irregularities in tenders
-
Delhi Liquor Scam: నిందితుల జాబితాలో ఆప్, కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఎక్సయిజ్ విధానంలో అవకతవకల కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం తాజాగా మరో చార్జ్‌షీట్‌ను దాఖలుచేసింది. ఇందులో ఆమ్ ఆద్మీ పార్టీ, సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్లను చేర్చింది. మనీ లాండరింగ్ ఆరోపణలపై ఇలా ఒక జాతీయ రాజకీయ పార్టీ, ఒక ముఖ్యమంత్రి పేర్లను చార్జ్‌షీట్‌లో చేర్చడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఢిల్లీలో ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజాకు ఈడీ 200 పేజీల అభియోగపత్రాలను సమరి్పంచింది. వీటిని పరిగణనలోకి తీసుకోవాలా వద్దా అనే అంశాన్ని జడ్జి త్వరలో పరిశీలించనున్నారు. ఆప్ కన్వీనర్‌గానే కాకుండా వ్యక్తిగతంగానూ ఈ కుట్రలో కేజ్రీవాల్ భాగస్వామి అయ్యారని తాజా చార్జ్‌షీట్‌లో ఈడీ ఆరోపించింది. మద్యం కేసులో మొత్తంగా ఈడీ ఇప్పటిదాకా ఎనిమిది చార్జ్షీట్లు దాఖలుచేసింది. 18 మందిని అరెస్ట్‌చేసింది. 38 సంస్థలకు ఈ నేరంతో సంబంధముందని పేర్కొంది. రూ.243 కోట్ల విలువైన ఆస్తులను జప్తుచేసింది. ‘‘ కేజ్రీవాల్ బసచేసిన ఏడు నక్షత్రాల హోటల్ బిల్లును ఈ కేసు నిందితుల్లో ఒకరు చెల్లించారు. ఆ బిల్లులు మా వద్ద ఉన్నాయి’’ అని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు గురువారం సుప్రీంకోర్టులో తెలిపారు. మనీ లాండరింగ్ కేసులో తనను అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ కేజ్రీవాల్ దాఖలుచేసిన పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు శుక్రవారం రిజర్వ్‌చేసింది. ఈ పిటిషన్‌ను జíస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం శుక్రవారం విచారించింది. కేజ్రీవాల్ తరఫున అభిషేక్ సింఘ్వీ, ఈడీ తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్చేస్తున్నాం. -
ఐఆర్బీ టెండర్లపై సీఎం రేవంత్ అభ్యంతరం
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్‌రోడ్డు లీజు టెండర్లలో అక్రమాలపైన ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. సీబీఐ లేదా అదేస్థాయి సంస్థలతో విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించడంతో ఔటర్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఔటర్ టోల్ లీజులో అక్రమాలకు బాధ్యులైన అధికారురులపైనా చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మరోవైపు ఔటర్ లీజు వ్యవహారంపైన పూర్తి వివరాలను అందజేయాలని హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలిని ముఖ్యమంత్రి ఆదేశించారు. 158 కిలోమీటర్ల మార్గంలో టోల్ వసూలు ద్వారా ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయాన్ని ఆర్జించిపెట్టే ఔటర్ రింగ్‌రోడ్డును గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిబంధనలకు విరుద్దంగా ఐఆర్బీ సంస్థకు కారుచౌకగా కట్టబెట్టినట్లు అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. బీజేపీతో పాటు, పీసీసీ చీఫ్‌గా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం తీవ్ర ఆరోపణలు చేశారు. కనీస ధర వెల్లడించకపోవడంతో ఔటర్లీజు వ్యవహారంలో భారీ కుంభకోణం జరిగినట్లు ఆరోపించారు. రేవంత్‌రెడ్డి ఆరోపణలపైన అప్పటి హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్‌కుమార్ ఆయనపైన పరువునష్టం దావా కూడా వేశారు. ఈ నేపథ్యంలోనే వివాదాస్పదంగా మారిన ఔటర్ లీజు అంశాన్ని ప్రస్తుతం ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి సీరియస్‌గా పరిగణనలోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే సమగ్రమైన విచారణ చేపట్టాలని ఆయన హెచ్ఎండీఏ అధికారులను ఆదేశించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. టీఓటీ పద్ధతిలో ఔటర్ లీజు... కేంద్ర కేబినెట్ సబ్ కమిటీ ఆమోదించిన టీఓటీ (టోల్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్) పద్ధతిలో ఔటర్ రింగ్‌రోడ్డును 30 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేందుకు 2022 ఆగస్టు11వ తేదీన గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అదే సంవత్సరం నవంబర్ 9వ తేదీన అంతర్జాతీయ సంస్థల నుంచి హెచ్ఎండీఏ టెండర్లను ఆహా్వనించింది. గత సంవత్సరం మార్చి 31వ తేదీ నాటికి 11 బిడ్డర్లు ఆసక్తిని ప్రదర్శించారు. బిడ్డింగ్ ప్రక్రియలో భాగంగా మూడుసార్లు బిడ్ గడువును పొడిగించారు. 30 ఏళ్ల లీజుపైన బేస్ ప్రైస్ కంటే ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలపర్స్ లిమిటెడ్ సంస్థ రూ.7380 కోట్లతో ఎక్కువ మొత్తంలో బిడ్ చేసినట్లు అప్పటి హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్‌కుమార్ వెల్లడించారు. కానీ ప్రభుత్వం నిర్ణయించిన బేస్ప్రైస్పైన మాత్రం గోప్యతను పాటించడంతో ఈ లీజు వ్యవహారం వివాదాస్పదమైంది. మొదట్లో 11 సంస్థలు పోటీ చేయగా, చివరకు 4 సంస్థలు మాత్రమే పోటీలో మిగిలాయి. ఆ నాలుగింటిలోనూ ఐఆర్బీ ఎక్కువమొత్తంలో బిడ్ వేసి లీజును దక్కించుకుంది. 158 కిలోమీటర్ల ఔటర్ రింగ్‌రోడ్డు మార్గంలో ప్రతి రోజు 1.5 లక్షలకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. అప్పట్లో గత ప్రభుత్వం నిర్దేశించిన అంచనాల కంటే ఎక్కువ మొత్తంలో ఐఆర్బీ సంస్థకు టోల్ ఆదాయం లభిస్తున్నట్లు అధికారవర్గాల అంచనా. మరోవైపు ఏటా సుమారు రూ.550 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించి పెట్టే కామధేనువు వంటి ఔటర్‌ను ప్రైవేట్ సంస్థకు ధారాదత్తం చేయడం పట్ల ఇంజనీరింగ్ నిపుణులు సైతం అభ్యంతరాలు వ్యక్తం చేశారు. గడువు కంటే ముందే రూ.7380 కోట్లు చెల్లించిన ఐఆర్బీ... ఇలా వివాదాల నడుమ ఔటర్ టెండర్‌ను దక్కించుకున్న ఐఆర్బీ సంస్థ నిర్ణీత 120 రోజుల గడువు కంటే ముందే రూ.7380 కోట్ల లీజు మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించింది..దీంతో 2008 నుంచి 2023 వరకు వరకు సుమారు 15 సంవత్సరాల పాటు హెచ్ఎండీఏ అనుబంధ సంస్థ అయిన హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ నిర్వహణలో ఉన్న ఔటర్‌రింగ్ రోడ్డు మొట్టమొదటిసారి ప్రైవేట్ సంస్థ నిర్వహణలోకి వెళ్లిపోయింది. నిబంధనల మేరకు రానున్న 30 ఏళ్ల పాటు ఈ లీజు కొనసాగవలసి ఉంటుంది. 8 వరుస లేన్లతో (1264 లేన్ కి.మీలు) కూడిన 158 కి.మీల ఔటర్ రింగ్రోడ్డుపైన ఉన్న సుమారు 120కి పైగా టోల్గేట్ల వద్ద ఐఆర్బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌వే సంస్థ టోల్ వసూళ్లను కొనసాగిస్తోంది. ఔటర్ రింగురోడ్డు నుంచి టోల్ వసూలు చేయడంతో పాటు రహదారుల నిర్వహణ, అవసరమైన మరమ్మతులు చేపట్టడం, తదితర ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) బాధ్యతలను కూడా గోల్కొండ ఎక్స్‌ప్రెస్ వే చేపట్టవలసి ఉంటుంది. హెచ్‌జీసీఎల్ ఔటర్‌ను ఆనుకొని ఉన్న సర్వీస్ రోడ్లు, ఔటర్ మాస్టర్‌ప్లాన్ అమలు, పచ్చదనం పరిరక్షణ వంటి బాధ్యతలకు పరిమితమైంది. -
జేఎల్ నియామకాల్లో అక్రమాలు
సాక్షి, హన్మకొండ(వరంగల్) : టీఎస్ ఎన్పీడీసీఎల్ ద్వారా చేపట్టిన నియామకాల్లో అధికారులు అక్రమాలకు తెరలేపారు. కొంతకాలంగా ఎన్పీడీసీఎల్లో చేపట్టిన ప్రతీ నియామక ప్రక్రి య వివాదాస్పదమవుతోంది. ఓ వైపు ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్న తమ దారి తమ దే అన్నట్లు అధికారులు వ్యవహరిస్తున్నారు. యాజమాన్యం అధికారులంటే ఒక తీరు.. ఉద్యోగులంటే మరో తీరుగా వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. అధికారులు ఎంత పెద్ద తప్పు చేసినా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుం డగా.. ఉద్యోగులు మాత్రం చిన్న పొరపాటు చేసినా పెద్ద పెద్ద శిక్షలు విధిస్తున్నారని ఉద్యోగ సం ఘాలు ఆరోపిస్తున్నాయి. అయినా అధికారులు మాత్రం తమ కనుసన్నల్లో అక్రమాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కఠినంగా ఉన్నామని చెబుతూనే.... జూనియర్ లైన్‌మన్ పోస్టుల భర్తీలో అక్రమాలు, అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని అభ్యర్థులు లేవనెత్తుతున్న సందేహాలు నిజమేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు పోల్ టెస్ట్ పై కఠినంగా వ్యవహరిస్తున్నారని అనిపించుకుంటూనే.. ఇదే అదునుగా అక్రమాలకు తెరలేపారని అభ్యర్థులు చెబుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టిన పోల్ టెస్ట్‌లో అసలు అభ్యర్థికి బదులుగా మరో వ్యక్తిని అధికారులు స్తంభం ఎక్కించారు. ఎన్పీడీసీఎల్ పరిధిలోని పాత ఐదు సర్కిళ్ల పరిధిలో రెండో విడత పోల్ టెస్ట్uమొదటిపేజీ తరువాయి నిర్వహించారు. పూర్వ అదిలాబాద్ సర్కిల్ పరిధిలోనూ ఈ ప్రక్రియ కొనసాగింది. జూన్ 20న జరిగిన పోల్ టెస్ట్‌లో అసలు అభ్యర్థికి బదులు మరో అభ్యర్థి స్తంభం పరీక్షకు హాజరయ్యారు. వరంగల్ సర్కిల్లో ఓ కాంటాక్టర్ వద్ద పని చేస్తున్న కార్మికుడు స్తంభాలు ఎక్కడంలో నిపుణుడు. దీంతో రాత పరీక్షలో అర్హత సాధించి స్తంభం పరీక్షకు ఎంపికైన ఓ అభ్యర్థి.. ఇక్కడి నుంచి నిష్ణాతుడిని తీసుకెళ్లి స్తంభం ఎక్కించాడు. 2,553 పోస్టుల భర్తీకి.. తెలంగాణ రాష్ట్ర ఉత్తర విద్యుత్ మండలి(టీఎస్ ఎన్పీడీసీఎల్) క్షేత్ర స్థాయిలో వినియోగదారులకు సత్వర సేవలు అందించేందుకు ఖాళీగా ఉన్న జూ నియర్ లైన్మెన్ పోస్టుల భర్తీకి సిద్ధమైంది. జిల్లాల పునర్విభజన జరిగినా పూర్వ జిల్లాల వారీగా వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామబాద్, అది లాబాద్ సర్కిళ్ల వారీగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ క్రమంలో 2,553 జూనియర్ లైన్మెన్ పోస్టుల నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేసి రాత పరీక్ష నిర్వహించింది. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు పూర్వ విద్యుత్ సర్కిళ్ల వారీగా జనవరిలో మొదటి విడత పోల్ టెస్ట్ (స్తంభం ఎక్కే పరీక్ష) నిర్వహించారు. ఈ మేరకు 2,553 పోస్టులకుగాను అంతే సంఖ్యలో అభ్యర్థులను ఆహ్వానించగా 1,,222 మంది అభ్యర్థులు పోల్ టెస్ట్‌లో ఉత్తీ ర్ణత సాధించారని సమాచారం. అయితే, ఎందరు అర్హత సాధించారనేది అధికారికంగా ప్రకటించలేదు. ఈ పోల్ టెస్ట్ నిర్వహణ, నిర్వహణలో అక్రమాలు జరిగాయని, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని, అర్హత సాధించినా అనర్హత వే టు వేశారని అభ్యర్థులు, ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో ఓ కమిటీని నియమించారు. ఈ నిపుణుల కమిటీ బాధ్యులు పరీ క్షకు సంబంధించిన వీడియో పుటేజీ ద్వారా అభ్యర్థుల ఎంపికకు తుది రూపు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే, పరిశీలించి అభ్యర్థుల తుది జాబితాను సిద్ధం చేసినా బయటకు వెల్లడించలేదు. మరో విడత నోటిఫికేషన్లో పేర్కొన్న ఖాళీల మేరకు మొదటి విడత పరీక్షలో అభ్యర్థులు ఎంపిక కాలేదు. దీంతో రెండో విడతగా మరికొందరిని స్తంభం పరీక్షకు పిలిచారు. రెండో విడత పరీక్షలోనూమాలు జరిగాయనేరోపణలు వచ్చాయి. అదిలాబాద్‌లో జరిగిన పోల్ టెస్ట్‌లో చివరకు రాత పరీ„ýక్షలో సాధించిన అభ్యర్థి తనకు బదులు స్తంభం పరీక్షకు మరో అభ్యర్థిని తీసుకువచ్చారని సహచర అభ్యర్థులు గుర్తించారు. జూన్ 20న జరిగిన స్తంభం పరీక్షలో 104 సీరియర్ నంర్గా ఉన్న శ్రావణ్‌కుమార్ స్థానంలో వరంగల్‌లోని ఓ కాంట్రాక్టర్ వద్ద పని చేస్తున్న బి.నవీన్ పరీక్షలో పాల్గొన్నాడని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఇదంతా అధికారుల కనుసన్నల్లోనే జరిగిందని అభ్యర్థుల వాదన. ఓ వైపు పోల్ టెస్ట్ పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నట్లు చెబుతూనే చాటుగా అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడుతున్నారు. టీఎస్ ఇకనైనా ఎన్పీడీసీఎల్ యాజమాన్యం స్పందించి వీడియో చిత్రీకరణను పరీక్షించి పోల్ టెస్ట్ నిర్వహంచిన, అక్రమాలకు తెర లేపిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. -
ఇంతింతై.. అవినీతి కొండంతై
సాక్షి, కడప: నీరు–చెట్టు పనులు తెలుగుదేశం పార్టీ నాయకులకు కాసుల వర్షం కురిపించాయి. గత ఏడాది మే నెలవరకు జిల్లావ్యాప్తంగా ఈ పథకం కింద 9,405 పనులు చేపట్టగా.. ఇందుకోసం రూ.626.56 కోట్లు వ్యయం చేశారు. ఇందులో చాలాచోట్ల గతంలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులనే మళ్లీ చేపట్టినట్లు రికార్డుల్లో చూపి రూ.లక్షలు తమ జేబుల్లో నింపుకొన్నారు. కొందరు టీడీపీ నేతలు తూతూమంత్రంగా పనులు కానిచ్చేశారు. మరికొందరు నాసిరకంగా పనులు చేసి బిల్లులు దండుకున్నారు. కొన్నిచోట్ల నాసిరకంగా చేసిన చెక్‌డ్యాంలకు పగుళ్లు రావడంతో వాటికి పైపైన సిమెంటు పూతలు పూసి మమా అనిపించారు. ఇక పూడికతీత పనుల్లో చెరువులు, కుంటలు, కాలువల్లో తీసిన మట్టిని టీడీపీ నేతలు వదల్లేదు. ఆ మట్టిని రైతులకు ఉచితంగా ఇవ్వాల్సి ఉన్నప్పటికీ డిమాండ్‌ను బట్టి ట్రాక్టర్ రూ. 800 నుంచి రూ.2వేల వరకు అమ్ముకున్నారు. మొత్తం రూ. 447.80 కోట్ల విలువైన పనులు చేపట్టగా.. మట్టిని విక్రయించి టీడీపీ నేతలు లక్షలు గడించడం గమనార్హం. ఇక చెక్‌డ్యాం పనుల్లోనూ కోట్లాది రూపాయలు ఇలాగే వెనకేసుకున్నారు. నాసిరకంగా పనులు చేయడమే కాకుండా.. కొన్ని చోట్ల అవసరం లేకున్నా చెక్‌డ్యాంలు నిర్మించి సొమ్ము చేసుకున్నారు. జిల్లావ్యాప్తంగా రూ. 178.76 కోట్లు చెక్‌డ్యామ్‌లకు ఖర్చు పెట్టారు. చాలా చోట్ల చెక్‌డ్యాంలను పడగొట్టి మళ్లీ కట్టి సొమ్ము చేసుకున్నారు. మరికొన్ని చోట్ల ఉపాధి పనుల్లో భాగంగా చేసిన పూడికతీత పనులనే మళ్లీ చేసినట్లు చూపి బిల్లులు పక్కదారి మళ్లించారు. ఇలా టీడీపీ నేతలు జిల్లా వ్యాప్తంగా రూ. 250 కోట్లపైనే నిధులను దారి మళ్లించినట్లుగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నీరు–చెట్టు పనుల కోసం పోటాపోటీ.. నీరు–చెట్టు పనుల కోసం టీడీపీ నేతలు బహిరంగంగా రచ్చకు దిగడం జిల్లాలో కనిపించింది. బద్వేలు నియోజకవర్గంలో నీరు–చెట్టు పనులు నాయకుల మధ్య విభేదాలకు కారణమయ్యాయి. స్వయంగా ఎమ్మెల్యే జయరాములు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ధ్వజమెత్తారు. నియోజకవర్గానికి రూ. 90 కోట్లు నీరు–చెట్టు పథకం కింద నిధులు మంజూరు కాగా.. అందులో మాజీ ఎమ్మెల్యే విజయమ్మకు రూ.85 కోట్లు, తనకు రూ. 3 కోట్లు, మరో టీడీపీ నేత విజయజ్యోతికి రూ. 2 కోట్ల పనులు ఇచ్చారని మండిపడ్డారు. విజయమ్మ వర్గం పనులు చేయకుండానే బిల్లులు చేసుకున్నారని ఆయన బహిర్గతం చేసుకున్నారు. ఈ పనుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఎమ్మెల్యే జయరాములు విజిలెన్స్ అధికారులకు లేఖ రాశారు. ఈ పనులన్నీ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ వర్గానికి చెందిన వ్యక్తులే చేయడం గమనార్హం. దాదాపు రూ.2 కోట్ల విలువైన 22 చెక్‌డ్యామ్‌లను ఈ నియోజకవర్గంలో నిర్మించారు. అవన్నీ నాసిరకంగా చేశారన్న విమర్శలు ఉన్నాయి. విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టి కాంక్రీట్ నమూనాలను విజయవాడ ల్యాబ్‌కు పంపించారు. పనులన్నీ టీడీపీ నేతలకే.. జిల్లాలో నీరు–చెట్టు కింద చేపట్టిన పనుల్లో 99 శాతం పనులు టీడీపీ నేతలే దక్కించుకున్నారు. ఆ పనులను బినామీలతో చేయించారు. ఎక్కడా నిబంధనలు పాటించకుండా పనులను మమ అనిపించి కోట్లు దండుకున్నారు. జమ్మలమడుగులో అధికారపార్టీ నేతతోపాటు వైఎస్సార్సీపీ నుంచి టీడీపీ తీర్థం పుచ్చుకున్న మంత్రి ఆదినారాయణరెడ్డిలు నీకు సగం.. నాకు సగం అంటూ పనులు పంచుకున్నారు. ఈ నియోజకవర్గంలో రూ. 96 కోట్ల విలువైన పనులు జరిగాయి. నియోజకవర్గంలోని కొండాపురంలో ఏకంగా పనుల విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం నెలకొంది. పంచాయతీ పోలీసు స్టేషన్‌కు చేరింది. అక్కడ పోలీసుల సమక్షంలోనే ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కడప బుగ్గవంకలో... కడప బుగ్గవంక పరిధిలో పూడికతీత పనులకు సంబంధించి తొలుత రూ. 66 లక్షలకు అధికారులు నివేదికలు తయారు చేశారు. అయితే ఈ పనులను టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి బినామీలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పనులు చేశారనే ఫిర్యాదులపై అధికారులు స్పందించక తప్పలేదు. దీంతో పనులను నిలిపివేశారు. కేవలం రూ. 12 లక్షలు బిల్లులు చెల్లించారు. విజిలెన్స్ విభాగం పరిశీలన జరపడంతో అంతటితో ఈ పనులు ఆగిపోయాయి. వారిపై ఎలాంటి చర్యలు లేవు. కమలాపురం నియోజకవర్గంలో టీడీపీ ఇన్చార్జి అంతా తానై రూ. 49.15 కోట్ల నీరు–చెట్టు పనులు చేయడం గమనార్హం. పులివెందుల నియోజకవర్గంలో రూ. 71.90 కోట్ల విలువైన నీరు–చెట్టు పనులు చేపట్టగా.. నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ ఎక్కువ శాతం పనులు దక్కించుకున్నారు. ఈ పనులన్నీ తన అనుయాయులకు పంచిపెట్టారు. మట్టి కొట్టుకుపోయింది వల్లూరు మండలంలో పైడికాలువ, పెద్దపుత్త గ్రామాల మధ్యన గల వంకపై పైడికాలువ గ్రామ పంచాయతీ పరిధిలోని జంగంపల్లె వద్ద జల వనరుల శాఖ ఆధ్వర్యంలో నీరు చెట్టు కింద నిర్మించిన మోడల్ చెక్‌డ్యాం. 30 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ చెక్ డ్యాం జిల్లాలో అతి తక్కువ ఖర్చుతో నిర్మించిన చెక్‌డ్యాంగా అధికారులు పేర్కొంటున్నారు. ఇంత ఎక్కువ మొత్తాన్ని ఒకే పని కింద చూపితే టెండర్లు పిలవాల్సివస్తుందనే కారణంగా మూడు పనులుగా విభజించారు. వంకకు ఇరువైపులా నిర్మించిన రెండు మట్టి కట్టలను రెండు పనులుగా , కాంక్రీట్ నిర్మాణాన్ని మరో పనిగా విభజించారు. దీంతో ఒక్కో పనికి రూ. 10 లక్షల చొప్పున మూడు పనులకు కలిపి రూ. 30 లక్షలను కేటాయించారు. స్థానిక ఎంపీటీసీ తనయుడు గ్రామానికి చెందిన టీడీపీ నేత వాసు పర్యవేక్షణలో నిర్మాణాన్ని చేపట్టారు. చెక్‌డ్యాంకు ఇరువైపులా ఉన్న మట్టి కట్టలను వంకలో ఉన్న మట్టితోనే నాసిరకంగా ని ర్మించారు. నిర్మాణం పూర్తి చేసుకున్న తర్వాత దాదాపు 40 రోజుల్లో కురిసిన వర్షాలకు చెక్‌డ్యాంకు నీరు చేరింది. కాంక్రీటు నిర్మాణానికి ఆనుకుని ఇరువైపులా ఏర్పాటు చేసిన మట్టి కట్టలో ఒకవైపున గల మట్టి కట్ట నీటి ప్రవాహానికి కొట్టుకుని పోయింది. దీంతో చుక్క నీరు కూడా నిలువకుండా దిగువకు తరలి పోయింది. సీఎం తనయుడు సందర్శించిన మోడల్ చెక్‌డ్యాం ఇదే.. జిల్లాలోనే మోడల్ చెక్‌డ్యాంగా రూపొందించిన ఈ చెక్‌డ్యాంను 2017 వ సంవత్సరం జులై నెల 12 వ తేదీన జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం తనయుడు, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖా మంత్రి నారా లోకేష్ సందర్శించారు. ఆయన సందర్శించిన 40 రోజుల్లోనే నాసిరకంగా నిర్మించిన ఈ చెక్‌డ్యాం వర్షపు నీటికి తెగిపోవడం నీరు చెట్టు పథకంలో జరిగిన అవినీతికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. దొరికినంత దోచుకోవడమే.. గాలివీడు : పనులన్నీ రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి్జ ఆర్.రమేష్‌రెడ్డి , వారి అనుచరులు చేపట్టారు. నూలివీడు గ్రామంలో స్థానిక ఎంపీటీసీ సభ్యురాలు పార్వతమ్మ కుటుంబీకులు చేసిన పనులకు మెరుగులు దిద్ది దాదాపు రూ. 80లక్షలు పైగా బిల్లులు చేసుకొని నిధులను దిగమింగారు. దాదాపు రూ.1.50కోటి పైగా ఆర్.రమేష్‌రెడ్డి బినామీ టీడీపీ నాయకుడు, గాలివీడు ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ సభ్యుడు రామమోహన్‌నాయుడు తూముకుంటలో వివిధ రకాల పనులు చేపట్టారు. కొర్లకుంట గ్రామంలో ఎంపీటీసీ ఈశ్వరమ్మ కుమారుడు, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి రైతులకు ఎలాంటి ఉపయోగం లేని చోట పనులు చేసి రూ.70లక్షలు బిల్లులు చేసుకున్నారు. గోరాన్చెరువులో రమేష్‌రెడ్డి సమీప బంధువు మాజీ ఎంపీటీసీ సభ్యుడు దాసరి రెడ్డిప్రసాద్‌రెడ్డి దాదాపు రూ. 50లక్షలు పైగా విలువైన పనులు చేపట్టారు. ఎగువ గొట్టివీడుకు చెందిన మండల టీడీపీ ఉపాధ్యక్షుడు శివప్పనాయుడు ఉపాధి పనులు చేసిన పనులకే నీరు –చెట్టు పనులు చేసి దాదాపు రూ.30లక్షలుపైగా స్వాహా చేశాడు. చెరువు మట్టి.. విక్రయాలు చేపట్టి.. కడప అర్బన్ పరిధిలో 2016–17 లో పూడికతీత పనులకు సంబంధించి రూ.2 కోట్లు, 113 చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి రూ.95 లక్షలు, 2017–18 లో పూడికతీత రెండు పనులకు గాను రూ.19 లక్షలు, 10 చెక్‌డ్యాంల నిర్మాణాలకు రూ.90 లక్షలు, మొత్తం రూ.4.04 కోట్లు నీరు చెట్టు కింద ఖర్చు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. 2015–16 లో కడప అర్బన్ పరిధిలో నీరు చెట్టు కింద ఎలాంటి పనులు చేపట్టలేదని అధికారులు వెల్లడించారు. పుట్లంపల్లె చెరువులో నీరు–చెట్టు కింద పూడిక తీసి మట్టిని అమ్మేందుకు ట్రాక్టర్లలో వేస్తున్న దృశ్యం పుట్లంపల్లె చెరువును చెరబట్టారు... కడప అర్బన్ పరిధిలో పుట్లంపల్లె చెరువులో పూడికతీత పనులకు, జంగిల్ క్లియరెన్స్‌కు రూ.9.30 లక్షలు ఖర్చు చేశారు. ఈ చెరువులో మట్టిని టీడీపీ నాయకుడు రెడ్డెయ్య అమ్ముకుని ఆదాయవనరుగా మార్చుకున్నాడు. ఓ ట్రిప్పు ట్రాక్టర్ మట్టిని రూ.300 నుంచి రూ. 400 వరకు విక్రయిస్తూ యథేచ్ఛగా వ్యాపారం కొనసాగించాడు. ఈ నాయకునికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి అండదండలున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. చెరువులో తీసిన పూడిక మట్టిని కట్టకు గాని రైతులకు ఉచితంగా గాని, ప్రభుత్వ పనులకు ఉచితంగా తరలించాల్సి ఉంటుంది. అదీ కూడా నిబంధనలకు లోబడి పూడికతీత పనులు చేపట్టాల్సి ఉంటుంది. అలా కాకుండా పూడికతీసిన మట్టిని పొక్లెయిన్‌తో ట్రాక్టర్లకు నింపి వ్యాపారం చేసుకున్నారు. దీనిపై ప్రజలు ఫిర్యాదులు చేసినా అధికారులు ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదు. నిబంధనలకు విరుద్ధంగా.. కడప బుగ్గవంకలో పూడికతీత పనుల కోసం రూ.66 లక్షలతో అధికారులు నివేదికలు తయారు చేశారు. కాని టీడీపీ నేతలు పనులు నిబంధనలకు విరుద్ధంగా చేయడంతో కేవలం రూ.12 లక్షలు మాత్రమే అధికారులు బిల్లులు చేశారు. తర్వాత విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేశారు. చర్యలు మాత్రం లేవు. ఆ తర్వాత పనులను ఆపేశారు. అధికారులపై అధికార పార్టీ నాయకులు ఒత్తిళ్లు తెచ్చారు. ఈ పనులు కూడా టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి అనుచరులు, బినామీలే చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. బుడ్డాయపల్లె చెరువులోనూ.. బుడ్డాయపల్లె చెరువులో కూడా అధికార పార్టీ నాయకులు మట్టిని అమ్ముకున్నారు. యథేచ్ఛగా మట్టిని అమ్ముకుని వ్యాపారం చేస్తున్నా అధికారుల తనిఖీలు మాత్రం శూన్యం. అలాగే దేవుని కడప చెరువులో కూడా మట్టిని అమ్ముకుంటూ అక్రమార్జనకు టీడీపీ నాయకులు తెరలేపారు. ఈ వింత చూడండి.. తొండూరు–గంగాదేవిపల్లె మధ్యలో గుట్టకు వాగులు సృష్టించి అధికారపార్టీ నాయకులు భారీగా అవినీతికి పాల్పడ్డారు. పులివెందుల నియోజకవర్గంలోని తొండూరు మండలంలో వాగులు, వంకలు, చెరువులు లేకపోయినా వాటిని పొక్లెయిన్ల సహాయంతో సృష్టించారు. మండలంలో నీరు–చెట్టు కింద 21 పనులు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. సబ్సిడీతో ట్రాక్టర్లు ఇచ్చి మట్టి, ఇసుక దోచేశారు టీడీపీ నాయకులకు ప్రభుత్వం సబ్సిడీ కింద రైతు రథం ట్రాక్టర్లు ఇచ్చింది. ఆ ట్రాక్టర్లతో వారు మట్టి, ఇసుకను ఇష్టం వచ్చినట్లు తోలి కోట్లాది రూపాయలు సంపాదించారు. ఆ ప్రాంతంలో రెండు ట్రాక్టర్లు ఉన్న ఓ టీడీపీ కార్యకర్త మూడు నెలల్లోనే ఇసుక అక్రమ రవాణా ద్వారా కోటి రూపాయలు సంపాదించాడంటే, ఐదేళ్లపాటు ఒక్కొక్కరు ఎంత సంపాదించారో అర్థం చేసుకోవచ్చు. నీరు చెట్టు పేరు చెప్పి బిల్లులు చేసుకున్నారు. ఆ మట్టిని పొలాలకు తోలకుండా అమ్ముకుని రెండు వి«ధాలుగా సంపాదించారు. – మెడతాటి రవి, మోడమీద పల్లె, కడప తాగునీటికి ఇబ్బంది ఏర్పడే పరిస్థితి నెలకొంది అధికార పార్టీ నాయకులు ఒక్కొక్కరు రెండేసి ట్రాక్టర్లు కొని ఇసుకను, మట్టిని అక్రమ రవాణా చేసి కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. కడప, ఆలంఖాన్‌పల్లెకు చెందిన నాయకుల పేర్లు చెప్పి సహజ వనరులను కొల్లగొట్టారు. టీడీపీ నాయకుల అరాచకాల వల్ల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. కడపలో తాగునీటి సమస్య తలెత్తడానికి వీరే ప్రధాన కారకులు. ప్రభుత్వం వీరికి దోచిపెట్టేందుకే ఉన్నట్లు పనిచేసింది. వీటికి అడ్డుకట్ట వేసే నాథుడే కరువయ్యాడు. – భాస్కర్‌రెడ్డి, మోడమీదపల్లె, కడప ఇసుకతో చెక్‌డ్యాంలను నిర్మించారు నీరు–చెట్టు పథకం కింద చేపట్టిన చెక్ డ్యాంలను ఇసుక, కంకర, సిమెంటుతో కాకుండా ఇసుకతోనే అధికార పార్టీ నాయకులు నిర్మించారు. లక్కిరెడ్డిపల్లె, రామాపురం మండలాల పరిధిలో చేపట్టిన చెక్‌డ్యాంలను ఒక్కసారి పరిశీలిస్తే వాటి నాణ్యత తెలిసిపోతుంది. ఒక నిర్మాణం జరుగుతుండగానే మరోవైపు దుమ్ము లేచిపోతున్నా అధికారులు మాత్రం ఒక్కో చెక్‌డ్యాంకు రూ.5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు బిల్లులు చేసి ఇచ్చేశారు. పనులు నామినేషన్ మీదనే కేటాయించడంతో పాటు అధికార పార్టీ నాయకులే చేశారు. ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేకపోగా నిర్మించిన చెక్‌డ్యాంల వలన చుక్క నీరు నిలిచే పరిస్థితులు లేవు. ఈ రెండు మండలాల పరిధిలోనే చెక్‌డ్యాంల పేరుతో 10 కోట్ల రూపాయలు వ్యయం చేశారు. కేటాయించిన నిధుల నుంచి 20 శాతం కూడా ఖర్చు చేయకపోవడం దారుణం. పిచ్చిమొక్కలను తొలగించుకుంటూ జేసీబీలతో గీతలు పెట్టి డబ్బులు దోచుకున్నారు. – సూరం వెంకటసుబ్బారెడ్డి, నల్లగుట్టపల్లె, రామాపురం మండలం -
అక్రమాల లెక్క తేలేనా?
అరసవల్లి: శ్రీకాకుళం డివిజన్ మైనింగ్ అక్రమాల లెక్క తేల్చేందుకు రంగంలోకి దిగిన ఆడిట్ అధికారులకు దిమ్మదిగిరే అనుభవం ఎదురయ్యింది. ఈ నెల 6వ తేదీ నుంచి శుక్రవారం వరకు విశాఖపట్నంలో నిర్వహించిన మైనింగ్ ఆడిట్ ప్రక్రియకు కేవలం అభ్యంతరాలే తప్ప..అందుకు స్పందన దొరకక పోవడంతో సంబంధిత అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ముఖ్యంగా శ్రీకాకుళం డివిజన్లో గత కొన్నేళ్ల నుంచి బయటపడుతున్న మైనింగ్ అక్రమాల లెక్క సంగతి తేల్చేందుకు గనులశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విశాఖపట్నం డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో ఆడిట్ ప్రక్రియను నిర్వహించారు. అయితే ఆడిట్ బృందానికి సమాధానం ఇచ్చే అధికారి ఒక్కరూ లేకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో కేవలం జిల్లా కేంద్ర డివిజన్లో జరిగిన మైనింగ్ పనులపై అభ్యంతరాలతో అధికారులు సరిపెట్టుకోవాల్సి వచ్చింది. శ్రీకాకుళం డివిజన్ అధికారులంతా గైర్హాజరే..! ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో జరిగిన మైనింగ్‌పై ఆడిట్ అధికార బృందం ఈనెల 6 నుంచి 10వ తేది వరకు డీడీ కార్యాలయంలో ప్రత్యేక చర్యలు చేపట్టింది. విశాఖ జిల్లాలో విశాఖపట్నం ఏడీ, డీడీ, అనకాపల్లి ఏడీ, విజిలెన్స్ కార్యాలయాలు, అలాగే విజయనగరం ఏడీ, శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం ఏడీ, టెక్కలి ఏడీ కార్యాలయాల్లో గత కొన్నేళ్లుగా జరిగిన మైనింగ్ వ్యవహారాలపై ఆడిట్‌ను నిర్వహించారు. ఈ ప్రక్రియకు కచ్చితంగా ఆయా కార్యాలయాల అసిస్టెంట్ డైరెక్టర్లు (ఏడీ)తో పాటు కార్యాలయ సూపరింటెండెంట్‌తో సహా నాన్ టెక్నకల్ సిబ్బంది కూడా తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉంది. ఆడిట్ అధికారులు లేవనెత్తిన అభ్యంతరాలకు వెంటనే సమాధానాలను నివేదిక రూపంలో అధికార బృందానికి అందజేయాల్సి ఉంది. ఇదిలావుంటే ఈ ఆడిట్ అభ్యంతరాల అంశంలో స్పందించేందుకు శ్రీకాకుళం డివిజన్ అధికారులు మినహా మిగిలిన జిల్లాల డివిజన్ల అధికారులు హజరయ్యారు. దీంతో శ్రీకాకుళం డివిజన్ అధికారులపై ఆడిట్ అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. 87 అభ్యంతరాలకు సమాధానాలెక్కడ..? జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం డివిజన్లో మైనింగ్ అక్రమాలు పేట్రేగిపోతున్నాయన్న విమర్శలున్నాయి. తాజాగా నిర్వహించిన ఆడిట్ కార్యక్రమానికి కూడా స్థానిక డివిజన్ అధికారులు గైర్హాజర్ కావడంతో మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యంగా శ్రీకాకుళం, టెక్కలి డివిజన్లలో మైనింగ్ అక్రమాలకు అధికార పార్టీ నేతలు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఇందుకు కొంద రు గనులశాఖ అధికారులు కూడా సహకరించడంతో అక్రమాలకు అడ్డూఆపు లేకుండా ఉన్నాయన్న విషయం ఇటీవల వంశధార నదికి వరదలు వచ్చినప్పుడు నిరూపితమైన సంగతి విదితమే. దీన్ని నిజం చేస్తున్నట్లుగా ఆడిట్ అభ్యంతరాలకు సమాధానం ఇవ్వాల్సిన డివిజన్ స్థాయి అధికారులు, సిబ్బంది గానీ విశాఖ ఆడిట్ సమావేశాలకు హాజరుకాలేదు. శ్రీకాకుళం డివిజన్లో మొత్తం మైనింగ్ అక్రమాలపై అనుమానాలను, సందేహా లను ఆడిట్ అధికారులు వ్యక్తం చేశారు. మొత్తం 87 అభ్యంతరాలను అధికారులు లేవనెత్తారు. అయితే ఒక్క అభ్యంతరానికి కూడా డివిజన్ అధికారులు సమాధానం ఇవ్వలేదని తెలిసింది. శ్రీకాకుళం డివిజన్ అధికారుల నిర్లక్ష్యంపై ఆడిట్ అధికార బృందం, మైనింగ్ ఉన్నతాధికారులకు ప్రత్యేకంగా నివేదిక పంపించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇదిలావుంటే ఆడిట్ అభ్యంతరాలపై సమాధానాలు సకాలంలో పంపుతారా..లేదా అన్నదానిపై స్పష్టత కొరవడింది. దీంతో మైనింగ్ అక్రమాల నిగ్గు తేలనుందా లేదా..అన్నది ప్రస్తుతానికి ప్రశ్నార్ధకమే..! త్వరలో నివేదికిస్తామన్నారు ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి ఇటీవల నిర్వహించిన ఆడిట్ ప్రక్రియలో శ్రీకాకుళం డివిజన్ ఏడీ హాజరుకాలేదు. అయితే శ్రీకాకుళంలో ఏడీగా తమ్మినాయుడు ఇటీవలే రీ జాయిన్ అయిన కారణంగా, త్వరలోనే ఆడిట్ అభ్యంతరాలకు సమాధానాలను అందజేస్తామని చెప్పారు. ఆడిట్ అభ్యంతరాలకు కచ్చితంగా సమాధానాలు ఇవ్వాల్సి ఉంది. – ఎన్‌ఆర్‌వి.ప్రసాద్, డిప్యూటీ డైరెక్టర్ (విశాఖ) -
పేరు గ్లోబల్... అంతా గోబెల్స్
గతంలో వైఎస్సార్ ప్రభుత్వం గ్లోబల్ టెండర్ల ద్వారా అంతర్జాతీయ సంస్థల మధ్య పోటీ నెలకొల్పి ప్రభుత్వ ఖజానాకు నష్టం జరగకుండా బెరైటీస్ ధర నిర్ణయించింది. దీనికి విరుద్ధంగా చంద్రబాబు ప్రభుత్వం లోపాయికారీ ఒప్పందాలతో ప్రైవేటు సంస్థల జేబులు నింపేందుకు కుట్ర పన్నింది. వాటికి అప్పనంగా లాభాలు చేకూర్చేందుకు ఏకంగా తన జీవోలను తానే సవరించుకుంది. అంతర్జాతీయ మార్కెట్ ధరలో 70-75 శాతం కనీస ధర నిర్ణయించాలన్న నిపుణుల కమిటీ సిఫార్సును కాదని, బెరైటీస్ కనీస ధరను 65 శాతానికి తగ్గించింది. గ్లోబల్ టెండర్లంటూ గోబెల్స్ ప్రచారంతో స్థానిక కోటా రద్దు చేసి 218 పరిశ్రమలు మూతపడేలా చేసింది. తద్వారా సుమారు 50 వేల మంది ఉద్యోగులు, కార్మికుల ఉపాధికి గండికొట్టి వీధులపాలు చేసింది. హైదరాబాద్: బెరైటీస్ విక్రయ టెండర్ల వ్యవహారంలో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయి. టెండర్ల ద్వారా రాబడి పెంచుకోవాల్సిన ప్రభుత్వమే ఖజానాకు గండికొట్టి ప్రైవేటు సంస్థల జేబులు నింపేందుకు సహకరించింది. చంద్రబాబు సర్కారు గత జనవరి 27వ తేదీ జారీ చేసిన జీవో 22ను సవరిస్తూ ఈ నెల 4న జారీ చేసిన జీవో 163 ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ప్రభుత్వ పెద్దల ప్రత్యక్ష అండదండలుండటంతో ఈ నెల 8న జరిగిన టెండర్లలో పాల్గొన్న నాలుగు ప్రైవేటు సంస్థలు రింగ్‌గా మారి తక్కువ ధరకే ఖనిజాన్ని కైవసం చేసుకున్నాయి. వైఎస్సార్ (కడప) జిల్లా మంగంపేట ప్రాజెక్టులోని బెరైటీస్ ఖనిజాన్ని గ్లోబల్ టెండర్ల ద్వారా విక్రయించాలని గత జనవరిలో రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ధర నిర్ణయించేందుకు టీడీపీ సర్కారు నిపుణుల కమిటీని నియమించింది. చెన్నైలో ప్రకటించే అంతర్జాతీయ మార్కెట్ ధరలో 70 - 75 శాతం కనీస (బేసిక్)ధరగా నిర్ణయించి బెరైటీస్ విక్రయానికి గ్లోబల్ టెండర్లు నిర్వహించాలని ఈ కమిటీ సిఫార్సు చేసింది. (టన్ను బెరైటీస్ ధర అంతర్జాతీయ మార్కెట్లో రూ. వెయ్యి ఉంటే రూ. 700 - 750 మధ్య కనీస ధర నిర్ణయించాలి). ఈ మేరకు ప్రభుత్వం జనవరి 27న జీవో 22 జారీ చేసింది. దీని ప్రకారం టన్ను ధర ‘ఎ’ గ్రేడ్ రూ.6,750, ‘బి’గ్రేడ్ రూ. 5,360 (అంతర్జాతీయ ధరలో సుమారు 71 శాతం) ఖరారు చేసి గత ఫిబ్రవరి 15న ఏపీఎండీసీ మెటల్ స్క్రాప్ ట్రేడ్ కార్పొరేషన్ ద్వారా గ్లోబల్ టెండర్లు ఆహ్వానించింది. అంతర్జాతీయ సంస్థలు పోటీకి రాకుండా స్థానిక సంస్థలు, ప్రభుత్వం రాజకీయం నడిపాయి. ముందే కుదిరిన ఒప్పందంతో... ముందే వాటితో కుదిరిన ఒప్పందం మేరకు ప్రభుత్వం బెరైటీస్ కనీస ధరను అంతర్జాతీయ మార్కెట్ ధరలో 65 శాతానికి తగ్గించి టన్ను ‘ఎ’ గ్రేడ్ రూ. 6000, ‘బి’ గ్రేడ్ రూ. 4,750కి నిర్ణయించింది. ఈ మేరకు తగ్గించిన కనీస ధరతో టెండర్లు ఆహ్వానిస్తూ ప్రభుత్వం గత నెల 14న రెండో విడత టెండర్లు ఆహ్వానించింది. ఇలా అంతర్జాతీయ మార్కెట్ ధరలో 65 - 70 శాతానికి కనీస ధరను తగ్గించేందుకు వీలుగా జీవో 22ను సవరిస్తూ ప్రభుత్వం ఈ నెల4గున జీవో 163 జారీ చేసింది. టెండర్లలో పాల్గొనే సంస్థలకు 25 నుంచి 30 శాతం లాభం చాలదంటూ ప్రభుత్వం కనీస ధరను 65 శాతానికి తగ్గించడం ద్వారా 35 శాతం లాభం ఉండేలా చేసింది. ఈ మేరకు ముందే ధరలు తగ్గించి టెండర్లు ఆహ్వానించి తర్వాత ఈ జీవో జారీ చేసింది. నిపుణుల సిఫార్సుల మేరకు బెరైటీస్ కనీస ధరను నిర్ణయించిన ప్రభుత్వం నిర్ణయం మార్చుకుని ధరలను తగ్గించడంలో భారీ మతలబు ఉందని, ఈ వ్యవహారం వెనుక కీలక నేత పాత్ర ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా ధరలు తగ్గించడంవల్ల ఏపీఎండీసీ కేవలం నాలుగు లక్షల టన్నుల ఖనిజానికి రూ. 28 కోట్ల రాబడి కోల్పోయింది. టెండర్లలో పాల్గొన్న ట్రైమాక్స్, ఆశాపురం, ఓరన్ హైడ్రో కార్బన్, ఆశాపుర సంస్థలు రింగ్‌గా మారి కనీస ధరకే టెండర్లు దక్కించుకోవడంవల్ల ఏపీఎండీసీ రూ. 150 కోట్ల వరకూ ఆదాయం కోల్పోయినట్లేనని అధికారులు అంటున్నారు. పోటీ ఏర్పడితే బేసిక్ ధరపై రూ. 1500 వరకూ అదనంగా రేటు పలికేదని వారు పేర్కొన్నారు.