money laundering act
-
Delhi Liquor Scam: నిందితుల జాబితాలో ఆప్, కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఎక్సయిజ్ విధానంలో అవకతవకల కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం తాజాగా మరో చార్జ్‌షీట్‌ను దాఖలుచేసింది. ఇందులో ఆమ్ ఆద్మీ పార్టీ, సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్లను చేర్చింది. మనీ లాండరింగ్ ఆరోపణలపై ఇలా ఒక జాతీయ రాజకీయ పార్టీ, ఒక ముఖ్యమంత్రి పేర్లను చార్జ్‌షీట్‌లో చేర్చడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఢిల్లీలో ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజాకు ఈడీ 200 పేజీల అభియోగపత్రాలను సమరి్పంచింది. వీటిని పరిగణనలోకి తీసుకోవాలా వద్దా అనే అంశాన్ని జడ్జి త్వరలో పరిశీలించనున్నారు. ఆప్ కన్వీనర్‌గానే కాకుండా వ్యక్తిగతంగానూ ఈ కుట్రలో కేజ్రీవాల్ భాగస్వామి అయ్యారని తాజా చార్జ్‌షీట్‌లో ఈడీ ఆరోపించింది. మద్యం కేసులో మొత్తంగా ఈడీ ఇప్పటిదాకా ఎనిమిది చార్జ్షీట్లు దాఖలుచేసింది. 18 మందిని అరెస్ట్‌చేసింది. 38 సంస్థలకు ఈ నేరంతో సంబంధముందని పేర్కొంది. రూ.243 కోట్ల విలువైన ఆస్తులను జప్తుచేసింది. ‘‘ కేజ్రీవాల్ బసచేసిన ఏడు నక్షత్రాల హోటల్ బిల్లును ఈ కేసు నిందితుల్లో ఒకరు చెల్లించారు. ఆ బిల్లులు మా వద్ద ఉన్నాయి’’ అని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు గురువారం సుప్రీంకోర్టులో తెలిపారు. మనీ లాండరింగ్ కేసులో తనను అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ కేజ్రీవాల్ దాఖలుచేసిన పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు శుక్రవారం రిజర్వ్‌చేసింది. ఈ పిటిషన్‌ను జíస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం శుక్రవారం విచారించింది. కేజ్రీవాల్ తరఫున అభిషేక్ సింఘ్వీ, ఈడీ తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్చేస్తున్నాం. -
క్రిప్టోకరెన్సీ లావాదేవీలు చేస్తున్నారా? ఈ విషయం తెలుసుకోకపోతే...
న్యూఢిల్లీ: క్రిప్టోకరెన్సీల్లాంటి వర్చువల్ అసెట్స్ నియంత్రణపై కేంద్రం మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా క్రిప్టోల ట్రేడింగ్, సంబంధిత ఆర్థిక సర్వీసులకు మనీలాండరింగ్ నిరోధక చట్టాలను వర్తింపచేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనితో దేశీ క్రిప్టో ఎక్సే్చంజీలు ఇకపై అనుమానాస్పద లావాదేవీలేవైనా గుర్తిస్తే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇండియా (ఎఫ్ఐయూ–ఐఎన్డీ)కి తెలియ జేయాల్సి ఉంటుంది. ఎంతో కొంత విలువ కలిగి, క్రిప్టో పద్ధతుల్లో జనరేట్ చేసిన కోడ్ లేదా నంబరు లేదా టోకెన్లను వర్చువల్ డిజిటల్ అసెట్లుగా పరిగణిస్తారు. (ఇదీ చదవండి: ఫోరెన్సిక్ ఆడిటర్లకు గడువు పెంపు) -
‘ఆ తీర్పు అత్యంత ప్రమాదకరం’.. 17 విపక్ష పార్టీల ఆందోళన!
న్యూఢిల్లీ: పీఎంఎల్ఏ చట్టం 2002కు 2019లో సవరణలు చేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వంటి దర్యాప్తు సంస్థలకు మరిన్ని అధికారాలు కల్పించటాన్ని ఇటీవల సమర్థించింది సుప్రీం కోర్టు. ఈడీ అరెస్టులు, సోదాలు సరైనవేనని, దర్యాప్తు అధికారులు పోలీసులు కాదని స్పష్టం చేసింది. అయితే.. సుప్రీం కోర్టు తీర్పును అత్యంత ప్రమాదకరమైన తీర్పుగా అభివర్ణించాయి విపక్ష పార్టీలు. సుమారు 17 విపక్ష పార్టీలు సుప్రీం కోర్టు తీర్పుపై ఆందోళన వ్యక్తం చేశాయి. దీర్ఘకాలం పాటు దాని ప్రభావం ఉంటుందని, తీర్పును పునఃసమీక్షించాలని కోరాయి. ‘ప్రమాదకరమైన తీర్పు స్వల్ప కాలికంగా ఉంటుందని, త్వరలోనే రాజ్యాంగపరమైన నిబంధనలు అమలులోకి వస్తాయని ఆశిస్తున్నాం’ అంటూ ఓ ప్రకటన విడుదల చేశాయి. దీనిపై కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ, సీపీఎం, సమాజ్ వాదీ పార్టీ, ఆర్జేడీ వంటి ప్రధాన పార్టీలు సంతకాలు చేశాయి. రాజకీయ ప్రతీకారంతో చట్టాన్ని తప్పుదోవలో వాడుకుంటున్నారని ఇప్పటికే పలు విపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. తాజాగా.. సుప్రీం కోర్టు తీర్పుపై పునఃసమీక్షించాలని కోరనున్నట్లు పేర్కొన్నాయి. ఈ చట్టంలో చాలా తక్కువ మంది దోషులుగా తేలారని తెలిపాయి. 8 ఏళ్ల మోదీ పాలనలో ఈడీ రైడ్స్ 26 రెట్లు పెరిగాయి. 3,010 మనీలాండరింగ్ కేసులు నమోదు కాగా.. అందులో 23 మంది మాత్రమే దోషులుగా తేలారు. 112 సోదాల్లో ఎలాంటి ఆధారాలు లేవు. పార్లమెంట్లో మనీలాండరింగ్ చట్ట సవరణ చేసిన విధానాన్ని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. మనీ బిల్గా ప్రవేశపెట్టిన ఫైనాన్స్ చట్టం కింద వాటిని ఆమోదించారని పేర్కొన్నాయి. మనీ బిల్లు తప్పనిసరిగా కన్సాలిడేటెడ్ ఫండ్, ట్యాక్స్‌ల నుంచి నగదు కేటాయింపులకు వర్తించాలని, కానీ, ఇతర అంశాల్లో చట్టాలు చేసేందుకు ఉపయోగించకూడదని పేర్కొన్నాయి. సవరణలు చేసేందుకు ఆర్థిక చట్టాన్ని ఉపయోగించే విధానం రాజ్యాంగ బద్ధతను పరిశీలించాల్సిన అవసరం ఉందన్నాయి. 17 Opposition parties, including TMC & AAP, plus one independent Rajya Sabha MP, have signed a joint statement expressing deep apprehensions on long-term implications of the recent Supreme Court judgement upholding amendments to PMLA,2002 and called for its review. The statement: pic.twitter.com/vmhtxRHAnl — Jairam Ramesh (@Jairam_Ramesh) August 3, 2022 ఇదీ చదవండి: Yes Bank DHFL Scam: ముంబై బిల్డర్స్‌కు చెందిన రూ.415 కోట్ల ఆస్తులు సీజ్! -
ఈడీనే కరెక్ట్.. అరెస్ట్‌లపై సుప్రీం కీలక వ్యాఖ్యలు!
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ (పీఎంఎల్ఏ) ప్రకారం విచారణ, అరెస్టులు, ఆస్తుల జప్తు చేపట్టేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారాలను సమర్థించింది సుప్రీం కోర్టు. ఈ మేరకు దాఖలైన పిటిషన్‌పై బుధవారం కీలక వ్యాఖ్యలే చేసింది. పీఎంఎల్ఏ చట్టంలోని నిబంధనల చట్టబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ ఎంఏ ఖాన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కు అధికారులు కల్పించే.. పీఎంఎల్ఏ చట్టంలోని సెక్షన్లు 5, 8(4), 15,17,19లు చట్టబద్ధమేనని స్పష్టం చేసిన ధర్మాసనం.. బెయిల్ విషయంలోనూ సెక్షన్ 45 సరైనదేనని నొక్కి చెప్పింది. ఈడీ అధికారులు పోలీసులు కాదు.. పీఎంఎల్ఏలోని పలు సెక్షన్లను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది ధర్మాసనం. దర్యాప్తు సంస్థలైన ఈడీ, తీవ్ర నేరాల దర్యాప్తు కార్యాలయం(ఎస్ఎఫ్ఐఓ), డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) వంటివి పోలీసు విభాగాలు కాదని స్పష్టం చేసింది ధర్మాసనం. అయితే విచారణలో భాగంగా ఆయా సంస్థలు నమోదు చేసే వాంగ్మూలాలు ఆధారాలేనని పేర్కొంది. ఈసీఐఆర్ అనేది ఎఫ్ఐఆర్ కాదు.. మనీలాండరింగ్ కేసులో నిందితులను అదుపులోకి తీసుకుంటున్న సమయంలో అరెస్ట్‌కు సంబంధించిన విషయాలను ఈడీ అధికారులు వెల్లడించటం తప్పనిసరి కాదని పేర్కొంది సుప్రీం కోర్టు. ►ఫిర్యాదు పత్రం(ఈసీఐఆర్)ను నిందితులకు ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంది. పీఎంఎల్ఏ చట్టం పరిధిలో మనీలాండరింగ్ అనేది తీవ్రమైన నేరమని ధర్మాసనం తెలిపింది. ► ‘ఎఫ్‌ఆర్‌కు ఈసీఐఆర్ సమానం కాదు. ముందస్తుగా ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవటం ఈడీ విచారణకు అడ్డంకి కాదు.’ అని పేర్కొంది. ► మరోవైపు.. పీఎంఎల్ఏ చట్టంలో బెయిల్ కోసం జంట నిబంధనలు చట్టబద్ధమేనని, ఏకపక్షం కాదని పేర్కొంది ధర్మాసనం. ఈ నిబంధనలు బెయిల్ పొందటంలో కఠినంగా మారినట్లు పిటిషనర్లు పేర్కొనటాన్ని తోసిపుచ్చింది. ► పీఎంఎల్ఏ చట్టంలో పలు సవరణలు చేయాలన్న ప్రశ్నలకు బధులుగా.. తమ బెంచ్ దీనిపై నిర్ణయం తీసుకోలేదని, ఏడుగురు సభ్యుల బెంచ్ విచారిస్తుందని పేర్కొన్నారు జస్టిస్ ఖాన్విల్కర్. ► పీఎంఎల్ఏ చట్టంలోని నిబంధనలపై వందకు పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. వాటన్నింటిని ఒకేసారి విచారిస్తోంది సుప్రీం కోర్టు. ► పోలీసు అధికారులను దర్యాప్తు ఏజెన్సీలు ఉపయోగిస్తున్నాయని, దర్యాప్తులో సీఆర్పీసీని అనుసరించాలని పిటిషనర్లు కోరారు. ► ఈసందర్భంగా అరెస్టులు, బెయిల్ మంజూరు, ఆస్తుల జప్తు అనేవి కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రోసీజర్(సీఆర్పీసీ) కిందకు రావని పేర్కొంది. ఇదీ చదవండి: Eknath Shinde: పొలిటికల్ హీట్ పెంచిన షిండే ట్వీట్.. ఉద్ధవ్ థాక్రేతో స్నేహం! -
ఆన్లైన్ గేమింగ్ కోసం.. కేవైసీ ఇవ్వాలి
న్యూఢిల్లీ: ఆన్లైన్ స్కిల్ గేమింగ్ పరిశ్రమ భారీగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారుతోంది. దీంతో ఈ గేమింగ్ పరిశ్రమను యాంటీ మనీ లాండరింగ్ చట్టం (అక్రమ నగదు చెలామణి నిరోధక/పీఎల్‌ఎంఏ) పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర సర్కారు భావిస్తోంది. దీనివల్ల అక్రమ నగదు చెలామణిని నిరోధించడమే కాకుండా, ఉగ్రవాదులకు నిధులు అందకుండా కట్టడి చేసినట్టు అవుతుంది. మనీ లాండరింగ్ చట్టం పరిధిలోకి తీసుకొస్తే స్కిల్ గేమింగ్, ఈ గేమింగ్ కంపెనీలన్నీ కూడా తమ కస్టమర్లకు సంబంధించి కేవైసీ నిబంధనలను అనుసరించాలి. బ్యాంకు ఖాతాలు, మ్యూచువల్ ఫండ్స్ పథకాలు, స్టాక్స్ కొనుగోలుకు ఇస్తున్నట్టే.. ఈ గేమింగ్/స్కిల్ గేమింగ్ యూజర్లు తమకు సంబంధించి కేవైసీ వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. అప్పుడు గేమింగ్‌కు సంబంధించి యూజర్ల లావాదేవీలను ప్రభుత్వం ట్రాక్ చేయగలుగుతుంది. పారదర్శకత లేదు.. ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమలో పారదర్శకత లేదని వెల్లడైంది. కొన్ని నగదు లావాదేవీలకు సంబంధించి వివరాలను దర్యాప్తు సంస్థలు పొందలేకపోయాయి. ఈ గేమింగ్ సంస్థలు తమ కస్టమర్ల విషయంలో పూర్తి స్థాయి వివరాలను సేకరించడం, ధ్రువీకరించడం చేయడం లేదని తెలిసింది. గేమింగ్ యాప్‌ల రూపంలో లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నట్టు, వీటికి సంబంధించి కస్టమర్ గుర్తింపు వివరాలు లేవని దర్యాప్తులో వెల్లడైనట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దీంతో కేవైసీ నిబంధనల పరిధిలోకి, పీఎల్‌ఎంఏ కిందకు స్కిల్ గేమింగ్ యాప్‌లను ప్రభుత్వం తీసుకురానున్నట్టు తెలిపాయి. దీంతో ఆయా సంస్థలు డైరెక్టర్‌తోపాటు, ప్రిన్సిపల్ ఆఫీసర్‌ను నియమించాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. స్కిల్ గేమింగ్ యాప్స్, ఈ గేమింగ్ సంస్థలను పీఎంఎల్ఏ పరిధిలోకి తీసుకువస్తే.. నగదు జమ చేస్తున్న వ్యక్తి, లబ్ధి దారు, ఇతర ముఖ్యమైన వివరాలను ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ)కు నివేదించాల్సి ఉంటుంది. అలాగే, రూ.50,000కు పైన ఎటువంటి లావాదేవీ విషయంలో అయినా అనుమానం ఉంటే, ఆ వివరాలకు కూడా ప్రత్యేకంగా తెలియజేయాలి. పీఎల్‌ఎంఏ చట్టం కిందకు ఆన్లైన్ స్కిల్ గేమింగ్ యాప్‌లను కూడా రిపోర్టింగ్ సంస్థలుగా తీసుకురావడానికి ముందు.. బ్రిటన్‌కు చెందిన గ్యాంబ్లింగ్ చట్టాన్ని పరిశీలించాలన్న సూచన కూడా ఉన్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆన్లైన్ గేమింగ్ సంస్థలను నియంత్రించే విషయంలో సరైన కార్యాచరణ లేకపోవవడం పట్ల కేంద్ర ఆర్థిక శాఖ, ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిపాయి. ప్రస్తుతం ఈ కంపెనీలన్నీ కూడా కార్పొరేట్ వ్యవహారాల శాఖ వద్ద నమోదు అవుతున్నాయి. ఈ కంపెనీల్లో విదేశీ పెట్టుబడులపై నిషేధం కూడా లేదు. స్కిల్ గేమింగ్ కంపెనీల్లో కొన్ని మాల్టాలో నమోదైనట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ గ్రే లిస్ట్‌లో ఉన్న ఈ దేశం.. ఆర్థిక అక్రమాలకు వేదికగా నిలుస్తున్న విషయాన్ని గుర్తు చేశాయి. -
ఆర్బీఐ ద్వారా ఎన్పీఆర్
ముంబై: జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్) అప్‌గ్రెడేషన్‌పై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నప్పటికీ కేంద్రం వెనక్కి తగ్గేలా లేదు. 2015 నాటి ప్రతిపాదనలను తెరపైకి తెచ్చి, తాజాగా బ్యాంకుల ద్వారా వివరాలను సేకరించేందుకు యోచిస్తోంది. మనీల్యాండరింగ్ నిబంధనలు–2005ను సవరిస్తూ కేంద్ర ఆర్థిక శాఖలోని రెవెన్యూ విభాగం 2015 జూలై 7వ తేదీన రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)కి ఒక సర్క్యులర్ జారీ చేసింది. వినియోగదారుల నుంచి అధికారిక ధ్రువీకరణ పత్రాలతోపాటు ‘నో యువర్ కస్టమర్’ వివరాల్లో భాగంగా ఎన్పీఆర్ను సేకరించాలని అందులో సూచించింది. కారణాలు వెల్లడి కానప్పటికీ, మూడేళ్ల తర్వాత ఆర్బీఐ 2018 ఏప్రిల్‌లో కేవైసీలో ఎన్పీఆర్ను భాగంగా మార్చుతూ ఆదేశాలిచ్చింది. అయితే, ఈ నెల 9వ తేదీన దీనిని ఆర్బీఐ ప్రకటించడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమయింది. ‘బ్యాంకింగ్ కార్యకలాపాలు, కొత్త అకౌంట్లకు ఈ వివరాలు తీసుకోవాలన్న ఆర్బీఐ సూచనలను అమలు చేస్తున్నాం. కొందరు భావిస్తున్నట్లుగా ఎన్పీఆర్ వివరాలివ్వడం తప్పనిసరి మాత్రం కాదు’అని ఆర్బీఐ ఎండీ పల్లవ్ మహాపాత్ర తెలిపారు. కాగా, కేరళ ప్రభుత్వం ఎన్పీఆర్ విషయంలోనూ కేంద్రంతో విభేదిస్తోంది. ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆందోళనల దృష్ట్యా దీనిని అమలు చేయబోమని కేంద్రానికి తెలపాలని సీఎం విజయన్ నేతృత్వంలో కేబినెట్ భేటీ నిర్ణయించింది. ఎన్సార్సీని అమలు చేయబోమంటూ కేరళ అసెంబ్లీ తీర్మానం చేసిన విషయం తెలిసిందే. -
నీరవ్ మోదీకి భారీ షాక్
న్యూఢిల్లీ : పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ(48)కి ముంబైలోని స్పెషల్ కోర్టు భారీ షాక్ ఇచ్చింది. పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడి(ఎఫ్ఈవో)గా నీరవ్‌ను గుర్తిస్తూ ప్రకటన విడుదల చేసింది. మనీలాండరింగ్ చట్టం కింద ముంబైలోని అక్రమ నగదు చెలామణి నిరోధక(పీఎంఎల్ఏ) కోర్టు అతడిని ఆర్థిక నేరగాడిగా పేర్కొంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ)ను రూ.14వేల కోట్ల మేర మోసం చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోదీ లండన్‌కు పారిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడిని అప్పగించాలంటూ భారత్ యూకేను కోరుతోంది. ఈ నేపథ్యంలో లండన్‌లో అరెస్టైన నీరవ్.. బెయిల్ కోసం పిటిషన్ పెట్టుకోగా నాలుగుసార్లు తిరస్కరణకు గురైంది. దీంతో అతడిని నైరుతి లండన్‌లోని వాన్‌డ్స్‌వర్త్ జైలుకు తరలించారు. ఈ క్రమంలో డిసెంబర్ 4న వీడియో లింక్ ద్వారా అతడిని కోర్టు విచారించనుందని వార్తలు వెలువడ్డాయి. కాగా నీరవ్ మోదీ బెయిల్ పిటిషన్‌ను భారత్ తరపున వాదిస్తున్న న్యాయవాది లండన్ కోర్టులో సవాల్ చేశారు. ఇక భారత్‌కు అప్పగిస్తే ఆత్మహత్య చేసుకుంటానని నీరవ్ మోదీ బెదిరించిన విషయం తెలిసిందే. కాగా భారత బ్యాంకులకు రూ.9,000 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టి విదేశాలకు చెక్కేసిన వ్యాపారవేత్త విజయ్‌మాల్యాను ముంబై కోర్టు ఆర్థిక నేరస్తుడిగాఇప్పటికే ప్రకటించిన విషయం విదితమే. తాజా పరిణామాల నేపథ్యంలో మాల్యా తర్వాత ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించిన రెండో వ్యక్తిగా నీరవ్ నిలిచాడు. -
నీరవ్ మోదీ కార్లను వేలం వేయనున్న ఈడీ
ముంబయి : వజ్రాల వ్యాపారి, ఆర్థిక నేరస్తుడు నీరవ్ మోదీ చుట్టూ మరింత ఉచ్చు బిగుసుకోనుంది. తాజాగా అతనికి చెందిన 13 కార్లను ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్(ఈడీ) వేలం వేయనుంది. కాగా, ఈ వేలం నవంబర్ 7న జరగనుంది. పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నిందితుడిగా ఉన్న నీరవ్ మోదీని గతేడాది మార్చిలో లండన్‌లో అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైళ్లో ఉన్న నీరవ్ మోదీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దీనికి సంబంధించిన విచారణ నవంబర్ 6న జరగనుంది. అయితే ఈ ఏడాది ఆగస్టులో నీరవ్ మోదీ ఆస్తులన్నింటిని జప్తు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఈడీ మనీ లాండరింగ్ చట్టం కింద ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ మేరకు నీరవ్‌కు చెందిన విలువైన వాచ్‌లు, పెయింటింగ్స్, కార్లను వేలం వేయడానికి అనుమతి పొందింది. ఇందులో భాగంగానే నవంబర్ 7న కార్ల వేలం వేయనున్నారు.అయితే వేలం వేయనున్న కార్లలో బెంట్లీ ఆర్నేజ్ , రోల్స్ రాయిస్ ఘోస్ట్ ఎంహెచ్, పోర్స్చే పనామెరా, మెర్సిడెస్ బెంజ్ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. -
ఎంపీ మిసా భారతికి ఈడీ సమన్లు
న్యూఢిల్లీ: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. తాజాగా లాలూ కుమార్తె, రాజ్యసభ సభ్యురాలు మిసా భారతికి సోమవారం ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) సమన్లు జారీ చేసింది. మంగళవారం విచారణకు హాజరు కావాలని ఆమెను ఈడీ ఆదేశించింది. అలాగే ఢిల్లీలోని మిసా ఫాంహౌస్‌ను ఈడీ అటాచ్ చేసే యోచనలో ఉంది. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి రెండో రోజుల క్రితం ఆమె నివాసంతో పాటు ఫాంహౌస్‌లో ఈడీ ఇప్పటికే సోదాలు చేసిన విషయం తెలిసిందే. మిసా, ఆమె భర్త బినామీ ఆస్తులు కలిగి ఉన్నారని భావిస్తున్న ఈడీ అధికారులు.. గత నెలలో వారిని విచారించారు. తాజాగా మరోసారి విచారణ పట్టిన అధికారులు.. ఇల్లు, ఆఫీసుల్లో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా పలు డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లతో పాటు ఎలక్ట్రానిక్ డివైజ్‌లు, ఫోన్లు కూడా సీజ్ చేశారు. మరోవైపు లాలూ ప్రసాద్ యాదవ్ నివాసంలో సీబీఐ సోదాలు చేపట్టి, కేసులు నమోదు చేసింది. -
లాటరీ కింగ్ రూ.122 కోట్ల ఆస్తుల జప్తు
చెన్నై : దేశంలో లాటరీ కింగ్ గా పేరొందిన శాంటియాగో మార్టిన్కి చెందిన రూ.122 కోట్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో లాటరీ టికెట్ల అమ్మకాల్లో అవకతవకలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై అతనిపై ఆరెండు రాష్ట్రాల్లో అనేక కేసులు నమోదైనాయి. మార్టిన్ 2007లో కేరళలోని సీపీఎంకు చెందిన ఒక వార్తా పత్రికకు రూ.2 కోట్ల విరాళం ఇచ్చినట్లు జరిగిన ప్రచారం కలకలం సృష్టించింది. ప్రతిపక్షాల ఒత్తిడి మేరకు ఈ కేసు విచారణ సీబీఐ చేతుల్లోకి వెళ్లింది. ఈ కేసు విచారణలో భాగంగా ఈడీ అధికారులు మార్టిన్ ఆస్తులపై దృష్టిపెట్టి విచారించగా అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో సోమవారం మార్టిన్‌కు చెందిన రూ.122.4 కోట్ల విలువైన నాలుగు సంస్థల స్థిరాస్తులను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు మార్టిన్ కుటుంబసభ్యుల పేరు మీద సుమారు రూ.5000వేల కోట్లు ఉన్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. గతంలోనూ మార్టిన్‌కు చెందిన ఆస్తులు, ఇళ్లపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడి చేసి సుమారు వందకోట్లకు పైగా స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. మార్టిన్ పై ఇప్పటికే సిక్కింలో 4500 కోట్ల రూపాయల చీటింగ్ కేసు కూడా ఉంది.