మీరట్: ఎందరో బాలికలను దారుణంగా హతమార్చి, అత్యాచారం చేసిన సురీందర్ కోలీకి సోమవారం ఉరిశిక్ష విధించవచ్చని తెలుస్తోంది. ఇతడు పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి తిరస్కరించడంతో ఉరితీయడం ఖాయమని మీరట్ జైలువర్గాలు తెలిపాయి. సీబీఐ కోర్టు డెత్ వారంటు జారీ చేయడంతో శిక్ష అమలు కోసం ఇతణ్ని ఈ నెల నాలుగున ఘజియాబాద్ దస్నా జైలు నుంచి మీరట్ జైలుకు తరలించారు. ఇతణ్ని ఈ నెల 7-12 తేదీల్లో ఎప్పుడైనా ఉరితీయవచ్చని అధికారులు ఇంతకుముందు ప్రకటించారు. ఉరి అమలుపై అధికారికంగా ఎవరూ నోరు విప్పకున్నా.. సోమవారం ఉదయం 5.30 గంటలకు శిక్షను అమలు చేస్తారని జైలువర్గాలు తెలిపాయి. కోలీని ఉరి తీయడానికి అవసరమైన పరికరాలను ఇది వరకే తెప్పించామని జైలుసూపరింటెండెంట్ తెలిపారు. యజమాని పంధేర్‌తో కలసి నోయిడాలోని నిఠారీ బాలిక రింపా హల్దార్‌ను 2006లో హత్య చేసినందుకు సీబీఐ కోర్టు ఇతనికి మరణశిక్ష విధించింది.
కోలీకి నేడే ఉరి ?
Published Sun, Sep 7 2014 11:06 PM | Last Updated on Sat, Sep 2 2017 1:01 PM
Advertisement