chargesheet filed
-
లిక్కర్ కేసు: కవిత జ్యుడీషియల్ కస్టడీ 21కి పొడిగింపు
సాక్షి,ఢిల్లీ: లిక్కర్ పాలసీ కేసులో కల్వకుంట్ల కవిత పాత్రపై సీబీఐ శుక్రవారం(జూన్7) సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌పై విచారణ జరిపిన రౌస్ ఎవెన్యూ కోర్టు దానిని పరిగణలోకి తీసుకుంది. సీబీఐ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీని జూన్ 21 వరకు కోర్టు పొడిగించింది. జైలులో చదువుకోవడానికి తనకు 9 పుస్తకాలు కావాలని కవిత కోర్టును కోరోగా కోర్టు ఆమె విజ్ఞప్తిని అంగీకరించింది. కాగా, కవితపై ఇప్పటికే సీబీఐ ఫైల్ చేసిన ప్రధాన ఛార్జ్‌షీట్‌ను కోర్టు పరిగణలోకి తీసుకున్న విషయం తెలిసిందే. కేసులో కవిత పాత్ర కీలమని, సౌత్‌గ్రూపు ఏర్పాటులో ఆమె ముఖ్య పాత్ర పోషించారని ఛార్జ్‌షీట్‌లో సీబీఐ పేర్కొంది. లిక్కర్ పాలసీ రూపకల్పనకు ప్రతిఫలంగా ఆమ్ ఆద్మీ పార్టీకి ముడుపులిచ్చారని అభియోగాలు మోపింది. -
Delhi Liquor Scam: నిందితుల జాబితాలో ఆప్, కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఎక్సయిజ్ విధానంలో అవకతవకల కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం తాజాగా మరో చార్జ్‌షీట్‌ను దాఖలుచేసింది. ఇందులో ఆమ్ ఆద్మీ పార్టీ, సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్లను చేర్చింది. మనీ లాండరింగ్ ఆరోపణలపై ఇలా ఒక జాతీయ రాజకీయ పార్టీ, ఒక ముఖ్యమంత్రి పేర్లను చార్జ్‌షీట్‌లో చేర్చడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఢిల్లీలో ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజాకు ఈడీ 200 పేజీల అభియోగపత్రాలను సమరి్పంచింది. వీటిని పరిగణనలోకి తీసుకోవాలా వద్దా అనే అంశాన్ని జడ్జి త్వరలో పరిశీలించనున్నారు. ఆప్ కన్వీనర్‌గానే కాకుండా వ్యక్తిగతంగానూ ఈ కుట్రలో కేజ్రీవాల్ భాగస్వామి అయ్యారని తాజా చార్జ్‌షీట్‌లో ఈడీ ఆరోపించింది. మద్యం కేసులో మొత్తంగా ఈడీ ఇప్పటిదాకా ఎనిమిది చార్జ్షీట్లు దాఖలుచేసింది. 18 మందిని అరెస్ట్‌చేసింది. 38 సంస్థలకు ఈ నేరంతో సంబంధముందని పేర్కొంది. రూ.243 కోట్ల విలువైన ఆస్తులను జప్తుచేసింది. ‘‘ కేజ్రీవాల్ బసచేసిన ఏడు నక్షత్రాల హోటల్ బిల్లును ఈ కేసు నిందితుల్లో ఒకరు చెల్లించారు. ఆ బిల్లులు మా వద్ద ఉన్నాయి’’ అని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు గురువారం సుప్రీంకోర్టులో తెలిపారు. మనీ లాండరింగ్ కేసులో తనను అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ కేజ్రీవాల్ దాఖలుచేసిన పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు శుక్రవారం రిజర్వ్‌చేసింది. ఈ పిటిషన్‌ను జíస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం శుక్రవారం విచారించింది. కేజ్రీవాల్ తరఫున అభిషేక్ సింఘ్వీ, ఈడీ తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్చేస్తున్నాం. -
‘ఫైబర్’ ఫ్రాడ్ సూత్రధారి బాబే
సాక్షి, అమరావతి: కేంద్ర నిధులతో చేపట్టిన ఫైబర్ నెట్ ప్రాజెక్టు స్కామ్ కేసులో మాజీ సీఎం చంద్రబాబు లూటీకి సంబంధించి కీలక ఆధారాలను సేకరించిన సీఐడీ శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేసింది. తనకు సన్నిహితుడైన, నేర చరిత్ర కలిగిన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీకి అడ్డగోలుగా ఈ ప్రాజెక్టును కట్టబెట్టి చంద్రబాబు ప్రజాధనాన్ని స్వాహా చేసినట్లు ఆధారాలతో నిగ్గు తేల్చింది. ఈ నేపథ్యంలో ఏ 1గా మాజీ సీఎం చంద్రబాబు, ఏ 2గా టెరాసాఫ్ట్ ఎండీ వేమూరి హరికృష్ణ, ఏ 3గా ఏపీ ఫైబర్‌నెట్ కార్పొరేషన్, ఇన్‌క్యాప్ సంస్థల మాజీ ఎండీ కోగంటి సాంబశివరావు (ప్రస్తుతం ద.మ. రైల్వేలో చీఫ్ కమర్షియల్ మేనేజర్)తోపాటు మరికొందరిని నిందితులుగా పేర్కొంది. వారిపై ఐపీసీ సెక్షన్లు 166, 167, 418, 465, 468, 471, 409, 506 రెడ్ విత్ 120(బి)లతోపాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 13(2), రెడ్ విత్ 13(1)(సి)(డి) ప్రకారం కేసులు నమోదు చేసింది. ఫైబర్‌నెట్ పేరుతో చంద్రబాబు బృందంప్రజాధనాన్ని ఎలా కొల్లగొట్టిందీ సీఐడీ తన చార్జ్‌షీట్‌లో సవివరంగా పేర్కొంది. ఎఫ్ఐఆర్ నమోదు సమయంలో చంద్రబాబును ఏ 25గా పేర్కొనగా అనంతరం దర్యాప్తులో వెల్లడైన అంశాల ఆధారంగా తాజాగా చార్జ్‌షీట్‌లో ఏ1గా చేర్చారు. ఈ వెసులుబాటు దర్యాప్తు సంస్థలకు ఉంది. ఐటీ శాఖకు బదులుగా.. టెరాసాఫ్ట్‌కు ఫైబర్‌నెట్ ప్రాజెక్టును కట్టబెట్టడం ద్వారా చంద్రబాబు యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారు. మొత్తం రూ.2 వేల కోట్ల విలువైన ప్రాజెక్టు మొదటి దశలో రూ.333 కోట్ల పనుల్లో అక్రమాలకు బరితెగించారు. ఈ ప్రాజెక్టును ఐటీ శాఖ చేపట్టాల్సి ఉండగా విద్యుత్, మౌలిక వసతుల కల్పన, పెట్టుబడుల శాఖ ద్వారా చేపట్టాలని స్వయంగా ఆదేశించారు. నాడు ఈ శాఖలను చంద్రబాబే నిర్వహించడం గమనార్హం. బిడ్లు.. టెండర్లు వేమూరివే వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్‌కే ఈ ప్రాజెక్టును అప్పగించాలని ముందే నిర్ణయించుకున్న చంద్రబాబు పక్కాగా కథ నడిపారు. అందుకోసం వేమూరిని ఏపీ ఈ–గవర్నింగ్ కౌన్సిల్లో సభ్యుడిగా చేర్చారు. నేర చరిత్ర ఉన్న ఆయన్ను కీలక స్థానంలో నియమించి పనులు చక్కబెట్టారు. నిబంధనలను విరుద్ధంగా ఫైబర్‌నెట్ టెండర్ల మదింపు కమిటీలో సభ్యుడిగా కూడా నియమించారు. ప్రాజెక్టు బిడ్లు దాఖలు చేసే కంపెనీకి చెందిన వ్యక్తులు నిబంధనల ప్రకారం టెండర్ల మదింపు కమిటీలో ఉండకూడదు. చంద్రబాబు దీన్ని తుంగలోకి తొక్కారు. అమాంతం విలువ పెంచేసి... ప్రాజెక్ట్ విలువను అడ్డగోలుగా నిర్ణయించారు. ఎలాంటి మార్కెట్ సర్వే చేపట్టకుండా సరఫరా చేయాల్సిన పరికరాలు, నాణ్యతను ఖరారు చేసి ప్రాజెక్ట్ విలువను అమాంతం పెంచేశారు. వేమూరి హరికృష్ణ, నాటి ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఎండీ కోగంటి సాంబశివరావు ఇందులో కీలక పాత్ర పోషించారు. బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించి మరీ.. ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ చేపట్టేనాటికి టెరాసాఫ్ట్ ప్రభుత్వ బ్లాక్ లిస్ట్‌లో ఉంది. పౌర సరఫరాల శాఖకు ఈ – పోస్ యంత్రాల సరఫరాలో విఫలమైన టెరాసాఫ్ట్‌ను అధికారులు బ్లాక్ లిస్టులో చేర్చారు. చంద్రబాబు ఆ కంపెనీని ఏకపక్షంగా బ్లాక్ లిస్టు నుంచి తొలగించారు. పోటీలో ఉన్న ఇతర కంపెనీలను పక్కనబెట్టేశారు. దీనిపై పేస్ పవర్ అనే కంపెనీ అభ్యంతరాలు వ్యక్తం చేసినా ఖాతరు చేయలేదు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను సైతం సాంకేతిక కారణాలతో అనర్హులుగా పేర్కొంటూ టెరాసాఫ్ట్‌కే ప్రాజెక్టును కట్టబెట్టారు. టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని పట్టుబట్టిన అధికారి బి.సుందర్‌ను హఠాత్తుగా బదిలీ చేసి తమకు అనుకూలమైన వ్యక్తులను నియమించుకున్నారు. టెండర్ల ప్రక్రియ మొదలైన తరువాత టెరాసాఫ్ట్ తమ కన్సార్షియంలో మార్పులు చేసి సాంకేతికంగా అధిక స్కోర్ సాధించేందుకుగా వివిధ పత్రాలను ట్యాంపర్ చేశారు. అమలు లోపభూయిష్టం ప్రాజెక్టును అమలు చేయడంలో టెరాసాఫ్ట్ అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది. టెండర్ నోటిఫికేషన్ నాణ్యత ప్రమాణాలను ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో 80 శాతం ప్రాజెక్టు పనులు నిరుపయోగంగా మారాయి. మరోవైపు షెల్ కంపెనీల ద్వారా ప్రజాధనాన్ని అక్రమంగా తరలించారు. వేమూరి హరికృష్ణ తన సన్నిహితుడైన కనుమూరి కోటేశ్వరరావు సహకారంతో వ్యవహారాన్ని నడిపించారు. వేమూరికి చెందిన కాఫీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలలో కనుమూరి కోటేశ్వరరావు భాగస్వామిగా ఉన్నాడు. వేమూరి హరికృష్ణ, తుమ్మల గోపీచంద్, రామ్‌కుమార్ రామ్మూర్తిలతో కలసి విజయవాడ కేంద్రంగా నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ ఎల్ఎల్పీ అనే మ్యాన్ పవర్ సప్లై కంపెనీ పేరిట ఓ షెల్ కంపెనీని సృష్టించారు. ఆ కంపెనీ ఫైబర్ నెట్ ప్రాజెక్టుకు సిబ్బందిని సమకూర్చినట్లు, పర్యవేక్షించినట్లు కాగితాలపై చూపించారు. ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న టెరాసాఫ్ట్, ఇతర కంపెనీలకు చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా రూ.284 కోట్లు విడుదల చేసింది. నకిలీ ఇన్వాయిస్లతో ఆ నిధులను కొల్లగొట్టి కనుమూరి కోటేశ్వరరావు ద్వారా అక్రమంగా తరలించారు. వాటిలో రూ.144 కోట్లను షెల్ కంపెనీల ద్వారా తరలించారు. నాసిరకమైన పనులతో ప్రభుత్వ ఖజానాకు రూ.119.8 కోట్ల నష్టం వాటిల్లిందని నిగ్గు తేలింది. కీలక అధికారుల వాంగ్మూలం.. ఫైబర్‌నెట్ కుంభకోణంపై కేసు నమోదు చేసిన సీఐడీ కీలక ఆధారాలను సేకరించింది. ఇండిపెండెంట్ ఏజెన్సీ ఐబీఐ గ్రూప్ ద్వారా ఆడిటింగ్ జరపడంతో అవినీతి మొత్తం బట్టబయలైంది. టెరాసాఫ్ట్ కంపెనీ నిబంధనలను ఉల్లంఘించి నాసిరకం పరికరాలు సరఫరా చేసి ప్రభుత్వాన్ని మోసగించిందని ఐబీఐ గ్రూప్ నిర్ధారించింది. ఫైబర్ నెట్ కుంభకోణంలో నిధులు కొల్లగొట్టిన తీరును కీలక అధికారులు వెల్లడించారు. నిబంధనలు పాటించాలని తాము పట్టుబట్టినప్పటికీ అప్పటి సీఎం చంద్రబాబు బేఖాతరు చేశారని, ఈ టెండర్ల ప్రక్రియలో ఆయన క్రియాశీలంగా వ్యవహరించారని సెక్షన్ 164 సీఆర్పీసీ ప్రకారం న్యాయస్థానంలో వారి వాంగ్మూలాన్ని నమోదు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
దొరికారు దొంగలు..ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం కేసులో సీఐడీ ఛార్జ్ షీట్
-
ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్‌లో ఏపీ సీఐడీ ఛార్జ్ షీట్ దాఖలు
సాక్షి, అమరావతి: ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్‌లో సీఐడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఏపీ సీఐడీ ఏసీబీ కోర్టులో గురువారం ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ప్రధాన ముద్దాయిలుగా ఏ 1 గా చంద్రబాబు, ఏ 2 గా మాజీ మంత్రి నారాయణ ఉన్నారు. వీరితో పాటు నారా లోకేష్, లింగమనేని రాజశేఖర్, లింగమనేని రమేష్‌లను ముద్దాయిలుగా సీఐడీ పేర్కొంది. సింగపూర్‌తో చంద్రబాబు ప్రభుత్వం చేసుకున్నది తప్పుడు ఒప్పందమని సీఐడీ తేల్చింది. గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఒప్పందం అంటూ తప్పుదారి పట్టించినట్టు సీఐడీ తెలిపింది. అయితే జీ 2 జీ ఒప్పందమే జరగలేదని సీఐడీ నిర్ధారించింది. సింగపూర్‌తో చేసిన ఒప్పందానికి కేంద్ర ప్రభుత్వ అనుమతిలేదని సీఐడీ తేల్చింది. చట్టవిరుద్ధంగా మాస్టర్ ప్లాన్ పేరుతో సుర్బానా జురాంగ్‌కు డబ్బులు చెల్లింపులు జరిగినట్టు నిర్ధారణ చేసింది. నిందితులకు మేలు చేసేలా ఇన్నర్ రింగ్ రోడ్, సీడ్ క్యాపిటల్, మాస్టర్ ప్లాన్ లు రూపొందించినట్టు సీఐడీ పేర్కొంది. ఇన్నర్ రింగ్ రోడ్ని లింగమనేని భూములు, హెరిటేజ్ భూములు, నారాయణ భూములకు అనుగుణంగా మార్చినట్టు సీఐడీ చార్జ్ షీట్లో వెల్లడించింది. 58 ఎకరాల భూములను బంధువుల పేరుతో మాజీ మంత్రి నారాయణ కొన్నారు. లింగమనేని 340 ఎకరాల ల్యాండ్ బ్యాంకుకి మేలు చేసేలా అలైన్ మెంట్ మార్పులు చేశారు. లింగమనేని నుండి చంద్రబాబుకు ఇంటిని ఇచ్చినట్టు సీఐడీ పేర్కొంది. లింగమనేని ల్యాండ్ బ్యాంక్ పక్కనే హెరిటేజ్ 14 ఎకరాల భూములు కొన్నట్టు సీఐడీ పేర్కొంది. ఈభూములకు విలువ పెరిగేలా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ మార్చినట్టు సీఐడీ నిర్ధారించింది. -
1984 అల్లర్లు: సీబీఐ చార్జిషీట్లో కాంగ్రెస్ నేత జగదీష్ టైట్లర్ పేరు
న్యూఢిల్లీ: 39 ఏళ్ల క్రితం జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లో ఆనాటి కాంగ్రెస్ ఎంపీ జగదీశ్ టైట్లర్ గురుద్వారా పుల్ బంగాశ్ వద్ద అల్లరిమూకను రెచ్చగొట్టి గురుద్వారాను తగులబెట్టి ఠాకూర్ సింగ్, బాదల్ సింగ్, గొర్చరణ్ సింగ్ అనే ముగ్గురు సిక్కులను హత్య చేయించినట్లుగా మే 20న దాఖలు చేసిన చార్జిషీటులో పేర్కొంది సీబీఐ. ఇందిరాగాంధీ హయాంలో జరిగిన 'ఆపరేషన్ బ్లూస్టార్'కు ప్రతిగా 1984లో ఆమెను సెక్యురిటీ సిబ్బంది హత్య చేశారు. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సిక్కు వ్యతిరేక అల్లర్లు చెలరేగాయి. సిక్కులను ఎక్కడపెడితే అక్కడ ఊచకోత కోశారు. ఆరోజు జరిగిన హింసాకాండలో సుమారుగా 3000 మంది మృతి చెందారు. అల్లర్లలో కాంగ్రెస్ నేత జగదీశ్ టైట్లర్ పాత్రపై సీబీఐ లోతైన దర్యాప్తు చేసింది. అల్లర్లలో జగదీశ్ గుంపులను రెచ్చగొట్టినట్లు మరింత విధ్వాంసానికి పాల్పడి, పలు హత్యలకు కారణమైనట్లు సీబీఐ చార్జిషీటులో పేర్కొంది. 2000లో సిక్కు వ్యతిరేక అల్లర్లపై నివేదిక సమర్పించిన నానావతి కమీషన్ అందులో జగదీశ్ టైట్లర్ ప్రత్యక్షంగానే అల్లరి మూకలను రెచ్చగొట్టే ప్రయత్నానికి పాల్పడినట్లు వెల్లడించారు. ఆరోజున జగదీశ్ కారులో వచ్చి టీబీ హాస్పిటల్ గేటు వద్ద కత్తులు, రాడ్లు, కర్రలు చేత పట్టుకుని ఉన్న ఒక గుంపుతో మాట్లాడుతూ.. "మీరు చేసిన హింస సరిపోదు.. నాకైతే సంతృప్తికరంగా లేదు.. మరింత మంది సిక్కులని చంపండి పోయి.. లేదంటే నా మాట పోతుంది, పెద్ద ఎత్తున సిక్కులను హత్య చేయిస్తానని మాటిచ్చాను" అని చెప్పినట్లు తెలిపింది. తాజాగా సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటులో ఒకామె జగదీశ్ టైట్లర్ గుంపును రెచ్చగొట్టడాన్ని కళ్లారా చూసినట్లు తెలిపింది. ఆరోజు తన దుకాణాన్ని అల్లరి మూకలు ధ్వంసం చేస్తుండడం చూసి వెనక్కి వెళ్లిపోతుండగా గురుద్వారా పుల్ బంగాశ్ వద్ద జగదీశ్ టైట్లర్ ఒక తెల్లటి అంబాసిడర్ కారులో వచ్చి అక్కడున్న దుండగలతో.. "ఆస్తులను తర్వాత కొల్లగొట్టవచ్చు.. ముందు దొరికిన సిక్కులను దొరికినట్టు చంపండి" అని రెచ్చగొట్టినట్లు సాక్ష్యమిచ్చింది. అటుపై తాను ఇంటికి తిరిగొచ్చి పక్కింట్లో ఆశ్రయం పొందినట్లు అక్కడ తన భర్త వద్ద పనిచేసే శ్రీ గొర్చరణ్ సింగ్, శ్రీ బాదల్ సింగ్ మృతదేహాలను చూసినట్లు తెలిపింది. ఈ సాక్ష్యాలతో పాటు ఆనాడు ఎంపీగా ఉన్నజగదీష్ టైట్లర్‌పై సిక్కు వ్యతిరేక అల్లర్లలో అనేక నేరారోపణలున్నాయి. అందుకు తగిన ఆధారాలను సేకరించిన తర్వాతే సీబీఐ చార్జిషీటు దాఖలు చేసినట్లు తెలిపింది. అల్లరి మూకలను రెచ్చగొట్టడం, సిక్కులను హత్య చేయించడం, గురుద్వారాను తగులబెట్టడం, 1984 నవంబర్ 1న నిషేధిత ఉతర్వులను ఉలంఘించడం, మత విద్వేషాలను రెచ్చగొట్టడం వంటి నేరాలను అభియోగించింది సీబీఐ. ఇది కూడా చదవండి: ఉత్తర భారతాన్ని వదలని వానలు -
బ్రిజ్‌భూషణ్‌పై చార్జ్‌షీట్ దాఖలు
మైనర్‌ను లైంగికంగా వేధించినట్లు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్(Brij Bhushan)పై రెజ్లర్లు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ఆరోపణలపై విచారణ చేపట్టిన ఢిల్లీ పోలీసులు తమ రిపోర్టును రిలీజ్ చేశారు. మైనర్‌ను బ్రిజ్ భూషణ్ వేధించినట్లు ఆధారాలు లేవని పోలీసులు తమ చార్జ్‌షీట్‌లో తెలిపారు. బ్రిజ్‌పై మైనర్ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని ఢిల్లీ పోలీసులు తమ రిపోర్టులో కోరారు. కాగా లైంగిక వేధింపుల కేసులో ఢిల్లీ పోలీసులు దాదాపు 1000 పేజీల చార్జ్‌షీట్ రిపోర్టును తయారు చేశారు. కేవలం మైనర్ కేసు విషయంలో సుమారు 500 పేజీల నివేదికను పొందుపరిచారు. దాంట్లో ఆ కేసును రద్దు చేయాలని పోలీసులు సూచించారు.విచారణలో తమకు ఎటువంటి ఆధారాలు లభించలేదన్నారు. ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో ఇవాళ పోలీసులు అధికారులు రిపోర్టును సమర్పించి 1500 పేజీలతో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. కాగా పోలీసులు సమర్పించిన చార్జ్‌షీట్‌పై తదుపరి విచారణను జూన్ 22కు వాయిదా వేసింది. ఏప్రిల్‌లో పోక్సో చట్టం కింద బ్రిజ్ భూషణ్‌పై ఓ మైనర్ అథ్లెట్ కేసు దాఖలు చేసింది. బ్రిజ్‌పై ఇచ్చిన స్టేట్మెంట్ను ఆ మైనర్ వెనక్కి తీసుకున్నట్లు పోలీసుల రిపోర్టు ద్వారా తెలుస్తోంది. తనను ఎంపిక చేయకపోవడం పట్ల ఆగ్రహంతో డబ్ల్యూఎఫ్ఐ చీఫ్‌పై కేసును ఫైల్ చేసినట్లు ఆ మైనర్ అథ్లెట్ వెల్లడించింది. చాలా కఠినంగా టోర్నీల కోసం వర్క్ చేశానని, కానీ తనను సెలెక్ట్ చేయలేదని, దాని వల్ల డిప్రెషన్లోకి వెళ్లిపోయానని, ఆ కోపంతో బ్రిజ్‌పై లైంగిక వేధింపుల కేసు పెట్టినట్లు ఆ మైనర్ రెజ్లర్ పేర్కొన్నది. మైనర్ కేసు విషయంలో సీఆర్పీసీ సెక్షన్ 173 కింద రిపోర్టును రూపొందించినట్లు ఢిల్లీ పోలీసులు చెప్పారు. బాధిత మైనర్ తో పాటు ఆమె తండ్రి నుంచి కూడా వాంగ్మూలం తీసుకున్నట్లు తెలిపారు. జూలై 4వ తేదీన మైనర్ కేసుపై కోర్టు విచారణ జరగనున్నది. చదవండి: 'టైటిల్ గెలిచిన మత్తులో ఎక్కాల్సిన ఫ్లైట్ మిస్సయ్యాం' జూలై 3 నుంచి వింబుల్డన్.. ప్రైజ్‌మనీ భారీగా పెంపు -
Delhi Liquor Scam: ఈడీ చార్జిషీట్లో కేజ్రీవాల్ పేరు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఈడీ గురువారం అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేరును చేర్చింది. సౌత్ గ్రూపు నుంచి రూ.100 కోట్లు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్‌నాయర్ తన మనిషి అని, విజయ్ను నమ్మొచ్చని ఫేస్‌టైం కాల్లో సమీర్ మహేంద్రుతో కేజ్రీవాల్ అన్నారని పేర్కొంది. కేజ్రీవాల్‌ను ఎవరెవరు కలిసిందీ, ఎవరెవరు ఫోన్లో మాట్లాడిందీ తెలిపింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పేర్లను మరోమారు ప్రస్తావించింది. ఈడీ దాఖలు చేసిన 428 పేజీల సప్లిమెంటరీ చార్జిషీట్‌ను రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఇందులో పేర్కొన్న నిందితులు విజయ్‌నాయర్, అభిషేక్ బోయినపల్లి, శరత్‌చంద్రారెడ్డి, బినోయ్‌బాబు, అమిత్ అరోరాలతో పాటు ఏడు కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 23కు వాయిదా వేసింది. కిక్‌బ్యాక్‌లపై చర్చించారు! స్కామ్‌లో కీలక వ్యక్తులతో పాటు ఆయా సంస్థల్లో పనిచేస్తున్న వారి స్టేట్మెంట్లను చార్జిషీట్‌కు ఈడీ జత చేసింది. అరుణ్పిళ్లై కవిత తరఫు ప్రతినిధిగా ఇండో స్పిరిట్స్‌లో చేరారని తెలిపింది. సౌత్ గ్రూపునకు చెందిన కవిత, మాగుంట, అభిషేక్ బోయినపల్లి, శరత్‌చంద్రారెడ్డిలు ఎవరెవరితో మాట్లాడారు? ఎవరెవరితో ఎక్కడ సమావేశమయ్యారన్న అంశాలు పొందుపరిచింది. కిక్‌బ్యాక్‌ల రూపంలో ముందుగా పెట్టుబడి ఎలా తిరిగి రాబట్టాలనే అంశాన్ని పెట్టుబడిదారులు చర్చించారని పేర్కొంది. విజయ్‌నాయర్ పాలసీ రూపకల్పనలో కీలకపాత్ర పోషించాడని పేర్కొంది. మనీలాండరింగ్ కేసు పెట్టడానికి తగిన కారణాలున్నాయని తెలిపింది. సౌత్ గ్రూపులో ఎమ్మెల్సీ కవిత, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాఘవ మాగుంట, శరత్‌రెడ్డిలు భాగస్వాములు అని తెలిపింది. సౌత్ గ్రూపునుంచి ఆప్ నేతలకు సొమ్ములు ఎలా చేరాయో వివరించింది. ఎవరెవరిని ఏయే కారణాలతో అరెస్టు చేసిందీ తెలియజేసింది. సౌత్‌గ్రూపు నుంచి తీసుకున్న రూ.100 కోట్లలో రూ.30 కోట్లు గోవా ఎన్నికలకు ఆప్ ఖర్చు చేసినట్లు ఆరోపించింది. కవిత, ఆమె భర్తతో భేటీ అయ్యా: సమీర్ మహేంద్రు తన వాటా నుంచి ఆంధ్రప్రభ పబ్లికేషన్స్, ఇండియా ఎహెడ్లకు రూ.1 కోటి, రూ.70 లక్షలు చొప్పున ఇండో స్పిరిట్స్ నుంచి జమ చేయాలని అరుణ్పిళ్లై సూచించారు. శరత్‌చంద్రారెడ్డికి ఐదు జోన్లు, ఎంఎస్‌రెడ్డికి రెండు జోన్ల ద్వారా ఇండో స్పిరిట్స్‌లో రూ.5 కోట్ల పెట్టుబడితో రూ.17 కోట్లు ఆర్జించారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డితో ఢిల్లీ నివాసంలో రెండు, మూడుసార్లు భేటీ అయి మద్యం వ్యాపారంపై మాట్లాడా. ఈ సమయంలో మాగుంట కుమారుడు రాఘవ, బుచ్చిబాబు ఉన్నారు. అ రుణ్పిళ్లై అతని అనుయాయులు అభిషేక్ బోయినపల్లి, బుచ్చిబాబులతో మాట్లాడడానికి విజయ్‌నాయర్ జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. అరుణ్, అభిషేక్, బుచ్చిబాబులకు రాజకీయ పలుకుబడి ఉందని వారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు స్నేహితులని విజయ్‌నాయర్ చెప్పారు. అరుణ్‌తో ఫోను సంభాషణల్లో కవిత పేరు వచ్చింది. ఇండో స్పిరిట్స్ వెనక ఎవరు ఉన్నారో చెప్పాలని అరుణ్పిళ్లైను అడగ్గా తెలంగాణ సీఎం కుమార్తె కవిత ఉన్నారని, ఆమె తరఫు తాను ప్రతినిధినని చెప్పారు. హైదరాబాద్ వెళ్లి కవిత ఇంట్లో కవిత, భర్త అనిల్‌తో భేటీ అయ్యా. అరుణ్ తమ కుటుంబానికి సన్నిహితుడని ఇప్పటికే కలిసి వ్యాపారం చేస్తున్నామని కవిత చెప్పారు. కేజ్రీవాల్, సిసోడియాలతో భేటీ అయ్యా: దినేష్ అరోరా తొలుత సంజయ్ సింగ్‌ను కలిశా. అతని ద్వారా మనీష్ సిసోడియాను హోటల్లో కలిశా. సంజయ్ సింగ్ విజ్ఞప్తి మేరకు ఇతర హోటళ్ల యాజమాన్యాలు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఖర్చుల నిమిత్తం రూ.82 లక్షల చెక్కులు ఇచ్చాయి. ఐదు, ఆరు సార్లు సిసోడియాతో మాట్లాడడంతోపాటు ఒకసారి సంజయ్‌సింగ్‌తో కలిపి ముఖ్యమంత్రి నివాసంలో సీఎం కేజ్రీవాల్‌తో భేటీ అయ్యా. తొలుత విజయ్‌నాయర్‌తో పరిచయం అయింది. అనంతరం అర్జున్ పాండే, అరుణ్పిళ్లై , బుచ్చిబాబు, అభిషేక్ బోయినపల్లిలను నాయర్ పరిచయం చేస్తూ వీరికి తెలంగాణ ఎమ్మెల్సీ కవిత, ఏపీ ఎంపీ ఎంఎస్‌రెడ్డిలకు బాగా దగ్గరవారని తెలిపారు. సౌత్ గ్రూపు విజయ్ నాయర్‌కు రూ.100 కోట్లు అడ్వాన్స్‌గా ఇచ్చింది. బిజినెస్‌లో సౌత్‌గ్రూప్‌కు ఆరుశాతం కిక్‌బ్యాక్ కింద మొత్తంగా సుమారు రూ.210 కోట్లు వస్తుంది. సౌత్ గ్రూపునకు రూ.100 కోట్లు రికవరీ అయిన తర్వాత మిగిలిన రూ.100 కోట్లు విజయ్‌నాయర్ (ఆప్ కోసం), సౌత్ గ్రూపు పంచుకుంటారు. మద్యం వ్యాపారంపై చర్చించడంతోపాటు అడ్వాన్స్‌గా ఇచ్చిన రూ.100 కోట్లు ఎలా రికవరీ అవుతుందో కూడా చర్చించాం. రూ.19 కోట్లు కాదు..రూ.32 కోట్లు తీసుకున్నా: అరుణ్ నవంబర్, డిసెంబర్ 2021ల్లో విజయ్‌నాయర్ ఫోన్ చేసి ఢిల్లీలోని ఇండియా హ్యాబిటెట్ సెంటర్లో కలవమన్నారు. ఇండో స్పిరిట్స్ నుంచి రూ.19 కోట్లు తీసుకున్నట్టుగా గతంలో ఇచ్చిన స్టేట్మెంట్ తప్పు. రూ.32 కోట్లు తీసుకున్నా. దీంట్లో రూ.25 కోట్లు నేరుగా నా ఖాతాలోకే వెళ్లాయి. ఒక ఈవెంట్ నిమిత్తం ఆంధ్రప్రభ పబ్లికేషన్స్‌కు ఇండో స్పిరిట్స్ ద్వారా రూ.1 కోటి, ఇండియా ఎహెడ్‌కు రూ.70 లక్షలు అందజేశా. గచ్చిబౌలిలోని శ్రీహిల్స్ దగ్గర నాలుగు ఎకరాలు కొనుగోలు నిమిత్తం వేముల హరి ద్వారా క్రియేటివ్ డెవలపర్స్‌కు రూ.5 కోట్లు అడ్వాన్స్‌గా ఇచ్చా. మార్చి 2021లో శరత్‌రెడ్డితో పాలసీ మార్పుపై చర్చించాం. మే 2021న బంజరాహిల్స్‌లోని ఎమ్మెల్సీ కవిత నివాసంలో అభిషేక్ బోయినపల్లిని కలిశా. అక్కడే శరత్‌రెడ్డికి అభిషేక్‌ను పరిచయం చేశా. ఢిల్లీ సీఎం కార్యాలయం పక్కనే విజయ్ నాయర్ నివాసం ఉంటారు. ఆప్ సోషల్ మీడియా చూసేది కూడా విజయ్‌నాయర్ కావడంతో అతడిపై కేజ్రీవాల్‌కు పూర్తి నమ్మకం ఉంది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఏర్పాటు చేసిన సమావేశంలో రాఘవ, నాగరాజరెడ్డిలు కూడా పాల్గొన్నారు. న్యూ పాలసీపై ఢిల్లీ సీఎంతో తాను మాట్లాడానని, కేజ్రీవాల్ తనని ఢిల్లీ లిక్కర్ ట్రేడ్‌కు ఆహ్వానించారని మాగుంట తెలిపారు. ఇండో స్పిరిట్స్‌లో ఎమ్మెల్సీ కవిత తరఫున భాగస్వామిని. కవితకు చాలా కాలంగా స్నేహితుడిని. ఇండో స్పిరిట్స్ లాభాలతో ఏం చేయాలనేది ఇంకా డిసైడ్ చేసుకోలేదు. సమీర్ మహేంద్రు, కవితలు ఫేస్ టైంలో మాట్లాడుకునే ఏర్పాటు చేశా. ఒకసారి హైదరాబాద్‌లో నేరుగా కలుసుకునే ఏర్పాటు చేశా. ఇండో స్పిరిట్స్‌లో అసలు పెట్టుబడిదారు కవిత అని సమీర్ మహేంద్రుకు చెప్పా. శరత్‌రెడ్డి హోల్‌సేల్ బిజినెస్‌లో ఎంటర్ కాలేదు. అభిషేక్ పలుమార్లు డబ్బిచ్చారు: గౌతమ్ ముత్తా‡ ఇండియా ఎహెడ్ న్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఐఏఎన్పీఎల్)లో పెట్టుబడులు పెట్టాలని అభిషేక్ బోయినపల్లిని కోరా. పెట్టుబడి మొత్తం కంపెనీ ఖాతాకు కాకుండా నాకు ఇవ్వాలని కోరా. ఐఏఎన్పీఎల్కు రూ.50 లక్షల చెక్కు అభిషేక్ ఇచ్చారు. దీన్ని కొన్ని కారణాల వల్ల తిరిగి ఇచ్చేశా. ఛానల్ నడపడానికి వ్యక్తిగతంగా ఇవ్వాలని కోరగా 10.11.2020న రూ.1.08 కోట్లు బదిలీ చేశారు. అనంతరం జెడ్ఎన్పీఎల్ షేర్లు రూ.5.80 కోట్లకు కొనుగోలు చేసి నన్ను, అభిషేక్‌ను డైరెక్టర్లుగా అపాయింట్ చేయాలని కోరా. దీని నిమిత్తం జెడ్ఎన్పీఎల్కు రూ.75 లక్షల రుణం ఇచ్చా. దీన్ని షేర్ల కొనుగోలులో అడ్జస్ట్ చేశారు. అనంతరం ఇండియా ఎహెడ్ ఐపీఆర్ సొంతమైన ఆంధ్రప్రభ పబ్లికేషన్ లిమిటెడ్‌కు రూ.1.30 కోట్లు బదిలీ చేశా. ఇండియా ఎహెడ్ ట్రేడ్‌మార్క్‌ను నా పేరుమీద బదిలీ చేసుకున్నా. ఈ క్రమంలో పలుతేదీల్లో అభిషేక్ రూ.6.53 కోట్లు బదిలీ చేశారు. సమీర్ తదితరులతో సమావేశమయ్యా: అభిషేక్ బోయినపల్లి స్టేట్మెంట్: విజయ్ నాయర్ ఆప్‌కు బాగా దగ్గర. విజయ్ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021–22 రూపొందించారని అరుణ్ పిళ్లై తెలిపారు. శరత్‌చంద్రారెడ్డి రిటైల్ జోన్స్ రన్ చేయడానికి ఆసక్తి చూపారు. తాజ్ హోటల్లో సమీర్ మహేంద్రు, అరుణ్పిళ్లై, శరత్‌రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాజేశ్ మిశ్రా బినోయ్‌బాబు, బుచ్చిబాబులతో సమావేశమయ్యా. 10 రిటైల్ ఎల్7 లైసెన్సులు మాగుంట, సమీర్‌మహేంద్రు, శరత్‌రెడ్డిలకు వచ్చినందుకు సెలబ్రేట్ చేసుకున్నాం. సమీర్‌కు రెండు, మాగుంటకు మూడు, శరత్‌రెడ్డిలకు ఐదు ఎల్7 లైసెన్సులు వచ్చాయి. అరుణ్, బుచ్చిబాబు, విజయ్‌నాయర్‌తో మరోసారి సమావేశమయ్యా. ఈ సమయంలోనే గౌతమ్ ముత్తాకు రూ.75 లక్షలు ఎందుకు ఇచ్చారన్న అంశంపై చర్చ జరిగింది. సంబంధిత వార్త: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సంచలనం.. ఈడీ చార్జ్‌షీట్ దాఖలు -
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం.. తొలి చార్జిషీట్ దాఖలు
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ తొలి చార్జిషీట్ దాఖలు చేసింది. ఆప్‌నేత విజయ్ నాయర్, అభిషేక్ బోయిన్‌పల్లితో సహా ఏడుగురు నిందితులపై అభియోగాలు మోపుతూ రోస్ అవెన్యూ కోర్టులో చార్జిషీట్ ఫైల్ చేసింది. దాదాపు 10 వేల పేజీలతో సీబీఐ చార్జ్ షీట్ రూపొందించింది. చార్జిషీట్లో ఇద్దరు ప్రభుత్వ అధికారులు ఉండగా.. అయిదుగురు ప్రైవేటు వ్యక్తులు ఉన్నారు. అయితే సీబీఐ తొలి ఛార్జిషీట్లో ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పేరు లేదు. చార్జిషీట్లో విజయ్ నాయర్, అభిషేక్, సమీర్ మహేంద్రు, అరుణ్ రామచంద్ర పిల్లై, ముత్తా గైతమ్, కుల్దీప్ సింగ్, నరేందర్ సింగ్ పేర్లు చేర్చింది. కుల్దీప్ సింగ్, నరేందర్ సింగ్ ఇద్దరు ప్రభుత్వ అధికారులు. ఇంకా అయిదుగురిని అరెస్ట్ చేయలేదని సీబీఐ తెలిపింది. ప్రభుత్వ అధికారులను ప్రాసిక్యూషన్ చేసేందుకు ప్రభుత్వ అనుమతి తీసుకుంది సీబీఐ. కేసు దర్యాప్తు కొనసాగుతుందని కోర్టుకు తెలిపింది. తదుపరి విచారణ నవంబర్ 30కి వాయిదా వేసింది. ►A1 ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ నరేంద్ర సింగ్ ►A2 ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ కుల్దీప్ సింగ్ ►A3 విజయ్ నాయర్ ►A4 అభిషేక్ బోయిన్పల్లి ►A5 సమీర్ మహేంద్రు, ►A6 అరుణ్ రామచంద్ర పిళ్లై, ►A7గా ముత్తా గౌతమ్ పేర్లను చార్జ్ షీట్లో పేర్కొంది. ఇప్పటికే లిక్కర్ స్కాం కేసులో నిందితుడైన అభిషేక్ బోయినపల్లికి సీబీఐ ప్రత్యేక కోర్టు గురువారం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఈడీ విచారణ కొనసాగుతున్నందున రెండు వారాల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తున్నట్టు కోర్టు పేర్కొంది. అదే విధంగా మరో నిందితుడు, ఆప్ నేత విజయ్ నాయర్‌ను రెండు రోజుల ఈడీ కస్టడీకి అనుమతిచ్చింది. చదవండి: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సంచలన ఆరోపణలు.. -
కిడారి హత్యకేసులో సప్లిమెంటరీ చార్జిషీట్
విజయవాడ లీగల్: విశాఖపట్నం జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోముల హత్యకేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) శుక్రవారం విజయవాడ నగర మెట్రోపాలిటిన్ సెషన్స్ జడ్జి కోర్టులో సప్లిమెంటరీ చార్జిషీటు దాఖలు చేసింది. 2018లో అప్పటి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను మావోయిస్టులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఆ కేసులో ఎన్ఐఏ 59 మందిని నిందితులుగా పేర్కొంది. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో జైలులో ఉన్నారు. ఈ కేసులో 59వ నిందితురాలైన సాకే కళావతి అలియాస్ భవానీపై సప్లిమెంటరీ చార్జిషీటును దాఖలు చేశారు. మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు కాకూరి పెద్దన్న భార్య, మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యురాలైన కళావతి హత్య చేసిన సమయంలో ఇన్సాస్ రైఫిల్‌తో పాటు పలు మారణాయుధాలను కళావతి ధరించిందని, కిడారి, సివిరి హత్యలకు పదిహేను రోజుల ముందు డుంబ్రిగూడలో రెక్కీ, బస చేసారని ఎన్ఐఏ తెలిపింది. చదవండి: ఇసుక రీచ్‌ల సబ్ లీజుల పేరిట భారీ మోసం -
ఢిల్లీ అల్లర్లు : 15,000 పేజీల చార్జిషీట్
సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ)వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన హింసపై ఢిల్లీ పోలీసులు బుధవారం 15,000 పేజీలతో కూడిన చార్జిషీట్ దాఖలు చేశారు. చార్జిషీట్లో 15 మంది పేర్లను పొందుపరిచారు. ఘర్షణలతో అట్టుడికిన ఢిల్లీలో 53 మంది మరణించారు. ఈ హింసాకాండపై కర్కదూమా కోర్టులో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్లో ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్లో 15 మంది నిందితుల పేర్లను చేర్చారు. వీరిపై చట్టవ్యతిరేక కార్యకలాపాల (నియంత్రణ) చట్టం, ఐపీసీ, ఆయుధ చట్టంలోని పలు సెక్షన్ల కింద అభియోగాలు మోపారు.మరోవైపు ఢిల్లీ ఘర్షణల కేసులో పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్లో జేఎన్‌యూ నేత ఉమర్ ఖలీద్, సర్జీల్ ఇమాంల పేర్లను ప్రస్తావించలేదు. కాగా, కొద్దిరోజుల కిందట అరెస్ట్ అయిన ఉమర్, సర్జీల్ల పేర్లను అనుబంధ చార్జిషీట్లో చేర్చే అవకాశం ఉంది. ఢిల్లీలో చెలరేగిన సీఏఏ ఘర్షణలు దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. చదవండి : ‘ఉమర్ ఖలీద్‌ను ఉరి తీయడం ఖాయం’ -
పుల్వామా దాడులు.. చార్జిషీట్ దాఖలు
న్యూఢిల్లీ: దేశ ప్రజలను తీవ్ర విచారంలోకి నెట్టడమే కాక పాక్, ఇండియా మధ్య యుద్ధ పరిస్థితులకు దారి తీసిన పుల్వామా దాడి కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు బృందం(ఎన్ఐఏ) మంగళవారం చార్జిషీట్ దాఖలు చేసింది. జైషే మహ్మద్ చీఫ్, ఉగ్రవాది మసూద్ అజర్‌తో పాటు అతడి సోదరుడు రౌఫ్ అస్గర్ పేరును ఎన్ఐఏ ఈ చార్జిషీట్లో చేర్చింది. పుల్వామా దాడికి వీరిద్దరే ప్రధాన సూత్రధారులని ఎన్ఐఏ ఛార్జిషీట్లో పేర్కొంది. 5,000 పేజీలతో కూడిన ఛార్జిషీట్‌ను ఎన్ఐఏ జమ్మూ కోర్టులో సమర్పించనుంది. ఈ దారుణమైన ఉగ్రదాడులకు ఎలాంటి ప్రణాళిక రచించారు.. పాక్ నుంచి ఎలా అమలు చేశారనే దాని గురించి అధికారులు చార్జిషీట్లో పూర్తిగా వివరించారు. అంతేకాకుండా జైషే మహ్మద్‌కు చెందిన 20 మంది ఉగ్రవాదులు ఈ దాడికి అవసరమైన ఆయుధాలను సమకూర్చారని ఛార్జిషీట్లో తెలిపారు. వీటన్నింటికీ అవసరమైన పూర్తి ఆధారాలను కూడా ఎన్ఐఏ బృందం కోర్టుకు సమర్పించనుంది. వాట్సాప్ చాటింగ్, ఫొటోలు, ఆర్డీఎక్స్ రవాణాకు సంబంధించిన ఫొటోలు, ఫోన్ కాల్స్ డేటా... ఇలా కీలక ఆధారాలను ఎన్ఐఏ అధికారులు కోర్టుకు నివేదించనున్నారు. (చదవండి: మళ్లీ ‘పూల్వామా’ దాడి జరిగితేనే బీజేపీ గెలుపు!) భారత్ కశ్మీర్‌ను ఆక్రమించుకున్నందనే పాక్ ఈ దాడులకు తెగబడిందని ఎన్ఐఏ తెలిపింది. భారత్‌పై దాడికి పాక్, స్థానికుడు ఆదిల్ అహ్మద్ దార్‌ను ఉపయోగించింది. అతడు సూసైడ్ బాంబర్‌గా మరి సీఆర్పీఎఫ్ దళాలు ప్రయాణిస్తున్న కాన్వాయ్ మీదకు పేలుడు పదార్థాలతో నిండిని కారును దూకించాడని అధికారులు తెలిపారు. ఇక పుల్వామా దాడిలో పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ తన దేశం పాత్రను ఖండించిన సంగతి తెలిసిందే. భారతదేశం సాక్ష్యాలు ఇస్తే నేరస్థులను విచారిస్తామని కూడా తెలిపారు. కానీ చర్యలు మాత్రం శూన్యం. పైగా అంతర్జాతీయ సమాజం నుంచి ఎంత ఒత్తిడి వస్తున్నప్పటికి పాక్ ఉగ్రవాదులకు స్వర్గధామంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
బోధన్ స్కాంలో మళ్లీ కదలిక
సాక్షి, హైదరాబాద్: వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకు చిల్లుపెట్టిన బోధన్ వాణిజ్య పన్నుల స్కాంలో తిరిగి కదలిక మొదలైంది. ఈ కేసులో చార్జిషీటు దాఖలు చేసే విషయంలో సీఐడీ అధికారులు ముందడుగు వేసినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ ఖజా నాకు గండికొట్టిన రూ.300 కోట్ల వాణిజ్య పన్నుల నకిలీ డాక్యుమెంట్ల ఫిజికల్ వెరిఫికేషన్ ప్రక్రియ సీఐడీ అధికారులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ స్కాంలో సూత్రధారి శివరాజు ఒక సంస్థ కోసం తీసిన చలానాను పలు సంస్థల పేరిట చూపించినట్లుగా రికార్డులు రాసి, సదరు మొత్తాన్ని జేబులో వేసుకున్నారు. ఫలితంగా వాణిజ్య శాఖకు తీవ్రనష్టం వాటిల్లిం ది. కేసు దర్యాప్తులో కీలకంగా ఉన్న పలు చలానాలు, అనుమానాస్పద పత్రాలు, డాక్యుమెంట్ల ఫిజికల్ వెరిఫికేషన్ మొదలైతే త్వరలోనే చార్జిషీటు సిద్ధమవుతుందని సమాచారం. ఈ వ్యవహా రంపై పలు ఫిర్యాదులు రావడంతో అప్రమత్తమైన ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. విజిలెన్స్ విచారణలో ప్రధాన నిందితుడు శివరాజ్, అతని కుమారుడు, మరికొందరు అక్రమాలకు పాల్పడినట్లుగా గుర్తించింది. 2010 నుంచి 2016 వరకు సాగిన వీరి అక్రమాల ఫలితంగా వాణిజ్య శాఖకు, ప్రభుత్వ ఖ జానాకు రూ.300 కోట్ల నష్టం వాటిల్లినట్లు నివేదిక సమర్పించిం ది. కేసు సీఐడీకి బదిలీ అయ్యాక తండ్రీకుమారులిద్దరూ అరెస్టయ్యారు. స్వాధీనమైన చలానాలు, కంప్యూటర్లు, హార్డ్‌డిస్కుల ను ఇప్పటికే సైబర్ నిపుణులు విశ్లేషించారు కూడా. చాలా కాలం తరువాత ఇప్పుడు అనుమానాస్పద పత్రాల ఫిజికల్ వెరిఫికేషన్ ప్రక్రియ మొదలైంది. వాస్తవానికి ఆలస్యంగా మొదలైనా.. ఫోరెన్సిక్ నిపుణులు ఇచ్చిన శాస్త్రీయ ఆధారాలకు ఇది కీలకం కానుం ది. పత్రాల పరిశీలన పూర్తికాగానే చార్జిషీటు వేస్తారని సమాచారం. ఈ కేసులో తీవ్ర జాప్యం జరిగిందని సీఐడీపై విమర్శలు వస్తున్న క్రమంలో కేసులో కదలిక రావడం గమనార్హం. -
ప్రణయ్ కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు
-
12వేల పేజీలతో ఈడీ తొలి చార్జిషీటు
ముంబై : పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ కుంభకోణానికి పాల్పడిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన మూడు నెలల తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురువారం తన తొలి చార్జిషీటును దాఖలు చేసింది. నీరవ్ మోదీ, ఆయన సన్నిహితులపై తాము తొలి చార్జిషీటు దాఖలు చేస్తున్నామని ఈడీ అధికారులు పేర్కొన్నారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం పలు సెక్షన్ల కింద 12వేల పేజీల చార్జిషీటును దాఖలు చేసి స్పెషల్ కోర్టు ముందుకు తీసుకొచ్చినట్టు తెలిపారు. నీరవ్ మోదీ మేనమామ మెహుల్ చౌక్సి, ఆయన వ్యాపారాలకు వ్యతిరేకంగా కూడా ఏజెన్సీ రెండో చార్జిషీటు దాఖలు చేయబోతోంది. ఈ చార్జిషీటులో కేసు ప్రారంభమైనప్పటి నుంచి మోదీకి, ఆయన అసోసియేట్స్‌కు వ్యతిరేకంగా ఉన్న అన్ని అటాచ్మెంట్ల వివరాలను పేర్కొంది. ఈ నెల మొదట్లో సీబీఐ సైతం పీఎన్బీ కుంభకోణ కేసులో రెండు ఛార్జ్షీట్లను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.13వేల కోట్లకు పైగా పీఎన్బీలో వీరు కుంభకోణానికి పాల్పడినట్టు తెలిసింది. కొందరు బ్యాంకు ఉద్యోగుల సాయంతో వీరు ఈ కుంభకోణం చేశారు. పీఎన్బీ ఫిర్యాదుతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అయితే అప్పటికే వారు దేశం విడిచి పారిపోయారు. ఇటు విచారణకు సైతం సహకరించడం లేదు. ఈ కేసులో ఈడీ మనీ లాండరింగ్ విషయాలపై ఎక్కువగా దృష్టిసారించిందని సీనియర్ అధికారులు చెప్పారు. -
కోర్టుకు దినకరన్
► చార్జ్‌షీట్ దాఖలు ► ఇక, సాక్షుల వద్ద విచారణ ► సంబంధం లేని వ్యవహారంలో ఇరికించారు ► టీటీవీ వ్యాఖ్య సాక్షి, చెన్నై: విదేశీ మారక ద్రవ్యం కేసు విచారణ నిమిత్తం అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ గురువారం ఎగ్మూర్ ఆర్థిక నేరాల విభాగం కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో ఆయనపై అభియోగం మోపుతూ ఈడీ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఇక, ప్రభుత్వం తరఫు సాక్షుల్ని విచారించేందుకు కోర్టు నిర్ణయించింది. అయితే, ఈ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తనను ఇరికించినట్టుగా కోర్టు ముందు దినకరన్ వాదన వినిపించారు. టీటీవీ దినకరన్‌పై విదేశీ మారక ద్రవ్యం కేసును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ కొన్నేళ్లుగా ఎగ్మూర్ ఆర్థిక నేరాల విభాగం కోర్టులో సాగుతోంది. హైకోర్టు ఆదేశాలతో తాజాగా, కేసు విచారణ వేగాన్ని న్యాయమూర్తి మలర్మతి పెంచారు. విచారణకు దినకరన్ తొలుత హాజరైనా తదుపరి గైర్హాజరయ్యారు. ఇందుకు కారణం రెండాకుల కోసం ఈసీకి లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన కేసులో దినకరన్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి తీహార్ జైలుకు పరిమితం చేయడమే. ప్రస్తుతం ఆయన బెయిల్ మీద బయటకు రావడంతో గురువారం విచారణ నిమిత్తం ఎగ్మూర్ కోర్టుకు హాజరయ్యారు. కోర్టుకు దినకరన్.. ఉదయం న్యాయమూర్తి మలర్మతి ఎదుట విచారణకు దినకరన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈడీ వర్గాలు ఆయన మీద అభియోగం మోపుతూ చార్జ్‌షీట్ దాఖలు చేశారు. తనకు సంబంధం లేని వ్యవహారంలో ఇరికించారని, తనపై అభియోగాలు మోపుతున్నారని పేర్కొంటూ దినకరన్ న్యాయమూర్తి ఎదుట తన వాదన వినిపించారు. ఈసందర్భంగా ఈడీ తరఫు న్యాయవాదిని ఉద్దేశించి న్యాయమూర్తి ప్రశ్నించారు. సాక్షులను ప్రవేశ పెట్టాలని సూచించారు. అయితే, ప్రస్తుతం సాక్షులు రాలేదని, సమయం కేటాయించాలని కోరారు. దీంతో ఇక, ప్రభుత్వం తరఫు సాక్షుల వద్ద విచారణ సాగుతుందంటూ తదుపరి విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేశారు. కోవైకు సుఖేష్: టీటీవీ దినకరన్‌ను ఢిల్లీ పోలీసులకు అడ్డంగా బుక్ చేసిన బ్రోకర్ సుఖేష్ చంద్ర శేఖర్‌ను గురువారం కోయంబత్తూరు కోర్టులో పోలీసులు హాజరు పరిచారు. కోయంబత్తూరు గణపతి శివశక్తి కాలనికి చెందిన బాలకృష్ణ కుమారుడు రాజవేలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుఖేష్ చంద్ర శేఖర్, అతడి తండ్రి చంద్రశేఖర్‌ల మీద మోసం కేసు నమోదై ఉంది. ఈ కేసులో గతంలో అరెస్టయిన ఈ ఇద్దరు బెయిల్ మీద బయటకు వచ్చారు. చంద్ర శేఖర్ విచారణకు హాజరవుతుండగా, సుఖేష్ పత్తా లేకుండా పోయాడు. ఢిల్లీ పోలీసులు రెండాకుల చిహ్నం కేసులో అతడ్ని అరెస్టు చేయడంతో కోర్టుకు హాజరు పరిచేందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఢిల్లీ నుంచి కోయంబత్తూరుకు తీసుకొచ్చిన పోలీసులు న్యాయమూర్తి రాజ్‌కుమార్ ఎదుట హాజరు పరిచారు. సుఖేష్‌ను ఈనెల 22వ తేదీ వరకు రిమాండ్‌కు ఆదేశించారు. దీంతో గట్టి భద్రత నడుమ సుకేష్‌ను ఢిల్లీకి రైల్లో తరలించారు. -
వ్యభిచార దళారీపై చార్జిషీటు
భువనేశ్వర్: వ్యభిచార వ్యాపార రంగంలో ఆరి తేరిన సునీల్ మెహర్ వ్యతిరేకంగా నేరారోపణ చిట్టా దాఖలైంది. స్థానిక సబ్-డివిజినల్ జుడిషియల్ మేజిస్ట్రేటు(ఎస్డీజేఎమ్) కోర్టులో శుక్రవారం దీనిని దాఖలు చేశారు. ఈ చిట్టాలో 300 పేజీలతో నిందితుని వ్యాపార లావాదేవీలకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని పొందుపరిచినట్టు కమిషనరేటు పోలీసులు తెలిపారు. కోల్‌కత్తాలో జంట నగరాల కమిషనరేటు పోలీసులు నిందితుడిని గతంలో అరెస్టు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ నెల 21వ తేదీన జంట నగరాల పోలీసు కమిషనరేటు క్విక్ యాక్షన్ టీమ్(క్యూఏటీ) నిందితుడిని అరెస్టు చేశారు. శుక్రవారం దాఖలు చేసిన నేరారోపణ చిట్టాలో సునీల్ మెహర్ అనుచరుల్లో 9 మంది నిందితులకు సంబంధించిన వివరాల్ని పొందుపరచి కోర్టుకు సమర్పించారు. నిందితుడు సునీల్ మెహర్ వ్యతిరేకంగా రాష్ట్రం, రాష్ట్రేతర ప్రాంతాల్లో 9 కేసులు పెండింగులో ఉన్నాయి. వీటిలో 3 కేసుల్లో ఆయన మోస్టు వాంటెడ్ నేరస్తుడుగా కొనసాగుతున్నాడు. 150 మంది పైబడి కాలేజి అమ్మాయిలతో మెహర్ వ్యభిచార వ్యాపారాన్ని అత్యంత ఆకర్షణీయంగా నిర్వహిస్తున్నట్లు చార్జి షీటులో పేర్కొన్నారు. కాలేజి అమ్మాయిల్ని కాల్ గాల్స్, పెయిడ్ గర్లు ఫ్రెండ్లుగా వ్యాపారంలో వినియోగించడంలో సిద్ధహస్తుడుగా విచారణలో తేలింది. సునీల్ వలలో చిక్కుకున్న కిర్గీజ్ మహిళ ఈ ఏడాది మార్చిలో అదృష్టవశాతు తప్పించుకోగలిగింది. యువతుల్ని వ్యభిచారంలో వినియోగించడంలో ఆరి తేరిన నిందితుడు సునీల్ మెహర్ పలుసార్లు పోలీసుల కంటిలో దుమ్ము కొట్టి పారిపోయిన దాఖలాలు ఉన్నాయి. కోర్టులో శుక్రవారం దాఖలు చేసిన చార్జి షీటులో సునీల్ మెహర్ వ్యభిచార వ్యాపారం పూర్వాపరాల్ని పొందుపరిచారు. వ్యాపారం ఆరంభం, దీని నుంచి ఆదాయం, యువతీ యువకుల ప్రమేయం, రాష్ట్రేతర ప్రాంతాల్లో ఆయన వ్యాపార శాఖలు వగైరా సమాచారంతో నేరారోపణ చిట్టాని పకడ్బందీగా రూపొందించారు. గత 10, 15 ఏళ్ల నుంచి ఈ వ్యాపారం చేస్తున్నట్లు తెలిసింది. ఈ వ్యాపారం నుంచి ఆయన నెలసరి ఆదాయం రూ. 10 నుంచి 15 లక్షల వరకు ఉందని పోలీసు విచారణలో తేలింది. బెంగుళూరు, సిలిగుడి, గుజరాత్, కోల్కత్తా ప్రాంతాల్లో సునీల్ మెహర్ వ్యభిచార సామ్రాజ్యం విస్తరించింది. దాదాపు 500 మంది యువతులు, మహిళలు ఈ వ్యాపారంలో ప్రముఖ పాత్రధారులు. వీరిలో కాలేజీ విద్యార్థినుల సంఖ్య సుమారు 150 మంది. పేరొందిన మోడళ్లు(సోగత్తెలు), చలన చిత్ర నటీమణులు వంటి ఆకర్షణీయ మహిళలతో సునీల్ వ్యాపారం హాయిగా సాగించాడు. వ్యభిచారంతో అనుభవించే వారి నుంచి రూ. 500 నుంచి రూ. 5 లక్షల వరకు సొమ్ము గుంజుతు వ్యాపారాన్ని లాభసాటిగా నడిపించినట్లు సమాచారం. వ్యాపార నిర్వహణ కూడా ఎప్పటికప్పుడు అప్డేటు చేసుకోవడంలో సునీల్ ఆరి తేరాడు. ఫోను కాల్స్, ఆన్లైన్ మాధ్యమాల్లో విటుల్ని ఆకట్టుకుంటు వ్యాపారం నిశ్చలంగా నిర్వహించాడు. రాష్ట్రేతర ప్రముఖ ప్రాంతాల్లో పేరొందిన పెయిడ్ గర్లు ఫ్రెండు వ్యభిచార సంస్కృతిని సునీల్ మెహర్ రాష్ట్రానికి పరిచయం చేశాడు. విదేశీ యువతుల్ని కూడా తన వ్యాపారంలో పావులుగా ప్రయోగించిన ఘనుడు. బెంగుళూరు, కోల్కత్తా ప్రధాన కేంద్రంగా సునీల్ వ్యభిచార వ్యాపార లావాదేవీల్ని నిర్వహించాడు. -
మారన్ చుట్టూ ఉచ్చు
-
మారన్ సోదరులపై బిగుస్తున్న ఉచ్చు
చెన్నై: ఎయిర్‌సెల్ - మాక్సిస్ వ్యవహారంలో మారన్ సోదరులపై వచ్చేవారంలో చార్జ్‌షీటు దాఖలు చేస్తామని సీబీఐ డెరైక్టర్ తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ కూటమి ప్రభుత్వం 2004 నుంచి 14 వరకు అధికారంలో ఉంది. అందులో 2004 - 2007 మధ్య కేంద్ర ఐటీ శాఖ మంత్రిగా దయానిధిమారన్ పని చేశారు. ఆ సమయంలో ఎన్ఆర్ఐ పారిశ్రామికవేత్త శివశంకరన్ చెన్నైలో నడుపుతున్న ఎయిర్‌సెల్ సమాచార సంస్థకు బ్రాడ్‌బ్యాండ్ కేటాయింపు కోరుతూ 2006లో దరఖాస్తు చేసుకున్నారు. అయితే దానికి ఒప్పందం కుదరలేదు. ఇలా ఉండగా ఎయిర్‌సెల్ సంస్థ షేర్లు హఠాత్తుగా మలేషియా మాక్సిస్ సంస్థకు చేతులు మారాయి. ఆ తరువాత అనేక ప్రాంతాల్లో ఎయిర్‌సెల్ సర్వీసును ప్రారంభించేందుకు 14 లెసైన్స్‌లు ఇచ్చారు. దీనికి ప్రతి ఫలంగా మాక్సిస్ సంస్థ తమ అనుబంధ సంస్థల ద్వారా దయానిధిమారన్ సోదరుడు కళానిధిమారన్ నిర్వహించే సన్ డెరైక్ట్ సంస్థలో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. ఆ తరువాత శివశంకరన్ విదేశాల్లో స్థిరపడ్డారు. 2008లో కరుణానిధి, మారన్ సోదరుల మధ్య అభిప్రాయాల భేదాలు ఏర్పడగా శివశంకరన్ ఢిల్లీ చేరుకున్నారు. సీబీఐతో మారన్ సోదరులకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. 2011లో ఎఫ్ఐఆర్ నమోదైంది. మారన్ సోదరులపై చార్జ్‌షీటు రూపొందించేందుకు సీబీఐ చర్యలు తీసుకుంటోంది. -
పాలెం బస్సు ఘటనపై సీఐడీ చార్జిషీటు
-
పాలెం బస్సు ఘటన: జేసీ ప్రభాకర్ భార్య సహా 10 మందిపై చార్జిషీటు
పాలెం బస్సు ప్రమాద దుర్ఘటనపై సీఐడీ విభాగం చార్జిషీటు దాఖలుచేసింది. వోల్వో బస్సు తయారీలోనే లోపాలున్నాయని, అందులోని డీజిల్ ట్యాంక్ టైర్లకు దగ్గరగా ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని అందులో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా బస్సు సీట్ల డిజైన్ మార్చారని, అదికూడా ఈ ప్రమాదానికి కారణంగా మారిందని తెలిపారు. (చదవండి: వోల్వో బస్సు దగ్ధం - 44 మంది దుర్మరణం) ఈ కేసులో అనంతపురం జిల్లా తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి భార్య, జబ్బార్ ట్రావెల్స్, ఆర్అండ్బీ శాఖతో పాటు మొత్తం పదిమంది నిందితులపై చార్జి షీటు దాఖలైంది. ఈ బస్సు ప్రమాదంపై 400 పేజీలతో కూడిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సీఐడీ పంపింది. మహబూబ్‌నగర్ కోర్టులో మే 7వ తేదీన చార్జిషీటు దాఖలు చేశారు. (చదవండి: ఎవరినీ వదిలిపెట్టం.. 40 రోజుల్లో ఛార్జిషీటు)