రెనో 800సీసీ కారు వస్తోంది.. | next year introduced on 800 reno car | Sakshi
Sakshi News home page

రెనో 800సీసీ కారు వస్తోంది..

Published Sat, Aug 9 2014 1:32 AM | Last Updated on Sat, Sep 2 2017 11:35 AM

next year introduced on 800 reno car

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ రెనో ఇండియా 800 సీసీ కారును తీసుకొస్తోంది. 2015లోనే ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశాలున్నాయి. తొలుత భారత్‌లో, ఆ తర్వాత బ్రెజిల్, దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో పరిచయం చేస్తారు. చెన్నై సమీపంలోని రెనో-నిస్సాన్ సంయుక్త ప్లాంటులో ఈ కారు తయారవుతోంది. చిన్న కార్ల తయారీకై ఇరు సంస్థలు అభివృద్ధి చేసిన కామన్ మాడ్యూల్ ఫ్యామిలీ ప్లాట్‌ఫామ్‌పై ఇది రూపుదిద్దుకుంటోంది.

 రూ.4 లక్షల లోపు ఖరీదున్న చిన్న కారును 2015 మధ్యకాలంలో విడుదల చేస్తున్నట్టు రెనో ఇండియా సీఈవో, ఎండీ సుమిత్ సాహ్నీ వెల్లడించారు. ఈ కారును ఎంత సీసీ సామర్థ్యంతో తీసుకొచ్చేది వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. అయితే కంపెనీ ప్రకటించిన రూ.4 లక్షలలోపు కారు, అభివృద్ధి దశలో ఉన్న 800 సీసీ కారు రెండూ ఒకటేనా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. కాగా, కొండాపూర్‌లో ఏర్పాటు చేసిన రెనో హైటెక్ సిటీ షోరూంను ప్రారంభించేందుకు శుక్రవారం  హైదరాబాద్ వచ్చిన సుమిత్ సాహ్నీ సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు.

ఆయనింకా ఏమన్నారంటే..
 కొత్త విభాగాలను సృష్టిస్తాం..: లక్షకుపైగా డస్టర్ వాహనాలు భారతీయ రోడ్లెక్కాయి. ఆల్ వీల్ డ్రైవ్ వేరియంట్ ఈ పండుగల సీజన్‌లో రానుంది. స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల్లో డస్టర్ కొత్త విభాగాన్ని సృష్టించింది. కంపెనీ తీసుకొచ్చే ఏ వాహనమైన ప్రత్యేక విభాగాన్ని సృష్టించాల్సిందే. 2015 ప్రారంభంలో మల్టీ పర్పస్ వాహనాన్ని(ఎంపీవీ) పరిచయం చేయనున్నాం. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ వాటా దేశంలో 2.2%. ఎంపీవీ, చిన్న కారు రాకతో రెండు మూడేళ్లలో వాటా 5%కి ఎగబాకుతుంది. ప్రపంచ దేశాల్లో రెనో విక్రయిస్తున్న మోడళ్లను భారత్‌కు అనువుగా మార్పులు చేసి ప్రవేశపెడుతున్నాం. ప్రస్తుతం 141 షోరూంలున్నాయి. మార్చికల్లా 175కు చేరుస్తాం.

 పాత వాహనాల స్వస్తి..
 చమురు దిగుమతుల కోసం వేల కోట్ల విదేశీ మారకం కోల్పోతున్నాం. పాత వాహనాలు ఇంధనాన్ని అధికంగా వినియోగిస్తాయి. అందుకే దిద్దుబాటు చర్యల్లో భాగంగా 12-15 ఏళ్లు పైబడిన వాహనాలను పెద్ద నగరాల్లో తిరక్కుండా ప్రభుత్వం నిబంధనలు విధించాలి. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేయాలి. పాత వాహనాలను తుక్కుగా (స్క్రాప్) చేయాల్సిందే. భద్రతా పరంగా చూస్తే ఇదే సరైన నిర్ణయం. ఈ విషయమై ప్రభుత్వం చొరవ తీసుకునేలా రెనో తరఫున వాహన కంపెనీల తయారీ సంఘం సియామ్‌పై ఒత్తిడి చేస్తున్నాం. అధిక మైలేజీ, భద్రత ప్రమాణాలతో పర్యావరణ అనుకూల కొత్త కొత్త మోడళ్లను కంపెనీలు ప్రవేశపెడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement