7 సీటర్‌ ఎలక్ట్రిక్‌ కారు.. ఒక్క సారి ఛార్జ్‌ చేస్తే 520 కి.మీ ప్రయాణం | Details About 7 Seater Multi Purpose Electric Car EV6 | Sakshi
Sakshi News home page

7 సీటర్‌ ఎలక్ట్రిక్‌ కారు.. ఒక్క సారి ఛార్జ్‌ చేస్తే 520 కి.మీ ప్రయాణం

Published Tue, Nov 2 2021 8:04 AM | Last Updated on Tue, Nov 2 2021 5:28 PM

Details About 7 Seater Multi Purpose Electric Car EV6 - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీలో ఉన్న బీవైడీ ఇండియా వ్యాపార సంస్థలను లక్ష్యంగా ‘ఈ6’ పేరుతో సరికొత్త ప్రీమియం ప్యూర్‌ ఎలక్ట్రిక్‌ మల్టీ పర్పస్‌ వెహికిల్‌ను ఆవిష్కరించింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.29.6 లక్షలు.

ఈ మల్టీ పర్పస్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్‌లో 71.7 కిలోవాట్‌ అవర్‌ లిథియం ఐరన్‌ ఫాస్ఫేట్‌ బ్లేడ్‌ బ్యాటరీ పొందుపరిచారు. ఒకసారి చార్జింగ్‌ చేస్తే 520 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. 180 ఎన్‌ఎం టార్క్, గరిష్ట వేగం గంటకు 130 కిలోమీటర్లు, 580 లీటర్ల బూట్‌ స్పేస్, వంటి హంగులు ఉన్నాయి. వాహనం వారంటీ మూడేళ్లు లేదా 1,25,000 కిలోమీటర్లు, బ్యాటరీ 8 ఏళ్లు లేదా 5,00,000 కిలోమీటర్లు, ట్రాక్షన్‌ మోటార్‌ 8 ఏళ్లు లేదా 1,50,000 కిలోమీటర్లు ఆఫర్‌ చేస్తోంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement