జూబ్లీహిల్స్‌లో ఓ మైనర్‌పై అత్యాచార ఘటన దేశంలోనే సంచలనంగా మారింది. పోలీసులే నిందితులకు అండగా ఉన్నారని బీజేపీ, కాంగ్రెస్ నేతల ఆరోపణల నేపథ‍్యంలో ఈ కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.
ఇదిలా ఉండగా.. ఆదివారం ఈ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అమ్నీషియా పబ్ కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మరో మైనర్‌తో పాటు ఉమేర్‌ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఇప్పటికే అరెస్ట్ అయిన వారిలో ఇద్దరు మైనర్లు, ఒక మేజర్ ఉన్నారు. కాగా, నిందితులంతా రాజకీయ నేతల కొడుకులుగా పోలీసులు గుర్తించారు.
నిందితులు వీరే..
A1.. సాదుద్దీన్(ఎంఐఎం నేత కొడుకు)
A2.. ఉమేర్‌ఖాన్(ఎమ్మెల్యే సోదరుడి కొడుకు)
మైనర్-1.. వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు
మైనర్-2.. ఎంఐఎం కార్పొరేటర్ కొడుకు
మైనర్-3.. సంగారెడ్డి మున్సిపల్ కో-ఆప్షన్ మెంబర్ కొడుకు ఉన్నారు.
ఇదిలా ఉండగా.. మైనర్‌పై అత్యాచార కేసుపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరా రాజన్ స్పందించారు. ఈ ఘటనపై నివేదికను సమర్పించాలని సీఎస్, డీజీపీని ఆదేశించారు. 2 రోజుల్లో నివేదికను అందించాలని ఆదేశించారు. మరోవైపు.. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితులు.. లైంగిక దాడి అనంతరం కారులో మొయినాబాద్‌కు వెళ్లారు. అక్కడ ఓ రాజకీయ నేతకు చెందిన ఫాంహౌస్‌లో ఆశ్రయం పొందారని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: అత్యాచారం ఘటనపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కేసీఆర్‌కు బండి లేఖ
Comments
Please login to add a commentAdd a comment