హ్యుందాయ్‌ వెర్నాకు భారీ స్పందన | Hyundai Verna receives over 20,000 bookings, 1,50,000 enquiries | Sakshi
Sakshi News home page

హ్యుందాయ్‌ వెర్నాకు భారీ స్పందన

Published Thu, Nov 2 2017 2:13 PM | Last Updated on Thu, Nov 2 2017 2:13 PM

Hyundai Verna receives over 20,000 bookings, 1,50,000 enquiries - Sakshi

హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా లిమిటెడ్‌ రెండు నెలల క్రితం లాంచ్‌ చేసిన తన కొత్త మిడ్‌-సైజ్‌ సెడాన్‌ వెర్నాకు అనూహ్య స్పందన వస్తోంది. లాంచ్‌ అయిన రెండు నెలల్లోనే 20వేల యూనిట్లు మార్కును ఇది క్రాస్‌ చేసింది. ఇప్పటి వరకు 1.5 లక్షల వరకు ఎంక్వయిరీలను కూడా ఇది పొందిందని హ్యుందాయ్‌ మోటార్‌ ప్రకటించింది.

''తర్వాత జనరేషన్‌ వెర్నా భారత్‌లో మరోసారి తన సత్తా చాటుతోంది. లాంచ్‌ అయిన కొన్ని నెలల్లోనే 20వేలకు పైగా బుకింగ్స్‌, లక్షన్నరకు పైగా ఎంక్వయిరీలను ఇది పొందింది'' అని హెచ్‌ఎంఐఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సీఈవో వైకే కూ తెలిపారు. హోండా సిటీకి, మారుతీ సుజుకీ సియాజ్‌కు ఇది గట్టి పోటీగా నిలుస్తోంది. మధ్య తూర్పు మార్కెట్‌ నుంచి 10,501 యూనిట్ల ఎగుమతి ఆర్డర్లు కూడా హ్యుందాయ్‌ మోటార్‌కు అందాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement