పాలెం బస్సు ఘటన: జేసీ ప్రభాకర్ భార్య సహా 10 మందిపై చార్జిషీటు
పాలెం బస్సు ప్రమాద దుర్ఘటనపై సీఐడీ విభాగం చార్జిషీటు దాఖలుచేసింది. వోల్వో బస్సు తయారీలోనే లోపాలున్నాయని, అందులోని డీజిల్ ట్యాంక్ టైర్లకు దగ్గరగా ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని అందులో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా బస్సు సీట్ల డిజైన్ మార్చారని, అదికూడా ఈ ప్రమాదానికి కారణంగా మారిందని తెలిపారు. (చదవండి: వోల్వో బస్సు దగ్ధం - 44 మంది దుర్మరణం)
ఈ కేసులో అనంతపురం జిల్లా తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి భార్య, జబ్బార్ ట్రావెల్స్, ఆర్అండ్బీ శాఖతో పాటు మొత్తం పదిమంది నిందితులపై చార్జి షీటు దాఖలైంది. ఈ బస్సు ప్రమాదంపై 400 పేజీలతో కూడిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సీఐడీ పంపింది. మహబూబ్నగర్ కోర్టులో మే 7వ తేదీన చార్జిషీటు దాఖలు చేశారు. (చదవండి: ఎవరినీ వదిలిపెట్టం.. 40 రోజుల్లో ఛార్జిషీటు)