Multi Purpose Vehicle
-
మారుతీ ఎర్టిగా రూ. 8.35 లక్షల నుంచి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ మల్టీ పర్పస్ వెహికల్ ఎర్టిగా కొత్త వెర్షన్‌ను విడుదల చేసింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.8.35–12.79 లక్షల మధ్య ఉంది. మారుతీ సుజుకీ సబ్‌స్క్రైబ్ విధానంలోనూ కారును సొంతం చేసుకోవచ్చు. చందా నెలకు పెట్రోల్ వేరియంట్ రూ.18,600, సీఎన్జీ అయితే రూ.22,400 చెల్లించాల్సి ఉంటుంది. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్స్‌తో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్, క్రూయిజ్ కంట్రోల్, ఫాలో మీ హోమ్ ఫంక్షన్‌తో కూడిన హెడ్‌ల్యాంప్స్‌ను ఈ కారుకు పొందుపరిచారు. సీఎన్జీ వేరియంట్లోనూ ఇది లభిస్తుంది. ప్యాడల్ షిఫ్టర్స్‌తో అత్యాధునిక 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో రూపుదిద్దుకుంది. పెట్రోల్ వేరియంట్ లీటరుకు 20.51 కిలోమీటర్లు, సీఎన్జీ కిలోకు 26.11 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ‘పదేళ్ల క్రితం ఎర్టిగా విడుదల భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో ఒక ముఖ్యమైన క్షణం. ఇది కొత్త విభాగాన్ని సృష్టించింది. ఈ విభాగం ఏటా సగటున 4.7% వృద్ధి చెందుతోంది’ అని మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈవో హిసాటీ టాకేయూచీ తెలిపారు. ఎక్స్ఎల్6 కొత్త వెర్షన్.. ప్యాసింజర్ కార్ల పరిశ్రమలో మల్టీ పర్పస్ వెహికల్స్ (ఎంపీవీ) విభాగం వాటా 2014–15లో 4–5 శాతమే. ప్రస్తుతం 8–9 శాతానికి చేరింది. అన్ని కంపెనీలు కలిపి నెలకు సుమారు 22,000 యూనిట్లు విక్రయిస్తున్నాయి. ఈ విభాగంలో సంస్థ వాటా దాదాపు రెండింతలై 61 శాతానికి ఎగబాకిందని మారుతీ సుజుకీ ఇండియా మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఈడీ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ నెలాఖరులో ఎక్స్ఎల్6 కొత్త వర్షన్ రానుందని ఆయన చెప్పారు. -
7 సీటర్ ఎలక్ట్రిక్ కారు.. ఒక్క సారి ఛార్జ్ చేస్తే 520 కి.మీ ప్రయాణం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న బీవైడీ ఇండియా వ్యాపార సంస్థలను లక్ష్యంగా ‘ఈ6’ పేరుతో సరికొత్త ప్రీమియం ప్యూర్ ఎలక్ట్రిక్ మల్టీ పర్పస్ వెహికిల్‌ను ఆవిష్కరించింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.29.6 లక్షలు. ఈ మల్టీ పర్పస్ ఎలక్ట్రిక్ వెహికల్లో 71.7 కిలోవాట్ అవర్ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్లేడ్ బ్యాటరీ పొందుపరిచారు. ఒకసారి చార్జింగ్ చేస్తే 520 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. 180 ఎన్ఎం టార్క్, గరిష్ట వేగం గంటకు 130 కిలోమీటర్లు, 580 లీటర్ల బూట్ స్పేస్, వంటి హంగులు ఉన్నాయి. వాహనం వారంటీ మూడేళ్లు లేదా 1,25,000 కిలోమీటర్లు, బ్యాటరీ 8 ఏళ్లు లేదా 5,00,000 కిలోమీటర్లు, ట్రాక్షన్ మోటార్ 8 ఏళ్లు లేదా 1,50,000 కిలోమీటర్లు ఆఫర్ చేస్తోంది. -
అతిచిన్న కారవాన్
తిక్క లెక్క కారవాన్... సినీతారలు సాధారణంగా ఉపయోగించే మల్టీపర్పస్ వాహనం. ఇందులో సకల సౌకర్యాలనూ ఏర్పాటు చేసుకోవచ్చు. సాధారణంగా ఇది వ్యానుకు ఎక్కువ, బస్సుకు తక్కువలా ఉంటుంది. సాదాసీదా కార్లతో పోలిస్తే కారవాన్‌ను కాస్త పెద్దవాహనంగానే పరిగణించవచ్చు. అయితే, యానిక్ రీడ్ అనే బ్రిటిష్ మెకానిక్ ప్రపంచంలోనే అతిచిన్న కారవాన్‌ను రూపొందించి గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కాడు. దీని సైజు మన దేశంలో తిరిగే నానో కారు కంటే కూడా చిన్నదే... దీని పొడవు 5.024 అడుగులు, ఎత్తు రెండడుగులు, వెడల్పు 7.9 అడుగులు మాత్రమే. ఇందులో ఒక బెడ్, ఒక టీవీ, ఒక సింక్, కెటిల్ వంటి సౌకర్యాలన్నీ ఉంటాయి. -
జనరల్ మోటార్స్ ఎంజాయ్.. కొత్త వేరియంట్
ధరలు రూ.6.24-8.79 లక్షల రేంజ్లో న్యూఢిల్లీ: జనరల్ మోటార్స్ కంపెనీ మల్టీ పర్పస్ వెహికల్ ఎంజాయ్‌లో అప్డేటెడ్ వెర్షన్‌ను సోమవారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ వేరియంట్ ధరలను రూ.6.24 లక్షల నుంచి రూ.8.79 లక్షల(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) రేంజ్లో నిర్ణయించామని జనరల్ మోటార్స్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ అరవింద్ సక్సేనా చెప్పారు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, డోర్ ఆర్మ్‌రెస్ట్‌లపై గ్లాసీ బ్లాక్ ఫినిష్ వంటి వివిధ ఫీచర్లతో ఈ వేరియంట్లను రూపొందించామని వివరించారు. -
హ్యుందాయ్ వెర్నా.. కొత్త వేరియంట్
ధరల శ్రేణి రూ.7.74-12.19 లక్షలు న్యూఢిల్లీ: హ్యుందాయ్ కంపెనీ వెర్నా మోడల్లో కొత్త మోడల్‌ను బుధవారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ కొత్త వేరియంట్‌తో సెడాన్ సెగ్మెంట్లో తమ స్థానం మరింత పటిష్టమవుతుందని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, రాకేశ్ శ్రీవాత్సవ చెప్పారు. ఈ కొత్త వేరియంట్ ధరలు రూ.7.74 లక్షల నుంచి రూ.12.19 లక్షల రేంజ్(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)లో ఉన్నాయని పేర్కొన్నారు. హోండా సిటీ, మారుతీ సియాజ్‌లకు పోటీనిచ్చే ఈ వెర్నా మోడల్ డీజిల్, పెట్రోల్ ఇంజిన్లలో, పది వేరియంట్లలో లభిస్తోంది. సమీప భవిష్యత్తులో దేశీయంగా ఏడాదికి 5 లక్షల కార్లను విక్రయించడం లక్ష్యమని శ్రీవాత్సవ పేర్కొన్నారు. దీంట్లో భాగంగానే వెర్నాలో కొత్త వేరియంట్‌ను తెచ్చామని, తమ కంపెనీ ఇతర మోడళ్లలో మరిన్ని వేరియంట్లను అందిస్తామని ఆయన తెలిపారు. కాగా, ఈ కంపెనీ ప్రీమియం హ్యాచ్‌బాక్ ఇలీట్ ఐ20లో క్రాస్-ఓవర్ వెర్షన్, కాంపాక్ట్ ఎస్‌యూవీతోపాటు కొత్తగా మల్టీ పర్పస్ వెహికల్(ఎంపీవీ) సెగ్మెంట్లోకి ప్రవేశించనున్నదని సమాచారం. -
రెనో 800సీసీ కారు వస్తోంది..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ రెనో ఇండియా 800 సీసీ కారును తీసుకొస్తోంది. 2015లోనే ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశాలున్నాయి. తొలుత భారత్‌లో, ఆ తర్వాత బ్రెజిల్, దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో పరిచయం చేస్తారు. చెన్నై సమీపంలోని రెనో-నిస్సాన్ సంయుక్త ప్లాంటులో ఈ కారు తయారవుతోంది. చిన్న కార్ల తయారీకై ఇరు సంస్థలు అభివృద్ధి చేసిన కామన్ మాడ్యూల్ ఫ్యామిలీ ప్లాట్‌ఫామ్‌పై ఇది రూపుదిద్దుకుంటోంది. రూ.4 లక్షల లోపు ఖరీదున్న చిన్న కారును 2015 మధ్యకాలంలో విడుదల చేస్తున్నట్టు రెనో ఇండియా సీఈవో, ఎండీ సుమిత్ సాహ్నీ వెల్లడించారు. ఈ కారును ఎంత సీసీ సామర్థ్యంతో తీసుకొచ్చేది వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. అయితే కంపెనీ ప్రకటించిన రూ.4 లక్షలలోపు కారు, అభివృద్ధి దశలో ఉన్న 800 సీసీ కారు రెండూ ఒకటేనా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. కాగా, కొండాపూర్‌లో ఏర్పాటు చేసిన రెనో హైటెక్ సిటీ షోరూంను ప్రారంభించేందుకు శుక్రవారం హైదరాబాద్ వచ్చిన సుమిత్ సాహ్నీ సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. ఆయనింకా ఏమన్నారంటే.. కొత్త విభాగాలను సృష్టిస్తాం..: లక్షకుపైగా డస్టర్ వాహనాలు భారతీయ రోడ్లెక్కాయి. ఆల్ వీల్ డ్రైవ్ వేరియంట్ ఈ పండుగల సీజన్లో రానుంది. స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల్లో డస్టర్ కొత్త విభాగాన్ని సృష్టించింది. కంపెనీ తీసుకొచ్చే ఏ వాహనమైన ప్రత్యేక విభాగాన్ని సృష్టించాల్సిందే. 2015 ప్రారంభంలో మల్టీ పర్పస్ వాహనాన్ని(ఎంపీవీ) పరిచయం చేయనున్నాం. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ వాటా దేశంలో 2.2%. ఎంపీవీ, చిన్న కారు రాకతో రెండు మూడేళ్లలో వాటా 5%కి ఎగబాకుతుంది. ప్రపంచ దేశాల్లో రెనో విక్రయిస్తున్న మోడళ్లను భారత్‌కు అనువుగా మార్పులు చేసి ప్రవేశపెడుతున్నాం. ప్రస్తుతం 141 షోరూంలున్నాయి. మార్చికల్లా 175కు చేరుస్తాం. పాత వాహనాల స్వస్తి.. చమురు దిగుమతుల కోసం వేల కోట్ల విదేశీ మారకం కోల్పోతున్నాం. పాత వాహనాలు ఇంధనాన్ని అధికంగా వినియోగిస్తాయి. అందుకే దిద్దుబాటు చర్యల్లో భాగంగా 12-15 ఏళ్లు పైబడిన వాహనాలను పెద్ద నగరాల్లో తిరక్కుండా ప్రభుత్వం నిబంధనలు విధించాలి. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేయాలి. పాత వాహనాలను తుక్కుగా (స్క్రాప్) చేయాల్సిందే. భద్రతా పరంగా చూస్తే ఇదే సరైన నిర్ణయం. ఈ విషయమై ప్రభుత్వం చొరవ తీసుకునేలా రెనో తరఫున వాహన కంపెనీల తయారీ సంఘం సియామ్పై ఒత్తిడి చేస్తున్నాం. అధిక మైలేజీ, భద్రత ప్రమాణాలతో పర్యావరణ అనుకూల కొత్త కొత్త మోడళ్లను కంపెనీలు ప్రవేశపెడుతున్నాయి.