Hyundai Company
-
ఊహించని షాక్.. ఒకప్పుడు ఈ కారుకి ఫుల్ డిమాండ్, ఇప్పుడేమో ఒక్కరూ కొనట్లేదు!
ఇటీవల ప్రజలు కారు కొనుగోలు ఆసక్తి చూపుతున్నారు. దీంతో కంపెనీ కస్టమర్లను ఆకట్టుకోవడానికి ప్రత్యేక ఫీచర్లతో కార్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. వాటి సేల్స్ కూడా బాగానే జరుగుతున్నాయి. అయితే హ్యుందాయ్ కంపెనీలోని ఓ మోడల్ కారుని ప్రజలు ఇప్పుడు అసలు పట్టించుకోవట్లేదు. గతంలో ఈ కారుకి ఫుల్ డిమాండ్. మధ్యతరగతి ప్రజలు ఈ కార్లే కావాలని కొనేవాళ్లు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది. ఒక్క కారు కూడా కొనలేదు హ్యుందాయ్ కంపెనీలోని శాంత్రో (Santro) మోడల్ కారు మంచి గుర్తింపే తెచ్చుకుంది. అయితే పలు కారణాల వల్ల సంస్థ ఈ కారు ఉత్పత్తిని మే 2022లో కంపెనీ నిలిపివేసినప్పటికీ, దాని మూసివేత ఇంకా అధికారికంగా ప్రకటించబడలేదు. ఈ కారు స్టాక్‌ను క్లియర్ చేయాలనుకోవడం దీనికి కారణం. వాస్తవానికి, ఇప్పటికీ కంపెనీ అధికారిక వెబ్సైట్లో ఈ కారు జాబితా ఉంచి ఆన్లైన్లో విక్రయిస్తోంది. అయినా స్టాక్ క్లియర్ చేయలేకపోతోంది. మరోవైపు ఈ కారు సేల్స్ క్రమక్రమంగా పడిపోతూ వస్తోంది. అలా ఏకంగా గత అక్టోబర్ నెలలో దీన్ని అమ్మకాలు జీరోగా ఉంది. ఇది కంపెనీకి భారీ షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే గతంలో ఫ్యామిలీ కారుగా గుర్తింపు సాధించింది శాంత్రో ప్రస్తుతం దాని సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం చాలా నిరాశపరిచింది. ఏడాది కిందట చూస్తే.. శాంట్రో అమ్మకాలు 2877 యూనిట్లుగా ఉన్నాయి. కంపెనీ 2018లో శాంత్రో కారును రీలాంచ్ చేసి దీని ప్రారంభ ధర రూ. 3.9 లక్షలుగా నిర్ణయించింది. అయితే నాలుగేళ్ల కాలంలో ఈ కారు ప్రారంభ ధర రూ. 5.7 లక్షలకు చేరింది. ఇక ధర పెరగడంలో కొనే వారు కరువైనట్లు తెలుస్తోంది. చదవండి: గుడ్‌న్యూస్: కొత్త సేవలు వచ్చాయ్.. ఇలా చేస్తే ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ పేమెంట్స్! -
దీపావళి కళ్లు చెదిరే అఫర్లు.. కారు కొంటే రూ.లక్ష తగ్గింపు!
అక్టోబర్ నెల రావడంతో పండగ కల వచ్చేస్తోంది. ప్రారంభంలో దసరాతో వచ్చి పోతూ పోతూ దీపావళితో ధూం ధాం చేసి వెళ్తుంది. పండుగా వస్తే చాలు.. ప్రజలు సాధారణ రోజుల కంటే ఈ రోజుల్లోనే కాస్త ఎక్కువగా షాపింగ్ చేస్తుంటారు. వీటిని దృష్టిలో పెట్టుకుని కంపెనీలు కూడా సరికొత్త ఆఫర్లు, డిస్కౌంట్లతో కస్టమర్లకు హాయ్ చెబుతుంటాయి. ఈ దీపావళి సందర్భంగా మీరు కొత్తగా కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే అదిరిపోయే శుభవార్త మీకోసమే. పండుగ సీజన్లో పలు కంపెనీలు తమ కార్లపై భారీగా తగ్గింపులు, బెనిఫిట్స్‌ని ప్రకటిస్తున్నాయి. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ (Hyundai Motor India) తాజాగా మైండ్‌బ్లోయింగ్ ఆఫర్లను తీసుకొచ్చింది. ఎంపిక చేసిన మోడళ్లపై కళ్లుచెదిరే డీల్స్ అందిండంతో పాటు ఏకంగా రూ. లక్ష వరకు డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చని ప్రకటించింది. హ్యుందాయ్ కోనా(Hyundai Kona Electric) హ్యుందాయ్ కోనా కారు రూ. 1 లక్ష క్యాష్ డిస్కౌంట్‌తో లభిస్తుంది. ఎలక్ట్రిక్ కాంపాక్ట్ SUV ఇటీవలే రెండు కొత్త కలర్స్‌ని కూడా లాంచ్ చేసింది. కోనా ఎలక్ట్రిక్ ధర రూ. 23.84 లక్షల నుంచి 24.03 లక్షల మధ్య ఉంటుంది. హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్(Hyundai Grand i10 Nios) కంపెనీ శాంట్రో నిలిపివేయడంతో, ప్రస్తుతం హ్యుందాయ్ ఎంట్రీ-లెవల్ మోడల్‌గా గ్రాండ్ i10 నియోస్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 5.43 లక్షల నుంచి 8.45 లక్షల వరకు ఉంది. దీనిపై దాదాపు రూ. 48 వేల తగ్గింపు ప్రయోజనాలను ప్రకటించింది. అందులో క్యాష్ డిస్కౌంట్ రూ. 35 వేల వరకు, ఎక్స్చేంజ్ బోనస్ రూ. 10 వేల వరకు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.3 వేల వరకు ఉంటుంది. హ్యుందాయ్ ఐ20 (hyundai i20) హ్యుందాయ్ ఐ20 (hyundai i20) కారుపై రూ.20 వేల వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఇందులో క్యాష్ డిస్కౌంట్ రూ. 10 వేలు, ఎక్స్చేంజ్ బోనస్ రూ. 10 వేలు ఉన్నాయి. ఈ ఆఫర్లు i20 Magna, Sportz వేరియంట్లపై మాత్రమే చెల్లుబాటు అవుతాయని తెలిపింది. ఐ20 ధర రూ.7.07 లక్షల నుంచి రూ.11.62 లక్షల మధ్య ఉంది. ఉంటుంది. ఇక ఈ మోడల్‌పై కార్పొరేట్ డిస్కౌంట్లు లేవని తెలిపింది. హ్యుందాయ్ ఆరా(Hyundai Aura) హ్యుందాయ్ ఆరా మోడల్‌పై కూడా ఆఫర్లు లభిస్తున్నాయి. ఈ కారుపై రూ. 33 వేల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఇందులో క్యాష్ డిస్కౌంట్ రూ. 20 వేలు ఉంటుంది. అలాగే ఎక్స్చేంజ్ బోనస్ రూ. 10 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 3 వేలు వంటివి కూడా కలిసి ఉన్నాయి. ఇతర వేరియంట్లు రూ. 18,000 వరకు గరిష్టంగా ప్రయోజనాలను పొందవచ్చు. హ్యుందాయ్ ఆరా ప్రారంభ ధర రూ. 6.09 లక్షల నుంచి గరిష్టంగా 8.87 లక్షలు ఉంది. గమనిక:పైన పేర్కొన్న ఆఫర్లు. నగరం లేదా రాష్ట్రాన్ని బట్టి మారవచ్చు, మరిన్ని వివరాల కోసం మీ సమీప డీలర్‌షిప్‌ని సంప్రదించాల్సి ఉంటుంది. ఇవి పండుగ ఆఫర్లు కాబట్టి అక్టోబర్ నెల చివరి వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. చదవండి: బ్యాంక్‌లో సేవింగ్స్ అకౌంట్ క్లోజ్ చేస్తున్నారా.. ఇవి తెలుసుకోకపోతే తిప్పలు తప్పవ్! -
ముదురుతున్న హ్యుందాయ్ "కాశ్మీర్" ట్వీట్ వివాదం..!
ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హ్యుందాయ్‌కు చెందిన పాకిస్థాన్ విభాగం "కాశ్మీర్" వ్యవహారంపై సోషల్‌మీడియాలో చేసిన ఓ పోస్ట్‌తో ఆ సంస్థ ఇప్పుడు పెను వివాదంలో చిక్కుకుంది. హ్యుందాయ్ "కాశ్మీర్" ట్వీట్ వివాదం రోజు రోజుకి పెరుగుతూ పోతుంది. ఆటోమొబైల్ కంపెనీ హ్యుందాయ్ పాకిస్తాన్ విభాగం కాశ్మీర్ పై వివాదాస్పద వ్యాఖ్యలను ట్విటర్ వేదికగా పోస్ట్ చేసిన తర్వాత దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి చుంగ్ యూ-యోంగ్ భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో ఫోన్లో మాట్లాడుతూ.."విచారం వ్యక్తం చేశారు". హ్యుందాయ్ పాకిస్తాన్ సోషల్ మీడియా ఫిబ్రవరి 5న "కాశ్మీరీ సోదరుల త్యాగాలను" గుర్తుచేసుకుంటున్నట్లు ఒక పోస్టు పెట్టింది. దీంతో వివాదం మొదలైంది. "రిపబ్లిక్ ఆఫ్ కొరియా విదేశాంగ మంత్రి హెచ్.ఇ.చుంగ్ యూ-యోంగ్ ఈ ఉదయం భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో ఫోన్లో మాట్లాడారు. వారు అనేక అంశాలపై చర్చించగా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా విదేశాంగ మంత్రి కూడా సోషల్ మీడియా పోస్ట్ వల్ల భారత ప్రజలకు, ప్రభుత్వానికి కలిగిన ఇబ్బందికి చింతిస్తున్నామని తెలియజేసినట్లు" ఎంఈఏ తన వివరణాత్మక ప్రకటనలో తెలిపింది. దక్షిణ కొరియాలోని భారత రాయబారి హ్యుందాయ్ ప్రధాన కార్యాలయంలోని సంబంధిత అధికారుల నుంచి వివరణ కోరినట్లు ఎంఈఏ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. Received a call from ROK FM Chung Eui-yong today. Discussed bilateral and multilateral issues as also the Hyundai matter. — Dr. S. Jaishankar (@DrSJaishankar) February 8, 2022 ఇంతలో, న్యూఢిల్లీలోని దక్షిణ కొరియా రాయబారిని కూడా ఎంఈఏ ఈ విషయం గురుంచి పిలిపించి అడిగినది. "కాశ్మీర్ సాలిడారిటీ డేకు మద్దతు తెలుపుతూ హ్యుందాయ్ పాకిస్తాన్ చేసిన సోషల్ మీడియా పోస్టును మేము చూశాము. ఈ సోషల్ మీడియా పోస్ట్ గురుంచి ఆదివారం, 6 ఫిబ్రవరి 2022న, సియోల్'లోని మా రాయబారి హ్యుందాయ్ హెడ్ క్వార్టర్స్ సంప్రదించి వివరణ కొరాము. ఆ వెంటనే సోషల్‌మీడియా నుంచి పోస్ట్‌ను వారు డిలీట్ చేశారు. సోషల్‌మీడియాలో వచ్చిన అనుచితపోస్టుపై భారత్ తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. దేశ భౌగోళిక సమగ్రతకు సంబంధించి విషయాల్లో రాజీపడేది లేదని గట్టిగా స్పష్టం చేశాం. దీనిపై కంపెనీ తగిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం” అని అరీందమ్ బాగ్బీ ఓ ప్రకటనలో వెల్లడించారు. (చదవండి: గూగుల్ సెట్టింగ్స్‌లో ఈ మార్పు చేస్తే మీ ఖాతా మరింత భద్రం..!) -
భారీ వర్షాలు, స్పెషల్ ఆఫర్ ప్రకటించిన హ్యుందాయ్
భారీ వర్షాల కారణంగా డ్యామేజీ అవుతున్న హ్యుందాయ్ కార్లపై ఆ సంస్థ ఆఫర్ ప్రకటించింది.ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గించడంతో పాటు స్పెషల్ సర్వీస్‌లను అందిస్తున్నట్లు వెల్లడించింది. గత నాలుగు రోజులుగా పడుతున్న భారీ వర్షాల కారణంగా ముంబైలో అతలాకుతలం అవుతోంది. కుండపోత వర్షాల కారణంగా 32 మంది ప్రాణాలు కోల్పోయారు. 52మంది ఆచూకీ లభ్యం కాలేదని మహరాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఏక్ నాథ్ షిండే తెలిపారు.. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్), భారత నౌకాదళం కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నాయని, 84,452 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. ముఖ్యంగా కోస్తా జిల్లాలైన రాయిగఢ్, రత్నగిరి, సింధుదుర్గ్ ప్రాంతాలలో కుండపోత వర్షాలు కురవడంతో ప్రజలు ప్రాణాల్ని అరచేతిలో పెట్టకొని బిక్కుబిక్కుమంటూ గడపుతున్నారు. ఇళ్లు ధ్వంసమయ్యాయి. వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అయితే ముంబైలో వర్షాల కారణంగా దెబ్బతిన్న హ్యుందయ్ సంస్థకు చెందిన వాహనాలకు ఈ ఏడాది పాటు స్పెషల్ సర్వీస్‌లు అందించడంతో పాటు ఇన్సూరెన్స్ ప్రీమియంలో 50శాతం తగ్గిస్తున్నట్లు హ్యుందాయ్ ఇండియా సేల్స్,మార్కెటింగ్ డైరక్టర్ తరుణ్ గార్గ్ ప్రకటించారు. -
కరోనా భయం.. కారే నయం!
సాక్షి, హైదరాబాద్: కరోనా పుణ్యమాని జీవనశైలిని దాని కి అనుగుణంగా మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ క్రమంలో విలాస వస్తువు ల జాబితాలో ఉన్న కారు ఇ ప్పుడు ‘అవసరం’గా మారే పరిస్థితి ఉత్పన్నమవుతోంది. ఎగువ మధ్య తరగతి ఇళ్ల ముందు తళుక్కున మెరుస్తు న్న కార్లు, ఇప్పుడు సగటు మ ధ్య తరగతి ఇళ్ల ముందూ కనిపించబోతున్నాయి. ప్రజా రవాణా, ఇతరత్రా ప్రైవేట్ వా హనాల్లో ప్రయాణం భద్రం కాదని భావిస్తున్న జనం.. కార్ల కొనుగోలుపై మోజు చూపుతున్నారు. తమ ప్రయాణ అవసరాలతో పాటు పిల్లలను ఆటోలు, బస్సుల్లో బడికి పంపడం సురక్షితం కాదని యోచిస్తున్న పలువు రు కారు కొనాలని ఫిక్స్ అయిపోతున్నారు. పది రోజుల క్రితం తెరుచుకున్న కార్ల షోరూంలకు వస్తున్న వారిని చూస్తే ఇది ఇట్టే అర్థమవుతుంది. ఇప్పుడు కార్ల కోసం ఎంక్వైరీ చేస్తున్న వారి జాబి తాలో 90% చిన్నకార్లే ఉంటున్నాయి. వీరంతా ఇంతకాలం కారును తమ పరిధిలోని వస్తువు కాదని భావించినవారే కావటం విశేషం. ఇక, ఇప్పటికే కారు ఉన్న వారు ఇంటి, ఇతర అవసరాలకు మరొకటి కొనే యోచనలో ఉన్నారు. అంతా ఆన్లైన్లోనే.. కరోనా భయంతో షో రూంలకు వెళ్లే వారి సంఖ్య బాగా తగ్గింది. దీంతో ఆయా షోరూంలు పూర్తి వివరాలను ఆన్లైన్లో ఉంచుతున్నాయి. ఈ–కొటేషన్, ఈ–బ్రోచర్, డిజిటల్ డెమో, ఈ–ఫైనాన్స్ ప్రాసెస్.. ఇలా అన్నీ వెబ్సైట్ ద్వారా చూసుకునే వీలు కల్పించాయి. కొనుగోలుదారులు ముందుగా ఆన్లైన్లోనే వాటిని పరిశీలించి.. కారు ఎంపిక చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక డిజిటల్ టెస్ట్ డ్రైవ్ ఆప్షన్ కూడా ఉంది. ఆ కారు నడిపితే ఎలా ఉంటుందో ఆన్లైన్ స్క్రీన్ ముందు కూర్చుని ఆస్వాదించొచ్చు. ఆన్లైన్లో ఎప్పటికప్పుడు ఇలాంటి వాటిని కొత్త ఫీచర్లతో అం దించేందుకు వీలుగా కార్ల కంపెనీలు ప్రచార బడ్జెట్‌ను రెట్టింపు చేశాయి. ఇక ఎవరైనా కారు కొనేందుకు ఆన్లైన్లో సెర్చ్ చేయగానే, ఆ సమాచారం కార్ల కంపెనీ సిబ్బందికి చేరిపోతోంది. దీంతో కొనుగోలుదారులు సెర్చ్ చేస్తున్న చోట తమ కార్లకు సంబంధించి ఫీచర్లతో కూడిన పాపప్ కనిపించేలా చేస్తున్నారు. దాన్ని క్లిక్ చేయగానే సమగ్ర సమాచారం స్క్రీన్‌పై వస్తోంది. ఏవైనా సందేహాలుంటే అప్పటికప్పుడు నివృత్తిచేసే ఏర్పాటూ ఉంది. ఈ సేవలు 24 గంటలూ అందుబాటులో ఉంటున్నాయి. ఇక కొందరు కొ నుగోలుదారులు నేరుగా షోరూంలకు వెళ్తున్నా రు. అయితే, అక్కడి నమూనా కార్లలో కూర్చుని పరిశీలించడానికి జంకుతున్నారు. అదే కారును అంతకుముందు ఎవరైనా పరిశీలించి ఉంటారనే దే ఇందుకు కారణం. దీంతో షోరూం నిర్వాహకులు కార్ల స్టీరింగులు, సీట్లు, డోర్ హ్యాండిల్స్, ఇతర ముఖ్యమైన చోట్ల తిరిగి తొలగించగలిగే పారదర్శక తొడుగులు ఏర్పాటు చేస్తున్నారు. ఒక కొనుగోలుదారు దాన్ని పరిశీలించగానే వాటిని తొలగించి కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. టాప్‌గేర్‌లో బుకింగ్‌లు ► మారుతి సుజుకీ కార్లు తెలంగాణలో గత వారం రోజుల్లో దాదాపు 400 బుక్ అయ్యాయి. వీటిలో ఈనెలాఖరు వరకు 250 కార్లు డెలివరీ అవుతాయని కంపెనీ చెబుతోంది. నిత్యం సగటున 50 కార్లు బుక్ అవుతున్నట్టు చెబుతోంది. ► హ్యుందాయ్ కార్లు లాక్డౌన్ తర్వాత 250 వరకు బుక్ అయ్యాయట. రోజూ రాష్ట్రవ్యాప్తంగా 150 వరకు ఎంక్వైరీలు వస్తున్నాయనేది నిర్వాహకుల మాట. ► నేరుగా షోరూమ్‌లకు వచ్చి కార్లను పరిశీలించే వారి సంఖ్య 60 శాతానికి పడిపోయింది. ఆన్లైన్లో ఎంక్వైరీల సంఖ్య రెట్టింపైంది. ► కారును పరిశీలించిన వారిలో కొంతమందే ఫైనల్‌గా కొంటారు. అదిప్పుడు 40 శాతం అదనంగా పెరిగింది. కొత్త మార్పుకు శ్రీకారం కార్లు కొనాలనుకునే వారి సం ఖ్య పెరగబోతోంది. షోరూం లకు వచ్చేవారి తో డిస్కషన్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. టెస్ట్ కార్లలో ముఖ్యమైన చోట్ల ప్రత్యేక కవర్లు ఏర్పాటుచేస్తున్నాం. కరోనా నిబంధనలన్నీ పాటిస్తున్నాం. షో రూంలను శానిటైజ్ చేస్తున్నాం. – డీకే రాజా, డైరెక్టర్, వరుణ్ మోటార్స్ ఫైనాన్స్తోనే తంటా ప్రజా రవాణాలో ప్రయాణానికి భయపడే చాలామంది సొంత కారుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఫైనాన్స్ సంస్థలు తటపటాయిస్తుండటం సమస్యగా మారింది. త్వరలో అదీ పరిష్కారమవుతుందని ఆశిస్తున్నాం. ఫైనాన్స్‌కు క్లియరెన్స్ రాగానే ఎక్కువమంది కార్లు బుక్ చేసుకుంటారు. – అశోక్, సీఈఓ, కున్ హ్యుందాయ్ -
ఐసీఐసీఐ బ్యాంక్ ‘మహా లోన్ ధమాకా’
ముంబై: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్.. తక్షణ రుణ మంజూరీ సేవలను అందించనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఇందుకోసం ‘మహా లోన్ ధమాకా’ పేరిట ప్రస్తుత ఆరి్థక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 2,000 రుణ శిబిరాలను ఏర్పాటు చేయనుంది. వ్యక్తిగత, వాహన, బంగారు రుణాలతో పాటు కిసాన్ క్రెడిట్ కార్డ్‌లను ఈ క్యాంప్స్ ద్వారా జారీ చేయనున్నట్లు వివరించింది. హ్యుందాయ్ మోటార్స్ వంటి కంపెనీలతో ఏర్పాటుచేసుకున్న ఒప్పందం మేరకు కస్టమర్లు కాకపోయినా.. ప్రత్యేక ఆఫర్లతో మేళా వద్ద రుణాలను ఇవ్వనున్నట్లు వెల్లడించింది. సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాలే లక్ష్యంగా ఈ క్యాంప్స్ ఉండనున్నాయని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) అనుప్ బాగ్చి పేర్కొన్నారు. -
పట్నం శిగలో మరో నగ!
సాక్షి, ఇబ్రహీంపట్నం : పట్నం శిగలో మరో నగ మెరువనుంది. ఇప్పటికే అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు ఈ ప్రాంతంలో కొలువుదీరడంతో ఇబ్రహీంపట్నం ఖ్యాతి ప్రంపంచ స్థాయిలో మారుమోగుతోంది. రక్షణ రంగ సంస్థలైన అక్టోపస్, బీడీఎల్, ఎన్ఎస్జీ తదితర ప్రభుత్వరంగ సంస్థలతో పాటు ఆదిబట్లలో టాటా ఏరోస్పేస్, టాటా లాకిడ్ మార్టిన్, బోయింగ్ విమానాల తయారీ కంపెనీ, సాఫ్ట్వేర్ దిగ్గజం టీసీఎస్ తదితర సంస్థలు పట్నం నియోజకవర్గం చుట్టూ ఏర్పాటైన విషయం తెలిసిందే. వీటిరాకతో ఈ ప్రాంతంలో రియల్‌వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందం మాదిరిగా సాగుతోంది. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని పడమర ప్రాంతం ఆదిబట్ల, బొంగ్లూర్, కొంగరకలాన్ ప్రాంతంలో ఔటర్ రింగ్‌రోడ్డు రాకతో కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి జరిగింది. తూర్పు భాగంలో రక్షణ రంగ సంస్థలు ఏర్పాటయ్యాయి. కొలువుదీరనున్న హ్యుందాయ్ ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని ఎల్మినేడు వ్యవసాయాధారిత గ్రామం. ప్రస్తుతం ఈ గ్రామం వైపు బహుళజాతి కంపెనీలు చూస్తున్నాయి. ఈక్రమంలో ఆదిబట్ల తరహాలో అభివృద్ధి జరిగేందుకు అవకాశం ఉంది. ఎల్మినేడు గ్రామంలో హ్యుందాయ్ కార్ల కంపెనీ ఏర్పాటు కోసం ప్రభుత్వం యోచిస్తోంది. టీఎస్ఐఐసీ ద్వారా భూములు సేకరించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. నాలుగు సంవత్సరాలుగా భూములు సేకరణ కోసం అధికారులు సర్వే చేస్తున్నారు. కార్ల తయారీలో దిగ్గజంగా కొనసాగుతున్న హ్యుందాయ్ పరిశ్రమను నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లేనని తెలుస్తోంది. గతంలో ఏరోస్పేస్ ఏర్పాటు కోసం ఇక్కడ భూములు కేటాయించాలనే యోచనలో ఉన్న ప్రభుత్వం.. భవిష్యత్తు అవసరాల కోసం అదే స్థానంలో ఈ కార్ల కంపెనీ ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే ఆదిబట్లలో హెలీకాప్టర్ విభాగాలు, బోయింగ్ విమానాల తయారీ అవుతున్న విషయం తెలిసిందే. అదేవిధంగా ఎల్మినేడులో కార్ల తయారీ కంపెనీ కొలువు దీరనున్న నేపథ్యంలో ఈ ప్రాంతం రూపురేఖలు మారబోతున్నాయి. పరిశ్రమల శాఖ ఈ సంస్థ ఏర్పాటు కోసం కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేసింది. సూమారు 2 వేల మందితో పని చేసే ఈ కంపెనీలో సుమారు రూ.10వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు యాజమాన్యం ముందుకొచ్చింది. త్వరలోనే అధికారికంగా ప్రభుత్వం కంపెనీ ఏర్పాటు కోసం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. జోరుగా కొనసాగుతున్న సర్వే ఎల్మినేడు గ్రామంలోని సర్వే నంబరు 512లో 378.09 ఎకరాలు ప్రభుత్వ భూమి, సర్వే నంబరు 166లో 108.09 ఎకరాలు, 421 నంబర్లో 178.33 ఎకరాలు , సర్వే నంబరు 492లో 1.17 ఎకరాల భూములను సేకరిచేందుకు టీఎస్ఐఐసీ అధికారులు నిర్ణయించారు. ప్రభుత్వ, పట్టా భూముల్లో వ్యవసాయం చేసుకొని జీవనం సాగిస్తున్న రైతులకు పరిహారం చెల్లించేందుకు సర్కారు చర్యలు తీసుకోనుంది. గతంలో ఇచ్చిన పరిహారం కంటే లక్ష రూపాయలు ఎక్కువగా ఇప్పించేందుకు కృషి చేస్తున్నట్లు స్థానిక ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. ఇప్పటికే రైతులను ఒప్పించడానికి బహిరంగ విచారణ చేపట్టారు. ఈ భూముల సర్వే వేగవంతంగా సాగుతోంది. రెండుమూడు రోజులుగా ఎల్మినేడు గ్రామంలోనే ఉండి అధికారులు సర్వే చేస్తున్నారు. ఇప్పటికే రైతులకు నోటీసులు జారీ చేశారు. వారి భూములను కంపెనీ ఏర్పాటు చేసేందుకు సేకరించనున్నట్లు తెలియజేశారు. దీనికి రైతుల నుంచి కూడా సానుకూల స్పందన వస్తోంది. దసరా తరువాత పరిహారం అందజేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. మారనున్న రూపురేఖలు కార్ల తయారీ కంపెనీ ఏర్పాటు కానున్న నేపథ్యంలో భూముల ధరలు ఆకాశాన్ని తాకే అవకాశం ఉంది. ఇప్పటికే బహుళజాతి కంపెనీలు ఇక్కడ కొలువు దీరడంతో రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఎల్మినేడుతో పాటు కప్పపహాడ్, తుర్కగూడ, ఎర్రకుంట, తులేకలాన్, పోచారం, చర్లపటేల్‌గూడ, కర్ణంగూడతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న భూమల ధరలు త్వరలో బంగారం కానున్నాయి. ఇప్పటికే ఒక్కో ఎకరం సుమారు రూ.75 లక్షలకు పైగా పలుకుతున్నాయి. హ్యుందాయ్ కార్ల తయారీ కంపెనీ ఏర్పాటు తర్వాత ఈ ప్రాంతం రూపురేఖలు మారిపోతాయి. ఇప్పటికే అప్రమత్తమైన రియల్టర్లు ఎల్మినేడు ప్రాంతంలోని భూములు కొనుగోలు చేయడానికి సిద్ధమవుతున్నారు. పట్నం మరింత అభివృద్ధి ఇప్పటికే ఇబ్రహీంపట్నంలో ప్రఖ్యాత సంస్థలు కొలువుదీరాయి. వాటి ఏర్పాటుకు చాలా కృషి చేశాను. ఈ ప్రాంతంలో వివిధ కంపెనీలను నెలకొల్పేందుకు ప్రభుత్వం ఆసక్తిగా ఉంది. ఎల్మినేడులో హ్యుందాయ్ కార్ల తయారీ పరిశ్రమ రాబోతుంది. ఈ నేపథ్యంలో అభివృద్ధి పరుగులు పెట్టనుంది. ఆదిబట్ల తరహాలో ఎల్మినేడును తయారు చేయాలన్నదే నా లక్ష్యం. ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి కూడా పెరుగుతుంది. త్వరలోనే కంపెనీ ఏర్పాటుక సేకరించే భూములకు పరిహారం చెల్లింపునకు అ«ధికారులతో మాట్లాడుతాను. – మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం -
హ్యుందాయ్ కార్ల ధరలు మరింత ప్రియం
న్యూఢిల్లీ: హ్యుందాయ్ మోటార్స్ ఇండియా తన వాహన ధరల పెంపు నిర్ణయాన్ని ప్రకటించింది. కంపెనీ నూతనంగా విడుదల చేసిన వెన్యూ, కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు మినహాయించి మిగిలిన అన్ని మోడళ్లపై ధరలను పెంచనున్నట్లు మంగళవారం వెల్లడించింది. నూతన భద్రతా నిబంధనలను పాటించాల్సి రావడం వల్ల ముడి పదార్థాల వ్యయం పెరిగినందున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేసింది. మోడల్ ఆధారంగా రూ.9,200 వరకు పెంపు ఉండనుండగా.. కొత్త ధరలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. కంపెనీ శాంత్రో హ్యాచ్‌బ్యాక్ నుంచి టక్సన్ ఎస్యూవీ వరకు విక్రయిస్తోంది. -
హ్యుందాయ్ ఎలక్ట్రిక్ వస్తోంది!!
ముంబై: హ్యుందాయ్ కంపెనీ మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన వ్యాపార సదస్సులో రెండు ఎలక్ట్రిక్ వాహనాలను ఆవిష్కరించింది. ఇక్కడ జరుగుతున్న భారత కొరియా వ్యాపార సదస్సులో ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో ఎస్యూవీ నెక్సోను, గ్లోబల్ మోడల్ లోనిక్‌ను ప్రదర్శనకు ఉంచినట్లు హ్యుందాయ్ నమ్యాంగ్ ఆర్ అండ్ డీ సెంటర్ వైస్ ప్రెసిడెంట్ ఎస్.హెచ్. కిమ్ చెప్పారు. భారత్‌లో తయారీకి గత 20 ఏళ్లుగా తమ వంతు బాధ్యత నిర్వర్తిస్తున్నామని చెప్పారాయన. సమర్థమైన పర్యావరణ అనుకూల వాహనాలను అందించడంలో ఈ ఎలక్ట్రిక్ వాహనాల ఆవిష్కరణను మైలురాయిగా వర్ణించారు. -
హ్యుందాయ్ ఎలైట్ ఐ20 విక్రయాలు @: 1.5 లక్షలు
న్యూఢిల్లీ: హ్యుందాయ్ ఇలీట్ ఐ20 కారు దేశీయంగా 1.5 లక్షల అమ్మకాల మైలురాయిని దాటింది. హ్యుందాయ్ కార్లపై వినియోగదారులకున్న నమ్మకానికి ఈ ఘనత ఒక నిదర్శనమని హ్యుందాయ్ కంపెనీ తెలిపింది. గత ఏడాది మార్చిలో ఈ కారును మార్కెట్లోకి తెచ్చామని హ్యుందాయ్ మోటార్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేశ్ శ్రీవాత్సవ చెప్పారు. భారత ప్రీమియం కాంపాక్ట్ సెగ్మెంట్లో 66% మార్కెట్ వాటాను సాధించామని వివరించారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో రూపొందిన విశిష్టమైన భారత తయారీ కారు ఇదని పేర్కొన్నారు. ప్రీమియం కాంపాక్ట్ సెగ్మెంట్లో మారుతీ సుజుకీ బాలెనో, హోండా జాజ్, ఫోక్స్‌వ్యాగన్ పోలో కార్లకు హ్యుందాయ్ ఇలీట్ ఐ20 కారు గట్టిపోటీనిస్తోంది. హ్యుందాయ్ దేశీయంగా 10 మోడళ్లను విక్రయిస్తోంది. -
చిన్న కారు.. పెద్ద పోటీ
800 సీసీ విభాగంలో లీడర్ ఆల్టోనే ⇒ ఇయాన్‌తో సవాలు విసిరిన హ్యుందాయ్ ⇒ క్విడ్తో బరిలోకి దూసుకొచ్చిన రెనో ⇒ 2016లో నిస్సాన్ 800 సీసీ కారు ⇒ వరుసలో టాటా, జనరల్ మోటార్స్ కూడా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆల్టో.. మారుతి సుజుకి తయారు చేస్తున్న ఈ 800 సీసీ కారు ప్రత్యేకతేంటో తెలుసా? భారత్‌లో గత 10 ఏళ్లుగా టాప్ సెల్లింగ్ మోడల్. 2014-15లో అయితే ఏకంగా 2,64,492 ఆల్టో కార్లు అమ్ముడుపోయాయి. అంటే... ఏడాదికి దాదాపు 26 లక్షల కార్లు అమ్ముడుపోయే భారత మార్కెట్లో 10% వాటా ఈ ఒక్క బ్రాండ్‌దే. అంతకు ముందటి ఏడాదితో పోల్చినా ఇది 2.4% అధికం. మారుతికి ఉన్న బ్రాండ్ విలువకు ఈ కారు 800 సీసీ విభాగంలో ఉండడం ఇంతటి అమ్మకాలకు కారణమన్నది ఆటో రంగ నిపుణుల మాట. ఇంతటి ప్రాధాన్యమున్న 800 సీసీ విభాగంలో హ్యుందాయ్ సంస్థ ‘ఇయాన్’తో బరిలోకి దిగింది. విక్రయాల పరంగా దేశంలో 6వ స్థానంలో నిలిచిన ఈ మోడల్ అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంలో 78,334 మేర నమోదయ్యాయి. ఈ మార్కెట్ అత్యంత ఆకర్షణీయంగా ఉండటంతో తామూ పోటీలో ఉన్నామంటూ మరిన్ని కంపెనీలు సిద్ధమవుతున్నాయి. సంచలనాలకు వేదిక.. ఎప్పటి నుంచో చిన్నకారు తెస్తామని వాగ్దానం చేస్తూ వచ్చిన రెనో... ఇటీవలే 800 సీసీ ‘క్విడ్’ను మార్కెట్లోకి తెచ్చి సందడి చేసింది. నిజానికి చిన్నకారు కోసం గతంలో నిస్సాన్‌తో జట్టుకట్టినా ఆ భాగస్వామ్యం ఫలవంతం కాలేదు. దీంతో బజాజ్‌తో కలసి చిన్నకారు తయారు చేసే ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే దాదాపు నమూనాను పూర్తి చేసిన బజాజ్... రెనో అధికారుల్ని ఆహ్వానించి దాన్ని చూపించింది. ఆ మోడల్‌ను మార్కెట్‌కు కూడా చూపించటం గమనార్హం. అయితే ఆ మోడల్ ద్వారా తాము అంతర్జాతీయంగా పోటీ పడలేమని భావించిన రెనో... ఆ భాగస్వామ్యాన్ని కూడా వదులుకుంది. చివరకు తానే సొంతగా భారతీయ ఇంజనీర్లను విశ్వసించి బరి లోకి దిగింది. తన మోడళ్లలో అత్యంత సక్సెస్ఫుల్ మోడల్‌గా ఉన్న ‘డస్టర్’కు మినీ రూపమా?... అన్న మాదిరిగా క్విడ్‌ను తయారు చేసి మార్కెట్లోకి తెచ్చింది. దీంతో ఆల్టో, ఇయాన్, క్విడ్ మధ్య పోటీ రసవత్తరంగా ఉంటుందనేది ఆటో నిపుణుల విశ్లేషణ. క్విడ్ అభివృద్ధికి, చెన్నై ప్లాంటు విస్తరణకు రూ.2,000 కోట్ల దాకా కంపెనీ వెచ్చించింది. ప్రస్తుతమున్న చిన్న కార్లకు భిన్నంగా, అంత్యంత ఆకర్షణీయమైన డిజైన్‌తో ఈ మోడల్‌ను తెచ్చామని రెనో అంటోంది. గ్లోబల్ కారుగా అభివృద్ధి చేసిన క్విడ్‌ను భారత్‌తో పాటు ద క్షిణాఫ్రికా, బ్రెజిల్ తదితర దేశాల్లోనూ విక్రయించనున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌పై దృష్టిపెట్టి ఏటా 10 లక్షల యూనిట్ల విక్రయాలు నమోదు చేస్తామని కంపెనీ ధీమాగా చెబుతోంది. భారత్‌లో కంపెనీ మార్కెట్ వాటా ప్రస్తుతం 2 శాతంగా ఉంది. దీన్ని 2016-17 నాటికి 5 శాతానికి చేరుస్తామని, అందులో క్విడ్ పాత్ర ఎక్కువగా ఉంటుందని రెనో చెబుతోంది. టాటా మోటార్స్ నుంచి.. ‘పెలికాన్’ కోడ్ నేమ్‌తో టాటా మోటార్స్ సైతం మరో చిన్నకారును అభివృద్ధి చేస్తున్నట్టు సమాచారం. 800 సీసీ డీజిల్ మోటార్‌తో పెలికాన్‌ను రూపొందిస్తున్నట్టు ఆటో వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కంపెనీ నానో కార్లతో సామాన్యులకూ దగ్గరైంది. 624 సీసీలో పలు నానో మోడళ్లను విక్రయిస్తోంది. అలాగే కైట్ పేరుతో హ్యాచ్ బ్యాక్ మోడల్‌ను రూపొందిస్తోంది. నానోకు, కైట్‌కు మధ్యస్తంగా పెలికాన్ ఉంటుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. పెలికాన్ 800 సీసీ కారు ధర రూ.2.5 లక్షలు ఉండే అవకాశముంది. స్పార్క్ ప్లాట్‌ఫామ్‌పై జీఎం కొత్త కారు.. జనరల్ మోటార్స్(జీఎం) సైతం 800 సీసీ విభాగంలోకి ప్రవేశించే అవకాశాలున్నాయి. మార్కెట్లో ఉన్న మోడళ్ల కంటే తక్కువ ధరను నిర్ణయించడం ద్వారా అమ్మకాలను పెంచుకోవాలన్నది కంపెనీ ఆలోచన. షెవర్లే స్పార్క్ ప్లాట్‌ఫామ్‌పై కారును అభివృద్ధి చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు మారుతి సుజుకీ 800 సీసీ డీజిల్ ఇంజన్‌ను ఒకటిరెండు నెలల్లో ఆవిష్కరించనుంది. వ్యాన్లు, ఇతర యుటిలిటీ వాహనాలను మినహాయిస్తే దేశంలో అన్ని కంపెనీలవీ కలిపి దేశవ్యాప్తంగా 2014-15లో 18,76,017 కార్లు అమ్ముడయ్యాయి. వచ్చే ఏడాది నిస్సాన్ కూడా.. చెన్నైలో నిస్సాన్-రెనోలకు ఉమ్మడి ప్లాంటుంది. ఏటా 4 లక్షల యూనిట్లను తయారు చేసే సామర్థ్యం ఉన్న ఈ ప్లాంట్‌ను రెండూ సమానంగా ఉపయోగించుకుంటున్నాయి. దీన్లోనే క్విడ్ మోడల్‌ను రెనో అభివృద్ధి చేసింది. చిన్న కార్ల తయారీ కోసం రెండు సంస్థలూ రూపొందించిన కామన్ మాడ్యూల్ ఫ్యామిలీ ప్లాట్‌ఫామ్‌పై క్విడ్ రూపుదిద్దుకుంది. ఇప్పుడు ఇదే ప్లాట్‌ఫామ్‌పై నిస్సాన్ సైతం ‘రెడీ-గో’ పేరిట 800 సీసీ కారును అభివృద్ధి చేస్తోంది. నిస్సాన్ లోకాస్ట్ కార్ బ్రాండ్ అయిన డాట్సన్ నుంచి ఇది విడుదల కాబోతోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ మోడల్ రోడ్డెక్కుతుందని, ధర రూ.2.5 లక్షల నుంచి ప్రారంభమవుతుందని సమాచారం. -
హ్యుందాయ్ కొత్త ఎలంట్రా
పెట్రోల్ కారుః రూ.14.13 లక్షలు-రూ.16.45 లక్షలు డీజిల్ కారుః రూ.14.58 లక్షలు- రూ.17.94 లక్షలు న్యూఢిల్లీ: హ్యుందాయ్ కంపెనీ ప్రీమియం సెడాన్ ఎలంట్రా మోడల్లో కొత్త వేరియంట్‌ను సోమవారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ కొత్త వేరియంట్ పెట్రోల్, డీజిల్ ఆప్షన్లలో లభ్యమవుతుందని హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎండీ, సీఈఓ బి.ఎస్. సియో చెప్పారు. పెట్రోల్ వేరియంట్ ధరలు రూ.14.13 లక్షల నుంచి రూ.16.45 లక్షల రేంజ్లో, డీజిల్ వేరియంట్ ధరలు రూ.14.58 లక్షల నుంచి రూ.17.94 లక్షల రేంజ్లో ఉన్నాయని (అన్ని ధరలూ ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) వివరించారు. పెట్రోల్ కారు 16.3 కి.మీ. డీజిల్ కారు 22.7 కి.మీ మైలేజీని ఇస్తాయని పేర్కొన్నారు. వినూత్నమైన డ్రైవింగ్, అత్యున్నతమైన సౌకర్యాలతో కూడిన ఫీచర్లతో ఈ కొత్త వేరియంట్లను అందిస్తున్నామని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా కోటి కార్ల అమ్మకాలు సాధించిన తొలి హ్యుందాయ్ కారు ఇదేనని తెలిపారు. అంతేకాకుండా అంతర్జాతీయంగా కోటి కార్ల అమ్మకాలు సాధించిన అగ్రశ్రేణి పది మోడళ్లలో ఇది కూడా ఒకటని వివరించారు. సమీప భవిష్యత్తులో 5 లక్షల వార్షిక అమ్మకాలు సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. -
హ్యుందాయ్ వెర్నా.. కొత్త వేరియంట్
ధరల శ్రేణి రూ.7.74-12.19 లక్షలు న్యూఢిల్లీ: హ్యుందాయ్ కంపెనీ వెర్నా మోడల్లో కొత్త మోడల్‌ను బుధవారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ కొత్త వేరియంట్‌తో సెడాన్ సెగ్మెంట్లో తమ స్థానం మరింత పటిష్టమవుతుందని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, రాకేశ్ శ్రీవాత్సవ చెప్పారు. ఈ కొత్త వేరియంట్ ధరలు రూ.7.74 లక్షల నుంచి రూ.12.19 లక్షల రేంజ్(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)లో ఉన్నాయని పేర్కొన్నారు. హోండా సిటీ, మారుతీ సియాజ్‌లకు పోటీనిచ్చే ఈ వెర్నా మోడల్ డీజిల్, పెట్రోల్ ఇంజిన్లలో, పది వేరియంట్లలో లభిస్తోంది. సమీప భవిష్యత్తులో దేశీయంగా ఏడాదికి 5 లక్షల కార్లను విక్రయించడం లక్ష్యమని శ్రీవాత్సవ పేర్కొన్నారు. దీంట్లో భాగంగానే వెర్నాలో కొత్త వేరియంట్‌ను తెచ్చామని, తమ కంపెనీ ఇతర మోడళ్లలో మరిన్ని వేరియంట్లను అందిస్తామని ఆయన తెలిపారు. కాగా, ఈ కంపెనీ ప్రీమియం హ్యాచ్‌బాక్ ఇలీట్ ఐ20లో క్రాస్-ఓవర్ వెర్షన్, కాంపాక్ట్ ఎస్‌యూవీతోపాటు కొత్తగా మల్టీ పర్పస్ వెహికల్(ఎంపీవీ) సెగ్మెంట్లోకి ప్రవేశించనున్నదని సమాచారం. -
మారుతీ కార్ల రేట్లకు రెక్కలు
ఇదే బాటలో హ్యుందాయ్ కూడా... వచ్చే నెల నుంచి పెంపు వర్తింపు న్యూఢిల్లీ: కార్ల కంపెనీలు కార్ల ధరలను పెంచుతున్నాయి. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలను తట్టుకోవడానికి, అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ ధరలను పెంచక తప్పడం లేదని కంపెనీలు చెబుతున్నాయి. ఇప్పటికే బీఎండబ్ల్యూ, జనరల్ మోటార్స్(జీఎం) ధరలను పెంచుతున్నట్లు ప్రకటించగా... తాజాగా మారుతీ సుజుకీ, హ్యుందాయ్ కంపెనీలు కూడా ఇదే బాటలో పట్టాయి. ధరల పెరుగుదల వచ్చే నెల నుంచి వర్తిస్తుంది. మారుతీ పెంపు 2-4 శాతం మారుతీ కంపెనీ తన అన్ని మోడళ్ల కార్ల ధరలను 2-4% పెంచుతోంది. ఈ పెరుగుదల వచ్చే నెల నుంచి అమల్లోకి వస్తుందని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్(మార్కెటింగ్ అండ్ సేల్స్) ఆర్.ఎస్. కల్సి చెప్పారు. గత ఏడాది అక్టోబర్‌లో ధరలను పెంచామని, అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉండటంతో అప్పటి నుంచి ఇప్పటి వరకూ ధరలను పెంచలేదని పేర్కొన్నారు. ఉత్పత్తి వ్యయాలు పెరుగుదలను ఇప్పటివరకూ భరించగలిగామని, ఇక ఇప్పుడు ధరలను పెంచక తప్పడం లేదని వివరించారు. మారుతీ సుజుకీ కంపెనీ రూ.2.37 లక్షల ధర ఉన్న ఆల్టో 800 నుంచి రూ.24.6 లక్షలు(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) ఉన్న గ్రాండ్ విటారా వరకూ కార్లను విక్రయిస్తోంది. హ్యుందాయ్ పెంపు రూ. 25,000... హ్యుందాయ్ కార్ల ధరలను రూ.5,000 నుంచి రూ. 25,000 వరకూ పెంచుతున్నట్లు ప్రకటిం చింది. అధిక ఉత్పత్తి వ్యయాలు, రూపాయి క్షీణించడంతో ధరల పెంపు అనివార్యమైందని హ్యుందాయ్ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్(సేల్స్, మార్కెటింగ్) రాకేశ్ శ్రీవాత్సవ చెప్పారు. ఇప్పటికే బీఎండబ్ల్యూ 5% వరకూ, జీఎం రూ.5,000-25,000 రేంజ్లో కార్ల కార్ల ధరలను పెంచాయి. ధరలను 1-2% రేంజ్లో పెంచుతామని టాటా మోటార్స్, మహీంద్రా గత నెలలోనే వెల్లడించాయి.