
సాక్షి,అనంతపురం: సినీ నటి మాధవీలతపై తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. మాధవీలత తనపై కించపరిచే వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేత, మాల కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ తాడిపత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెక్షన్ 353 కింద మాధవీలతపై పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆదేశాలతోనే మాధవీలతపై కేసు నమోదు చేశారని తాడిపత్రి లో చర్చ జరుగుతోంది.
గతంలో తనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగాను జేసీ ప్రభాకర్‌రెడ్డిపై మాధవీలత హైదరాబాద్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులతో పాటు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లోనూ మాధవీలత జేసీపై కంప్లైంట్ ఇచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలకుగాను మాధవీలతకు జేసీ ఒక దశలో క్షమాపణలు కూడా చెప్పారు. అయినా వీరి మధ్య వివాదం కొనసాగుతోంది.