Verna model
-
మార్కెట్లోకి వెర్నా కొత్త వేరియంట్లు
హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ తన మిడ్‌సైజు ప్రీమియం సెడాన్ వెర్నాలో రెండు కొత్త వేరియంట్లను బుధవారం లాంచ్ చేసింది. 1.4 లీటరు పెట్రోల్ ఇంజిన్‌తో వీటిని మార్కెట్లోకి తీసుకొచ్చింది. వీటి ధరలు ఎక్స్‌షోరూం ఢిల్లీలో రూ.7,79,000, రూ.9,09,000గా ఉన్నాయి. గతేడాది ఆగస్టులోనే కంపెనీ తన కొత్త తరం వెర్నాను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం లాంచ్ అయిన తన తర్వాతి జనరేషన్ వెర్నాలో 1.4లీటరు కప్పా డ్యూయల్ వీటీవీటీ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది పనితీరుకు, ఇంధన సామర్థ్యానికి కచ్చితమైన కలయికగా ఉపయోగపడుతోందని కంపెనీ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ రాకేష్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ కొత్త వేరియంట్లు వెర్నా పాపులారిటీని మరింత బలోపేతం చేస్తామని, సెడాన్‌ను ఎంపికను, అనుభూతిని మరింత విస్తృతం చేస్తాయని చెప్పారు. ఈ కొత్త వేరియంట్లు 100పీఎస్ పవర్ అవుట్‌పుట్, 19.1కేఎంపీఎల్ ఇంధన సామర్థ్యాన్ని ఆఫర్ చేయనున్నట్టు కంపెనీ పేర్కొంది. సిక్స్-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను ఈ మోడల్స్ ఆఫర్ చేయనున్నాయి. -
హ్యుందాయ్ వెర్నాకు భారీ స్పందన
హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ రెండు నెలల క్రితం లాంచ్ చేసిన తన కొత్త మిడ్-సైజ్ సెడాన్ వెర్నాకు అనూహ్య స్పందన వస్తోంది. లాంచ్ అయిన రెండు నెలల్లోనే 20వేల యూనిట్లు మార్కును ఇది క్రాస్ చేసింది. ఇప్పటి వరకు 1.5 లక్షల వరకు ఎంక్వయిరీలను కూడా ఇది పొందిందని హ్యుందాయ్ మోటార్ ప్రకటించింది. ''తర్వాత జనరేషన్ వెర్నా భారత్‌లో మరోసారి తన సత్తా చాటుతోంది. లాంచ్ అయిన కొన్ని నెలల్లోనే 20వేలకు పైగా బుకింగ్స్, లక్షన్నరకు పైగా ఎంక్వయిరీలను ఇది పొందింది'' అని హెచ్ఎంఐఎల్ మేనేజింగ్ డైరెక్టర్ సీఈవో వైకే కూ తెలిపారు. హోండా సిటీకి, మారుతీ సుజుకీ సియాజ్‌కు ఇది గట్టి పోటీగా నిలుస్తోంది. మధ్య తూర్పు మార్కెట్ నుంచి 10,501 యూనిట్ల ఎగుమతి ఆర్డర్లు కూడా హ్యుందాయ్ మోటార్‌కు అందాయి. -
హ్యుందాయ్ వెర్నా.. కొత్త వేరియంట్
ధరల శ్రేణి రూ.7.74-12.19 లక్షలు న్యూఢిల్లీ: హ్యుందాయ్ కంపెనీ వెర్నా మోడల్లో కొత్త మోడల్‌ను బుధవారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ కొత్త వేరియంట్‌తో సెడాన్ సెగ్మెంట్లో తమ స్థానం మరింత పటిష్టమవుతుందని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, రాకేశ్ శ్రీవాత్సవ చెప్పారు. ఈ కొత్త వేరియంట్ ధరలు రూ.7.74 లక్షల నుంచి రూ.12.19 లక్షల రేంజ్(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)లో ఉన్నాయని పేర్కొన్నారు. హోండా సిటీ, మారుతీ సియాజ్‌లకు పోటీనిచ్చే ఈ వెర్నా మోడల్ డీజిల్, పెట్రోల్ ఇంజిన్లలో, పది వేరియంట్లలో లభిస్తోంది. సమీప భవిష్యత్తులో దేశీయంగా ఏడాదికి 5 లక్షల కార్లను విక్రయించడం లక్ష్యమని శ్రీవాత్సవ పేర్కొన్నారు. దీంట్లో భాగంగానే వెర్నాలో కొత్త వేరియంట్‌ను తెచ్చామని, తమ కంపెనీ ఇతర మోడళ్లలో మరిన్ని వేరియంట్లను అందిస్తామని ఆయన తెలిపారు. కాగా, ఈ కంపెనీ ప్రీమియం హ్యాచ్‌బాక్ ఇలీట్ ఐ20లో క్రాస్-ఓవర్ వెర్షన్, కాంపాక్ట్ ఎస్‌యూవీతోపాటు కొత్తగా మల్టీ పర్పస్ వెహికల్(ఎంపీవీ) సెగ్మెంట్లోకి ప్రవేశించనున్నదని సమాచారం.