రైల్వేమంత్రిని అరెస్ట్ చేస్తారా?: జేసీ
అనంతపురం: వోల్పో బస్సు దుర్ఘటనపై మాజీ మంత్రి దివాకర్ రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్‌రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. పాలెం ఘటన తర్వాత తమను అరెస్టు చేయమంటున్నారని, నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ఘటనకు బాద్యుడిని చేస్తూ రైల్వేమంత్రిని అరెస్ట్ చేస్తారా అంటూ ఆవేశంగా ప్రశ్నించారు. తమవి దొంగ బస్సులైతే పర్మిట్లు రద్దు చేయాలని సవాల్ విసిరారు. కొందరు అధికారులు లంచాలు తీసుకుంటూ పాత బస్సులకు పర్మిట్లు ఇస్తున్నారని ఆరోపించారు. పాలెం ఘటన వార్తలపై కొందరు మీడియా ప్రతినిధులు తమను బ్లాక్‌మొయిల్ చేస్తున్నారని వెల్లడించారు.
అక్టోబర్ 30న మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద వోల్వో బస్సుకు మంటలంటుకుని 45 మంది సజీవ దహనమైన సంగతి విదితమే. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం లక్ష రూపాయాల చొప్పున పరిహారం చేతులు దులుపుకుంది. ప్రమాదానికి కారణమైన బస్సు యజమానులను శిక్షించాలంటూ బాధితులు ఆందోళన కొనసాగిస్తున్నారు. బాధితులకు రూ. 25 లక్షల నష్టపరిహారంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని మృతుల బంధువులు డిమాండ్ చేశారు.