోతే మోదీ, కేజ్రివాల్ ఎక్కడుండేవారు!?
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో రాజకీయంగా, ఆర్థికంగా ప్రకంపనలు సష్టించిన ‘2జీ స్పెక్ట్రమ్’ స్కామ్ కేసుపై ఏళ్ల తరబడి సుదీర్ఘంగా విచారణ జరిపిన అనంతరం ఇందులో స్కామూ లేదు, గీము లేదంటూ ప్రత్యేక సీబీఐ కోర్టు తేల్చి చెప్పడం పట్ల సర్వత్రా దిగ్భ్రాంతి వ్యక్తం అవుతోంది. ఈ స్కామ్ వల్ల కేంద్ర ప్రభుత్వం ఖజానాకు దాదాపు 1.76 లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని కాగ్ నివేదిక పేర్కొనడం, ఇదే స్కామ్‌పై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని పురస్కరించుకొని 122 టెలికామ్ లైసెన్స్‌లను సుప్రీం కోర్టు రద్దు చేయడం సంగతి ఏమిటీ? 122 టెలికామ్ లైసెన్స్‌లను రద్దు చేయడం వల్ల అనేక కంపెనీలు నష్టపోయాయి. కొన్ని కంపెనీలు పూర్తిగా దివాలాతీసి కంపెనీలనే మూసివేశాయి? వాటి సంగతేమిటీ? వాటికి జరిగిన నష్టాన్ని ఇప్పుడు ఎవరు భర్తీ చేస్తారు? అందుకు ఎవరు బాధ్యత వహిస్తారు? లైసెన్స్‌ల రద్దు ప్రభావం 5.3 కోట్ల టెలిఫోన్ కనెక్షన్లపై ప్రభావం చూపిందన్నది ఓ అంచనా. ఆ నష్టానికి ఎవరు బాధ్యులు ? టైమ్ మేగజైన్ పది అత్యంత అధికార దుర్వినియోగం కేసుల్లో ఒకటిగా పేర్కొన్న ‘2జీ స్పెక్ట్రమ్’ కారణంగా అప్రతిష్టపాలైన యూపీఏ ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు? కేవలం ఈ కుంభకోణం కారణంగానే అవినీతి నిర్మూలన నినాదంతో 2014 పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రజల ముందుకు రావడం, ఆ పార్టీకి ప్రజలు పట్టం కట్టారన్న విషయం తెల్సిందే. ఇలా ఓ ప్రభుత్వాన్నే మార్చేసిన కుంభకోణం కేసులో ఏమీ లేదని కోర్టు తేల్చడం వల్ల ఏర్పడిన శూన్యాన్ని ఎవరు భర్తీ చేశారు ? 2జీ స్కామ్ కారణంగానే దేశంలోని అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్మించిన అన్నా హజారే ఇప్పుడు కోర్టు తీర్పు సరైనదేనంటూ సమర్థించడం ఎంతవరకు సబబు? ఆయన ఉద్యమం నుంచే అరవింద్ కేజ్రీవాల్, ఆయన పార్టీ పుట్టుకొచ్చిన విషయం తెల్సిందే. అసలు 2జీ స్కామ్ అనేది అప్పుడే లేకపోతే నేడు ప్రధానిగా మోదీ, ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రివాల్ ఉండేవారు కాదేమో! -
బొగ్గు స్కామ్‌లో మధు కోడాను దోషిగా తేల్చిన కోర్టు
-
మాజీ ముఖ్యమంత్రిని దోషిగా తేల్చిన కోర్టు
సాక్షి, న్యూఢిల్లీ : బొగ్గు బ్లాకుల కేటాయింపు కుంభకోణంలో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడాను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం దోషిగా ప్రకటించింది. బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సీ గుప్తా, జార్ఖండ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్ బసులతో పాటుగా మరొకరిని కోర్టు బుధవారం దోషులుగా తేల్చింది. కోర్టు వీరిని రేపు (గురువారం) శిక్షలు ఖరారు చేయనుంది. కాగా కోల్‌కతాకు చెందిన సంస్థకు బొగ్గు బ్లాకుల కేటాయింపునకు సంబంధించి కోడాతో పాటు మాజీ ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్ బసు, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సీ గుప్తా, మరో ఐదుగురిపైనా చార్జిషీట్ దాఖలు అయిన విషయం తెలిసిందే. -
శశికళ భర్తకు జైలు శిక్ష : వెంటనే ఆస్పత్రి పాలు
సాక్షి, చెన్నై : శశికళ భర్త నటరాజన్ మరోసారి ఆస్పత్రి పాలయ్యారు. పన్ను ఎగవేత కేసులో ట్రయల్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సమర్థిస్తూ మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే ఆయన మళ్లీ అనారోగ్యం పాలయ్యారు. దీంతో నటరాజన్‌ను వెనువెంటనే ఆస్పత్రికి తరలించారు. నటరాజన్ ఇటీవలే చెన్నై హాస్పిటల్లో కిడ్నీ ఆపరేషన్‌తో పాటు, కాలేయ మార్పిడి చేయించుకున్నారు. అయితే ప్రస్తుతం ఆయన ఏ వ్యాధితో ఆసుపత్రి పాలయ్యారో ఇంకా తెలియరాలేదు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత పదవిలో ఉన్న కాలంలో నటరాజన్ తమిళనాడు ప్రభుత్వంలో బ్యూరోక్రాట్‌గా పనిచేసేవారు. అనంతరం నటరాజన్, శశికళ ఇద్దరూ పోయెస్ గార్డెన్‌లోకి మారిపోయారు. నటరాజన్‌తో పాటు మరో ముగ్గురు కూడా కుట్ర, మోసం, ఫోర్జరీ, పన్ను ఎగవేతలకు పాల్పడ్డారని తెలిసింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న కొత్త కారు సెకండ్‌హ్యాండ్ అని చెప్పి కస్టమ్ శాఖను మోసగించడంతో నటరాజన్‌తో పాటు, శశికళ అక్క కుమారుడు భాస్కరన్, మరో ఇద్దరికీ సీబీఐ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ శిక్షలను మద్రాస్ హైకోర్టు సమర్థించింది. 1994 సెప్టెంబర్ 6వ తేదీన నటరాజన్ లండన్ నుంచి లెక్సెస్ అనే లగ్జరీకారును తమిళరసి పబ్లికేషన్ పేరిట దిగుమతి చేసుకున్నారు. కాగ, తమిళనాడు మాజీ సీఎం జయలలిత నివాసమైన పోయెస్ గార్డెన్‌లోని వేద నిలయంలో శుక్రవారం రాత్రి ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జయ, శశికళ వ్యక్తిగత గదుల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. -
టీడీపీ నేత ‘కందికుంట’కు ఐదేళ్ల జైలు
సాక్షి, హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) డిమాండ్ డ్రాఫ్ట్(డీడీ)లతో రూ.కోట్లు డ్రా చేసుకున్న కేసులో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గ ఇన్చార్జి కందికుంట వెంకట ప్రసాద్‌కు ఇక్కడి సీబీఐ కోర్టు ఐదేళ్ల జైలుశిక్ష విధించింది. అదే సమయంలో రూ.5.10 లక్షల జరిమానా కూడా విధించింది. ఇదే కేసులో ఎస్బీఐ హుస్సేనీఆలం బ్రాంచ్ అసిస్టెంట్ మేనేజర్ నరసింగరావుకు ఐదేళ్లు జైలుశిక్ష, రూ.45 వేల జరిమానా, అప్పటి సబ్ ఇన్స్పెక్టర్ వెంకటమోహన్‌కు మూడేళ్ల జైలుశిక్ష, రూ.35 వేల జరిమానా విధిస్తూ సీబీఐ కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. గతంలో హైదరాబాద్ సనత్‌నగర్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ)ను కూడా ఇదే రీతిలో మోసం చేసిన కేసులో కందికుంటకు ఏడేళ్ల జైలుశిక్ష వి«ధిస్తూ 2016లో కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. కేసు పూర్వాపరాలివీ..: కాగా 2003లో ఎస్బీఐ హుస్సేనీఆలం బ్రాంచ్ అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేసిన నరసింగరావు ఉన్నతాధికారులకు తెలియకుండా బ్యాంకు నుంచి ఖాళీ డీడీలు తీసుకొచ్చారు. వీటిని ఆ ప్రాంతంలో ఎస్.ఐ.గాపనిచేస్తున్న వెంకటమోహన్‌కు ఇచ్చారు. వాటిని ఆయన కందికుంట ప్రసాద్‌కు అందచేశారు. ఈ ఖాళీ డీడీలతో పెద్ద మొత్తంలో డబ్బు డ్రా చేయాలన్న కుట్రకు కందికుంట తెరతీశారు. ఆ డీడీల్లో కొన్నింటిని నగదుగా మార్చుకోకపోవడంపై అనుమానం వచ్చిన బ్యాంకు మేనేజర్ సీబీఐకి ఫిర్యాదు చేశారు. సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. తీర్పు అనంతరం నిందితులను చర్లపల్లి జైలుకు తరలించారు. -
టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు ఐదేళ్ల జైలు శిక్ష
సాక్షి, హైదరాబాద్: డీడీల ఫోర్జరీ కేసులో మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌కు సీబీఐ కోర్టు ఐదేళ్ల జైలుశిక్ష విధించింది. కందికుంటతో పాటు మరో ఇద్దరికి జైలుశిక్ష విధించింది సీబీఐ కోర్టు. వివరాలివి.. హుస్సేనీ అలం ఎస్బీఐలో నకిలీ డీడీలతో మోసం చేసినట్లు కందికుంటపై ఆరోపలున్నాయి. ఈ కేసును సీబీఐ కోర్టు విచారణ చేసింది. కందికుంటతోపాటు అసిస్టెంట్ మేనేజర్ నర్సింగరావుకు ఐదేళ్లు శిక్ష, ఇన్స్పెక్టర్ వెంకటమోహన్‌కు మూడేళ్లు శిక్ష విధిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. కందికుంట వెంకట ప్రసాద్ 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా కదిరి నియోజక వర్గం నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు. -
టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు ఐదేళ్ల జైలు శిక్ష
-
నవంబర్ 6 నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర!
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ అప్రజాస్వామిక, ప్రజావ్యతిరేక విధానాలు, హామీల అమలులో పూర్తి వైఫల్యంతో అన్ని వర్గాల ప్రజలు కష్టాల సుడిగుండంలో చిక్కుకున్న నేపథ్యంలో... వారికి అండగా ఉంటూ భరోసా కల్పించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తలపెట్టిన పాదయాత్ర నవంబర్ ఆరో తేదీనుంచి ప్రారంభం కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్ర ప్రజలకు భరోసాగా తాను పాదయాత్ర చేస్తున్నందున ఆరునెలల పాటు కోర్టుకు వ్యక్తిగత హాజరునుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని జగన్ సీబీఐ కోర్టును అభ్యర్థించారు. అందుకు అనుమతించని సీబీఐ కోర్టు ప్రతి శుక్రవారం హాజరుకావాలని సోమవారం పేర్కొంది. ఈ నేపథ్యంలో పాదయాత్ర చేపట్టేందుకు ముందు నిర్ణయించిన రెండో తేదీ గురువారం కావడం, మరునాడే శుక్రవారం రావడంతో యాత్ర తేదీలో స్వల్ప మార్పులు చేసినట్లు పార్టీవర్గాల సమాచారం. చేపట్టిన మరునాడే పాదయాత్ర నిలిచిపోయేలా కాకుండా మూడు, నాలుగు రోజులు కొనసాగింపు ఉండేందుకు వీలుగా నవంబర్ ఆరో తేదీ నుంచి యాత్రను చేపట్టాలని పార్టీ నిర్ణయించిందని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. ఈ మేరకు జగన్ పాదయాత్రకు రెండు రోజుల ముందు తిరుమలకు వెళ్లి శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని, అనంతరం కడప దర్గా, కడప చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసి అనంతరం పాదయాత్రను చేపట్టనున్నారని ఆయన వివరించారు. జగన్ పిటిషన్ కొట్టివేత సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 2 నుంచి పాదయాత్ర ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రతీ శుక్రవారం జరిగే విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపునివ్వాలన్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అభ్యర్థనను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తిరస్కరించింది. ప్రతీ శుక్రవారం జరిగే విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో కేసులపై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ప్రతీ శుక్రవారం విచారణ జరుపుతోంది. ఈ విచారణకు జగన్‌తో పాటు మిగిలిన వారందరూ వ్యక్తిగతంగా హాజరు కావాల్సి వస్తోంది. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలతో పాటు సామాన్యుల కష్టనష్టాలను తెలుసుకునేందుకు నవంబర్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయనున్న నేపథ్యంలో తనకు ఆరు నెలల పాటు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునివ్వాలని కోరుతూ జగన్ ఇటీవల సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు తన బదులు తన న్యాయవాది హాజరయ్యేందుకు అనుమతినివ్వాలని సీఆర్పీసీ సెక్షన్ 371 కింద దాఖలు చేసిన పిటిషన్లో కోర్టును కోరారు. దీనిపై విచారణ జరిపి తీర్పును వాయిదా వేసిన ప్రత్యేక న్యాయస్థానం సోమవారం తన నిర్ణయాన్ని వెలువరించింది. -
అక్టోబర్ 25న తేలనున్న స్పెక్ట్రమ్ కేసులు
సాక్షి, న్యూఢిల్లీః 2జీ స్పెక్ట్రం కేసులు ఎట్టకేలకు కొలిక్కివచ్చాయి. ఈ కేసుల్లో తుది విచారణను సీబీఐ కోర్టు అక్టోబర్ 25న చేపట్టనుంది. స్పెక్ట్రం కేటాయింపుల కేసులో మాజీ టెలికాం మంత్రి ఏ రాజా, డీఎంకే రాజ్యసభ సభ్యులు కనిమొళి ఇతరులు నిందితులుగా ఉన్నారు. కేసులో సమర్పించిన పత్రాలు భారీగా ఉండటం, సాంకేతిక అంశాలతో ముడిపడిన క్రమంలో వీటిని ఇంకా పరిశీలించాల్సి ఉందని విచారణను వాయిదా వేస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి ఓపీ సైనీ పేర్కొన్నారు. తదుపరి విచారణ సందర్భంగా తీర్పును ఎప్పుడు వెలువరించేదీ వెల్లడిస్తామని చెప్పారు. స్పెక్ర్టం కేసులకు సంబంధించి రెండు వేర్వేరు కేసులను కోర్టు విచారిస్తుంది. వీటిలో ఒక కేసును సీబీఐ, మరో కేసును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు నిర్వహించాయి. ఏప్రిల్ 26న కోర్టులో ఈ కేసులపై తుది వాదనలు ముగిశాయి. 2జీ స్పెక్ట్రం కేటాయింపుల్లో మాజీ మంత్రి రాజా కొన్ని టెలికాం సంస్థల పట్ల పక్షపాత వైఖరి ప్రదర్శించడంతో ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని సీబీఐ ఆరోపిస్తోంది. -
నేను నపుంసకుడిని: గుర్మీత్
-
నేను నపుంసకుడిని: గుర్మీత్
సాక్షి, న్యూఢిల్లీ/చండీగఢ్ : అత్యాచారాల కేసులో 20 ఏళ్ల జైలుశిక్షకు గురైన ఆధ్యాత్మిక గురువు, డేరా సచ్ఛా సౌధా అధినేత గుర్మీత్ సింగ్ విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడించాడు. కీలకాంశం ఏంటంటే.. శిక్ష నుంచి బయటపడేందుకు తానో నపుంసకుడినని ఈ రాక్‌స్టార్ బాబా చెప్పుకున్నారు. అయితే తాను 1990 నుంచి నపుంసకుడిగా మారానని, అలాంటిది 1999 ఆగస్ట్, సెప్టెంబర్ నెలలో తాను ఇద్దరు మహిళలను అత్యాచారం చేశానన్నది అసత్య ప్రచారమేనని పేర్కొన్నారు. అసలు ఆ ఆరోపణల్లో ఇసుమంతైనా నిజంలేదని సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణలో భాగంగా జస్టిస్ జగ్దీప్ కుమార్‌కు ఆయన చెప్పుకొచ్చారు. తాను అమాయకుడినని, ఎలాంటి తప్పులు చేయలేదని న్యాయమూర్తికి విన్నవించుకున్నా ప్రయోజనం లేకపోయింది. గుర్మీత్ చెప్పేవన్నీ అసత్యాలేనని సీబీఐ న్యాయస్థానం గుర్తించింది. మీకు ఇద్దరు కూతుళ్లున్నారు కదా.. దీనిపై మీ సమాధానం ఏంటని ప్రశ్నించగా గుర్మీత్ మౌనం వహించినట్లు సమాచారం. ఆపై ఈ కేసులో బాధితురాలు గుర్మీత్ గురించి మరిన్ని విషయాలు తెలిపారు. అశ్రమంలో తమపై జరిగిన లైంగిక దాడుల గురించి ఇంట్లో వాళ్లకు చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని గుర్మీత్ బెదిరించేవారని చెప్పారు. కుటుంబ సభ్యులను హత్య చేయిస్తానని పలుమార్లు హెచ్చరించినట్లు కోర్టుకు బాధితురాలు వెల్లడించారు. నిందితుడు బాబాకు ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నట్లు చెప్పడంతో పాటు బాధితురాలి ఫిర్యాదు వివరాలను పరిశీలించిన తర్వాతే సీబీఐ కోర్టు గుర్మీత్‌కు 20 ఏళ్ల జైలుశిక్షతో పాటుగా ఒక్కో కేసులో రూ. 15 లక్షల చొప్పున జరిమానా విధించిన విషయం తెలిసిందే. -
ఈ ఉన్మాదం ఇంకెన్నాళ్లు?
విశ్వాసాలతో ముడిపడిన హింసకు సంబంధించి నెలరోజుల వ్యవధిలో మూడోసారి ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడవలసి వచ్చింది. ప్రత్యేకించి హరియాణా, పంజాబ్, ఢిల్లీల్లో భయానక హింస జరగడానికి కారణమైన బాబా గుర్మీత్ సింగ్ ఉదంతంలో ఆయన మూడు రోజుల వ్యవధిలోనే రెండో దఫా మాట్లాడక తప్ప లేదు. విశ్వాసాల కోసం చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు ఏ ఒక్కరికీ లేదని ‘మన్ కీ బాత్’లో జాతినుద్దేశించి మాట్లాడుతూ హెచ్చరించారు. ఏ దేశంలోనైనా పౌరు లందరికీ సమానంగా వర్తించే చట్టాలే ఉంటాయి. ఆ చట్టాలను ఎంత ఉన్నతస్థాయి లోని వారైనా, సామాన్యులైనా గౌరవించాల్సిందే. అవి తమకు వర్తించబోవని చెప్పినా, ఆ చట్టాలున్న సంగతే తమకు తెలియదని చెప్పినా అది చెల్లదు. ఒక వ్యక్తి లేదా గుంపు చట్టాన్ని ఉల్లంఘించే అవకాశం ఉన్నదని సమాచారం అందినప్పుడు దాన్ని నిరోధించడం... అయినా చోటు చేసుకుంటే తగిన విధంగా స్పందించి చర్య లకు ఉపక్రమించడం శాంతిభద్రతల యంత్రాంగం చేయాల్సిన పని. ఇదంతా సవ్యంగా అమలవుతున్న చోట ఎవరూ వికృత పోకడలకు పోయే ప్రయత్నం చేయరు. సాధారణ పౌరుల్లో సైతం ప్రభుత్వాలపట్ల నమ్మకమూ... చట్టాలంటే గౌరవమూ ఏర్పడతాయి. కానీ డేరా సచ్చా సౌదా అధిపతి బాబా గుర్మీత్‌సింగ్ రెండు అత్యాచారం కేసుల్లో, ఒక హత్య కేసులో శిక్షార్హుడని చెప్పిన వెంటనే మూడు రాష్ట్రాలు భగ్గున మండాయి. 38మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా వందలాదిమంది గాయపడ్డారు. భారీయెత్తున ఆస్తులు విధ్వంస మయ్యాయి. హింసోన్మాదం ఏ స్థాయిలో ఉన్నదంటే నేరస్తుడికి ఎంత శిక్ష పడిందో ప్రకటించడానికి సోమవారం న్యాయస్థానమే జైలుకు తరలవలసి వచ్చింది. పంజాబ్, హరియాణాల్లో ఇంటర్నెట్ సేవలను నిషేధించారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పునివ్వడానికి మూడు రోజుల ముందునుంచే హరియాణా, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంభాషించడం ప్రారంభించారు. ముందు జాగ్రత్త చర్యలను సూచించారు. కానీ జరి గిందేమిటి? వందలాదిమంది వీధుల్లోకొచ్చి వీరంగం వేస్తుంటే ప్రభుత్వాలు నిస్సహాయమయ్యాయి. పంజాబ్ ఎంతో కొంత నయం. హరియాణా అయితే పూర్తిగా చేష్టలు డిగిపోయింది. ఇలాంటి దుస్థితి అంతర్జాతీయంగా మన పరువును బజారుకీడుస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే నరేంద్రమోదీ అంతగా స్పందిం చారు. హింసాకాండ చెలరేగిన శుక్రవారం రాత్రే ఆయన మూడు ట్వీట్లు చేశారు. హింసను తీవ్రంగా ఖండించడంతోపాటు పరిస్థితిని ప్రభుత్వం సమీక్షిస్తున్నదని ప్రజలకు హామీ ఇచ్చారు. రెండోసారి ఆదివారం ‘మన్ కీ బాత్’లో ఆయన పరోక్షంగా డేరా విధ్వంసాన్ని ప్రస్తావించారు. తప్పు చేసినవారిని వదిలేది లేదని హెచ్చరించారు. గత నెలలో ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు జరిగిన అఖిలపక్ష సమావేశంలో సైతం ఆవు పేరిట వివిధ ప్రాంతాల్లో సాగుతున్న దాడుల గురించి ఆందోళన వ్యక్తంచేశారు. గాంధీ పుట్టిన గడ్డపై జన్మిం చామన్న స్పృహను కూడా ఈ హింసకు పాల్పడేవారు కోల్పోతున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వాలు పకడ్బందీగా ఉన్నచోట, చట్టపాలన సవ్యంగా సాగుతున్నచోట ప్రైవేటు వ్యక్తులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే సాహసం చేయరు. అది లేకపోబట్టే కొందరు చెలరేగుతున్నారు. సాక్షాత్తూ డిప్యూటీ అడ్వొకేట్ జనరల్ స్థాయిలో ఉన్న వ్యక్తి శిక్షపడిన గుర్మీత్‌తో కలిసి న్యాయస్థానానికి రావడం మాత్రమే కాదు... ఆయనగారి సూట్‌కేసును కూడా మోశారంటే కారణమెవరు? గుర్మీత్‌ను అదుపులోకి తీసుకోవడానికెళ్లిన పోలీసులను ఆయనకు భద్రత కల్పిస్తున్న కమాండోలు ప్రతిఘటించడం దేన్ని సూచిస్తోంది? స్వయంగా కేంద్ర హోంమంత్రి చాలా ముందుగా సీఎంలతో మాట్లాడినా ఫలితం లేకపోవడం ఎందువల్ల? అన్నిటికీ ఒకటే జవాబు... పాలకులు సక్రమంగా లేకపోవడం వల్ల! పదిహేనేళ్ల క్రితం అప్పటి ప్రధాని వాజపేయికి ఇద్దరు మహిళలు రాసిన లేఖ రాస్తే, దానిపై విచారణ జరిపించాలని ఆయన సీబీఐకి ఆదేశాలిస్తే నేరగాడికి శిక్ష పడటానికి ఇన్నేళ్లుపట్టింది. ఈలోగా ఆ ఇద్దరు మహిళలకూ సాయపడ్డాడన్న అనుమానంతో డేరా సంస్థల వ్యవహారాలు చూసే మేనేజర్ ఒకరిని ‘గుర్తు తెలియని వ్యక్తులు’ హతమార్చారు. ఆ ఉదంతంపై పరిశోధన సాగించే పాత్రికేయుడు సైతం అదే తరహాలో ప్రాణాలు కోల్పోయాడు. వీటితోపాటు అనేక ఘటనలకు సంబంధించి నమోదైన కేసుల్లో గుర్మీత్ నిందితుడు. కానీ పాలకులుగా ఉన్నవారు మాత్రం ఈ పదిహేనేళ్లనుంచీ ఆయన ఆశ్రమం ముందు సాగిలపడ్డారు. నోరారా కీర్తించారు. ఆయనతో వేదికలు పంచుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నరరూప రాక్షసుడు నయీముద్దీన్‌తో అధికారంలో ఉన్నవారు అంటకాగినట్టే ఇదంతా సాగింది. స్వయంగా వాజపేయి స్థాయి నాయకుడే తనకొచ్చిన ఫిర్యాదులు చూసి ఆందో ళనపడి విచారణకు ఆదేశించినా ఆ పార్టీకి చెందిన నేతలకు జ్ఞానోదయం కాలేదు. అప్పట్లో విపక్షంగానూ, ఆ తర్వాత అధికార పక్షంగానూ ఉన్న కాంగ్రెస్ నేతలు సైతం అలాగే ప్రవర్తించారు. కనీసం శిక్షపడ్డాకైనా గుర్మీత్ ప్రవర్తనను తప్పు బట్టలేకపోయారు సరిగదా...బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ ఆయన ‘గొప్ప ఆత్మ’ అంటూ పొగిడారు. గోరక్షణ పేరుతో ఏర్పడి, హింసకు పాల్పడే బృందాలకు సైతం ఇలాంటి ప్రశంసలే లభిస్తున్నాయి. అందువల్లే ప్రధాని పదేపదే చెప్పినా ఫలితం ఉండటం లేదు. హింసకు పాల్పడేవారిని వెనువెంటనే అరెస్టు చేయలేక పోవడం, చేసినా కఠినమైన సెక్షన్లకింద కేసులు పెట్టలేకపోవడం చాలాచోట్ల కనబడుతోంది. కనుక ప్రకటనలతో సరిపెట్టకుండా సీఎంల, హోంమంత్రుల సమావేశం ఏర్పాటుచేసి చట్టబద్ధ పాలనపై శ్రద్ధవహించాలన్న సంగతి ప్రధాని గుర్తుచేయాలి. పార్టీలకతీతంగా వ్యవహరించమని హితవుచెప్పాలి. సంతృప్తిక రంగా లేనివారి లోపాలు ఎత్తి చూపాలి. లేనట్టయితే ఇలాంటి ఉదంతాలకు అంతూ పొంతూ ఉండదు. -
గుర్మీత్‌కు జైలు: అనూహ్య మలుపు
-
గుర్మీత్‌కు జైలు: అనూహ్య మలుపు
రోహతక్: డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రాం రహీమ్ సింగ్ కేసు తీర్పులో మరో ట్విస్ట్. లైంగిక వేధింపుల కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు పదేళ్ల జైలు శిక్ష విధించినట్టు మీడియా ప్రచారం చేసింది. అయితే ఆయనకు 20 ఏళ్లు జైలు శిక్ష విధించినట్టు తేలింది. రెండు కేసుల్లో దోషిగా తేలిన ఆయనకు ఒక్కో కేసులో కోర్టు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించిందని సీబీఐ అధికార ప్రతినిధి అభిషేక్ దయాళ్ వెల్లడించారు. ఈ రెండు శిక్షలు దాని తర్వాత ఒకటి అమలు చేస్తారని వెల్లడించారు. ఈ విషయాన్ని గుర్మీత్ సింగ్ తరపు న్యాయవాదులు కూడా ధ్రువీకరించారు. అయితే రెండు శిక్షలు ఒకేసారి అమలవుతాయని గుర్మీత్ సింగ్ తరపు లాయర్ ఎస్కే నార్వానా అన్నారు. శిక్షతో పాటు రూ.15 లక్షల చొప్పున మొత్తం రూ. 30 లక్షల న్యాయస్థానం జరిమానా విధించిందని తెలిపారు. రూ. 14 లక్షల చొప్పున మొత్తాన్ని ఇద్దరు బాధితురాళ్లకు ఇవ్వాలని కోర్టు ఆదేశించినట్టు చెప్పారు. తీర్పు పాఠం పూర్తిగా చదివిన తర్వాత ఉన్నత న్యాయస్థానాల్లో కచ్చితంగా అప్పీలు చేస్తామని ప్రకటించారు. 15 ఏళ్ల క్రితం తన ఆశ్రమంలో ఇద్దరు మహిళలను అత్యాచారం చేసిన కేసులో గుర్మీత్ దోషిగా ఇదివరకే నిర్ధారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు.. ఆ మేరకు సోమవారం మధ్యాహ్నం కఠిన శిక్షను ఖరారు చేసింది. తీర్పు సందర్భంగా గుర్మీత్ చేతులు కట్టుకుని తనను క్షమించి వదిలేయాలని న్యాయమూర్తిని వేడుకున్నారు. ప్రాథమిక కథనాలు: అత్యాచారం కేసులో గుర్మీత్‌కు కఠిన శిక్ష గుర్మీత్ సింగ్ కేసు: జడ్జి ఏమన్నారంటే? తీర్పుపై బాబా రాందేవ్ స్పందన ఇలా... 'ఎంతో మంది జీవితాలను నాశనం చేశాడు' -
గుర్మీత్ సింగ్ కేసు: జడ్జి ఏమన్నారంటే?
-
గుర్మీత్ సింగ్ కేసు: జడ్జి ఏమన్నారంటే?
రోహతక్: లైంగిక వేధింపుల కేసులో డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రాం రహీమ్ సింగ్‌కు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం పదేళ్ల కఠిన కారాగార శిక్ష జైలు శిక్ష విధించింది. తీర్పు సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ జగదీప్ సింగ్ పలు అంశాలు ప్రస్తావించారు. ఇది క్షమించరాని నేరమని పేర్కొన్నారు. తనను నమ్మి వచ్చిన అమాయకులపై అత్యాచారానికి పాల్పడడం దారుణమని వ్యాఖ్యానించారు. గుర్మీత్ రాం రహీమ్ సింగ్‌కు జీవితఖైదు విధించాలని బాధితురాలు కోరినట్టు వెల్లడించారు. తనను క్షమించాలన్న గుర్మీత్ విజ్ఞప్తిని జడ్జి తోసిపుచ్చారు. గుర్మీత్‌ను సాధారణ ఖైదీలాగే చూడాలని ఆదేశించారు. అతడిని వీఐపీలాగా చూడటంతో పోలీసులపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపిస్ట్‌కు అదనపు సౌకర్యాలు కల్పిస్తారా అని చివాట్లు పెట్టారు. కాగా, కోర్టు తీర్పుపై బాధితురాలు అసంతృప్తి వ్యక్తం చేశారు. గుర్మీత్‌కు పదేళ్ల జైలు శిక్ష సరిపోదని అన్నారు. గుర్మీత్ సింగ్ చేసిన సేవలను దృష్టిలో పెట్టుకుని నిరపరాధిగా విడిచిపెట్టాలని లేదా శిక్షను తగ్గించాలని ఆయన తరపు న్యాయవాది చేసిన వాదనను కోర్టు తోసిపుచ్చింది. జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించగానే గుర్మీత్ సింగ్ కోర్టులోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. కోర్టు హాలు నుంచి బయటకు రావడానికి నిరాకరించడంతో ఆయనను పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి జైలుకు తరలించారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఖైదీ దుస్తులు ఇవ్వనున్నారు. తర్వాత జైల్లో సెల్ కేటాయిస్తారు. -
రేప్ కేసులో దోషిగా తేలిన గుర్మీత్ సింగ్
- సంచలన తీర్పు చెప్పిన పంచకుల సీబీఐ కోర్టు - హరియాణ, పంజాబ్‌లో హై అలర్ట్.. రోడ్లపైనే బాబా అనుచరులు పంచకుల: దేశవ్యాప్తంగా తీవ్ర ఉంత్కంఠ రేపిన అత్యాచారాల కేసులో పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తనను తాను దేవుడి అవతారంగా చెప్పుకునే గుర్మీత్ సింగ్ అలియాస్ బాబా గుర్మీత్ సింగ్ రాం రహీంను అత్యాచారం కేసులో దోషిగా తేలారు. 2002లో గుర్మీత్ తన ఆశ్రమంలో సాధ్విలుగా ఉన్న ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడినట్లు సాక్ష్యాధారాలున్నాయన్న కోర్టు.. అతను ముమ్మాటికీ శిక్షార్హుడేనని పేర్కొంది. అయితే గుర్మీత్‌కు విధించే శిక్షలను సోమవారం ఖరారు చేయనున్నట్లు న్యాయమూర్తులు తెలిపారు. కోర్టు తీర్పును అనుసరిస్తూ హరియాణా పోలీసులు.. గుర్మీత్ సింగ్‌ను అదుపులోకి తీసుకుని, అంబాలా సెంట్రల్ జైలుకు తరలించారు. అంతకు ముందు కోర్టుకు హాజరయ్యేందుకు గుర్మీత్ 300 వాహనాల కాన్వాయ్‌తో హల్చల్ చేశారు. రెండు రాష్ట్రాల్లో హై అలర్ట్: డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్‌పై అత్యాచార ఆరోపణలకు సంబంధించిన కేసులో శుక్రవారం తీర్పు వెలువడనుండటంతో హరియాణా, పంజాబ్ నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. గుర్మీత్ మద్దతుదారులు, అభిమానులు దాదాపు లక్ష మంది వరకూ పంచకుల చేరుకున్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలతో పంచకులతో పాటు పంజాబ్, హరియాణాల్లోని సున్నితమైన ప్రాంతాల్లో పోలీసులకుతోడు 15 వేలమంది పారామిలిటరీ బలగాలను మోహరించారు. అన్ని జిల్లాల్లోనూ 144 సెక్షన్ విధించారు. డేరా సచ్చా సౌదాకు పంజాబ్, హరియాణాల్లో లక్షలాది మంది మద్దతుదారులు ఉన్నారు. దీంతో ఈ రెండు రాష్ట్రాల్లోనూ హైఅలర్ట్ ప్రకటించారు. ముందుజాగ్రత్త చర్యగా ఇరు రాష్ట్రాల్లోనూ 72 గంటల పాటు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలుపుదల చేశారు. సోషల్ మీడియాలో పోస్టులపై అధికారులు నిఘా పెట్టారు. పంచకులకు వెళ్లే బస్సులు, రైళ్లపై ఆంక్షలు విధించారు. పంజాబ్, హరియాణా ప్రభుత్వాలకు పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తన ఆశ్రమంలో ఇద్దరు సాధ్వీలపై గుర్మీత్ రామ్‌రహీం సింగ్ అత్యాచారానికి పాల్పడ్డారని 2002లో ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి పంజాబ్, హరియాణా హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ డేరా చీఫ్‌పై కేసు నమోదు చేసింది. తీర్పు నేపథ్యంలో సిస్రాలోని 3 గ్రామాల్లో కర్ఫ్యూ విధించారు. (ఆ బాబా సీక్రెట్ ఏంటి?) -
రేప్ కేసులో దోషిగా తేలిన బాబా గుర్మీత్ సింగ్
-
పంజాబ్, హరియాణాల్లో హైఅలర్ట్
-
పంజాబ్, హరియాణాల్లో హైఅలర్ట్
♦ ‘రాక్‌స్టార్ బాబా’ లైంగిక వేధింపుల కేసులో రేపే తీర్పు ♦ వేల సంఖ్యలో పంచకులకు చేరుకుంటున్న మద్దతుదారులు చంఢీగఢ్: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, డేరా సచ్చా సౌదా చీఫ్, రాక్‌స్టార్‌గా పేరొందిన గుర్మీత్ రామ్ రహీం సింగ్‌పై నమోదైన లైంగిక వేధింపుల కేసులో సీబీఐ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించనుంది. దీంతో ఆయన మద్దతుదారులు వేల సంఖ్యలో పంచకులకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఇరు రాష్ట్రాల్లో 144 సెక్షన్ విధించారు. ఇప్పటికే 35 వేల మంది వరకు గుర్మీత్ మద్దతుదారులు పంచకుల బాబా ప్రార్థనా స్థలం నామ్ చర్చా ఘర్కు చేరుకున్నారు. రానున్న రెండు రోజుల్లో లక్ష మంది వరకు మద్దతుదారులు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో పంజాబ్, హరియాణాల్లో భారీగా భద్రతా చర్యలు చేపట్టారు. వేల సంఖ్యలో పోలీసులు, భద్రతా దళాలను మోహరించారు. ముందుజాగ్రత్తగా గురు, శుక్రవారాల్లో పంచకులలోని పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. పంచకులలోని జిల్లా కోర్టుకు వెళ్లే అన్ని మార్గాల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. శుక్రవారం కోర్టు ముందుకు గుర్మీత్ బాబా కూడా హాజరవనున్నారు. తీర్పు నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశముందని నిఘావర్గాలు సైతం హెచ్చరించాయి. పంజాబ్‌కి ఇప్పటికే 75 కంపెనీల కేంద్ర బలగాలు చేరుకున్నాయి. అవాం ఛనీయ ఘటనలు జరగకుండా డ్రోన్ల సహాయంతో నిరంతరం పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. తాత్కాలిక జైలుగా క్రికెట్ స్టేడియం చంఢీగఢ్లోని క్రికెట్ స్టేడియాన్ని తాత్కాలిక జైలుగా మార్చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారనే అనుమానం వచ్చిన ప్రతిఒక్కరిని శుక్రవారం ఆ క్రికెట్ స్టేడియంలో ఉంచాలని చంఢీగఢ్ పరిపాలన విభాగం నిర్ణయించింది. 2002లో ఇద్దరు శిష్యురాళ్లను లైంగికంగా వేధించినట్లు గుర్మీత్ రామ్ రహీం సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. -
సీబీఐ కోర్టుకు హాజరైన లాలూ
రాంచీ: దాణా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్జేడీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ గురువారం సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు సాక్ష్యులను ఆయన ప్రవేశపెట్టారు. గత మంగళవారం కూడా లాలూ ఇదే కోర్టుకు హాజరై మరో కేసుకు సంబంధించి స్టేట్మెంట్ ఇచ్చారు. రూ.900 కోట్ల దాణా కుంభకోణం ఆయన బిహార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగింది. ఈ కుంభకోణానికి సంబంధించి ఐదు కేసులుండగా ఒక కేసుకు సంబంధించి దోషిగా తేలటంతో సీబీఐ న్యాయస్థానం గత మే నెలలో లాలూకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు. -
ఇంద్రాణిని కొట్టారు, దూషించారు!
సీబీఐ కోర్టులో ఆమె తరఫు న్యాయవాది ఫిర్యాదు ముంబై: షీనాబోరా హత్యకేసులో నిందితు రాలు ఇంద్రాణి ముఖర్జీని బైకల్లా జైలు సిబ్బంది కొట్టారని, దూషించారని ఆమె తరఫు న్యాయవాది గుంజన్ మంగ్లా సీబీఐ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఆందోళన చేస్తే లైంగికదాడి చేస్తానంటూ జైలు సిబ్బంది, సూపరింటెండెంట్ బెదిరించారన్నారు. ఇంద్రాణి కాళ్లు, చేతులు, ముఖంపై గాయాలను తనకు చూపించారని, జైలు సిబ్బందిపై ఫిర్యాదు చేయాలని ఆమె కోరిందన్నారు. విచారణ జరిపిన కోర్టు బుధవారం ఇంద్రాణిని హాజరుపరచాలని ఆదేశించింది. బైకల్లా జైలు ఖైదీ మంజురా (45) ముంబైలోని జేజే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించింది. జైలు సిబ్బంది తీవ్రంగా కొట్టడంతోనే మంజురా మృతిచెందిందని ఆరోపిస్తూ ఇంద్రాణి సహా ఖైదీలు ఆందోళన చేపట్టారు. జైలు డాబాపైకెక్కి వార్తా పత్రికలకు నిప్పు అంటిస్తూ జైలు సిబ్బందికి వ్యతిరేక నినాదాలు చేశారు. మరోవైపు మంజురాను జైలు సిబ్బంది తీవ్రంగా హింసించారని, జననాంగంలోకి లాఠీ జొప్పించారని పోలీసులు చెప్పారు. ఆందోళన విషయమై జైలు అధికారి ఒకరు స్పందిస్తూ.. ఆహారం తీసుకోవద్దని, ఆందోళనను ఆపడానికి ప్రయత్నిస్తే పిల్లలను అడ్డుగా ఉంచుకోవాలని ఖైదీలను ఇంద్రాణి ఉసిగొల్పారని ఆరోపించారు. -
కోర్టుకు బ్రదర్స్!
► చార్జ్‌షీట్ నకలు అప్పగింత ► మీడియాపై న్యాయవాదుల చిందులు ► మౌనంగా మారన్ ముందుకు సాక్షి, చెన్నై: మారన్ బ్రదర్స్ మంగళవారం చెన్నై సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. 2500 పేజీలతో కూడిన చార్జ్‌షీట్ నకలును వీరికి కోర్టు వర్గాలు అప్పగించాయి. తదుపరి విచారణ జూలై 28కి న్యాయమూర్తి జవహర్ వాయిదా వేశారు. యూపీఏ హయాంలో కేంద్ర టెలికాం మంత్రిగా ఉన్న సమయంలో దయానిధిమారన్ హై స్పీడ్ ఇంటర్నెట్ బీఎస్ఎన్ఎల్ కనెక్షన్లను దుర్వినియోగం చేసినట్టుగా ఆరోపణలు బయలు దేరాయి. ఈ కనెక్షన్లను తమ కుటుంబానికి చెందిన సన్ టీవీ నెట్‌వర్క్‌కు అప్పగించడంతో ప్రభుత్వానికి కోటి 78 లక్షల మేరకు ఆదాయానికి గండి పడిందని సీబీఐ గుర్తించి కేసు నమోదు చేసింది. దయానిధిమారన్, ఆయన సోదరుడు కళానిధి మారన్‌తో పాటు అప్పటి బీఎస్ఎన్ఎల్ అధికారులు బ్రహ్మనాథన్, వేలుస్వామి, మారన్ వ్యక్తిగత కార్యదర్శి గౌతమన్, సన్‌టీవీ సిబ్బందికన్నన్, రవి మీద అభియోగం మోపుతూ ఈ కేసులు దాఖలయ్యాయి. కేసు విచారణ చెన్నై సీబీఐ కోర్టులో సాగుతూ వస్తోంది. ఈ కేసుకు సంబంధించి డిసెంబర్ ఎనిమిదో తేదీన సీబీఐ కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేసింది. గత విచారణ సందర్భంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లందరూ కోర్టుకు హాజరు కావాలని న్యాయమూర్తి జవహర్ ఆదేశించారు. ఆ మేరకు మారన్ బ్రదర్స్ మంగళవారం కోర్టుమెట్లు ఎక్కారు. కోర్టుకు బ్రదర్స్ : కళానిధి మారన్, దయానిధి మారన్‌తో పాటు మిగిలిన వారు ఉదయాన్నే హైకోర్టు ఆవరణలోని సీబీఐ కోర్టుకు చేరుకున్నారు. కోర్టుకు హాజరైన వీరిని వీడియో, ఫొటోలు తీయడానికి మీడియా ఉత్సాహాన్ని ప్రదర్శించింది. అయితే, ఆ బ్రదర్స్ తరఫు న్యాయవాదులు అడ్డుకోవడం వివాదానికి దారి తీసింది. కోర్టులో న్యాయమూర్తి జవహర్ ఆదేశాల మేరకు 2500 పేజీలతో కూడిన చార్జ్‌షీట్ నకలును ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరికీ అందజేశారు. వీటిని పరిశీలించి, తదుపరి తమ వాదన వినిపించేందుకు తగ్గ సమయాన్ని కోర్టు కేటాయించింది. తదుపరి విచారణను జూలై 28వ తేదీకి వాయిదా వేసింది. కోర్టు నుంచి వెలుపలకు వస్తున్న మారన్ బ్రదర్స్‌ను తమ కెమెరాల్లో బంధించేందుకు మీడియా యత్నించగా, వారి న్యాయవాదులు మళ్లీ అడ్డుకున్నారు. ఫొటోలు, వీడియోల్ని తీయనివ్వకుండా మీడియా మీద తిరుగబడ్డారు. మీడియా వర్గాలను బెదిరిస్తూ, కాస్త దూకుడు ప్రదర్శించారు. న్యాయవాదులు రవీంద్రన్, స్నేహ అయితే, కాస్త దూకుడుగా ప్రదర్శించడంతో మీడియా వర్గాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. మీడియా మీద తమ న్యాయవాదులు దూకుడు ప్రదర్శిస్తూ ముందుకు సాగుతున్నా, ఓ మీడియా సంస్థలకు అధిపతిగా ఉన్న మారన్ బ్రదర్స్ వారించకుండా మౌనంగా ముందుకు సాగడం గమనార్హం. -
సీబీఐ కోర్టు మెట్లెక్కిన లాలూ
పాట్నా: దాణా కుంభకోణం కేసుకు సంబంధించి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మంగళవారం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి హాజరయ్యారు. బిహార్ మరో మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా కూడా సీబీఐ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి దేవ్‌రాజ్ త్రిపాఠి కూడా కోర్టుకు వచ్చారు. దాణా పంపిణీకి సంబంధించి కోట్లలో కుంభకోణం జరిగినట్లు బయటపడటంతో 45మందిని నిందితులుగా చేర్చిన విషయం తెలిసిందే. ఇందులో పలువురు చనిపోగా.. ప్రస్తుతం 27మంది విచారణను ఎదుర్కొంటున్నారు. గతంలో జార్కండ్ కోర్టు లాలూ ప్రసాద్ యాదవ్‌పై నమోదైన కుట్రపూరిత ఆరోపణలన్నింటిని కొట్టి వేయగా.. ఇటీవల విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు లాలూ విచారణ ఎదుర్కోవాల్సిందేనని ఆదేశించిన విషయం తెలిసిందే. -
అడ్వాణీపై కుట్ర అభియోగాలు
♦ ‘బాబ్రీ’ విధ్వంసం కేసులో ఎంఎం జోషి, ఉమాభారతిలపై కూడా ♦ అనంతరం వారికి బెయిల్ మంజూరు చేసిన సీబీఐ ప్రత్యేక కోర్టు లక్నో: బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో మంగళవారం బీజేపీ అగ్రనేత ఎల్కే అడ్వాణీకి ఎదురుదెబ్బతో పాటు, కాస్త ఊరట కూడా లభించింది. అడ్వాణీ తదితరులపై నేరపూరిత కుట్ర అభియోగాలను నమోదుకు ఆదేశాలు జారీ చేసిన సీబీఐ ప్రత్యేక కోర్టు.. వారికి రూ. 50వేల వ్యక్తిగత పూచికత్తుపై బెయిల్‌ను సైతం మంజూరు చేసింది. ఈ కేసులో బీజేపీ అగ్రనేతలు అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, కేంద్రమంత్రి ఉమాభారతి సహా మొత్తం 12 మందిపై నేరపూరిత కుట్ర అభియోగాలను మళ్లీ నమోదు చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం వారు ఎదుర్కొంటున్న పలు ఇతర అభియోగాలకు ఇవి అదనం. అలాగే అడ్వాణీ(89), ఎంఎం జోషి(83), ఉమాభారతి(58), బీజేపీ ఎంపీ వినయ్ కటియార్(62), వీహెచ్‌పీ నేత విష్ణు హరి దాల్మియా(89), హిందూత్వవాది సాధ్వి రితంబర(53)లకు న్యాయమూర్తి ఎస్కే యాదవ్ బెయిలు మంజూరు చేశారు. మంగళవారం అడ్వాణీ, ఉమ సహా నిందితులంతా తమ ముందు హాజరు కావాల్సిందేనని గతంలో కోర్టు ఆదేశించడం తెలిసిందే. కోర్టు ఆదేశాల నేపథ్యంలో.. ఈ విచారణకు అడ్వాణీ సహా అభియోగాలు ఎదుర్కొంటున్న నేతలంతా హాజరయ్యారు. కోర్టు హాల్లో మూడు గంటల పాటు ఉన్నారు. ఇరుపక్షాల వాదనల అనంతరం అడ్వాణీ సహా ఆరుగురు నేతలకు బెయిల్ మంజూరు చేసింది. కుట్ర అభియోగాలను మోపవద్దంటూ నిందితుల తరఫు న్యాయవాది చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. కాగా, కోర్టుకు వెళ్లేముందు అడ్వాణీని యూపీ సీఎం ఆదిత్యనాథ్ వీఐపీ గెస్ట్‌హౌజ్‌లో కలిశారు. మసీదు కూల్చివేత కేసులో సుప్రీంకోర్టు గతనెలలో కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ కేసులో అడ్వాణీ సహా బీజేపీ అగ్రనేతలపై కుట్ర కేసులను ట్రయల్ కోర్టు, అలహాబాద్ హైకోర్టులు గతంలో కొట్టివేయగా, వాటిని పునరుద్ధరించాలన్న సీబీఐ వాదనను సుప్రీం కోర్టు అంగీకరించింది. అలాగే లక్నోలో సీబీఐ ప్రత్యేక కోర్టులో రోజువారీ విచారణ చేపట్టి రెండేళ్లలో పూర్తి కేసును ముగించాలని ఆదేశించింది. అందులో భాగంగా బీజేపీ నేతలపై కుట్రపూరిత అభియోగాలను నమోదు చేయడంపై లక్నోలోని సీబీఐ కోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఎవరూ ఆపలేరు: సాక్షి మహరాజ్ బాబ్రీ మసీదు విధ్వంసంలో కుట్ర ఏమీ లేదని, అదిబహిరంగ ఉద్యమంలా జరిగిందని కోర్టుకు హాజరయ్యేముందు ఉమ అన్నారు. ‘ఆ రోజు నేనక్కడే ఉన్నాను. నేనే కాదు లక్షలాది కార్యకర్తలు, రాజకీయ నేతలు అందులో పాలుపంచుకున్నారు’ అన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని ఎవరూ ఆపలేరని బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ అన్నారు. గతంలో రామ మందిర నిర్మాణానికి ఎవరైతే అడ్డు చెప్పారో ఇప్పుడు వారే రామ భక్తులుగా మారిపోయారన్నారు. అయోధ్యలో రామాలయం నిర్మాణానికి ముస్లింలూ అనుకూలంగా ఉన్నారన్నారు. అభియోగాలివీ... నిందితులపై ఇప్పటికే జాతీయ సమైక్యతకు హాని కలిగించడం, ప్రార్థనా స్థలాన్ని అపవిత్రం చేయడం, ఉద్దేశపూర్వకంగా మతపరమైన భావాలను దెబ్బతీయడం, బహిరంగ అల్లర్లకు దారితీసేలా ప్రకటనలు చేయడం, అల్లర్లు చేయడం తదితర అభియోగాలు ఉన్నాయి. వీటికి అదనంగా కోర్టు మంగళవారం నేరపూరిత కుట్ర అభియోగాన్ని కూడా మోపింది. నేరం రుజువైతే నిందితులకు ఐదేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చని కోర్టులో ఈ కేసు విచారణను పరిశీలిస్తున్న ఓ న్యాయవాది పేర్కొన్నారు. -
హిమాచల్ సీఎంకు బెయిల్ మంజూరు
-
హిమాచల్ సీఎంకు బెయిల్ మంజూరు
న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌కు సీబీఐ కోర్టులో ఊరట లభించింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి వీరభద్రసింగ్తో పాటు, ఆయన భార్యకు సీబీఐ కోర్టు సోమవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు, అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని న్యాయస్థానం ఆదేశించింది. అలాగే వీరభద్రసింగ్ పాస్‌పోర్టును కోర్టులో సమర్పించాలని సూచించింది. కేసు తదుపరి విచారణ జూలై 27వ తేదీకి వాయిదా పడింది. -
17 ఏళ్లు అవుతోంది.. ఆ వ్యక్తి ఎక్కడా?
న్యూఢిల్లీ: తనకు బెయిల్ కోసం ష్యూరిటీ ఇచ్చిన వ్యక్తి మరణించి 17 సంవత్సరాలు గడిచిపోయినా నిందితుడికి తెలియకపోవడం నమ్మశక్యంగా లేదని సీబీఐ కోర్టు వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను మే 22కు వాయిదా వేసింది. వివరాల్లోకెళితే ఢిల్లీకి చెందిన వినీత్ తివారీ, ఎల్.కె.కౌల్, ఏ ఎస్ మస్తర్లు 1982లో అప్పటి షిప్పింగ్, రవాణా మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సంతకంతో ఫోర్జరీ డాక్యుమెంట్లను సృష్టించారు. వాటి సాయంతో బాంబే పోర్ట్ ట్రస్టుకు చెందిన 39,846 చదరపు మీటర్ల భూమిని రూ.2.27 కోట్లకు విక్రయించారు. ఈ ఘటనపై 1983, మార్చి22న అప్పటి షిప్పింగ్, రవాణా మంత్రిత్వ శాఖ జాయింట్స సెక్రటరీ ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మస్తర్ అప్రూవర్‌గా మారడంతో 1985లో కోర్టు అతడిని విడుదల చేసింది. 2008 అక్టోబర్ 13న తివారీ, కౌల్‌లకు వ్యతిరేకంగా మోసం, ఫోర్జరీ, కుట్ర, తప్పుడు ధ్రువపత్రాల సమర్పణ అభియోగాల నమోదుకు కోర్టు ఆదేశాలిచ్చింది. ప్రాథమిక ఆధారాల ప్రకారం నిందితులిద్దరూ అప్రూవర్‌తో కలిసి నేరం చేశారని కోర్టు అభిప్రాయపడింది. తివారీ బెయిల్‌కు మరో ష్యూరిటీని అంగీకరించిన ధర్మాసనం, విచారణను మే 22కు వాయిదా వేసింది. -
ఛోటా రాజన్‌కు జైలు శిక్ష
న్యూఢిల్లీ: నకిలీ పాస్ట్ పోర్ట్ కేసులో గ్యాంగ్‌స్టర్ ఛోటా రాజన్‌తో పాటు మరో ముగ్గురికి ఏడేళ్ల జైలు శిక్ష పడింది. సోమవారం వీరిని దోషులుగా నిర్ధారించిన ఢిల్లీ సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ రోజు (మంగళవారం) శిక్షలను ఖరారు చేసింది. వీరికి జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి 15 వేల రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి వీరేందర్ కుమార్ గోయల్ తీర్పు చెప్పారు. ఫోర్జరీ పత్రాలతో మారుపేరుతో ఛోటా రాజన్ పాస్ పోర్టు పొందినట్టు గతేడాది జూన్ 8న సీబీఐ కోర్టులో అతనిపై అభియోగాలు నమోదయ్యాయి. రాజన్‌తో పాటు పాస్ పోర్టు అధికారులు జయశ్రీ దత్తాత్రేయ్ రహతె, దీపక్ నట్వర్లాల్ షా, లలిత లక్ష్మణన్‌లపై కేసు నమోదైంది. 1998-99లో బెంగళూరులో ఛోటా రాజన్.. మోహన్ కుమార్ అనే పేరుతో నకిలీ పాస్ పోర్టు పొందాడని, ఇందుకు పాస్ట్ పోర్టు అధికారులు సహకరించారని సీబీఐ కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేసింది. నేరం రుజువు కావడంతో రాజన్‌తో పాటు అతనికి సహకరించిన వారికి శిక్ష పడింది. 2015 అక్టోబర్‌లో ఇండోనేసియా పోలీసులకు పట్టుబడ్డ రాజన్‌ను ఆ ఏడాది నవంబర్‌లో భారత్‌కు అప్పగించారు. -
ఛోటా రాజన్‌కు మరో ఎదురు దెబ్బ
-
ఛోటా రాజన్‌కు మరో ఎదురు దెబ్బ
న్యూఢిల్లీ: గ్యాంగ్‌స్టర్ ఛోటా రాజన్‌కు మరో ఎదురుదెబ్బ తగలింది. నకిలీ పాస్ పోర్టు కేసులో సోమవారం ఢిల్లీ సీబీఐ ప్రత్యేక కోర్టు ఛోటా రాజన్‌ను దోషీగా ప్రకటించింది. రేపు (మంగళవారం) రాజన్‌కు శిక్షను ఖరారు చేయనున్నట్టు సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి వీరేందర్ కుమార్ గోయల్ ప్రకటించారు. ఫోర్జరీ పత్రాలతో మారుపేరుతో ఛోటా రాజన్ పాస్ పోర్టు పొందినట్టు గతేడాది జూన్ 8న సీబీఐ కోర్టులో అతనిపై అభియోగాలు నమోదయ్యాయి. రాజన్‌తో పాటు పాస్ పోర్టు అధికారులు జయశ్రీ దత్తాత్రేయ్ రహతె, దీపక్ నట్వర్లాల్ షా, లలిత లక్ష్మణన్‌లపై కేసు నమోదైంది. 1998-99లో బెంగళూరులో ఛోటా రాజన్.. మోహన్ కుమార్ అనే పేరుతో నకిలీ పాస్ పోర్టు పొందాడని, ఇందుకు పాస్ట్ పోర్టు అధికారులు సహకరించారని సీబీఐ కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేసింది. నేరం రుజువు కావడంతో రాజన్‌తో పాటు అతనికి సహకరించిన వారిని కోర్టులో దోషులుగా ప్రకటించింది. హత్యలు, స్మగ్లింగ్, కిడ్నాప్ సహా రాజన్‌పై 85కు పైగా కేసులున్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లతో అతనిపై దాఖలైన కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 2015 అక్టోబర్‌లో ఇండోనేసియా పోలీసులకు పట్టుబడ్డ రాజన్‌ను ఆ ఏడాది నవంబర్‌లో భారత్‌కు అప్పగించారు. -
జగతి పబ్లికేషన్స్‌కు హైకోర్టు ఊరట
ఈ నెల 17 వరకు అభియోగాల నమోదు వద్దంటూ సీబీఐ కోర్టుకు ఆదేశం సాక్షి, హైదరాబాద్: జగతి పబ్లికేషన్స్‌కు ఉమ్మడి హైకోర్టులో ఊరట లభించింది. జగన్ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసుల్లో ఈ నెల 17వ తేదీ దాకా ఎలాంటి అభియోగాల నమోదు ప్రక్రియా చేపట్టొద్దని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని హైకోర్టు ఆదేశించింది. న్యాయమూర్తి జస్టిస్ ఎం.సీతారామమూర్తి ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. సీబీఐ నమోదు చేసిన కేసుల్లో ఒకేసారి అభియోగాల నమోదు చేపట్టేందుకు నిరాకరిస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ జగతి పబ్లికేషన్స్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడం తెలిసిందే. వీటిపై న్యాయమూర్తి గురువారం మరోసారి విచారణ జరిపారు. వేర్వేరుగా అభియోగాల నమోదు ప్రక్రియ చేట్టడం వల్ల తమకు కలిగే నష్టాన్ని జగతి పబ్లికేషన్స్ తరఫున సీనియర్ న్యాయవాదులు టి.నిరంజన్‌రెడ్డి, డి.వి.సీతారామ్మూర్తి ఈ సందర్భంగా న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. తరువాత సీబీఐ తరఫు న్యాయవాది పి.కేశవరావు వాదనలు వినిపిస్తూ ఈ వ్యాజ్యాలకు విచారణార్హత లేదన్నారు. ఈ వ్యాజ్యాలపై విచారణకు సమయం పడుతున్నందున వారం పాటు అభియోగాల నమోదు ప్రక్రియను నిలిపేస్తే అభ్యంతరమేమైనా ఉందా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. వారం పాటైతే అభ్యంతరం లేదని కేశవరావు పేర్కొనడంతో 17 వరకు అభియోగాల నమోదు ప్రక్రియ చేపట్టవద్దని ఆదేశించారు. విచారణను ఈ నెల 14కు వాయిదా వేశారు. వ్యాజ్యాలన్నింటినీ రెగ్యులర్ కోర్టు ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు.