న్యూఢిల్లీ: ఢిల్లీలో ఎక్సయిజ్ విధానంలో అవకతవకల కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం తాజాగా మరో చార్జ్‌షీట్‌ను దాఖలుచేసింది. ఇందులో ఆమ్ ఆద్మీ పార్టీ, సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్లను చేర్చింది. మనీ లాండరింగ్ ఆరోపణలపై ఇలా ఒక జాతీయ రాజకీయ పార్టీ, ఒక ముఖ్యమంత్రి పేర్లను చార్జ్‌షీట్‌లో చేర్చడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఢిల్లీలో ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజాకు ఈడీ 200 పేజీల అభియోగపత్రాలను సమరి్పంచింది. వీటిని పరిగణనలోకి తీసుకోవాలా వద్దా అనే అంశాన్ని జడ్జి త్వరలో పరిశీలించనున్నారు. ఆప్ కన్వీనర్‌గానే కాకుండా వ్యక్తిగతంగానూ ఈ కుట్రలో కేజ్రీవాల్ భాగస్వామి అయ్యారని తాజా చార్జ్‌షీట్‌లో ఈడీ ఆరోపించింది. మద్యం కేసులో మొత్తంగా ఈడీ ఇప్పటిదాకా ఎనిమిది చార్జ్‌షీట్‌లు దాఖలుచేసింది. 18 మందిని అరెస్ట్‌చేసింది.
38 సంస్థలకు ఈ నేరంతో సంబంధముందని పేర్కొంది. రూ.243 కోట్ల విలువైన ఆస్తులను జప్తుచేసింది. ‘‘ కేజ్రీవాల్ బసచేసిన ఏడు నక్షత్రాల హోటల్ బిల్లును ఈ కేసు నిందితుల్లో ఒకరు చెల్లించారు. ఆ బిల్లులు మా వద్ద ఉన్నాయి’’ అని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజు గురువారం సుప్రీంకోర్టులో తెలిపారు. మనీ లాండరింగ్ కేసులో తనను అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ కేజ్రీవాల్ దాఖలుచేసిన పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు శుక్రవారం రిజర్వ్‌చేసింది. ఈ పిటిషన్‌ను జíస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం శుక్రవారం విచారించింది. కేజ్రీవాల్ తరఫున అభిషేక్ సింఘ్వీ, ఈడీ తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజు వాదనలు వినిపించారు. వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్‌చేస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment