హ్యుందాయ్ కొత్త ఎలంట్రా | 2015 Hyundai Elantra Launched in India; Prices Start at Rs. 14.13 lakh | Sakshi
Sakshi News home page

హ్యుందాయ్ కొత్త ఎలంట్రా

Published Tue, Apr 21 2015 1:24 AM | Last Updated on Sun, Sep 3 2017 12:35 AM

హ్యుందాయ్ కొత్త ఎలంట్రా

హ్యుందాయ్ కొత్త ఎలంట్రా

పెట్రోల్ కారుః రూ.14.13 లక్షలు-రూ.16.45 లక్షలు
డీజిల్ కారుః  రూ.14.58 లక్షలు- రూ.17.94 లక్షలు

న్యూఢిల్లీ: హ్యుందాయ్ కంపెనీ ప్రీమియం సెడాన్ ఎలంట్రా మోడల్‌లో కొత్త వేరియంట్‌ను సోమవారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ కొత్త వేరియంట్ పెట్రోల్, డీజిల్ ఆప్షన్లలో లభ్యమవుతుందని హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎండీ, సీఈఓ బి.ఎస్. సియో చెప్పారు. పెట్రోల్ వేరియంట్ ధరలు రూ.14.13 లక్షల నుంచి రూ.16.45 లక్షల రేంజ్‌లో, డీజిల్ వేరియంట్ ధరలు రూ.14.58 లక్షల నుంచి రూ.17.94 లక్షల రేంజ్‌లో ఉన్నాయని (అన్ని ధరలూ ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) వివరించారు.

పెట్రోల్ కారు 16.3 కి.మీ. డీజిల్ కారు 22.7 కి.మీ మైలేజీని ఇస్తాయని పేర్కొన్నారు. వినూత్నమైన డ్రైవింగ్, అత్యున్నతమైన సౌకర్యాలతో కూడిన ఫీచర్లతో ఈ కొత్త వేరియంట్లను అందిస్తున్నామని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా కోటి కార్ల అమ్మకాలు సాధించిన తొలి హ్యుందాయ్ కారు ఇదేనని తెలిపారు. అంతేకాకుండా అంతర్జాతీయంగా కోటి కార్ల అమ్మకాలు సాధించిన అగ్రశ్రేణి పది మోడళ్లలో ఇది కూడా ఒకటని వివరించారు. సమీప భవిష్యత్తులో 5 లక్షల వార్షిక అమ్మకాలు సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement