HC Gupta
-
బొగ్గు కుంభకోణంలో మాజీ కార్యదర్శి దోషే: కోర్టు
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంలో ఆ శాఖ మాజీ కార్యదర్శి హెచ్సీ గుప్తా, మాజీ సంయుక్త కార్యదర్శి కేఎస్ క్రోఫాలను సీబీఐ ప్రత్యేక కోర్టు శుక్రవారం దోషులుగా తేల్చింది. మహారాష్ట్రలోని లొహారా ఈస్ట్ కోల్ బ్లాక్ కేటాయింపుల్లో వీరిద్దరూ నేరపూరిత కుట్రకు, మోసం, అవినీతికి పాల్పడ్డారని పేర్కొంది. గ్రేస్ ఇండస్ట్రీస్(జీఐఎల్)ను, ఆ కంపెనీ డైరెక్టర్ ముకేశ్ గుప్తాను కూడా ప్రత్యేక జడ్జి అరుణ్ భరద్వాజ్ దోషిగా పేర్కొన్నారు. వీరికి ఆగస్ట్ 4న శిక్షలు ఖరారు చేయనున్నారు. 2005–11 సంవత్సరాల మధ్య బొగ్గు బ్లాకుల కేటాయింపుల్లో చోటుచేసుకున్న అవకతవకలపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఇదీ చదవండి: ఫ్యామిలీ కోర్టుల్లో 11.4 లక్షల పెండింగ్ కేసులు -
బొగ్గు స్కాంలో మాజీ కార్యదర్శి దోషి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బొగ్గు కుంభకోణంలో బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్సీ గుప్తాను ఢిల్లీలోని ఓ కోర్టు దోషిగా నిర్ధారించింది. యూపీఏ హయాంలో పశ్చిమ బెంగాల్లోని పలు బొగ్గు బ్లాకుల కేటాయింపులో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై గుప్తాతోపాటు మరో ఐదుగురిని సీబీఐ ప్రత్యేక కోర్టు దోషులుగా తేల్చింది. వీరిలో ఒకరు రిటైరయ్యారు. 2005–08 సంవత్సరాల మధ్య బొగ్గు శాఖ కార్యదర్శిగా ఉన్న గుప్తాకు బొగ్గు బ్లాకుల కేటాయింపుల్లో అవకతవకలకు పాల్పడిన రెండు కేసుల్లో కలిపి ఇప్పటికే ఐదేళ్ల వరకు జైలుశిక్షలు పడ్డాయి. ఆయన ప్రస్తుతం బెయిలుపై ఉన్నారు. కోర్టు దోషులుగా ప్రకటించిన వారిలో కేఎస్ క్రోఫా అప్పట్లో బొగ్గు శాఖ సంయుక్త కార్యదర్శిగా ఉండి, తర్వాత మేఘాలయ చీఫ్ సెక్రటరీగా రిటైరయ్యారు. మరో అధికారి కేసీ సమ్రియా యూపీఏ హయాంలో బొగ్గు శాఖ డైరెక్టర్గా పనిచేశారు. ప్రస్తుతం మైనారిటీ వ్యవహారాల శాఖ జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. శుక్రవారం విచారణ అనంతరం సీబీఐ కోర్టు ప్రత్యేక జడ్జి ఆదేశాల మేరకు పోలీసులు దోషులందరినీ కస్టడీలోకి తీసుకున్నారు. డిసెంబర్ 3వ తేదీన కోర్టు వీరికి శిక్షలు ప్రకటించేదాకా జ్యుడీషియల్ కస్టడీలోనే ఉంటారు. బొగ్గు బ్లాకుల కేసులో మాజీ ప్రధాని మన్మోహన్కు ట్రయల్ కోర్టు 2015లో జారీ చేసిన సమన్లపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఆయన పిటిషన్ ఇప్పటికీ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. సమాచారాన్ని సీబీఐ లీక్ చేస్తోంది బొగ్గు కుంభకోణం దర్యాప్తులో సీబీఐ గోప్యత పాటించడం లేదని స్పెషల్ జడ్జి ఓపీ సైనీ అన్నారు. సుప్రీంకోర్టు సూచనలను సీబీఐ పట్టించుకోకుండా బయటి వ్యక్తులకు దర్యాప్తు సమాచారాన్ని చేరవేస్తోందని వ్యాఖ్యానించారు. కుంభకోణానికి సంబంధించిన పలు కీలక విషయాలను సీబీఐ కోర్టు దృష్టికి తేకుండా దాచి ఉంచిందంటూ దాఖలైన పిటిషన్పై ఈయన ఈ వ్యాఖ్యలు చేశారు. -
బొగ్గు స్కాం: మాజీ అధికారికి రెండేళ్ల జైలు
-
బొగ్గు స్కాం: మాజీ ఉన్నతాధికారికి రెండేళ్ల జైలు
బొగ్గు బ్లాకుల కేటాయింపు స్కాంలో బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్సీ గుప్తాకు రెండేళ్ల జైలు శిక్ష పడింది. ఆయనతో పాటు మరో ఇద్దరు అధికారులకు కూడా సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ శిక్ష విధించినా, వెంటనే బెయిల్ మంజూరు చేసింది. కేఎస్ క్రోఫా, కేసీ సమారియా అనే ఇద్దరు అధికారులకు లక్ష రూపాయల చొప్పున వ్యక్తిగత పూచీకత్తు మీద బెయిల్ మంజూరుచేశారు. మధ్యప్రదేశ్లోని తెస్గోరా బి/ రుద్రపురి బొగ్గు క్షేత్రాలను కమల్ స్పాంజ్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ (కేఎస్ఎస్పీఎల్)కు కేటాయించడంలో అక్రమాలు జరిగాయని కేసు నమోదైంది. 2005 డిసెంబర్ 31 నుంచి 2008 నవంబర్ వరకు బొగ్గు శాఖ కార్యదర్శిగా ఉన్న హెచ్సీ గుప్తా, నాటి జాయింట్ సెక్రటరీ కేఎస్ క్రోఫా, డైరెక్టర్ కేసీ సమారియా ముగ్గురూ నేరం చేసినట్లు సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ధారించింది. వీళ్లతో పాటు కేఎస్ఎస్పీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ పవన్ కమార్ అహ్లువాలియా కూడా నేరం చేసినట్లు తెలిపింది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చార్టర్డ్ అకౌంటెంటు అమిత్ గోయల్ మీద మాత్రం ఆరోపణలు రుజువు కాలేదు. ఈ కేసులో 2012 అక్టోబర్లో ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన సీబీఐ.. 2014 మార్చి 27న క్లోజర్ రిపోర్టు దాఖలుచేసింది. అయితే దాన్ని కోర్టు తిరస్కరించి, గుప్తా, ఇతరులను నిందితులుగా విచారణకు పిలిచింది. సుదీర్ఘ విచారణ అనంతరం గుప్తా, మరో ఇద్దరు అధికారులకు రెండేసి సంవత్సరాల జైలుశిక్ష విధించింది.