హ్యుందాయ్ వెర్నా.. కొత్త వేరియంట్ | Hyundai launches updated version of mid-sized sedan Verna | Sakshi
Sakshi News home page

హ్యుందాయ్ వెర్నా.. కొత్త వేరియంట్

Published Thu, Feb 19 2015 2:03 AM | Last Updated on Sat, Sep 2 2017 9:32 PM

హ్యుందాయ్ వెర్నా.. కొత్త వేరియంట్

హ్యుందాయ్ వెర్నా.. కొత్త వేరియంట్

ధరల శ్రేణి రూ.7.74-12.19 లక్షలు
న్యూఢిల్లీ: హ్యుందాయ్ కంపెనీ వెర్నా మోడల్‌లో కొత్త మోడల్‌ను బుధవారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ కొత్త వేరియంట్‌తో సెడాన్ సెగ్మెంట్‌లో తమ స్థానం మరింత పటిష్టమవుతుందని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, రాకేశ్ శ్రీవాత్సవ చెప్పారు. ఈ కొత్త వేరియంట్ ధరలు రూ.7.74 లక్షల నుంచి రూ.12.19 లక్షల రేంజ్(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)లో ఉన్నాయని పేర్కొన్నారు. హోండా సిటీ, మారుతీ సియాజ్‌లకు పోటీనిచ్చే ఈ వెర్నా మోడల్ డీజిల్, పెట్రోల్ ఇంజిన్లలో, పది వేరియంట్లలో లభిస్తోంది.

సమీప భవిష్యత్తులో దేశీయంగా ఏడాదికి 5 లక్షల కార్లను విక్రయించడం లక్ష్యమని శ్రీవాత్సవ పేర్కొన్నారు. దీంట్లో భాగంగానే వెర్నాలో కొత్త వేరియంట్‌ను తెచ్చామని, తమ కంపెనీ ఇతర మోడళ్లలో మరిన్ని వేరియంట్‌లను అందిస్తామని ఆయన తెలిపారు. కాగా, ఈ కంపెనీ ప్రీమియం హ్యాచ్‌బాక్ ఇలీట్ ఐ20లో క్రాస్-ఓవర్ వెర్షన్,  కాంపాక్ట్ ఎస్‌యూవీతోపాటు కొత్తగా మల్టీ పర్పస్ వెహికల్(ఎంపీవీ) సెగ్మెంట్‌లోకి ప్రవేశించనున్నదని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement