jubliee hills police
-
అత్యాచారం కేసులో నటుడు అరెస్ట్... క్యారవాన్‌లో ఉంచమని భార్య రిక్వెస్ట్
'సార్.. మా ఆయన సినిమా హీరో.. లాకప్‌లో దోమలు, ఈగలు, వేడితో ఇబ్బందులు పడుతున్నాడు.. దయచేసి క్యారవాన్‌లో ఉండటానికి అనుమతివ్వండి' అంటూ ఓ యువతి పోలీసులను వింత కోరిక కోరింది. రేప్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్టైన కొత్తగా మా ప్రయాణం సినిమా హీరో ప్రియాంత్‌రావు భార్య జూబ్లీహిల్స్ పోలీసులకు పెట్టుకున్న విన్నపం ఇది. సదరు యువతి.. 'క్యారవాన్ సైతం తీసుకొచ్చాను.. రాత్రంతా అందులో ఉండటానికి అనుమతి ఇవ్వండి' అని కోరడంతో పోలీసులు నోరెళ్లబెట్టారు. చట్టం అందుకు ఒప్పుకోదని పోలీసులు చెప్పగా క్యారవాన్ పోలీస్‌స్టేషన్ ఆవరణలోనే ఉంచుతామని సిబ్బంది ఎందుకని ఎదురు ప్రశ్నించింది. రూల్స్ ఒప్పుకోవమ్మా అంటూ పోలీసులు నచ్చజెప్పినా గంటపాటు భర్తను క్యారవాన్‌లో ఉంచేందుకు పోలీసులను బతిమిలాడి విఫలమైంది. సినీ నటుడు ప్రియాంత్‌రావు ఓ జూనియర్ ఆర్టిస్టును ప్రేమ పేరుతో మోసం చేశాడు. పెళ్లిమాట ఎత్తేసరికి దిక్కున్నచోట చెప్పుకో అంటూ దూషించాడు. దీంతో బాధితురాలు పోలీసులుకు ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడిపై అత్యాచారంతో పాటు అట్రిసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నిందితుడిని గురువారం రిమాండ్‌కు తరలించారు. -
జూనియర్ ఆర్టిస్ట్‌పై అత్యాచారం.. యంగ్ హీరో అరెస్ట్!
సాక్షి, హైదరాబాద్: వర్ధమాన నటుడు ప్రియాంత్ రావును జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ పేరుతో వంచించి అత్యాచారం చేశాడంటూ ప్రియాంత్‌పై ఓ మహిళా జూనియర్ ఆర్టిస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అత్యాచారంతో పాటు కులం పేరుతో దూషించాడని సదరు మహిళా ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారిలో ఉన్న ప్రియాంత్‌ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘కొత్తగా మా ప్రయాణం’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ప్రియాంత్. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఓ జూనియర్ ఆర్టిస్ట్‌తో పరిచయం ఏర్పడింది. ప్రేమ పేరుతో ఆమెను నమ్మించి.. అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో ఆమె గర్భం దాల్చగా.. హీరో మొహం చాటేశాడు. అంతేకాదు అబార్షన్ కోసం మెడిసిన్ ఇవ్వడంతో బాధితురాలు ఆరోగ్యం పాడైపోయింది. ఈ విషయం బయటకు చెప్తే చంపేస్తానని బెదిరించడంతో.. ప్రాణభయంతో జులై 9న పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి పరారిలో ఉన్న నిందితుడిని .. తాజాగా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. -
పబ్ కేసులో మరో ట్విస్ట్.. కోర్టును ఆశ్రయించిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఆమ్నేషియా పబ్ కేసు దేశంలోనే చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పటికే పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో భాగంగా తెలంగాణ పోలీసులు.. హైకోర్టును ఆశ్రయించారు. ఆరుగురు(ఐదుగురు మైనర్లతో సహా సాదుద్దీన్) నిందితుల డీఎన్ఏ సేకరణ కోసం పోలీసులు కోర్టును ఆశ్రయించారు. నిందితుల డీఎన్ఏ సేకరణ కోసం జువైనల్ బోర్డుతోపాటు కోర్టు అనుమతిని సైతం పోలీసులు కోరారు. దీంతో, ఆరుగురు నిందితుల డీఎన్ఏను సేకరించి పోలీసులు ల్యాబ్‌కు పంపనున్నట్టు స్పష్టం చేశారు. ఇన్నోవాలో సేకరించిన ఆధారాలతో అధికారులు.. డీఎన్ఏను సరిపోల్చనున్నారు. కాగా, విచారణలో సైంటిఫిక్ ఎవిడెన్స్‌గా డీఎన్ఏ రిపోర్టు కీలకం కానుంది. ఇదిలా ఉండగా, అవసరమైతే బాధితురాలి డీఎన్ఏ శ్యాంపిల్ కూడా తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు.. కేసులో బాధితురాలి స్టేట్మెంట్ను పోలీసులు ఇప్పటికే కోర్టులో సబ్మిట్ చేశారు. ఈ క్రమంలోనే నిందితుల పాస్‌పోర్టులను కూడా సీజ్ చేయాలని పోలీసులు.. కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వారికి బెయిల్ లభిస్తే.. దేశం విడిచి వెళ్లిపోయే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. కాగా, నిందితుల బెయిల్ పిటిషన్‌ను కోర్టు ఇప్పటికే తిరస్కరించింది. ఇది కూడా చదవండి: గచ్చిబౌలి: పబ్‌లో మైనర్లతో పార్టీ నిర్వహణ.. బడా నేత ప్రమేయం! -
జూబ్లీహిల్స్ పబ్ కేసు: చిక్కిన నిందితులు.. వారి బ్యాక్ గ్రౌండ్ ఇదే..
జూబ్లీహిల్స్‌లో ఓ మైనర్‌పై అత్యాచార ఘటన దేశంలోనే సంచలనంగా మారింది. పోలీసులే నిందితులకు అండగా ఉన్నారని బీజేపీ, కాంగ్రెస్ నేతల ఆరోపణల నేపథ్యంలో ఈ కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇదిలా ఉండగా.. ఆదివారం ఈ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అమ్నీషియా పబ్ కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మరో మైనర్‌తో పాటు ఉమేర్‌ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఇప్పటికే అరెస్ట్ అయిన వారిలో ఇద్దరు మైనర్లు, ఒక మేజర్ ఉన్నారు. కాగా, నిందితులంతా రాజకీయ నేతల కొడుకులుగా పోలీసులు గుర్తించారు. నిందితులు వీరే.. A1.. సాదుద్దీన్(ఎంఐఎం నేత కొడుకు) A2.. ఉమేర్‌ఖాన్(ఎమ్మెల్యే సోదరుడి కొడుకు) మైనర్-1.. వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు మైనర్-2.. ఎంఐఎం కార్పొరేటర్ కొడుకు మైనర్-3.. సంగారెడ్డి మున్సిపల్ కో-ఆప్షన్ మెంబర్ కొడుకు ఉన్నారు. ఇదిలా ఉండగా.. మైనర్‌పై అత్యాచార కేసుపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరా రాజన్ స్పందించారు. ఈ ఘటనపై నివేదికను సమర్పించాలని సీఎస్, డీజీపీని ఆదేశించారు. 2 రోజుల్లో నివేదికను అందించాలని ఆదేశించారు. మరోవైపు.. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితులు.. లైంగిక దాడి అనంతరం కారులో మొయినాబాద్‌కు వెళ్లారు. అక్కడ ఓ రాజకీయ నేతకు చెందిన ఫాంహౌస్‌లో ఆశ్రయం పొందారని తెలుస్తోంది. ఇది కూడా చదవండి: అత్యాచారం ఘటనపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కేసీఆర్‌కు బండి లేఖ -
దాసరి ప్రభును తీసుకెళ్లిన మహిళ ఎవరు?
సాక్షి, హైదరాబాద్: దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు పెద్ద కుమారుడు దాసరి తారక ప్రభు ఆచూకీ లభ్యమైంది. ఈ నెల 9న అనుమానాస్పద స్థితిలో ఆయన అదృశ్యమైన విషయం తెలిసిందే. బుధవారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్ రోడ్ నెం. 46లోని తన నివాసానికి వచ్చిన ప్రభును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. తన అల్లుడు కనిపించడం లేదంటూ అతడి మామ నార్ల సురేంద్ర ప్రసాద్ ఈ నెల12న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. అదే రోజు సాయంత్రం తారక ప్రభు ఆటోలో ఇమ్లిబన్ బస్ స్టేషన్‌కు వెళ్లి అక్కడ చిత్తూరు బస్సు ఎక్కినట్లుగా సీసీ టీవీల్లో రికార్డైంది. ఎస్ఐ చంద్రశేఖర్ మూడు రోజుల పాటు తిరుపతి, చిత్తూరు ప్రాంతాల్లో గాలింపు చేపట్టినా ప్రయోజనం కనిపించలేదు. కాగా ఈ నెల 12న ప్రభు తన పెద్ద భార్య దాసరి సుశీలతో కలిసి హైదరాబాద్ వచ్చినట్లుగా పోలీసులు గుర్తించినప్పటికీ హడావుడిగా తెల్లవారే వెళ్లిపోయారు. బుధవారం పోలీసుల ఎదుట హాజరైన ప్రభు మిస్సింగ్‌కు గల కారణాలను ఆరా తీస్తే సరైన సమాధానం చెప్పడం లేదని తెలుస్తోంది. ఓ మహిళ తనను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిందని ఓ సారి చెప్పగా, తాను ఇక్కడి నుంచి ముంబై వెళ్లానంటూ మరోసారి పొంతన లేని సమాధానం చెబుతున్నాడు. పోలీసులకు అందిన సమాచారం మేరకు ఆయన చిత్తూరు, తిరుపతి ప్రాంతాల్లోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆయన మిస్సింగ్ వెనుక గల కారణాలను ఆరా తీస్తున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. -
హీరో నానికి తప్పిన ప్రమాదం
-
హీరో నానికి తృటిలో తప్పిన ప్రమాదం
సాక్షి, హైదరాబాద్ : జూబ్లీహిల్స్‌లో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో హీరో నానికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. షూటింగ్ ముగించుకొని శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో అతడు తన ఇన్నోవా కారు(టీఎస్ 07ఎఫ్‌సి 0024)లో వెళ్తుండగా జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లో కారు నడుపుతున్న డ్రైవర్ శ్రీనివాస్‌కు ఒక్కసారిగా నిద్ర ఆవహించింది. దీంతో నిర్మానుష్యమైన ఈ రోడ్డుపై స్పీడ్‌గా వెళ్తూ వేగాన్ని అదుపు చేయలేక డ్రైవర్ కారును డివైడర్‌కు ఢీకొట్టాడు. దీంతో కారు ఒక్కసారిగా పైకి లేచి పక్కనే ఉన్న ఫుట్‌ఫాత్‌ను ఢీకొట్టడంతో ముందు భాగం అంతా నుజ్జునుజ్జు అయింది. అయితే అదృష్టవశాత్తు నాని కారు మధ్య సీటులో కూర్చోవడం వల్ల ఎలాంటి గాయాల కాలేదు. వెంటనే అతడు క్యాబ్‌లో గచ్చిబౌలిలోని తన నివాసానికి వెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఘటన స్థలానికి వచ్చి శ్రీనివాస్‌ను విచారించగా తాను వేగంగా వెళ్తున్నానని నిద్ర రావడంతో కారు అదుపు తప్పినట్లు తెలిపాడు. శ్రీనివాస్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి శ్వాస పరీక్షలు నిర్వహించగా మద్యం తీసుకోలేదని తేలింది. కాగా సాయంత్రం వరకు ఈ కారులో శ్రీనివాస్ ఒక్కడే ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. రాత్రి 7 గంటల ప్రాంతంలో పోలీసులు నాని తండ్రి రాంబాబుకు ఫోన్ చేసి ఆరా తీశారు. ఆ సమయంలో నాని కారులో ఉన్నాడని షూటింగ్ ముగించుకొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలపడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు 3/పీపీడీఏ చట్టం (పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ అండ్ డిస్ట్రక్షన్ యాక్ట్) కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ కారు హీరో నాని తండ్రి గంటా రాంబాబు పేరు మీద ఉంది. ఓవర్ స్పీడ్ కారణంగా గత ఏడాది జూన్‌లో ట్రాఫిక్ పోలీసులు రూ.1400 చలానా విధించారు. అయితే ఆ చలానా ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది. -
ఏ తల్లి వదిలి వెళ్లిందో... మృత శిశువును!
బంజారాహిల్స్ (హైదరాబాద్): యూసుఫ్‌గూడలోని జానకమ్మ తోటలో సోమవారం ఆడ శిశువు మృతదేహం వెలుగు చూసింది. ఓ శిశువు మృతదేహం ఉన్నట్లు స్థానిక మెకానిక్ ఇచ్చిన సమాచారంతో జూబ్లీహిల్స్ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. నెలలు నిండకుండానే శిశువును గర్భస్రావం ద్వారా తొలగించుకోవడం వల్ల మృతి చెంది ఉంటుందని తేల్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.