అతిచిన్న కారవాన్
తిక్క లెక్క
కారవాన్... సినీతారలు సాధారణంగా ఉపయోగించే మల్టీపర్పస్ వాహనం. ఇందులో సకల సౌకర్యాలనూ ఏర్పాటు చేసుకోవచ్చు. సాధారణంగా ఇది వ్యానుకు ఎక్కువ, బస్సుకు తక్కువలా ఉంటుంది. సాదాసీదా కార్లతో పోలిస్తే కారవాన్‌ను కాస్త పెద్దవాహనంగానే పరిగణించవచ్చు.
అయితే, యానిక్ రీడ్ అనే బ్రిటిష్ మెకానిక్ ప్రపంచంలోనే అతిచిన్న కారవాన్‌ను రూపొందించి గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కాడు. దీని సైజు మన దేశంలో తిరిగే నానో కారు కంటే కూడా చిన్నదే... దీని పొడవు 5.024 అడుగులు, ఎత్తు రెండడుగులు, వెడల్పు 7.9 అడుగులు మాత్రమే. ఇందులో ఒక బెడ్, ఒక టీవీ, ఒక సింక్, కెటిల్ వంటి సౌకర్యాలన్నీ ఉంటాయి.