న్యూఢిల్లీ: వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా (హెచ్‌ఎంఐఎల్) రెండు పునరుత్పాదక విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. వాహనాల తయారీకై 2025 నాటికి పూర్తిగా పునరుత్పాదక విద్యుత్‌ను వినియోగించాలన్న లక్ష్యంలో భాగంగా తమిళనాడులోని ప్లాంటులో వీటిని నెలకొల్పనుంది.
ఇందుకోసం ఫోర్త్ పార్ట్‌నర్ ఎనర్జీతో పవర్ పర్చేజ్ ఒప్పందం చేసుకున్నట్టు హ్యుందాయ్ తెలిపింది. 75 మెగావాట్ల సౌర, 43 మెగావాట్ల పవన విద్యుత్ ప్లాంట్‌ను స్థాపిస్తారు. ఈ రెండు కేంద్రాలకు హెచ్‌ఎంఐఎల్ రూ.38 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్, ఆపరేషన్స్, మెయింటెనెన్స్ కోసం ఫోర్త్ పార్ట్‌నర్ ఎనర్జీతో కలిసి స్పెషల్ పర్పస్ వెహికిల్ ఏర్పాటు చేశారు.
హ్యుండై మోటార్ ఇండియాకు ఈ ఎస్‌పీవీలో 26 శాతం వాటా ఉంటుంది. ప్రస్తుత విద్యుత్ అవసరాల్లో 63 శాతం పునరుత్పాదక వనరుల నుంచి సమకూరుతోందని కంపెనీ తెలిపింది. హెచ్‌ఎంఐఎల్ ప్లాంటుకు 25 ఏళ్లపాటు ఏటా 25 కోట్ల యూనిట్ల విద్యుత్ సరఫరా చేస్తామని ఫోర్త్ పార్ట్‌నర్ ఎనర్జీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment