ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్‌లో ఏపీ సీఐడీ ఛార్జ్ షీట్ దాఖలు | AP CID Filed Chargesheet On Inner Ring Road Scam In ACB Court, See Details Inside - Sakshi
Sakshi News home page

ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్‌లో ఏపీ సీఐడీ ఛార్జ్ షీట్ దాఖలు

Published Thu, Feb 8 2024 8:09 PM | Last Updated on Thu, Feb 8 2024 8:25 PM

AP CID Filed Chargesheet On Inner Ring Road Scam In ACB Court - Sakshi

సాక్షి, అమరావతి: ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్‌లో సీఐడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఏపీ సీఐడీ ఏసీబీ కోర్టులో గురువారం ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ప్రధాన ముద్దాయిలుగా ఏ 1 గా చంద్రబాబు, ఏ 2 గా మాజీ మంత్రి నారాయణ ఉన్నారు. వీరితో పాటు నారా లోకేష్,  లింగమనేని రాజశేఖర్, లింగమనేని రమేష్లను ముద్దాయిలుగా సీఐడీ పేర్కొంది. సింగపూర్‌తో చంద్రబాబు ప్రభుత్వం చేసుకున్నది తప్పుడు ఒప్పందమని సీఐడీ తేల్చింది.

గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఒప్పందం అంటూ తప్పుదారి పట్టించినట్టు  సీఐడీ తెలిపింది. అయితే జీ 2 జీ ఒప్పందమే జరగలేదని సీఐడీ నిర్ధారించింది. సింగపూర్‌తో చేసిన ఒప్పందానికి కేంద్ర ప్రభుత్వ అనుమతిలేదని సీఐడీ తేల్చింది. చట్టవిరుద్ధంగా మాస్టర్ ప్లాన్ పేరుతో సుర్బానా జురాంగ్‌కు డబ్బులు చెల్లింపులు జరిగినట్టు నిర్ధారణ చేసింది. నిందితులకు మేలు చేసేలా ఇన్నర్ రింగ్ రోడ్, సీడ్ క్యాపిటల్, మాస్టర్ ప్లాన్ లు రూపొందించినట్టు  సీఐడీ పేర్కొంది.

ఇన్నర్ రింగ్ రోడ్‌ని లింగమనేని భూములు, హెరిటేజ్ భూములు, నారాయణ భూములకు అనుగుణంగా మార్చినట్టు  సీఐడీ చార్జ్ షీట్‌లో వెల్లడించింది. 58 ఎకరాల భూములను బంధువుల పేరుతో మాజీ మంత్రి నారాయణ కొన్నారు. లింగమనేని 340 ఎకరాల ల్యాండ్ బ్యాంకుకి మేలు చేసేలా అలైన్ మెంట్ మార్పులు చేశారు. లింగమనేని నుండి చంద్రబాబుకు ఇంటిని ఇచ్చినట్టు సీఐడీ పేర్కొంది. లింగమనేని ల్యాండ్ బ్యాంక్ పక్కనే హెరిటేజ్ 14 ఎకరాల భూములు కొన్నట్టు సీఐడీ పేర్కొంది. ఈభూములకు విలువ పెరిగేలా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ మార్చినట్టు సీఐడీ నిర్ధారించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement