వోల్వో బస్సు ప్రమాదంపై హైకోర్టు నోటీసులు
హైదరాబాద్ : మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన వోల్వో బస్సు ప్రమాద ఘటనపై హైకోర్టు సీరియస్ అయ్యింది. ఈ ప్రమాదానికి సంబంధించి
వోల్వో కంపెనీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. అలాగే రవాణా శాఖ, ఆర్టీసీలకు నోటీసులు ఇచ్చింది. వారంలోగా జవాబు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
కాగా మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన వోల్వో బస్సు ప్రమాద సంఘటనపై విచారణ పూర్తయింది. బస్సులో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని క్లూస్ టీమ్ ధ్రువీకరించింది. బస్సు అదుపు తప్పి కల్వర్ట్ను ఢీకొనటం వల్లే మంటలు చెలరేగినట్లు వెల్లడి అయ్యింది. జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు కల్వర్టును ఢీకొట్టి 45 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే.