Case filed
-
కోట్ల రూపాయల మోసం కేసులో తమన్నా-కాజల్?
సైబర్ నేరాలు కావొచ్చు, ఎక్కువ డబ్బులిస్తామని ఆశపెట్టడం కావొచ్చు.. గత కొన్నేళ్లలో చాలామంది ప్రజలు మోసపోతూనే ఉన్నారు. కొన్నాళ్ల క్రితం ఇలానే క్రిప్టో కరెన్సీ పేరుతో పుదేచ్చేరిలో పలువురు కోట్ల రూపాయల మోసపోయారు. ఇప్పుడీ కేసులో హీరోయిన్లు తమన్నా-కాజల్(Kajal Aggarwal)ని పోలీసులు విచారించబోతున్నారు?(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు)ఇంతకీ ఏం జరిగింది?కోయంబత్తూర్ ప్రధాన కేంద్రంగా క్రిప్టో కరెన్సీ పేరుతో 2022లో ఓ కంపెనీ ప్రారంభించారు. దీనికి తమన్నా(Thamannah Bhatia) తదితరులు హాజరయ్యారు. అనంతరం మహాబలిపురంలోని ఓ స్టార్ హోటల్ లో జరిగిన సంస్థ కార్యక్రమానికి కాజల్ అగర్వాల్ హాజరైంది. తర్వాత ముంబైలోని క్రూయిజ్ నౌకలో గ్రాండ్ గా పార్టీ నిర్వహించి, పెట్టుబడులు పెట్టేలా ప్రజల్ని ఆకర్షించారు.ఈ క్రమంలోనే అత్యధిక లాభాల్ని రిటర్న్ ఇస్తామని చెప్పిన క్రిప్టో కరెన్సీ సంస్థ.. పుదుచ్చేరిలో వేలాది మంది నుంచి రూ.3.4 కోట్లు వసూలు చేశారు. ఈ వ్యవహారంలో నితీష్ జైన్, అరవింద్ కుమార్ అనే వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.(ఇదీ చదవండి: నాన్న ఫోన్ చేసేసరికి ప్రభాస్ భయపడ్డాడు: మంచు విష్ణు)అశోకన్ అనే రిటైర్డ్ ఉద్యోగి ఫిర్యాదు మేరకు హీరోయిన్లు తమన్నా, కాజల్ అగర్వాల్ ను కూడా ఈ కేసులో భాగంగా ఇప్పుడు పోలీసులు విచారించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ విషయం కాస్త ఇప్పుడు వార్తల్లో నిలిచింది.పుదుచ్చేరి సైబర్ క్రైమ్ ఎస్పీ డాక్టర్ బాస్కరన్ మాట్లాడుతూ.. ఈ సంస్థపై ఢిల్లీ, ఒడిశా, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ సహా పలు ప్రాంతాల్లో కేసులు నమోదయినట్టు చెప్పారు. మొత్తంగా రూ.50 కోట్ల మేర మోసాలకు పాల్పడినట్టు పేర్కొన్నారు. ఈ కేసులో కోయంబత్తూరు, బెంగళూరు, చెన్నైకు చెందిన కనీసం 10 మందికిపైగా నిందితుల ఉన్నట్టు విచారణలో వెల్లడయ్యిందని వివరించారు.(ఇదీ చదవండి: సీనియర్ నటి జయప్రద ఇంట్లో విషాదం) -
మాధవీలతపై కేసు.. ‘జేసీ’ ఆదేశాలతోనే..?
సాక్షి,అనంతపురం: సినీ నటి మాధవీలతపై తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. మాధవీలత తనపై కించపరిచే వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేత, మాల కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ తాడిపత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెక్షన్ 353 కింద మాధవీలతపై పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆదేశాలతోనే మాధవీలతపై కేసు నమోదు చేశారని తాడిపత్రి లో చర్చ జరుగుతోంది.గతంలో తనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగాను జేసీ ప్రభాకర్‌రెడ్డిపై మాధవీలత హైదరాబాద్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులతో పాటు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లోనూ మాధవీలత జేసీపై కంప్లైంట్ ఇచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలకుగాను మాధవీలతకు జేసీ ఒక దశలో క్షమాపణలు కూడా చెప్పారు. అయినా వీరి మధ్య వివాదం కొనసాగుతోంది. -
రాహుల్‌గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు
గువహతి:కాంగ్రెస్ పార్టీ దేశంతోనూ పోరాడుతోందని కాంగ్రెస్(Congress) అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై అస్సాంలోని గువహతి పోలీస్ స్టేషన్లో ఆదివారం(జనవరి19) ఎఫ్ఐఆర్(FIR) నమోదైంది. మోన్‌జిత్ చాటియా అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు వాక్ స్వాతంత్ర్య పరిమితులను దాటాయని,అవి జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పు కలిగిస్తాయని చాటియా తన ఫిర్యాదులో తెలిపారు. ఆయన వ్యాఖ్యలు అశాంతితో పాటు,వేర్పాటువాద భావాలు కలిగిన వారిని రెచ్చగొట్టే ప్రమాదం ఉందన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజలకు విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత రాహుల్‌కు ఉందని చాటియా పేర్కొన్నారు. కాగా,ఢిల్లీలో కాంగ్రెస్ నూతన ప్రధాన కార్యాలయాన్ని ఇటీవల ప్రారంభించారు.ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ బీజేపీ ఆరెస్సెస్ దేశంలోని ప్రతి సంస్థను తమ గుప్పిట్లో పెట్టుకున్నాయన్నారు. తాము ఇప్పుడు బీజేపీ, ఆరెస్సెస్‌తోపాటు భారత దేశంపై కూడా పోరాడుతున్నామన్నారు. ఈవ్యాఖ్యలను పలువురు కేంద్ర మంత్రులు తప్పుబట్టారు.కాంగ్రెస్ అసలురూపం ఈ వ్యాఖ్యలతో బయటపడిందని బీజేపీ నేతలు విమర్శించారు. -
అల్లు అర్జున్‌ని పోలీసులు అడిగే ప్రశ్నలివే!
సంధ్య థియేటర్ దగ్గర మహిళ మృతి చెందిన కేసులో ఇదివరకే హీరో అల్లు అర్జున్‌ని (Allu Arjun) అరెస్ట్ చేయగా.. నాలుగు వారాల మధ్యంతర బెయిల్‌ని న్యాయస్థానం మంజూరు చేసింది. అయితే విచారణ కోసం మరోసారి రావాలని చెప్పి చిక్కడపల్లి పోలీసులు బన్నీకి నోటీసులు జారీ చేశారు. దీంతో బన్నీ ఇప్పుడు తన లాయర్లతో కలిసి పోలీస్ స్టేషన్‌కి వెళ్లాడు. ఇందులో భాగంగా పోలీసులు అడిగే ప్రశ్నలు ఇవేనని తెలుస్తోంది. ఇంతకీ ఆ ప్రశ్నలేంటంటే?(ఇదీ చదవండి: సినిమాల్ని వదిలేద్దాం అనుకుంటున్నా: డైరెక్టర్ సుకుమార్)అల్లు అర్జున్‌ని పోలీసులు అడగబోయే ప్రశ్నలుబెనిఫిట్ షోకు.. మూవీ టీమ్ రావొద్దని పోలీసులు, యాజమాన్యానికి చెప్పిందా లేదా?పోలీసుల అనుమతి లేకుండా మూవీ టీమ్ థియేటర్‌కి రావొద్దనే విషయం మీకు తెలియదా?పోలీసుల అనుమతి లేకుండా మీరు సంధ్య థియేటర్‌కి ఎందుకొచ్చారు?గతంలో సినిమా చూసేందుకు ఎన్నిసార్లు సంధ్య థియేటర్‌కి వచ్చారు?మీతో పాటు సినిమా చూసేందుకు ఎంతమంది వచ్చారు?సినిమాకు ఫ్యామిలీతో పాటు భద్రతగా ఎంతమంది వచ్చారు? వివరాలేంటి?మీరు థియేటర్ కి రావడం వల్లే తొక్కిసలాట జరిగింది. దీనికి మీ సమాధానం?చేతులు ఊపుతూ ర్యాలీగా థియేటర్లోకి ఎందుకు ప్రవేశించారు.తొక్కిసలాట జరిగినా మీరు ఎందుకు థియేటర్ నుంచి బయటకు రాలేదు?పోలీసులు మీకు చెప్పినా సంధ్య థియేటర్ నుంచి రావడానికి ఎందుకు నిరాకరించారు?పోలీసుల విధులను మీరు అడ్డుకున్నారనే ఆరోపణలపై మీ సమాధానం?రేవతి కుటుంబంతో మీరు మాట్లాడుతున్నారా? ఎలాంటి భరోసా ఇచ్చారు?(ఇదీ చదవండి: అల్లు అర్జున్ అరెస్ట్‌పై ప్రశ్న.. జానీ మాస్టర్ రియాక్షన్?) -
ఫార్ములా-ఈ కేసులో ఏ1గా కేటీఆర్.. ఏసీబీ కేసు నమోదు
సాక్షి,హైదరాబాద్: ఫార్ములా ఈ-కార్ రేసు నిధుల గోల్మాల్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ కేసును దర్యాప్తు చేయాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఏసీబీకి ఇప్పటికే లేఖ రాశారు.ఈ క్రమంలో తాజాగా గురువారం(డిసెంబర్ 19) ఈ-కార్ రేసు వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఏ1గా, అప్పటి మునిసిపల్ శాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్‌ను ఏ2గా చేరుస్తూ ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో ఏ3గా అప్పటి హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బిఎల్‌ఎన్‌రెడ్డిని ఏసీబీ చేర్చింది. కేటీఆర్‌పై అవినీతి నిరోధక చట్టం(పీసీ యాక్టు) 13(1)ఏ, 13(2)తో పాటు బీఎన్ఎస్ చట్టంలోని పలు నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.ఫార్ములా ఈ-కార్ రేసుల కోసం ఓ విదేశీ కంపెనీకి అప్పటి మునిసిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆదేశాలతో కేబినెట్ అనుమతి లేకుండానే రూ.45 కోట్ల ఇండియన్ కరెన్సీ చెల్లించారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఇందుకు ఆర్బీఐ రూ.8 కోట్లు ఫైన్ వేయగా తమ ప్రభుత్వం జరిమానా చెల్లించిందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద ఫార్ములా ఈ కార్ రేసులు నిర్వహించారు. ఈ రేసులకు అప్పటి మునిసిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ నిబంధనలు పాటించకుండా ప్రైవేటు సంస్థలకు నేరుగా నిధులు మంజూరు చేశారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. మాజీ మంత్రి అయిన కేటీఆర్‌పై దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే గవర్నర్ అనుమతి కూడా తీసుకోవడం గమనార్హం. హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసే యోచనలో కేటీఆర్తనపై నమోదైన ఫార్ములా ఈ కార్ల కేసులో క్వాష్ పిటిషన్ వేసే యోచనలో కేటీఆర్ రేపు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసే అవకాశం ఎఫ్ఐఆర్ నమోదైనందున క్వాష్ పిటిషన్ వేసేందుకు అవకాశం న్యాయ నిపుణులతో ఇప్పటికే కేటీఆర్ చర్చలు ప్రభుత్వం అబద్ధాలు చెప్తూ కేసు పెట్టింది: హరీశ్‌రావు రాష్ట్రం కోసం పనిచేసిన కేటీఆర్‌పై కేసు పెట్టారుప్రభుత్వం చెప్పేవన్నీ అబద్ధాలు ఫార్ములా ఈ కేసుపై అసెంబ్లీలో చర్చించండి -
జర్నలిస్టుపై దాడి.. మోహన్ బాబుపై పోలీస్ కేసు
కుటుంబ వివాదంలో సతమతమవుతున్న నటుడు మోహన్ బాబుకి మరో షాక్ తగిలింది. మోహన్ బాబు ఫ్యామిలీలో అసలేం జరుగుతుందో తెలుసుకునేందుకు మంగళవారం రాత్రి పలువురు జర్నలిస్టులు జల్పల్లిలోని ఆయన ఇంటికి వెళ్లారు. అయితే ప్రశ్న అడిగేందుకు ఓ రిపోర్టర్ ప్రయత్నించగా.. అతడి దగ్గరున్న మైక్ లాక్కొని సదరు జర్నలిస్టుపైనే మోహన్ బాబు దాడి చేశాడు.(ఇదీ చదవండి: నా గుండెలపై తన్నావ్.. మోహన్ బాబు ఆడియో వైరల్)ఈ దాడిలో సదరు జర్నలిస్టు తలపై కాస్త గట్టిగానే గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో మోహన్ బాబు క్షమాపణలు చెప్పాలని.. ఇప్పటికే పలువురు జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ దాడి విషయమై 118 బీఎన్ఎస్ యాక్ట్ కింద.. మోహన్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఈ విషయం కాస్త చర్చనీయాంశంగా మారింది.118 బీఎన్ఎస్ యాక్ట్ విషయానికొస్తే.. 2023 భారతీయ న్యాయ సంహిత ప్రకారం ప్రమాదకరమైన ఆయుధాలతో దాడి చేస్తే ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు. దీనికి ప్రతిగా మూడేళ్ల జైలుశిక్ష లేదంటే రూ.20 వేల జరిమానా విధించొచ్చు. కొన్నిసార్లు రెండింటిని కూడా విధించే అవకాశముంది.మంగళవారం రాత్రి మోహన్ బాబు ఇంటి దగ్గర జరిగిన గొడవ దృష్ట్యా.. తమ దగ్గరున్న లైసెన్స్ గన్స్ సరెండర్ చేయాలని పోలీసులు.. మోహన్ బాబు, విష్ణు, మనోజ్లని ఆదేశించారు. అలానే బుధవారం ఉదయం పదిన్నర గంటలకు విచారణకు హాజరు కావాలని ఇప్పటికే రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేశారు.(ఇదీ చదవండి: మోహన్ బాబు ఇంటి వద్ద హై టెన్షన్.. గేట్లు బద్దలు కొట్టిన మనోజ్!) -
డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో వివాదం.. స్పందించిన జానీ మాస్టర్
లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ అయి, ఇటీవల బెయిల్‌పై బయటకొచ్చిన జానీ మాస్టర్‌కి ఊహించని షాక్ తగిలిందంటూ వార్తలు వచ్చాయి. ఆయనను డ్యాన్స్ అసోసియేషన్ నుంచి తొలగించారని సోషల్ మీడియాలో భారీగా ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్లో కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే, తాజాగా జానీ మాస్టర్ తన సోషల్‌మీడియా ద్వారా రియాక్ట్ అయ్యారు.మొన్నటివరకు డ్యాన్సర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జానీ మాస్టర్ కొనసాగుతూ వచ్చారు. ఎప్పుడైతే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌ని లైంగికంగా వేధించాడనే ఆరోపణలు వచ్చాయో.. ఇతడి పదవిపై నీలినీడలు కమ్ముకున్నాయి. అందుకు తగ్గట్లే తాజాగా ఆదివారం అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించగా.. జోసెఫ్ ప్రకాశ్ విజయం సాధించారు. 5వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2023లో అధ్యక్షుడిగా ఎన్నికైన జానీ.. తన పదవీ కాలం 2025 వరకు ఉంది. అయితే, గుట్టుచప్పుడు కాకుండా అసోషియేషన్‌లో ఎలక్షన్లు నిర్వహించడంపై ఆయన తప్పుబట్టారువారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా: జానీతనను అసోసియేషన్ నుంచి తొలగించినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని జానీ మాస్టర్ తెలిపారు. సోషల్‌మీడియాలో కావాలనే ఎవరో ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని ఇలా చెప్పారు. 'నన్ను ఏ యూనియన్ నుంచి తొలగించలేదు. నేను డ్యాన్సర్ యూనియన్‌లో మెంబర్. అందులో నుంచి శాశ్వితంగా ఎవర్నీ తొలగించలేరు. నిన్న జరిగిన ఎన్నికలపై నేను ఫైట్ చేస్తాను. నా పదవీ కాలం ఇంకా ఉంది. కొందరు అనధికారికంగా, అనైతికంగా ఎలక్షన్లు నిర్వహించి వారికి వారే నిర్ణయాలు, హోదాలు తీసుకున్నారు. వారికి ఆ హక్కు లేదు. దీనికి కారణమైన వారిపై చట్టపరంగా వెళుతున్నాను. టాలెంట్ ఉన్నవారికి పనివ్వకుండా, దొరక్కుండా ఎవ్వరూ ఆపలేరు. నా కొరియోగ్రఫీలో గేమ్ ఛేంజర్ నుంచి ఓ మంచి పాట రాబోతుంది, మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది.' అని జానీ అన్నారు.డ్యాన్స్ అసోసియేషన్ కోసం తీసుకున్న భూ వివాదంలలో భారీ స్కామ్ జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. శంకర్‌పల్లిలో డ్యాన్సర్ అసోసియేషన్ కోసం 15 ఎకరాలు భూమి కొనుగోలు సమయంలో కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని. ఆ స్కామ్ వివరాలను జానీ మాస్టర్ బయటకు తీయడం వల్లే జానీ మాస్టర్‌పై ఆరోపణలు వస్తున్నాయని తెలుస్తోంది. డ్యాన్సర్ అసోసియేషన్ కార్డుల జారీ విషయంలో కూడా భారీగా వసూళ్లకు పాల్పిడినట్లు జానీ ఆరోపించడంతో తనపై ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. నిర్ధారణవ్వని ఆరోపణలని కారణంగా చూపిస్తూ నన్ను శాశ్వతంగా యూనియన్ నుండి తొలగించినట్టు మీడియాలో పుకార్లు పుట్టిస్తున్నారు. అవేవీ నమ్మకండి!!నా పదవీ కాలం ఇంకా ఉన్నా కూడా అనధికారికంగా, అనైతికంగా ఎలక్షన్లు నిర్వహించి వారికి వారే నిర్ణయాలు, హోదాలు తీసుకునే హక్కు ఎవరికీ లేదు. దీనికి… pic.twitter.com/qroJxE5Uxv— Jani Master (@AlwaysJani) December 9, 2024 -
అమెరికా అభ్యర్థన రాలేదు
సాక్షి, న్యూఢిల్లీ: భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై అమెరికాలో కేసు నమోదు కావడంపై కేంద్ర ప్రభు త్వం మొదటిసారిగా అధికారికంగా స్పందించింది. ఇది కేవలం ప్రైవేట్ కంపెనీలు, వ్యక్తులు, అమెరికా న్యాయవిభాగాలకు సంబంధించిన న్యాయ పరమై న వ్యవహారమని పేర్కొంది. విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ శుక్రవారం మీడియాకు ఈ విషయం తెలిపారు. అదానీకి నోటీసు/ అరెస్ట్ వారెంట్‌పై అమెరికా నుంచి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యర్థన కూడా రాలేదన్నారు. అదానీపై కేసు నమోదుపై ముందుగా అమెరికా భారత ప్రభుత్వా నికి ఎటువంటి సమా చారం ఇవ్వలేదని కూడా స్పష్టం చేశారు. ఈ కేసులో సహకరించాలంటూ అమెరికా ప్రభుత్వం నుంచి ఎటువంటి విజ్ఞాపనా అందలేదని, దీనిపై రెండు ప్రభుత్వాల స్థాయిలో ఏ చర్చా జరగలేదని కూడా జైశ్వాల్ తెలిపా రు. ప్రస్తుతానికి ఈ అంశంతో భారత ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని ఆయన వివరించారు. అదానీ అంశంపై పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడుతున్న వేళ విదేశాంగ శాఖ ఈ మేరకు ప్రకటించడం గమనార్హం. -
'పుష్ప' నటుడు శ్రీ తేజ్‌పై పోలీసు కేసు
తెలుగులో పలు సినిమాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న శ్రీతేజ్‌పై హైదరాబాద్‌లోని కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని తనని మోసం చేశాడని ఓ యువతి ఫిర్యాదు చేసింది. దీంతో BNS 69, 115(2),318(2) సెక్షన్ ల కింద కేస్ నమోదు చేశారు. గతంలోనూ ఇదే పీఎస్‌లో శ్రీతేజ్‌పై కేసు నమోదైంది.(ఇదీ చదవండి: యూరప్ వెళ్లనున్న ప్రభాస్.. ఎందుకో తెలుసా..?)'నారప్ప', 'మంగళవారం', 'పుష్ప' తదితర సినిమాల్లో సహాయ నటుడిగా చేసిన శ్రీతేజపై గతంలోనే కేసు నమోదైంది. ఓ బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ భార్యతో ఇతడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసి సదరు వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. ఈ విషయమై మాదాపూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఇలా వరస కేసుల వల్ల శ్రీతేజ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది.(ఇదీ చదవండి: అమ్మాయిలకే 'సెకండ్ హ్యాండ్' లాంటి ట్యాగ్ ఎందుకు?: సమంత) -
గౌతమ్ అదానీపై సంచలన ఆరోపణలు
అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదైంది. బిలియన్ డాలర్ల లంచం, మోసానికి పాల్పడినట్లు న్యూయార్క్‌లో అధికారులు అభియోగాలు మోపారు. గౌతమ్ అదానీ, ఆయన బంధువు సాగర్ అదానీతో సహా మరో ఏడుగురు ఇందులో నిందితులుగా ఉన్నట్లు తెలిపారు.20 ఏళ్లలో 2 బిలియన్ డాలర్ల లాభం వచ్చే సౌరశక్తి సరఫరా కాంట్రాక్ట్‌ల కోసం వీరు భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 265 మిలియన్ డాలర్లు లంచాలు చెల్లించినట్లు అధికారులు గుర్తించారు. అలాగే అదానీ గ్రీన్ ఎనర్జీలోనూ అక్రమ మార్గాల ద్వారా రుణాలు, బాండ్లను సేకరించినట్లు న్యాయవాదులు పేర్కొన్నారు.అదానీ కేసు వ్యవహారంపై ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ స్పందించారు. కేసు నుంచి అదానీ తప్పించుకోలేరని, వాళ్ల దగ్గర తిరుగులేని ఆధారాలు ఉన్నాయని ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. వ్యవస్థలను మేనేజ్ చేసి తప్పించుకునేందుకు అక్కడున్నది మోదీ ప్రభుత్వం కాదని చురకలేశారు. దీనిపై జాయింట్ పార్లమెంట్ కమిటీ వేసి విచారణ జరిపించాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ డిమాండ్ చేశారు.అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీపై అమెరికా అధికారుల అభియోగాల నేపథ్యంలో అదానీ గ్రూప్ యూనిట్లు 600 మిలియన్ డాలర్ల బాండ్‌ను రద్దు చేశాయి. అలాగే అమెరికన్ డాలర్‌పై జారీ చేసిన అన్ని బాండ్లను వెనక్కితీసుకున్నట్లు తెలిసింది.ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం.. అదానీ సంపద 69.8 బిలియన్ డాలర్లు. ప్రపంచంలో 22వ అత్యంత సంపన్నుడిగా ఉన్న ఆయన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తర్వాత స్థానంలో ఉన్నారు. గతేడాది జనవరిలో హిండెన్‌బర్గ్ నివేదిక వెలువడ్డాక అదానీ గ్రూప్ స్టాక్‌లలో సుమారు 150 బిలియన్ డాలర్లు కరిగిపోయాయి. Adanis indictment in the US is for 5 counts massive bribery & fraud; & relies on irrefutable electronic evidence. It seeks forfeiture of their properties.Adani forgot that US is not ruled by Modi where he could rely upon a pliant ED, SEBI& CBI to get away with anything.#Modani pic.twitter.com/G0VWQyTIUW— Prashant Bhushan (@pbhushan1) November 21, 2024 -
పోలీస్ విచారణకు హాజరుకాని రామ్ గోపాల్ వర్మ
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై పోలీస్ కేసు నమోదైంది. లెక్క ప్రకారం ఈరోజు (నవంబర్ 19) విచారణకు హాజరు కావాలి. అయితే తాను సినిమా షూటింగ్ బిజీ షెడ్యూల్ కారణంగా విచారణకు రాలేనని వర్మ పేర్కొన్నారు. ఈ మేరకు ఒంగోలు రూరల్ సర్కిల్ ఇన్సెపెక్టర్ శ్రీకాంత్ బాబుకి వాట్సాప్‌లో వర్మ మెసేజ్ పెట్టారు. విచారణకు సహకరిస్తానని, కాకపోతే నాలుగైదు రోజుల తర్వాత విచారణకు వస్తానని చెప్పారు. అయితే వర్మ నిజంగానే షూటింగ్ బిజీలో ఉన్నారా లేదా అనేది తెలుసుకుంటానని సీఐ అన్నారు.(ఇదీ చదవండి: అయ్యప్ప మాలలో చరణ్.. కానీ దర్గాకు ఎందుకు వెళ్లాడంటే?)ఇకపోతే సోమవారం ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన కేసులో అరెస్ట్ నుంచి రక్షణల్పించాలని ఆయన దాఖలు చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. తనపై నమోదైన కేసు కొట్టేయాలన్న పిటిషన్‌ను మాత్రం విచారణకు స్వీకరించింది. ఈ క్రమంలో కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది.ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో వర్మపై కొన్నిరోజులు క్రితం కేసు నమోదైంది. 'వ్యూహం' మూవీ ప్రమోషన్స్‌లో చంద్రబాబు, నారా లోకేశ్ తదితరులపై కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేయడంతో ఐటీ యాక్ట్ కింద కేసు నమోదైంది. (ఇదీ చదవండి: రూమర్స్ కాదు నిజంగానే కీర్తి సురేశ్‌కి పెళ్లి సెట్!) -
పోసాని కృష్ణమురళిపై కేసు నమోదు
ప్రముఖ నటుడు పోసానిపై జనసేన సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ ఫిర్యాదు చేశారు. గతంలో హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్లో ఈయన పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఇందులో పేర్కొన్నారు. పోసాని వ్యాఖ్యలు పార్టీ పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించడంతో పాటు రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఆటంకం కలిగించే విధంగా ఉన్నాయని ఫిర్యాదు చేశారు.(ఇదీ చదవండి: యష్ 'టాక్సిక్' మూవీ టీమ్‌పై పోలీస్ కేసు)బాడిత శంకర్ ఫిర్యాదుతో పోసానిపై భవానీపురం పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మపైన కూడా టీడీపీ నేత కేసు పెట్టాడు. దీంతో ప్రకాశం జిల్లా మద్దిపాలెం పోలీసులు.. ఆర్జీవీకి నోటీసులు జారీ చేశారు. 19వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.(ఇదీ చదవండి: రాంగోపాల్ వర్మకు ఏపీ పోలీసుల నోటీసులు) -
కేంద్ర మంత్రి సురేశ్ గోపీపై కేసు
త్రిస్సూర్: కేరళలోని త్రిస్సూర్‌లో ఈ ఏడాది ఏప్రిల్‌లో పూరమ్ ఉత్సవాల సమయంలో అంబులెన్సు సౌకర్యాన్ని దుర్వినియోగం చేశారంటూ కేంద్ర మంత్రి సురేశ్ గోపీపై కేసు నమోదైంది. ఉద్దేశపూర్వక ర్యాష్ డ్రైవింగ్‌తోపాటు మోటారు వాహనాల చట్టంలోని పలు సెక్షన్ల కింద త్రిస్సూర్ ఈస్ట్ పోలీసులు ఆదివారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. స్థానిక సీపీఐ నేత కేపీ సుమేశ్ ఫిర్యాదు మేరకు సురేశ్ గోపీతోపాటు కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి అభిజిత్ నాయర్, అంబులెన్సు డ్రైవర్‌ను నిందితులుగా చేర్చారు. పూరమ్ ఉత్సవాల వేదిక వద్దకు చేరుకునేందుకు వీరు పోలీసు ఆంక్షలను ధిక్కరిస్తూ, ప్రజల ప్రాణాలకు హాని కలిగించేలా వ్యవహరించారని సుమేశ్ ఆరోపించారు. మంత్రి సురేశ్ గోపీ ఈ ఆరోపణలను ఖండించారు. కారులో వస్తుండగా ప్రత్యర్థి పారీ్టల గూండాలు దాడి చేయడంతో అక్కడే ఉన్న అంబులెన్సులో ఉత్సవాల వేదిక వద్దకు చేరుకున్నట్లు చెప్పారు. -
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై కేసు
సాక్షి, మహబూబ్‌నగర్: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై కేసు నమోదైంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, దురుసుగా ప్రవర్తించారనే ఫిర్యాదుపై వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఇటీవలే పార్టీ కార్యకర్త వరద భాస్కర్‌ను పోలీసులు కొట్టారనే ఆరోపణపై శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో వన్ టౌన్ వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నా చేశారు. మరో పదిహేను మందిపై కూడా కేసు నమోదు చేశారు. ఇప్పటికే శ్రీనివాస్‌గౌడ్ తమ్ముడు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవల బీఆర్ఎస్ కార్యకర్తపై వన్‌టౌన్ సీఐ దౌర్జన్యం చేశారంటూ మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడని బీఆర్ఎస్ కార్యకర్తను రబ్బరు బెల్టుతో సీఐ కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఐ తీరును వ్యతిరేకిస్తూ మహబూబ్‌నగర్ పీఎస్ ముందు శ్రీనివాస్‌గౌడ్ ఆందోళనకు దిగుతూ.. పోలీసుల తీరుపై శ్రీనివాస్‌గౌడ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై కూడా కేసు నమోదు చేసినట్లు సమాచారం. -
కేసు పెట్టిన సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్
ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్.. హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తన కొడుకుపై జరిగిన దాడి విషయమై ఈ కంప్లైంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు దీని పూర్తి వివరాలు తెలుసుకునే పనిలో ఉన్నారు.(ఇదీ చదవండి: Satyam Sundaram Review: ‘సత్యం సుందరం’ మూవీ రివ్యూ)ఇంతకీ ఏమైంది?ఆర్పీ పట్నాయక్ కొడుకు వైష్ణవ్.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఎంబీఏ చదువుతున్నాడు. అదే కాలేజీలో చదువుతున్న శ్యామ్ అనే స్టూడెంట్ ఇతడిని ర్యాగింగ్ చేసేవాడు. ఈ గొడవ కాస్త ముదిరి.. బస్సులో వెళ్లేటప్పుడు వైష్ణవ్‌తో గొడవకు దిగాడు. ఇందులో భాగంగా ఆవేశానికి లోనైన శ్యామ్.. వైష్ణవ్ చెవి కొరికేశాడు.తన కొడుకుపై జరిగిన దాడి గురించి తెలిసిన ఆర్పీ పట్నాయక్.. రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇదలా ఉండగా ఆర్పీ పట్నాయక్ ప్రస్తుతం సినిమాలు పూర్తిగా తగ్గించేశారు. కెరీర్ ప్రారంభంలో సంగీత దర్శకుడిగా బోలెడంత క్రేజ్ తెచ్చుకున్న ఈయన.. ఆ మధ్య నటుడు, దర్శకుడిగానూ పలు చిత్రాలు తీశారు. ప్రస్తుతం పెద్దగా మూవీస్ చేయట్లేదు.(ఇదీ చదవండి: ఓటీటీలోనే విచిత్రమైన సినిమా.. 'కొట్టుక్కాళి' రివ్యూ) -
యువతిని మోసం చేసిన కేసు.. స్పందించిన హర్షసాయి
యువతిని మోసం చేసిన కేసులో యూట్యూబర్ హర్షసాయిపై హైదరాబాద్ నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. పెళ్లి పేరుతో తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని, నగ్న చిత్రాలతో తనని బెదిరిస్తున్నాడని ఓ యువతి మంగళవారం ఫిర్యాదు చేసింది. ఇది జరిగినప్పటి నుంచి హర్షసాయి అందుబాటులో లేడు. ఇతడితో పాటు తండ్రి రాధాకృష్ణ గురించి పోలీసులు వెతుకున్నారు. ఇప్పుడు ఈ ఆరోపణలపై హర్షసాయి స్పందించాడు. ఇన్ స్టా వేదికగా క్లారిటీ ఇచ్చాడు.'అవన్నీ తప్పుడు ఆరోపణలు. డబ్బులు దండుకోవడం కోసమే నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. నా గురించి మీకు తెలుసు. నిజానిజాలు త్వరలో బయటకొస్తాయి. మా లాయర్ తానికొండ చిరంజీవి ఈ విషయమై త్వరలో మీ ముందుకు వస్తారు' అని ఇన్ స్టా స్టోరీలో హర్షసాయి రాసుకొచ్చాడు.(ఇదీ చదవండి: యూట్యూబర్ హర్షసాయిపై కేసు.. నిజాలు బయటపెట్టిన యువతి)వైజాగ్‌కి హర్షసాయి.. పేదోళ్లకు డబ్బులు సాయం చేస్తూ వాటిని వీడియోలుగా తీసి తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేస్తుంటాడు. అయితే ఈ కుర్రాడికి ఇన్నేసి లక్షల రూపాయలు ఎక్కడనుంచి వస్తున్నాయనేది పెద్ క్వశ్చన్ మార్క్. ఇది కాదన్నట్లు బెట్టింగ్ యాప్స్‌ని విపరీతంగా ప్రమోట్ చేస్తుంటాడు. కొన్నిరోజుల క్రితమే ఈ విషయమై విమర్శలు వచ్చాయి.ఇవన్నీ పక్కనబెడితే సొంతంగా కథ రాసుకుని 'మెగా' అనే సినిమాని గతేడాది లాంచ్ చేశారు. ఇందులో హీరోయిన్గా నటిస్తూ, నిర్మాతగా వ్యవహరిస్తున్న అమ్మాయే.. ఇప్పుడు హర్షసాయిపై కేసు పెట్టింది. తన దగ్గర రూ.2 కోట్లు తీసుకున్నాడని ఆరోపిస్తోంది. ఇప్పుడు ఈ కేసు కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది.(ఇదీ చదవండి: ప్రముఖ నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ) -
యూట్యూబర్ హర్షసాయిపై కేసు.. నిజాలు బయటపెట్టిన యువతి
యూట్యూబర్ హర్షసాయిపై ఓ అమ్మాయి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. హైదరాబాద్‌లోని నార్సింగి పోలీస్ స్టేషన్లో ఇతడిపై అత్యాచారం కేసు నమోదైంది. బాధిత యువతి ఫిర్యాదుతో నార్సింగి పోలీసులు.. హర్షసాయిపై 328, 376 (2) 354 , 376ఎన్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటికే బాధిత యువతి స్టేట్మెంట్ని రికార్డు చేశారు. అలానే కొండాపూర్‌లోని ప్రాంతీయ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు కూడా పూర్తి చేశారు. కేసు నమోదు అయినప్పటి హర్షసాయి పరారీలో ఉన్నాడు. ఇతడి తండ్రి రాధాకృష్ణ కూడా అందుబాటులో లేరు.చాలామంది డబ్బులు, వస్తువులు పంచుతూ వాటిని వీడియోలుగా తీసి యూట్యూబ్‌లో పెట్టే హర్షసాయికి మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ఉన్నారు. ఇతడిని అభిమానించే వాళ్లు బోలెడు మంది. అలాంటిది ఇతడిపై ఇప్పుడు ఓ యువతి కేసు పెట్టడం చర్చనీయాంశమైంది. ముంబైకి చెందిన ఈమె సినిమా అవకాశాల కోసం కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చింది. తెలుగు రియాలిటీ షోలోనూ పాల్గొంది. ఆ తర్వాత ప్రైవేట్ పార్టీలో హర్షసాయి కలిశారు. ఫ్రెండ్షిప్ పేరు చెప్పి దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అలా నమ్మబలికి అత్యాచారం కూడా చేశాడు.(ఇదీ చదవండి: 'భారతీయుడు' హీరోయిన్ విడాకులు.. భర్తకు ఇష్టం లేకపోయినా!)యువతిపై అత్యాచారం చేయడమే కాకుండా నగ్నచిత్రాలు సేకరించి ఆమెని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. అంతకుముందే వీళ్లిద్దరి హీరోహీరోయిన్లుగా గతేడాది సెప్టెంబరులో ఓ సినిమా మొదలైంది. ఆ తర్వాత ఏకంగా రూ.2 కోట్లు వరకు ఆమె దగ్గర నుంచి తీసుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత ఈమెని మోసం చేశాడు. దీంతో బాధిత యువతి పోలీసులని ఆశ్రయించింది. ప్రస్తుతం పరారీలో ఉన్న హర్షసాయి, అతడి తండ్రి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.మరో ట్విస్ట్అయితే ఈ కేసులో కీలక ట్విస్ట్ ఇప్పుడు బయటపడింది. తనని హీరోగా పెట్టి తీసే 'మెగా' సినిమాకు సంబంధించిన కాపీ రైట్స్ కోసమే హర్ష సాయి ఇంతలా తెగించాడట. ఈ సినిమాకు బాధితురాలు నిర్మాతగా వ్యవహరించింది. కాపీ రైట్స్ విషయమై ఇద్దరి మధ్య గొడవ జరగ్గా.. బాధితురాలికి మత్తు మందు ఇచ్చి హర్షసాయి అత్యాచారం చేశాడు. ఆ వీడియోలని సీక్రెట్‌గా రికార్డ్ చేశాడు. కాపీ రైట్స్ ఇవ్వకుంటే వీడియోలు బయటపెడతానని బెదిరించినట్లు సదరు యువతి ఫిర్యాదులో పేర్కొంది.(ఇదీ చదవండి: Bigg Boss 8: సోనియా చీప్ బిహేవియర్.. బండారం బయటపెట్టిన యష్మి) -
యూట్యూబర్ హర్ష సాయిపై కేసు పెట్టిన యువతి
యూట్యూబర్ హర్షసాయిపై పోలీసు కేసు నమోదైంది. హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్లో ఓ యువతి ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని తనని మోసం చేసి రూ.2 కోట్లు తీసుకున్నాడని ఫిర్యాదు చేసింది. హర్షసాయితో పాటు అతడి తండ్రి రాధాకృష్ణపైన కూడా కంప్లైంట్ ఇచ్చింది. దీంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు.పేదలకు డబ్బు సాయం చేస్తూ వాటిని వీడియోలుగా తీసి యూట్యూబ్‌లో పోస్ట్ చేసే చాలా పాపులర్ అయ్యాడు. అయితే బెట్టింగ్ యాప్స్‌ని విపరీతంగా ప్రమోట్ చేస్తున్నాడని కొన్నాళ్ల క్రితం ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు మోసం చేశాడని యువతి ఫిర్యాదు చేయడంతో హర్షసాయి బండారం కాస్త బట్టబయలైంది. -
తమిళ హీరోయిన్‌పై పోలీస్ కేసు.. అప్పటి గొడవ మళ్లీ
రీసెంట్గా దళపతి విజయ్ 'ద గోట్' మూవీతో వచ్చాడు. ఇందులో కీలక పాత్రలో నటించిన పార్వతి నాయర్‌పై ఇప్పుడు పోలీస్ కేసు నమోదైంది. రెండేళ్ల క్రితం గొడవ మళ్లీ తెరపైకి వచ్చింది. పార్వతి, మరో నిర్మాత సహా మొత్తంగా ఐదుగురిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.అసలేం జరిగింది?2022 అక్టోబరు 20న తన ఇంట్లో దొంగతనం జరిగిందని పార్వతి నాయర్ నుంగంబాక్కం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. తన దగ్గర పనిచేసే సుభాష్ చంద్రబోస్.. రూ.9 లక్షల విలువైన రెండు వాచీలు, లక్షన్నర ఖరీదైన ఐఫోన్, రూ.2 లక్షల విలువైన ల్యాప్ ట్యాప్ దొంగతనం చేశాడని తన ఫిర్యాదులో పేర్కొంది. ప్రతిగా ఈమెపై సుభాష్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. పార్వతి నాయర్.. తనని కొట్టి, మానసిక క్షోభకు గురిచేసిందని, తిరిగి దొంగతనం కేసు పెట్టిందని చెప్పాడు.(ఇదీ చదవండి: భార్యకి సరైన గౌరవం ఇవ్వాలి.. ఖుష్బూ షాకింగ్ ట్వీట్)ఇప్పుడేం జరిగింది?అప్పుడు సుభాష్.. తేనాంపేట పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో తాజాగా సైదాపేట కోర్టులో కేసు వేశాడు. ఆమెతో పాటు మరికొందరు తనపై దాడి చేశారని వాళ్లపై చర్యలు తీసుకోవాలని కోరాడు. తనని ఇబ్బంది పెట్టారని తేనాంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని వాపోయాడు. ఈ కేసు పరిశీలించిన స్థానిక కోర్ట్.. చర్యలు తీసుకోవాలని పోలీసులని ఆదేశించింది.ఈ క్రమంలోనే నటి పార్వతి నాయర్, నిర్మాత కొడప్పాడి రాజేశ్‌తో పాటు మరో ముగ్గురిపై తేనాంపేట పోలీసు స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. దుబాయిలో పుట్టి పెరిగిన పార్వతి నాయర్.. మలయాళ సినిమాలతో నటి అయింది. ఆ తర్వాత తమిళ, కన్నడ సినిమాల్లో నటించింది. తెలుగులో చేయనప్పటికీ ఎంతవాడు గానీ, ఉత్తమ విలన్, ద గోట్ చిత్రాలతో అలరించింది.(ఇదీ చదవండి: కుమ్మేసిన లేడీస్.. ప్రైజ్‌మనీ డబుల్! అభయ్, మణికి వార్నింగ్) -
తప్పించుకు తిరుగుతున్న జానీ మాస్టర్.. అరెస్ట్ ఎప్పుడు?
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో కాస్త పురోగతి. ఇప్పటికే కేసు వివరాలని సేకరించిన పోలీసులు.. బాధితురాలి స్టేట్మెంట్ని తీసుకుని, ఆమెకు వైద్య పరీక్షలు పూర్తి చేశారు. అయితే రెండు వారాల క్రితమే ఫిల్మ్ ఛాంబర్ దగ్గరికి ఈ కేసు వచ్చింది. కానీ మూడు రోజుల క్రితం బాధిత మహిళ.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ ఘోరం బయటపడింది. అప్పటినుంచి జానీ మాస్టర్ జాడ మాత్రం తెలియట్లేదు.(ఇదీ చదవండి: ఇండస్ట్రీలోని మహిళలకు ఆ ధైర్యం ఇవ్వలేకపోతున్నాం: తమ్మారెడ్డి భరద్వాజ)ఈ కేసు ఏంటి?మధ్యప్రదేశ్‌కి చెందిన ఓ టీనేజ్ అమ్మాయి 2017లో ఢీ డ్యాన్స్ షోలో పాల్గొంది. ఇదే షోకు జడ్జిగా వచ్చిన జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ భాషా ఆమెకు అవకాశమిస్తానని మాటిచ్చాడు. అందుకు తగ్గట్లే 2019 నుంచి సదరు మహిళ జానీ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తోంది. అయితే తనని లైంగికంగా, మానసికంగా చాలారోజుల నుంచి వేధిస్తున్నాడని.. ఓ షో కోసం ముంబై వెళ్లినప్పుడు హోటల్ రూంలో తనని బలవంతం చేసి లైంగిక వేధింపులకు పాల్పడడ్డాని సదరు యువతి చెప్పింది.అలానే షూటింగ్ టైంలోనూ అందరి ముందు తనని అసభ్యంగా తాకేవాడని, జానీ మాస్టర్ భార్య కూడా తనని మతం మార్చుకుని, అతడిని పెళ్లి చేసుకోమని చాలా ఇబ్బంది పెట్టిందని ఫిర్యాదులో పేర్కొంది. ఓసారి వ్యానిటీ వ్యాన్‌లో, నార్సింగిలోనూ తన ఇంటికొచ్చి కూడా లైంగికంగా చాలాసార్లు వేధించాడని సదరు మహిళా కొరియోగ్రాఫర్ బాధని బయటపెట్టింది.(ఇదీ చదవండి: జానీ మాస్టర్ కేసుపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలి: కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి)ఫిల్మ్ ఛాంబర్ స్పందనఈ ఘటనపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కూడా కాస్త ఘాటుగానే స్పందించింది. మంగళవారం ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ కేసు గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టారు. మైనర్‌గా ఉన్నప్పుడే బాధితురాలు లైంగిక వేధింపులకు గురైందని, ఇప్పటికే కొన్ని ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని చెబుతోంది. ఇదంతా చూస్తుంటే జానీ మాస్టర్ చుట్టూ గట్టిగా బిగుస్తోంది.జానీ మాస్టర్ ఎక్కడ?అయితే తనపై పోలీసు కేసు నమోదైన దగ్గర నుంచి జానీ మాస్టర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని నార్సింగి పోలీసులు ఇతడి కోసం గాలిస్తున్నారు. నెల్లూరులో ఉన్నట్లు సమాచారం అందడంతో అక్కడి పోలీసులని సంప్రదించారు. జానీ మాస్టర్‌కు నోటీసులు ఇచ్చి, ఒకటి రెండు రోజుల్లో అరెస్ట్ చేయడం గ్యారంటీ!(ఇదీ చదవండి: జానీ మాస్టర్ భార్య కూడా దాడి చేసింది: బాధితురాలు) -
జానీ మాస్టర్ భార్య దాడి చేసింది
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై నమోదైన లైంగిక వేధింపుల కేసులో కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. జానీ మాస్టర్, అతని భార్య ఇద్దరూ కలిసి ఒకరోజు తన ఇంటికి వచ్చి బలవంతంగా తలుపులు తెరవడంతో పాటు లోపలికి వచ్చి తనతో మతం ప్రస్తావన తీసుకొచ్చారని, నానా రకాలుగా ప్రశ్నించారని, ఈ క్రమంలో జానీ మాస్టర్ భార్య పలుమార్లు తనపై శారీరక దాడికి పాల్పడిందని బాధితురాలు ఎఫ్ఐఆర్లో వెల్లడించింది. జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషా తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని అతని సహాయకురాలు (21) చేసిన ఫిర్యాదు మేరకు ఈనెల 15న నార్సింగి పీఎస్‌లో ఐపీసీ 376 (2)(ఎన్), 506, 323 సెక్షన్ల కింద కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ముంబైలోని ఓ హోటల్లో మొదలుపెట్టి.. ఎఫ్ఐఆర్లోని వివరాల ప్రకారం..బాధితురాలు 2017లో తన స్వస్థలం నుంచి హైదరాబాద్‌కు వచ్చింది. ఢీ–12 డ్యాన్స్ షో చేస్తున్న క్రమంలో ఆమెకు జానీ మాస్టర్‌తో పరిచయం ఏర్పడింది. సహాయ కొరియోగ్రాఫర్‌గా పనిచేయడానికి జానీ మాస్టర్ బృందం నుంచి ఫోన్ కాల్ రావడంతో 2019లో ఆ బృందంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేరింది. ఈ క్రమంలో ముంబైలో ఒక ప్రాజెక్టు కోసం జానీ మాస్టర్, ఇద్దరు అసిస్టెంట్లతో కలిసి ముంబైకు వెళ్లింది. అప్పుడు ఓ హోటల్లో జానీ మాస్టర్ ఆమెపై బలవంతంగా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయం బయట ఎవరికైనా చెబితే పని నుంచి తొలగిస్తానని బెదిరించాడు.దీంతో బాధితురాలు మౌనంగా ఉండిపోయింది. ఆపై ప్రతి షూట్ సమయంలోనూ జానీ మాస్టర్ ఆమెను వేధించేవాడు. ఆమె వ్యానిటీ వ్యాన్‌లోకి ప్రవేశించి లైంగిక వాంఛను తీర్చాలని బలవంతం చేసేవాడు. షూటింగ్ సెట్లలో ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. ఒకసారి తన కోరిక తీర్చనన్నందుకు జుట్టు పట్టుకొని ఆమె తలను వ్యానిటీ వ్యాన్‌లోని అద్దానికి గుద్దాడు. ఒకసారి షూటింగ్ ముగిశాక అర్ధరాత్రి ఆమె ఇంటికి వెళ్లి స్కూటీని ధ్వంసం చేశాడు. మతం మారాలని, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చాడు. ఆగంతకుడి బెదిరింపులు.. అనుమానాస్పద పార్శిల్ వేధింపులు భరించలేక బాధితురాలు సొంతంగా ప నిచేసుకోవడం ప్రారంభించింది. కానీ చిత్ర పరిశ్ర మలో తనకున్న పరిచయాలను ఆధారంగా చేసు కుని జానీ మాస్టర్ ఆమెకు ఎలాంటి అవకాశాలు రాకుండా చేసేవాడు. ఈ క్రమంలోనే కొన్ని ప్రాజెక్టుల కోసం ఆమెను ఎంపిక చేసుకుని, షూటింగ్ కొంత పూర్తయ్యాక మధ్యలో వదిలేసి వేరొకర్ని నియమించుకున్నాడు. గత నెల 17న గుడి నుంచి ఇంటికి వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తి ఆమెను చుట్టుముట్టి బెదిరింపులకు పాల్పడ్డాడు. 28న ఆమె ఇంటి తలుపులకు అనుమానాస్పద పార్శిల్ వేలాడదీసి ఉంది. అందులో ‘కంగ్రాచ్యులేషన్స్ ఫర్ సన్ .. బట్ బీ కేర్ ఫుల్..’అని రాసి ఉందని బాధితురాలు ఎఫ్ఐఆర్లో పేర్కొంది. -
జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు
మణికొండ: సినిమాల్లో నృత్య దర్శకునిగా పనిచేస్తూ పాపులర్ అయిన జానీ మాస్టర్ తనపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడినట్టు అతని సహాయకురాలు (21) పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్, చెన్నై, ముంబై తదితర నగరాల్లో ఔట్‌డోర్ షూటింగ్లలో పాల్గొన్నప్పుడు ఆయన తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే నార్సింగిలోని తన నివాసానికి వచ్చి పలుమార్లు వేధింపులకు గురి చేశాడని వివిధ ఆధారాలతో ఆమె ఆదివారం రాత్రి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన మతం మార్చుకుని అతడిని వివాహం చేసుకోవాలంటూ బెదిరింపులకు పాల్పడ్డాడని ఆ యువతి ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, బాధితురాలు ఉండేది నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో కావటంతో రాయదుర్గం పోలీసులు ఎఫ్ఐఆర్ నంబర్ 1371/2024 ప్రకారం సెక్షన్ 376 (రేప్), 506 (క్రిమినల్ బెదిరింపులు), 323(2) గాయపర్చడం వంటి సెక్షన్ల కింద జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి నార్సింగి పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు.ఇదిలా ఉండగా జానీ మాస్టర్‌కు గతంలోను నేరచరిత్ర ఉందని, 2015లో ఓ కాలేజీలో మహిళపై దాడి కేసులో 2019లో మేడ్చల్ కోర్టు అతనికి ఆరునెలల జైలుశిక్ష విధించిందని పోలీసులు తెలిపారు. ఇటీవల ఆయన రాజకీయాల్లోచేరి ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీ తరఫున గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేశారు. కేసు తమ స్టేషన్‌కు వచ్చిందని, విచారణ చేస్తున్నామని నార్సింగి సీఐ హరికృష్ణారెడ్డి తెలిపారు. మరో పక్క సఖీ బృందం బాధితురాలి వద్ద రహస్య ప్రదేశంలో వివరాలు సేకరించింది. బాధితుల గోప్యతను కాపాడాలి‘ఓ ఇష్యూ కోర్టులో ఉన్నప్పుడు ఆ సమస్య పరిష్కారమయ్యే వరకు సంబంధిత వ్యక్తుల తాలూకు ముసుగు లేని ఫొటోలను, వీడియోలను ఉపయోగించవద్దని, ఒకవేళ ఇప్పటికే ఉపయోగించినట్లయితే వెంటనే తీసివేయాలని కోరుతున్నాం’ అని తెలుగు చలనచిత్ర వాణిజ్యమండలి ఓ నోట్‌ని విడుదల చేసింది. బాధిత పార్టీల గోప్యతను కాపాడాలని అన్ని ప్రింట్, డిజిటల్, ఎలక్ట్రానిక్ మీడియాలను అభ్యర్థిస్తున్నాం.. అంటూ తెలుగు చలనచిత్ర వాణిజ్యమండలి తరఫున గౌరవ కార్యదర్శి కె.ఎల్.దామోదర్‌ప్రసాద్ ఆ నోట్లో పేర్కొన్నారు. జానీ మాస్టర్ ‘వ్యవహారం’లో స్పందించిన జనసేనపార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశంసాక్షి, అమరావతి: మొన్నటి ఎన్నికల్లో జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై హైదరాబాద్‌లో లైంగిక వేధింపుల కేసు నమోదు కావడంపై ఆ పార్టీ స్పందించింది. ఈ మేరకు జనసేన కార్యాలయం పార్టీ ప్రతినిధి వేములపాటి అజయ్‌కుమార్ పేరుతో సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని షేక్ జానీ (జానీ మాస్టర్)ని ఆదేశించడమైనది. ఆయనపై కేసు నమోదైన క్రమంలో పార్టీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఈ నిర్ణయం అమలులోకి వస్తుంది..’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
జానీ మాస్టర్ కేసు.. బయటకొస్తున్న నిజాలు!?
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. 21 ఏళ్ల అమ్మాయి హైదరాబాద్‌లోని రాయదుర్గ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనని అత్యాచారం చేయడంతో పాటు గాయపరిచాడని పేర్కొంది. అలానే ఇండస్ట్రీలోని అవకాశాలని అడ్డుకోవడంతో పాటు శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని వాపోయింది. దీనితో పాటే ఎఫ్ఐఆర్లో పలు కీలక అంశాలు ఉన్నాయి.మధ్యప్రదేశ్‌కి చెందిన బాధితురాలు 2017లో జానీ మాస్టర్‌కి పరిచయమైంది. 2019లో అతని వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేరింది. ఓ షో కోసం ముంబయికి వెళ్లిన టైంలో తనని లైంగికంగా వేధించాడని బాధితురాలు చెబుతోంది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపివేస్తానని తనని బెదిరించే వాడని, షూటింగ్‌కు సంబంధించిన వాహనంలో కూడా తనని వేధించాడని బాధితురాలు చెప్పింది. (ఇదీ చదవండి: కౌగిలించుకోవడం కోసం 17సార్లు రీ షూట్.. మాలీవుడ్ 'తెర' వెనుక అగ్లీ స్టోరీస్)అందరి ముందు అసభ్యంగా శరీరభాగాలను తాకేవాడని, పెళ్లి చేసుకోవాలంటే మతం మార్చుకోవాలని భార్యతో కలిసి జానీ మాస్టర్ తనని వేధించాడని చెప్పుకొచ్చింది. గత నెల 28న అనుమానాస్పద పార్శిల్ తన ఇంటి ముందు ఉందని, ఇదే నీ చివరి షూటింగ్ అని దానిపై రాసి ఉందని బాధితురాలు పేర్కొంది. తనకు అవకాశాలు లేకుండా చేయడంతో పాటు జానీ మాస్టర్ నుంచి తనకు ప్రాణ హాని కూడా ఉందని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. దీనిపై నార్సింగి పోలీసులు ప్రస్తుతం విచారణ చేస్తున్నారు.ఇదే కాదు గతంలోనూ జానీ మాస్టర్‌పై సతీష్ అనే కొరియోగ్రాఫర్ కేసు పెట్టాడు. అంతకు ముందు కాలేజీకి వెళ్లి ఓ యువతిని కొట్టిన కేసులో 2019లో కోర్టు ఇతడికి ఆరు నెలల జైలు శిక్ష కూడా విధించింది. ఇప్పుడు లైంగిక వేధింపుల కేసు. ఇలా వరస వివాదాలతో జానీ మాస్టర్ హాట్ టాపిక్ అయిపోయాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 మూవీస్.. ఆ మూడు కాస్త స్పెషల్) -
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై ఓ మహిళ లైంగిక వేధింపుల కేసు పెట్టింది. హైదరాబాద్‌లోని రాయ్‌దుర్గ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో సెక్షన్ 376 రేప్ కేసుతో పాటు బెదిరింపు (506), గాయపరచడం (323) క్లాజ్ (2) కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఘటన నార్సింగి పరిధిలో జరగడంతో కేసుని పోలీసులు అక్కడికి బదిలీ చేశారు.ఏం జరిగింది?మధ్యప్రదేశ్‌కి చెందిన 21 ఏళ్ల మహిళ.. జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా గత ఆరు నెలలుగా పనిచేస్తోంది. అయితే ఔట్ డోర్ షూటింగ్స్ టైంలో తనని పలుమార్లు లైంగికంగా వేధించాడని సదరు మహిళ కేసు పెట్టింది. అత్యాచారం చేయడంతో పాటు గాయపరిచాడని చెప్పుకొచ్చింది. నార్సింగిలోని తన ఇంటికి కూడా వచ్చి ఇబ్బందులకు గురిచేసినట్లు తన ఫిర్యాదులో పేర్కొంది. అవకాశాలు అడ్డుకోవడమే కాకుండా శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని వాపోయింది.(ఇదీ చదవండి: ఓటీటీలోనే బెస్ట్ జాంబీ మూవీ.. ప్యాంటు తడిచిపోవడం గ్యారంటీ!)ఇంతకు ముందు కూడాఈ ఏడాది జూన్‌లోనూ జానీ మాస్టర్‌పై సతీష్ అనే కొరియోగ్రాఫర్ కేసు పెట్టాడు. సినిమాల్లో అవకాశాలు రాకుండా తనని వేధిస్తున్నాడని ఫిర్యాదు చేశాడు. అంతకు ముందు 2019లో మేడ్చల్ కోర్టు జానీ మాస్టర్‌కి ఆరు నెలల జైలు శిక్ష విధించింది. 2015లో ఓ కాలేజీలో జరిగిన గొడవ విషయమై ఇలా తీర్పిచ్చింది. ఇలా జానీ మాస్టర్ ఎప్పటికప్పుడు వివాదాల్లో చిక్కుకుంటూనే ఉన్నాడు.జనసేన నాయకుడుకొరియోగ్రాఫర్గా అందరికీ తెలిసిన జానీ మాస్టర్.. పవన్ కల్యాణ్ జనసేన పార్టీకి స్టార్ క్యాంపెయినర్. కొన్నాళ్ల క్రితం జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున ప్రచారం చేసారు. కొన్నిరోజుల క్రితం మాట్లాడుతూ పవన్ కల్యాణ్ త్వరలో సీఎం, ప్రధాని అవుతారని కూడా చెప్పుకొచ్చాడు. మరి ఇప్పుడు తనపై నమోదైన కేసు విషయంలో ఏం చెబుతాడో చూడాలి?(ఇదీ చదవండి: బిగ్ బాస్ 8లో రెండో ఎలిమినేషన్.. కొత్త ట్విస్ట్) -
డీసీపీ ఫిర్యాదు..ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు
సాక్షి,హైదరాబాద్:హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో శనివారం(సెప్టెంబర్14) కేసు నమోదైంది. అడిషనల్ డీసీపీ హరిచందద్రారెడ్డి ఫిర్యాదుతో బీఎన్ఎస్ఎస్ 132 కింద కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు.గురువారం తన ఇంటిపై ఎమ్మెల్యే గాంధీ దాడి తర్వాత కౌశిక్‌రెడ్డి బీఆర్ఎస్ నేతలతో కలిసి సైబరాబాద్ కమిషనరేట్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా కౌశిక్‌రెడ్డి తనను బెదిరించారని డీసీపీ ఫిర్యాదు చేశారు. కాగా, కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి చేసిన కేసులో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై గచ్చిబౌలి పోలీసులు ఇప్పటికే హత్యాయత్నం కేసు నమోదు చేశారు. పార్టీ ఫిరాయింపులపై ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, గాంధీ మధ్య వాగ్యుద్ధం ముదిరి దాడులు, కేసుల వరకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. ఎమ్మెల్యే గాంధీపై హత్యాయత్నం కేసు -
ఎమ్మెల్యే గాంధీపై హత్యాయత్నం కేసు
సాక్షి,హైదరాబాద్:శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మీద హత్యాయత్నం కేసు నమోదైంది.హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో ఎమ్మెల్యే గాంధీతో పాటు ఆయన కుమారుడు సోదరుడి మీద గచ్చిబౌలి పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.కౌశిక్‌రెడ్డి ఇంటి మీద దాడి చేసిన ఘటనపై ఎస్ఐ మహేష్ ఇచ్చిన ఫిర్యాదుతో రెండు రోజుల క్రితమే ఒక కేసు నమోదవగా ఆ కేసులో గాంధీ ఇప్పటికే బెయిల్ తీసుకున్నారు. తాజాగా కౌశిక్ రెడ్డి ఫిర్యాదుతో హత్యాయత్నం కేసు పెట్టారు.కాగా, పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, గాంధీలు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు. ఇవి కాస్తా హద్దు మీరి కౌశిక్‌రెడ్డి ఇంటి మీద గాంధీ దాడి చేసే దాకా వెళ్లింది. ఈ దాడిపై బీఆర్ఎస్ నేతలు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ముందు నిరసన తెలిపారు. ఈ నిరసన ఉద్రిక్తంగా మారడంతో హరీశ్‌రావు సహా ముఖ్యనేతలను పోలీసులు అరెస్టు చేసి తర్వాత విడిచిపెట్టారు. ఇదీ చదవండి.. ఎమర్జెన్సీ కన్నా దారుణం: హరీశ్‌రావు -
‘హైడ్రా’ పేరిట వసూళ్లు..! వ్యక్తిపై కేసు నమోదు
సాక్షి,సంగారెడ్డి: అమీన్పూర్లో హైడ్రా పేరిట బిల్డర్ల వద్ద నుంచి వసూళ్లకు యత్నించిన ఓ వ్యక్తిపై పోలిస్స్టేషన్లో కేసు నమోదైంది. బెదిరింపులకు పాల్పడుతున్న డాక్టర్ బండ్ల విప్లవ సిన్హా అనే వ్యక్తిపై బిల్డర్లు వాడల రాజేంద్రనాథ్, మంజునాథ్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. సోషల్ యాక్టివిస్ట్, సోషల్ వర్కర్ అని బోర్డు పెట్టుకొని కస్టమర్లకు తమ ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో దగ్గరి పరిచయం ఉందని, ఆయనతో కలిసి దిగిన ఫొటోలు చూపిస్తూ వాట్స్అప్ కాల్ చేసి బెదిరిస్తున్నాడని తెలిపారు. మీ జోలికి రావద్దు అంటే తనకు 20 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపించారు. బిల్డర్ల ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన అమీన్పూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళపై థర్డ్‌డిగ్రీ.! షాద్‌నగర్ పోలీసులపై కేసు
సాక్షి,షాద్‌నగర్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని షాద్‌నగర్ పోలీసులపై కేసు నమోదైంది. ఇటీవల ఒక దళిత మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న ఆరోపణలపై కేసు నమోదైంది. షాద్‌నగర్ పీఎస్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ (డీఐ) రామ్‌రెడ్డి సహా నలుగురు కానిస్టేబుళ్లపై బాధితురాలు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా వారిపై ఎఫ్ఐఆర్ రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల షాద్‌నగర్ పోలీసులు దళిత మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి విచారించారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై రాజకీయ దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. -
కెప్టెన్ అన్షుమన్ సతీమణిపై వివాదాస్పద పోస్టు.. నెటిజన్‌పై కేసు
న్యూఢిల్లీ: కీర్తి చక్ర అవార్డు గ్రహీత దివంగత కెప్టెన్ అన్షుమన్‌సింగ్ సతీమణి స్మృతిసింగ్‌పై వివాదాస్పద పోస్టు పెట్టినందుకుగాను ఢిల్లీ పోలీసులు ఓ నెటిజన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) ఫిర్యాదు మేరకు నిందితునిపై ఇటీవలే అమలులోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్ 2024)సెక్షన్ 79, ఐటీ చట్టం సెక్షన్ 67 కింద కేసులు పెట్టారు. స్మృతిసింగ్‌పై సోషల్‌మీడియాలో వివాదాస్పద పోస్టు పెట్టిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని ఎన్సీడబ్ల్యూ ఢిల్లీ పోలీసు కమిషనర్‌కు ఒక లేఖ కూడా రాసింది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.గతేడాది సైన్యంలో విధి నిర్వహణలో ఉండగా సియాచిన్‌లో జరిగిన ఒక అగ్నిప్రమాదంలో అన్షుమన్ ప్రాణాలు కోల్పోయారు. చనిపోయే ముందు తన సహచరులను కాపాడినందుకుగాను అన్షుమన్‌కు కేంద్ర ప్రభుత్వం కీర్తి చక్ర పతకం ప్రకటించింది. ఈ పతకాన్ని ఈ మధ్యే జులై 5న రాష్ట్రపతి చేతుల మీదుగా అన్షుమన్ సతీమణి, మాతృమూర్తులు అందుకున్నారు. కాగా అన్షుమన్‌కు వివాహం జరిగిన తర్వాత కేవలం 5 నెలలకే ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలిచివేసింది. -
సూరజ్ రేవణ్ణపై లైంగిక వేధింపుల కేసు
బనశంకరి: జేడీఎస్‌కు చెందిన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దాడి, నగ్న వీడియోల కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. తాజాగా ప్ర జ్వల్ తమ్ముడు డాక్టర్ సూరజ్ రేవణ్ణ (36)పై కూడా లైంగిక వేధింపుల కే సు నమోదైంది. ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణ తనపై అసహజ లైంగిక దాడికి పాల్పడ్డారని చేతన్ కే.ఎస్. అనే జేడీఎస్ కార్యకర్త శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హాసన్ జిల్లా అరకలగూడుకు చెందిన చేతన్ వీడియోల ను కూడా విడుదల చేయడంతో కన్నడ రాజకీయాల్లో మరోసారి సంచల నం చెలరేగింది. లోక్‌సభ ఎన్నికల సమయంలో పరిచయమైన సూరజ్ ఫాంహౌస్‌కు పిలిచి లైంగిక దాడికి యతి్నంచాడని చేతన్ ఆరోపించాడు. డబ్బులు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేతన్, అతని బంధువు డబ్బులు డిమాండ్ చేశారని, ఇవ్వకపోతే లైంగిక వేధింపుల కేసు పెడతామని బ్లాక్మెయిల్ చేశారని సూరజ్ రేవణ్ణ ముఖ్య అనుచరుడైన శివకుమార్ సైతం శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనతో స్నేహం చేసిన చేతన్.. సూరజ్ రేవణ్ణ బ్రిగేడ్‌కు పనిచేయడం ప్రారంభించాడని, కుటుంబ ఖర్చులకు డబ్బు ఇవ్వాలని కోరగా తాను నిరాకరించడంతో సూరజ్ రేవణ్ణపై లైంగిక వేధింపుల కేసు పెడతామని బెదిరింపులకు దిగారని శివకుమార్ పేర్కొన్నారు. మొదట రూ. 5 కోట్లు తర్వాత దాన్ని తగ్గించి రూ. 2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారని అన్నా రు. శివకుమార్ ఫిర్యాదుతో చేతన్, అతని బంధువుపై కేసు నమోదైంది. -
జేసీ కుటుంబంపై కేసు నమోదు
సాక్షి, అనంతపురం: టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలింగ్ సందర్భంగా తాడిపత్రి పట్టణంలో జేసీ కుటుంబ సభ్యులు విధ్వంసం సృష్టించారు. తాడిపత్రి టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, జేసీ పవన్ రెడ్డిలపై ఎఫ్ఐఆర్ నమోదైంది.జేసీ కుటుంబ సభ్యులతో పాటు 100 మంది టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కాన్వాయ్‌పై టీడీపీ నేతలు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఐదు వాహనాలు ధ్వంసం కాగా, ఇద్దరు కానిస్టేబుళ్లు సహా పలువురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. ఈ ఘటనలపై పోలీసులు విచారణ చేపట్టారు. -
మన్యంలో మోసగాడిగా.. పచ్చ నేత! యథేచ్ఛగా మేత!!
పాడేరు: మఠం భాస్కర్.. రంపచోడవరం నియోజకవర్గంలో ఈయన పేరు తెలియని వారండరు.. చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో సిద్ధహస్తుడు. సొంతూరు రాజవొమ్మంగి మండలం అనంతగిరి. రంపచోడవరం టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి మిరియాల శిరీషాదేవికి భర్త. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తానని సుమారు రూ.కోటి వరకు గతంలో వసూలు చేశాడు.. ఆ సొమ్ముకోసం ఇప్పటికీ బాధితులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఆయన నేరచరిత్ర కూడా పెద్దదే. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడిన పలు కేసుల్లో నిందితుడు. నిరుద్యోగులకు మంచి జరగాలంటే భార్య శిరీషాదేవికి ఓటేయాలని ఇప్పుడు అభ్యర్థిస్తున్నాడు. అతను మాటలు నమ్మితే మన్యాన్ని మడత పెట్టేస్తాడని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.సార్వత్రిక ఎన్నికల్లో రంపచోడవరం అసెంబ్లీకి పోటీచేస్తున్న టీడీపీ అభ్యర్థి మఠం భాస్కర్ రాజవొమ్మంగి పోలీసు స్టేషన్లో నమోదైన పలు కేసుల్లో నిందితుడు. ఏజెన్సీలో గిరిజన యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తానని రెండేళ్ల క్రితం వారి నుంచి సుమారు రూ.కోటి వరకు డబ్బులు వసూలు చేశాడు. నియోజకవర్గంలోని రాజవొమ్మంగి, జడ్డంగి, దేవీపట్నం, వీఆర్‌పురం, డొంకరాయి, అడ్డతీగల గ్రామాల్లో ఆయన ఉచ్చులో పడి మోసపోయిన బాధితులు ఎంతోమంది ఉన్నారని ప్రచారం జరుగుతోంది.రాజవొమ్మంగి మండలం చికిలింత గ్రామానికి చెందిన గిరిజన యువకుడికి ఓ ఎయిడెడ్ స్కూల్లో టీచర్ పోస్టు ఇప్పిస్తానని రూ.3 లక్షల వరకు తన ఖాతాకు నగదు బదిలీ చేయించుకున్నట్టు సమాచారం. ఇందుకు మధ్యవర్తిగా వ్యవహరించిన టీడీపీకి చెందిన ఓ నాయకుడు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేయమని అడిగినట్టు సమాచారం. డబ్బులు ఇచ్చే వరకు అడగవద్దని హెచ్చరించినట్టు తెలిసింది.అడ్డతీగల మండలం దుప్పులపాలెం గ్రామానికి చెందిన ముగ్గురు గిరిజన యువకుల నుంచి సీఆర్టీ పోస్టు ఇప్పిస్తానని ఒకొక్కరి నుంచి రూ.లక్ష చొప్పన మూడు లక్షలు వసూలు చేసినట్టు తెలిసింది. అంతేకాకుండా మరో యువకుడి నుంచి టీచర్ పోస్టు ఇప్పిస్తానని రూ.లక్ష, గుమస్తా పోస్టుకు రూ. 60 వేలు మధ్యవర్తుల సమక్షంలో వసూలు చేసినట్టు సమాచారం. ఇలా తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించేందుకు ఒప్పుకున్న మఠం భాస్కర్ పూర్తిగా చెల్లించిన దాఖల్లాలేవు. ఉద్యోగాలు మాట దేవుడెరుగు మా డబ్బులు మాకివ్వండి అంటూ గిరిజన యువత గగ్గోలు పెట్టిన ఫలితం లేకుండా పోయింది. అయితే ఎప్పటికైనా ఎంతో కొంత మొత్తం ఇస్తాడన్న ఆశతో వారు జరిగిన అన్యాయాన్ని బయటకు చెప్పేందుకు రాలేకపోతున్నారు.అసెంబ్లీ అభ్యర్థి శిరీషాదేవి భర్త మఠం భాస్కర్‌కు నేర చరిత్ర కూడా ఉంది. రాజవొమ్మంగి పోలీసుస్టేషన్లో ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి.2016లో రాజవొమ్మంగి పోలీస్‌స్టేషన్Œ వద్ద విధి నిర్వహణలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ ఏకే దొరపై దౌర్జన్యానికి పాల్పడ్డాడు. వాహనాలను తనిఖీ చేస్తున్న అతనిపై దాడికి దిగడంతో (ఎఫ్ఐఆర్: 50/2017) అదే పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. 2017లో అతని స్వగ్రామం అనంతగిరిలో జీడిమామిడి తోటను దగ్ధం చేశాడు. గ్రామస్తుల సమక్షంలో బాధిత రైతుకు నష్టపరిహారం చెల్లించాలని గ్రామపెద్దలు చెప్పినప్పటికీ అందుకు అంగీకరించనట్టు తెలిసింది. బాధితుల ఫిర్యాదు మేరకు (ఎఫ్ఐఆర్: 15/2017) రాజవొమ్మంగి పోలీసుస్టేషన్లో కేసు నమోదు అయింది.2019లో జరిగిన ఎన్నికల సమయంలో రాజవొమ్మంగిలో గొడవకు దిగి శాంతి భద్రతలకు విఘాతం కలిగించాడన్న అభియోగంపై (ఎఫ్ఐఆర్:47/2019) కేసు నమోదైంది.2022లో అనంతగిరి గ్రామ సమీపంలో అశ్లీల నృత్య ప్రదర్శన, పేకాట, గుండాట నిర్వహించాడన్న అభియోగం మేరకు అతనిపై రాజవొమ్మంగి పోలీసులు (ఎఫ్ఐఆర్: 10/2022) కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసులన్నీ కోర్టులో విచారణ దశలో ఉన్నాయి.ఇవి చదవండి: కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్ కళ్యాణ్ -
యూట్యూబర్ ఓవర్ యాక్షన్.. దిమ్మతిరిగే షాక్!
సోషల్ మీడియా రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. ఓవర్ యాక్షన్ చేస్తే అది మన మెడకే చుట్టుకుంటుంది. ఛానల్ ఉంది కదా అనో, చేతిలో కెమెరా ఉంది కదా అనో విచక్షణ మరిచి ప్రవర్తించకూడదు. ఇది తెలియక చాలామంది యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్లు ఫేక్‌వార్తలు, సమాచారంతో గప్పాలు కొడుతుంటారు. తాజాగా పబ్లిసిటీ కోసం నిషిద్ధ ప్రాంతంలోకి ఉద్దేశపూర్వకంగా ఎంటరైన ఒక యూట్యూబర్‌కి దిమ్మతిరిగే షాక్ తగిలింది. విషయం ఏమిటంటే.. బెంగళూరులోని యలహంకకు చెందిన వికాస్ గౌడ (23) అడ్డంగా బుక్కయ్యాడు. ఏప్రిల్ 7వ తేదీన మధ్యాహ్నం 12 గంటల సమయంలో చెన్నైకి వెళ్లే ఎయిరిండియా విమానం టిక్కెట్ బుక్ చేసుకున్నాడు. భద్రతా తనిఖీల అనంతరం విమానాశ్రయంలోకి ప్రవేశించాడు. ఇక్కడి దాకా బాగానే వుంది. విమానం ఎక్కకుండా, విమానాశ్రయ ఆవరణలోనే తిరుగుతూ వీడియో కంటెంట్‌ను రికార్డ్ చేశాడు. ఇక్కడితో సరిపెట్టినా బావుండేది. ఎయిర్‌పోర్ట్‌లో రోజంతా బస చేసా.. అయినా తనని ఎవరూ పట్టించుకోలేదంటూ ప్రగల్భాలు పలుకుతూ ఏప్రిల్ 12న ఒక వీడియో తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాడు. విమానాశ్రయంలో మొత్తం తిరిగినా తనను ఎవరూ పట్టుకోలేదంటూ, ఎయిర్పోర్ట్ భద్రత గురించి నెగెటివ్ కామెంట్ చేశాడు. అంతా అయ్యాక డ్యామేజ్ కంట్రోల్లో పడ్డాడు. ఆ ఎయిర్పోర్ట్ వీడియోను తన ఛానెల్ నుండి తీసివేశాడు. కానీ అది కాస్తా చేరాల్సిన వారి దృష్టికి అప్పటికే చేరిపోయింది. కట్ చేస్తే.. విషయం తెలుసుకున్న ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ వింగ్ సీఐఎస్ఎఫ్ వికాస్‌పై ఫిర్యాదు చేసింది. దీంతో అతణ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐపీసీ సెక్షన్లు 505, 448 కింద కేసు కూడా నమోదు చేశారు. తన ఫ్లైట్ మిస్సయ్యానని పేర్కొంటూ, సుమారు ఆరు గంటలపాటు విమానాశ్రయంలో తిరిగాడని, కానీ అతను చెప్పినట్టుగా 24 గంటలు కాదని తన విచారణలో తేలిందని భద్రతా అధికారులు వెల్లడించారు. అతని మొబైల్ ఫోన్నుస్వాధీనం చేసుకున్నారు. ఎట్టకేలకు తను చేసింది తప్పేనని అంగీకరించాడు. ప్రచారంకోసం అలా చేశానంటూ లెంపలేసుకున్నాడు. మొత్తం మీద గౌడకు బెయిల్ మంజూరు కావడంతో బతుకు జీవుడా అంటూ బయటపడ్డాడు. -
‘‘చంపేస్తాం’’.. మహిళా జడ్జికి బెదిరింపు లేఖ
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో ఓ మహిళా జడ్జికి చంపేస్తామని బెదిరింపు లేఖ వచ్చింది. దీనిపై ఆ మహాళా జడ్జి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈ మహిళా జడ్జి గతంలో తనను జిల్లా జడ్జి లైంగికంగా వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వేధింపుల్లో భాగంగానే తనకు తాజాగా బెదిరింపు లేఖ వచ్చిందని ఆమె ఫిర్యాదులో తెలిపారు. లేఖ కవర్‌పై ఉన్న ఫ్రమ్ చిరునామా మొత్తం ఫేక్ అని, లేఖ వచ్చిన పోస్టాఫీసులో సీసీ టీవీ కెమెరా పరిశీలించాలని పోలీసులను జడ్జి కోరారు. ఫిర్యాదుకు స్పందించిన పోలీసులు సీసీటీవీ ఫుటే ఫుటేజ్ పరిశీలించి నిందితుడిని అరెస్టు చేస్తామని తెలిపారు. జడ్జి గతంలో నమోదు చేసిన లైంగిక వేధింపుల కేసు ప్రయాగ్‌రాజ్ పోలీసుల వద్ద పెండింగ్‌లోనే ఉంది. ఇదీ చదవండి.. అతనికి 35, ఆమెకు 42 -
మేడిపల్లి పీఎస్‌లో బండి సంజయ్‌పై కేసు
సాక్షి, మేడ్చల్ జిల్లా: మేడిపల్లి పోలీస్ స్టేషన్లో బండి సంజయ్‌పై కేసు నమోదైంది. చెంగిచర్లలో పిట్టల బస్తి బాధితులను పరామర్శించడానికి బండి సంజయ్, అతని అనుచరులు రాగా, పోలీసులకు, బీజేపీ నాయకులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. తోపులాటలో కింద పడిన నాచారం సీఐ నందిశ్వర్ రెడ్డికి గాయాలయ్యాయి. సీఐ ఫిర్యాదుతో బండి సంజయ్‌తో పాటు మరో పది మందిపై 332, 353, 143, 149 ఐపీసీ 3, 4పీడీపీపీఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదీ చదవండి: హైదరాబాద్ ఎంపీగా సానియా మీర్జా పోటీ?! -
నటి రాధపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు
కోలీవుడ్‌లో సుందరాట్రావెల్స్, అదావతి, మనస్థాన్, కధవరాయన్ త దితర చిత్రాల్లో హీరోయిన్గా నటించి గుర్తింపు పొందిన నటి రాధ. నెల్లూరుకు చెందిన రాధ సినిమా అవకాశాల కోసం చెన్నై మకాం మార్చింది. అక్కడ పలు సినిమాల్లో హీరోయిన్గా ఛాన్సులు దక్కించుకుంది. ప్రస్తుతం టీవీ సీరియళ్లలో నటిస్తుంది. ఈమెకు తరుణ్ అనే కుమారుడు ఉన్నాడు. వీరు చెన్నైలోని సాలిగ్రామంలో నివసిస్తున్నారు. కాగా వీరి ఇంటి సమీపంలో ఫ్రాన్సిస్ రిచర్డ్ అనే యువకుడు నివసిస్తున్నాడు. ఇతను ఒక ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నాడు. కాగా రాత్రి ప్రాన్సిస్ ఇంటికి తిరిగి వస్తుండగా వెనుక వచ్చిన నటి రాధ, ఆమె కుమారుడు తరుణ్ అతనిపై దాడి చేసి కొట్టారు. దీంతో ఫ్రాన్సిన్ రిజర్డ్ తండ్రి డేవిడ్ రాజ్ నటి రాధ, ఆమె కొడుకు తరుణ్‌పై విరుగంబాక్కమ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన కొడుకుపై దాడికి పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొన్నారు. దీంతో కేసును నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. నటి రాధ ఫ్రాన్సిస్ రిజర్డ్‌పై దాడి చేసిన దృశ్యాలు ఆ ప్రాంతంలోని నిఘా కెమెరాల్లో చోటు చేసుకున్న విషయం పోలీసులు దృష్టికి వచ్చింది. కాగా ఫ్రాన్సిస్ రిచర్డ్ ఇంతకు ముందు నటి రాధపై వ్యంగంగా ప్రవర్తించినందుకు గానూ అతనిపై ఇంతకు ముందు ఆమె పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే నటి రాధ, ఆమె కొడుకు ఫ్రాన్సిస్ రిచర్డ్‌పై దాడి చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. రాధ గతంలో కూడా పలు వివాధాల వల్ల కోలివుడ్ మీడియాలో ఎప్పుడూ వార్తల్లో నిలిచేది. భర్తతో గొడవలు,వివాహేతర సంబంధాలు,నిర్మాతల వేధింపులపై ఆమె కామెంట్లు ఇలా పలు విషయాల చుట్టూ ఆమె టాపిక్ వైరల్‌గా ఉండేది. -
కేసీఆర్ తోడల్లుడిపై కేసు నమోదు
కరీంనగర్‌క్రైం: మాజీ సీఎం కేసీఆర్ తోడల్లుడు, రాజ్యసభ్యుడు జోగినపల్లి సంతోష్ రావు తండ్రి రవీందర్‌రావుపై కేసు నమోదు చేసినట్లు కరీంనగర్ టూటౌన్ సీఐ వెంకటేశ్ తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అనుచరుడు కరీంనగర్‌లోని రాంనగర్‌కు చెందిన కూస రవీందర్ భూదందాలకు పాల్పడుతున్నాడని ఓ యూట్యూబ్ చానల్లో వార్త ప్రసారం చేశారు. మిడ్‌మానేరు భూ నిర్వాసితులకు కేటాయించిన ప్లాట్లలో భూకబ్జాకు పాల్పడ్డాడని, అక్రమ పట్టా ఇవ్వమని సిరిసిల్ల ఆర్డీవోను బెదిరింపులకు గురిచేశాడని పేర్కొన్నారు. అయితే ఈ వార్తలో ఏమాత్రం నిజం లేదని, తప్పుడు విషయాన్ని కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేశారని.. దీని వెనుక కేసీఆర్ తోడల్లుడు జోగినపల్లి రవీందర్ రావు, గూడ బాలకృష్ణ, ఎ.నాగరాజు, సంపత్ ఉన్నారని కూస రవీందర్ ఆరోపించారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. కరీంనగర్ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు జోగినపల్లి రవీందర్ రావు, గూడ బాలకృష్ణ, ఎ.నాగరాజు, సంపత్, యూట్యూబ్ చానెల్ నిర్వాహకుడు చిలుక ప్రవీణ్‌పై కూడా కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు.ల -
తగ్గేదేలే.. రాహుల్ గాంధీపై కేసు నమోదు
గువాహటి: అస్సాం(అసోం)లో సాగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర జాతీయ రాజకీయాల్ని వేడెక్కిస్తోంది. తాజాగా.. కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలపై అసోంలో పోలీస్ కేసు నమోదు అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ స్వయంగా వెల్లడించారు. యాత్ర పేరుతో హింస, రెచ్చగొట్టడం, దాడి చేసినందుకు ఈ కేసు నమోదు చేసినట్లు తెలిపారాయన. మంగళవారం తెల్లవారుజామున మేఘాలయా నుంచి తిరిగి అసోం గువాహటిలోకి రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర కొనసాగుతుండగా పోలీసులు అనుమతి లేదని అడ్డుకున్నారు.దీంతో పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇది తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. అయితే.. అసోంలో ఘర్షణలు సృష్టించినందుకుగానూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా పలువురు నేతలపై పోలీసు కేసులు నమోదు అయ్యిందని సీఎం హిమంత బిస్వా శర్మ తెలిపారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో హింస, రెచ్చగొట్టడం, దాడి చేసినందుకు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, కన్హయ్య కుమార్, ఇతర పార్టీ కార్యకర్తలపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారాయన. ‘‘కాంగ్రెస్ సభ్యులు ఈ రోజు హింసాత్మక చర్యలు, రెచ్చగొట్టడం, ప్రజా ఆస్తులకు నష్టం కలిగించడం, పోలీసులపై దాడి చేయడం వంటి చర్యలను ప్రస్తావిస్తూ.. రాహుల్ గాంధీ, కెసి వేణుగోపాల్, కన్హయ్య కుమార్, ఇతర వ్యక్తులపై PDPP చట్టంలోని సెక్షన్ 120(B)143/147/188/283/353/332/333/427 IPC R/W సెక్షన్ 3 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది’’ అని ఎక్స్ ఖాతాలో సీఎం శర్మ పేర్కొన్నారు. With reference to wanton acts of violence, provocation , damage to public property and assault on police personnel today by Cong members , a FIR has been registered against Rahul Gandhi, KC Venugopal , Kanhaiya Kumar and other individuals under section… — Himanta Biswa Sarma (@himantabiswa) January 23, 2024 బారికేడ్లను బద్దలు కొట్టేందుకు "జనసమూహాన్ని రెచ్చగొట్టినందుకు" రాహుల్‌పై కేసు నమోదు చేయాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)ని ముఖ్యమంత్రి ఆదేశించిన కొన్ని గంటల తర్వాత ఈ కేసు నమోదైంది. 'జనసమూహాన్ని రెచ్చగొట్టినందుకు మీ నాయకుడు రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయాలని నేను డీజీపీని ఆదేశించాను' అని యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ బీవీ ట్విట్టర్ పోస్ట్‌కు సీఎం హిమంత శర్మ స్పందించడం గమనార్హం. These are not part of Assamese culture. We are a peaceful state. Such “naxalite tactics” are completely alien to our culture. I have instructed @DGPAssamPolice to register a case against your leader @RahulGandhi for provoking the crowd & use the footage you have posted on your… https://t.co/G84Qhjpd8h — Himanta Biswa Sarma (@himantabiswa) January 23, 2024 మరోవైపు రాహుల్ గాంధీపై రాష్ట్ర పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేస్తారని, లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆయనను అరెస్టు చేస్తామని అస్సాం ముఖ్యమంత్రి మంగళవారం ఉదయం ప్రకటించారు. ఖానాపరా ప్రాంతంలో పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ ఘటన తరువాత.. రాహుల్ గాంధీ సుమారు 3000 మంది వ్యక్తులు, 200 వాహనాలతో గువాహటిలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారని సీఎం ఆరోపించారు. అడ్డుకుంటేనే మంచిది: రాహుల్ తాను కేసులకు భయపడనని, ప్రపంచమంతా వ్యతిరేకంగా నిలబడినా సత్యం కోసం పోరాడతానని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అసోంలో భారత్ జోడో న్యాయ్ యాత్ర కు ఆటంకాలు ఏర్పడుతోన్న నేపథ్యంలో ఆయన స్పందించారు. తమకు పబ్లిసిటీ కల్పిస్తున్నందున.. యాత్రకు బీజేపీ ఇంకా ఇంకా అడ్డంకులు సృష్టించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. న్యాయ యాత్రను గువాహటి నగరంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడంతోపాటు రాహుల్‌పై కేసు నమోదు చేయాలని సీఎం హిమంత బిశ్వ శర్మ పోలీసులను ఆదేశించిన వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘గతంలో కన్యాకుమారి నుంచి యాత్ర మొదలుపెట్టిన సమయంలో.. ప్రజలపై దాని ప్రభావం లేదని భాజపా నేతలు వాదించారు. కానీ, జమ్మూ-కశ్మీర్ చేరేనాటికి పరిస్థితులు మారిపోయాయి. దీంతో ఇప్పుడు మొదట్లోనే అడ్డుకోవాలనేది వారి ఆలోచన. కానీ, ఇలా చేయడం ద్వారా మాకే మేలు కలుగుతుంది. కాబట్టి.. యాత్రకు ఆటంకం కలిగించాలని నేనూ కోరుకుంటున్నా. తద్వారా దేశమంతా గమనిస్తుంది. అసోం సీఎం, కేంద్ర హోంమంత్రి చేస్తున్న పనుల వల్ల కాంగ్రెస్‌కు లబ్ధి చేకూరుతోంది. రాష్ట్రంలో ‘జోడో యాత్ర’ ప్రధాన అంశంగా మారింది. ఈ విషయంలో సంతోషంగా ఉన్నాను’’ అని రాహుల్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: రాహుల్‌కు షాక్.. ఆలయంలోకి అనుమతి నిరాకరణ.. కారణం ఏంటంటే.. -
దరఖాస్తు ఫారాలు విక్రయిస్తే కేసులు.. : కలెక్టర్ రాహుల్‌రాజ్
ఆదిలాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా అభయహస్తం ఆరు గ్యారంటీలకు సంబంధించి దరఖాస్తుల ను అర్హులైన ప్రతీ కుటుంబానికి ఉచితంగా అందజేస్తున్నామని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. జిల్లాలో దరఖాస్తుల కొరత లేదని ప్రతి గ్రామం, ము న్సిపల్ వార్డులో ఉన్న కుటుంబాల కంటే పది శా తం అదనంగా పంపించామన్నారు. మీసేవ, జిరా క్స్ కేంద్రాలు, దళారులు విక్రయించినట్లైతే చర్యలు తప్పవన్నారు. మీసేవ కేంద్రాల లైసెన్స్ రద్దుతో పాటు బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఆరు గ్యారంటీల దరఖాస్తుల వివరాలు వెల్లడించారు. దరఖాస్తు నింపేందుకు కొంతమంది రూ.50వరకు తీసుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అలా జరుగకుండా అన్ని చోట్ల వాటిని నింపేందుకు ప్రత్యేక హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేశామన్నారు. ఆరు గ్యారంటీలకు ఒకే కా మన్ దరఖాస్తు పత్రం ఉంటుందని, అందులో అవసరమైన సాయంతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. రేషన్‌కార్డు లేని వారు, ఆధార్‌కార్డులో ఆంధ్రప్రదేశ్ అని ఉన్న వారు కూడా నిరభ్యంతరంగా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. పింఛన్ పొందుతున్న ల బ్ధిదారులు కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని, రైతుబంధు సాయం పొందుతున్న రైతులు మాత్రం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. కొత్తగా రేషన్‌కార్డు పొందాలనుకునే వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అద్దె ఇళ్లలో నివసించేవారు గృహజ్యోతి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం అద్దె ఇంటి విద్యుత్ సర్వీస్ నంబర్‌తోనూ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రజలు ఇ బ్బందులు పడుకుండా ఉండేలా అన్ని కేంద్రాల్లో షామియానాలు, తాగునీటి వసతి కల్పించామన్నారు. జనవరి 6వరకు కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని, అప్పటికీ అందించలేని వారు కూడా ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాల్లో అందజేయవచ్చని తెలిపారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం అర్హులైన ప్రతి ఒక్కరికి పారదర్శకంగా సంక్షేమ ఫలాలు అందజేస్తామన్నారు. డబ్బులిస్తే ఇప్పిస్తామని నమ్మబలికే దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. సంక్షేమ ఫలాల కోసం మహారాష్ట నుంచి వచ్చే వారికి తప్పుడు ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తే మాత్రం బాధ్యులైన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో జనాభా ఎక్కువగా ఉన్నందున ప్రతి వార్డుకు ఓ జిల్లా స్థాయి అధికారిని ప్రత్యేకాధికారిగా నియమించినట్లుగా వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ ఖుష్బూ గుప్తా పాల్గొన్నారు. -
ఎయిరిండియా ఎక్కొద్దు: ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్‌కు ఎన్ఐఏ షాక్
టాటా యాజమాన్యంలోని విమానయాన సంస్థ ఎయిరిండియా కార్యకలాపాలను నిలిపివేస్తామని బెదిరింపులకు పాల్పడిన ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌కు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) షాకిచ్చింది. అతడిపై పలు సెక్షన్ల కింద అతడిపై కేసు నమోదు చేసినట్లు సోమవారం పేర్కొంది. భారతీయ శిక్షాస్మృతి, కఠినమైన చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద కేసు పెట్టినట్టు వెల్లడించింది. సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ నవంబర్ 4 న ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశాడు. సిక్కులు ఎవరూ నవంబరు 19న ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించవద్దని, ఒకవేళ అలా ఎవరైనా ప్రయాణిస్తే ప్రాణాలు ప్రమాదంలో పడతాయని హెచ్చరించాడు. మొత్తం 37 సెకెన్ల వీడియోలో అదే రోజు నవంబర్ 19న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుందంటూ బెదిరించడం వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కలకలం రేపాయి. దీంతో హై అలర్ట్ జారీ చేసిన ఇండియా, కెనడాతోపాటు ఎయిరిండియా పయనిచంఏ ప్రయాణించే కొన్ని ఇతర దేశాలలో భద్రతా దళాలు దర్యాప్తు ప్రారంభించాయి. 2019లో యాంటీ టెర్రర్ ఏజెన్సీ అతనిపై తొలి కేసు నమోదైంది. అప్పటికీ అతడు ఎన్ఐఏ దృష్టిలో కూడా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే పంజాబ్ ,చండీగఢ్‌లోని అమృత్‌సర్‌లో ఇల్లు , కొంతభూమిని జప్తు చేసింది. 2021 ఫిబ్రవరిలో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు పన్నన్‌పై నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. గత ఏడాది నవంబర్ 29న అతన్ని "ప్రకటిత నేరస్థుడిగా" ప్రకటించింది. భారత్-కెనడా సంబంధాలు దెబ్బతిన్నప్పటి నుంచి గురుపత్వంత్ సింగ్ పన్నూన్ పేరు ప్రతిచోటా మారుమోగుతున్న సంగతి తెలిసిందే. -
హీరో మోటో ఎండీ, తదితరులపై ఫోర్జరీ కేసు:షేరు ఢమాల్
Delhi Police file FIR against Hero MotoCorp chairman Pawan Munjal ద్విచక్ర వాహన తయారీదారు హీరో మోటోకార్ప్‌కు మరోసారి భారీ షాక్ గిలింది. మోసం, ఫోర్జరీ , నేరపూరిత కుట్ర ఆరోపణలతో ఢిల్లీ కోర్టు ఆదేశాలపై హీరో మోటో ఎండీ, సహా పలువురి సీనియర్ అధికారులపై కేసు నమోదైంది. నకిలీ బిల్లులు తయారు చేసి, ఆదాయపు పన్ను శాఖలో డిపాజిట్ చేసి, సేవా పన్నులో లబ్ధి పొందారని పోలీసులు ఆరోపించారు. దీంతో స్టాక్ 3 శాతం భారీ పతనాన్ని నమోదు చేసింది. ఈ కేసు ఎఫ్ఐఆర్ 2010కి ముందు నాటి పాత విషయానికి సంబంధించినదని, ఇతర దర్యాప్తులు , పన్ను విచారణలకు ఎలాంటి సంబంధం లేదని కంపెనీ తెలిపింది. బిలియనీర్ , కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పవన్ ముంజాల్, సీఈవో పవన్ కాంత్, ముగ్గురిపై ఫోర్టరీ అరోపణలపై కేసు నమోదైంది. కాగా పవన్ ముంజాల్సహా మరికొందరికీలక అధికారులపై మనీలాండరింగ్ ఆరోపణలు దాఖలైనాయి. ఇందులో భాగంగానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) 2023 ఆగస్టు లో ముంజాల్, ఇతరులపై సోదాలు నిర్వహించింది. ప్రకటించని విదేశీ కరెన్సీని కలిగి ఉన్నారనే ఆరోపణలపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) ఫిర్యాదు చేసింది. దీంతో ముంజాల్ నివాసంతో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. వ్యక్తిగత అవసరాల కోసం కోసం రూ.40 కోట్ల విలువైన విదేశీ కరెన్సీ (నిషేధిత వస్తువు)ని అక్రమంగా ఎగుమతి చేసినట్టు ఈడీ ఆరోపించింది. దీనికి సంబంధించిన తనిఖీల్లో సెర్చ్ 25 కోట్ల రూపాయల విలువైన విదేశీ కరెన్సీ, నగదు, బంగారం ,వజ్రాభరణాలు (విదేశీ కరెన్సీ, బంగారంతో సహా) స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ తెలిపింది. (ఇజ్రాయెల్-గాజా సంక్షోభం: ‘షెకెల్’ కోసం సెంట్రల్ బ్యాంకు కీలక నిర్ణయం) ఆగస్ట్ 20, 2018న ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ముంజాల్‌తో పాటు ఎగ్జిక్యూటివ్ లండన్‌కు బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంలో భద్రతా తనిఖీల సమయంలో అతని హ్యాండ్ బ్యాగేజీలో రూ.81 లక్షల కంటే ఎక్కువ విలువైన విదేశీ కరెన్సీని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ స్వాధీనం చేసుకుంది. 800 కోట్లకు పైగా అక్రమ వ్యాపార వ్యయాలు, భూమి కొనుగోలుకు ఉపయోగించిన రూ. 60 కోట్ల విలువైన "ఖాతాలో చూపని" అక్రమ ఆస్తులను సోదాల్లో కనుగొన్నట్లు ఐటి అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ గత ఏడాది మార్చిలో ప్రకటించిన సంగతి తెలిసిందే. (స్పోర్ట్స్ ఈవెంట్లో మెరిసిన రణబీర్, అలియా...మరో విశేషమేమంటే..!) -
నటుడు ప్రకాశ్‌రాజ్‌పై కేసు నమోదు..
బెంగళూరు: ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్‌పై కర్ణాటకాలోని బాగాల్కోట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. చంద్రయాన్ 3పై సోషల్ మీడియాలో చేసిన పోస్టు వివాదాస్పదంగా మారింది. చంద్రయాన్ 3 పంపిన ఫొటోపై ప్రకాశ్‌రాజ్ అనుచితంగా ప్రవర్తించారు. బనహట్టి పోలీసు స్టేషన్లో హిందూ సంస్థ నాయకుడు ఫిర్యాదు చేశాడు. ప్రకాశ్‌రాజ్‌పై చర్యలు తీసుకోవలని డిమాండ్ చేశాడు. చంద్రయాన్-3 పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ట్విట్టర్లో టీ వడపోస్తున్న ఒక వ్యక్తి ఫోటో పోస్ట్ చేశాడు నటుడు ప్రకాశ్ రాజ్. చంద్రయాన్ 3 ఇప్పుడే పంపిన ఫొటో అంటూ కామెంట్ కూడా పెట్టాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. నెటిజన్లు ప్రకాష్ రాజ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. విమర్శల అనంతరం కూడా తన వ్యాఖ్యలను సమర్థించుకున్నాడు నటుడు ప్రకాశ్ రాజ్. తాను ఎవరినీ ఉద్దేశించి ఆ పోస్టు చేయలేదని అన్నాడు. ద్వేషించే వాళ్లకి ద్వేషమే కనిపిస్తుందని సమర్థించుకున్నాడు. అది నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ కాలం నాటి జోక్ అని పేర్కొన్నాడు. మీరు ఏ చాయ్ వాలా గురించి అనుకుంటున్నారో..?అంటూ వ్యంగ్యంగా రిప్లే ఇచ్చాడు. ఇదీ చదవండి: ప్రధాని మోదీకి పాక్ సోదరి రాఖీ.. గత 30 ఏళ్లుగా.. -
Qnet Case: క్యూనెట్ కేసులో కీలక నిందితుడి అరెస్ట్
హైదరాబాద్: మల్టీ లెవల్ మార్కెటింగ్(ఎంఎల్ఎం) క్యూనెట్ కేసులో సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు మరొకరిని అరెస్ట్ చేశారు. కర్నూలు జిల్లా, చిన్నంపల్లి గ్రామానికి చెందిన సీహెచ్ ఉపేంద్ర నాథ్ రెడ్డిని సీసీఎస్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నా రు. విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ (క్యూనెట్)పై మహంకాళి పోలీస్ స్టేషన్లో నాలుగు కేసులు నమో దయ్యాయి. అనంతరం అదనపు సీపీ(ఎస్ఐటీ) ఆదేశాల మేరకు ఈ కేసుల ను హైదరాబాద్ సీసీఎస్‌కు బదిలీ చేశారు. సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో వి–అంపైర్ పేరుతో నకిలీ కంపెనీలు ఏర్పాటు చేసినట్లు దర్యాప్తులో గుర్తించిన అధికారులు 15 మంది నిందితులపై కేసులు నమోదు చేశారు. వీరు అధిక లాభాలు ఆశ చూపించి నిరుద్యోగులు, గ్రామీణులు, అమాయకుల నుంచి డబ్బులు సేకరించినట్లు గుర్తించారు. ఈ క్రమంలో ప్రధా న నిందితులు రాజేష్‌ఖన్నా, సీహెచ్ ఉపేంద్రనాథ్‌రెడ్డి ప్రేరణ క్లాసులు నిర్వహించి సామాన్యులను మల్టీ లెవల్ మార్కెటింగ్‌లో పెట్టుబడులను ఆకర్శించేవారు, ఈ క్రమంలో పెట్టుబడుల పెట్టిన వారికి నెలకు రూ.20 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు సంపాదించుకోవచ్చని ఆశ చూపారు. రిజిస్ట్రేషన్ పేరుతో ఒక్కో బాధితుడి నుంచి రూ.50 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు చార్జీల రూపంలో వసూలు చేశారు. ఇదే తరహాలో దాదాపు 163 మంది బాధితుల నుంచి రూ.3 కోట్ల వరకు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. విహాన్ డైరెక్ట్ సెల్లింగ్లకు చెందిన 35 బ్యాంకు ఖాతాల్లోని రూ.54 కోట్ల నగదును సీజ్ చేసిన పోలీసులు ఇప్పటివరకు 15 మంది నిందితుల్లో 9 మందిని అరెస్ట్ చేశారు. -
నయనతార జంటపై కేసు పెట్టిన విఘ్నేశ్ శివన్ బాబాయ్
దర్శకుడు విగ్నేష్ శివన్, నయనతారలపై ఆస్తి అపహరణ కేసు నమోదు అయ్యింది. ఆరేళ్ల క్రితం ప్రేమలో పడి, సహజీవనం చేస్తూ గత రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న సంచలన జంట నయనతార, విఘ్నేష్ శివన్. సౌత్ ఇండియా చిత్ర పరిశ్రమలో నయనతార నటిగా రానిస్తూ.. కుటుంబ జీవితంలో సంతోషంగా ఉన్నా వ్యక్తిగతంగా పలు సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ జంట సరోగసి విధానం ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులు అయిన విషయం కూడా వివాదంగా మారింది. (ఇదీ చదవండి; 'దేవర' తర్వాత జాన్వీని తమిళ్‌కు పరిచయం చేయనున్న టాప్ హీరో) తాజాగా వీళ్లకు మరో సమస్య ఎదురైంది. విఘ్నేశ్ శివన్ పూర్వీకం తిరుచ్చి జిల్లా, లాల్‌కుడి గ్రామం ఈయన తండ్రి పేరు శివకొళుదు. వీళ్లు తొమ్మిది మంది అన్నదమ్ములు. పోలీస్ ఇన్ఫార్మర్గా పనిచేసిన విఘ్నేష్ శివన్ తండ్రి శివకొళుదు ఇప్పుడు లేరు. అయితే ఈయన జీవించి ఉండగా తమ ఉమ్మడి ఆస్తిని అన్నదమ్ములకు తెలియకుండా మోసపూరితంగా అపహరించినట్లు ఆయన సోదరుడు మాణిక్యం కోయంబత్తూర్‌లో నివసిస్తున్న మరో సోదరుడు కుంచిత పాదం గురువారం తిరిచ్చి డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. (ఇదీ చదవండి: ఈ రోజుల్లో వాళ్లతో నటిస్తేనే క్రేజ్ వస్తుంది: మాళవిక) అందులో మాణిక్యం పేర్కొంటూ తమ సోదరుడు విఘ్నేష్ శివన్ తండ్రి ఉమ్మడి ఆస్తిని తమకు తెలియకుండా వేరే వారికి విక్రయించి మోసానికి పాల్పడ్డాడని, తమ ఆస్తిని కొనుగోలు చేసిన వారికి డబ్బును తిరిగి ఇచ్చి, ఆస్తిని తమకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని అదేవిధంగా తమ సోదరుడు కుమారుడు విఘ్నేశ్ శివన్ అతని తల్లి మీనాకుమారి, సోదరి ఐశ్వర్య, భార్య నయనతారలపై చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో తిరుచ్చి డీఎస్పీ ఈ కేసు దర్యాప్తు చేయాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సంఘటన ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇది నటి నయనతారకు కూడా తలనొప్పిగా మారింది. -
దళపతి విజయ్‌పై పోలీస్ కేసు.. అలా చేసినందుకు!
దళపతి విజయ్‌పై తెలుగు ప్రేక్షకులకు ఎక్కడలేని ఆసక్తి. ఈ క్రమంలోనే అతడు హీరోగా నటించిన 'లియో' మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ మధ్యే అతడి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలోని 'నా రెడీ' పాట విడుదల చేయగా, అది యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. దళపతి ఫ్యాన్స్ ఈ సాంగ్‌ని రిపీట్స్ లో వింటున్నారు. అలాంటిది ఇప్పుడు విజయ్‌పై ఓ కేసు నమోదు కావడంతో.. అభిమానులంతా అవాక్కయ్యారు. ఏంటా కేసు? 'లియో' నుంచి వచ్చిన 'నా రెడీ' పాటలో విజయ్ సింపుల్ స్టెప్పులేసినప్పటికీ.. ట్యూన్ మంచి ఎనర్జిటిక్ గా ఉండటంతో అలరిస్తోంది. అయితే ఈ సాంగ్ మొత్తాన్ని ఓ డెన్ లో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. గీతంలోని ప్రతి సీన్ లోనూ విజయ్.. నోటిలో సిగరెట్ తో కనిపించాడు. ఇప్పుడు ఆ విషయమై చెన్నైకి చెందిన సామాజిక కార్యకర్త ఆర్టీ సెల్వం కోర్టుని ఆశ్రయించారు. విజయ్, చిత్రబృందంపై ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు. నార్కోటిక్స్ కంట్రోల్ యాక్ట్ కింద వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. (ఇదీ చదవండి: 'ఆదిపురుష్ 2' ప్లాన్.. ఆ క్లారిటీ ఇచ్చేసిన ప్రభాస్!) విజయ్‌పైనే ఎందుకు? సాధారణంగా సినిమాల్లో హీరోలు సిగరెట్ స్మోక్ చేస్తూ కనిపించినా సరే అది యాక్టింగ్ వరకే పరిమితం. కానీ ఈ మధ్య విజయ్.. తమిళనాడులోని 10, 12 తరగతుల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులని కలిశాడు. దాదాపు పది గంటలకు పైగా జరిగిన ఈ మీటింగ్ లో.. వాళ్లని నగదు బహుమతులతో సత్కరించడంతో పాటు మంచిగా ఉండాలని, డబ్బులు తీసుకోకుండా ఓటు వేసేలా తల్లిదండ్రులకు ప్రోత్సాహించాలని చెప్పాడు. అలాంటి విజయ్.. ఇప్పుడు సినిమాల్లో సిగరెట్ తాగుతూ నటించడం ఏం బాగోలేదని ఓ వ్యక్తి కేసు వేశాడు. 'లియో' సంగతేంటి? లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే 'లియో' తీస్తున్నారని మూవీ లవర్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్, 'నా రెడీ' పాటలో ఆయా రిఫరెన్స్ లు కనిపించాయని అంటున్నారు. అక్టోబరు 19న ఈ సినిమా తెలుగు-తమిళ భాషల్లో విడుదల కానుందని ఇప్పటికే ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలు ఉండటంతో తెలుగు హక్కులని నిర్మాతలు భారీ మొత్తానికి అమ్మినట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: 'ద కేరళ స్టోరీ' సినిమాకు ఓటీటీ కష్టాలు.. కారణం అదేనా?) -
విడాకుల కేసు.. అమెరికా నుంచి రావాల్సిందే
సాక్షి, బెంగళూరు: ఒక విడాకుల కేసులో అమెరికాలో ఉన్న భర్తను భారతదేశానికి రప్పించేందుకు ఒక భార్య చేసిన న్యాయ పోరాటంలో అనుకూల తీర్పు వచ్చింది. వివరాలు.. అమెరికాలో ఉన్న భర్త, బెంగళూరులో ఉన్న భార్యతో విడాకుల కోసం బెంగళూరు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ విచారణకు భర్త నేరుగా హాజరు కావాలని, వీడియో కాన్ఫరెన్స్ విచారణ సరికాదని కోర్టుకు భార్య విన్నవించింది. అయితే ఆయన అమెరికా నుంచి రావడానికి అయ్యే రూ.1.60 లక్షల ఖర్చును మీరే భరించాలని కోర్టు ఆమెకు సూచించింది. ఈ తీర్పుతో కంగుతిన్న మహిళ ఆ తీర్పును కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించింది. భార్య కోరినట్లు అతడు భౌతికంగా హాజరవ్వడంలో ఎలాంటి తప్పు లేదని హైకోర్టు పేర్కొంది. భర్త పేదవాడు కూడా కాకపోవడంతో ఆ ప్రయాణ ఖర్చులను అతడే భరించుకోవాలని, విచారణకు రావాలని ఆదేశించింది. -
తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు
బంజారాహిల్స్ (హైదరాబాద్): వివిధ వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నాడనే అభియోగం మీద.. తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌కుమార్‌పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కమలానగర్ బస్తీవాసి విజయ్‌తో కలసి షేక్ హైదర్ అనే వ్యక్తి బస్తీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పిస్తామని కొంతమంది నుంచి డబ్బులు వసూలు చేశారు. అయితే వారెవరికీ అక్కడ ఇళ్లు రాలేదు. షేక్‌హైదర్, విజయ్ చేతుల్లో మోసపోయినట్లు వారికి తెలిసింది. దీంతో వారంతా బస్తీవాసులపై గొడవకు దిగుతుండటంతో శాంతి భద్రతలకు భంగం కలుగుతోందంటూ అదే బస్తీకి చెందిన జె.గోపీచంద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే తమను మోసగించాడంటూ డబ్బులు చెల్లించిన వారందరికీ విజయ్, షేక్‌హైదర్‌లు చెబుతూ.. వారిని నమ్మించి తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూన్యూస్ స్టూడియోకు తీసుకెళ్లాడు. అక్కడ వారిని బస్తీవాసులుగా పేర్కొంటూ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించేందుకు వారినుంచి ఎమ్మెల్యేపై తప్పుడు కథనాలను ప్రసారం చేశారు. దీంతో తీన్మార్‌మల్లన్నతోపాటు షేక్‌హైదర్, విజయ్, మధులపై ఫిర్యాదు చేశారు. ఇదీ చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాం.. కవితే అసలైన పెట్టుబడిదారు! -
ప్రాపర్టీ డీల్: హీరో షారుఖ్ భార్య, గౌరీ ఖాన్‌కు షాక్!
సాక్షి, ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ భార్య, ఇంటీరియర్ డిజైనర్ గౌరీ ఖాన్‌పై లక్నోలో ఎఫ్ఐఆర్ నమోదైంది. గౌరీపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 409 (నేరపూరిత విశ్వాస ఉల్లంఘన) కింద కేసు నమోదు చేశారు.ముంబైకి చెందిన వ్యక్తి మేరకు ఈ పరిణామం చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఎఫ్ఐఆర్ దాఖలైంది. గౌరీబ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న కంపెనీ డబ్బలు తీసుకుని కూడా ఫ్లాట్ అప్పగించకుండా మోసం చేశారని ఆరోపిస్తూ ముంబైకి చెందిన జస్వంత్ షా ఫిర్యాదు చేశారు. లక్నోలోని సుశాంత్ గోల్ఫ్ సిటీ ప్రాంతంలోని తులసియాని గోల్ఫ్ వ్యూలో ఉన్న ఫ్లాట్ నిమిత్తం రూ. 86 లక్షలు చెల్లించినప్పటికీ తనను కాదని ఆ ఫ్లాట్‌ను వేరొకరికి ఇచ్చారని ఫిర్యాదుదారు ఆరోపించారు. బ్రాండ్ అంబాసిడర్ గౌరీ ఖాన్ ప్రభావంతో తాను సదరు ఫ్లాట్ కొన్నానని ఫిర్యాదుదారు తెలిపారు. దీంతో గౌరీతో పాటు తులసియాని కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ లిమిటెడ్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమార్ తులసియాని, డైరెక్టర్ మహేష్ తులసియానిపై కూడా ఫిర్యాదు నమోదైంది. -
నాపై పలుమార్లు అత్యాచారం చేశాడు.. నటి భర్తపై ఫిర్యాదు
రాఖీ సావంత్ భర్త ఆదిల్ దురానీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే భర్త మోసం చేశాడంటూ ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేసింది రాఖీ సావంత్. తాజాగా ఆదిల్‌పై మరో మహిళ పోలీసులను ఆశ్రయించింది. తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఇరాన్ మహిళ ఆరోపించింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో పెళ్లికి నిరాకరించాడని.. అలాగే చాలా మంది అమ్మాయిలతో ఇలాంటి సంబంధాలు కలిగి ఉన్నాడని ఆ మహిళ ఆరోపించింది. ఇరాన్ మహిళ ఫిర్యాదుతో రాఖీ సావంత్ భర్త ఆదిల్ దురానీపై మైసూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మైసూర్లో సహజీవనం చేసేటప్పుడు పెళ్లి పేరుతో ఆదిల్ తనపై అత్యాచారం చేశాడని ఇరాన్ మహిళ ఆరోపించింది. అయితే ప్రస్తుతం రాఖీ సావంత్ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు ఆదిల్. ఐదు నెలల క్రితం తనను పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేయగా.. బెదిరించాడని ఇరానీ మహిళ పోలీసులకు తెలిపింది. పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని బెదిరించాడని పేర్కొంది. అతనితో సన్నిహితంగా ఉన్న ఫోటోలను లీక్ చేస్తానని చెప్పాడని వాపోయింది. ఈ వార్త విన్న రాఖీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఇప్పటికే ఆదిల్‌పై రాఖీ ఓషివారా పోలీసులకు ఫిర్యాదు చేయగా అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆదిల్ తనను మానసికంగా, శారీరకంగా హింసించాడని రాఖీ కంప్లెంట్లో పేర్కొంది. ఆదిల్‌కు వివాహేతర సంబంధం ఉందని ఆమె ఆరోపించింది. View this post on Instagram A post shared by Rakhi Sawant (@rakhisawant2511) -
పామును చంపినందుకు పోలీసు కేసు.. పరారీలో నిందితుడు
లఖ్‌నవూ: పాము, తేలు వంటి విషపురుగులు కనిపిస్తే ఎవరైనా భయంతో పరుగులు పెడతారు. చాలా వరకు గ్రామాల్లో పాములు, తేళ్లు కనిపిస్తే చంపేస్తారు. అవి కాటు వేస్తే ప్రమాదం కనుక చంపటం తప్పేమి కాదని చాలా మంది అనుకుంటారు. కానీ, అలా అనుకుంటే పొరపాటే. అలాగే ఓ వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించిందని పామును చంపేశాడు. పోలీసులు కేసు పెట్టడంతో అవాక్కయ్యాడు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాఘ్‌పత్ జిల్లాలో జరిగింది. ఛప్రౌలి ప్రాంతంలోని షాబ్గా గ్రామంలో ఆదివారం రాత్రి రామ్ చరణ్ అనే వ్యక్తి ఇంట్లోకి ఓ పాము ప్రవేశించింది. దానిని చూసేందుకు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు గుమిగూడారు. స్వలీన్ అనే వ్యక్తి అక్కడికి వచ్చి పామును చంపేశాడు. ఈ విషయంపై సోమవారం ఉదయం అటవీ శాఖకు సమాచారం అందింది. ఫారెస్ట్ గార్డ్ సంజయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్వలీన్‌పై అటవీ జంతువుల పరిరక్షణ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని తెలిపారు. పెద్ద వస్తువుతో పామును నుజ్జు నుజ్జు చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అయితే, పాము మృతికి గల అసలు కారణాలు తెలుసుకునేందుకు పోస్ట్ మార్టం నిర్వహించేందుకు తరలించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: Joshimath: ఎవరి పాపం ఇది?! -
బైరి నరేష్ పై 4 సెక్షన్ల కింద కేసు నమోదు
-
కొడంగల్: భైరి నరేష్‌పై కేసు నమోదు
సాక్షి, వికారాబాద్: హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్‌పై శుక్రవారం కేసు నమోదు అయ్యింది. నరేష్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు కొడంగల్ పోలీసులు. రెండు రోజుల కిందట ఓ సభలో హిందూ దేవుళ్లను, అయ్యప్ప స్వామిపై వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపింది. రాష్ట్రవ్యాప్తంగా అయ్యప్ప మాలధారులు నిరసనలు, రాస్తారోకో చేపట్టారు. ఈ క్రమంలో కోస్గిలో వీడియోలు తీస్తూ అనుమానాదాస్పదంగా వ్యవహరించిన బాలరాజు అనే వ్యక్తిపై అయ్యప్ప మాలధారులు దాడి చేశారు కూడా. అయితే.. ఫిర్యాదుల నేపథ్యంలో భైరి నరేష్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. 295/ఏ, 298, 153ఏ, 505(2) సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది. పరారీలో ఉన్న నరేష్ కోసం పోలీసులు గాలింపు చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే.. అతన్ని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారన్న ప్రచారం నడుస్తోంది. మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించమని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి స్పష్టం చేశారు. మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవు. శాంతికి విఘాతం కలిగించేవాళ్లను సమావేశాలకు పిలవొద్దని ఎస్పీ స్పష్టం చేశారు. -
పాపులర్ ఫ్రంట్‌పై ఎన్ఐఏ గురి
న్యూఢిల్లీ: నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)తోపాటు దాని అనుబంధ సంస్థలపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు దృష్టి పెట్టారు. చట్టవ్యతిరేక, హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సదరు సంస్థలపై ఇప్పటికే కేసు నమోదయ్యింది. కేసు దర్యాప్తులో భాగంగా కేరళలో 12 జిల్లాల్లో పీఎఫ్ఐ, అనుబంధ సంస్థలకు సంబంధించిన 56 ప్రాంతాల్లో గురువారం అధికారులు సోదాలు నిర్వహించారు. పీఎఫ్ఐ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, జోనల్ హెడ్స్, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్స్–ట్రైనర్స్తోపాటు మారణాయుధాలు ఉపయోగించడంలో శిక్షణ పొందిన మరికొందరి నివాసాల్లో సోదాలు చేసినట్లు ఎన్ఐఏ ప్రతినిధి చెప్పారు. మరో 20 మంది అనుమానితుల ఇళ్లను తనిఖీ చేసినట్ల తెలిపారు. ఆయుధాలు, డిజిటల్ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. పీఎఫ్ఐ, అనుబంధ సంస్థలపై గతంలోనే కేసు నమోదు చేసింది. -
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత పేరు ప్రస్తావించిన ఈడీ..
-
చికోటి ప్రవీణ్ క్యాసినో కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం
-
కేసుల్లో ఈ కేసులు వేరయా.. పతి, పత్నీ ఔర్ ఓ.. ప్చ్! యాప్ ఎంతపని చేసింది?
సాక్షి, హైదరాబాద్: నగర కమిషనరేట్ పరిధిలోని మహిళ, సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లకు అనునిత్యం పదుల సంఖ్యలో బాధితులు వస్తుంటారు. వేధింపులు ఎదురైన, బెదిరింపులకు లోనైన వారితో పాటు ఆర్థికంగా నష్టపోయిన వాళ్లూ వీటి మెట్లు ఎక్కుతారు. అప్పుడప్పుడు ఈ ఠాణాలకు వస్తున్న కొన్ని కేసులు పోలీసులనే షాక్‌కు గురి చేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఎవరికి ఎలా న్యాయం చేయాలో, ఎవరికి ఎలా సర్ది చెప్పాలో అర్థం కాక తలలు పట్టుకోవాల్సి వస్తోంది. ఇటీవల పోలీసుల వద్దకు వచ్చిన ఆ తరహాకు చెందిన కేసుల్లో కొన్ని... పతి, పత్నీ ఔర్ ఓ... భర్త మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడనో, ప్రేమించిన వ్యక్తి మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడనో, పెళ్లి పేరుతో ప్రేమాయణం నడిపి మోసం చేశాడనో...ఇలా అనే కేసులు పోలీసుల వద్దకు వస్తుంటాయి. అయితే బుధవారం మహిళ ఠాణాకు వచ్చిన ఓ కేసు అధికారులకే మతి పోగొట్టింది. వివాహితుడైన ఓ వ్యక్తికి ఆన్లైన్లో నగరానికే చెందిన యువతితో పరిచయమైంది. వీరి మధ్య ప్రేమ చిగురించడం అనేక కేసుల్లో వింటూనే ఉంటాం. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే... ఈ ప్రేమాయణం కథ మొత్తం అతడి భార్యకూ తెలిసి ఉండటం. ఈ భార్య, ఆ ప్రియురాలు ఓ అండర్ స్టాడింగ్కు వచ్చి కలిసే అతడితో కాపురం చేసుకుంటామని నిర్ణయించుకున్నారు. ఈ విషయం సదరు యువతి ఇంట్లో తెలియడంతో కథ అడ్డం తిరిగింది. వివాహితుడికి రెండో భార్యగా ఉంటావా? అంటూ యువతిని మందలించారు. అయినప్పటికీ ఆమె వినకపోవడంతో విషయం ఠాణా వరకు వచి్చంది. ‘నా భర్త ఆమెను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే.. ముగ్గురం కలిసే ఉంటాం’ అంటూ భార్య, ‘ఆయన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోను’ అంటూ యువతి చెప్తుండగా... ఆమె తల్లిదండ్రులు మాత్రం ససేమిరా అన్నారు. భార్య ఉండగా ఆమె సమ్మతించినా రెండో పెళ్లి చేసుకోవడం నేరమంటూ చట్టాన్ని వివరించిన పోలీసులు ముగ్గురికీ కౌన్సిలింగ్ చేశారు. ఫలితంగా పరిస్థితులు అదుపులోకి రావడంతో ఎవరి ఇళ్లకు వాళ్లు చేరారు. నిందితుడిగా మారిన మాజీ ప్రియుడు... వివాహిత అయిన మాజీ ప్రేయసి నుంచి సందేశం అందుకున్న ఆ ప్రియుడు ఎగిరి గంతేసి మరీ లండన్ నుంచి నగరానికి వచ్చాడు. సీన్ కట్ చేస్తే ఆమే తనను పెళ్లి పేరుతో వేధిస్తున్నాడంటూ అతడిపై సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. అతను నగరంలో చదువుకునే సమయంలో ఈమెతో ప్రేమలో పడ్డాడు. కొన్నాళ్లు చెట్టపట్టాలు వేసుకుని తిరిగిన ఈ జంట ప్రయాణం పెళ్లి వరకు వెళ్లలేదు. మరో వ్యక్తితో ఆమెకు పెళ్లి కావడంతో అతడు ఉద్యోగరీత్యా లండన్ వెళ్లిపోయాడు. వివాహమైన కొన్నాళ్లకే భర్తతో విభేదాలు రావడంతో ఆమె విడాకులు తీసుకోవాలని భావించింది. ఆ తంతు పూర్తయిన తర్వాత మనం పెళ్లి చేసుకుందామంటూ మాజీ ప్రియుడికి సందేశం ఇచ్చింది. ఇంకేముంది ఉన్న ఫళంగా నగరానికి వచ్చేశాడు. ఆమె భర్తతోనే కలిసి ఉండటాన్ని చూసి అవాక్కయ్యాడు. పెళ్లి చేసుకుందామంటూ పదేపదే ఆమెకు సందేశాలు పెట్టాడు. విడాకులు తీసుకోకుండా అదెలా సాధ్యమంటూ దాటవేస్తూ వచ్చింది. అలాంటప్పుడు తనను ఎందుకు రమ్మన్నావంటూ అతడు గొడవకు దిగాడు. తన వేదనను ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేశాడు. కట్ చేస్తే బాధితురాలిగా మారిన ఆ యువతి తన మాజీ ప్రియుడి పైనే సైబర్ క్రైమ్ ఠాణాలో కేసు పెట్టింది. కౌన్సిలింగ్‌తో ఈ కథ లండన్‌కు చేరింది. చదవండి: కీచక ఉపాధ్యాయులు.. మొన్న మహిళా ఉద్యోగి.. నేడు విద్యార్థినితో యాప్... ఎంతపని చేసింది... ఓయూ ప్రాంతానికి చెందిన ఓ నిరక్షరాస్యుడు గొర్రెలు, మేకల వ్యాపారి. ఇతడికి స్థానికంగా ఉండే యువతితో పరిచయమైంది. ఇద్దరూ కొన్నాళ్లు చెట్టపట్టాలుగా తిరిగారు. నిరక్షరాస్యుడని తెలియడం..ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో ఆమె అతడిని దూరంగా పెట్టింది. దీంతో తనను ప్రేమిస్తున్నానంటూ మోసం చేసిందని వ్యాఖ్యానిస్తూ ఇన్‌స్ట్రాగామ్‌లో యువతి ఫొటోతో సహా అతడు పోస్టు చేశాడు. ఈ విషయంపై ఇద్దరి మధ్య చాటింగ్ యుద్ధం కూడా జరిగింది. అవాక్కైన పోలీసులు ఆవేదనకు గురైన ఆమె అతడిపై సైబర్ క్రైమ్ ఠాణాను ఆశ్రయించింది. నిరక్షరాస్యుడైన అతడికి చాటింగ్, పోస్టులు పెట్టడం రాదని, అతడి వెనుక ఎవరో ఉన్నారని ఆరోపించింది. కేసు నమోదు కావడంతో ఆ యువకుడిని పోలీసులు ఠాణాకు తీసుకొచ్చారు. విచారణ నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన విషయాలు విని అవాక్కయ్యారు. ఏ మాత్రం ఆంగ్ల పరిజ్ఞానం లేని అతడు ఓ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నాడు. ఆ యువతి పంపిన సందేశాన్ని కాపీ చేసి అందులో పేస్ట్ చేసే వాడు. దానికి ఏం సమాధానం చెప్పాలన్నది ఆ యాప్ సూచించేది. దాన్ని మళ్లీ కాపీ చేసే అతడు యువతికి పోస్టు చేసేవాడు. కొన్నిసార్లు వాయిస్ కమాండ్స్‌ను టెక్టస్గా మార్చి పోస్టు చేసే వాడు. నిందితుడిగా మారిన అతగాడు తనను ఆ యువతి ఎలా మోసం చేసిందో కూడా వివరించాడు. ఈ విషయాలను ఆమె కూడా అంగీకరించడంతో అరెస్టు పర్వం తప్పింది. -
టీడీపీ నేత చింతకాయల విజయ్ పై C.I.D కేసు నమోదు
-
యడియూరప్పకు షాక్.. కేసు నమోదు
బెంగళూరు: బీజేపీ అగ్రనేత, కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పకు షాక్ తగిలింది. ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులపై లోకాయుక్త పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు, బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్రలపై లోకాయుక్త కేసు నమోదు చేసింది. 2019లో పనిచేసిన బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్(బీడీఏ)పైనా ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం కేసు నమోదైంది. బీడీఏ కాంట్రాక్టులు కట్టబెట్టినందుకు వీరంతా లంచాలు తీసుకున్నారంటూ సామాజిక కార్యకర్త టీజే అబ్రహాం చేసిన ఫిర్యాదు మేరకు అవినీతి నిరోధక చట్టం, ఐపీసీ కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కింది కోర్టు అబ్రహాం వేసిన పిటిషన్‌ను తిరస్కరించినప్పటికీ.. హైకోర్టు మాత్రం స్వీకరించింది. పిటిషన్ ను విచారించిన హైకోర్టు యడ్డీ, ఆయన కుమారుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో లోకాయుక్త కేసు నమోదు చేసింది. మరోవైపు, తమపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని యడియూరప్ప వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: ఆప్‌లో చేరిక కన్నడ సినీ నటి -
రాజాసింగ్‌కు ఊహించని షాక్.. ఇలా జరిగిందేంటి?
BJP MLA Raja Singh.. సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మజ్లీస్ నేతల ఫిర్యాదు మేరకు కేసులు నమోదయ్యాయి. దీంతో, పోలీసులు రాజాసింగ్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం, కోర్టు రాజాసింగ్‌కు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన బయటకు వచ్చారు. ఇదిలా ఉండగా.. రాజాసింగ్‌కు తాజాగా మరో ఊహించని షాక్ తగిలింది. పోలీసులు మరోసారి రాజాసింగ్‌కు నోటీసులు పంపించారు. పాత కేసులకు సంబంధించి రెండు కేసుల్లో 41(A) సీఆర్పీసీ నోటీసులు అందజేశారు. ఫిబ్రవరి, ఏప్రిల్ నెలకు సంబంధించి రాజాసింగ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు మంగళ్‌హట్, షాహినాయత్‌గంజ్ పోలీసులు రెండు నోటీసులు ఇచ్చారు. మంగళ్‌హట్ పీఎస్‌లో 68/2022 క్రైమ్ నంబర్ కేసులో, షాహినాయత్‌గంజ్ పీఎస్‌లో క్రైమ్ 71/2022లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ సందర్భంగా పోలీసుల నోటీసులపై రాజాసింగ్ స్పందించారు. ఇక, రాజాసింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నన్ను మళ్లీ అరెస్ట్ చేయడానికి పోలీసులు కుట్ర చేస్తున్నారు. పాత కేసులకు సంబంధించి 41(A) సీఆర్పీసీ నోటీసులు ఇచ్చారు. ఏప్రిల్ ఘటనకు సంబంధించి ఇప్పుడు నోటీసులు ఇవ్వడమేంటి’’ అని ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: ఏ మతాన్నీ కించపరచలేదు: రాజాసింగ్ -
షాకింగ్ క్రైమ్.. భర్త అలా చేశాడని.. భార్య దారుణం!
క్షణికావేశంలో చేసే తప్పులు తీవ్ర పరిణామాలకు దారి తీస్తాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. భర్త తనను కొట్టాడన్న కోపంతో భార్య దారుణానికి ఒడిగట్టింది. యాసిడ్‌లో కారం కలిపి అతడిపై పోసింది. వివరాల ప్రకారం.. బరేలీలో మొహమ్మద్ యాసీన్ తాగుడుకు బానిసై భార్య, పిల్లలను కొడుతుండేవాడు. ప్రతీరోజు మద్యం తాగి వచ్చి.. భార్య ఫర్హాతోపాటు నాలుగేళ్ల కుమార్తెను చితకబాదేవాడు. తాగుడు మానేయాలని భార్య ఎంత చెప్పిన వినుపించుకోలేదు. ఈ క్రమంలో రెండు రోజుల కిందట తాగి ఇంటికి వచ్చిన భర్త.. భార్యను చెంపపై కొట్టాడు. దీంతో, భర్తపై కోపం తెచ్చుకుని క్షణికావేశంలో తీవ్ర నిర్ణయం తీసుకుంది. నిద్రిస్తున్న భర్తపై కారం కలిపిన యాసిడ్ పోసింది. దీంతో యాసీన్ తీవ్రంగా గాయపడంతో వారి కుటుంబ సభ్యులు అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాగా, భర్తపై యాసిడ్ దాడి అనంతరం భార్య ఫర్హా, తన కుమార్తెను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది.అనంతరం..యాసీన్ బంధువులు భార్య ఫర్హాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: ఇన్‌స్టాగ్రామ్‌లో పైలట్‌గా ప్రొఫైల్ పెట్టి 30మంది మహిళలకు టోకరా! -
నిత్యపెళ్లికొడుకు మామూలోడు కాదు.. 13 మందిని పెళ్లి చేసుకొని..
ప్రేమ, పెళ్లి పేరుతో యువతులకు గాలం వేసి.. వారిని మోసం చేస్తున్న నిత్యపెళ్లికొడుకు అడప శివశంకర్ బాబును గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. శివశంకర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో 13 మంది యువతులను పెళ్లిచేసుకున్నట్టు విచారణలో తేలింది. కాగా, హైదరాబాద్, రాచకొండ, సంగారెడ్డి, గుంటూరు, విజయవాడలో పలు సెక్షన్ల కింద పోలీసు స్టేషన్లలో శివశంకర్‌పై కేసులు నమోదయ్యాయి. అయితే, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం బేతపూడి గ్రామానికి చెందిన శివశంకర్‌బాబు(33) మ్యాట్రిమోనీ ద్వారా యువతులను టార్గెట్ చేస్తాడు. అనంతరం, వారికి ఏదో రకంగా తన బుట్టలో వేసుకుని పెళ్లి చేసుకుంటాడు. ఇలా పెళ్లి చేసుకుని వారిని శారీరకంగా, ఆర్థికంగా మోసం చేసి వారిని వదిలేస్తాడు. తర్వాత మరో మహిళకు గాలం వేసి పెళ్లి చేసుకుంటాడు. ఇలా దాదాపు 13 మంది యువతులను పెళ్లిచేసుకున్నాడు. కాగా, ఇటీవల హైదరాబాద్‌లో ఓ యువతిని పెళ్లిచేసుకున్నాడు. తర్వాత తనకు అమెరికా ఉద్యోగం వచ్చిందని వెంటనే అక్కడికి వెళ్లాలని భార్యను డబ్బుల కోసం వేధించాడు. ఈ క్రమంలో ఆమె.. భర్తకు రూ. 32 లక్షలు ఇచ్చింది. ఆ తర్వాత, శివశంకర్ బాబు మళ్లీ అమెరికా ఊసే ఎత్తలేదు. దీంతో, అనుమానం వచ్చిన.. భార్య అతడి గురించి ఆరా తీయగా ఇప్పటికే పెళ్లిళ్లు అయినట్టు గుర్తించింది. అనంతరం పోలీసులను ఆశ్రయించింది. ఈ సందర్భంగా ఓ బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ.. నిత్యపెళ్లికొడుకు శివశంకర్ బాబును అరెస్ట్ చేసినందుకు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది. అతడిని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరింది. పరువు పోతుందనే భయంతో చాలా మంది మహిళలు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు. డబ్బుల కోసమే మహిళలను ట్రాప్ చేసి పెళ్లిళ్లు చేసుకుంటున్నాడు. మహిళల జీవితాలతో ఆడుకుంటున్నాడు అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. -
మేనత్త కూతురిని ఇష్టపడ్డాడు.. నో చెప్పడంతో అర్ధరాత్రి కీర్తనను..
సాక్షి, చెన్నై: మేనత్త కూతురిపై మనస్సు పడ్డ ఓ యువకుడు ప్రేమోన్మాదిగా మారాడు. తనతో మాట్లాడటం లేదనే ఆగ్రహంతో ఆ యువతిని నరికి చంపేశాడు. వివరాలు.. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి పరిధిలోని తిరుబువనం సన్యాసి కుప్పానికి చెందిన నాగరాజ్‌కు ఇద్దరు భార్యలు. మొదటి భార్య మయిల్ మరణించడంతో అంబికను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఐదుగురు పిల్లలు, ఇందులో కీర్తన(19) మూడో కుమార్తె. ఈమె డిగ్రీ చదువుతోంది. కీర్తనపై మయిల్ అన్న కుమారుడు ముఖేష్ మనస్సు పడ్డాడు. అయితే ముఖేష్‌కు మద్యం అలవాటు ఉండడంతో అతడి ప్రేమను కీర్తన తిరస్కరిస్తూ వచ్చింది. ఈ పరిస్థితుల్లో మంగళవారం రాత్రి కళాశాల నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో నిర్మానుష్య ప్రదేశంలో కీర్తనను ముఖేష్ అడ్డుకున్నాడు. ప్రేమించాలని, పెళ్లి చేసుకుందామని ఒత్తిడి తెచ్చాడు. ఆమె నిరాకరించడంతో ఉన్మాదిగా మారాడు. వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న ఆమె తల వెంట్రుకల్ని కత్తరించేశాడు. తర్వాత ఉడాయించాడు. ఆమెను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించి.. సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. కాగా అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమె శరీరంపై 18 చోట్ల కత్తిగాట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. పోలీసులు మృత దేహాన్ని మార్చురీకి తరలించారు. అనంతరం, పరారీలో ఉన్న ముఖేష్ కోసం గాలిస్తున్నారు. కాగా బుధవారం ఉదయం సంఘటనా స్థలాన్ని ఎస్పీ జిత్తన్ కోదండరామన్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం పరిశీలించింది. ఇది కూడా చదవండి: ఆయన నా భర్తే.. రచ్చకెక్కిన నవ్య శ్రీ ఉదంతం.. ఫొటోలు వైరల్ -
వెలుగులోకి మెహుల్ చోక్సీ మరో స్కాం: షాకిచ్చిన సీబీఐ
సాక్షి, ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ కుంభకోణానికి పాల్పడి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాడు, డైమండ్ వ్యాపారి మెహుల్ చోక్సీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. కెనరా బ్యాంక్ నేతృత్వంలోని కన్సార్టియంను రూ. 55.27 కోట్లకు ముంచేసిన మెహుల్ చోక్సీపై సీబీఐ కొత్త ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. చోక్సీతోపాటు, చేత్నా ఝవేరి, దినేష్ భాటియా, మిలింద్ లిమాయేలతో సహా బెజెల్ జ్యువెలరీ ఫుల్ టైం డైరెక్టర్లపై కూడా సీబీఐ కేసు ఫైల్ చేసింది. కెనరా బ్యాంక్ నేతృత్వంలోని గ్రూప్ ఆఫ్ కంపెనీలను రూ. 55.27 కోట్ల మోసం చేసి పారిపోయిన మెహుల్ చోక్సీపై సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్లు అధికారులు గురువారం తెలిపారు. కెనరా బ్యాంక్ ,బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బెజెల్ జ్యువెలరీకి వర్కింగ్ క్యాపిటల్‌గా రూ. 30 కోట్లు, రూ. 25 కోట్లు మంజూరు చేశాయి. అయితే అక్రమంగా నిధుల మళ్లించిందని బ్యాంకుల ఆరోపణ. కంపెనీ రుణాన్ని తిరిగి చెల్లించకపోవడంతో కన్సార్టియంకు రూ.55.27 కోట్ల నష్టం వాటిల్లిందని సీబీఐ అభియోగం. కాగా 13,500 కోట్ల పీఎన్బీ స్కాంలో చోక్సీని ఇండియా రప్పించేందుకు సీబీఐ, ఈడీ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్ 16న చోక్సీ ఆస్తులను ఆదాయపు పన్ను శాఖ జప్తు చేసింది. నాసిక్‌లో చోక్సీకి చెందిన తొమ్మిది ఎకరాల వ్యవసాయ భూమిని కూడా ఐటీ శాఖ స్వాధీనం చేసుకుంది. పీఎన్బీ స్కాం వెలుగులోకి వచ్చిన తరువాత 2018లో ఆంటిగ్వా బార్బుడా పారిపోయి అక్కడి పౌరసత్వం తీసుకున్నాడు. చోక్సీ. అయితే 2021లో అక్కడి నుంచి అదృశ్యమై డొమినికాలో తేలడం చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. -
Telangana: టీ కాంగ్రెస్ నేతలపై కేసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేతలపై నగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మొత్తం మూడు కేసులు నమోదు అయ్యాయి. అనుమతులు లేకుండా గురువారం చలో రాజ్‌భవన్ నిర్వహించినందుకు పోలీసులు రంగంలోకి దిగారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో సహా పది మంది కాంగ్రెస్ నేతలపై కేసులు నమోదు చేశారు పోలీసులు. భట్టి, జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, హనుమంతరావుతో పాటు.. పలువురు కాంగ్రెస్ నేతల పేర్లను చేర్చారు. రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేశారని, అనుమతి లేకుండా రాజ్‌భవన్ ముట్టడికి వచ్చారని ఆరోపణలు ఉన్నాయి. మొత్తం పదమూడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పంజాగుట్ట పోలీసులు. జన జీవనానికి ఇబ్బంది కలిగించడమే కాకుండా .. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారని ప్రస్తావించారు పోలీసులు. -
అది బీజేపీ కుట్రే.. కావాలనే కేసు: రేవంత్ రెడ్డి
-
భర్తతో విడిపోయి బతుకుతోంది.. లవ్ యూ అంటూ సహోద్యోగి వచ్చి..
సమాజంలో కొందరు మృగాలు రెచ్చిపోతున్నారు. మహిళలపై దాడులు చేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. తాజాగా పెళ్లై, ముగ్గురు పిల్లలున్న ఓ మహిళలను ప్రేమిస్తున్నానని వెంటపడి చివరకు ఆమెపై యాసిడ్ చేశాడు. ఈ దారుణ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. బెంగళూర్‌లోని అగర్బత్తి కంపెనీలో బాధితురాలు(32), అహ్మాద్(36) కలిసి పనిచేస్తున్నారు. కాగా, బాధితురాలికి ముగ్గురు పిల్లలు ఉండగా.. ఆమె తన భర్త నుంచి విడాకులు తీసుకుని జీవనం కొనసాగిస్తోంది. ఇదిలా ఉండగా.. కంపెనీ పనిచేస్తున్న క్రమంలో బాధితురాలితో అహ్మద్ మధ్య పరిచయం ఏర్పడింది. మూడేళ్లుగా వారిద్దరూ అదే కంపెనీలో పనిచేస్తున్నారు. అయితే, కొద్దిరోజుల నుంచి బాధితురాలితో తనను ప్రేమిస్తున్నానని, పెళ్లిచేసుకుంటానని అహ్మాద్ అడిగాడు. దీనికి ఆమె నిరాకరించింది. తన పిల్లలతో జీవిస్తానంటూ క్లారిటీ ఇచ్చింది. అయినప్పటికీ అహ్మాద్ ఆమెపై ఒత్తిడి చేశాడు. బాధితురాలు ఒప్పుకోకపోవడంతో కక్షగట్టిన అహ్మాద్ శుక్రవారం.. ఆమెపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ప్రమాదంలో ఆమె కంటికి తీవ్ర గాయం కాగా.. వెంటనే బాధితురాలని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం నిందితుడు అహ్మాద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది కూడా చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌ను దారుణ హత్య చేసిన ఫుట్‌బాలర్ -
జూబ్లీహిల్స్ పబ్ కేసు: చిక్కిన నిందితులు.. వారి బ్యాక్ గ్రౌండ్ ఇదే..
జూబ్లీహిల్స్‌లో ఓ మైనర్‌పై అత్యాచార ఘటన దేశంలోనే సంచలనంగా మారింది. పోలీసులే నిందితులకు అండగా ఉన్నారని బీజేపీ, కాంగ్రెస్ నేతల ఆరోపణల నేపథ్యంలో ఈ కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇదిలా ఉండగా.. ఆదివారం ఈ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అమ్నీషియా పబ్ కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మరో మైనర్‌తో పాటు ఉమేర్‌ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఇప్పటికే అరెస్ట్ అయిన వారిలో ఇద్దరు మైనర్లు, ఒక మేజర్ ఉన్నారు. కాగా, నిందితులంతా రాజకీయ నేతల కొడుకులుగా పోలీసులు గుర్తించారు. నిందితులు వీరే.. A1.. సాదుద్దీన్(ఎంఐఎం నేత కొడుకు) A2.. ఉమేర్‌ఖాన్(ఎమ్మెల్యే సోదరుడి కొడుకు) మైనర్-1.. వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు మైనర్-2.. ఎంఐఎం కార్పొరేటర్ కొడుకు మైనర్-3.. సంగారెడ్డి మున్సిపల్ కో-ఆప్షన్ మెంబర్ కొడుకు ఉన్నారు. ఇదిలా ఉండగా.. మైనర్‌పై అత్యాచార కేసుపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరా రాజన్ స్పందించారు. ఈ ఘటనపై నివేదికను సమర్పించాలని సీఎస్, డీజీపీని ఆదేశించారు. 2 రోజుల్లో నివేదికను అందించాలని ఆదేశించారు. మరోవైపు.. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితులు.. లైంగిక దాడి అనంతరం కారులో మొయినాబాద్‌కు వెళ్లారు. అక్కడ ఓ రాజకీయ నేతకు చెందిన ఫాంహౌస్‌లో ఆశ్రయం పొందారని తెలుస్తోంది. ఇది కూడా చదవండి: అత్యాచారం ఘటనపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కేసీఆర్‌కు బండి లేఖ -
మెట్రో స్టేషన్లో యువతిపై లైంగిక వేధింపులు
దేశంలో యువతులు, మహిళలపై లైంగిక వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. బస్సుల్లో, రైళ్లలో ప్రయాణించే సమయంలో కొందరు ఆకతాయిలు మహిళలను లైంగికంగా వేధిస్తూనే ఉన్నారు. తాజాగా మెట్రో స్టేషన్లో ఓ యువతికి చేదు అనుభవం ఎదురైంది. ఓ యువకుడు.. ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చేటుచేసుకుంది. వివరాల ప్రకారం.. బాధిత యువతి ఢిల్లీలోని జోర్‌బాగ్ మెట్రో స్టేషన్లో రైలు ఎక్కింది. అనంతరం రైలులో ఉన్న ఓ వ్యక్తి ఆమె వద్దకు వచ్చి ఓ అడ్రస్ గురించి అడిగాడు. ఈ క్రమంలో ఆమె అతడికి అడ్రస్ చెప్పింది. అనంతరం ఆమె దిగిపోవాల్సిన స్టేషన్ రాగా.. రైలు దిగి మరో రైలు కోసం ఎదురు చూస్తూ ప్లాట్‌ఫామ్ మీద ఉన్న బెంచి మీద కూర్చుంది. ఇంతలో అడ్రస్ అడిగిన వ్యక్తి మళ్లీ ఆమె వద్దకు వచ్చి.. మరోసారి అడ్రస్‌ను కోరి.. క్లియర్ చెప్పమని అడిగాడు. ఈ క్రమంలో సదరు వ్యక్తి.. బాధితురాలి పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. తన శారీరక అవయవాలను ఆమెకు తాకిస్తూ దారుణంగా ప్రవర్తించాడు. దీంతో బాధితురాలు.. అతను ఏం చేస్తున్నాడో గమనించి.. ప్లాట్‌ఫామ్ మీది ఉన్న సీఐఎస్ఎఫ్ సిబ్బందికి ఫిర్యాదు చేసింది. ఆమె చెప్పింది అతను పట్టించుకోకుండా పై ఫ్లోర్లో ఉన్న స్టేషన్లో ఫిర్యాదు చేయమన్నాడు. దీంతో షాకైన యువతి.. మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితుడిని కూడా గుర్తించింది. అయితే పోలీసులు కేసు నమోదు చేసుకునేందుకు నిరాకరించారు. దానిని పెద్ద సీన్ చేయవద్దని ఆమెకు నచ్చ చెప్పేందుకు ప్రయత్నించారు. దీంతో, బాధితురాలు తనకు జరిగిన చేదు అనుభవాన్ని ట్విట్టర్ ద్వారా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌కు ఫిర్యాదు చేసింది. ఆమె ట్వీట్‌కు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు స్పందించారు. ఆ ఘటనపై తగు చర్యలు తీసుకుంటున్నట్టు స్పష్టం చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితుడిని గుర్తిస్తున్నట్టు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని వెల్లడించారు. ఇక, ఈ ఘటనపై సీరియస్ అయిన ఢిల్లీ మహిళా కమిషన్.. కేసు సుమోటోగా స్వీకరిస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. Zero-tolerance for any indecent behaviour, sexual harassment: DMRC on Jor Bagh station case In a statement, it also asserted that the Delhi Metro Rail Corporation, as an organisation has "zero-tolerance for any act amount... #News by #EconomicTimes https://t.co/wOyd25dCYK — Market’s Cafe (@MarketsCafe) June 4, 2022 In the context of the recent incident reported at Jorbagh, we have already taken up the issue with the concerned security agencies. Delhi Police has already taken cognizance of the complaint and are investigating into the matter. — Delhi Metro Rail Corporation I कृपया मास्क पहनें😷 (@OfficialDMRC) June 3, 2022 ఇది కూడా చదవండి: ‘ఆర్య సమాజ్’ మ్యారేజ్ సర్టిఫికెట్లు చెల్లవు -
నా భార్యను చంపేశాను.. డయల్ 100కు ఫోన్ చేసి..
అర్ధరాత్రి దాటింది. ఊళ్లన్నీ నిశ్శబ్దంగా నిద్రపోతున్న సమయంలో ఓ వ్యక్తి 100 నంబర్‌కు ఫోన్ చేశాడు. కాల్ లిఫ్ట్ చేసిన పోలీసులతో ‘నా భార్యను చంపేశాను. నన్ను తీసుకెళ్లండి’ అంటూ చెప్పాడు. విన్న పోలీసులకు ఓ క్షణం ఏమీ అర్థం కాలేదు. ఆకతాయిలు ఎవరైనా ఫోన్ చేశారా..? నిజంగానే హత్య జరిగిందా..? అని ఆలోచించారు. ఏమై ఉంటుందో అని అవతలి వ్యక్తి చెప్పిన అడ్రస్‌కు వెళ్లి చూసి నిశ్చేషు్టలయ్యారు. నిద్రపోతున్న భార్యను గొంతు నులిమి చంపేసిన ఓ ప్రబుద్ధుడు తాపీగా పోలీసులకు ఫోన్ చేసి లొంగిపోయాడు. ఎచ్చెర్ల క్యాంపస్: ఎచ్చెర్ల మండలం పూడివలసలో మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఎచ్చెర్ల మండలం పూడివలస గ్రామానికి చెందిన జరుగుళ్ల రామా రావు (ఆనంద్ పాల్) భార్య నాగరత్నం(45)ను మంగళవారం రాత్రి హత్య చేశాడు. రామారావు పాస్టర్‌గా పనిచేస్తున్నారు. నాగరత్నం ఫరీదుపేట సచివాలయం ఏఎన్ఎంగా విధులు నిర్వహిస్తున్నారు. పూడివలసలో నివాసం ఉంటూ ఫరీదుపేట రాకపోకలు సాగిస్తుంటారు. రామారావు రోజూ భార్యను బైక్‌పై సచివాలయం వద్ద దించి సాయంత్రం పూట మళ్లీ ఇంటికి తీసుకెళ్తుంటారు. అయితే కొన్ని రోజులుగా రామారావు ఇంటి వద్దనే ఉంటున్నారు. ఆయనకు సాయంత్రం అయితే కనిపించదు. తొమ్మిదేళ్ల కిందట పెళ్లి చేసుకున్న వీరికి ఆరేళ్ల రాజ్‌కుమార్ పాల్ అనే కుమారుడు ఉన్నాడు. కొన్ని నెలలుగా ఈ దంపతుల మధ్య మనస్ఫర్థలు తలెత్తాయి. చీటి కీ మాటికీ గొడవలు పడడం ప్రారంభించారు. నాగరత్నంను కన్నవారింటికి వెళ్లవద్దని రామా రావు చెబుతుండేవాడు. అయినా ఆమె టెక్కలి సమీపంలోని నందిగాంలోని కన్నవారికి వెళ్లడంతో అప్పట్లో ఓ సారి చేయి చేసుకున్నాడు కూడా. తన మాట వినడం లేదని తరచూ ఆమెపై ఆంక్షలు పెట్టేవాడు. దీంతో కుటుంబ కలహాలు పెచ్చుమీరాయి. మంగళవారం రాత్రి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. గంటల కొద్దీ వాదించుకున్నాక.. అర్ధరాత్రి దాటిన తర్వాత నిద్రపోతున్న భార్యను రామారావు గొంతు నులిమి చంపేశాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నాక క్రైమ్ స్టాపర్ 100కు ఫోన్ చేసి తాను భార్యను చంపేశానని, తనను తీసుకోపోవాలని తానే సమాచారం ఇచ్చాడు. పోలీసులు సంశయిస్తూనే సంఘటన స్థలానికి వచ్చారు. ఇంటిలోకి వెళ్లి చూస్తే నాగరత్నం మృతదేహం మంచంపై పడి ఉంది. దీంతో హంతకుడిని అదుపులోకి తీసుకున్నారు. శవ పంచనామా నిర్వహించి అనంతరం మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. పాపం కుమారుడు.. రాత్రి పడుకున్నప్పుడు పక్కనే ఉన్న అమ్మ ఉదయానికి మృతదేహంగా మారడంతో కుమారుడు రాజ్‌కుమార్ కన్నీరుమున్నీరయ్యాడు. అమ్మ కావాలంటూ గుక్కపట్టి ఏడిచాడు. ఒక్కడే కుమారుడు కావడంతో తల్లి గారాబంగా పెంచుకుంది. అమ్మ హత్యకు గురి కావడం, తండ్రి జైలుకు వెళ్లడంతో కుమారుడి పరిస్థితి ఒక్కసారిగా తల్లకిందులైపోయింది. ప్రస్తుతం అతడిని అమ్మమ్మ, తాతయ్యలు తీసుకువెళ్లారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని నందిగాం తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విజయవాడలో దారుణం.. ఫుట్‌బాల్ ప్లేయర్ హత్య
విజయవాడలోని గురునానక్ కాలనీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. జక్కంపూడికి చెందిన ఫుట్‌బాల్ ప్లేయర్ ఆకాష్ దారుణ హత్యకు గురయ్యాడు. దీంతో ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల ప్రకారం.. వాంబే కాలనీలో రౌడీ షీటర్ టోని రెండు రోజుల క్రితం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, ఆకాశ్, ప్రభాకర్ మరికొంత మంది టోని గ్యాంగ్‌లో పని చేస్తున్నారు. ఇక, టోని అంత్యక్రియల అనంతరం వీరంతా ఓ బార్లో ఫుల్లుగా మద్యం సేవించారు. ఈ క్రమంలోనే టోని గ్యాంగ్‌లోని ప్రభాకర్ బ్యాచ్, ఆకాశ్ గ్యాంగ్ మధ్య వివాదం చెలరేగింది. ఆ సందర్భంలోనే పోలీసులు అక్కడికి వస్తున్నారని వారంతా బార్ నుంచి వెళ్లిపోయారు. తర్వాత మంగళవారం రాత్రి ప్రభాకర్ గ్యాంగ్.. ఆకాశ్ ఉంటున్న ఇంట్లోకి వెళ్లి అతడిపై దాడి చేశారు. కత్తులతో దాడి చేయడంతో ఆకాశ్ ఘటనా స్థలంలోనే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆకాశ్ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి పోస్టువార్టం నిర్వహిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. టోని గ్యాంగ్‌పై ఫోకస్‌పెట్టారు. టోని అంత్యక్రియల్లో ఎవరెవరు పాల్గొన్నారనే అంశంపై దృష్టిసారించారు. ఇక, ఆకాశ్ మృతి కేసులో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు.. ఆకాశ్ ఫుట్‌బాల్ ప్లేయర్ కాగా కొన్ని టోర్నీల్లో కప్‌లు కూడా సాధించాడు. -
ట్యూషన్‌కు వచ్చిన విద్యార్థినిపై లైంగిక దాడి.. వీడియోలు తీసి..
దేశంలో యువతులు, మహిళపై లైంగిక దాడులు ఆగడం లేదు. ఎన్ని కొత్త చట్టాలు తీసుకువచ్చినా అత్యాచారాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ టీచర్.. స్టూడెంట్ను లైంగికంగా హిసించి గర్భవతిని చేశాడు. ఈ దారుణ ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. దాహోద్ జిల్లాలోని జలోద్లో ఓ విద్యార్థిని(17).. నైనేష్ దామోరా ఆధ్వర్యంలో నడిచే కోచింగ్ క్లాసులకు వెళ్తోంది. ఈ క్రమంలో ఓ రోజు.. దామోరా.. విద్యార్థిని వాష్‌రూమ్‌కు వెళ్లినప్పుడు వీడియోను రికార్డు చేశాడని బాధితురాలు తెలిపింది. అనంతరం ఆ వీడియోను చూపించి.. ఆమెను దామోర్ బెదిరింపులకు గురిచేశాడు. ఆ తర్వాత వీడయోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేసి తనపై లైంగిక దాడికి పాల్పడినట్టు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా.. ఈ వీడియోను ఆసరాగా చేసుకుని ఆమెపై టీచర్ పలుమార్లు లైంగిక దాడి చేయగా బాధితురాలు గర్భం దాల్చింది. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేసినట్టు జలోద్ సర్కిల్ పోలీస్ ఇన్స్పెక్టర్ హెచ్‌సీ రత్వా తెలిపారు. అనంతరం బాలికను ఆసుపత్రికి తరలించినట్టు వెల్లడించారు. ఇది కూడా చదవండి: బరాత్‌లో పెళ్లి కొడుకు అత్యుత్సాహం.. వధువుకు చేదు అనుభవం -
సరదాకు చేసిన ఫీట్ ప్రాణాల మీదకు తెచ్చింది.. వీడియో వైరల్
సరదాకు చేసిన ఓ ఫీట్ యువకుడిని ఆసుపత్రిపాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చింది. పోలీసులు హెచ్చరించినా వినిపించుకోకపోవడంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఇటీవల కర్నాటకలో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు పొర్లిపొంగాయి. ఈ క్రమంలో చిక్కబళ్లాపూర్‌లోని శ్రీనివాస సాగర డ్యామ్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో డ్యామ్ వద్ద ఉన్న గోడపై నుంచి డ్యామ్ నీళ్లు కిందకు వస్తున్నాయి. వేసవిలో దీన్ని చూసేందుకు స్థానికులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ యువకుడు(20) పై నుంచి నీళ్లు వస్తున్న సమయంలో సరదాకు ట్రెక్కింగ్ చేయబోయాడు. అతడు దాదాపు 25 అడుగుల ఎత్తుకు చేరుకున్న తర్వాత పట్టుజారి పోవడంతో కింద పడిపోయాడు. కాగా, ఆనకట్ట దాదాపు 50 అడుగుల ఎత్తు వరకు ఉంటుంది. ఈ ప్రమాదంలో గాయపడిన యువకుడిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా.. ప్రమాదకర ఫీట్ చేయవద్దని జిల్లా యంత్రాంగం హెచ్చరించినా పట్టించుకోకుండా యువకుడి ఇలా చేయడంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. A man fell down the wall of Srinivasa Sagara Dam in #Chikkaballapur and got injured while he was attempting to scale the wall. Reports @dpkBopanna pic.twitter.com/KUpU1NRgyR — Sanjay Jha (@JhaSanjay07) May 23, 2022 ఇది కూడా చదవండి: మోదీని సర్ప్రైజ్ చేసిన బాలుడు.. ఆశ్యర్యపోయిన ప్రధాని -
మంత్రి కొడుకు అరాచకం.. మహిళపై అత్యాచారం చేసి..
మంత్రి కొడుకు ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. అతడిని అరెస్ట్ చేసేందుకు వెళ్లారు. తీరా అక్కడికి వెళ్లాక.. నిందితుడు ఇంట్లో లేకపోవడంతో ఇంటికి పోలీసులు సమన్లు అంటించారు. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. కాంగ్రెస్ పార్టీ మంత్రి మహేష్ జోషి కుమారుడు రోహిత్ జోషి(23) తనపై లైంగిక దాడి చేశాడని ఓ మహిళ ఢిల్లీ పోలీసులను ఆశ్రయించింది. గత ఏడాది జనవరి 8 నుంచి ఏప్రిల్ 17 వరకు పలుమార్లు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అయితే, జనవరి 8వ తేదీన రోహిత్ జోషిని ఆమె కలిసినప్పడు డ్రింక్‌లో మత్తు మందు కలిపి తనపై లైంగికదాడికి పాల్పడినట్లు తెలిపింది. ఆ సమయంలో తన నగ్న ఫొటోలు, వీడియోలు చూపించి బెదిరించి, బ్లాక్మెయిల్ చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. అనంతరం గతేదాడి ఆగస్ట్ 11న గర్భం దాల్చినట్లు తెలియడంతో అబార్షన్ మాత్ర వేసుకోవాలని రోహిత్ జోషి.. తనను బెదిరించినట్లు తెలిపింది. దీంతో, జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు.. ఆదివారం రాజస్థాన్‌లోని రోహిత్ జోషి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఇంటికి తాళం వేసి ఉండటంతో పోలీసులు.. అరెస్ట్ చేసేందుకు సమన్ల నోటీసును ఇంటి డోర్‌కు అంటించారు. లైంగిక దాడి కేసుపై విచారణకు మే 18లోగా హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: నువ్వు లేకపోతే చచ్చిపోతానని నమ్మించి.. పలుమార్లు లైంగిక దాడి -
లిఫ్ట్ పేరుతో టీచర్‌పై లైంగిక దాడి.. వీడియోలు తీసి ఆ తర్వాత..
దేశంలో ప్రతీరోజు ఎక్కడో ఒక చోట మహిళలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ ముస్లిం వ్యక్తి.. టీచర్‌పై లైంగిక దాడి చేసి వీడియోలు తీసి అనంతరం పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. షహజాన్‌పూర్‌లో లిఫ్ట్ పేరుతో అమీర్ అనే వ్యక్తి గవర్నమెంట్ టీచర్(28) బైకుపై ఎక్కించుకున్నాడు. అనంతరం ఆమెకు మత్తుమందు వాసన చూపించి స్పృహ కోల్పోయేలా చేశారు. ఆ తర్వాత అమీర్.. టీచర్‌పై అత్యాచారం చేసి వీడియోలు తీశాడు. ఇదిలా ఉండగా.. తమ కుమారుడిని కాపాడుకునేందు టీచర్‌ను మతం మారాలని, తనను పెళ్లి చేసుకోవాలని అమీర్ కుటుంబ సభ్యులు టీచర్‌ను బెదిరింపులకు గురిచేశారు. దీంతో.. సదరు మహిళ జరిగిన విషయాన్ని పోలీసులు తెలిపి అమీర్‌పై ఫిర్యాదు చేసింది. నిందితుడు అమీర్‌తో సహా ఐదుగురిపై ఉత్తరప్రదేశ్‌లో తీసుకువచ్చిన మత మార్పిడి నిషేధ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. కాగా, ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఎస్పీ తెలిపారు. ఇది కూడా చదవండి: నరకం చూపించారు, బర్త్‌డే రోజే చంపేశారు: మోడల్ తల్లి -
బాలుడిపై మహిళ లైంగిక దాడి.. చివరకు భలే ట్విస్టు
బాలుడిని లైంగికంగా వేధించినందుకు ఓ మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె తనపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడినట్టు బాధితుడు పోలీసులకు వివరించాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ధారావికి చెందిన ఓ మహిళ(20)కు ఓ బాలుడి(17)తో సోషల్ మీడియాతో 2020లో పరిచయం ఏర్పడింది. దీంతో వారిద్దరూ చాటింగ్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఆమె.. అతడికి తన లవ్ ప్రపోజ్‌చేసింది. కానీ, బాలుడు ఆమె ప్రపోజల్‌ను తిరస్కరించాడు. అనంతరం ఆమె ఫోన్ నెంబర్, సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేశాడు. ఆమె మాత్రం వేరే ఫోన్ నెంబర్లు, ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేసి అతడిని వేధించింది. ఇదిలా ఉండగా.. బాధిత బాలుడు జనవరి 19న ఉద్యోగం వెతుక్కుంటూ ముంబైలోని తన బంధువుల ఇంటికి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న మహిళ, అతడిని కలవాలని ధారవిలోని తన బాలుడిని ఇంటికి ఆహ్వానించింది. దీంతో ఆ బాలుడు ఆమె ఇంటికి రాగా.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అతడిపై లైంగిక దాడికి పాల్పడింది. అంతేకాకుండా తర్వాత కూడా వాషిలోని ఓ లాడ్జితో పాటు పలు ప్రాంతాలకు బాలుడిని పిలిపించుకొని ఆమె లైంగిక వేధింపులకు పాల్పడిందని బాధితుడు పోలీసుల వద్ద ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో బాలుడి ఫిర్యాదు మేరకు ఆమెపై పోక్సో చట్లంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. మరోవైపు.. బాలుడి కుటుంబానికి ఆమె మరో షాకిచ్చింది. బాలుడితో పాటు అతని తండ్రి, నలుగురు మేనమామలు, బంధువు.. తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేస్తూ నవీ ముంబై పోలీసులను ఆశ్రయించింది. నవీ ముంబై పోలీసులు కేసును ధారవి పోలీసులకు బదిలీ చేశారని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఇది కూడా చదవండి: మాజీ ప్రేయసి ఇంకొకరితో చనువుగా ఉందని.. -
జాతీయస్థాయిలో అవార్డు గ్రహీత.. ఆమెపై అత్యాచారం.. చివరకు..
సాక్షి, న్యూఢిల్లీ: ఆయన జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రచయిత. ఆయన రచనలకు గుర్తింపుగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా సొంతం చేసుకున్నారు. కానీ ఇందంత ఒకవైపు.. మరోవైపు మాత్రం అతను ఓ యువతి జీవితాన్ని నాశనం చేశాడు. అతడు తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు పోలీసులను ఆశ్రయించడం కలకలం సృష్టించింది. వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన మహిళ(32) .. ఢిల్లీలోని తిమ్మార్‌పూర్ పోలీసులను ఆశ్రయించింది. ఢిల్లీకి చెందిన కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీత తనపై అత్యాచారం చేశాడని ఆరోపించింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నట్టు తెలిపింది. ఈ క్రమంలో పదేళ్ల క్రితం సోషల్ మీడియాలో ద్వారా అతడితో పరిచయం ఏర్పడిందని, అనంతరం వారద్దరూ ప్రేమించున్నట్టు పేర్కొంది. 2013లో తనకు కంటి నొప్పి రావడంతో ఎయిమ్స్ చికిత్స చేపించుకుని తిరిగి వచ్చేసరికి ఆలస్యమైందని తెలిపింది. లేట్ అయినందుకు అతను కోపంతో తనను తీవ్రంగా కొట్టాడని, ఓ వైపు తాను ఏడుస్తున్నా తనపై అత్యాచారం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, తర్వాత రోజు అతను తన వద్దకు వచ్చి పెళ్లి చేసుకుంటానని చెప్పినట్టు పేర్కొంది. ఇలా పెళ్లి పేరుతో అతడు తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని వాపోయింది. ఇదిలా ఉండగా.. ఇటీవలే నిందితుడి ఫోన్‌ను బాధితురాలు చెక్ చేయగా అతడికి మరికొంతమంది మహిళలతో సంబంధం ఉన్నట్టు గుర్తించానని పేర్కొంది. దీంతో పోలీసులను ఆశ్రయించినట్టు చెప్పుకొచ్చింది. ఇది కూడా చదవండి: ఆర్డర్ చేసిన ఫుడ్‌లో పాము చర్మం...షాక్‌లో కస్టమర్ -
మంత్రి ఈశ్వరప్ప కేసులో ట్విస్టులు.. ఎఫ్ఐఆర్పై మరో వివాదం
సాక్షి, బెంగళూరు: కర్నాకటలో కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్య పెను దుమారం రేపుతోంది. ఈ కేసు విషయంలో ఇప్పటికే మంత్రి ఈశ్వరప్ప రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా, ఆత్మహత్య వివాదం మాత్రం ఇంకా ముగిసిపోలేదు. కాంట్రాక్టర్ ఆత్మహత్య విషయంలో కాంగ్రెస్ పార్టీ అధికార బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఈ కేసులో మంత్రి ఈశ్వరప్ప రాజీనామా పరిష్కారం కాదన్నారు కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్. కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ అనుమానాస్పద మృతి కేసులో ఈశ్వరప్పపై కేసు నమోదు చేసి.. ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్‌ను ఈశ్వరప్ప 40 శాతం కమీషన్ అడిగినట్లు ఎఫ్ఐఆర్లో ఎక్కడుందని ప్రశ్నించారు. అవినీతి నిరోధక చట్టం కింద ఎందుకు కేసు నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈశ్వరప్పపై కేసు నమోదు చేయాలన్నది కర్ణాటక ప్రజల డిమాండ్ అని శివకుమార్ అన్నారు. ఈశ్వరప్ప, అతని స్నేహితులు రమేశ్, బసవరాజ్‌ను కూడా అరెస్టు చేయాలని శివకుమార్ కోరారు. విచారణ ప్రారంభించకముందే ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. -
ఇద్దరు కూతుళ్లపై అత్యాచారం.. పెద్ద కూతురికి పెళ్లి కావడంతో..
జైపూర్: తన కూతుర్ల పట్ల ఓ తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. వావివరుసలు మరిచి ఇద్దరు కూతుర్లను లైంగికంగా వేధించాడు. ఏకంగా మూడు దశాబ్దాల నుండి అతను తన కూతురిని వేధింపులకు గురిచేస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసు అధికారి జుల్ఫికర్ వివరాలు తెలుపుతూ.. జోధ్‌పూర్‌లోని చౌపాస్ని హౌసింగ్ బోర్డ్ పరిధిలో కన్న తండ్రి తన ఇద్దరు కూతుళ్లను లైంగికంగా వేధించాడు. పెద్ద కూతురు ఆరు సంవత్సరాల వయస్సు నుంచే అతడి వల్ల లైంగిక వేధింపులకు గురైనట్టు తెలిపారు. 1993లో తనపై అత్యాచారం చేశాడని.. ఈ విషయాన్ని తన తల్లికి చెప్పినా పట్టించుకోలేదన్నారు. కాగా, బాధితురాలికి 2017లో వివాహమైంది. దీంతో ఆమె ఇంటి నుంచి వెళ్లిపోగా.. అతడి కన్ను తన చెల్లెలిపై పడింది. తాజాగా, ఆమెను కూడా తండ్రి లైంగికంగా వేధించినట్టు ఆమె ఆరోపించింది. దీంతో తన సోదరిని రక్షించాలని బాధితురాలు(అక్క) పోలీసులను ఆశ్రయించింది. కాగా, ఆమె ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల తండ్రిపై కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్టు వెల్లడించారు. -
చిన్నారులపై అసభ్యకర సన్నివేశాలు, ప్రముఖ దర్శకుడిపై కేసు
బాలీవుడ్ ప్రుముఖ డైరెక్టర్, నటుడు మహేశ్ మంజ్రేకర్‌పై కేసు నమోదైంది. మైనర్ పిల్లలపై అభ్యంతకర సన్నివేశాలను తెరకెక్కించారనే ఆరోపణలపై ముంబై మహిమ్ పోలీసు స్టేషన్లో ఆయనపై ఎఫ్ఐఆర్ దాఖలైంది. దీంతో డైరెక్టర్ మహేశ్ మంజ్రేకర్‌పై కేసు నమోదు చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. వివరాలు.. ఇటీవల మహేశ్ మంజ్రేకర్ రూపొందించిన మరాఠి చిత్రంలో చిన్నారులపై అసభ్యకర సన్నివేశాలు ఉన్నాయి. చదవండి: ఛీఛీ ఇలాంటి చెత్త వీడియోలో నటించడమేంటి, కాస్తా చూసుకో: కీర్తిపై దారుణమైన ట్రోల్స్ ఈ సీన్స్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మహరాష్ట్రకు చెందిన సామాజిక కార్యకర్త సీమ దేశ్‌పాండే ముంబై సెషన్స్ కోర్టులో పటిషన్ దాఖలు చేసింది. ఇందులో నటించిన పిల్లలంతా మైనర్లని, అలాంటి వారితో అభ్యంతకర దృశ్యాలను చిత్రీకరించడం పోక్స్ చట్టాన్ని ఉల్లంఘించమేనని ఆమె పిటిషన్లో ఆరోపించారు. సీమ దేశ్‌పాండే ఫిర్యాదు మేరకు మహేశ్ మంజ్రేకర్‌పై ఐపీసీ 292, 34 సెక్షన్లతో పాటు పోక్సో సెక్షన్ 14, ఐటీ యాక్ట్ 67, 67బీ కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇప్పటి వరకు ఈ కేసులో ఎవరిని అరెస్టు చేయలేదని సమాచారం. -
ఎన్నికల వేళ.. కేజ్రీవాల్, చన్నీలపై కేసు నమోదు
ఛండీఘడ్: మరికొన్ని గంటల్లో పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢీల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై పోలీసు కేసు నమోదైంది. అకాలీదళ్, ఇతర రాజకీయ పార్టీలను దూషించారన్న ఆరోపణలపై పంజాబ్ ఎన్నికల పోలింగ్ అధికారి విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలో కేజ్రీవాల్‌పై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే దూషించినట్లు ఒక వీడియో సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతుండటంపై ఆయా పార్టీ నేతలు కేజ్రీవాల్‌పై పంజాబ్ ఈసీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మరోవైపు శనివారం సాయంత్రంతో పంజాబ్‌లో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. కాగా, ప్రచార సమయం ముగిసినప్పటికీ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ ఇంటింటి ప్రచారం నిర్వాహించారంటూ కేసు నమోదైంది. చన్నీతో పాటు కాంగ్రెస్ అభ్యర్థి, పంజాబీ గాయకుడు శుభ్ దీప్ సింగ్ పైనా కూడా కేసు నమోదు చేశారు. -
మాజీ మిస్ చెన్నైను ఓ గదిలో బంధించి.. 40 రోజుల పాటు..
సాక్షి, చెన్నై: స్పెషల్ ఎస్ఐ తనను 40 రోజులు గదిలో బంధించి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు మాజీ మిస్ చెన్నై శనివారం పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదుతో పళ్లికరణై పోలీసులు కేసును విచారిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. పళ్లికరణైకు చెందిన యువతి గతంలో మిస్ చెన్నై పోటీల్లో విజేతగా నిలిచారు. ఆమె తల్లిదండ్రులు విదేశాల్లో ఉంటున్నారు. ఈమెకు ఈస్ట్ కోస్టు రోడ్డులో ప్లాట్ ఉంది. ఇక్కడ ఇంటి నిర్మాణానికి ఓ బిల్డర్‌ను ఆశ్రయించింది. అతడు తనను మోసం చేయడంతో స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లింది. ఈ సమయంలో ఎస్ఎస్ఐ ఆండ్రు కార్వెల్‌తో పరిచయం ఏర్పడింది. కేసు విచారణ పేరిట తరచూ ఆమెను కలిసేవాడు. అదే సమయంలో తన సమస్యలను కార్వెల్‌తో ఆమె పంచుకుంది. ఇదే అదనుగా ఆమె ఇంట్లో కొన్ని పూజలు చేయించాలని పేర్కొంటూ, మత బోధకుల పేరిట కొందర్ని కార్వెల్ రంగంలోకి దించాడు. ప్రార్థనలు, పూజలు అంటూ హంగామా చేసి, చివరకు మాజీ మిస్ చెన్నైను ఓ గదిలో బంధించాడు. తనను లొంగ దీసుకునేందుకు 40 రోజుల పాటు ఎస్ఎస్ఐ ప్రయత్నించాడని, ఆ గదిలో తాను నరకం చూశానని ఫిర్యాదులో పేర్కొంది. తెలిసిన వారి సాయంతో తప్పించుకుని వచ్చినట్లు చెప్పింది. ఎస్ఎస్ఐ అజ్ఞాతంలోకి వెళ్లడంతో పళ్లికరణై పోలీసులు కేసు విచారణను వేగవంతం చేశారు. -
అశ్లీల చిత్రాల కేసులో రాజ్‌కుంద్రాకు ఊరట!!
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాకు అశ్లీల చిత్రాల కేసులో సుప్రీంకోర్టు నుంచి కాస్త ఊరట లభించింది. అంతేకాదు సుప్రీంకోర్టు రాజ్‌కుంద్రాకు అరెస్టు కాకుండా నాలుగు వారాల బెయిల్‌ని మంజూరు చేసింది. ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానం మహారాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేసింది. అయితే నవంబర్ 25న బాంబే హైకోర్టు ముందస్తు బెయిల్ కోసం రాజ్ కుంద్రా దాఖలు చేసిన పిటీషన్‌ను తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. (చదవండి: నాలుగేళ్ల జైలు శిక్ష!.... రెండు రోజుల్లో విడుదల అంతలోనే..) ఈ క్రమంలో కుంద్రా వీడియోలు శృంగారభరితమైనవే అయినప్పటికీ, వాస్తవానికి ఎటువంటి శారీరక లేదా లైంగిక కార్యకలాపాలను చూపించలేదని హైకోర్టులో పిటిషన్లో పేర్కొన్నారు. పైగా తాను అటువంటి వీడియోల తయారీలో లేదా ప్రసారంలో పాల్గొనలేదని చెప్పడమే కాక తనను ఈ కేసులో తప్పుగా ఇరికించారని అన్నారు. అయినప్పటికీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. దాంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. (చదవండి: మాజీ ప్రియురాలు ఫోన్ అన్‌లాక్ చేసి... ఏకంగా రూ 18 లక్షలు కొట్టేశాడు!!) -
గ్యాస్ లీక్ అవ్వడంతో.... దంపతులు మృతి!!
సత్తుపల్లిటౌన్: వంట చేస్తుండగా గ్యాస్ లీక్ కావడంతో మంటలు వ్యాపించి తీవ్రంగా గాయపడిన దంపతులు హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. వివరాలిలా ఉన్నాయి.. పట్టణంలోని హనుమాన్‌నగర్‌కు చెందిన దంపతులు అడపా శ్రీరామమూర్తి (50), అడపా ఇంద్రకుమారి(44) నవంబర్ 30న ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ లీక్ అయి మంటలు చెలరేగాయి. దీంతో ఇంద్రకుమారికి మంటలు అంటుకోవడంతో ఆర్పేందుకు యత్నించిన భర్త శ్రీరామమూర్తి కూడా తీవ్రంగా గాయపడ్డారు. (చదవండి: వామ్మో! ఆ దేశం కేవలం పూల వ్యాపారంతోనే.... రూ.180 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుందటా!!) వారికి సత్తుపల్లిలో ప్రాథమిక చికిత్స నిర్వహించి హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తుండగా భర్త శ్రీరామమూర్తి మృతి చెందాడు. సాయంత్రం ఇంద్ర కుమారి మృతి చెందింది. చికిత్స పొందుతూ ఒకేరోజు దంపతులు మృతి చెందటంతో హనుమాన్‌నగర్‌లో విషాదచాయలు అలుముకున్నాయి. మృతుడు శ్రీరామమూర్తి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వారికి సతీశ్, రాజేశ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబానికి మున్నూరుకాపు సంఘం నియోజకవర్గ కోఆర్డినేటర్ మాధురి మధు, రామిశెట్టి సుబ్బారావు, రామిశెట్టి కృష్ణ, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ తోట సుజలారాణి, తోట గణేశ్ సంతాపం తెలిపారు. (చదవండి: డాక్యుమెంట్ రైటర్లదే హవా..) -
కార్వీ ఎండీ పార్థసారథిపై మరో కేసు..
హైదరాబాద్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (కేఎస్‌బీఎల్)సంస్థ ఎండీ పార్థసారథి కేసుపై సెంట్రల్ సైబర్ స్టేషన్(సీసీఎస్) పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. తాజాగా, ఆయనపై మరో కేసు నమోదు చేసినట్లు సీసీఎస్ పోలీసులు తెలిపారు. డీమాట్ అకౌంట్ నుంచి రూ.35 కోట్లను.. తన వ్యక్తి గత ఖాతాకు బదిలీ చేసుకున్నట్లు గుర్తించారు. దీంతో ఇప్పటి వరకు పార్థసారథిపై సీసీఎస్ పోలీసులు నాలుగు కేసులను నమోదు చేశారు. చదవండి: ఆడిట్ రిపోర్ట్ ముందుంచి పార్థసారథిని ప్రశ్నించిన పోలీసులు -
భార్యపై మంత్రి వేముల పీఆర్వో దాడి.. కేసు నమోదు, వీడియో వైరల్
మంథని(పెద్దపల్లి జిల్లా): భార్యాభర్తల వివాదంలో వ్యవసాయ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పీఆర్ఓగా చెప్పుకుంటున్న తోట శ్రీకాంత్‌పై మంథని పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. మంథని ఎస్సై చంద్రకుమార్ వివరాల ప్రకారం.. మంథని మండలం గాజులపల్లికి చెందిన కోమలతతో కాల్వశ్రీరాంపూర్ మండలం ఎదులాపూర్‌కు చెందిన శ్రీకాంత్‌తో వివాహమైంది. రెండేళ్లుగా శ్రీకాంత్ కోమలతను కాపురానికి తీసుకెళ్లడం లేదు. ఆదివారం ఎదులాపూర్‌లో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరగాల్సి ఉంది. కోమలత గ్రామ çసర్పంచ్ వద్దకు పిలిపిస్తే శ్రీకాంత్ రాలేదు. భర్తతో కలిసి వెళ్లేందుకు కోమలత సిద్ధంకాగా ఇద్దరిమధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో శ్రీకాంత్ కోమలతపై చేయి చేసుకున్నాడు. కోమలత మంథని పోలీస్ స్టేషన్‌కు చేరుకుని అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని శ్రీకాంత్‌పై ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. ఇవీ చదవండి: అదృష్టం వీరికి పిల్లి రూపంలో వచ్చింది ! పగలంతా పెద్ద మనుషులు, రాత్రి అయితే..? -
అధిక ఫీజులు వసూలు చేస్తే క్రిమినల్ కేసులు
సాక్షి, అమరావతి: విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కాలేజీల యాజమాన్యాల ప్రయోజనాల కోసమే ఇంటర్మీడియెట్ ఫస్టియర్ అడ్మిషన్లలో ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టామని ఇంటర్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ తెలిపారు. ఈ విధానానికి అందరి నుంచి మంచి స్పందన లభించిందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఎయిడెడ్, అన్ఎయిడెడ్ జూనియర్ కాలేజీల్లో 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి తొలిదశ అడ్మిషన్లకు ఇప్పటివరకు 2.60 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయన్నారు. బోర్డు ఎక్కడా కొత్తగా ఏ నిబంధననూ మార్పు చేయలేదని వివరించారు. గతంలో ఆఫ్‌లైన్‌లో జరిగే పద్ధతినే ఇప్పుడు ఆన్‌లైన్‌లోకి మార్చామని పేర్కొన్నారు. తొలివిడత ఆన్లైన్ అడ్మిషన్ల దరఖాస్తు గడువు శుక్రవారంతో ముగిసిన నేపథ్యంలో రామకృష్ణ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆన్లైన్ అడ్మిషన్ల వల్ల తల్లిదండ్రులు, విద్యార్థులు కరోనా సమయంలో కాలేజీల చుట్టూ తిరగాల్సిన పని తప్పుతుందన్నారు. ఇంట్లో నుంచే తమకు నచ్చిన కాలేజీలో, కోరుకున్న గ్రూపులో సీటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆధార్, కొన్ని సర్టిఫికెట్ల నంబర్లను నమోదు చేసి విద్యార్థులు ఆన్లైన్ అడ్మిషన్ పొందొచ్చని చెప్పారు. ఎక్కడా ఎవరికీ ఎలాంటి ధ్రువపత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపారు. కాలేజీ యాజమాన్యాలకు కూడా ఆన్లైన్ అడ్మిషన్లవల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. తమ కాలేజీల్లో సీట్లు పొందిన విద్యార్థులను ఫీజులు కట్టించుకొని చేర్పించుకోవడం వరకే వాటి బాధ్యత అని స్పష్టం చేశారు. రామకృష్ణ ఇంకా ఏమన్నారంటే.. నిర్దేశిత ఫీజులనే కళాశాలలు తీసుకోవాలి.. పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సిఫార్సుల మేరకు రాష్ట్రంలోని ప్రైవేటు అన్ఎయిడెడ్ కాలేజీలకు ప్రభుత్వం ఇప్పటికే ఫీజులను ఖరారు చేసింది. ఆ మేరకు మాత్రమే ఆయా కాలేజీలు ఫీజులు తీసుకోవాలి. తల్లిదండ్రులు కూడా నిర్దేశిత ఫీజులను మాత్రమే చెల్లించాలి. ఏ కాలేజీ అయినా ఎక్కువ ఫీజులు డిమాండ్ చేస్తే.. క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. వాటిని ప్రాసిక్యూషన్ చేయించే అధికారం ఇంటర్ బోర్డుకు ఉంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ (రెగ్యులేషన్ ఆఫ్ అడ్మిషన్స్ అండ్ ప్రొహిబిషన్ ఆఫ్ క్యాపిటేషన్ ఫీ) చట్టం–1983లోని సెక్షన్ 9, 10, 11 ప్రకారం ప్రభుత్వం గతేడాది మార్చిలో జీవో 57 ద్వారా బోర్డుకు ప్రత్యేకాధికారాలు కల్పించింది. అందరికీ అందుబాటులో సీట్లు రాష్ట్రంలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు అన్ఎయిడెడ్ సహా ఇతర యాజమాన్యాల్లోని జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియెట్ ఫస్టియర్‌లో 6 లక్షల వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి సీట్లు రావన్న ఆందోళన వద్దు. సెక్షన్‌కు 88 మందిని అనుమతిస్తున్నాం. రిజర్వేషన్ల ప్రకారమే ప్రతి కాలేజీలో సీట్ల భర్తీ ఉంటుంది. కాబట్టి అన్ని వర్గాల వారికి సీట్లు దక్కుతాయి. గతంలో రిజర్వేషన్ల అమలు సరిగా లేనందున కొన్ని కాలేజీల్లో కొందరికి మాత్రమే అవకాశం దక్కేది. దీంతో రిజర్వుడ్ వర్గాల పిల్లలు నష్టపోవాల్సి వచ్చేది. తొలి దశ అనంతరం మిగిలిన సీట్లకు మలివిడత ఆన్లైన్ ప్రవేశాలుంటాయి. గతేడాది మొత్తం 3.20 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది కూడా అంతేస్థాయిలో దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నాం. విద్యార్థుల మేలుకే ఆన్లైన్ సేవలు గతంలో కొన్ని కాలేజీలు విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందిపెట్టేవి. ముఖ్యంగా కరోనా సమయంలో పిల్లలు కాలేజీల చుట్టూ తిరగలేక ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలో ఈ–హాల్‌టికెట్లను బోర్డు ప్రవేశపెట్టింది. బోర్డు వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్‌ను డౌన్లోడ్ చేసుకొని నేరుగా పరీక్షకు హాజరయ్యే అవకాశం కల్పించాం. పరీక్ష ఫీజుల విషయంలోనూ కాలేజీలు విద్యార్థుల నుంచి అధికంగా వసూలు చేసేవి. దీంతో ఆన్లైన్లో చెల్లించే ఏర్పాటు చేయడంతో కార్పొరేట్ కాలేజీల అక్రమాలకు అడ్డుకట్ట పడింది. అలాగే విద్యార్థులు ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ల(టీసీ) విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అంశాన్ని బోర్డు గుర్తించింది. ఈ నేపథ్యంలో నేరుగా బోర్డు నుంచి ఈ–టీసీ జారీ చేసే ప్రక్రియపై దృష్టి సారించాం. దీని ద్వారా విద్యార్థులు నేరుగా బోర్డు వెబ్సైట్ నుంచి టీసీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
అమెరికాలో గూగుల్‌పై కేసు
వాషింగ్టన్: ఆండ్రాయిడ్ యాప్ స్టోర్ ‘గూగుల్ ప్లే స్టోర్’లో ఆరోగ్యకరమైన పోటీని తన విధానాల ద్వారా తోసిపుచ్చుతోందని, దేశ కాంపిటీషన్ చట్టాలను ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ వాషింగ్టన్ డీసీతో పాటు 36 రాష్ట్రాలు దిగ్గజ టెక్నాలజీ కంపెనీ ‘గూగుల్’పై కోర్టులో కేసు వేశాయి. వ్యాపారంలో పోటీని వ్యతిరేకించే ఒప్పందాలు, విధానాలను అవలంబిస్తూ యాండ్రాయిడ్ వినియోగదారులకు సరైన, చవౖMðన ఉత్పత్తులు లభించకుండా చూస్తోం దని ఆరోపించాయి. న్యూయార్క్, నార్త్ కరోలినా, టెన్నెసీ తదితర రాష్ట్రాలు గూగుల్‌పై ఈ దావా వేశాయి. యాప్ డెవలపర్లు వారి డిజిటల్ కంటెంట్‌ను గూగుల్ ప్లే సోర్ట్‌లో కొనుగోలు చేసిన యాప్‌ల ద్వారా, గూగుల్ మధ్యవర్తిగా మాత్రమే అమ్మాలని నిర్దేశిస్తోందని, తద్వారా వారి నుంచి గూగుల్ కమిషన్ సహా పెద్ద ఎత్తున ఆదాయం సముపార్జిస్తోందని ఆయా రాష్ట్రాలు ఆరోపిం చాయి. ‘చాన్నాళ్లుగా ఇంటర్నెట్కు గేట్‌కీపర్‌గా గూగుల్ వ్యవహరిస్తూ వచ్చింది. ఇప్పుడు మన డిజిటల్ డివైజెస్‌కు గేట్ కీపర్‌గా మారింది. తద్వారా మనం రోజూ వాడే సాఫ్ట్‌వేర్‌ను ఎక్కువ ధరకు కొనుక్కోవాల్సి వస్తోంది. తన ఆధిక్యతను ఆసరాగా తీసుకుని పోటీని అక్రమంగా అణచివేస్తోంది. పోటీకి నిలిచిన థర్డ్ పార్టీ యాప్ డెవలపర్ల చిన్న,చిన్న వ్యాపారాలను తొక్కేస్తోంది’ అని న్యూయార్క్ అటార్నీ వ్యాఖ్యానించారు. -
ట్విట్టర్‌పై కేసుల వెల్లువ
నోయిడా/ ఢిల్లీ: కేంద్రంతో ధిక్కార ధోరణి అవలంబిస్తున్న సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్‌పై మంగళవారం మరికొన్ని కేసులు నమోదయ్యాయి. ట్విట్టర్ ఎండీపై యూపీ, ఎంపీ పోలీసులు కేసులు నమోదు చేయగా, ట్విట్టర్‌పై ఢిల్లీ పోలీసులు కేసు పెట్టారు. జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లను వేరే దేశంగా పేర్కొంటూ తమ వెబ్సైట్లో ఓ తప్పుడు మ్యాప్‌ను ప్రదర్శించినందుకు గానూ ట్విట్టర్ సీనియర్ అధికారులపై ఉత్తరప్రదేశ్ పోలీసులు, మధ్య ప్రదేశ్ పోలీసులు వేరువేరుగా కేసులు నమోదు చేశారు. సంస్థ ప్లాట్‌ఫామ్‌పై పిల్లల నీలిచిత్రాలకు యాక్సెస్ ఇస్తున్నందుకు న్యూఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. భారత చిత్రపటాన్ని తప్పుగా చూపారని భజరంగ్‌దళ్ కార్యకర్తల ఫిర్యాదు మేరకు మనీశ్ మహేశ్వరితో పాటు న్యూస్ పార్టనర్ షిప్స్ హెడ్ అమృతా త్రిపాఠిపై యూపీలోని ఖుర్జానగర్ పోలీసు స్టేషన్లో ఐపీసీ సెక్షన్ 505–2, ఐటీ చట్టం 74 కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇదే అంశంపై బీజేపీ నేత ఫిర్యాదు ఆధారంగా మధ్యప్రదేశ్ సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తప్పుడు మ్యాపింగ్ అంశంపై లోతైన దర్యాప్తు జరపాలని ఎంపీ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా రాష్ట్ర డీజీపీని ఆదేశించారు. భారత్‌కు సంబంధించి తప్పుడు మ్యాప్‌ను ట్విట్టర్ సోమవారం తన వెబ్సైట్లో ప్రదర్శించడం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఇలా ఉండగా, కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఖాతాలను ఇటీవల బ్లాక్ చేయడంపై రెండు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఐటీపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ట్విట్టర్‌కు నోటీసులు జారీ చేసింది. చదవండి: Prashant Bhushan: వ్యాక్సిన్ వ్యతిరేక ట్వీట్లు.. షాకిచ్చిన ట్విటర్ -
భూ వ్యవహారంలో రూ.2కోట్ల మోసం
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ భూమి విక్రయిస్తానంటూ నమ్మబలికి రూ.2కోట్లు వసూలు చేసి మోసం చేసిన ఘటనలో నిందితుడిపై జూబ్లీహిల్స్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం ఎంకేపల్లిలో తనకు 12 ఎకరాల 33 గుంటల వ్యవసాయ భూమి ఉందని.. ఇందులో మామిడి తోట ఉందని బంజారాహిల్స్ రోడ్ నంబర్–10కి చెందిన మీర్జా హుస్సేన్ అలీఖాన్ చెప్పడంతో జూబ్లీహిల్స్ రోడ్ నంబర్–10లోని వెంకటగిరి భగవతినగర్‌కు చెందిన ఎస్.భక్తప్రియ అనే మహిళ అతడితో చర్చలు జరిపి రూ.9.45 కోట్లకు బేరం కుదుర్చుకుంది. దీని కోసం అడ్వాన్స్‌గా రూ.2 కోట్లు చెల్లించారు. కాగా నిర్ణీత సమయంలో మిగిలిన డబ్బులు అడ్జెస్ట్ కాకపోవడంతో మరో రెండు నెలలు అదనంగా సమయం ఇవ్వాలని ఆమె కోరింది. అయితే తనకు త్వరగా డబ్బులు కావాలని వేరొకరికి అమ్మేసిన తర్వాత మీరిచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇస్తానంటూ హుస్సేన్ అలీఖాన్ చెప్పాడు. అయితే స్థలం వేరొకరికి అమ్మి నెలలు గడుస్తున్నా డబ్బులు ఇవ్వకపోగా కనీసం ఫోన్లు కూడా ఎత్తకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్ 420, 406 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. (చదవండి: వివాహేతర సంబంధం: మహిళ దారుణ హత్య) -
కర్నూలు వన్‌టౌన్ పీఎస్‌లో చంద్రబాబుపై కేసు నమోదు
సాక్షి, కర్నూలు: కరోనా కట్టడిపై టీడీపీ అధ్యక్షుడు,ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో విషప్రచారం చేస్తున్నారంటూ ఆయనపై కర్నూలు వన్‌టౌన్ పీఎస్‌లో కేసు నమోదైంది. సీనియర్ న్యాయవాది సుబ్బయ్య ఫిర్యాదు మేరకు చంద్రబాబుపై పోలీసులు కేసును నమోదుచేశారు. కర్నూలు కేంద్రంగా ఎన్ 440 అనే స్ట్రెయిన్ వ్యాప్తి అనే అభూత కల్పనను చంద్రబాబు సృష్టించారని సుబ్బయ్య ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు దుష్ప్రచారంతో పలువురి చావుకు కారణమయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు.చంద్రబాబుపై తగుచర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో తెలిపారు. న్యాయవాది సుబ్బయ్య ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు.. చంద్రబాబుపై 188, 505(1)(బి)(2) సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. చదవండి: చంద్రబాబు విష ప్రచారాల వల్లే.. ఇదంతా: సజ్జల -
రెజ్లర్ సుశీల్ కుమార్‌పై కేసు
న్యూఢిల్లీ: భారత మేటి రెజ్లర్ సుశీల్ కుమార్‌పై కేసు నమోదైంది. సుశీల్‌కు చెందిన ఛత్రశాల్ స్టేడియం లోపల మంగళవారం రాత్రి జరిగిన గొడవలో 23 ఏళ్ల సాగర్ అనే రెజ్లర్ మృతి చెందాడు. దాంతో ఈ కేసుకు సంబంధించి 37 ఏళ్ల సుశీల్ కుమార్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఢిల్లీ సీనియర్ పోలీసు ఆఫీసర్ కుమార్ తెలిపారు. సుశీల్ ప్రస్తుతం అందుబాటులో లేడని, అతని కోసం గాలిస్తున్నామని కుమార్ తెలిపారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం, 2012 లండన్ ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన సుశీల్ కుమార్ ఒలింపిక్స్ చరిత్రలో భారత్ తరఫున రెండు వ్యక్తిగత పతకాలు గెలిచిన ఏకైక క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. -
అతిథిలా వచ్చిన కలెక్టర్.. వధూవరులపై కేసు నమోదు
-
వైరల్: అతిథిలా వచ్చిన కలెక్టర్.. వధూవరులపై కేసు నమోదు
అగర్తల: దేశంలో కరోనా విజృంభిస్తూ వీర విహారం చేస్తున్న క్లిష్ట పరిస్థితుల్లో సామాజిక దూరం పాటించడం, సమావేశాలతో పాటు పలు కార్యక్రమాలకు జరుపుకునే విషయంలో ప్రభుత్వాలు కొన్ని ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పరిమిత సంఖ్యలోనే ప్రజలు వేడుకలు జరుపుకోవాలని స్పష్టంగా చేప్తున్నాయి. అయితే ఎవరు ఎంత చెప్తున్నా కొందరు మాత్రం నిబంధనలను ఉల్లంఘిస్తూ కరోనా కేసులు పెరగడానికి పరోక్షంగా కారణమవుతున్నారు. ఓవైపు సామాన్య ప్రజలు కరోనా మహమ్మారితో హడలిపోతుంటే త్రిపురలోని రెండు కుటుంబాలు వారి పెళ్లి వేడుకలను ఆడంబరంగా, భారీ జనసందోహంతో జరపుకున్నారు. కోవిడ్ నిబంధనలు మరిచి పెళ్లి వేడుకలను చేసుకుంటున్న ఆ జంటలపై వెస్ట్ త్రిపుర కలెక్టర్ అడ్డుకుని వారిపై కేసులను నమోదు చేశారు. ఏ ముహూర్తాన పెళ్లి పెట్టుకున్నారో గానీ.. మండపంలోనే ఆ జంటలపై పోలీస్ కేసులు నమోదయ్యాయి. వివరాల్లోకి వెళితే.. ఉత్తర గేట్ ప్రాంతంలోని ప్యాలెస్ కాంపౌండ్‌లో గులాబ్ బాగన్, మాణిక్య కోర్టు అనే రెండు వివాహ మండపాల్లో కరోనా నిబంధనలు పాటించకుండా పెళ్లిళ్లు జరుగుతున్నాయని తెలుసుకున్న ఆ జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్ శైలేష్ కుమార్ యాదవ్.. మొదట తానొక్కడే ఓ అతిథిలా అక్కడికి వెళ్లారు. అక్కడ నిబంధనలకు గాలికి వదిలేసినట్లు కనిపించడంతో సిబ్బంది సాయంతో వారిపై చర్యలు తీసుకున్నారు. పెళ్లి నిర్వాహకులపైనే కాక వధూవరులు వారి కుటుంబ సభ్యులతో సహా అనేక మందిని అరెస్టు చేయాలని ఆ కలెక్టర్ పోలీసులను ఆదేశించారు. అంతేకాదు, ఇంత జరుగుతున్నా పట్టించుకోరా అంటూ పోలీసులపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రెండు కల్యాణ మండపాలపైనా డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద సంవత్సరానికి పైగా నిషేధం విధించారు. ప్రస్తుతం ఈ కలెక్టర్ చర్యలకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. ( చదవండి: ‘బరాత్’లో పీపీఈ కిట్‌తో చిందేసిన అంబులెన్స్ డ్రైవర్ ) -
బాలుడి ఆచూకీ చెబితే రూ.లక్ష!
గీసుకొండ: రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్ జిల్లా రేణి గ్రామానికి చెందిన పలువురు గత ఏడాది కొమ్మాల జాతరలో ఆట వస్తువులు అమ్ముకునేందుకు వచ్చారు. వీరిలో భగర్య ధర్మవీర్– సీత దంపతుల కుమారుడు భగర్య ప్రదీప్(6) అదే ఏడాది మార్చి 10న జాతరలో తప్పిపోయాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయగా పోలీసులతోపాటు, బాలల సంరక్షణ అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. బస్సులపై పోస్టర్లు అంటించినా ఫలితం లేకుండా పోయింది. బాలుడు ఎప్పటికైనా తిరిగి రాకపోతాడా అని తల్లిదండ్రులు కొన్ని నెలల పాటు ఇక్కడే కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించారు. అయితే, బాలుడు తప్పిపోయి ఏడాది గడిచిపోవడంతో పోలీసులకు ఈ కేసు సవాల్‌గా మారింది. కాగా, శనివారం కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి వచ్చిన మామునూరు ఏసీపీ నరేష్కుమార్ బాలుడి ఆచూకీ తెలిపిన వారికి రూ.లక్ష నజరానా అందజేస్తామని ప్రకటించారు. అదేవిధంగా వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. అలాగే, ఈసారి జాతరలో కూడా బాలుడి వాల్‌పోస్టర్లు వేయిస్తామని పేర్కొన్నారు. చదవండి: నిర్లక్ష్యం: స్విమ్మింగ్ పూల్‌లో ఈత నేర్చుకుంటూ.. -
లక్కీ డ్రా గ్యాంగ్..ఇలా చిక్కారు!
జగిత్యాలక్రైం: లక్కీ లాటరీ పేరుతో సామాన్యులకు సభ్యత్వం ఇస్తూ ప్రతీనెల వాయిదాల పద్ధతిలో డబ్బు తీసుకుని డ్రా నిర్వహిస్తూ లక్షలాది రూపాయలు వసూలు చేస్తుండగా జగిత్యాల రూరల్ ఎస్సై చిరంజీవి, జగిత్యాల అర్బన్ మండలం మోతె గ్రామంలో సోమవారం దాడి చేసి 13 మందిపై కేసు నమోదు చేశారు. మోతె గ్రామానికి చెందిన లోకిని చంద్రమౌళి, చైత్రిక ఎంటర్ప్రైజెస్ పేరుతో లక్కీ డ్రా దందా నిర్వహిస్తున్నాడు. అంతే కాకుండా మరో 12 మంది ఆరె ధర్మయ్య, ప్రదీప్, బొల్లం కిరణ్, నర్ర శేఖర్, నాంపల్లి పవన్, చిలుక సతీశ్, నాయిని రాజన్న, వేముల రమేశ్, సతీశ్, రాకేశ్, కొక్కు సందీప్, సామల్ల చందు ఏజెంట్లుగా పని చేస్తున్నారు. ఒక్కో సభ్యుడి నుంచి వారానికి రూ.300 వసూలు చేసి లక్కీ డ్రా నిర్వహిస్తూ పెద్దఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. వీరిని అరెస్ట్ చేసి వీరి వద్ద నుంచి రూ.2.07 లక్షల నగదు, ఆరు రిసీప్ట్ బుక్స్, చైత్రిక ఎంటర్ప్రైజెస్ బుక్లెట్స్ 130, లాటరీ కాయిన్స్ 45, లాటరీ కాయిన్స్ రోలింగ్, ప్లాస్టిక్ కుర్చీలు 70, టెంట్ 1, టేబుల్ ఫ్యాన్స్ 22, పెడెస్టెల్ ఫ్యాన్స్ 2, మిక్చర్ గ్రైండర్స్ 25, గ్యాస్‌స్టౌవ్ 4 స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై తెలిపారు. -
వివేక్ ఒబెరాయ్‌పై కేసు నమోదు
ముంబైలో కరోనా కేసులు పెరుగుతున్నాయని ఒకవైపు ప్రభుత్వం టెన్షన్ పడుతోంది. మరోవైపు సెలబ్రిటీలు కాసింత మైమరిచి ప్రవర్తించి చిక్కులు పడుతున్నారు. నటుడు వివేక్ ఒబెరాయ్‌పై తాజాగా కేసు బుక్ అయ్యింది. ఎఫ్.ఐ.ఆర్ కూడా నమోదైంది. దానికి కారణం హీరోగారి ఉత్సాహం. వేలెంటైన్స్ డే సందర్భంగా వివేక్ తన భార్య ప్రియాంకా అల్వాతో కలిసి హార్లి–డేవిడ్సన్ బైక్ మీద ముంబై వీధుల్లో షికారు చేశాడు. అంతేనా! చుట్టుముట్టిన అభిమానులతో ఫొటోలు దిగాడు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అక్కడి నుంచి సమస్య మొదలైంది. సోషల్ మీడియాలో అతణ్ణి చూసిన నెటిజన్లు ‘మాస్క్ ఏది? హెల్మెట్ ఏది?’ అని ప్రశ్నించడం మొదలెట్టారు. వెంటనే పోలీసులు రంగంలో దిగి హెల్మెట్ లేకుండా బైక్ నడిపినందుకు 500 రూపాయల ఫైన్ వేశారు. అది చెల్లించడం సులభం. భార్య ప్రియాంకా అల్వాతో వివేక్ అయితే మాస్క్ లేకుండా బాధ్యతారహితంగా తిరిగినందుకు సెక్షన్ 269 ప్రకారం కేసు నమోదైంది. మహమ్మారి సమయంలో అది వ్యాపించేలా తిరిగే వ్యక్తులపై ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేయవచ్చు. అయితే ఈ వ్యవహారంలో వివేక్ స్పందన ఇంకా తెలియలేదు. ఒకవైపు భార్యతో కలిసి ఏదో సరదాగా బయలుదేరాడనుకునేవారు ఉండొచ్చు. మరోవైపు ఇలా శిక్షించేలా ఉండాల్సిందే అనేవారూ ఉండొచ్చు. కాని వివేక్ చిన్నవాడేమి కాదు. ఏకంగా నరేంద్రమోది పాత్రను పోషించి ‘పి.ఎం. నరేంద్రమోదీ’ సినిమాలో నటించాడు. ఇంకా పెద్ద సినిమాలలో నటిస్తున్నాడు. కనుక ఈ కేసులు అతణ్ణి ఏమి చేస్తాయో చూడాలి. -
నంబర్ ప్లేట్ వంచితే క్రిమినల్ కేసు: ట్రాఫిక్ అధికారులు
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ చలానా నుంచి తప్పించుకోవడానికి జనాలు ఎలాంటి వింత వింత వేషాలు వేస్తున్నారో కొద్ది రోజుల క్రితమే చెప్పుకున్నాం. చలానా పడకూడదనే ఉద్దేశంతో ఓ మహిళ తన కాలును నంబర్ ప్లేట్‌కు అడ్డంగా పెట్టి.. ఎలా బుక్కయ్యిందో చూశాం. సాధారణంగా ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం వంటివి చేస్తే ట్రాఫిక్ అధికారులు 1,000 రూపాయలలోపే జరిమానా విధిస్తారు. కానీ సదరు మహిళ ఉద్దేశపూర్వకంగా నంబర్ ప్లేట్‌ని కనిపించకుండా కాలు అడ్డుపెట్టడంతో ట్రాఫిక్ అధికారులు ఏకంగా 2,800 రూపాయలు చలానా విధించారు. అత్తారింటికి దారేది సినిమా క్లైమాక్స్ సీన్‌ని మీమ్‌గా ఉపయోగించి చేసిన ఈ ట్వీట్ తెగ వైరలయ్యింది. తాజాగా ఇప్పుడు మరో కొత్త మీమ్‌తో ముందుకు వచ్చారు. ఉద్దేశపూర్వకంగా నంబర్ ప్లేట్ వంచితే బెండు తీస్తామని.. క్రిమినల్ కేసు ఫైల్ చేస్తామని హెచ్చరిస్తూ ట్వీట్ చేశారు. ఈ సారి దీనికి రామ్ ‘రెడీ’ సినిమాను ఎంచుకున్నారు. బ్రహ్మానందం, రామ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం కాంబినేషన్లో వచ్చే సీన్‌ను మీమ్‌గా వాడారు. నంబర్ ప్లేట్ వంచి ప్రయాణం చేస్తున్న ఓ బైక్ ఫోటోతో పాటు ఈ మీమ్‌ని షేర్ చేశారు. ఆ బైక్ ఓనర్ గురించి పబ్లిక్- ‘‘వాడి పాపాన వాడే పోతాడు వదిలేయండి’’ అంటే.. బైక్(బ్రహ్మానందం).. ‘‘వాడి పాపాలకి నేను పోయేలా ఉన్నాను సార్’’ అంటూ షేర్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం తెగ వైరలుతోంది. నవ్వు తెప్పిస్తూనే.. జనాల్లో ఆలోచన కలిగేలా ట్వీట్ చేయడంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తమకు తామే సాటి అని మరోసారి నిరూపించుకున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. ఉద్దేశపూర్వకంగా నంబర్ ప్లేట్ వంచడం/దాచడం నేరం. ఇందుకు వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయబడును. pic.twitter.com/iGr6C21XSX — CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) February 8, 2021 చదవండి: ట్రాఫిక్ చలానా; ఎంత పని జేశినవ్ అక్క..! -
రైతులకు మద్దతు : గ్రెటా థన్‌బర్గ్‌పై కేసు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో నిరసన తెలుపుతున్న రైతులకు మద్దతు పలికిన ప్రముఖ స్వీడిష్ యువ పర్యావరణ ప్రచారకురాలు గ్రెటా థన్‌బర్గ్ (18)పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 120-బీ, 153-ఏ సెక్షన్ల కింద ఆమెపై ఎఫ్ఐఆర్ దాఖలైంది. కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనంటూ ఢిల్లీ సరిహద్దులో ఉద్యమం చేస్తున్న రైతులకు సంఘీభావం తెలుపుతున్నామంటూ ట్వీట్లు చేసిన అనంతరం ఈ పరిణామం చోటు చేసుకుంది. భారతదేశంలో రైతు ఉద్యమంపై స్పందించిన గ్రెటా భారతదేశంలో జరుగుతున్న రైతు ఉద్యమానికి సంఘీభావం తెలుపుతున్నామంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఒక కథనాన్ని కూడా షేర్ చేశారు. ఆ తర్వాత గూగుల్ డాక్యుమెంట్ ఫైల్‌ను షేర్ చేస్తూ చేసిన మరో ట్వీట్ వివాదాస్పదంగా మారింది. ఈ ‘టూల్‌కిట్’ సహాయం చేయాలనుకునే వారి కోసం అని రాశారు. దీంతో భారత ప్రభుత్వంపై అంతర్జాతీయంగా ఒత్తిడి తెచ్చే కార్యాచరణ ప్రణాళికను వివరించే లింక్ ఈ ఫైల్లో ఉందన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. గ్రెటా తర్వాత పాత పోస్ట్‌ను తొలగించి, అప్డేట్ చేసిన ట్వీట్ షేర్ చేసింది.కానీ, అప్పటికే చాలామంది ఆ నోట్‌ను డౌన్లోడ్ చేసుకోవడం గమనార్హం. శాంతియుతంగా ఉద్యమిస్తున్న రైతులకే తన మద్దతు అంటూ ఆమెపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన కొద్ది నిమిషాల తరువాత గ్రెటా మరోసారి నొక్కి వక్కాణించారు. ద్వేషం, బెదిరింపులు, మానహక్కుల ఉల్లంఘనలు ఇవేవీ తనను మార్చలేవంటూ ట్వీట్ చేశారు I still #StandWithFarmers and support their peaceful protest. No amount of hate, threats or violations of human rights will ever change that. #FarmersProtest — Greta Thunberg (@GretaThunberg) February 4, 2021 మరోవైపు గ్రెటా, రిహన్నాకు సపోర్ట్‌గా నిలిచిన బాలీవుడ్ నటులు, క్రికెటర్లపై సినీ నటి కంగన రనౌత్ విరుచుకుపడుతోంది. ఢిల్లీలో ఉద్యమం చేస్తున్న వారు రైతులు కాదు, వారు ఉగ్రవాదులంటూ నోరు పారేసుకుంది. అలాగే ఇండియాను అస్థిరపరిచేందుకు జరుగుతున్న అంతర్జాతీయ రహస్య పత్రాన్ని షేర్ చేసి గ్రెటా అతిపెద్ద తప్పు చేసింది..పప్పూ టీంలో అందరూ జోకర్లే...అంటూ విమర్శించింది. అటు రైతులకు మద్దతుగా ట్వీట్ చేసిన తాప్సీపై కూడా ‘బీ’గ్రేడ్ ఆర్టిస్ట్ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసింది. -
డేటా చోరీ: కేంబ్రిడ్జ్ ఎనలిటికాకు సీబీఐ షాక్!
సాక్షి, న్యూఢిల్లీ: ఫేస్బుక్ వినియోగదారుల వ్యక్తిగత డేటా చోరీ కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. డేటా బ్రీచ్ కేసులో సీబీఐ కేంబ్రిడ్జ్ అనలిటికాపై శుక్రవారం కేసు నమోదు చేసింది. 5.62 లక్షల మంది భారతీయ ఫేస్బుక్ వినియోగదారుల వ్యక్తిగత డేటాను అక్రమంగా సేకరించిందనే ఆరోపణలతో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) యూకేకు చెందిన పొలిటికల్ కన్సల్టింగ్ సంస్థ కేంబ్రిడ్జ్ అనలిటికాపై కేసు నమోదు చేసింది. ఇదే ఆరోపణలతో ఆ దేశానికి చెందిన మరో సంస్థ గ్లోబల్ సైన్స్ రీసెర్చ్ (జీఎస్ఆర్ఎల్) ను కూడా కేసులో చేర్చింది. దీనిపై ఫేస్బుక్ కూడా స్పందించింది. సుమారు 5.62 లక్షల భారతీయ యూజర్ల డేటాను అక్రమంగా సేకరించిన గ్లోబల్ సైన్స్ కంపెనీ అక్ర ఆ డేటాను క్యాంబ్రిడ్జ్ అనలిటికాతో పంచుకుందని తెలిపింది. తద్వారా ఎన్నికలను ప్రభావితం చేసిందని ఆరోపించింది. కాగా దేశంలో ఎన్నికలను ప్రభావితం చేసే లక్క్ష్యంతో కేంబ్రిడ్జ్ ఎనలిటికా భారతీయ ఫేస్బుక్ వినియోగదారుల డేటాను ఉపయోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫేస్బుక్-కేంబ్రిడ్జ్ ఎనలిటికా డేటా చోరీ కేసుపై సీబీఐ దర్యాప్తు చేయనుందని కేంద్ర సమాచా,ప్రసార, సాంకేతిక శాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటించారు. -
కంగనపై మరో కేసు: ‘రూ.100కు యాక్ట్ చేసే గతి పట్టలేదు’
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సూపర్ స్టార్లు సైతం స్పందించడానికి భయపడే అనేక అంశాలపై ‘క్వీన్’ నటి స్పందిస్తారు. నిర్భయంగా.. కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడతారు. ఇక తాజాగా నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఉద్యమం గురించి కంగన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఉద్యమంలో పాల్గొన్న 73 ఏళ్ల వృద్ధురాలు మొహిందర్ కౌర్‌ని చూసి కంగన షాహీన్ బాగ్ దాదీగా భావించి.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘టైమ్స్ మ్యాగ్జైన్ ఈ దాదీని శక్తివంతమైన మహిళగా గుర్తించింది. కానీ ఇమె కేవలం 100 రూపాయల కూలీ కోసం ఇక్కడ కూర్చొని నిరసన తెలుపుతున్నారంటూ’ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. (చదవండి: వివాదాస్పద ట్వీట్.. కంగనకు నోటీసులు) కంగన వ్యాఖ్యలపై తాజాగా మొహిందర్ కౌర్ బతిండ కోర్టులో కేసు నమోదు చేశారు. న్యాయవాది రఘుబీర్ సింగ్ దాఖలు చేసిన ఈ ఫిర్యాదులో కంగన ట్విట్టర్లో తప్పుదోవ పట్టించేలా చేసిన పోస్ట్ కారణంగా, బాధితురాలు మొహిందర్ కౌర్ ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు ప్రజల దృష్టిలో పరువు, ప్రతిష్టం కోల్పోయి.. తీవ్రమైన మానసిక ఉద్రిక్తత, వేదన, వేధింపులు, అవమానం, వంటి వాటితో బాధపడుతోందని పేర్కోన్నారు. ఈ సందర్భంగా మొహిందర్ కౌర్ మాట్లాడుతూ.. ‘తరతరాలుగా మా కుటుంబం వ్యవసాయం మీదనే ఆధారపడి బతుకుతోంది. కేంద్ర తీసుకువచ్చిన చట్టాలు రైతులకు అన్యాయం చేస్తాయి. అందుకు నిరసనగా వేలాది మంది రైతులు రాజధానిలో ఆందోళన చేస్తున్నారు. వారికి మద్దతు తెలపడం కోసం నేను, నా కుటుంబ సభ్యులు ఢిల్లీ వెళ్లి.. ఆందోళనలో పాల్గొని.. రైతులకు మద్దతు తెలిపాం. నాకు 13 ఎకరాల భూమి ఉంది. కేవలం 100 రూపాయల కోసం నటించాల్సిన అవసరం లేదు’ అంటూ మొహిందర్ కౌర్ ఘాటుగా స్పందించారు. ఇక జనవరి 11న దీనిపై విచారణ జరగనుంది. ఇక ఇదే వ్యాఖ్యలపై గతంలో కంగనపై మరో కేసు నమోదయిన సంగతి తెలిసిందే. -
హథ్రాస్ : నిందితుడిపై కేసు నమోదు చేసిన సీబీఐ
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కలకలం రేపిన హథ్రాస్ హత్యాచార కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ నిందితుడిపై కేసు నమోదు చేసింది. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు హథ్రాస్ కేసు దర్యాప్తును యూపీ పోలీసుల నుంచి సీబీఐ స్వీకరించింది. సెప్టెంబర్ 14న బాధితురాలు పొలంలో పని చేసుకుంటూ ఉండగా.. దుండగులు ఆమెను లాక్కెళ్లి అత్యాచారం చేసి.. నాలుక కోసి తీవ్రంగా హింసించిన్నట్టు బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక మెడ, వెన్నెముకకు తీవ్ర గాయాలయిన బాధితురాలిని ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ ఆమె రెండు వారాలపాటు ప్రాణాలతో పోరాడి చివరకు సెప్టెంబర్ 29న కన్ను మూశారు. ఇక హథ్రాస్ ఘటన యూపీ ప్రభుత్వం, రాష్ట్ర పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ కేసు పట్ల యూపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, బాధితురాలి కుటుంబం పట్ల నిర్థాక్షిణ్యంగా వ్యవహరించిందనే విమర్శలు వెల్లువెత్తాయి. బాధితురాలి కుటుంబ సభ్యులను ఇంట్లో బంధించి అర్ధరాత్రి ఆమె మృతదేహానికి పోలీసులు అంత్యక్రియలు నిర్వహించడం దుమారం రేపింది. చదవండి : హథ్రాస్: 60 మంది పోలీసులు.. 8 సీసీ కెమెరాలు -
దర్శకుడిపై అత్యాచారం కేసు
లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. నటి పాయల్ ఘోష్ ఫిర్యాదు మేరకు ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్టు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మంగళవారం రాత్రి నటి పాయల్ ఘోష్ తన లాయర్ నితిన్ సాత్పుటేతో కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు. ఐపీసీ సెక్షన్ 376 (ఐ), 354, 341, 342 సెక్షన్ల కింద అనురాగ్ కశ్యప్‌పై కేసు నమోదయ్యింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతుంది. 2013లో వెర్సోవాలోని యారి రోడ్డులో కశ్యప్ తనపై అత్యాచారం చేశారని నటి పాయల్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏడేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనపై విచారణలో భాగంగా అనురాగ్ కశ్యప్‌ని ప్రశ్నించనున్నట్టు సదరు అధికారి తెలిపారు. మొదట పాయల్ తన లాయర్‌తో కలిసి ఒషివారా పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా.. ఈ ఘటన వెర్సోవా పీఎస్ పరిధిలో జరిగినందు వల్ల అక్కడే ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. వెర్సోవాలో ఘటన జరిగిందని చెప్తుండగా.. అనురాగ్ కశ్యప్ ఆఫీస్ ఒషివారా పరిధిలో ఉంది. ఇక ఈ ఆరోపణలు అనురాగ్ కశ్యప్ కొట్టి పారేసిన సంగతి తెలిసిందే. ఆయన మాజీ భార్యతో సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు అనురాగ్‌కు మద్దతు తెలుపుతున్నారు. (చదవండి: ఈ చెత్తలోకి నన్ను లాగొద్దు: నటి ఫైర్) -
సృష్టి సంతాన సాఫల్య కేంద్రంపై మరో కేసు
సాక్షి, హైదరాబాద్ : యూనివర్సల్ సృష్టి సంతాన సాఫల్య కేంద్రంపై మరో కేసు నమోదైంది. సంతానం కోసం సులక్షణ రాణి అనే దంపతులు కూకట్‌పల్లిలోని కేపీహెచ్‌బీ కాలనీ బ్రాంచ్‌ను సంప్రదించారు. ఈ క్రమంలో విశాఖపట్నం బ్రాంచ్‌లో సరోగసీ ద్వారా బిడ్డను ఇస్తామంటూ యాజమాన్యం వీరి నుంచి డబ్బులు వసూలు చేశారు. విడతల వారీగా ఇప్పటి వరకు బాధితులు రూ.13 లక్షలు ఇచ్చారు. సృష్టి యాజమాన్యం చెప్పిన తేదీన బిడ్డ కోసం విశాఖపట్నం వెళ్లిన దంపతులకు.. సరోగసి చికిత్స తీసుకుంటున్న తల్లి కోవిడ్‌తో మృతి చెందిందని బుకాయింపు మాటలు చెప్పారు. దీంతో బాధిత దంపతులు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయమంతా వెలుగులోకి వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. (‘సృష్టి’ అక్రమాల్లో మరి కొన్ని నిజాలు) -
నన్ను బెదిరిస్తున్నారు : ఇళయరాజా
సాక్షి,చెన్నై: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా-ప్రసాద్ స్టూడియో వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఎల్వీ ప్రసాద్ మనవడు సాయి ప్రసాద్‌పై లయ రాజా తాజాగా మరో కేసు నమోదు చేశారు. సాయి, అతని మనుషులు తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని, తద్వారా తన స్టూడియోను ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఇళయరాజా ఆరోపించారు. ఈ మేరకు ఆయన మేనేజర్ జాఫర్ ఫిర్యాదు దాఖలు చేశారు. ('ఇళయరాజా కేసును రెండు వారాల్లో ముగించండి') ప్రసాద్ స్టూడియోలోని తన సూట్లోకి ప్రవేశించి మరీ సంగీత వాయిద్యాలు, నోట్లు, ఇతర పరికరాలను ధ్వంసం చేశారని చెన్నై కమిషనర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో ఇళయరాజా పేర్కొన్నారు. అంతేకాదు తన విలువైన వస్తువులను అధిక మొత్తానికి విక్రయించుకున్నారని కూడా ఆరోపించారు. సాయి, అతని అనుచరులపై శాశ్వత ఆంక్షలు విధించాలని కోరుతూ సిటీ సివిల్ కోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసినట్లు వివరించారు. ఈ కేసు పెండింగ్‌లో ఉండగానే తనపై దౌర్జన్యం చేసి, బలవంతంగా స్టూడియోను లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారన్నారు. అందుకే స్టూడియోలో తన కార్యక్రమాలకు అడ్డొస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో సాయి ప్రసాద్, అతని అనుచరులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఇళయరాజా డిమాండ్ చేశారు. కాగా చెన్నైలోని ప్రసాద్ స్టూడియోస్ స్థాపకుడు ఎల్వీ ప్రసాద్, ఇళయరాజాపై గౌరవంతో ప్రత్యేక గది ఉన్న స్టూడియో స్థలాన్ని బహుమతిగా ఇచ్చారు. ఇక్కడున్న రికార్డింగ్ స్టూడియోలోనే గత 40 సంవత్సరాలకు పైగా ఆయన తన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే ఎల్వీ ప్రసాద్ కుమారుడు రమేష్ ప్రసాద్ ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరం చెప్పకపోగా, మనవడు సాయి ప్రసాద్ మాత్రం స్టూడియోను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. Veteran music composer #Ilaiyaraaja filed a complaint against Sai Prasad for tampering his musical instruments, notes and valuables by unlawfully entering into his recording studio #PrasadStudios pic.twitter.com/1LyAntffNL — Rajasekar (@sekartweets) July 31, 2020 -
ఇండియాలో ‘ఆడి’కి షాక్
సాక్షి, న్యూఢిల్లీ: జర్మనీ దిగ్గజ కార్ల తయారీ సంస్థ ఫోక్స్ వ్యాగన్‌కు చెందిన మరో సంస్థ ఆడికు దేశంలో తొలి ఎదురు దెబ్బతగిలింది. ఉద్గార నిబంధనలకు సంబంధించిన ఆరోపణలతో దేశంలో తొలిసారిగా కేసు నమోదైంది. నోయిడా నివాసి ఒకరు కంపెనీపైనా, కంపెనీకి చెందిన ఇతర ఉన్నతాధికారులపైనా తాజాగా ఫిర్యాదు చేశారు. ఫోర్జరీ, మోసం, నేరపూరిత కుట్ర లాంటి ఆరోపణలతో సంస్థపై కేసు నమోదైంది. (ఆడి కొత్తకారు వచ్చేసింది) కాలుష్య నివారణకు సంబంధించి, ఉద్గారాల శాతాన్ని తక్కువగా చూపించే మోసపూరిత పరికరాలతో తనను మోసం చేశారని ఆరోపిస్తూ అనిల్ జిత్ సింగ్ ఫిర్యాదు దాఖలు చేశారు. ఫోక్స్ వ్యాగన్, ఆడి ఉన్నతాధికారులతోపాటు, జర్మనీలోని ఆయా సంస్థల ప్రధాన కార్యాలయాల పైనా కూడా ఆయన కేసు పెట్టారు. ఆడి ఇండియా బ్రాండ్ డైరెక్టర్ రాహిల్ అన్సారీ, ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్, ఆడి ఏజీ చైర్మన్ బ్రామ్ షాట్ పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చారు. 2018లో కోట్ల రూపాయల విలువైన ఏడు ఆడి కార్లను కొనుగోలు చేసినట్లు ఫిర్యాదుదారుడు తెలిపారు. డెలివరీ సమయంలో, భారతదేశంలో చీట్ డివైసెస్ గురించి తాను విచారించానని, అయితే అలాంటి దేమీ లేదని చెప్పి తనను మోసం చేశారని ఆయన ఆరోపించారు. దేశంలో నత్రజని ఆక్సైడ్ ఉద్గారాలు అనుమతించిన పరిమితుల కంటే ఆడికార్లలో 5-8 రెట్లు ఉన్నాయని తేలడంతో, నేషనల్ గ్రీన్ ట్రైబ్యూనల్ ఫోక్స్ వ్యాగన్‌పై 500 కోట్ల రూపాయల జరిమానా విధించిన నేపథ్యంలో తాను మేల్కొన్నాని పేర్కొన్నారు. తప్పుడు పత్రాలు, నకిలీ పరికరాలతో ఉద్దేశ పూర్వకంగానే ఈ కంపెనీలు తనను మోసం చేశాయని, తన కష్టార్జితాన్ని దోచుకున్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారంలో అధికారులు సమగ్ర దర్యాప్తు జరిపి తనకు న్యాయం చేయాల్సింగా సింగ్ డిమాండ్ చేశారు. కాగా ఫోక్స్ వ్యాగన్ గ్లోబల్ ఉద్గార నిబంధనల ఉల్లంఘన కుంభకోణంలో చిక్కుకున్న నేపథ్యంలో దేశంలో తాజా కేసు నమోదు కావడం గమనార్హం. పరిమితికి మించి 10-40 రెట్లు ఉద్గారాలను ఉత్పత్తి చేసే పరికరాలను కార్లలో అమర్చుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. మరోవైపు భారత్‌లో విడుదల చేసిన డీజిల్ కార్లలో ‘చీట్ డివైజ్’ కారణంగా పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లిందంటూ ఎన్జీటీ గత ఏడాది మార్చిలో ఫోక్స్ వ్యాగన్‌కు 500 కోట్ల రూపాయల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. -
సుశాంత్‌కి తొలి అవకాశం ఇచ్చింది నేనే
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు కారణమయ్యానంటూ తనపై కేసు పెట్టిన నేపథ్యంలో నిర్మాత ఏక్తాకపూర్ స్పందించారు. సుశాంత్‌కు నటుడిగా తొలి అవకాశమిచ్చింది తానేనని, అలాంటిది తనపైనే కేసు నమోదు కావడం ఆశ్చర్యంగా ఉందన్నారు. సుశాంత్ ఆత్మహత్యకు చిత్రపరిశ్రమలో పాతుకుపోయిన బంధుప్రీతే కారణమంటూ వెల్లువెత్తున్న విమర్శలపై ఏక్తా ఆవేదన వ్యక్తం చేశారు. పవిత్ర రిస్తా టీవీ సీరియల్లో సుశాంత్‌కు ఏక్తా కపూర్ తొలి అవకాశమిచ్చారు. అయితే, సుశాంత్‌కు లీడ్ రోల్ ఇవ్వడానికి చానెల్ తొలుత ఒప్పుకోలేదని, చివరికి సదరు చానెల్‌ను కన్విన్స్ చేసి ఒప్పించానని ఏక్తా కొన్ని వారాల క్రితమే తెలిపిన సంగతి తెలిసిందే. View this post on Instagram Thanku for the case for not casting sushi....when Actually I LAUNCHED HIM. I’m beyond upset at how convoluted theories can b! Pls@let family n frns mourn in peace! Truth shall@prevail. CANNOT BELIEVE THIS!!!!! credit: @jagranenglishnews... A police case has been filed against eight people including Bollywood directors @karanjohar, Sanjay Leela Bhansali and @ektarkapoor along with actor @beingsalmankhan in connection with the death of actor Sushant Singh Rajput, news agency ANI reported on Wednesday . "In the complaint, I have alleged that Sushant Singh Rajput was removed from around seven films and some of his films were not released. Such a situation was created which forced him to take the extreme step," Advocate Sudhir Kumar Ojha was quoted as saying . . . #sushantsinghrajput #sushantsinghrajputdeath #sushantsinghrajpurrip #jagranenglish #instawithjagranenglish #ripsushantsinghrajputsir💔🙏 #ripsushant #ripsushantsinghrajput🙏 #ripsushantsinghrajput💔 #ripsushantsinghrajput🙏🙏 #ripsushantsinghrajput #sushantnomore #salmankhan #salmankhanfans #salmankhanswag #salmankhanmerijaan #salmankhanfilms #salman #salmankhanfanclub #salmankhanfc #karanjohar #karanjoharfilm #karanjoharupdates #karanjoharfan A post shared by Erk❤️rek (@ektarkapoor) on Jun 17, 2020 at 1:26am PDT సుశాంత్ ఆత్మహత్యపై బాలీవుడ్ ప్రముఖులు కరణ్ జోహర్, సల్మాన్ ఖాన్, ఏక్తాకపూర్, సంజయ్ లీలా భన్సాలీ సహా 8 మందిపై బిహార్ ముజఫర్ కోర్టులో బుధవారం కేసు నమోదైన సంగతి తెలిసిందే. సుశాంత్ ఆకస్మి మరణం సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు పలువురిని దిగ్ర్భాంతికి గురిచేసింది. దీంతో అతడి ఆత్మహత్యకు బాలీవుడ్‌లోని కొంతమంది ప్రముఖులే కారణమంటూ న్యాయవాది సుధీర్ కుమార్ ఓజా ముజఫర్‌పూర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జూన్ 14న సుశాంత్ సింగ్ తన ఇంట్లో బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. యువ నటుడి ఆకస్మిక మరణంపై పలువురు దిగ్ర్భాంతికి గురయ్యారు. అంతేకాకుండా బాలీవుడ్లో పేరుకుపోయిన నెపోటిజమ్ వల్లనే సుశాంత్ బలయ్యాడంటూ సామాన్యులు సహా కంగనా రనౌత్, ప్రకాశ్‌రాజ్, అభినవ్ కశ్యప్ లాంటి పలువురు ప్రముఖులు బాహాటంగానే ఆరోపణలు చేశారు. -
టిక్‌టాక్ స్టార్ సోనాలిపై కేసు నమోదు
చండీగఢ్: టిక్‌టాక్ స్టార్ బీజేపీ నేత సోనాలి పోగట్ మీద కేసు నమోదయ్యింది. హర్యానా ధాన్యం మార్కెట్లో అధికారి సుల్తాన్‌సింగ్‌ను చెప్పుతో కొట్టడంతో అతని ఫిర్యాదు మేరకు ఆమెపై శుక్రవారం స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై హిస్సార్ ఎస్పీ గంగారామ్ పునియా మాట్లాడుతూ...‘సుల్తాన్ సింగ్ ఫిర్యాదు మేరకు పోగాట్‌పై కేసు నమోదు చేశాం. ప్రభుత్వ అధికారిని అవమానించిన కేసులో పోగట్‌పై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాం’ అని తెలిపారు. (అధికారిని చెప్పుతో కొట్టిన బీజేపీ నాయకురాలు) సోనాలి ఫొగట్ కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో బాలాస్మంద్‌లోని ధాన్యం మార్కెట్‌ను సమీక్షించేందుకు వెళ్లింది. ఈ క్రమంలో అక్కడున్న మార్కెట్ సెక్రటరీతో ఆమెకు వాదులాట జరిగింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన సోనాలి అతనికి చెంపదెబ్బ రుచి చూపించింది. అంతటితో ఆగకుండా చెప్పు తీసుకుని ఇష్టమొచ్చినట్లుగా కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై సొనాలి మాట్లాడుతూ అతను దుర్భాషలాడుతూ, తనను అవమానించడం వల్లే కొట్టాల్సి వచ్చిందని పేర్కొంది. మార్కెట్ సెక్రటరీ మాత్రం తానేమీ అనకముందే సోనాలి తనపై దాడి చేసిందని చెప్పుకొచ్చాడు. కాగా టిక్‌టాక్‌తో గుర్తింపు సంపాదించుకున్న సోనాలి ఫొగట్‌కు బీజేపీ గతేడాది ఎన్నికల్లో హర్యానాలోని ఆదంపూర్ నియోజకవర్గం నుంచి టికెట్ ఇచ్చింది. ఆమె గెలుపు తథ్యమనుకున్నప్పటికీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఓటమిపాలైంది. (కరోనా: ప్రైవేటులో చార్జీలపై సుప్రీం విచారణ) -
కరోనా బాధితుడిపై కేసు
సాక్షి, గుంటూరు/తెనాలిరూరల్: తెనాలిలో తొలి కరోనా పాజిటివ్ కేసు బాధితుడి, అతని తండ్రి, చెన్నై నుంచి అతన్ని తీసుకువచ్చేందుకు సహకరించిన లారీ ఓనర్, డ్రైవర్‌పై కేసు నమోదైంది. వైరస్ భారినపడిన ఐతానగర్‌కు చెందిన 23 ఏళ్ల యువకుడు చెన్నైలోని ఓ హోటల్లో పనిచేస్తూ హాస్టల్లో ఉంటున్నాడు. ఈ నెల ఒకటో తేదీన చెన్నై కోయంబేడు కూరగాయల మార్కెట్‌కు తెనాలి నుంచి కాయగూరల లోడ్‌తో వెళ్లింది. ఈ లారీ డ్రైవర్ ఫోన్ నెంబర్‌ను చెన్నైలో ఉన్న యువకునికి తండ్రి ఇచ్చి లారీలో తెనాలికి రావాలని సూచించాడు. (కరోనా.. వివక్షను తొలగిద్దాం) దీంతో కాయగూరల లారీలో నాలుగో తేదీ యువకుడు తెనాలిలోని నివాసానికి చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న వలంటీర్లు, వైద్య సిబ్బంది పరీక్షలు జరుపగా ట్రూనాట్ విధానంలో పాజిటివ్ వచ్చింది. తదుపరి పరీక్షల కోసం గుంటూరు పంపగా యువకుడికి కరోనా నిర్ధారణ అయ్యింది. స్థానిక ఏఎన్ఎం ఫిర్యాదు మేరకు లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన కరోనా బాధితుడు, అతని తండ్రి, లారీ ఓనర్ పాలేటి గోపి, డ్రైవర్ సారథిలపై తెనాలి టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. (చిన్నారులు సహా ప్రతి ఒక్కరికీ సాయం) -
పెళ్లి వార్తలపై ఫిర్యాదు
‘హీరోయిన్ లావణ్యా త్రిపాఠిని వివాహం చేసుకుని, ఆపై వదిలేశా’ అంటూ సోషల్ మీడియా ద్వారా శ్రీరామోజు సునిశిత్ అనే వ్యక్తి ఓ దుమారం రేపారు. సునిశిత్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ కథానాయిక లావణ్యా త్రిపాఠి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీరామోజు సునిశిత్ అనే వ్యక్తి కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్నాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారామె. లిఖితపూర్వక ఫిర్యాదును ఆమె తన సహాయకుడి ద్వారా ఏసీపీ కేవీఎమ్ ప్రసాద్‌కు అందజేశారు. ఈ విషయంపై ఏసీపీ కేవీఎమ్ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘శ్రీరామోజు సునిశిత్ అనే వ్యక్తి లావణ్య ఒక్కరిపైనే కాదు.. చాలా మంది సెలబ్రిటీలపైనా లేనిపోని వ్యాఖ్యలు చేశాడు.. ఎవరూ ఫిర్యాదు చేయలేదు. లావణ్యా త్రిపాఠి ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నాం. మహిళల గురించి అసభ్యంగా మాట్లాడితే ఎవరైనా జైలుకు వెళ్లక తప్పదు’’ అన్నారు. -
బాన్సువాడలో నకిలీ డాక్టర్ కలకలం
సాక్షి, బాన్సువాడ టౌన్: బాన్సువాడలోని ఎన్జీవోస్ కాలనీలో నకిలీ వైద్యుడు ప్రజల ఆరోగ్యంతో చలగాటం ఆడుతుండగా ఎంబీబీఎస్ డాక్టర్లు పట్టుకుని, ఎంఐవోకు ఫిర్యాదు చేసిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చాయి. వివరాలు.. పట్టణంలోని ఎన్జీవోస్ కాలనీలో మూడేళ్ల కిత్రం సంగారెడ్డికి చెందిన శ్రీకాంత్‌రెడ్డి అనే వ్యక్తి ఎంబీబీఎస్ డాక్టర్ అంటూ సమన్విత హాస్పిటల్ ఏర్పాటు చేశాడు. పట్టణంలో ఉన్న ఎంబీబీఎస్ వైద్యులకు శ్రీకాంత్‌రెడ్డి రాసే మందుల చీటిలపై అనుమానం వచ్చింది. ఒక రోగానికి మరో మందు రాస్తున్నారని వారు గమనించారు. దీంతో వైద్యులు సమావేశం ఏర్పాటు చేసుకొని నకిలీ వైద్యుడు శ్రీకాంత్‌రెడ్డిని పిలిచారు. ఆయన చదువుకున్న కళాశాల వివరాలు ఆరా తీశారు. దీంతో శ్రీకాంత్‌రెడ్డి ఎంఎన్ఆర్ కళాశాలలో చదివానని, మరో సారి ఢిల్లీ యూనివర్సిటీలో చదివానని తడబడుతు సమాధానం చెప్పారు. తన వద్ద ఉన్న సర్టిఫికేట్‌ను వైద్యులు ఆన్లైన్లో సెర్చ్ చేయగా నకిలీ అని తేలింది. దీంతో వారు శ్రీకాంత్‌రెడ్డిని నిలదీయగా తాను కొంపల్లిలో ఓ ఆస్పత్రిలో పని చేశానని, బోధన్‌కు చెందిన సాయిబాబా తనను బాన్సువాడకు తీసుకువచ్చాడని చెప్పారు. గతంలో ఇక్కడ ఉన్న వైద్యుల వద్ద హాస్పిటల్‌ను రూ.8.50 లక్షలకు కొనుగోలు చేశామని కొన్ని రోజుల తర్వాత సాయిబాబా మోసం చేయడంతో ఒక్కడినే హాస్పిటల్ నడిపిస్తున్నానని చెప్పారు. దీంతో వైద్యులు నిజామాబాద్‌లో ఉన్న ఐఎంవోకు ఫిర్యాదు చేయగా, వారు కామారెడ్డిలో ఉన్న వైద్య ఆరోగ్య శాఖలో నకిలీ వైద్యుడు శ్రీకాంత్‌రెడ్డిపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేస్తారని తెలుసుకున్న శ్రీకాంత్‌రెడ్డి హాస్పిటల్‌కు తాళం వేసి పరారయ్యాడు. ఆయనకు సంబంధించిన హాస్పిటల్ బోధన్‌లో కూడా ఉన్నట్లు తెలిసింది. వేరే మందులు రాస్తుండటంతో.. రోగం ఒకటి ఉంటూ వేరే మందులు రాస్తుండటంతో శ్రీకాంత్‌రెడ్డిపై అనుమానం వచ్చింది. వైద్యులందరం కలిసి ఆయనను పిలిచి సర్టిఫికెట్ల గురించి ఆరా తీయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో ఐఎంవోకు ఫిర్యాదు చేశాం. – కిరణ్‌కుమార్, పిల్లల వైద్య నిపుణుడు, బాన్సువాడ -
జెట్ ఎయిర్వేస్ నరేష్ గోయల్‌కు ఈడీ షాక్
సాక్షి, ముంబై: జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ నరేష్ గోయల్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ( ఈడీ) భారీ షాక్ ఇచ్చింది. మనీలాండరింగ్ కేసులో నరేష్ గోయల్ ఇంటిపై ఈడీ అధికారులు గురువారం దాడులు నిర్వహంచారు. అలాగే గోయల్‌తోపాటు మరికొందరిపై ఈడీ తాజాగా కేసులు నమోదు చేసింది. ముంబై పోలీసులు ఆయనపై కేసులు నమోదు చేసిన నేపథ్యంలో మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద క్రిమినల్ కేసు నమోదైందని ఈడీ అధికారులు తెలిపారు. బుధవారం కూడా ఆయన ఇంటిలో సోదాలు నిర్వహించి, విచారణ చేపట్టామని, దాడులు కొనసాగుతున్నాయని అధికారులు గురువారం తెలిపారు. జెట్‌ఎయిర్‌వేస్‌లో పెద్ద ఎత్తున నిధుల దారిమళ్లింపు సహా పలు అవకతవకలు చోటు చేసుకున్నాయంటూ గత ఏడాది ఆగస్టులో గోయల్, అతని కుటుంబం, ఇతరులపై విదేశీ మారకద్రవ్య చట్ట (ఫెమా) ఉల్లంఘనల ఆరోపణలపై దాడులు నిర్వహించింది. ఇదే కేసులో గత ఏడాది సెప్టెంబర్‌లో గోయల్‌ను విచారించింది. గోయల్‌కు 19 ప్రైవేటు కంపెనీలు ఉన్నాయని, వీటిలో ఐదు విదేశాల్లో ఉన్నాయిని ఈడీ గతంలో ఆరోపించింది. అమ్మకం, పంపిణీ, నిర్వహణ ఖర్చులు ముసుగులో ఈ సంస్థలు "అనుమానాస్పద" లావాదేవీలు జరిగాయన్న ఆరోపణలను ఈడీ పరిశీలిస్తోంది. కాగా అప్పుల సంక్షోభంలో చిక్కుకున్న జెట్ ఎయిర్వేస్ గత ఏడాది ఏప్రిల్‌లో తన కార్యకలాపాలను మూసివేసింది. దీనికి ఒక నెల ముందు, గోయల్ జెట్ ఎయిర్వేస్ చైర్మన్ పదవి నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. -
టిక్‌టాక్, వాట్సప్, ట్విటర్లపై ఎఫ్ఐఆర్
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే తొలిసారిగా టిక్‌టాక్, ట్విటర్, వాట్సప్ యాజమాన్యాలపై కోర్టు ఆదేశాల మేరకు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. దేశానికి వ్యతిరేకంగా మత పరమైన వీడియోలు ఉద్దేశ పూర్వకంగా వైరల్ చేస్తున్నారని సీనియర్ జర్నలిస్ట్ ఎస్. శ్రీశైలం దాఖలు చేసిన పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ తరువాత నాంపల్లి కోర్టు కీలక నిర్ణయం వెల్లడించింది. ఇండియన్ టిక్ టాక్, వాట్సప్ గ్రూప్ ల్లో పాకిస్థాన్ కి చెందిన వారు ఉన్నారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు.సీఏఏ, ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తున్న వీడియోలు పాకిస్తాన్ వారు పెడితే, ఇండియాలో పెట్టినట్లు వైరల్ చేస్తున్నారని పిటిషనర్ కోర్టుకి తెలిపారు. పిటిషనర్ ఆధారాలు పరిగణనలోకి తీసుకొని తగిన చర్యలు చేపట్టాలని సైబర్ క్రైమ్ పోలీసులకు నాంపల్లి కోర్టు సూచించింది. రెండు రోజుల్లో టిక్ టాక్, ట్విట్టర్, వాట్సప్ యాజమాన్యాలకు సైబర్ క్రైమ్ పోలుసులు నోటీసులు ఇవ్వనున్నారు. యాప్ యాజమాన్యాలు పై 153 (A) , 121 (A) ,294, 505, రెడ్ విత్ 156(3) కింద సైబర్ క్రైమ్ పోలుసులు కేసులు నమోదు చేశారు. చదవండి : వాట్సాప్ ద్వారా యథేఛ్చగా వ్యభిచారం -
చిన్నపాటి నేరాలతో పెరుగుతున్న ఈ–పెట్టి కేసులు!
సాక్షి, సంగారెడ్డి: జిల్లాలో ఈ–పెట్టి కేసులు పెరిగిపోతున్నాయి. ఈ–పెట్టి కేసుల్లో ఐపీసీ (ఇండియన్ పీనల్ కోడ్) సెక్షన్లు వర్తించకుండా అత్యవసరంగా ఆన్లైన్లోనే కేసులు నమోదు చేస్తున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేసినా లేదా పోలీసులకు ఆధారాలు లభించినా వీటిపై వెంటనే ఆన్లైన్లోనే పెట్టి కేసులు నమోదు చేస్తున్నారు. న్యూసెన్స్ చేయడం, ఎక్కడపడితే అక్కడ మద్యం సేవించడం, అర్ధరాత్రి వరకు నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలు తెరిచి ఉంచి ఇబ్బంది కలిగించినా ఈ విభాగంలోనే కేసులు నమోదు చేస్తున్నారు. పార్టీల పేరుతో డీజే సౌండ్‌తో ప్రజలకు ఇబ్బంది కలిగించినా, పేకాట ఆడడం నిషేధిత ప్రాంతాల్లో పార్కింగ్ చేయడం, బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం, ఎక్కువ శబ్ధాలతో వాహనాలు నడిపి ఇతరులకు ఇబ్బంది కలిగించడం వంటివి కూడా ఈ–పెట్టి కేసులుగా నమోదు చేస్తున్నారు. ఇక రోడ్లపై అసభ్యంగా ప్రవర్తించడం, డ్రంకెన్ డ్రైవ్ తదితర చర్యలపై పెట్టి కేసుల కింద పరిగణిస్తారు. ఇలాంటి కేసుల్లో వీడియో, ఫొటోలు సాక్ష్యాలుగా లభిస్తే పోలీసులు స్వయంగా ఆన్లైన్లోనే కేసులు నమోదు చేస్తున్నారు. జిల్లాలో పెట్టి కేసులు ఇలా.. పెట్టి కేసుల నమోదును 2018 నుంచి అమలు చేస్తున్నారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డితోపాటు నారాయణఖేడ్, పటాన్చెరు, జహీరాబాద్ పోలీసు సబ్ డివిజన్లు ఉన్నాయి. ఈ సంవత్సరం జనవరి నుంచి గత నెలాఖరు వరకు జిల్లాలో 2,407 పెట్టి కేసులు నమోదయ్యాయి. ఒక్క సంగారెడ్డి పోలీసు సబ్ డివిజన్ పరిధిలోనే 1,626 కేసులు నమోదైనట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. జిల్లా కేంద్రంతోపాటు సదాశివపేట, జోగిపేట, సంగారెడ్డి మున్సిపాలిటీలు సంగారెడ్డి పోలీసు సబ్ డివిజన్ పరిధిలోకి వస్తాయి. జనాభా అధికంగా ఉండడం, వ్యాపార విస్తృతి ఉండడం, మూడు మార్కెట్ కమిటీలు ఈ పరిధిలోకే రావడం, హైదరాబాద్– ముంబై జాతీయ రహదారి (నంబర్ 65), అకోలా–నాందేడ్ జాతీయ రహదారి (నంబర్ 161) ఉండడం, బెంగళూరు–ముంబై జాతీయ రహదారి ఉండడంతో పెట్టి కేసులు అధికంగా నమోదవుతున్నాయి. గజ్వేల్–తూప్రాన్ జాతీయ రహదారి సైతం సంగారెడ్డి సబ్‌డివిజనల్ పరిధిలోకి వస్తుంది. ఈ రహదారుల వెంట హోటళ్లు, దాబాలు రేయింబవళ్లు తెరిచి ఉండడంతో న్యూసెన్స్‌కు కారణమవుతున్నాయి. అంతేకాకుండా పలు పరిశ్రమలు ఉండడం కూడా ఈ కేసులు ఎక్కువ కావడానికి కారణాలవుతున్నాయి. ఇదిలా ఉండగా హైదరాబాద్ నగరానికి సమీపంలో పటాన్చెరులో 454, కర్ణాటక, మహారాష్ట్రలకు సరిహద్దుగా ఉన్న జహీరాబాద్ సబ్ డివిజన్లో 118, నారాయణఖేడ్‌లో 209 కేసులు నమోదయ్యాయి. నమోదు ఇలా.. సాధారణంగా ఏదైనా నేరం రుజువైతే ఐపీసీ (ఇండియన్ పీనల్ కోడ్) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తారు. శిక్షలుపడే విధంగా పోలీసులు చర్యలు తీసుకుంటారు. కాగా పెట్టి కేసులకు మాత్రం ఐపీసీ సెక్షన్లు వర్తించవు. చిన్న నేరాలకు పోలీసులే స్వయంగా లేదా ఎవరైనా ఫిర్యాదు చేస్తే వెంటనే ఆన్లైన్లో పెట్టి కేసు నమోదు చేస్తారు. ఫొటో లేదా వీడియో రూపంలో సాక్ష్యాధారాలను సేకరిస్తారు. ఆధారాల కోసం పోలీసు అధికారులు పరిశోధన చేయాల్సిన పని ఈ కేసుల్లో ఉండదు. ప్రత్యేకమైన అనుమానిత సంఘటనలకు సంబంధించి తప్ప మిగతా వాటిలో పెట్టి కేసులను వెంటనే నమోదు చేస్తారు. పోలీసు పెట్రోలింగ్ అధికారులు, సిబ్బంది వారివద్ద ఉన్న సాక్ష్యాలను ట్యాబ్‌లలో పొందుపరిచి ఆన్లైన్లో అప్లోడ్ చేసి కేసులు నమోదు చేస్తారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా జరిమానా గాని, శిక్షగాని విధిస్తారు. ఇలాంటి కేసులు ఆన్లైన్ కాకముందు మధ్యవర్తుల ద్వారా ఒప్పందంతో కేసులు రాజీ జరిగేవి. ప్రస్తుతం ఆన్లైన్ విధానంలో ఈ–పెట్టి కేసులు నమోదవుతుండడంతో జరిమానా లేదా శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ పెట్టి కేసులు జిల్లాలో అధికంగానే నమోదుతున్నాయి. ఆన్లైన్లో నమోదు చేస్తున్నాం ఈ–పెట్టి కేసులకు సంబంధించి ఎక్కడా కూడా రాజీ లేకుండా వెంటనే ఆన్లైన్లో నమోదు చేస్తున్నాం. న్యూసెన్స్ చేయడం, తోపుడు బండ్లు, బైకులపై అడ్డదిడ్డంగా తిరగడం, డీజే, వేధించడం, రోడ్డు పక్కన, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం.. తదితర వాటిపై వెంటనే స్పందిస్తున్నాం. పోలీసులు స్వయంగా చూసినా, ఎవరైనా ఫిర్యాదు చేసినా ట్యాబ్‌లో ఫొటోలు తీసి కేసులు చేస్తున్నాం. ఎప్పటికప్పుడు ప్రజలు ఈ–పెట్టి కేసులపై ప్రజలతోపాటు పోలీసు సిబ్బందికి అవగాహన కలి్పస్తున్నాం. – శ్రీధర్‌రెడ్డి, డీఎస్పీ, సంగారెడ్డి -
‘పద్మశ్రీ’ లీలాశాంసన్‌పై సీబీఐ కేసు
సాక్షి, చెన్నై: చెన్నైలో కళాక్షేత్రలోని ఆడిటోరియం పునరుద్ధరణ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అక్రమాలను గుర్తించింది. ఆ క్షేత్ర మాజీ డైరెక్టర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత, భరతనాట్య కళాకారిణి లీలా శాంసన్‌పై కేసు నమోదు చేసింది. ఆమెతో పాటు అప్పటి నిర్వాహకులు తదితరులపై కేసులు నమోదయ్యాయి. చెన్నై తిరువాన్నియూరులోని ‘కళాక్షేత్ర’ ఫౌండేషన్‌లో 2006–12 మధ్య కాలంలో ఆడిటోరియం పునరుద్ధరణ కోసం కేంద్ర సాంస్కృతిక విభాగం నుంచి రూ. 7 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులు దుర్విని యోగమైనట్లు ఆరోపణలున్నాయి. -
పోలీస్ స్టేషన్‌కు చేరిన ప్రేమ వ్యవహారం
-
మణిరత్నం సహా 50మందిపై కేసు నమోదు
ముజఫర్‌పూర్: దేశ రాజకీయాల్లో ఆసక్తిరేపిన 50మంది సెలబ్రిటీల లేఖ అంశంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. దిగ్గజ దర్శకుడు మణిరత్నం సహా పలువురు మేధావులపై దేశద్రోహం కేసు నమోదయింది. మూకుమ్మడి దాడులు, హత్యలపై ఆందోళన వ్యక్తం చేస్తూ దేశంలోని వివిధ రంగాల్లో నిష్ణాతులైన 50 మంది సెలెబ్రెటీలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాసినందుకుగాను రామచంద్ర గుహ, మణిరత్నం, అపర్ణా సేన్ తదితరులపై దేశద్రోహం కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. న్యాయవాది సుధీర్ కుమార్ ఓజా దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ సూర్యకాంత్ తివారీ ఆదేశాల మేరకు ఈ ఎఫ్ఐఆర్ నమోదయింది. దాదాపు మూడు నెలల క్రితం దేశంలో అసహనం పెరిగిపోతుందని, మాబ్ లించింగ్ మితిమీరు తున్నాయంటూ అదూర్ గోపాల కృష్ణన్, మణిరత్నం, అనురాగ్ కశ్యప్, శ్యాం బెనగల్ అపర్ణాసేన్, కొంకణ్ సేన్ శర్మ, సౌమిత్రా చటర్జీ, రామచంద్ర గుహ, శుభ ముద్గల్ సహా పలువురు సెలెబ్రిటీలు ప్రధాని మోదీనుద్దేశించి బహిరంగ లేఖ రాశారు. అయితే దీనికి నిరసనగా సుధీర్‌కుమార్ ఓజీ బీహార్ లోని బీహార్ లోని ముజఫర్ నగర్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దేశ ప్రతిష్టను మంటకలిపారని, ప్రధాని అద్భుత పనితీరును నాశనం చేసే విధంగా రాసిన లేఖపై 50 మంది ప్రముఖులు సంతకాలు చేశారని ఆరోపిస్తూ ఓజా కోర్టును ఆశ్రయించారు. తన పిటిషన్‌ను అంగీకరించిన చీఫ్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ సూర్యకాంత్ తివారీ వీరిపై కేసు నమోదు చేయాల్సిందిగా ఆగస్టు 20న ఈ ఉత్తర్వులిచ్చారనీ, ఈ మేరకు సదర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైందని ఓజా చెప్పారు. ప్రధాని మోదీ హయాంలో దేశంలో అసహనం పెరిగిపోతుందంటూ ఏకంగా ప్రధాన మంత్రినుద్దేశించి బహిరంగ లేఖ రాసిన 50 మంది లేఖ రాయడం, ఈ లేఖ వెనుక వామపక్ష భావజాల ప్రభావం వుందని, కమ్యూనిస్టు భావజాలంతోనే వారంతా మోదీని అప్రతిష్ట పాలు చేసేందుకు యత్నించారని కాషాయదళం, దానికి అనుబంధంగా మరో 62 మంది సెలెబ్రిటీలు ఎదురు దాడి లాంటి పరిణామాలు తెలిసిందే. ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకులు శ్యాంబెనగల్, అనురాగ్ కశ్యప్ -
చిక్కుల్లో చిన్మయానంద్
షహజన్‌పూర్ : తాను నిర్వహించే కళాశాలలో న్యాయవిద్యను అభ్యసించిన విద్యార్థినిచే లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానంద్‌పై లైంగిక దాడి అభియోగాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారని భావిస్తున్నారు. అత్యంత భద్రత నడుమ బాధితురాలు సుప్రీం కోర్టులో స్టేట్మెంట్ నమోదు చేయడంతో ఈ దిశగా చిన్మయానంద్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు ముమ్మరం కానుంది. మరోవైపు చిన్మయానంద్ అస్వస్థతకు లోనుకావడంతో షహజన్‌పూర్‌లోని తన ఆశ్రమంలో ఆయనను వైద్యులు పరీక్షించి చికిత్స అందించారు. చిన్మయానంద్ డయేరియాతో బాధపడుతున్నారని, ఆయనకు మధుమేహం ఉండటంతో బలహీనంగా ఉన్నారని పూర్తి విశ్రాంతి తీసుకుంటే పరిస్థితి మెరగువుతుందని వైద్యులు సూచించారు. కాగా చిన్మయానంద్ తనపై ఏడాదిపాటు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆయన నిర్వహించే కళాశాలలో చదివే లా విద్యార్ధిని ఆరోపించిన సంగతి తెలిసిందే. -
టీడీపీ నేతల తీరు పై సర్వత్రా విమర్శలు
-
మాజీ మంత్రి ఆనందబాబుపై కేసు నమోదు
సాక్షి, పట్నంబజారు(గుంటూరు): అక్రమంగా ఓ స్థలంలోని సామాన్లు ఖాళీ చేయించిన విషయంలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబుతో పాటు పలువురిపై కేసు నమోదైంది. గుంటూరు అరండల్‌పేట ఎస్హెచ్ఓ బత్తుల శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం విద్యానగర్‌లో నివాసం ఉండే అద్దంకి శ్రీకృష్ణ అమరావతి రోడ్డు, డొంకరోడ్డు ప్రాంతాల్లో బాలాజీ టెంట్ హౌస్ డెకరేకర్స్ అండ్ లైటింగ్ వ్యాపారం గత కొంతకాలంగా చేస్తున్నాడు. వ్యాపారం నిమిత్తం ఏఈఎల్సీ చర్చి కాంపౌండ్‌లోని మహిమ గార్డెన్స్‌లో ఉన్న కర్లపూడి బాబూప్రకాష్ స్వాధీనంలోని నాలుగున్నర ఎకరాల స్థలాన్ని 2008లో అగ్రిమెంట్ రాసుకున్నారు. రూ.6.50 లక్షలు ఇచ్చి ఆ స్థలంలో కల్యాణమండపం సామాన్లు పెట్టుకునేందుకు మూడు షెడ్డులు నిర్మించారు. ఆ స్థలంపై ఆయనకు 2021 వరకు హక్కు ఉంది. 2015లో కర్లపూడి బాబూప్రకాష్, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు గోడౌన్‌ను ఖాళీ చేయాలని ఇబ్బందులకు గురిచేశారు. ఈక్రమంలో శ్రీకృష్ణ కోర్టును ఆశ్రయించగా వాదోపవాదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 15వ తేదీన శ్రీకృష్ణ కుమారుడు శివసాయి,మరో పది మంది వర్కర్లు ఉండగా, పొక్లెయిన్‌తో పది మందితో కలిసి వచ్చి షెడ్డులను పగులగొట్టి సుమారు రూ.40 లక్షల విలువ చేసే సామగ్రి ఎత్తుకెళ్లినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఆనందబాబు, కర్లపూడి బాబూప్రకాష్‌లపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పిల్లి మృతిపై కేసు
విశాఖపట్నం,సీతమ్మధార(విశాఖ ఉత్తర): కొట్టడంతో పిల్లి మృతి చెందినట్లు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రైల్వే న్యూ కాలనీలోని రేవతి టవర్స్‌లో ప్లాట్ నంబర్ 306లో నివాసం ఉంటున్న కటారి యశోద పిల్లిని పెంచుకుంటున్నారు. రేవతి టవర్స్‌లో గల 402 ప్లాట్‌లో ఉన్న వారు తన పిల్లిని కొట్టినట్లు ఆమె విశాఖ సొసైటీ ప్రొటక్షన్ అండ్ కేర్ ఆప్ యానిమల్స్ సంస్థకు చెందిన పొట్నూరి శ్రీదేవికి ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన శ్రీదేవి నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఏఎస్ఐ భువనేశ్వర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన పిల్లిని పోస్టుమార్టం కోసం వెటర్నరీ ఆస్పత్రికి పంపించారు. -
గంభీర్‌పై కేసు నమోదు
న్యూఢిల్లీ: తూర్పు ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీచేస్తున్న మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. సంబంధిత అధికారుల అనుమతి లేకుండా ఢిల్లీలోని జంగ్పూరలో గురువారం గంభీర్ ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. దీనిపై కేసు నమోదు చేయాల్సిందిగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆదేశించడంతో ఢిల్లీ పోలీసులు గంభీర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఢిల్లీ పోలీసు చట్టంలోని 28/110 సెక్షన్ల కింద గంభీర్‌పై కేసు నమోదు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్ఈస్ట్) చిన్మయి బిశ్వాల్ శనివారం మీడియాకు తెలిపారు. దీనిపై ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి హరీశ్ ఖురానా స్పందిస్తూ...నాటి ర్యాలీపై గంభీర్ సంబంధిత అధికారులనుంచి అనుమతి తీసుకున్నారని, అయితే ఆ ర్యాలీని నిర్దేశిత సమయానికి మించి పొడిగించారని తెలిపారు. దీనిపై పార్టీ న్యాయ విభాగం అవసరమైన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. గంభీర్ దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో అవాస్తవాలు/ వ్యత్యాసాలున్నాయని, రెండు చోట్ల ఓటు గుర్తింపు కార్డును కలిగి ఉన్నారని చట్ట రీత్యా ఇది నేరమని ఆప్ అభ్యర్థి అతీషీ ట్వీట్ చేశారు. -
సినీ నటి భానుప్రియపై కేసు నమోదు
సాక్షి, కాకినాడ: ప్రముఖ నటి భానుప్రియపై తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. తన కుమార్తెను భానుప్రియ ఇంట్లో నిర్భందించి వేధిస్తున్నారని ఆరోపిస్తూ పండ్రవాడకు చెందిన ప్రభావతి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తన కుమార్తె సంధ్యను చెన్నైలోని భానుప్రియ నివాసంలో పనికి పెటినట్టు ప్రభావతి తెలిపారు. అయితే అక్కడ భానుప్రియ సోదరుడు గోపాలకృష్ణ తన కుమార్తెను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. తొలుత తన కుమార్తెతో ఫోన్లో మాట్లాడించేవారిని.. కానీ ఏడాది కాలంగా తన కుమార్తెతో ఫోన్లో కూడా మాట్లాడించడం లేదని పేర్కొన్నారు. తన కుమార్తెతో మాట్లాడించాలని కోరిన పట్టించుకోవడం లేదని.. పైగా తన కుమార్తెపై దొంగతనం కేసు పెడతామని బెదిరిస్తున్నట్టు వెల్లడించారు. పది లక్షల రూపాయలు చెల్లించి తన కుమార్తెను తీసుకెళ్లాలని భానుప్రియ చెబుతున్నట్టు తెలిపారు.దీంతో తాను పోలీసులను ఆశ్రయించినట్టు చెప్పుకొచ్చారు. ప్రభావతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆమె చెబుతున్న దాంట్లో వాస్తవాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు. -
మూడు ధర్మాసనాలు.. ఏడుగురు సింగిల్ జడ్జిలు
సాక్షి, హైదరాబాద్: కేసుల విచారణ సాఫీగా, వేగవంతంగా సాగేందుకు వీలుగా హైకోర్టులో ధర్మాసనాలను, ఆయా న్యాయమూర్తులు విచారించే సబ్జెక్టులను మారుస్తూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్ పాలనాపరమైన నిర్ణయం తీసుకున్నారు. మొన్నటి వరకు నాలుగు ధర్మాసనాలుండగా.. వాటిని మూడుకు కుదించారు. మొదటి ధర్మాసనానికి ఏసీజే జస్టిస్ ప్రవీణ్‌కుమార్, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి నేతృత్వం వహిస్తారు. రెండో ధర్మాసనం.. న్యాయమూర్తులు జస్టిస్ ఎస్వీ భట్, జస్టిస్ మంతోజ్ గంగారావు నేతృత్వంలో పనిచేస్తుంది. మూడో ధర్మాసనానికి న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకటశేషసాయి, జస్టిస్ జవలాకర్ ఉమాదేవి నేతృత్వం వహిస్తారు. మిగిలిన న్యాయమూర్తులు సింగిల్ జడ్జిలుగా వ్యవహరిస్తారు. ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం.. చట్టాలను, చట్ట నిబంధనలను సవాలు చేస్తూ దాఖలయ్యే వ్యాజ్యాలను విచారిస్తుంది. అలాగే ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, హెబియస్ కార్పస్ పిటిషన్లు, పర్యావరణం, కాలుష్యం సంబంధిత వ్యాజ్యాలతో పాటు క్రిమినల్ అప్పీళ్లను, ఉరిశిక్ష ఖరారు వ్యాజ్యాలపై విచారణ జరుపుతుంది. ఇక ఎస్వీ భట్ నేతృత్వంలోని ధర్మాసనం.. ఐటీ ట్రిబ్యునల్ అప్పీళ్లు, ఐటీ కేసులు, సెంట్రల్ ఎక్సైజ్ కేసులు, ఏపీ పునర్విభజన చట్ట నిబంధనలను, జీఎస్టీ, డీఆర్టీ తదితర చట్టాలను సవాలు చేస్తూ దాఖలయ్యే కేసులను విచారిస్తుంది. జస్టిస్ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం.. ఉద్యోగుల సర్వీసు వివాదాలకు సంబంధించిన అప్పీళ్లు, సర్వీసు చట్ట నిబంధనలను సవాలు చేస్తూ దాఖలయ్యే వ్యాజ్యాలపై విచారణ జరుపుతుంది. ఏ ఏ కేసులు.. ఎవరు విచారిస్తారంటే.. ఇక సింగిల్ జడ్జిలుగా జస్టిస్ మంథాట సీతారామమూర్తి.. పురపాలక, రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్, సమాచార హక్కు చట్టం తదితర విషయాలకు సంబంధించిన కేసులపై విచారణ జరుపుతారు. జస్టిస్ ఉమ్మాక దుర్గాప్రసాద్‌రావు.. పంచాయతీరాజ్, భూసేకరణ, పౌర సరఫరాలు, వ్యవసాయం, నీటి పారుదలశాఖ తదితర విషయాలకు సంబంధించిన కేసులను విచారిస్తారు. అలాగే కంపెనీ పిటిషన్లు, కంపెనీల అప్పీళ్లపై కూడా విచారణ జరుపుతారు. జస్టిస్ తాళ్లూరు సునీల్‌చౌదరి.. 2009 నుంచి దాఖలైన క్రిమినల్ అప్పీళ్లు, క్రిమినల్ రివిజన్ పిటిషన్లు (ఏసీబీ, సీబీఐతో సహా) విచారిస్తారు. జస్టిస్ గుడిసేవ శ్యాంప్రసాద్.. విద్యా, యూనివర్సిటీలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, సాంఘిక, మైనారిటీ, బీసీ సంక్షేమ శాఖలు, వైద్య, ఆరోగ్యం తదితర విషయాలకు సంబంధించిన కేసులను విచారిస్తారు. జస్టిస్ తేలప్రోలు రజనీ.. బెయిల్, క్రిమినల్ పిటిషన్లతో పాటు 2008 వరకు దాఖలైన క్రిమినల్ అప్పీళ్లు, క్రిమినల్ రివిజన్ పిటిషన్లపై (ఏసీబీ, సీబీఐ సహా) విచారణ జరుపుతారు. జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు.. సివిల్ రివిజన్ పిటిషన్లు, సెంకడ్ అప్పీళ్లు తదితరాలను విచారిస్తారు. జస్టిస్ కొంగర విజయలక్ష్మి.. హోం, గనులు, పరిశ్రమలు, రవాణా, దేవాదాయ, ఎక్సైజ్, జీఏడీ తదితర విషయాలకు సంబంధించిన కేసులను విచారిస్తారు. ఈ ఏర్పాట్లు ఈ నెల 21వ తేదీ నుంచి తదుపరి మార్పులు చేసేంత వరకు అమల్లో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటయ్యే నాటికి 14 మంది న్యాయమూర్తులుండగా.. ఈ నెల 14న జస్టిస్ బాలయోగి పదవీవిరమణ చేయడంతో న్యాయమూర్తుల సంఖ్య 13కి చేరింది. రాష్ట్ర హైకోర్టులో దాదాపు 1.90 లక్షల వరకు పెండింగ్ కేసులుండే అవకాశం ఉంది. ఇంత తక్కువ మంది న్యాయమూర్తులు ఈ స్థాయి కేసులను విచారించడం చాలా కష్టం. న్యాయమూర్తుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోకుంటే ప్రస్తుత ఉన్న 13 మంది న్యాయమూర్తులు తీవ్రమైన పని ఒత్తిడిని ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది. -
ప్రచారంలో సౌండ్ పెంచితే కేసులే...
సాక్షి, బయ్యారం(ఇల్లందు): ఎన్నికలు వచ్చాయంటే చాలు బరిలో నిలిచిన అభ్యర్థుల ప్రచారంతో మైకులు హోరెత్తుతుంటాయి. తమకే ఓటు వేయాలని పల్లెల నుంచి పట్టణాల వరకు మైకులతో ప్రచారం కొనసాగిస్తుంటారు. విపరీతమైన శబ్దాలను పెట్టడం ద్వారా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉండటంతో ఎన్నికల సంఘం నిబంధనలు విధించింది. నిబంధనలకు విరుద్ధంగా శబ్దాలను పెట్టినట్లయితే సంబంధిత అభ్యర్థిపై కేసులు నమోదు చేయటంతో పాటు జరిమాన విధిస్తారు. నివాసప్రాంతాల్లో 45–55 డెసిబుల్స్, వైద్యశాలలు, విద్యాలయాలు, న్యాయస్థానాల ప్రాంతాల్లో 40–50 డెసిబుల్స్, వ్యాపారప్రాంతాల్లో 55–65 డెసిబుల్స్, పారిశ్రామిక ప్రాంతాల్లో 70–75 డెసిబుల్స్ శబ్దం మాత్రమే వినియోగించాలి. ఇందుకు విరుద్ధంగా వినియోగిస్తే కేసులు నమోదు చేస్తారు. -
‘వారం లోగా చింతమనేనిని అరెస్ట్ చేయాలి’
సాక్షి, విజయవాడ : టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను అరెస్ట్ చేయాలంటూ కమ్యూనిస్ట్ నేతలు డీజీపీని కలిశారు. కొన్ని నెలల క్రితం దళితుడిపై దాడి కేసులో చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కానీ ఈ కేస్‌లో చింతమనేనిపై ఇంతవరకూ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దాంతో సీపీఐ నాయకుడు కె. రామకృష్ణ, సీపీఎం నాయకుడు వైవీ, న్యూడెమోక్రసి నేతలు నెల్లిమర్ల ప్రసాద్, డేగా ప్రసాద్‌లు డీజీపీని కలిసి.. చింతమనేనిని అరెస్ట్ చేయాల్సిందిగా కోరారు. అనంతరం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి అండ చూసుకునే చింతమనేని దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రౌడీయిజం చేసే ఎమ్మెల్యేలను చంద్రబాబు కాపాడుతున్నారంటూ ఆరోపించారు. వారం రోజుల్లోగా చింతమనేనిని అరెస్ట్ చేయకపోతే విజయవాడలో కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు -
వాద్రా, హుడాపై ఎఫ్ఐఆర్
చండీగఢ్: గుర్గావ్లో అక్రమ భూ ఒప్పందాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ బావ రాబర్ట్ వాద్రా, హరియాణా మాజీ సీఎం భూపిందర్‌సింగ్ హుడాలపై శనివారం పోలీసులు కేసు నమోదుచేశారు. సురేందర్ శర్మ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు వాద్రా, హుడాతో పాటు డీఎల్ఎఫ్, ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్ కంపెనీలపై ఎఫ్ఐఆర్ నమోదుచేసినట్లు మనేసర్ డీసీపీ రాజేశ్ చెప్పారు. గుర్గావ్లోని 4 గ్రామాల్లో హౌసింగ్ కాలనీలు, వాణిజ్య సముదాయాల నిర్మాణానికి హుడా సీఎంగా ఉన్న సమయంలో ఇచ్చిన అనుమతుల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలున్నాయి. వీటిపై విచారణకు ఖట్టర్ ప్రభుత్వం 2015లో జస్టిస్ ధింగ్రా కమిటీ వేసింది. వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ 2008లో ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్ నుంచి 3.5 ఎకరాల భూమిని రూ.7.50 కోట్లకు కొనుగోలుచేసి, హుడా పలుకుబడితో వాణిజ్య అనుమతులు పొంది ఆ భూమిని డీఎల్ఎఫ్కు రూ.58 కోట్లకు విక్రయించిందని ఫిర్యాదుదారుడు ఆరోపించారు. -
చిక్కుల్లో అంతకుమించి సినిమా హీరో
-
వ్యాపారులపై క్రిమినల్ కేసులు
ఖమ్మంవ్యవసాయం : ఎటువంటి అనుమతులు, లైసెన్సులు లేకుండా అక్రమంగా వ్యాపారాలు సాగిస్తున్న ఏడుగురిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వీరంతా, ‘కమీషన్ వ్యాపారులు’గా, ‘ఖరీదుదారులు’గా చలామణవుతూ రైతులను నిలువునా దోచుకుంటున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఫిర్యాదుతో వీరిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వీరంతా ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో కొంతకాలం నుంచి అక్రమంగా వ్యాపారాలు సాగిస్తున్నారు. మార్కెట్‌కు వచ్చిన రైతులకు మాయమాటలు చెప్పి, అధిక ధర పెట్టిస్తామంటూ బోల్తా కొట్టిస్తున్నారు. వారి పంటను కమీషన్ వ్యాపారుల ద్వారా ఖరీదుదారులకు చూపిస్తున్నారు. అడ్డగోలుగా కమీషన్లు దండుకుంటున్నారు. పంట విక్రయంలో వాస్తవానికి కమీషన్ వ్యాపారి మాత్రమే కమీషన్ తీసుకోవాలి. వీరు మాత్రం కమీషన్ వ్యాపారుల నుంచి, కొన్నిసార్లు ఖరీదుదారుల నుంచి కూడా (కమీషన్) దండుకుంటున్నారు. సాధారణంగా కమీషన్ రూపాయిన్నర నుంచి రెండ్రూపాయల వరకు ఉంది. వీరు మాత్రం రైతుల నుంచి ఐదారు రూపాయల కమీషన్ గుంజుతున్నారు. పంటను చూసినప్పుడు ఓ ధర నిర్ణయిస్తారు. కాంటాల సమయంలో తిరకాసు పెడతారు. సరుకు బాగా లేదంటారు. తేమ శాతం ఎక్కువగా ఉందంటారు. తక్కువ ధరకు అమ్మేందుకు రైతులు ఒప్పుకోకపోతే.. తమకు అసలు ఆ సరుకు అవసరమే లేదంటూ మధ్యలోనే వెళ్లిపోయేవారు. మరో వ్యాపారి అటువైపు రాకుండా, ఆ సురుకును చూడకుండా ప్రయత్నించేవారు. ఎక్కడి నుంచో వచ్చిన ఆ రైతులు... గత్యంతరం లేని పరిస్థితుల్లో వీరు అడిగిన రేటు/కమీషన్ ఇచ్చేవారు. రైతుల అనైకక్యత, వ్యాపారుల ఐక్యత/సిండికేట్ కారణంగా అధికారులు కూడా ఇన్నాళ్లూ ఏమీ చేయలేకపోయారు. గత ఏడాది ఈ మార్కెట్‌కు పర్సన్ ఇన్చార్జిగా అప్పటి జాయింట్ కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి (ప్రస్తుతం, జనగాం కలెక్టర్) బాధ్యతలు చేపట్టారు. కొద్ది రోజులకే ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఈ–నామ్ అమలయింది. తమ అక్రమాలకు ఇది అడ్డుగా ఉండడంతో కొందరు వ్యాపారులు వ్యతిరేకించారు. ఆ తరువాత, ఇందులోని లొసుగులను పట్టేసుకున్నారు. వాటి ద్వారా తమ అక్రమాలను కొనసాగించారు. మార్కెట్ ఫీజు చెల్లించని వ్యాపారులపై మార్కెటింగ్ శాఖ అధికారులు దృష్టి సారించారు. వినయ్‌కృష్ణారెడ్డి బదిలీతో పర్సన్ ఇన్చార్జిగా కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్ నియమితులయ్యారు. మార్కెట్లో అక్రమాలపై, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రాష్ట్ర మార్కెటింగ్ శాఖ కూడా సీరియస్‌గానే దృష్టి పెట్టింది. మార్కెట్‌కు దాదాపుగా 15లక్షల రూపాయల ఫీజు చెల్లించని ఇద్దరు వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అప్పటికీ ఫలితం లేకపోవడంతో అధికారులు మరో అడుగు ముందుకేశారు. ఎటువంటి లైసెన్స్ లేకుండా వ్యాపారాలు సాగిస్తున్న వారిని గుర్తించే పనిలోకి దిగారు. ఈ క్రమంలోనే, లైసెన్సులకు సంబంధించి ఎటువంటి తాడు–బొంగరం లేని ఏడుగురు ‘వ్యాపారులు/ఖరీదుదారులు’ను గుర్తించారు. మార్కెట్ పర్సన్ ఇన్చార్జ్ (కలెక్టర్) లోకేష్‌కుమార్ ఆదేశాలతో ఆ ఏడుగురిపై ఖమ్మం మూడవ అదనపు మొదటి తరగతి జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని గురువారం మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి రత్నం సంతోష్‌కుమార్ తెలిపారు. వీరికి ఆరు నెలల నుంచి ఏడాది వరకు జైలు శిక్ష పడే అవకాశముందని చెప్పారు. మార్కెట్లో రైతులను మోసగించే, పంట దొంగలపై నిఘా పెంచినట్టు చెప్పారు. -
43 మంది వేధించారు..!
సాక్షి, న్యూఢిల్లీ : పనిచేసే ప్రదేశాల్లో మహిళలకు రక్షణ కరువైంది. నోయిడాలోని ఘజియాబాద్‌కు చెందిన ఓ యువతి 2016 నుంచి ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. తాను పనిచేసే కార్యాలయంలో ఏకంగా 43 మంది సహచర ఉద్యోగులు తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నోయిడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత ఏడాది నుంచి ఉద్యోగులు తనను వేధిస్తున్నారని, కొంత మంది వాట్సప్‌లో తమ ప్రైవేటు అవయవాలను కూడా చూపిస్తూ తనన వేధింపులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కోన్నారు. దీనిపై యూపీ సీఎం యోగి ఆధిత్యానాథ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి కూడా గతంలో ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి 21 మంది పేర్లను ఫిర్యాదులో తెలిపానని, మరికొంత మంది పేర్లు తనకు తెలిదని ఆమె తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు స్పందించిన నోయిడా పోలీసులు విచారణ చేపట్టునున్నట్లు తెలిపారు. పూర్తి విచారణ చేయకుండా ఎవరిని అరెస్ట్ చేయమని, యువతి ఆఫీసులో సీసీ కెమెరాలు పరిశీలించి, నిందితులకు విచారించిన తరువాతనే అరెస్ట్ చేస్తామని తెలిపారు. -
ఏపీ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిపై కేసు
సాక్షి, ఉంగుటూరు: కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ ఏపీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ పై కేసు నమోదయింది. తన కుమారుడు చెరువులో పడి మృతి చెందగా పరిహారంగా వచ్చిన డబ్బును కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సుంకర పద్మశ్రీ ఇవ్వడం లేదని పఠాన్ మరియంబీ అనే మహిళ ఆత్కూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గ్రామదర్శిని కార్యక్రమంలో బాధితురాలు మరియంబీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ దృష్టికి తీసుకురాగా, పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. రెండేళ్ల కిందట తన కుమారుడు ఓ డైరీలో ఫాంలో పనిచేస్తూ ప్రమాదవశాత్తూ పక్కనున్న చెరువులో పడి చనిపోయాడని, డైరీ ఫాం యజమానిపై ఎటువంటి కేసు లేకుండా ఉండేందుకు గానూ సుంకర పద్మశ్రీ మధ్యవర్తిత్వం చేసి డబ్బుకు తీసుకున్నారని మరియంబీ తెలిపారు. యజమాని దగ్గర డబ్బులు తీసుకుని తనకు ఇవ్వకుండా కాజేశారని ఆరోపించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సుంకర పద్మశ్రీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అరాచకాలు బయటపెట్టినందుకే అక్రమ కేసులు: సుంకర పద్మశ్రీ తనపై కేసు పెట్టడంతో సుంకర పద్మశ్రీ స్పందించారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ చేస్తున్న అరాచకాలను బయట పెట్టినందుకు తనపై అక్రమ కేసులు బనాయించారని ఆమె ఆరోపించారు. చిక్కవరంలోని బ్రహ్మలింగయ్య చెరువులో నీరు-చెట్టు కార్యక్రమంలో కోట్ల రూపాయలు దోచుకున్న విషయాన్ని బయటపెట్టినందుకు కక్ష గట్టారని తెలిపారు. టీడీపీ నేతల ప్రోద్బలంతో పఠాన్ మరియంబీ అనే మహిళతో కేసు నమోదు చేయించారని వెల్లడించారు. అసలు ఆమెతో తనకు సంబంధం లేదని, తన కుమారుడు టీడీపీ నేత డైరీ ఫాంలో పడి మృతి చెందితే నాకు న్యాయం చేయాలంటూ ఆ మహిళ తనకు విన్నవించుకున్నదని చెప్పారు. ఆమెకు న్యాయం చేయాలంటూ ఉంగుటూరు పోలీస్ స్టేషన్‌కు పంపిన సంగతి వాస్తవమన్నారు. వంశీమోహన్ నియోజకవర్గ పరిధిలో చేస్తున్న అక్రమాలను బయట పెడుతున్నందుకు ఇప్పటికే నాలుగు కేసులు నమోదు చేయించారని వివరించారు. -
కులాంతర వివాహం చేసుకుందని..
నెల్లూరు జిల్లా /గూడూరు: ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న కుమార్తెను ఆమె తల్లిదండ్రులు కోర్టు ఆవరణ నుంచే బలవంతంగా లాక్కెళ్లారు. అడ్డొచ్చిన ఆమె భర్త బంధువులను కొట్టారు. ఈ ఘటన పట్టణంలో శనివారం సంచలనం రేకెత్తించింది. పోలీసుల సమాచారం మేరకు.. చిల్ల కూరు మండలం వల్లిపేడుకు చెందిన నిండలి రఘురామయ్య, సంపూర్ణమ్మ కుమారుడు రాధాకృష్ణ నెల్లూరులోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తుండేవాడు. ఈ క్రమంలో అదే ప్రాంతంలో ఉన్న ఎస్కే మీరామోహిద్దీన్ కుమార్తె అస్మాతో రాధాకృష్ణకు పరిచమై, ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. రెండేళ్ల పాటు ప్రేమించుకున్న వీరి పెళ్లికి పెద్దలు అభ్యంతరం చెప్పడంతో, రెండు నెలల క్రితం ఎదురించి వెళ్లిపోయి పెళ్లి చేసేసుకున్నారు. దీంతో అస్మా తల్లిదండ్రులు నెల్లూరులోని దర్గామిట్ట పోలీస్‌స్టేషన్‌లో తమ కుమార్తెను రాధాకృష్ణ కిడ్నాప్ చేశాడని ఫిర్యాదు చేశారు. దీంతో వారు ఆ జంటను పిలిపించగా, వారిద్దరూ మేజర్లమని, తమ ఇష్ట పూర్వకంగానే పెళ్లి చేసుకున్నట్లు చెప్పడంతో.. చేసేది లేక పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపేశారు. పెద్దలకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నామని, భవిష్యత్‌లో తమ తల్లిదండ్రుల నుంచి తమకు ప్రమాదముందని కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఇరు కుటుంబాల వారికి, నోటీసులు వెళ్లగా ఇరువురి పెద్దలతో పాటు, దంపతులు శనివారం వాయిదాకు కోర్టుకు హాజరయ్యారు. ఈ క్రమంలో అవకాశం కోసం ఎదురు చూస్తున్న అస్మా తల్లిదండ్రులతో పాటు వారి బంధువులు ఇదే అదనుగా ఆమెను బలవంతంగా లాక్కెళ్లి కారులో ఎక్కించే ప్రయత్నం చేశారు. రాధాకృష్ణతో పాటు అతని తండ్రి, వారి బంధువులు కూడా అడ్డుకునే యత్నం చేయడంతో వారిని కొట్టి అస్మాను కారులో తీసుకెళ్లిపోయారు. ఈ మేరకు రాధాకృష్ణ రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
వీవీపై అక్రమ కేసు విరమించుకోవాలి
డాక్టర్ వరవరరావు తెలుగు సాహిత్యంలో సుప్ర సిద్ధ రచయిత. అరవై ఏళ్ల నుంచి కవిగా, రచయి తగా, విమర్శకుడిగా, పరిశోధకుడిగా సాహిత్య కృషి చేస్తున్నారు. సముద్రం, చలినెగళ్లు, ఆ రోజులు లాంటి కవితా సంపుటాలను ప్రచురిం చారు. ‘తెలంగాణ విమోచనోద్యమ నవలల’పై విలువైన పరిశోధనను చేశారు. ఈ పరిశోధన వివిధ విశ్వవిద్యాలయాలలో రెఫరెన్స్‌గా ఉంది. ‘భూమి తో మాట్లాడు...’ లాంటి కల్పనా సాహి త్యంపై విమర్శ గ్రంథాలను రాశారు. వరంగల్ లోని సి.కె.ఎం. కళాశాలలో సుదీర్ఘ కాలం తెలుగు అధ్యాపకులుగా, కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. కవిగా, రచయితగా, వక్తగా, ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాహిత్య విశ్లే షకుడిగా ఆయనకు దేశవ్యాపిత గుర్తింపు ఉంది. తెలుగు సమాజంలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడం కోసం ఆయన నక్సలైట్లకు, ప్రభు త్వానికి మధ్య జరిగిన చర్చలలో ప్రతినిధిగా పాల్గొని తన బాధ్యతను నిర్వహించారు. వరవరరావు 1970లో ఏర్పడిన విప్లవ రచ యితల సంఘం వ్యవస్థాపక సభ్యుడు. ప్రజాకవి శ్రీశ్రీ, కాళోజీలతో కలిసి పనిచేశారు. ఆయన నమ్మిన విలువల కోసం, సిద్ధాంత రాజకీయాల కోసం అరవై ఏళ్లుగా రాజీ లేకుండా పనిచేస్తు న్నారు. ఇట్లాంటి వ్యక్తులు మన సమాజంలో ఉండటం సామాజిక చలనానికి అదనపు కూర్పు. భిన్న భావాలు కలిగి ఉండటమనే ప్రజాస్వామిక సూత్రానికి ఆయన లాంటి వాళ్లు ఒక ఉదాహరణ. భారత సమాజం మొదటి నుంచి అన్ని ఆలో చనలకు నిలయంగా ఉంది. వరవరరావు విప్లవా చరణ సాహిత్యంలోనే కానీ ఇతరేతర రూపాలలో కాదని మేము నమ్ముతున్నాం. విప్లవ పార్టీల చర్యలతో ఆయనకు సంబంధం ఉండే అవకాశం లేదు. రచయిత స్వేచ్ఛగా తన భావాలను వ్యక్తం చేసే అవకాశం ఉన్నప్పుడే సృజనాత్మక సాహిత్యం వికసిస్తుంది. భావాలను ఆధారంగా చెబుతున్న లేఖలో వరవరరావు ప్రస్తావనను ఆధారం చేసు కుని రచయితను వేధించడం సరైంది కాదు కనుక మహారాష్ట్ర పోలీసులు అక్రమ కేసులో ఆయనను ఇరికించే ప్రయత్నాన్ని విరమించుకోవాలని మేము విజ్ఞప్తిచేస్తున్నాము. వరవరరావుపై అక్రమ కేసును మోపే ప్రయత్నాన్ని విరమించుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. (నిఖిలేశ్వర్, నందిని సిధారెడ్డి, పొత్తూరి వెంకటేశ్వరరావు, కె.రామచంద్రమూర్తి, కె.శ్రీని వాస్, గద్దర్, అంపశయ్య నవీన్, పాశం యాద గిరి, ఓల్గా, విమలక్క, దేవిప్రియ, యాకూబ్, కాత్యా యని విద్మహే, గోరటి వెంకన్న, సురెపల్లి సుజాత, విల్సన్ సుధాకర్, కొండేపూడి నిర్మల, జయధీర్ తిరుమలరావు. నగ్నముని, కె.శివారెడ్డి, ఖాదర్ మొహినుద్దిన్ తదితర 35 మంది రచయితలు, కవులు, కళాకారులు) -
సారూ..నా భర్తను విడిపించండి
పరిగి : పోలీసులు అరెస్టు చేసిన తన భర్తను విడిపించాలని పరిగి మండల పరిధిలోని జాఫర్‌పల్లికి చెందిన పద్మ అనే మహిళ మంత్రి మహేందర్‌రెడ్డికి విన్నవించింది. మంగళవారం మండల పరిధిలోని జాఫర్పల్లిలో ఏర్పాటు చేసిన గోదాముల ప్రారంభోత్సవానికి మంత్రి విచ్చేయగా ఆయనకు మొరపెట్టుకుంది. అయితే మంత్రి వచ్చే కంటే ముందే గోదాములు నిర్మించిన సమయంలో చిన్నపాటి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. జాఫర్‌పల్లికి చెందిన పీఏసీఎస్ డైరక్టర్ లాల్‌కృష్ణ ప్రసాద్ మంత్రి కార్యక్రమానికి ముందు హల్చల్ చేశాడు. తనతో పాటు గ్రామస్తులకు చేసిన పనులు, మెటీరియల్‌కు సంబంధించి కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వాలని పేర్కొన్నాడు. డబ్బులు ఇవ్వకుండా గోదాములు ప్రారంభిస్తే తమ డబ్బులు ఎవరిస్తారని అక్కడే ఉన్న కాంట్రాక్టర్‌తో వాగ్వాదానికి దిగాడు. అక్కడే ఉన్న కొందరు టీఆర్ఎస్ నాయకులు కల్పించుకుని మంత్రి కార్యక్రమంలో గొడవ చేయొద్దని ఏమైనా ఉంటే తరువాత చూసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో వాగ్వాదం ఎక్కువైంది. మరికొద్దిసేపట్లో మంత్రి వస్తాడనగా పోలీసులు లాల్‌కృష్ణను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తలరించారు. కొద్దిసేపటికే మంత్రి రావటంతో లాల్‌కృష్ణ ప్రసాద్ భార్య తన భర్తను విడిపించాలని మంత్రిని కలిసి మొరపెట్టుకుంది. పోలీసులతో మాట్లాడతానని మంత్రి చెప్పి కార్యక్రమం ముగించుకని వెళ్లి పోయారు. ఇద్దరిపై కేసు నమోదు మంత్రి పర్యటన సమయంలో కాంట్రాక్టర్‌ను బెదిరించటంతో పాటు అతనితో గొడవకు దిగారనే కారణంతో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేయటంతో పాటు వారిపై కేసు నమోదు చేశారు. జాఫర్‌పల్లికి చెందిన లాల్‌కృష్ణప్రసాద్, అదే గ్రామానికి చెందిన వెంకటయ్యలపై కేసు నమోదు చేశామని ఎస్సై కృష్ణ తెలిపారు. మంత్రి పర్యటన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మరో నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. -
భర్త వేధింపులతో గర్భిణి మృతి
మంచిర్యాలక్రైం: భర్త వేధింపులతో అనారోగ్యానికి గురై గర్భిణి మృతి చెందింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్‌కు చెందిన నిమ్మకంటి శ్రీలత (22) బెల్లంపల్లికి చెందిన ఎండీ అజ్గర్‌తో ఏడు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో శ్రీలత కుటుంబ సభ్యులు కొంత కాలంగా ఇంటికి రానియ్యలేదు. తరుచూ వేధింపులకు గురి చేస్తూ రోజు చిత్రహింసలకు గురి చేస్తున్న క్రమంలో వారం రోజుల క్రితం పుట్టింటికి వచ్చింది. అప్పటికే శ్రీలత నాలుగు నెలల గర్భిణి. దీంతో అనారోగ్యానికి గురై సరైన వైద్యం అందక మృతి చెందింది. ఆమె మృతికి భర్త అజ్గర్ కారణమని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్సై వెంకటేశ్వర్ తెలిపారు. -
సహజీవనం చేసి చంపేశాడు
ఖానాపూర్: సహజీవనం సాగిస్తున్న వ్యక్తే ఆ మహిళ పాలిట కాలయముడయ్యాడు. మద్యం మత్తులో క్షణికావేశానికి లోనై నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి ఖానాపూర్ సీఐ ఆకుల అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. కడెం మండలం పెద్దూరుకు చెందిన టేకం బుజ్జిబాయి(43)కు ఇరవై ఏళ్ల క్రితం రాజు అనే వ్యక్తితో వివాహం జరిగింది. గత కొన్నేళ్లుగా భర్తతో దూరంగా ఉంటున్న బుజ్జిబాయికి మండల కేంద్రంలోని ఓ వసతిగృహంలో పనిచేసే టేకం బాపురావుతో పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరు రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఆరు నె లల క్రితం ఉపాధి నిమిత్తం ఖానాపూర్లోని మండలం రాజురా గ్రామంలోని బుజ్జిబాయి సోదరుడు ఆ త్రం గంగారాం వద్దకు వెళ్లారు. గంగారాం వారిని గ్రామానికి చెందిన గోగు రాజలింగు వద్ద మొక్కజొన్న కావలి పనికి కుదిర్చాడు. గత నెల 24న బుజ్జిబాయి, బాపురావు మొక్కజొన్న చేను వద్దకు వెళ్లారు. మద్యం మత్తులో ఉన్న బాపురావు బుజ్జిబాయితో గొడవకు ది గాడు. క్షణికావేశంతో పక్కనే ఉన్న కర్రతో ఆమె తలపై దాడి చేశాడు. రక్తం మడుగులో ఉన్న బుజ్జిబాయిని చూసి అక్కడినుంచి పారిపోయాడు. మరునాడు సం ఘటన స్థలానికి వచ్చి చూడగా బుజ్జిబాయి మృతి చెందడం గమనించి పారిపోయాడు. అదే రోజు య జమాని గోగు రాజలింగు బుజ్జిబాయి మృతదేహాన్ని చూశాడు. సోదరులు మల్లేశ్, చిన్నరాజన్న, నారాయణ సహకారంతో మృతదేహాన్ని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి పడేశాడు. 29న బుజ్జిబాయి తమ్ముడు గంగారాంకు తెలియజేసి ఇరువురు కలిసి మృతదేహాన్ని అక్కడే ఖననం చేశారు. అనంతరం ఈ నెల 2న కడెంలో ఉండే మరో సోదరుడు ఆత్రం బాపురావు, గంగారాం కలిసి పెంబి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు రాజూరాలోని గంగారాం ఇంటికి వచ్చిన టేకం బాపురావును అరెస్టు చేశారు. అతడిపై హత్య కేసు నమోదు చేశారు. అలాగే సాక్ష్యాధారాలు తారుమారు చేసేందుకు ప్రయత్నించిన ఆత్రం రాజలింగు, గోగు రాజలింగు, గోగు మల్లేశ్, గోగు చిన్నరాజన్నలపై ఐపీసీ 201 కింద కేసులు నమోదు చేశారు. గోగు నారాయణ పరారీలో ఉండగా, మిగతా నిందితులను రిమాండ్ చేశామని సీఐ అశోక్, ఎస్సై సంజీవ్‌కుమార్ తెలిపారు. -
420 గురుస్వామి..!
తల్లాడ: ఆయనొక గురుస్వామి. ఓ మహిళ ఫిర్యాదుతో ఆయనపై ‘420’ సెక్షన్ కింద తల్లాడ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఎస్ఐ మేడా ప్రసాద్ తెలిపిన వివరాలు... ఖమ్మం నగరానికి చెందిన గూడూరు రమాదేవి, మద్యానికి బానిసగా మారిన తన భర్త రవిని దానికి (మద్యానికి) దూరం చేయాలని కోరుతూ తల్లాడకు చెందిన గురుస్వామి పస్తం రంగారావును ఆశ్రయించింది. దీనికి గురుస్వామి అంగీకరించాడు. ఇందుకుగాను పదివేల రూపాయలు ఖర్చవుతుందన్నాడు. ఆ మొత్తాన్ని అతడికి ఆమె ఇచ్చింది. ఆమె పలుమార్లు గురుస్వామి వద్దకు వచ్చి పూజలు చేసింది. అయినప్పటికీ ఫలితం కనిపించకపోవడంతో తానిచ్చిన డబ్బును తిరిగివ్వాలని కోరింది. పూజలు చేసినందుకు డబ్బంతా ఖర్చయిందని, తానేమీ తిరిగివ్వలేనని ఆ గురుస్వామి బదులిచ్చాడు. ఆమె గట్టిగా అడగడంతో ‘‘చేతబడి చేసి నిన్ను చంపుతా’’ అని బెదిరించాడు. ఆమె భయపడింది. తల్లాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎస్ఐ మేడా ప్రసాద్, ఆ గురుస్వామిపై శుక్రవారం 420 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు జరుపుతున్నారు. -
పదో తరగతి పరీక్షకు ఒకరికి బదులు మరొకరు
ధర్మారం(ధర్మపురి): ఒకరికి బదులు మరొకరు పదో తరగతి పరీక్ష రాస్తూ పట్టుబడ్డారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని ఖిలావనపర్తి మారుతీ విద్యాలయం పదోతరగతి విద్యార్థులకు మండలంలోని దొంగతుర్తి హైస్కూల్ పరీక్షా కేంద్రం కేటాయించారు. మారుతీ విద్యాలయంలో పదోతరగతి చదువుతున్న కోల మహేష్, పెండ్యాల శ్రీనివాస్ పరీక్షలు రాయాల్సి ఉండగా... వీరికి బదులుగా ఇంటర్ చదువుతున్న ఇదే గ్రామానికి చెందిన మామిడిశెట్టి పవన్‌కుమార్, సామంతుల హరీష్ కేంద్రానికి వచ్చారు. ప్రశ్నాపత్రం.. ఆన్సర్షీట్ తీసుకున్న విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా ఇన్విజిలేటర్‌కు అనుమానం వచ్చి సంతకాలు పరిశీలించారు. తేడాగా కనిపించడంతో నిలదీశారు. దీంతో విద్యార్థులు అసలు విషయం చెప్పారు. పెద్దపల్లి ఏసీపీ హాబీబ్‌ఖాన్, సీఐ నరేందర్ దొంగతుర్తి పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. పదో తరగతి విద్యార్థులకు బదలుగా ఇంటర్ విద్యార్థులను ప్రొత్సహించి పరీక్షలు రాయించిన మారుతీ విద్యాలయం కరస్పాండెంట్ కొమురయ్య, విద్యార్థులు కోల మహేష్, పెండ్యాల శ్రీనివాస్, ఇంటర్ విద్యార్థులు మామిడిశెట్టి పవన్‌కుమార్, సామంతుల హరీష్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. -
మద్యం సేవించి బస్సు నడిపిన డ్రైవర్
చేవెళ్ల: మద్యం సేవించి బస్సు నడుపుతున్న ఆర్టీసీ బస్‌డ్రైవర్‌పై చేవెళ్ల పోలీసులు డ్రంక్‌అండ్‌డ్రైవ్ కేసు నమోదు చేశారు. వికారాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (టీఎస్ 07 యూఏ 2073) శంకర్పల్లి–చేవెళ్ల మధ్య తిరుగుతుంది. గురువారం ప్రయాణికులతో తిరుగుతున్న బస్సు డ్రైవర్ టి.మురళిగౌడ్ ప్రవర్తనలో ప్రయాణికులకు తేడా కనిపించింది. దీంతోపాటు మద్యం సేవించినట్లుగా వాసనరావడంతో ప్రయాణికులు చేవెళ్ల బస్‌స్టేషన్‌లో బస్సును నిలిపివేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి బ్రీత్‌ఎన్‌లైజర్‌తో చెక్‌చేయడంతో డ్రైవర్ మురళీగౌడ్ మద్యం సేవించినట్లు 179 శాతం రిపోర్టు వచ్చింది. దీంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
రెవెన్యూ అధికారులను అరెస్టు చేయాలి
బెల్లంపల్లి : రామగౌడ్ ఆత్మహత్యకు కారకులైన రెవెన్యూ అధికారులను అరెస్టు చేయాలని మాలమహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుసుమ భాస్కర్, జిల్లా అధ్యక్షుడు ఆసాది మధు, పట్టణ అధ్యక్షుడు కుంబాల రాజేశ్ డిమాండ్ చేశారు. పట్టణంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్లో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ పల్ల మహేష్ అనే వ్యక్తికి తప్పుడు కుల ధ్రువీకరణ పత్రం అందజేయడంతోనే రామగౌడ్‌పై అట్రాసిటీ కేసు నమోదైందని తెలిపారు. ఈ నేపథ్యంలో తహసీల్దార్, సర్పంచ్ తదితర అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు నగేష్, రవిరాజ్, గోపాల్, శ్రీధర్, చక్రధర్, ఆకాష్, సమ్మయ్య పాల్గొన్నారు. -
కనిమొళిపై కేసు నమోదు చేయండి
సాక్షి, కరీంనగర్: తమిళనాడులోని డీఎంకే ఎంపీ కనిమొళిపై కేసు నమోదు చేయాలని కరీంనగర్ కోర్టు ఆదేశించింది. తిరుమల వెంకటేశ్వర స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు బేతి మహేందర్‌రెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఆమెపై 153ఏ, 153బి, 295ఏ, 298, 504, 505 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని త్రీ టౌన్ పోలీసులను అడిషనల్ మున్సిఫ్ మేజిస్ట్రేట్ ఆదేశించారు. -
ఆలయ మడిగల కబ్జా- నిందితులకు జైలు
ఎల్బీనగర్(హైదరాబాద్): ఆలయానికి చెందిన మడిగలను కబ్జా చేసిన కేసులో నలుగురు నిందితులకు రంగారెడ్డి జిల్లా కోర్టు జైలు శిక్ష విధించింది. ఎల్బీ నగర్‌లోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయం పరిధిలో 102 మడిగలు(దుకాణాలు) ఉన్నాయి. వీటిలో 76, 77 మడిగలలో మల్లారెడ్డి అనే వ్యక్తి ఇరవయ్యేళ్లుగా కిరాయికి ఉంటున్నాడు. అయితే 2011లో నకిలీ పత్రాలు సృష్టించి వాటిని తన భార్య పేరుపై ఇతను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. దీనిపై ఆలయ చైర్మన్ రాజేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును విచారించిన రంగారెడ్డిజిల్లా కోర్టు రెండో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కవితాదేవి మంగళవారం తీర్పు చెప్పారు. ప్రధాన నిందితుడు మల్లారెడ్డి, మరో ముగ్గురికి ఏడాది జైలు, రూ.3వేల చొప్పున జరిమానా విధించారు. -
శ్రీ మందిరంతో సెల్ఫీ ముచ్చట
సాక్షి, భువనేశ్వర్/పూరీ: శ్రీ జగన్నాథుని దేవస్థానం సెల్ఫీ ముచ్చట ముప్పుగా మారింది. శ్రీ మందిరం దేవస్థానం ప్రాంగణంలో మొబైల్ కెమెరా, వీడియో రికార్డింగ్ నిషేధం. ఈ చర్యలకు పాల్పడిన యాత్రికుల వర్గం మొబైల్ వీడియో చిత్రీకరణ ఫేస్బుక్లో ప్రసారం చేసి చిక్కుల్లో పడ్డారు. ఇద్దరు వ్యక్తుల్ని నిందితులుగా గుర్తించిన సింహద్వార్ ఠాణా పోలీసులు శుక్రవారం కేసులు నమోదు చేసినట్లు ప్రకటించారు. పూణే నుంచి విచ్చేసిన ఆకాష్ మడకా, రాయ్‌పూర్ నుంచి వచ్చిన జుగొలొ కిషోర్ వైష్ణవ్‌లపై కేసుల్ని నమోదు చేసినట్లు సింహద్వార్ పోలీసులు పేర్కొన్నారు. శ్రీ జగన్నాథ ఆలయం పరి పాలన విభాగం దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా నిందితులకు వ్యతిరేకంగా కేసుల్ని నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు. శ్రీ జగన్నాథ ఆలయ చట్టం, సాంకేతిక సమాచార చట్టం-2000 కింద నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. శ్రీ మందిరం దేవస్థానం ప్రధాన ప్రాంగణంలో కొయిలి వైకుంఠొ (కోవెల శ్మశాన వాటిక), భోగమండపం, రత్న భాండాగారం, లోపలి ప్రాంగణం వగైరా ప్రముఖ చిత్రాల్ని వీడియో రికార్డ్ చేసి నిందితులు ఫేస్బుక్లో అప్లోడ్ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
అనుమతి 20వేలకు.. వచ్చింది 70వేల మంది
హైదరాబాద్: రెండు రోజుల క్రితం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన లంబాడీల ఐక్య వేదిక సభ నిర్వహుకులపై ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సభకు 20వేలమంది హాజరుకు అనుమతిస్తే 70వేల మందిని తీసుకువచ్చారని పోలీసులు చెబుతున్నారు. పైగా సభకు వచ్చిన వారికి తగ్గట్లుగా ప్రాథమిక సౌకర్యాలు కూడా కల్పించకపోవడంతో కొందరు బహిరంగ మూత్ర విసర్జన చేశారన్నారు. డీజేకు అనుమతి ఇవ్వకున్నా డీజే వాడారని, నాయకుల ప్రసంగాలలో ప్రభుత్వాన్ని దూషించారని తెలిపారు. ఈ కారణాలతో సభకు అనుమతి కోసం దరఖాస్తు చేసిన తెలంగాణ గిరిజన ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సురేష్‌పై సిటీ పోలీసు యాక్టులోని 188, 290, 336-76 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
టాయిలెట్ కట్టాలంటే కోరిక తీర్చమన్నాడు..
రాయ్‌గఢ్: మరుగుదొడ్డి నిర్మించడానికి అనుమతి ఇవ్వాలంటే తన కోరిక తీర్చాలని ఓ మహిళ(32)ను ప్రభుత్వాధికారి వేధించిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లాలో జరిగింది. రాయ్‌గఢ్‌లోని తెందూదిపాలో ‘క్లీన్ ఇండియా’ పథకం కింద బాధితురాలి ఇంట్లో నిర్మిస్తున్న మరుగుదొడ్డి అక్రమమనీ, దాన్ని వెంటనే నిలిపివేయాలని రాయ్‌గఢ్ మున్సిపల్ కార్పొరేషన్ గతంలో నోటీసులిచ్చింది. దీంతో బాధితురాలు అన్ని ఆధారాలను సబ్ ఇంజినీర్ ఐపీ సారథికి సమర్పించారు. మరుసటి రోజు బాధితురాలికి ఫోన్‌చేసిన సారథి.. మరుగుదొడ్డి నిర్మాణానికి అనుమతి కావాలంటే తన కోరిక తీర్చాలన్నాడు. ఒప్పుకోకుంటే అక్రమ నిర్మాణం పేరుతో ఇంటినీ కూల్చేస్తానన్నాడు. ఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో సారథిపై కేసు నమోదుచేశారు. -
కమల్‌పై కేసు నమోదు
సాక్షి,న్యూఢిల్లీ: హిందూ తీవ్రవాదంపై వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు కమల్ హాసన్‌పై కేసు నమోదైంది. ఆయనపై ఐపీసీ సెక్షన్లు 511, 298, 295(ఏ), 505(సీ) కింద అభియోగాలు నమోదు చేశారు. కమల్ ఇటీవల రాసిన ఓ వ్యాసంలో దేశంలో హిందూ తీవ్రవాదం పెచ్చరిల్లిందని, హిందూ తీవ్రవాదం లేదని ఎవరూ ప్రశ్నించలేరని, హిందువుల్లోనూ తీవ్రవాదం ప్రబలిందని కమల్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపిన విషయం తెలిసిందే.త్వరలో రాజకీయ పార్టీని ప్రారంభించనున్న కమల్‌పై నమోదైన అభియోగాలపై శనివారం విచారణ నిర్వహిస్తారు. కమల్ హాసన్‌పై నమోదైన ఆరోపణలకు, నమోదైన సెక్షన్లను పరిశీలిస్తే..సెక్షన్ 500 కింద కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు శిక్ష విధిస్తారు. 511 కింద నేరాలకు పూనుకోవడం, సెక్షన్ 298 కింద పరుష వ్యాఖ్యలతో ఏ వ్యక్తి మతపరమైన భావాలు దెబ్బతినేలా వ్యవహరించడం, సెక్షన్ 295(ఏ) కింద మత విశ్వాసాలాను, మతాన్ని కించపరచడం ద్వారా ఏ వర్గంవారి మత భావాలను దెబ్బతీయడం, సెక్షన్ 505(సీ) కింద ఒక వర్గం, మతాన్ని ఇతర మతం, వర్గంపై దాడులకు పురికొల్చేలా వ్యవహరించడం వంటి అభియోగాలను కమల్ హాసన్‌పై నమోదు చేశారు. -
జకీర్ నాయక్‌పై ఎన్ఐఏ చార్జిషీటు
ముంబై: వివాదాస్పద ఇస్లాం మత ప్రబోధకుడు జకీర్ నాయక్‌పై జాతీయ భద్రత సంస్థ (ఎన్ఐఏ) ముంబైలోని ప్రత్యేక కోర్టులో చార్జిషీటు దాఖలు చేసింది. రెచ్చగొట్టే ప్రసంగాలతో దేశంలోని కొన్ని వర్గాల మధ్య విభేదాలు పెంచిపోషించటం, యువతను ఉగ్రవాదంలోకి తీసుకురావటం వంటి అభియోగాలతో నాలుగు వేల పేజీలతో కూడిన చార్జిషీట్‌ను దాఖలు చేసినట్లు ఎన్ఐఏ అధికారులు గురువారం విలేకరులకు తెలిపారు. ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్న జకీర్ నాయక్‌పై ఎన్ఐఏ ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సాయం అందిస్తుండటంతోపాటు మనీల్యాండరింగ్ ఆరోపణలతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. జకీర్ నాయక్ ప్రసంగాలతో స్ఫూర్తి పొందిన ఉగ్రవాదులు గత ఏడాది జూలైలో బంగ్లాదేశ్‌లోని ఢాకాలో ఉగ్రదాడికి దిగారు. -
అజ్ఞాతంలో నటుడు సంతానం
తమిళసినిమా (చెన్నై): ప్రముఖ నటుడు సంతానంపై హత్యా బెదిరింపుల కేసు నమోదైంది. దీంతో అతను అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలిసింది. తమిళ చిత్ర పరిశ్రమలో సంతానం హాస్యనటుడిగా ఎదిగి, అనంతరం కథానాయకుడిగా రాణిస్తున్నారు. ఈయన చెన్నై, వలసరవాక్కం, చౌదరినగరానికి చెందిన కాంట్రాక్టర్ షణ్ముగసుందరంతో కలసి కుండ్రత్తూర్ సమీపంలోని కోవూర్ ప్రాంతంలో కల్యాణ మండపాన్ని కట్టడానికి సన్నాహాలు చేశారు. అందుకు తన భాగంగా భారీ మొత్తాన్ని షణ్ముగసుందరానికి ఇచ్చారు. తరువాత కల్యాణ మండపం నిర్మాణాన్ని విరమించుకున్నారు. దీంతో తను చెల్లించిన డబ్బును తిరిగి ఇవ్వవలసిందిగా షణ్ముగసుందరంను సంతానం అడగ్గా కొంత డబ్బు మాత్రం ఇచ్చి మిగిలిన డబ్బును ఇవ్వకండా కాలం గడపడంతో సోమవారం సంతానం తన మేనేజర్ రమేష్‌తో కలసి వలసరవాకంలోని షణ్ముగసుందరం కార్యాలయానికి వెళ్లి డబ్బు తిరిగి ఇవ్వవలసిందిగా డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఇరువురి మధ్య వాగ్వాదం పెరిగి కొట్టుకునే స్థాయికి వెళ్లింది. ఆ సమయంలో షణ్ముగసుందరంతో పాటు, ఆయన మిత్రుడు, స్థానిక బీజేపీ నాయకుడు, న్యాయవాది ప్రేమానంద్ ఉన్నారు. కొట్లాటలో ఈ ముగ్గురికీ దెబ్బలు తగిలాయి. నటుడు సంతానం వెంటనే స్థానిక వడపళనిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. అదే ఆస్పత్రిలో షణ్ముగసుందరం చేరారు. కాగా, బీజేపీ నాయకుడు ప్రేమానంద్‌కు గాయాలయ్యాయన్న విషయం తెలిసిన పార్టీ కార్యకర్తలు ఆస్పత్రికి వచ్చి ఆందోళనకు దిగారు. అనంతరం సోమవారం రాత్రి వలసరవాక్కం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సంతానంపై కేసు నమోదు చేసి ఆయనను అరెస్ట్ చేయాలని ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు సంతానంపై మూడు సెక్షన్లలో కేసు నమోదు చేశారు. అనంతరం ఆయనను విచారించడానికి ప్రయత్నించగా సంతానం అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలిసింది. దీంతో సంతానంను ఏ క్షణంలోనైనా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ సంఘటన కోలీవుడ్‌లో కలకలానికి దారితీసింది. -
చిన్నారిని చంపుతామని బెదిరించి.. గ్యాంగ్ రేప్
ముజఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఆస్పత్రి నుంచి బైక్‌పై ఇంటికొస్తున్న ఓ జంటను అడ్డగించిన నలుగురు దుండగులు భర్త, 3 నెలల చిన్నారి ముందే మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. భర్తను తీవ్రంగా కొట్టి చెట్టుకు కట్టేసిన దుండగులు.. సదరు మహిళను పొలంలోకి ఈడ్చుకెళ్లి, చిన్నారిని చంపేస్తామని తుపాకీతో బెదిరించి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద కారుతో పాటు ఆయుధాలు కూడా ఉన్నాయన్నారు. అత్యాచారం చేసిన అనంతరం ఈ విషయం పోలీసులకు చెబితే చంపేస్తామని బెదిరించి దుండగులు పరారైనట్లు వెల్లడించారు. ఈ దంపతుల అరుపులు విని అటుగా వచ్చిన రైతులు పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించడంతో పాటు బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి గుర్తుతెలియని నలుగురు దుండగులపై కేసు నమోదు చేసినట్లు ముజఫర్‌నగర్ రూరల్ ఎస్పీ అజయ్ సహదేవ్ తెలిపారు. గతేడాది జూలైలో యూపీలోని బులంద్‌షహర్‌లో కారులో వెళ్తున్న ఓ కుటుంబంపై దాడిచేసిన దుండగులు అందర్నీ సమీపంలోని పొలంలోకి ఈడ్చుకెళ్లారు. అనంతరం అందర్నీ చెట్టుకు కట్టేసి తల్లి, కూతుళ్లపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. -
రైతుల తిరుగుబాటు
కోట, న్యూస్‌లైన్ : మండలంలోని తిన్నెలపూడి ఇసుక రీచ్ నుంచి యథేచ్ఛగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణాపై రైతులు తిరుగుబాటు చేశారు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 18 వాహనాలను రైతులు అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. స్వర్ణముఖి చల్లకాలువ రీచ్‌లో నిబంధనలకు విరుద్ధంగా తవ్వేసి ఇసుకను అక్రమ రవాణా చేస్తుండటంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఈ రీచ్ నుంచి ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తరలించి చిట్టేడు, గూడలి సమీప పొలాల్లో డంపింగ్ చేసి రాత్రి పూట చెన్నైకు అక్రమంగా లారీల్లో తరలిస్తున్నారు. ఎక్కువగా రాత్రి సమయంలోనే ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు నిఘా బృందాలు ఏర్పాటు చేసి, కేసులు నమోదు చేయాలని ఉన్నతాధికారులు సూచించినా ఫలితం లేదు. రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం మామూళ్ల మత్తులో జోగుతూ ఇసుక అక్రమ రవాణాదారుల నుంచి భారీగా ముడుపులు అందుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు స్థానిక రైతులందరూ ఒక్కటయ్యారు. వెంకన్నపాళెం, తిన్నెలపూడి గ్రామాల రైతులు శనివారం స్వర్ణముఖి చల్లకాలువ రీచ్ వద్దకు వెళ్లి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తుండగా అడ్డుకున్నారు. 18 ట్రాక్టర్లను కోట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో కొన్ని ట్రాక్టర్లను తప్పించేందుకు తహశీల్దార్ కార్యాలయం సిబ్బంది ప్రయత్నించారు. దీంతో రైతులు వారితో వాదనకు దిగడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తవ్వేస్తుండటంతో గ్రామాల్లో సాగు,తాగు నీటి సమస్యలు ఎక్కువయ్యాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో ఇసుక అక్రమరవాణాదారుల నుంచి బెదిరింపులు కూడా వస్తున్నాయన్నారు. వీరికి అధికారుల అండదండలు ఉన్నాయని ఆరోపించారు. పట్టించిన వాహనాలను వదలవద్దని, కేసులు నమోదు చేయాలని కోరారు. పట్టుబడిన ట్రాక్టర్లను మైనింగ్ అధికారులకు అప్పగిస్తామని ఎస్ఐ వీరనారాయణ తెలిపారు. -
ఎస్.కోట టీడీపీ అభ్యర్థిపై కేసు నమోదు
శృంగవరపుకోట, న్యూస్‌లైన్ : ఎన్నికల ప్రచారంలో భాగంగా అనుమతి లేకుండా సభ నిర్వహించినందుకు టీడీపీ అభ్యరి మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారిపై ఎస్.కోట పోలీసు లు కేసు నమోదు చేశారు. వసి గ్రామంలో ఆదివారం రాత్రి 9 గంట ల సమయంలో టీడీపీ నేతలు సభ నిర్వహిస్తున్నారన్న సమాచారం అం దుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు గ్రామానికి వెళ్లి వీడియో రికార్డింగ్ చేస్తుండగా టీడీపీ నేతలు తలోదిక్కుకు చెల్లాచెదురయ్యారు. ఎన్నిక ల కోడ్ అమల్లో ఉండగా అనుమతులు లేకుండా సభ నిర్వహించడంపై మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, శోభా స్వాతిరాణి, రెడ్డి వెంకన్న, రాయవరపు చంద్రశేఖర్, జి.ఎస్.నాయుడు, ఆడారి రమేష్, ఎర్రా గోపి, యేడువాక అప్పలనాయయుడు, జనపురెడ్డి తాతబాబులపై కేసులు నమోదు చేసినట్టు ఎస్.కోట ఎస్.ఐ ఎస్.కె.ఎస్.ఘనీ చెప్పారు.