
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంలో ఆ శాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సీ గుప్తా, మాజీ సంయుక్త కార్యదర్శి కేఎస్ క్రోఫాలను సీబీఐ ప్రత్యేక కోర్టు శుక్రవారం దోషులుగా తేల్చింది. మహారాష్ట్రలోని లొహారా ఈస్ట్ కోల్ బ్లాక్ కేటాయింపుల్లో వీరిద్దరూ నేరపూరిత కుట్రకు, మోసం, అవినీతికి పాల్పడ్డారని పేర్కొంది. గ్రేస్ ఇండస్ట్రీస్(జీఐఎల్)ను, ఆ కంపెనీ డైరెక్టర్ ముకేశ్ గుప్తాను కూడా ప్రత్యేక జడ్జి అరుణ్ భరద్వాజ్ దోషిగా పేర్కొన్నారు. వీరికి ఆగస్ట్ 4న శిక్షలు ఖరారు చేయనున్నారు. 2005–11 సంవత్సరాల మధ్య బొగ్గు బ్లాకుల కేటాయింపుల్లో చోటుచేసుకున్న అవకతవకలపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది.
ఇదీ చదవండి: ఫ్యామిలీ కోర్టుల్లో 11.4 లక్షల పెండింగ్ కేసులు
Comments
Please login to add a commentAdd a comment