
'సార్.. మా ఆయన సినిమా హీరో.. లాకప్‌లో దోమలు, ఈగలు, వేడితో ఇబ్బందులు పడుతున్నాడు.. దయచేసి క్యారవాన్‌లో ఉండటానికి అనుమతివ్వండి' అంటూ ఓ యువతి పోలీసులను వింత కోరిక కోరింది. రేప్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్టైన కొత్తగా మా ప్రయాణం సినిమా హీరో ప్రియాంత్‌రావు భార్య జూబ్లీహిల్స్ పోలీసులకు పెట్టుకున్న విన్నపం ఇది. సదరు యువతి.. 'క్యారవాన్ సైతం తీసుకొచ్చాను.. రాత్రంతా అందులో ఉండటానికి అనుమతి ఇవ్వండి' అని కోరడంతో పోలీసులు నోరెళ్లబెట్టారు.
చట్టం అందుకు ఒప్పుకోదని పోలీసులు చెప్పగా క్యారవాన్ పోలీస్‌స్టేషన్ ఆవరణలోనే ఉంచుతామని సిబ్బంది ఎందుకని ఎదురు ప్రశ్నించింది. రూల్స్ ఒప్పుకోవమ్మా అంటూ పోలీసులు నచ్చజెప్పినా గంటపాటు భర్తను క్యారవాన్‌లో ఉంచేందుకు పోలీసులను బతిమిలాడి విఫలమైంది.
సినీ నటుడు ప్రియాంత్‌రావు ఓ జూనియర్ ఆర్టిస్టును ప్రేమ పేరుతో మోసం చేశాడు. పెళ్లిమాట ఎత్తేసరికి దిక్కున్నచోట చెప్పుకో అంటూ దూషించాడు. దీంతో బాధితురాలు పోలీసులుకు ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడిపై అత్యాచారంతో పాటు అట్రిసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నిందితుడిని గురువారం రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment