Caravan
-
రహస్య కెమేరాలు అమర్చారు: రాధికా శరత్‌కుమార్
కేరళ రాష్ట్రం రిలీజ్ చేసిన హేమా కమిషన్ నివేదిక మలయాళ చిత్ర పరిశ్రమనే కాకుండా ఇతర పరిశ్రమలనూ కుదిపేస్తోందనే చెప్పాలి. ఇంతకు ముందు దగా పడ్డ నటీమణులు ఇప్పుడు తమ ఆవేదనను వివిధ మాధ్యమాల ద్వారా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా రాధికా శరత్‌కుమార్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ – ‘‘నేను నటించిన ఒక మలయాళ చిత్రం షూటింగ్ సమయంలో క్యారవేన్‌లో రహస్య కెమేరాలు అమర్చారు. నటీమణులు దుస్తులు మార్చుకుంటున్న దృశ్యాలను చిత్రీకరించి కొందరు నటులు సెల్ఫోన్లో చూసి, ఆనందించడం నా కంటపడింది. చాలా కోపం వచ్చింది.నేను క్యారవేన్కు వెళ్లకుండా హోటల్‌కు వెళ్లి దుస్తులు మార్చుకున్నాను. ఆ తర్వాత వాహన ఇన్చార్జ్ని ఇంకోసారి ఇలా జరిగితే జాగ్రత్త అని హెచ్చరించాను. సినిమా రంగంలో సిస్టమ్ సరిగ్గా లేదు. నటీమణుల గది తలుపులను తట్టే పరిస్థితి పలు చిత్ర పరిశ్రమల్లో ఉంది. సినిమా ఇండస్ట్రీకి వచ్చే మహిళలు తమను తాము నిరూపించుకోవడానికి హార్డ్‌వర్క్ చేస్తారు. ఎన్నో త్యాగాలు చేస్తారు. మేం అందరం అలా ఎదిగినవాళ్లమే. ఒక మహిళ ఏదైనా ఫిర్యాదు చేసినప్పుడు ఆధారాలు చూపించమని అడుగుతారు. అంటే... జరిగే ఘటనను మేం వీడియో తీయాలా? ఇప్పుడు మహిళలు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. కానీ ఈ విషయంపై కోలీవుడ్‌లో మాట్లాడుతున్న నటులెవరైనా ఉన్నారా? ‘ఉల్లొళుకు’ సినిమాలో ఊర్వశితో కలిసి పార్వతి బాగా నటించింది. ఆమెకు ఎందుకు అవార్డు రాలేదని మలయాళ ఇండస్ట్రీలో కొందరిని అడిగాను. ‘పార్వతి అన్యాయాన్ని వ్యతిరేకిస్తుంది. సమస్యల గురించి మాట్లాడుతుంది’ అన్నారు. అంత ప్రతిభ ఉన్న నటిని ఇలానా ట్రీట్ చేసేది అనిపించింది’’ అన్నారు.అవకాశాల కోసం అడ్జెస్ట్ అవుతారని...2018లో ‘మీటూ’లో భాగంగా తమిళ రచయిత వైరముత్తు గురించి చిన్మయి చేసిన ఫిర్యాదు గురించి ప్రస్తావించారు రాధిక. ఇంకా ఆమె మాట్లాడుతూ – ‘‘నేను యూ ట్యూబ్‌లో ఓ వీడియో చూశాను. ఒక వ్యక్తి... అతను జర్నలిస్ట్ కాదు... అతను నటీమణులు అవకాశాల కోసం అడ్జెస్ట్ అవుతారు అన్నట్లుగా మాట్లాడాడు. నడిగర్ సంఘమ్ జనరల్ సెక్రటరీ విశాల్‌కి ధైర్యం ఉంటే.. వెళ్లి అతన్ని చెప్పుతో కొట్టమనండి. తనతో పాటు నేను కూడా వెళతాను’’ అని ఘాటుగా స్పందించారు రాధిక. -
26 ఏళ్ల పాటు కారవాన్‌లో బానిసగా..ఏకంగా రూ. 3.75 కోట్లు..!
సంపన్న కుటుంబాలు బలహీనులను బానిసలుగా చేసుకుని ఇష్టరాజ్యంగా వారిచేత వెట్టిచాకిరీ చేయించుకునేదని కథకథలుగా విన్నాం. అలా బానిసలుగా బంధీలై కొందరూ ప్రాణాలు కూడా కోల్పోయేవారు. అచ్చం అలాంటి దారుణమైన క్రూరత్వానికి ఓ సంపన్న కుటుంబం ఒడిగట్టింది. అందుకుగానే ఏళ్ల పాటు శిక్షలు కూడా అనుభవించింది. చాలామంది న్యాయం పొందేలోపు మరణించగా ఓ వ్యక్తి పరిహారంగా కోట్లు పొందాడు. ఈ దిగ్బ్రాంతికర ఘటన యూకేలో చోటు చేసుకుంది.అసలేం జరిగిందంటే..రెండు దశాబ్దాలుగా రూనీస్ అనే సంపన్న కుటుంబ బలహీన వ్యక్తులను తమ బానిసలుగా బంధీలను చూసి ఇష్టారాజ్యంగా వారి జీవితాలతో ఆడుకున్నారు. వారి అవసరాల కోసం వీళ్లని పనివాళ్లగా నియమించుకుని తక్కువ వేతనాలు ఇవ్వడమే గాక క్రూరంగా హింసించేవారు. కొంతమందిని అయితే వారి డిమాండ్లను నెరవేర్చకపోతే చంపేస్తామని బెదిరించేవారు కూడా. అలా వారి చేతిలో బానిసగా బంధీ అయ్యి ఏకంగా 26 ఏళ్లుపాటు మురికి కారావాన్లో చిత్రహింసలకు గురైన వ్యక్తికి ఇప్పటకీ న్యాయం లభించింది. ఆ సంపన్న కుటుంబం దాష్టికానికి 15 మంది వ్యక్తులు న్యాయం పొందక ముందే మరణించారు. అందుకు గాను 2017లో ఆ రూనీ కుటుంబ సభ్యులు 11 మంది ఏకంగా 79 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించారు. కానీ ఆ బాధితుల్లో ఒకే ఒక్క వ్యక్తి ఎట్టకేలకు న్యాయం జరిగి ఏకంగా రూ. 3.75 కోట్లు నష్టపరిహారం అందుకోనున్నాడు. వారి హేయమైన చర్యలు ఆ బాధితుల జీవితాల్లో నీలి నీడల్లా వెంటాడుతూనే ఉండటం బాధకరం. అంతేగాదు సదరు బాధితుడు ఆ ఆర్థిక భద్రతకు తగిన సంరక్షణను పొందే అవకాశం కూడా యూకే ప్రభుత్వం అందించింది. అయితే చాలామంది ఆ బాధితుడు అపరిశుభ్రమైన కార్వాన్లో అనుభవించిన దారుణమైన నరకానికి ఈ నగదు ఏ మాత్రం సరితూగదని అనడం గమనార్హం. (చదవండి: మరణాంతరం భద్రపర్చడానికి ఏకంగా రూ. 1.8 కోట్లు..!) -
ఈ క్యారవాన్‌కు లైసెన్స్ అక్కర్లేదు, నీటిలోనూ సూపర్ స్పీడ్
ఇది రోడ్డు మీద పరుగులు తీసేటప్పుడు వ్యాను. నీటిలో ప్రయాణించేటప్పుడు బోటు. నేల మీదనే కాదు నీటిలోనూ ప్రయాణించగల ఉభయచర వాహనం ఇది. జర్మనీకి చెందిన వాహనాల తయారీ సంస్థ ‘సీల్ వ్యాన్స్’ ఈ విచిత్ర ఉభయచర వాహనాన్ని రూపొందించింది. నేల మీద పరుగులు తీసేటప్పుడు ఇది 50 హార్స్పవర్ హోండా మోటారు సాయంతో పనిచేస్తుంది. నీటిలో ప్రయాణించేటప్పుడు ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇది 4.20 మీటర్ల మోడల్‌లోను, 7.50 మీటర్ల మోడల్‌లోను దొరుకుతుంది. ‘సీల్‌వ్యాన్స్’ 4.20 మీటర్ల వాహనంలో ఇద్దరు ప్రయాణించడానికి వీలవుతుంది. ఇక 7.50 మీటర్ల మోడల్లో ఇద్దరు పెద్దలు, ఇద్దరు పిల్లలు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. యూరోప్‌లో దీనికి లైసెన్స్ అవసరం లేదు, వాహనబీమా తప్పనిసరి కాదు. నీటిలో ఇది గంటకు 13 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగలదు. దీని ధర మోడల్‌ను బట్టి 30,500 డాలర్ల (రూ.25.25 లక్షలు) నుంచి 63,800 డాలర్ల (రూ.49.86 లక్షలు) వరకు ఉంటుంది. -
పట్టుమని పాతికేళ్ళు లేవు.. కోట్లు విలువ చేసే కార్లు, హెలికాఫ్టర్స్.. ఇంకా ఎన్నో..!
Ajay Singh Tanwar: భారతదేశంలో ధనవంతుల సంఖ్య భారీగా పెరిగింది. ఇందులో 'అజయ్ సింగ్ తన్వర్' కూడా ఒకరు. పాతికేళ్ళు కూడా నిండని ఈ యువకుడు ప్రస్తుతం అత్యంత విలాసవంతమైన జీవితం గడిపే వ్యక్తులలో కూడా ఒకరుగా ప్రసిద్ధి చెందాడు. ఇతడు ఉపయోగించే కార్లలో చాలా వరకు ఖరీదైన అన్యదేశ్య కార్లు ఉండటం గమనార్హం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. నిజానికి అజయ్ తన్వర్ ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యుడుగా ఎదిగిన 'కన్వర్ సింగ్ తన్వర్' మనవడు. ఢిల్లీకి చెందిన సంపన్న పారిశ్రామికవేత్త అజయ్ సింగ్ తన్వర్ రాజకీయ, వ్యాపారం రంగాలకు చెందిన కుటుంబంలో జన్మించారు. ఇతడు ప్రపంచములోనే అత్యంత ఖరీదైన కార్లను తయారు చేసే రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన కార్లను కలిగి ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో రోల్స్ రాయిస్ ఘోస్ట్, రోల్స్ రాయిస్ ఫాంటమ్ వంటి ఖరీదైన కార్లను కూడా చూడవచ్చు. అజయ్ గ్యారేజీలో మూడు టయోటా ల్యాండ్ క్రూయిజర్ కార్లు, మెర్సిడెస్ మేబ్యాక్ ఎస్ క్లాస్ లగ్జరీ సెడాన్ వంటివి ఉన్నాయి. ఈ మెర్సిడెస్ బెంజ్ కారు ధర రూ. 2.79 కోట్లని తెలుస్తోంది. దీనితో పాటు కస్టమైజ్డ్ వైట్ ఫోర్డ్ ముస్టాంగ్ సెడాన్, మెర్సిడెస్ బెంజ్జి 63 AMG వంటివి కూడా ఇతని గ్యారేజిలో ఉండటం గమనార్హం. భారతీయ రోడ్ల మీద అరుదుగా కనిపించే 'హమ్మర్ హెచ్2' కూడా ఇతని వద్ద ఉంది. దీనిని భారతదేశానికి ప్రైవేట్‌గా దిగుమతి చేసుకోవడం జరిగింది. (ఇదీ చదవండి: వాట్సాప్‌లో అదిరిపోయే 'ఎడిట్ మెసేజ్ ఫీచర్'.. దీన్నెలా వాడాలో తెలుసా?) రూ. 3 కోట్ల విలువైన లెక్సస్ LX530, రూ. 1.94 కోట్ల విలువైన బిఎండబ్ల్యు ఎక్స్5 ఎమ్, రూ. 1.5 కోట్ల ఖరీదైన ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ స్పోర్ట్, రూ. 2.30 విలువైన ఆడి ఆర్8 స్పోర్ట్స్, ఆడి ఆర్ఎస్5, లంబోర్ఘిని గల్లార్డో కార్లు మాత్రం కాకుండా DC రూపొందించిన రూ. 2 కోట్ల విలువైన కారవ్యాన్ కూడా ఉంది. కార్లు మాత్రమే కాకుండా రెండు హెలికాఫ్టర్లు కూడా ఉన్నాయి. (ఇదీ చదవండి: వెయ్యికోట్ల సామ్రాజ్యానికి తిరుగులేని అధినేత్రి - సక్సెస్ స్టోరీ) నివేదికల ప్రకారం, అజయ్ చత్తర్‌పూర్‌లో ఉన్న ఓషన్ పెరల్ గార్డెనియా, కింగ్స్ ఫోర్త్ అనే రెండు హోటళ్లను నిర్వహిస్తున్నట్లు సమాచారం. వ్యాపారం అనేది కుటుంబం నుంచి వారసత్వంగా లభించినట్లు గతంలోనే వెల్లడించారు. వ్యాపారంలో ఇతని కృషికి ఎలైట్ మ్యాగజైన్ 'మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ 2020' అవార్డును కూడా అందించింది. -
ఇంటిమేట్ సీన్స్‌లో నటించేటప్పుడు క్యారవాన్‌లో కూర్చొని ఏడ్చాను : హీరోయిన్
తెలుగుమ్మాయి అయినప్పటికీ తమిళనాట మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ అంజలి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అంజలి ప్రస్తుతం ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్స్లో వరుస సినిమాలతో బిజీగా మారింది. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో కీలక పాత్రలో నటిస్తుంది. దీంతో పాటు మరికొన్ని సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అంజలి ముద్దుసీన్లు, ఇంటిమేట్ సీన్లలో నటించడం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యింది. 'కొన్నిసార్లు పాత్రకు తగ్గట్లు ముద్దుసీన్లలో నటించాల్సి వస్తుంది. మనకు ఇష్టం లేని వ్యక్తిని ముద్దు పెట్టుకోవడం ఇబ్బందే. ఇక కొన్నిసార్లు ఇంటిమేట్ సీన్లలో నటించినప్పుడు క్యారవాన్‌లోకి వెళ్లి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. అయినా సీన్ పండటం కోసం నటించాల్సి వస్తుంది' అంటూ ఎమోషనల్ అయ్యింది. -
వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల క్యారవాన్‌కు నిప్పు
-
రెచ్చిపోయిన టీఆర్ఎస్ శ్రేణులు.. వైఎస్ షర్మిల కేరవాన్‌కు నిప్పు..
సాక్షి, వరంగల్: టీఆర్ఎస్ శ్రేణులు మరోసారి రెచ్చిపోయారు. దీంతో, వరంగల్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. వైస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కేరవాన్‌కు నిప్పంటించడం కలకలం సృష్టించింది. వివరాల ప్రకారం.. చెన్నారావుపేటలో టీఆర్ఎస్ కార్యకర్తలు రెచ్చిపోయారు. వైఎస్ షర్మిల కేరవాన్‌కు నిప్పు అంటించారు. కొన్ని వాహనాల అద్దాలు ధ్వంసం చేశారు. కాగా, నిన్న(ఆదివారం) నర్సంపేట సభలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిపై వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ దారుణానికి ఒడిగట్టాయి. ఇక, ఈ ఘటనపై వైఎస్ షర్మిల స్పందించారు. తమ పాదయాత్రను అడ్డుకునేందుకు, ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి కుట్రపూరింతంగా ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే ఇలా చేశారని షర్మిల ఆరోపించారు. అలాగే, ఈ దారుణానికి ఒడిగట్టిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు. ఇక, టీఆర్ఎస్ శ్రేణుల చర్యతో ఆ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. అయితే, ప్రస్తుతం లంచ్ బ్రేక్ అనంతరం పోలీసుల బందోబస్తు మధ్య షర్మిల పాదయాత్ర కొనసాగే అవకాశం ఉందని తొలుత భావించారు. కానీ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉండటంతో షర్మిలను అరెస్ట్ చేశారు. -
అత్యాచారం కేసులో నటుడు అరెస్ట్... క్యారవాన్‌లో ఉంచమని భార్య రిక్వెస్ట్
'సార్.. మా ఆయన సినిమా హీరో.. లాకప్‌లో దోమలు, ఈగలు, వేడితో ఇబ్బందులు పడుతున్నాడు.. దయచేసి క్యారవాన్‌లో ఉండటానికి అనుమతివ్వండి' అంటూ ఓ యువతి పోలీసులను వింత కోరిక కోరింది. రేప్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్టైన కొత్తగా మా ప్రయాణం సినిమా హీరో ప్రియాంత్‌రావు భార్య జూబ్లీహిల్స్ పోలీసులకు పెట్టుకున్న విన్నపం ఇది. సదరు యువతి.. 'క్యారవాన్ సైతం తీసుకొచ్చాను.. రాత్రంతా అందులో ఉండటానికి అనుమతి ఇవ్వండి' అని కోరడంతో పోలీసులు నోరెళ్లబెట్టారు. చట్టం అందుకు ఒప్పుకోదని పోలీసులు చెప్పగా క్యారవాన్ పోలీస్‌స్టేషన్ ఆవరణలోనే ఉంచుతామని సిబ్బంది ఎందుకని ఎదురు ప్రశ్నించింది. రూల్స్ ఒప్పుకోవమ్మా అంటూ పోలీసులు నచ్చజెప్పినా గంటపాటు భర్తను క్యారవాన్‌లో ఉంచేందుకు పోలీసులను బతిమిలాడి విఫలమైంది. సినీ నటుడు ప్రియాంత్‌రావు ఓ జూనియర్ ఆర్టిస్టును ప్రేమ పేరుతో మోసం చేశాడు. పెళ్లిమాట ఎత్తేసరికి దిక్కున్నచోట చెప్పుకో అంటూ దూషించాడు. దీంతో బాధితురాలు పోలీసులుకు ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడిపై అత్యాచారంతో పాటు అట్రిసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నిందితుడిని గురువారం రిమాండ్‌కు తరలించారు. -
క్రేజీ.. క్యారవాన్ టూర్!
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా క్యారవాన్ పర్యాటకం పరుగెడుతోంది. వినోద, విహార యాత్రలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కుటుంబం, స్నేహితులతో కలిసి బడ్జెట్లో విలాస టూర్లు చేయిస్తోంది. నచ్చిన చోటుకు.. కావాల్సిన సమయంలో తీసుకెళ్తూ.. బస గురించి బెంగ లేకుండా.. సకల వసతులతో హోం స్టే అనుభూతులన్నీ అందిస్తోంది. ఈ మేరకు కేంద్ర పర్యాటక శాఖ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. విస్తరిస్తున్న క్యారవాన్ సంస్కృతి.. విదేశాల్లో ఉండే ఓవర్ ల్యాండర్ (క్యారవాన్) సంస్కృతి భారత్‌లోనూ క్రమంగా విస్తరిస్తోంది. బెంగళూరు, ఢిల్లీ, ఈశాన్య భారతం, హిమాచల్ ప్రదేశ్, నాగ్‌పూర్, మహారాష్ట్ర, గోవాలో ప్రత్యేక ప్యాకేజీల్లో మొబైల్ హౌస్ పర్యాటకం లభిస్తోంది. ఇటీవల కేరళలో ఈ తరహా పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా క్యారవాన్ టూరిజం పాలసీని సైతం తీసుకొచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే టూరిజం శాఖ క్యారవాన్ పర్యాటకాన్ని ప్రవేశపెట్టగా.. రాష్ట్ర విభజన అనంతరం టీఎస్‌టీడీసీ దానిని నిర్వహిస్తోంది. తాజాగా ఏపీటీడీసీ తీర్థయాత్రల ప్యాకేజీలు అందిస్తున్న విధానంలోనే క్యారవాన్ టూరిజాన్ని కూడా తీసుకురావాలని కసరత్తు చేస్తోంది. చక్రాలపై పర్యాటకం! సినిమా స్టార్స్ షూటింగ్ సమయాల్లో, రాజకీయ నాయకులు తమ పర్యటనల్లో సకల సౌకర్యాలు ఉండే క్యారవాన్లను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇందులో విశ్రాంతి తీసుకోవడానికి విలాసవంతమైన ఏర్పాట్లు ఉంటాయి. ఏసీ, ఆధునిక టాయిలెట్లు, షవర్ (వేడి, చల్ల నీళ్లతో), ఎల్ఈడీ స్క్రీన్లు ఉండడమే కాకుండా ఒక రిఫ్రిజిరేటర్‌తో కూడిన కిచెన్, బార్బిక్యూ సౌకర్యం కూడా ఉంటుంది. ఇక్కడ నచ్చిన ఆహారాన్ని వండుకుని తినేందుకు పాత్రలుంటాయి. ఇందులో ఉండే సోఫాలను బెడ్లుగా కూడా మార్చుకోవచ్చు. గుడారాలు వేసుకుని ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. అయితే ఇలాంటి వాహనాలను కొనుగోలు చేయడం అందరికీ సాధ్యపడదు. అయితే అద్దెకు తీసుకొని కోరిన చోటుకి విహార యాత్రకు వెళ్లడానికి వివిధ రాష్ట్రాల పర్యాటక శాఖలు, టూర్ ఆపరేటర్ సంస్థలు అవకాశం కల్పిస్తున్నాయి. వినోదానికి బోర్డ్ గేమ్‌లు, మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. వాహనం సైజును బట్టి.. ఒక్కో వాహనం సైజును బట్టి నలుగురు నుంచి 9 మంది వరకు ప్రయాణించవచ్చు. డ్రైవర్‌తో పాటు లేకుంటే సెల్ఫ్ డ్రైవింగ్‌లో కూడా క్యారవాన్ టూర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రయాణ దూరం, సమయాన్ని బట్టి చార్జీలు వసూలు చేస్తారు. -
2 ఎకరాల్లో బన్నీ కొత్త ఇల్లు.. దాని విలువ ఎన్ని కోట్లో తెలుసా!
టాలీవుడ్ స్టార్ హీరోలలో అల్లు అర్జున్‌కు ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తన స్టైలీష్ లుక్, భిన్నమైన డ్యాన్స్, అంతకుమించిన వ్యక్తిత్వం.. ఇలా ప్రతి విషయంలో అందరి కంటే భిన్నంగా ఉంటాడు బన్నీ. అందుకే స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ ఎదిగాడు. ఇక బన్నీ ఫ్యామిలీ మ్యాన్ అనే విషయం తెలిసిందే. ఖాళీ దొరికితే కుటుంబంతో కలిసి టూర్స్ ప్లాన్ చేస్తాడు. లేదా ఇంట్లోనే పిల్లలతో సరదా సమయాన్ని ఆస్వాదిస్తాడు. ఇక వీలు చిక్కినప్పుడల్లా భార్య పిల్లలతో హైదరాబాద్ రోడ్లపై కారులో షికారు కొడుతుంటాడు. ఇక తన ప్రతి మూవీ ఈవెంట్‌కు కుటుంబంతోనే వస్తాడు బన్నీ. అలాంటి బన్నీ తన ఫ్యాషన్‌లో అయినా లగ్జరీ విషయంలో అయినా ‘తగ్గేదే లే’ అంటాడు. అందుకే అతడు వాడే కాస్ట్యూమ్స్ నుంచి కారు బంగ్లాల వరకు అన్ని భిన్నంగా, లగ్జరీగా ఉండేలా చూసుకుంటాడు. అయితే స్టార్ హీరో అయిన బన్నీ విలాసవంతమైన కొత్త ఇల్లు ఇటీవల కట్టించుకున్నాడు. పుష్పతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న బన్నీపైనే ఇప్పుడు అందరి ఫోకస్ ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఇల్లు, కార్ల కలెక్షన్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి అవేంటి? వాటి స్పెషాలిటీ ఏంటో మనం కూడా ఓ సారి చూద్దాం. అల్లు అర్జున్ వ్యానిటీ వ్యాన్ బెసిగ్గా బ్లాక్‌ను ఇష్టపడే ఈ ఐకాన్ స్టార్ వ్యానిటీ వ్యాన్ కారును పూర్తిగా బ్లాక్‌లో ఉండేలా చూసుకున్నాడు. అత్యంత విలాసవంతంగా ఉండే ఈ వ్యాన్ ధర రూ. 7 కోట్లు. ముద్దుగా దీనిని ఫాల్కాన్ అని పిలుచుకుంటాడట బన్నీ. ఈ వ్యాన్‌లో భారీ టీవీ సెట్, ఫ్రిజ్‌తో పాటు సౌకర్యవంతమైన రిక్లైనర్ అమర్చారు. వీటికి సంబంధించిన ఫొటోలను బన్నీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. దీనిపై ముందులో భాగంగా ఫాల్కోన్ అని రాసి ఉండగా.. ఇరువైపు ఏఏ(AA) ఉంటుంది. View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) 2 ఎకరాల్లో 100 కోట్లతో విలాసవంతమైన బంగ్లా! సింప్లిసిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అల్లు అర్జున్ ఇల్లు ఎలా ఉంటుందో అని అభిమానుల్లో ఆసక్తి ఉండడం సహజం. హైదరాబాద్‌లోని అల్లు అర్జున్ ఇంటి పేరు 'బ్లెస్సింగ్'. రెండు ఎకరాల స్థలంలో 8,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దాదాపు 100 కోట్ల రూపాయలతో విలాసవంతంగా అల్లు అర్జున్ ఈ ఇంటిని తన టేస్ట్‌కు తగ్గట్టుగా నిర్మించుకున్నాడు. పూర్తిగా సహజమైన తెలుపు రంగుతో పెయింటింగ్ చేసిన ఈ ఇంటి లోపల పెద్ద స్విమ్మింగ్ ఫూల్, జిమ్, హోమ్ థియేటర్, స్పెషల్ పార్టీల కోసం బార్ జోన్, పిల్లల కోసం ప్లేయింగ్ ఏరియా ఉంది. రేంజ్ రోవర్ వోగ్ అల్లు అర్జున్ అత్యంత ఇష్టంగా కొనుక్కున్న ఖరీదైన లగ్జరీ కారు రేంజ్ రోవర్ వోగ్, బన్నీ విలువైన ఆస్తులలో ఇది కూడా ఒకటి. బన్నీ ఈ కారు ఫోటోను ట్విటర్లో షేర్ చేస్తూ ‘ఇంట్లో కొత్త కారు. నేను దానికి బీస్ట్ అని పేరు పెట్టాను. నేను ఏదైనా ప్రత్యేకమైన దానిని కొన్న ప్రతిసారి నా మనసులో ఒకటే ఉంటుంది. అది కృతజ్ఞత’ అంటూ రాసుకొచ్చాడు. ఈ రేంజ్ రోవర్ కారు ఖరీదు రూ. 75 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఉంటుందని అంచనా. హమ్మర్ హెచ్2 బన్నీ ఖరీదైన కారు కలెక్షన్స్‌లో ఇది ఒకటి. దీని ధర రూ. 75 లక్షలకు పైగా ఉంటుంది. దీనిని అల్లు అర్జున్ ఎంతో ఇష్టంగా తన తొలి సంపాదనతో కొనుగొలు చేశాడట. ఈ కారులోనే బన్నీ ఎక్కువగా భార్య, పిల్లలతో కలిసి లాంగ్ డ్రైవ్‌కు వెళుతుంటాడని సమాచారం. రెడ్ మెర్సిడేజ్ 200 సీడీఐ ఈ ఎలక్ట్రిక్ కారు ధర 31 లక్షల రూపాయలు. ఎక్కువ బన్నీ ఈ కారులోనే ఫ్యామిలీతో కలిసి షికార్లకు వెళుతుంటాడట. -
కేరళా స్పెషల్.. కేరవాన్ టూరిజం..
పని ఒత్తిడి నుంచి రిలాక్స్ అయ్యేందుకు.. ఫ్యామిలీతో కలిసి ప్రకృతిలో విహరించేందుకు చాలా మంది గాడ్స్ ఓన్ కంట్రీ కేరళాకి వెళ్తుంటారు. ఇలాంటి వారి కోసం ప్రత్యేకంగా కేరవాన్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది కేరళా టూరిజం శాఖ. కేరవాన్ టూరిజం రోజురోజుకి చాలా పాపులర్ అవుతోంది. సాధారణంగా టూర్‌కి వెళ్లే పర్యటకులకు వివిధ ప్రదేశాల్లో చూడదగ్గ ప్రదేశాలు ఎంత బాగున్నా.. మౌలిక సదుపాయల కొరత అనే సమస్య వేధిస్తూనే ఉంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు.. టూరిస్టులు మరింత అహ్లాదంగా తమ పర్యటన ఎంజాయ్ చేసేందుకు వీలుగా కేరవాన్ కాన్సెప్టును విస్తృతం చేస్తోంది కేరళా టూరిజం శాఖ. కేరవాన్ టూరిజంలో భాగంగా కస్టమైజ్ వాహనాలు అందుబాటులో ఉంచుతోంది. ఇందులో బాత్రూం, బెడ్రూం, కిచెన్, గీజర్, మినీ ఫ్రిడ్జ్ , సోఫా, రిక్లెయినర్, ఫోల్డబుల్ టేబుల్, వైఫైతో కూడిన ఎంటర్టైన్మెంట్ సిస్టమ్.. ఇలా ఇంట్లో ఉండే సౌకర్యాలన్నీ ఉంటాయి. టూరిస్టులు తమ అభిరుచికి తగ్గట్టుగా వాహనాలను ఎంపిక చేసుకోవచ్చు. ప్రభుత్వ నియమ నిబంధనలు అనుగుణంగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఈ కేరవాన్ టూరిజాన్ని అభివృద్ధి చేస్తున్నట్టు ఆ రాష్ట్ర టూరిజం డైరెక్టర్ వీఆర్ కృష్ణ తేజ తెలిపారు. కనీసం యాభై ఎకరాల స్థలం, ఐదు కేరవాన్లు సర్థుబాటు చేయగలిగిన వారికి ఇందులో భాగస్వామ్యం కల్పిస్తున్నామన్నారు. ఇప్పటికే అనేక ప్రముఖ సంస్థలు ఈ టూరిజం ప్లాన్స్ ఆసక్తి కనబరుస్తున్నాయని తెలిపారు. కేరవాన్ టూరిజానికి ఫ్యామిలీలతో పాటు హనీమూన్ జంటల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉంది. కేరవాన్ టూరిజంలో ఉండే సదుపాయాలు, సేఫ్టీ కారణంగా హానీమూన్ జంటలు ఈ ప్యాకేజీ ఎంచుకుంటున్నాయని తెలిపారు. దీంతో ఫ్యామిలీలతో పాటు కపుల్స్ కోసం హైబ్రిడ్ టూరిజం ప్లాన్స్ కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. కేరళా పల్లెలు, బ్యా్క్ వాటర్ ల్యాండ్ స్కేప్స్, సుగంధ ద్రవ్యాల తోటల్లో విహరించేందుకు ఇదో చక్కని అవకాశం అంటోంది కేరళా టూరిజం శాఖ.(అడ్వెటోరియల్) -
లగ్జరీ కారవ్యాన్ కొనుగోలు చేసిన నరేశ్.. ప్రత్యేకత ఏంటంటే?
కారవాన్... సినీతారలు సాధారణంగా ఉపయోగించే మల్టీపర్పస్ వాహనం. ఇందులో సకల సౌకర్యాలనూ ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే గతంలో ఇది కేవలం స్టార్ హీరో, హీరోయిన్లు మాత్రమే ఉపయోగించేవారు. కానీ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా కారవాన్లు వాడుతున్నారు. తమ పాత్రకు సంబంధించిన షూట్ కంప్లీట్ అయితే చాలు వెళ్లి తమ కారవాన్‌లో సేద తీరుతారు. మరో షాట్ రెడీ కాగానే బయటకు వస్తున్నారు. తాజాగా సీనియర్ నరేశ్ లగ్జరీ కారవాన్‌ని కొలుగోలు చేశాడు. ఒకప్పడు హీరోగా రాణించిన నరేశ్.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వరుస సినిమాలతో దూసుకెళ్లున్నాడు. ఆయన ఇంట్లో కంటే ఎక్కువ సమయంలో షూటింగ్ స్పాట్లోనే గడుపుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇతర నటీనటులు వాడిన కారవ్యాన్‌ని వాడడం అంత మంచిది కాదని భావించిన నరేశ్.. ప్రత్యేకంగా ఓ కారవ్యాన్ కొలుగోలు చేశాడట. తనకు కావాల్సిన సదుపాయాలు అన్ని ఉండేలా దాన్ని ఏర్పాటు చేయించుకున్నారట. అందులో ఏసీ బెడ్, మేకప్ ప్లేస్, జిమ్, వెయిటింగ్ రూమ్, వాష్రూప్తో సహా అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయట. ఈ వ్యాన్ని ఆయన ముంబై నుంచి తెప్పించారట. దీని కోసం నరేశ్ భారీగానే ఖర్చు చేశారట. ప్రస్తుతం టాలీవుడ్లో ఏ క్యారెక్టర్ ఆర్టిస్టుకి ప్రత్యేకంగా కారవ్యాన్ లేదు. కొంతమంది సీనియర్ నటులకు అయితే నిర్మాతలే ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారట. అయితే నరేశ్ మాత్రం సొంతంగా క్యారవాన్ కొలుగోలు చేయడం విశేషం. -
మహేశ్‌బాబు లగ్జరీ కారవాన్: ఖరీదు ఎంతో తెలుసా?
స్టార్ హీరోలు సొంత కారవాన్‌ను ఉపయోగించడం పరిపాటిగా మారింది. టాలీవుడ్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు ఇప్పటికే లగ్జరీ వానిటీ వ్యాన్ ఉంది. ఈ మధ్యే మహేశ్‌బాబు కూడా ఓ కారవాన్‌ను కొనుకున్నట్లు ఫిల్మీ దునియాలో టాక్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఆ వ్యాన్‌ను హీరో దగ్గరుండి మరీ రెడీ చేయించుకున్నాడట. అందులో బాత్రూమ్, హాల్, కిచెన్, టీవీ సహా సకల సౌకర్యాలు ఉండేలా చూసుకున్నాడట. దీనికోసం మహేశ్ ఏకంగా రూ.8 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తను నటిస్తున్న సర్కారు వారి పాట షూటింగ్ సెట్స్‌లో దీన్ని పార్క్ చేసేందుకు తాత్కాలిక షెడ్డును కూడా ఏర్పాటు చేయించినట్లు తెలుస్తోంది. కాగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తన కారవాన్ కోసం ఆరున్నర కోట్లు ఖర్చు చేస్తే, మహేశ్ ఏకంగా రెండు కోట్లు ఎక్కువ పెట్టి మరీ ఈ కార్వాన్ను సొంతం చేసుకున్నాడట. లేట్‌గా తీసుకున్నా లేటెస్ట్గా ఉన్న మహేశ్ కారవాన్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతున్నాయి. కాగా మహేశ్ ప్రస్తుతం 'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తున్నాడు. మహానటి ఫేమ్ కీర్తిసురేశ్ హీరోయిన్గా నటిస్తోంది. పరుశురామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను మైత్రీమూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: సందీప్ వంగ డైరెక్షన్లో మహేష్! -
అల్లు అర్జున్ కార్వాన్కు ప్రమాదం
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కార్వాన్కు ప్రమాదం చోటుచేసుకుంది. పుష్ప మూవీ షూటింగ్ పూర్తిచేసుకోని తిరిగి హైదరాబాద్ వస్తుండగా.. ఆయన కార్వాన్ను ఖమ్మం సమీపంలో లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. సడన్ బ్రేక్ వేడయంతో వెనుకనుంచి మరో వావాహం వచ్చి ఢీ కొట్టింది. ప్రమాద సమయంలో కారులో అల్లు అర్జున్ లేరని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఆ కారవాన్ మీద అల్లు అర్జున్ లోగో ఉండడంతో అక్కడున్నవారు హీరోకు గాయాలు అయి ఉంటాయనుకుని పరిగెత్తుకుంటూ వచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మరో వైపు ఏజెన్సీ ఏరియాలో షూటింగ్ పూర్తయిందంటూ చిత్ర బృందం ప్రకటన విడుదల చేసింది. ‘రంజచోడవరం, మారేడుమిల్లి ఏజెన్సీ ప్రాంతాల్లో ‘పుష్ప’సినిమాకు సంబంధించి నవంబర్ 2020 నుంచి జనవరి 2021 మధ్య రెండు భారీ షెడ్యూల్స్‌ను పూర్తి చేశాం. సినిమా షూటింగ్‌కు సహకరించిన ఆదివాసీలు, అధికారులకు ధన్యవాదాలు. వారి సహకారం లేకుండా చిత్రీకరణ సజావుగా సాగేది కాదు. షూటింగ్ కోసం మళ్లీ ఇక్కడకు తప్పకుండా వస్తాం’అని చిత్ర యూనిట్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆర్య, ఆర్య 2’ చిత్రాల తర్వాత హీరో అల్లు అర్జున్–దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మికా మందన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఎర్రచందనం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వావ్! అనిపించేలా బన్నీ కారవాన్
నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన చిత్రయూనిట్ ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకపోయినా తాజాగా సెట్లో కనిపించిన కారవాన్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా నుంచి బన్నీ స్పెషల్‌గా డిజైన్ చేయించిన కారవాన్‌ను వాడుతున్నాడు. ఇప్పటికే కారవాన్‌కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బన్నీ దాదాపు 7 కోట్లతో పాల్కన్ కంపెనీకి కారవాన్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నాడట. ముంబై చెందిన ప్రముఖ డిజైనర్లు అల్లు అర్జున్ టేస్ట్‌కు తగ్గట్టుగా ఇంటీరియర్‌ను డిజైన్ చేశారు. తాజాగా కారవాన్‌కు సంబంధించిన ఇంటీరియర్ ఫోటోలను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేశాడు బన్నీ. కారవాన్ ఫోటోలతో పాటు ‘జీవితంలో పెద్ద స్థాయిలో ఏది కొన్న ఒకే విషయం గుర్తుకు వస్తుంది. అభిమానులు నామీద ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. వారి ప్రేమ, ఆదరణ కారణంగానే నేను ఇవన్నీ కొనగలుగుతున్నాను. నా మీద ప్రేమ చూపిస్తున్న అందరికీ రుణపడి ఉంటాను’ అంటూ ట్వీట్చేశాడు బన్నీ. Every time I buy something big in my life... there is only one thought in my mind ... “ People have showered soo much love...it’s the power of their love that I am being able to buy all this “ Gratitude forever . Thank you all ❤️. It’s my Vanity Van “FALCON” pic.twitter.com/pSRBjIFfy0 — Allu Arjun (@alluarjun) 5 July 2019 -
ఏడుకోట్ల క్యారవాన్?
డ్యాన్స్ అయినా...లుక్స్ పరంగా అయినా...స్టైలింగ్ విషయంలో హీరో అల్లు అర్జున్ తనదైన శైలిలో ప్రత్యేకతను చూపుతూ స్టైలిష్‌స్టార్ అని అనిపించుకుంటున్నారు. అయితే అల్లు అర్జున్ ఏడుకోట్ల రూపాయల ఖర్చుతో ఓ స్పెషల్ క్యారవాన్‌ను సిద్ధం చేయిస్తున్నట్లు ఫిల్మ్‌నగర్‌లో వార్తలు వచ్చాయి. సెట్లో షూటింగ్ చేస్తున్నప్పుడు సీన్ గ్యాప్‌లో యాక్టర్స్ సేదతీరేది క్యారవాన్స్లోనే. అంతేకాదు.. అల్లు అర్జున్ రెడీ చేయిస్తున్న ఈ క్యారవాన్‌లోని లోపలి డిజైన్‌ను డెకరేట్ చేయడానికి ముంబై నుంచి ఓ ఇంటీరియర్ డిజైనర్‌కు కబురు పెట్టారట. ఇక సినిమాల విషయానికి వస్తే.. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అలాగే, సుకుమార్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయనున్నారు అల్లు అర్జున్. -
టాప్ హీరోయిన్‌కు షాక్
చెన్నై(తమిళసినిమా): హీరోయిన్ అనుష్కకు తమిళనాడు అధికారులు షాక్ ఇచ్చారు. షూటింగ్ కోసం ఆమె ఉపయోగిస్తున్న కారవాన్‌ను రవాణా శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బాహుబలి చిత్రం తరువాత ‘భాగమతి’ సినిమాలో అనుష్క నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ కొద్దిరోజులుగా పొల్లాచ్చిలో జరుగుతోంది. అక్కడ హోటల్లో బస చేసి ఆ చిత్రంలో నటిస్తున్న నటి అనుష్క షూటింగ్ లోకేషన్స్‌కు వెళ్లడానికి కారవాన్‌ను ఉపయోగిస్తోంది. దీనికి ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో రవాణాశాఖ అధికారులు సీజ్ చేసి ఆర్టీఓ కార్యాలయానికి తరలించారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలానికి దారి తీసింది. పిల్ల జమీందార్ ఫేం అశోక్ దర్శకత్వంతో హర్రర్ జానర్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆది పినిశెట్టి, ఉన్ని ముకుందన్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఆగస్టు రెండు వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. -
అతిచిన్న కారవాన్
తిక్క లెక్క కారవాన్... సినీతారలు సాధారణంగా ఉపయోగించే మల్టీపర్పస్ వాహనం. ఇందులో సకల సౌకర్యాలనూ ఏర్పాటు చేసుకోవచ్చు. సాధారణంగా ఇది వ్యానుకు ఎక్కువ, బస్సుకు తక్కువలా ఉంటుంది. సాదాసీదా కార్లతో పోలిస్తే కారవాన్‌ను కాస్త పెద్దవాహనంగానే పరిగణించవచ్చు. అయితే, యానిక్ రీడ్ అనే బ్రిటిష్ మెకానిక్ ప్రపంచంలోనే అతిచిన్న కారవాన్‌ను రూపొందించి గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కాడు. దీని సైజు మన దేశంలో తిరిగే నానో కారు కంటే కూడా చిన్నదే... దీని పొడవు 5.024 అడుగులు, ఎత్తు రెండడుగులు, వెడల్పు 7.9 అడుగులు మాత్రమే. ఇందులో ఒక బెడ్, ఒక టీవీ, ఒక సింక్, కెటిల్ వంటి సౌకర్యాలన్నీ ఉంటాయి.