renewable energy
-
భారత్‌లో ప్రవేశించేందుకు సిద్ధమవుతున్న టెస్లా
ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ), పునరుత్పాదక ఇంధన రంగాల్లో గ్లోబల్ లీడర్‌గా ఉన్న టెస్లా ఇంక్ భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌ల మధ్య సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలో కొన్ని వాణిజ్య అంశాలపై చర్చించారు. అందులో భాగంగా టెస్లా భారత్‌లో ప్రవేశానికి సంబంధించిన అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. దాంతో త్వరలో దీనిపై నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈ అనుమానాలకు ఊతమిచ్చేలా ముంబై, ఢిల్లీలో కస్టమర్ ఫేసింగ్, బ్యాకెండ్ పొజిషన్లలో పని చేసేందుకు 13 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు టెస్లా ప్రకటించింది. దాంతో టెస్టా భారత్‌లో ప్రవేశించేందుకు అడ్డంకులు తొలిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.వ్యూహాత్మక ఎత్తుగడ..టెస్లా భారతదేశంలో నియామకాలు చేపట్టాలని తీసుకున్న నిర్ణయం దేశంలో తన ఉనికిని స్థాపించే దిశగా ఒక కీలక అడుగుగా భావిస్తున్నారు. సర్వీస్ టెక్నీషియన్, టెస్లా అడ్వైజర్, ఇన్సైడ్ సేల్స్ అడ్వైజర్, స్టోర్ మేనేజర్, బిజినెస్ ఆపరేషన్స్ అనలిస్ట్ వంటి పోస్టులను ఈ మేరకు భర్తీ చేయనున్నారు. హైఎండ్ కార్లపై దిగుమతి సుంకాన్ని భారతదేశం ఇటీవల 110% నుంచి 70%కు తగ్గించిన తరువాత ఇలా నియామకాలు చేపడుతున్నట్లు ప్రకటించారు. టెస్లా వంటి లగ్జరీ కార్ల తయారీదారులు మార్కెట్లోకి ప్రవేశించడం ఆర్థికంగా మరింత లాభదాయకంగా మారనుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.భారత మార్కెట్లో అవకాశాలుచైనా వంటి దేశాలతో పోలిస్తే భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ ఇంకా తక్కువగానే ఉంది. 2024లో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు 1,00,000 యూనిట్లకు దగ్గరగా ఉన్నందున భారత ప్రభుత్వం ఈ రంగంలో మరింత వృద్ధి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. అందుకోసం ఎలక్ట్రిక్ వాహన తయారీదారులకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఈ వ్యవహారం టెస్లాకు గణనీయమైన అవకాశాన్ని అందించనుంది. 2070 నాటికి నికర సున్నా ఉద్గారాలను సాధించడానికి దేశం కట్టుబడి ఉంది. అందుకోసం సుస్థిర ఇంధన పరిష్కారాలను ప్రోత్సహించడంలో భాగంగా టెస్లా వంటి కంపెనీలకు కేంద్రం ఆమోదముద్ర వేసే అవకాశాలు కనిపిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: పరుగు ఆపని పసిడి! తులం ఎంతంటే..స్టార్ లింక్‌కు గ్రీన్ సిగ్నల్..?ఇటీవల మస్క్-మోదీల మధ్య జరిగిన సమావేశం అనంతరం మస్క్‌కు చెందిన శాటిలైట్ బ్రాడ్ బ్యాండ్ సర్వీస్ స్టార్ లింక్ భారత మార్కెట్లోకి ప్రవేశించడంపై కూడా చర్చ జరుగుతుంది. ట్రాయ్ ఆంక్షల కారణంగా స్టార్ లింక్ భారత్‌లోకి ప్రవేశించడం ఆలస్యం అవుతుంది. అయితే మోదీ, మస్క్ ఇద్దరూ ఈ సమస్యలను పరిష్కరించడానికి ఆసక్తిని వ్యక్తం చేసినట్లు తెలిసింది. స్టార్ లింక్ లైసెన్సింగ్ సవాళ్ల పరిష్కారానికి భారత ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ఇది రెండు దేశాల మధ్య సాంకేతిక సహకారాన్ని పెంపొందించడానికి మార్గం సుగమం చేస్తుందని కొందరు అధికారులు తెలియజేస్తున్నారు. -
ఓఎన్‌జీపీఎల్ చేతికి అయానా రెన్యూవబుల్
న్యూఢిల్లీ: ఓఎన్జీసీ–ఎన్టీపీసీ గ్రీన్ (ఓఎన్‌జీపీఎల్) తాజాగా అయానా రెన్యూవబుల్ పవర్‌ను కొనుగోలు చేయనుంది. ఇందుకోసం ఈక్విటీ, రుణభారాన్ని కూడా కలిపి కంపెనీ విలువను (ఎంటర్ప్రైజ్ వేల్యూ) రూ.19,500 కోట్లుగా (2.3 బిలియన్ డాలర్లు) లెక్కగట్టారు. ఓఎన్‌జీపీఎల్ నిర్దిష్ట మొత్తాన్ని అయానా యజమానులకు చెల్లించి, కంపెనీ రుణాలను తనకు బదలాయించుకునే విధంగా ఒప్పందం కుదిరింది. అయితే, ఎంత మొత్తం చెల్లించేదీ వెల్లడి కాలేదు.ఈ వ్యవహారానికి సంబంధించి అయానా ప్రస్తుత షేర్‌హోల్డర్లయిన నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (51 శాతం), బ్రిటీష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్..దాని అనుబంధ సంస్థలు (32 శాతం), ఎవర్‌సోర్స్ క్యాపిటల్ (17 శాతం) నుంచి 100 శాతం వాటాలను కొనుగోలు చేసేందుకు ఓఎన్‌జీపీఎల్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 2024 నవంబర్‌లో ఏర్పాటైన తర్వాత తమ సంస్థకు ఇది తొలి వ్యూహాత్మక పెట్టుబడని ఓఎన్‌జీపీఎల్ తెలిపింది. పునరుత్పాదక ఇంధన విభాగంలో ఇది రెండో అతి పెద్ద డీల్‌గా నిలవనుంది. 2021 అక్టోబర్‌లో సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్ప్, భారతి గ్రూప్ నుంచి ఎస్బీ ఎనర్జీ ఇండియాను అదానీ గ్రీన్ ఎనర్జీ (ఏజీఈఎల్) కొనుగోలు చేసింది. అప్పట్లో ఆ డీల్ విలువ ఏకంగా 3.5 బిలియన్ డాలర్లు. ఇక గతేడాది డిసెంబర్లో ఓ2 పవర్ పూలింగ్ అనే రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాట్‌ఫాంను జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ దక్కించుకుంది. ఇందుకోసం ఎంటర్ప్రైజ్ విలువను రూ. 12,468 కోట్లుగా (1.47 బిలియన్ డాలర్లు) లెక్కగట్టారు.ఇదీ చదవండి: కొత్త పన్ను చట్టం.. ఎంతో సులభతరం!4.1 గిగావాట్ల సామర్థ్యం..అయానాకు 4.1 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ అసెట్లు ఉన్నాయి. వీటిలో కొన్ని ఇప్పటికే పని చేస్తుండగా మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయి. మరోవైపు, చమురు..గ్యాస్ దిగ్గజం ఓఎన్జీసీ, విద్యుదుత్పత్తి దిగ్గజం ఎన్టీపీసీ కలిసి జాయింట్ వెంచర్‌గా ఓఎన్జీపీఎల్ను ఏర్పాటు చేశాయి. ఇందులో రెండు సంస్థలకూ చెరి 50 శాతం వాటాలు ఉన్నాయి. 2038 నాటికి కర్బన ఉద్గారాలను తటస్థ స్థాయికి తగ్గించుకునే దిశగా హరిత హైడ్రోజన్ ప్లాంట్లు, పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయడంపై రూ. 2 లక్షల కోట్లు వెచ్చించనున్నట్లు ఓఎన్జీసీ గతేడాది వెల్లడించింది. -
సోలార్ విద్యుత్ @100 గిగావాట్లు
న్యూఢిల్లీ: సోలార్ విద్యుదుత్పాదన సామర్థ్యంలో భారత్ కీలక మైలురాయిని అధిగమించింది.‘‘గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీజీ దార్శనిక నాయకత్వంలో భారత్ చరిత్రాత్మక 100 గిగావాట్ల సోలార్ సామర్థ్యాన్ని సాధించింది. పరిశుద్ధమైన, పర్యావరణ అనుకూల భవిష్యత్ కోసం విశ్రమించని మా అంకిత భావానికి ఇది నిదర్శనం’’అని నూతన, పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రి ప్రహ్లాద్ జోషి ఎక్స్ ప్లాట్ఫామ్లో పోస్ట్ పెట్టారు. 2022 నాటికి 175 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలని కేంద్ర సర్కారు లక్ష్యాన్ని విధించుకోగా, ఇందులో 100 మెగావాట్లు సోలార్ ద్వారా సమకూర్చుకోవాలన్నది ప్రణాళిక. కానీ, కరోనా విపత్తు, ఆ సమయంలో లాక్డౌన్లతో లక్ష్యం చేరిక రెండేళ్లు ఆలస్యమవడం గమనార్హం. 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని మోదీ సర్కారు లక్ష్యంగా నిర్దేశించుకుంది. ‘‘సోలార్ ప్యానెళ్లు, సోలార్ పార్క్‌లు, రూఫ్‌టాప్ సోలార్ ప్రాజెక్టులు విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చాయి. ఫలితమే నేడు భారత్ 100 గిగావాట్ల సోలార్ ఇంధన లక్ష్యాన్ని సాధించింది. పర్యావరణ అనుకూల ఇంధనంలో భారత్ స్వీయ సామర్థ్యాలపై ఆధారపడడమే కాకుండా, ప్రపంచానికి కొత్త మార్గాన్ని చూపిస్తోంది’’అని ప్రహ్లాద్‌జోషి పేర్కొన్నారు. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలి యోజన పథకం ప్రతి ఇంటికి శుద్ధ ఇంధనాన్ని అందిస్తుందన్నారు. పదేళ్లలో చేరిక 2014 నాటికి దేశంలో సోలార్ విద్యుదుత్పాదన సామర్థ్యం 2.82 గిగావాట్లుగానే ఉండగా, పదేళ్లలో 100 గిగావాట్లను చేరుకోవడం విశేషం. 2025 జనవరి 31 నాటికి స్థాపిత సోలార్ సామర్థ్యం 100.33 గిగావాట్లు అయితే, మరో 84.10 గిగావాట్ల సామర్థ్యం ఏర్పాటు దశలో ఉంది. మరో 47.49 గిగావాట్లు టెండర్ దశలో ఉండడం గమనార్హం. కేవలం 2024లోనే 24.5 గిగావాట్ల సామర్థ్యం కొత్తగా అందుబాటులోకి వచి్చంది. మరోవైపు 2014 నాటికి దేశంలో కేవలం 2 గిగావాట్ల సోలార్ మాడ్యూళ్ల తయారీ సామర్థ్యం ఉంటే, 2024 నాటికి 60 గిగావాట్లకు చేరుకుంది. -
ఉపాధికి 'నూతన ఎనర్జీ'
సాక్షి, అమరావతి: ప్రపంచ వ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన రంగం పురోగమిస్తోంది. ఈ రంగంలో ఉపాధి అవకాశాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 2050 నాటికి ఈ రంగంలో పని చేసేందుకు 43 మిలియన్ల మంది కావాల్సి ఉంటుందని తాజాగా ఇండియన్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ(ఐఆర్ఈడీఏ), అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్వో) విడుదల చేసిన సంయుక్త నివేదికలో వెల్లడించాయి.ఇంజనీర్లు, నైపుణ్యం గల కార్మికులు, మధ్యస్థ నైపుణ్యం గల కార్మికులు, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, ఇతర కార్మికుల సేవలు ఎక్కువగా అవసరం ఉంటుందని పేర్కొన్నాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన రంగంలో 16.2 మిలియన్ల మంది పని చేస్తున్నారని, వారిలో మన దేశంలోనే 1.2 మిలియన్ల మంది ఉన్నారని తెలిపాయి. విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా ఉపాధి అవకాశాలు⇒ దేశంలో 2032 నాటికి విద్యుత్ వినియోగం మరో 70 శాతం పెరుగుతుందని అంచనా.⇒ 2070 నాటికి కర్బన ఉద్గారాలు నెట్ జీరో స్థాయిని చేరుకోవడంలో భాగంగా 2030 నాటికి దేశ వ్యాప్తంగా 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ స్థాపిత ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా అన్ని రాష్ట్రాలు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను ప్రోత్సహించాలని సూచించింది. ⇒ అందువల్ల మన దేశంలో కొత్తగా ఏర్పడే పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల్లో 2050 నాటికి 8.5 మిలియన్ల మందికి కొలువులు లభిస్తాయని ఐఆర్ఈడీఏ వివరించింది. ⇒ ఈ నేపథ్యంలో భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా విద్యుత్ ఉత్పత్తి వనరులను సమకూర్చుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అయితే అది శిలాజ ఇంధనాల నుంచి కాకుండా స్వచ్చ ఇంధనం(గ్రీన్ ఎనర్జీ) ద్వారానే జరగాలని అంతర్జాతీయంగా అన్ని దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.నివేదికలోని ముఖ్యాంశాలు...⇒ ప్రపంచ పునరుత్పాదక రంగానికి సంబంధించి 2022లో 4.9 మిలియన్ల మందికి ఉద్యోగాలు లభించాయి. దీంతో 2022లో మొత్తం ఉద్యోగాలు 13.7 మిలియన్లకు చేరాయి. అదే 2023లో ఆ సంఖ్య 16.2 మిలియన్లకు పెరిగింది. ⇒ మన దేశానికి సంబంధించి 2022లో 2,82,200 మందికి ఈ రంగంలో ఉద్యోగాలు వచ్చాయి. ⇒ 2023లో ఈ సంఖ్య భారీగా పెరిగింది. జలవిద్యుత్ రంగంలో అత్యధికంగా దాదాపు 4,53,000 మందికి ఉద్యోగాలు లభించాయని అంచనా. సౌర విద్యుత్ ఫొటో వాల్టాయిస్ రంగంలో 3,18,600 మందికి ఉపాధి లభించింది. పవన విద్యుత్ రంగంలో సుమారు 52,200 మందికి, ద్రవ జీవ ఇంధన రంగంలో 35వేల మందికి, బయోమాస్‌లో 58 వేల మందికి, సోలార్ హీటింగ్, కూలింగ్ సెక్టార్లో 17 వేల మందికి, బయోగ్యాస్ రంగంలో 85 వేల మందికి కొలువులు లభించాయి. ⇒ భారతదేశంలో 2023లో దాదాపు 10,18,800 లక్షల ఉద్యోగాలు లభించినట్లు తమ అధ్యయనంలో తేలినట్లు ఆర్‌ఈఎన్‌ఏ, ఐఎల్వో వెల్లడించాయి. ⇒ ఒక్క చైనా మినహా మిగతా ప్రపంచ దేశాలన్నిటి కంటే మన దేశమే ఈ రంగంలో పురోగమనంలో ఉంది. -
పెరిగిన పునరుత్పాదక ఇంధన సామర్థ్యం.. ఎంతంటే..
పునరుత్పాదక ఇంధన విద్యుత్ సామర్థ్యం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) ఏప్రిల్–నవంబర్ కాలంలో 15 మెగావాట్ల మేర అదనంగా సమకూరినట్టు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. క్రితం ఏడాది ఇదే కాలంలో కొత్త ఏర్పాటు చేసిన 7.54 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన విద్యుత్ సామర్థ్యం కంటే రెట్టింపుగా ఉందని పేర్కొన్నారు. గత నెలలోనే 2.3 గిగావాట్ల మేర సామర్థ్యం సమకూరినట్టు మంత్రి తెలిపారు.సీఐఐ నిర్వహించిన ఇంధన సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి మాట్లాడారు. ప్రధాని మోదీ నాయకత్వంలో పదేళ్లలో పునరుత్పాదక ఇంధన రంగంలో అసాధారణమైన బాటలు వేసినట్టు చెప్పారు. ప్రస్తుతం ఇంధన శుద్ధి విభాగంలో భారత్ ప్రపంచంలోనే ప్రముఖ దేశంగా అవతరించినట్టు ప్రకటించారు. శిలాజేతర ఇంధన వనరుల ద్వారా 2030 నాటికి 500 గిగావాట్ల విద్యుత్ తయారీ సాధించాలన్న లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్ 6.1 బిలియన్ డాలర్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) ఆకర్షించినట్టు మంత్రి వెల్లడించారు.ఇదీ చదవండి: నాయకత్వ స్థానాల్లో మహిళలకు ప్రాధాన్యంస్థానికంగానే సోలార్ ప్యానెళ్లు, మాడ్యూళ్ల తయారీని ప్రోత్సహించేందుకు పీఎల్ఐ ద్వారా రూ.24,000 కోట్లు అందించినట్లు మంత్రి గుర్తు చేశారు. 2025–26 నాటికి 38 గిగావాట్ల సామర్థ్యంతో 50 సోలార్ పార్క్‌లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద ఎలక్ట్రోలైజర్ల తయారీకి రూ.4,400 కోట్లు, ఇతర ప్రధాన విడిభాగాలకు రూ.13,050 కోట్ల ప్రోత్సాహకాలు ప్రకటించినట్టు చెప్పారు. -
అనిల్ అంబానీ ‘పవర్’ పెరుగుతోంది!
పునరుత్పాదక విద్యుత్‌కు సంబంధించి అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ కొత్తగా రిలయన్స్ న్యూ ఎనర్జీస్ పేరుతో అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. మయాంక్ బన్సల్‌ను సీఈవోగా, రాకేశ్ స్వరూప్‌ను చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా నియమించింది. ఈ సంస్థ ప్రధానంగా సౌర, పవన విద్యుదుత్పత్తి.. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం మొదలైన సొల్యూషన్స్‌పై దృష్టి పెడుతుంది.పునరుత్పాదక విద్యుత్ విభాగంలో బన్సల్‌కి 25 ఏళ్ల అనుభవం ఉంది. గతంలో ఆయన రెన్యూ పవర్‌కి చెందిన ఇండియా ఆర్ఈ బిజినెస్‌కి గ్రూప్ ప్రెసిడెంట్‌గా వ్యవహరించారు. ఇంధన రంగం, స్టార్టప్‌ల విభాగంలో స్వరూప్నకు 17 ఏళ్ల పైగా అనుభవం ఉంది. ఆయన గతంలో రెన్యూ పవర్, పీఆర్ క్లీన్ ఎనర్జీ మొదలైన సంస్థల్లో కీలక హోదాల్లో పని చేశారు. కాగా రిలయన్స్ పవర్ మరో అనుబంధ సంస్థ రిలయన్స్ ఎన్యూ సన్‌టెక్ సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది. ఇటీవల జరిగిన ఈ-రివర్స్ వేలంలో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SECI) నుండి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS) ప్రాజెక్ట్ కోసం 930 మెగా వాట్ల సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్‌ను పొందింది. -
‘వాతావరణ మార్పునకు ఈవీలు పరిష్కారం కాదు’
ఎలక్ట్రిక్ వాహనాలు వాతావరణ మార్పులకు పరిష్కారం చూపవని ప్రముఖ రచయిత అమితావ్ ఘోష్ తెలిపారు. పునరుత్పాదక శక్తి, పరిమితంగా కర్బన ఉద్గారాలను వాడడం వంటి కార్బన్ క్రెడిట్ల ద్వారా వాతావరణ సమస్యకు పరిష్కారం దొరకదన్నారు. అందుకు బదులుగా బంగ్లాదేశ్ వంటి దేశాల్లో అమలు చేస్తున్న విధానాలపై ప్రపంచం దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఇటీవల లండన్ కింగ్స్ కాలేజీలో గ్లోబల్ కల్చర్స్ ఇన్స్టిట్యూట్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.‘వాతావరణ మార్పు అనేది ప్రపంచ సమస్య. దీన్ని పరిష్కరించేందుకు అందరూ ముందుకు రావాలి. కేవలం ఎలక్ట్రిక్ వాహనాలు ఈ సమస్యకు పరిష్కారం చూపవు. పునరుత్పాదక శక్తి, పరిమితంగా కర్బన ఉద్గారాలను వాడడం వంటి కార్బన్ క్రెడిట్ల ద్వారా ఇది పరిష్కారం కాదు. స్థానిక ప్రజల ఆలోచన విధానాల్లో మార్పు రావాలి. బంగ్లాదేశ్‌లో చాలా ఏళ్లుగా వాతావరణ మార్పులపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అక్కడ వాతావరణ సంరక్షణకు సంబంధించిన సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. దాంతో స్థానికులు వాతావరణానికి చేటు చేసే కార్యాలకు స్వతహాగా దూరంగా ఉంటున్నారు. ఈ మార్పునకు ఏదో గొప్ప సాంకేతిక తోడ్పడలేదు. ప్రజల్లో మార్పు వచ్చింది. భారత్ నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న దేశం. అలాంటిది ఇక్కడి రైతులు చాలా ఏళ్లుగా తమకు తోచినంతలో నీటిని సమర్థంగా వాడుకుని పంటలు పండిస్తున్నారు. వనరులను సమర్థంగా వాడుకోవాలనే స్పృహ అందరిలోనూ ఉండాలి. అప్పుడే వాతావరణం మరింత క్షీణించకుండా కాపాడుకోవచ్చు’ అని అమితావ్ ఘోష్ అన్నారు.ఇదీ చదవండి: ‘మీరు ముసలాడవ్వకూడదు’‘ఇరాక్ యుద్ధ సమయంలో యూఎస్ మిలిటరీ ఏటా 1.3 బిలియన్ గ్యాలన్ల చమురును వినియోగించింది. ఇది బంగ్లాదేశ్ వార్షిక వినియోగం కంటే ఎక్కువ. యుద్ధాలు, భౌగోళిక అనిశ్చితుల కారణంగా చెలరేగులున్న వైరుధ్యం వల్ల వాతావరణ మార్పులు పెరుగుతున్నాయి. అయినా ఇలాంటి సమస్యలు చాలా అరుదుగా చర్చకు వస్తాయి’ అని అన్నారు. -
పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులకు అదనపు వెసులుబాటు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నెలకొల్పుతున్న మూడు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు ప్రభుత్వం అదనపు వెసులుబాటు కల్పించింది. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ‘గ్రీన్ కో’ సంస్థ ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ నిర్మిస్తోంది. అందులో భాగంగా 800 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తోంది. దాని సామర్థ్యాన్ని 1,300 మెగావాట్లకు పెంచుకునేందుకు అనుమతించాలని ప్రభుత్వాన్ని ఆ సంస్థ కోరింది. గ్రీన్ కో అదనంగా అడిగిన 500 మెగావాట్లకు అనుమతిస్తూ ఇంధన శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.రెండేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ పేర్కొన్నారు. దీంతో గ్రీన్ కో ప్రాజెక్టు సామర్థ్యం 4,230 మెగావాట్ల నుంచి 4,730 మెగావాట్లకు పెరిగింది. దీనిలో 2,800 వేల మెగావాట్ల సౌర విద్యుత్, 250 మెగావాట్ల పవన విద్యుత్, 1,680 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు ఉన్నాయి. అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లో ‘ఆస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ నిర్మించనున్న 1,800 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుకు అదనంగా 186 ఎకరాలు కేటాయిస్తూ విజయానంద్ మరో ఉత్తర్వులు జారీచేశారు. ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే 490 ఎకరాలు కేటాయించారు. అదనంగా ఇచ్చే భూమిని కొనుగోలు చేస్తే ఎకరాకు రూ.5 లక్షలు, లీజుకు తీసుకుంటే ఎకరాకు ఏడాదికి రూ.31వేలు చొప్పున చెల్లించాలని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఎకోరన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పవన విద్యుత్ ప్రాజెక్ట్ సామర్థ్యాన్ని 1,000 మెగావాట్ల నుంచి మరో 277 మెగావాట్లు పెంచుకునేందుకు అనుమతిస్తూ మరో ఉత్తర్వులను విజయానంద్ జారీ చేశారు. మొత్తం సామర్థ్యం 1,277 మెగావాట్లలో 1,168.70 మెగావాట్ల ప్రాజెక్టులను ఇప్పటికే కేటాయించిన ప్రాంతాల్లో స్థాపించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, ఈ మూడు నిర్ణయాలను స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ (ఎస్ఐపీబీ) ఈ నెల 19న తీసుకుందని విజయానంద్ తెలిపారు. -
హ్యుందాయ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్స్
న్యూఢిల్లీ: వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా (హెచ్ఎంఐఎల్) రెండు పునరుత్పాదక విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. వాహనాల తయారీకై 2025 నాటికి పూర్తిగా పునరుత్పాదక విద్యుత్‌ను వినియోగించాలన్న లక్ష్యంలో భాగంగా తమిళనాడులోని ప్లాంటులో వీటిని నెలకొల్పనుంది.ఇందుకోసం ఫోర్త్ పార్ట్నర్ ఎనర్జీతో పవర్ పర్చేజ్ ఒప్పందం చేసుకున్నట్టు హ్యుందాయ్ తెలిపింది. 75 మెగావాట్ల సౌర, 43 మెగావాట్ల పవన విద్యుత్ ప్లాంట్‌ను స్థాపిస్తారు. ఈ రెండు కేంద్రాలకు హెచ్ఎంఐఎల్ రూ.38 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్, ఆపరేషన్స్, మెయింటెనెన్స్ కోసం ఫోర్త్ పార్ట్నర్ ఎనర్జీతో కలిసి స్పెషల్ పర్పస్ వెహికిల్ ఏర్పాటు చేశారు.హ్యుండై మోటార్ ఇండియాకు ఈ ఎస్పీవీలో 26 శాతం వాటా ఉంటుంది. ప్రస్తుత విద్యుత్ అవసరాల్లో 63 శాతం పునరుత్పాదక వనరుల నుంచి సమకూరుతోందని కంపెనీ తెలిపింది. హెచ్ఎంఐఎల్ ప్లాంటుకు 25 ఏళ్లపాటు ఏటా 25 కోట్ల యూనిట్ల విద్యుత్ సరఫరా చేస్తామని ఫోర్త్ పార్ట్నర్ ఎనర్జీ తెలిపింది. -
వాతావరణాన్నీ మార్చేస్తున్నాం!
సాక్షి, అమరావతి : వాతావరణ మార్పులకు వేగవంతమైన చర్యలు చేపడుతున్న దేశాల జాబితాలో వరుసగా ఆరో ఏడాది భారత్ టాప్–10లో కొనసాగుతోంది. 2014లో 31వ స్థానం నుంచి 2019లో టాప్ 10లోకి చేరుకుని నిలకడగా రాణిస్తోంది. అయితే వాతావరణ మార్పుల పనితీరు సూచీ(క్లయిమేట్ ఫెర్ఫార్మెన్స్–సీసీపీఐ)లో మాత్రం ఏడో స్థానం నుంచి 10వ స్థానానికి పడిపోయింది. కానీ, పునరుత్పాదక శక్తి వినియోగంలో మాత్రం పురోగతి సాధిస్తోంది. జీ20 దేశాల్లో కేవలం భారత్, యూకేల్లో మాత్రమే క్లయిమేట్ ఫెర్ఫార్మెన్స్ మెరుగ్గా ఉన్నట్టు తాజాగా జర్మన్వాచ్, న్యూ క్లయిమేట్ ఇన్స్టిట్యూట్, సీఏఎన్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా విడుదల చేసిన క్లయిమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్‌లో వెల్లడించింది. ఇందులో తొలి మూడు ర్యాంకులు ఏ దేశానికీ కచి్చతమైన స్కోర్ లేకపోవడంతో ఖాళీగా ఉంచారు. డెన్మార్క్(4వ), నెదర్లాండ్స్(5వ), యూకే(6వ) ముందంజలో ఉన్నాయి. అయితే యూకే వాతావరణ మార్పుల పనితీరులో అద్భత ప్రదర్శన కనబరుస్తూ 20వ స్థానం నుంచి ఆరో స్థానానికి చేరుకుంది. ‘గ్రీన్హౌస్’ ఉద్గారాల విడుదలలో చైనాకు 55వ స్థానం ప్రపంచంలో అత్యధిక గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాలను విడుదల చేసే చైనా 55వ స్థానంలో, రెండో అతిపెద్ద ఉద్గారాలను విడుదల చేసే అమెరికా 57వ స్థానంలో నిలిచాయి. సీసీపీఐలో చివరి స్థానాల్లో ఇరాన్(67వ), సౌదీ అరేబియా(66వ), యూఏఈ(గతేడాది యూఎన్ వాతావరణ చర్చల హోస్ట్)(65వ), రష్యా (64వ) నిలిచాయి. ఈ నాలుగు దేశాలు ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద చమురు, గ్యాస్ ఉత్పత్తిదారులుగా ఉన్నాయి. ఆయా దేశాల్లో పునరుత్పాదక వస్తువుల వాటా మూడు శాతం కంటే తక్కువ ఉంది. దేశాల వాతావరణ ఉపశమన పనితీరును జీహెచ్జీ ఉద్గారాలు, పునరుత్పాదక శక్తి, ఇంధన వినియోగం, వాతావరణ విధానం వంటి నాలుగు విభాగాల్లో అంచనా వేస్తున్నారు. దేశంలో తలసరి ఉద్గారాలు తక్కువే.. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం అయినప్పటికీ భారత్‌లో తలసరి ఉద్గారాలు తక్కువని నివేదిక పేర్కొంది. తలసరి ఉద్గారాలు 2.9 టన్నుల కార్బన్ డయాక్సైడ్ సమానమైనవిగా ఉన్నాయి. ఇది ప్రపంచ సగటు 6.6 టన్నుల కార్బన్ డయాక్సైడ్ కంటే చాలా తక్కువగా ఉండటం విశేషం. పునరుత్పాదక ఇంధన వినియోగంలో ముఖ్యంగా పెద్ద ఎత్తున సోలార్ పవర్ ప్రాజెక్టులు, రూఫ్‌టాప్ సోలార్ స్కీమ్‌ను ప్రారంభించడంలో దేశం గణనీయమైన పురోగతిని సాధించినట్టు గుర్తు చేసింది. 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే బొగ్గుపై ఎక్కువగా ఆధార పడటాన్ని ఇండెక్స్ ఎత్తి చూపించింది. వాస్తవానికి బొగ్గు నిల్వలు అధికంగా ఉన్న టాప్ 10 దేశాల్లో భారత్ ఒకటిగా ఉండగా, నెమ్మదిగా బొగ్గు ఉత్పత్తిని పెంచాలని యోచిస్తోంది. జీ20 దేశాల నుంచే 75శాతం ఉద్గారాలు జీ20 దేశాల్లో అమెరికా, చైనా, కెనడా(62వ), ఆస్ట్రేలియా(52వ), సౌత్ కొరియా (63వ), అర్జెంటీనా (59వ), జపాన్(58వ) వెనుక స్థానాల్లో నిలిచాయి. జీ20 దేశాలు ఉద్గారాలు తగ్గించడానికి బాధ్యత వహించాలని సీసీపీఐ చెబుతోంది. అందులో సభ్య దేశాల నుంచే 75శాతం కంటే ఎక్కువ గ్రీన్హౌస్ వాయువులు విడుదల చేస్తున్నాయి. రష్యా, సౌదీ అరేబియా, దక్షిణ కొరియా ఇప్పటికీ దారుణమైన పనితీరును కనబరుస్తున్నాయి. 2015 పారిస్ ఒప్పందం నుంచి వైదొలిగిన అర్జెంటీనా(59వ స్థానం) ఈ సంవత్సరం అత్యధికంగా వెనుకబడింది. గ్రీన్హౌస్ ఉద్గారాలు భారత్‌లో తక్కువేమనదేశంలో కర్బన ఉద్గారాలు మిగతా అగ్ర దేశాలతో పోలిస్తే తక్కువేనని మరోసారి రుజువైంది. క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2025లో మనదేశం 10వ స్థానంలో నిలిచింది. యూరోపియన్ యూనియన్ సహా 90 దేశాల్లో వాతావరణ పరిస్థితులపై అధ్యయనం చేసి ఈ నివేదిక విడుదల చేశారు. ప్రపంచ గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాల్లో సుమారు 90 శాతం ఈ దేశాల నుంచే వస్తున్నాయి. ఈ జాబితాలో 1, 2, 3 స్థానాల్లో ఉండేందుకు ఏ దేశమూ అర్హత సాధించలేకపోవడం విశేషం. 2019 నుంచీ మన దేశం ఈ జాబితాలో టాప్–10లో ఉంటూ వస్తోంది. జీ20 దేశాల్లో భారత్, యూకే మాత్రమే టాప్ 10లో స్థానం సంపాదించగలిగాయి. ఈ జాబితాలో చైనా 55, అమెరికా 57వ స్థానంలో నిలిచాయి. -
ఎన్టీపీసీతో చేతులు కలిపిన ఓఎన్జీసీ: ఎందుకంటే..
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజాలు ఎన్టీపీసీ, ఓఎన్జీసీ తాజాగా చేతులు కలిపాయి. తద్వారా నూతన, పునరుత్పాదక ఇంధన విభాగంలో అవకాశాలను అన్వేషించనున్నాయి. ఇందుకు అనుగుణంగా గ్రీన్ ఎనర్జీ అనుబంధ సంస్థల ద్వారా భాగస్వామ్య కంపెనీ(జేవీ)కి తెరతీయనున్నాయి.చమురు దిగ్గజం ఓఎన్జీసీ సహకారంతో కొత్తతరం ఇంధన అవకాశాలను అందిపుచ్చుకోనున్నట్లు విద్యుత్ రంగ దిగ్గజం ఎన్టీపీసీ పేర్కొంది. ఓజీఎల్తో సమాన భాగస్వామ్య(50:50 వాటా) కంపెనీ(జేవీసీ) ఏర్పాటుకు వీలుగా కార్పొరేట్ వ్యవహారాల శాఖకు ఎన్జీఈఎల్ దరఖాస్తు చేసినట్లు తెలియజేసింది.సోలార్, విండ్, ఎనర్జీ స్టోరేజీ, ఈమొబిలిటీ, కార్బన్ క్రెడిట్స్ తదితర న్యూ ఎనర్జీ అవకాశాలపై జేవీ పనిచేయనున్నట్లు వివరించింది. పునరుత్పాదక ఇంధన ఆస్తుల కొనుగోలుతోపాటు.. తమిళనాడు, గుజరాత్‌లలో రాబోయే ఆఫ్‌షోర్ విండ్ టెండర్లలో పాలుపంచుకునే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది. -
తయారీలో సహకారంపై భారత్, సౌదీ చర్చలు
న్యూఢిల్లీ: పునరుత్పాదక ఇంధనం, డిజిటల్ మౌలిక సదుపాయాలు, తయారీ తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవడంపై భారత్, సౌదీ అరేబియా దృష్టి పెడుతున్నాయి. రెండు రోజుల సౌదీ పర్యటన సందర్భంగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్, ఆ దేశ మంత్రులతో ఈ అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్లు ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. అలాగే, ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్షియేటివ్ కార్యక్రమంలో పాల్గొంటారని, పలువురు అంతర్జాతీయ దిగ్గజ ఇన్వెస్టర్లతో కూడా భేటీ అవుతారని వివరించింది. వ్యవసాయం, ఆహార భద్రత, ఇంధనం, టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తదితర రంగాలపై ప్రధానంగా దృష్టి పెడుతూ ఇండియా–సౌదీ స్ట్రాటెజిక్ పార్ట్నర్íÙప్ కౌన్సిల్ కింద ఎకానమీ–ఇన్వెస్ట్మెంట్ కమిటీ రెండో సమావేశానికి కో–చెయిర్‌గా వ్యవహరిస్తారు. సౌదీ అరేబియాకు భారత్ రెండో అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. భారత్‌కు సౌదీ అరేబియా నాలుగో అతి పెద్ద భాగస్వామి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2023–24లో 43 బిలియన్ డాలర్లుగా ఉంది. ఎల్అండ్టీ, టాటా, విప్రో తదితర దిగ్గజ భారతీయ కంపెనీలు సౌదీ అరేబియాలో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. 2000 ఏప్రిల్ నుంచి 2024 జూన్ మధ్య కాలంలో భారత్‌లో సౌదీ అరేబియా 3.22 బిలియన్ డాలర్ల మేర ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టింది. -
నీటిపై తేలాడే సోలార్ వెలుగులు.. దేశంలోని ప్రాజెక్ట్‌లు ఇవే..
పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధికి దేశంలో ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో సిద్ధం చేసిన ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్‌కు ఇటీవల ప్రధాన నరేంద్రమోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. రూ.800 కోట్లతో 176 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఇందులో 56 మెగావాట్లు ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ద్వారా, మరో 120 మెగావాట్ల పవర్‌ను గ్రౌండ్మౌంట్ సోలార్ ప్లాంట్ ద్వారా సమకూర్చాలని ప్రతిపాదించారు. ఈ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి ఎల్ అండ్ టీ సంస్థ కాంట్రాక్ట్ పొందింది.ఇదీ చదవండి: ‘పర్యావరణం కోసం వాటికి నేను దూరం’గ్రౌండ్మౌంట్ సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు సాధారణంగా అధిక విస్తీర్ణంలో భూ సేకరణ చేయాల్సి ఉంటుంది. అదే నీటిపై తేలాడే ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ఈ ఇబ్బంది ఉండదు. రెండింటిలో ఏ ప్లాంటైనా మౌలిక సదుపాయాల ఖర్చు ఎలాగూ ఉంటుంది. దాంతో తక్కువ ఖర్చుతో కూడుకున్న ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్‌లకు పెద్దపీట వేస్తున్నారు. ఇప్పటికే దేశంలో వివిధ ప్రాంతాల్లో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేశారు.ఎన్టీపీసీ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ రామగుండం: స్థాపిత సామర్థ్యం-100 మెగావాట్లు, ఇది 500 ఎకరాల్లో విస్తరించి ఉంది.ఎన్టీపీసీ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ కాయంకులం: స్థాపిత సామర్థ్యం-92 మెగావాట్లు. కేరళలో ఉన్న ఈ ప్రాజెక్ట్ 450 ఎకరాల సరస్సుపై ఏర్పాటు చేశారు.రిహాండ్ డ్యామ్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్: స్థాపిత సామర్థ్యం-50 మెగావాట్లు. ఈ ప్రాజెక్ట్ ఉత్తరప్రదేశ్‌లో ఉంది.సింహాద్రి ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్: దీని స్థాపిత సామర్థ్యం-25 మెగావాట్లు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో 75 ఏకరాల్లో ఇది విస్తరించి ఉంది.ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్: దీని అంచనా సామర్థ్యం-600 మెగావాట్లు. మధ్యప్రదేశ్‌లో దీని ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. -
2030 నాటికి రూ.32 లక్షల కోట్లు అవసరం
భారత్ తన లక్ష్యాలను చేరుకోవడానికి 2030 నాటికి పునరుత్పాదక ఇంధన రంగంలో దాదాపు రూ.32 లక్షల కోట్లు అవసరమవుతాయని ఐఆర్ఈడీఏ ఛైర్మన్ ప్రదీప్ కుమార్ దాస్ తెలిపారు. 23వ ఇండియా పవర్ ఫోరమ్ 2024లో పాల్గొని ఆయన మాట్లాడారు. రుణదాతలు కస్టమర్ల అవసరాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. సకాలంలో ఆర్థిక అవసరాలు తీర్చేలా ప్రణాళికలు ఉండాలని తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘పునరుత్పాదక ఇంధన రంగంలో ఎలాంటి హానికర ఉద్గారాలు లేకుండా ఉండేలా చర్యలు చేపడుతున్నారు. అందుకోసం 2030 నాటికి ఈ రంగంలో సుమారు రూ.32 లక్షల కోట్ల పెట్టుబడులు రావాల్సి ఉంది. ఇందుకోసం రుణదాతలు కొత్త ఆఫర్లు ప్రవేశపెట్టాలి. భవిష్యత్తులో దేశీయ విద్యుత్ అవసరాలు తీర్చే ఈ రంగంలో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు ఆర్జించవచ్చు. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని చేరాలంటే ఈ విభాగం కీలకంగా మారనుంది. ఈ రంగంలో మరిన్ని మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసేలా ప్రభుత్వం దృష్టి సారిస్తుంది. గ్రీన్ హైడ్రోజన్, ఆఫ్‌షోర్ విండ్(సముద్ర అలల సాయంతో విద్యుత్ ఉత్పత్తి), ఇ-మొబిలిటీ వంటి అభివృద్ధి చెందుతున్న పునరుత్పాదక సాంకేతికతలకు రానున్న రోజుల్లో ప్రాముఖ్యత పెరుగుతుంది’ అన్నారు.ఇదీ చదవండి: 99.1 శాతం ఫిర్యాదుల పరిష్కారం -
పునరుత్పాదక రంగంలో ఉపాధి పరుగులు
ప్రపంచ వ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా మన దేశంలో ఈ రంగంలో 2023 సంవత్సరంలో దాదాపు 10,18,800 (1.02 మిలియన్ల) ఉద్యోగాల కల్పన జరిగింది. ఈ విషయాన్ని ఇటీవల అంతర్జాతీయ పునరుత్పాదక ఇంధన సంస్థ (ఆర్‌ఈఎన్‌ఏ), అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్వో) సంయుక్తంగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం... ప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన రంగంలో 2022లో 4.9 మిలియన్ల మందికి ఉద్యోగాలు లభించాయి. ఆ సంఖ్య అనూహ్యంగా 2023లో 16.2 మిలియన్లకు పెరిగింది. మన దేశంలో 2022లో 2,82,200 మందికి కొలువులు వచ్చాయి. 2023లో ఈ సంఖ్య భారీగా పెరిగి దాదాపు 10,18,800కు చేరింది. ఒక్క చైనా మినహా ప్రపంచ దేశాలన్నింటి కంటే మన దేశమే ఈ విషయంలో పురోగమనంలో ఉంది. మొత్తం ఉద్యోగాల్లో దాదాపు 40శాతం మంది మహిళలు ఉండటం విశేషం. – సాక్షి, అమరావతి -
ఏఎం గ్రీన్‌తో గెయిల్ ఒప్పందం
దేశంలో స్థిరమైన ఇంధన పరిష్కారాల అభివృద్ధికి గెయిల్ (ఇండియా) లిమిటెడ్, ఏఎం గ్రీన్ బీవీ (AMG) సంస్థలు జట్టుకట్టాయి. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈమిథనాల్ ఉత్పత్తి కోసం కార్బన్ డయాక్సైడ్ (CO2) దీర్ఘకాలిక సరఫరా, దేశం అంతటా హైబ్రిడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల అన్వేషణపై భాగస్వామ్యం దృష్టి సారిస్తుందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో గెయిల్ తెలిపింది.గెయిల్ డైరెక్టర్ (బిజినెస్ డెవలప్మెంట్) రాజీవ్ సింఘాల్ సమక్షంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (బిజినెస్ డెవలప్మెంట్ అండ్ ఎక్స్‌ప్లోరేషన్ & ప్రొడక్షన్) సుమిత్ కిషోర్, ఏఎం గ్రీన్ గ్రూప్ ప్రెసిడెంట్ మహేష్ కొల్లి అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు.ఒప్పందంలో భాగంగా ఈమిథనాల్ను ఉత్పత్తి కోసం కార్బన్ డయాక్సైడ్ దీర్ఘకాలిక సరఫరా కోసం అధ్యయనాలను చేపట్టాలని రెండు కంపెనీలు భావిస్తున్నాయి. ప్రతిపాదిత ఇమిథనాల్ ప్రాజెక్ట్‌లో పెట్టుబడి పెట్టడానికి గెయిల్‌కి కూడా ఈక్విటీ ఆప్షన్ ఉంటుంది. అలాగే దేశం అంతటా 2.5 గిగావాట్స్ వరకు సోలార్/విండ్ హైబ్రిడ్ పునరుత్పాదక ప్రాజెక్టుల ఏర్పాటును సంయుక్తంగా అన్వేషించాలని ఇరు సంస్థలు భావిస్తున్నాయి. -
ఏటా రూ.మూడు లక్షల కోట్లు అవసరం
దేశీయంగా 2030 నాటికి 440 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఏటా రూ.మూడు లక్షల కోట్లు అవసరమని ఇక్రా తెలిపింది. ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ(ఇక్రా) ఈమేరకు నివేదిక విడుదల చేసింది. పునరుత్పాదక ఇంధన రంగం ఎనర్జీ స్టోరేజీ, గ్రిడ్ ఇంటిగ్రేషన్ వంటి సవాళ్లను ఎదుర్కొంటుందని నివేదికలో తెలిపింది.ఇక్రా గ్రూప్ కార్పొరేట్ రేటింగ్స్ వైస్ ప్రెసిడెంట్ వి.విక్రమ్ మాట్లాడుతూ..‘2030 నాటికి భారతదేశం 440 గిగావాట్ల స్థాపిత పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలని నిర్ణయించింది. అందుకోసం ఏటా రూ.మూడు లక్షల కోట్లు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం దాదాపు 200 గిగావాట్లుగా ఉన్న పునరుత్పాదక ఇంధన సామర్థ్యం వచ్చే ఆరేళ్లలో రెట్టింపు అవ్వాల్సి ఉంది. ప్రధానంగా ఈ రంగంలో ఎనర్జీ స్టోరేజీ, గ్రిడ్ ఇంటిగ్రేషన్ వంటి సవాళ్లు ఎదురవుతున్నాయి. 2030 ఆర్థిక సంవత్సరం నాటికి కొత్త వాహనాల విక్రయాల్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు 25 శాతం వాటాను కలిగి ఉంటాయి. ఎలక్ట్రిక్ త్రీవీలర్లు, బస్సులు వరుసగా 40 శాతం, 30 శాతంగా ఉంటాయి. వీటి కోసం భవిష్యత్తులో విద్యుత్ వినియోగం పెరుగుతుంది’ అన్నారు.ఇదీ చదవండి: జీఎస్టీ శ్లాబుల క్రమబద్ధీకరణపై 25న చర్చదేశీయంగా పెరుగుతున్న విద్యుత్తు అవసరాలకు అనుగుణంగా తయారీ ఊపందుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే సంప్రదాయ పద్ధతిలో విద్యుత్తు తయారీకి ఇప్పటికీ అధికం శాతం భారత్‌లో బొగ్గునే వినియోగిస్తున్నారు. క్రమంగా దీన్ని పునరుత్పాదక ఇంధనంతో భర్తీ చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆ దిశగా ఏటా బడ్జెట్లో కేటాయింపులు పెంచుతున్నారు. దేశంలో కోటి ఇళ్లకు రూఫ్‌టాప్ సోలార్ ప్లేట్లను ఏర్పాటు చేసి 300 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మిగులు విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేసి ఇతర అవసరాలకు వినియోగించాలని ప్రణాళికలు ఏర్పాటు చేసింది. -
పచ్చని కొలువులు తోడుంటే..!
2070 నాటికి కర్బన ఉద్గార రహిత (నెట్ జీరో) దేశంగా అవతరించాలనేది భారత్ లక్ష్యం. ఈ దిశగా ఇప్పటికే వడివడిగా అడుగులు పడుతున్నాయి. దిగ్గజ కంపెనీలు పునరుత్పాదక ఇంధన రంగంలో భారీ ప్రాజెక్టులకు తెరతీయడంతో.. గ్రీన్ జాబ్స్‌కు ఫుల్ డిమాండ్ నెలకొంది.పునరుత్పాదక ఇంధన (రెన్యూవబుల్ ఎనర్జీ) కంపెనీలు ఇప్పుడు నిపుణులకు రారామ్మంటూ రెడ్ కార్పెట్ వేస్తున్నాయి. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు తోడు మరిన్ని కొత్త ప్రాజెక్టులు జతవుతుండటంతో భారీగా సిబ్బంది కొరత నెలకొన్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ, టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ, విక్రమ్ సోలార్, జెన్సాల్ గ్రూప్ తదితర సంస్థలు నియామకాల జోరు పెంచిన వాటిలో ఉన్నాయి. ముఖ్యంగా డేటా సైన్స్, వాతావరణ విశ్లేషణ, సోలార్ సెల్–మాడ్యూల్ తయారీ, కార్యకలాపాలు, సరఫరా వ్యవస్థ నిర్వహణ, మెయింటెనెన్స్ వంటి విభాగాల్లో నిపుణులకు భారీగా అవకాశాలున్నాయనేది పరిశ్రమ ఎగ్జిక్యూటివ్‌లు, హెచ్ఆర్ ఏజెన్సీల మాట! సౌర, పవన విద్యుత్‌తో పాటు జల, అణు విద్యుత్ ఇతరత్రా హైబ్రీడ్ ప్రాజెక్టులు రెన్యూవబుల్ ఎనర్జీలోకి వస్తాయి. అదానీ.. 50 గిగావాట్లు బహుముఖ రంగాల్లో దూసుకుపోతున్న అదానీ గ్రూప్.. పునరుత్పాదక ఇంధనంపై భారీగా పెట్టుబడులు పెడుతోంది. సౌర, పవన, హైబ్రీడ్ ప్రాజెక్టుల విస్తరణకు అనుగుణంగా అదానీ గ్రీన్ ఎనర్జీ ప్రధాన కార్యకలాపాలు, మెయింటెనెన్స్‌లో నిపుణుల నియమాకాలపై దృష్టి పెట్టినట్లు కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. 2030 నాటికి 50 గిగావాట్ల (జీడబ్యూ) రెన్యూవబుల్ ఎనర్జీ సామర్థ్యాన్ని సాధించాలని అదానీ లక్ష్యంగా పెట్టుకుంది. డేటా సైంటిస్టులు, ఎలక్ట్రికల్–సివిల్ ఇంజినీర్లు, బిజినెస్ ఇంటెలిజెన్స్, డిజిటల్ టెక్నాలజీలు, సరఫరా వ్యవస్థల స్పెషలిస్టులతో పాటు పరికరాల ప్రొక్యూర్మెంట్లో అనుభవం గల వారికి కూడా కంపెనీ పెద్దపీట వేస్తోంది.హైరింగ్‌లో టాటా ‘పవర్’ ఇక టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ సోలార్ సెల్, మాడ్యూల్ తయారీ; సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల నిర్వహణ, ఆపరేషన్స్–మెయింటెనెన్స్, ఇంజినీరింగ్–టెక్నాలజీ తదితర ఉద్యోగాల భర్తీలో తలమునకమైంది. భారీ ప్రాజెక్టులకు తోడు, రూఫ్‌టాప్ సోలార్ పవర్, ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) చార్జింగ్ కేంద్రాల ఏర్పాటులో కూడా శరవేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థలో 2,500 పైగా సిబ్బంది ఉన్నారు. ‘పునరుత్పాదక విద్యుత్‌కు సంబంధించి ప్రాజెక్టులు ఫాస్ట్‌ట్రాక్‌లో నడుస్తున్నాయి. ఈ మేరకు అనేక ఎంఓయూలు కుదుర్చుకున్నాం. గుజరాత్లో 10,000 మెగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు రానున్నాయి. వీటిద్వారా అనేక ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఈ భారీ విస్తరణ, వృద్ధికి అనుగుణంగా హైరింగ్ జోరు పెంచుతున్నాం’ అని టాటా పవర్ చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ హిమల్ తివారీ పేర్కొన్నారు. ఇక జెన్సాల్ గ్రూప్ బ్యాటరీలు, డేటా ఎనలిటిక్స్, ప్రాజెక్ట్–ల్యాండ్ డెవలప్మెంట్, పర్యావరణం, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ తదితర విభాగాల్లో నిపుణుల వేటలో ఉంది. 2024–2032 మధ్య కాలంలో పునరుత్పాదక ఇంధన మార్కెట్ వార్షికంగా 8.7 శాతం వృద్ధి (సీఏజీఆర్) చెందుతుందని అంచనా. → 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని సాధించాలనేది భారత్ లక్ష్యం. → ప్రస్తుతం భారత్‌లో గ్రీన్ ఎనర్జీ (భారీ జలవిద్యుత్, అణు విద్యుత్‌తో సహా) ఉత్పత్తి సామర్థ్యం 208 గిగావాట్లు. మొత్తం విద్యుదుత్పత్తిలో ఇది దాదాపు 46%. గత 9 ఏళ్లలో 400 శాతం ఎగబాకడం విశేషం. → సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గత 9 ఏళ్లలో 30 రెట్లు ఎగసి 89.4 గిగావాట్లకు చేరింది. → పవన విద్యుత్ సామర్థ్యం 2014 నుంచి ఇప్పటిదాకా రెట్టింపునకు పైగా ఎగసి 47.19 గిగావాట్లకు చేరుకుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఇప్పుడు దేశానికి ఇది అవసరం: నిర్మలా సీతారామన్
ఇంధన వినియోగాన్ని, దిగుమతులను తగ్గించుకోవాలని పలువురు నేతలు చెబుతూనే ఉన్నారు. దీని ప్రత్యామ్నాయంగా గ్రీన్ ఎనర్జీ ఉపయోగించుకోవాలి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఆర్ధికమంత్రి 'నిర్మలా సీతారామన్' భోపాల్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) 11వ స్నాతకోత్సవంలో ప్రస్తావించారు.పునరుత్పాదక ఇంధన నిల్వలపై పరిశోధనలు ముమ్మరం చేయాలని సైన్స్ కమ్యూనిటీకి నిర్మలా సీతారామన్ విజ్ఞప్తి చేశారు. శిలాజ ఇంధనం నుంచి పునరుత్పాదక శక్తికి మారడానికి చాలా డబ్బు అవసరం అవుతుంది. అయితే దీనికి నిధులు ఇంకా రావాల్సి ఉందని ఆమె అన్నారు.భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశానికి పునరుత్పాదక ఇంధన వనరులు చాలా అవసరం. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. దేశం గ్రీన్ ఎనర్జీ నిల్వలో అగ్రగామిగా ఉంది. కానీ సౌర శక్తిని నిల్వ చేసుకోవడానికి కావలసిన బ్యాటరీలు ప్రస్తుతం మనదగ్గర లేదు. వాటిని అభివృద్ధి చేయాల్సి ఉంది.ఇదీ చదవండి: ఫోన్ పే, గూగుల్ పేకు గట్టి పోటీ.. సిద్దమవుతున్న భీమ్సౌర శక్తిని నిల్వ చేసుకోవడానికి కావలసిన బ్యాటరీలు అందుబాటులోకి వచ్చే వరకు.. శిలాజ ఇంధనాలపైన ఆధారపడాలి. పెట్టుబడుల కోసం దేశం వేచి చూడదు, కాబట్టి శాస్త్రవేత్తలు కొత్త ఆవిష్కరణలు చేయాలి. అప్పుడే భారత్ మరింత వేగంగా ముందుకు వెళ్ళడానికి సాధ్యమవుతుందని నిర్మలా సీతారామన్ అన్నారు. -
ఎయిర్టెల్ డేటా సెంటర్ అరుదైన ఘనత
ఎయిర్టెల్ డేటా సెంటర్ విభాగమైన నెక్స్‌స్ట్రా అరుదైన ఘనత సాధించింది. కార్బన్ డిస్క్లోజర్ ప్రాజెక్ట్ భాగస్వామ్యంతో క్లైమేట్ గ్రూప్ నేతృత్వంలోని ఫ్లాగ్షిప్ గ్లోబల్ ఇనిషియేటివ్ ఆర్ఈ 100 ఇనిషియేటివ్‌లో చేరింది. 100 శాతం పునరుత్పాదక విద్యుత్తు వినియాగానికి కట్టుబడి ఉన్నట్లు కంపెనీ తెలిపింది. నెక్స్‌స్ట్రా దేశవ్యాప్తంగా 12 పెద్ద, 120 ఎడ్జ్ డేటా సెంటర్లతో దేశంలో అతిపెద్ద డేటా సెంటర్ల నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. "మాది పర్యావరణపరంగా బాధ్యతాయుతమైన బ్రాండ్. క్లీన్ ఎనర్జీ ప్రత్యామ్నాయాలను అవలంబిస్తున్నాం. 2031 నాటికి మా నెట్ జీరో లక్ష్యాలను సాధించే దిశగా మేము ఆరోగ్యకరమైన మార్గంలో ఉన్నాం. 100 శాతం పునరుత్పాదక విద్యుత్తుకు నిబద్ధతతో ఆర్ఈ 100 చొరవలో భాగం కావడం సంతోషంగా ఉంది" అని ఎయిర్టెల్ నెక్స్‌స్ట్రా సీఈవో ఆశిష్ అరోరా ఒక ప్రకటనలో తెలిపారు.భారత్‌లో ఆర్ఈ 100 ఇనిషియేటివ్‌కు హామీ ఇచ్చిన ఏకైక డేటా సెంటర్ సంస్థగా, ఈ మైలురాయిని చేరుకున్న 14 వ భారతీయ సంస్థగా నెక్స్‌స్ట్రా నిలిచింది. కంపెనీ తన పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచింది. ఇప్పటి వరకు 4,22,000 మెగావాట్ల పునరుత్పాదక శక్తి ఒప్పందాలను కుదుర్చుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, క్యాప్టివ్ సోలార్ రూఫ్‌టాప్ ప్లాంట్ల ద్వారా పునరుత్పాదక శక్తిని సోర్సింగ్ చేయడం ద్వారా సుమారు 1,56,595 టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించినట్లు నెక్స్‌స్ట్రా పేర్కొంది. -
భారీ పెట్టుబడులకు అదానీ రెడీ
అహ్మదాబాద్: డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ పునరుత్పాదక (రెన్యువబుల్స్‌ౖ) విద్యుదుత్పత్తిపై భారీగా ఇన్వెస్ట్ చేయనుంది. 2030కల్లా 40 గిగావాట్ల (జీడబ్ల్యూ) పునరుత్పాదక సామర్థ్యాన్ని నిర్మించే ప్రణాళికల్లో ఉంది. ఇందుకు రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులకు సిద్ధపడుతోంది. తద్వారా 2050కల్లా వివిధ బిజినెస్‌లలో నికరంగా కర్బనరహితం(నెట్ జీరో)గా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం గ్రూప్ పునరుత్పాదక(సౌర, పవన) విద్యుత్‌లో 10 గిగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది.ఇకపై ప్రతీ ఏడాది 6–7 జీడబ్ల్యూను జత చేసుకోవాలని చూస్తోంది. వెరసి 2030కల్లా 50 గిగావాట్లకు చేరుకునే లక్ష్యంతో పనిచేస్తోంది. ఒక్కో మెగావాట్‌కు రూ. 5 కోట్ల పెట్టుబడుల అంచనాతో మదింపు చేస్తే 2030కల్లా రూ. 2 లక్షల కోట్లను వెచ్చించవలసి ఉంటుందని అదానీ గ్రీన్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాగర్ అదానీ వెల్లడించారు. వీటితోపాటు 5 జీడబ్ల్యూ పంప్ స్టోరేజీ సామర్థ్యా న్ని సైతం ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ సీఈవో అమిత్ సింగ్ తెలిపారు. విద్యుత్‌కు అధిక డిమాండ్ నెలకొనే రాత్రి వేళల్లో విద్యుదుత్పత్తికి వీలుగా స్టోరేజీ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు వివరించారు. కార్బన్ క్రెడిట్స్.. రెన్యువబుల్ సామర్థ్యాల వినియోగం ద్వారా లభించే కార్బన్ క్రెడిట్స్‌కుతోడు మరికొన్ని ఇతర చర్యల ద్వారా 2050కల్లా అదానీ గ్రూప్ నెట్ జీరోకు చేరనున్నట్లు అమిత్ పేర్కొన్నారు. గతేడాది(2023–24) అదానీ గ్రీన్ ఎనర్జీ 2.8 జీడబ్ల్యూ సామర్థ్యాలను జత చేసుకున్నట్లు తెలియజేశారు. ఈ ఆర్థిక సంవత్సరం(2024–25)లో 6 జీడబ్ల్యూ సామర్థ్యాలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. కాగా, అదానీ గ్రూప్ ఈ ఏడాది (2024–25) వివిధ విభాగాలపై భారీ పెట్టుబడుల ప్రణాళికలు ప్రకటించింది. వివిధ కంపెనీలలో రూ. 1.3 లక్షల కోట్లు వెచ్చించనుంది. -
2029 నాటికి రూ.5000 కోట్ల ఆర్డర్స్!.. రెనర్జీ డైనమిక్స్
రెనర్జీ డైనమిక్స్ (REnergy Dynamics) పునరుత్పాదక రంగంలోకి అడుగుపెట్టినట్లు సోమవారం ప్రకటించింది. కంపెనీ లార్జ్ స్కేల్ బయోఎనర్జీ ప్రాజెక్ట్‌లకు, ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, నిర్మాణ రంగానికి, ఫీడ్‌స్టాక్ అగ్రిగేషన్, కంప్రెస్డ్ బయోగ్యాస్ మొదలైనవి సంస్థలకు తన ఉత్పతులను విక్రయించనుంది.రెనర్జీ డైనమిక్స్ 2029 నాటికి వివిధ సంస్థల నుంచి రూ.5000 కోట్ల రూపాయల ఆర్డర్లను బుక్ చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. సంస్థ వివిధ దశల్లో రూ. 575 కోట్ల విలువైన ప్రాజెక్టులను నిర్వహించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. -
5,500 మందితో హైదరాబాద్‌లో భారీ ఎక్స్పో.. ఎప్పుడంటే..
పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రానిక్ వాహనాల మార్కెట్‌కు సంబంధించి దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ప్రదర్శనకు హైదరాబాద్ వేదిక కానుంది. ఏప్రిల్ 26, 27న హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ‘రెన్యూఎక్స్ 2024’(8వ ఎడిషన్) పేరుతో ఈవింట్‌ను జరుపనున్నారు. ప్రముఖ బీ2బీ ఎగ్జిబిషన్స్ ఆర్గనైజర్ ఇన్ఫార్మా మార్కెట్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ ప్రదర్శనలో దాదాపు 5,500 మంది వీక్షకులు, 150 కంపెనీలు పాల్గొనవచ్చని అంచనా. ఈ మేరకు సంస్థ ప్రకటన విడుదల చేసింది. దాదాపు 180 బ్రాండ్లను ప్రదర్శనగా ఉంచే ఈ కార్యక్రమంలో ప్రధానంగా పునరుత్పాదక శక్తికి సంబంధించి విభిన్న విభాగాల్లో సేవలందిస్తున్న కంపెనీలు పరస్పరం సహకారం అందించుకునేలా ఏర్పాటు చేయనున్నారు. ఆయా విభాగాల్లోని నిపుణులు తమ ఆలోచనలు పంచుకునేందుకు వీలుకల్పిస్తున్నారు. దాంతో పునరుత్పాదక ఇంధన రంగానికి భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలు ఉండబోతున్నాయో చర్చించనున్నారు. ఈ ప్రదర్శనలో ఆర్కిటెక్ట్‌లు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు, పారిశ్రామిక వినియోగదారులు, ఫెసిలిటీ మేనేజర్లు, ఎనర్జీ కన్సల్టెంట్లు, ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్లు, పవర్ డిస్ట్రిబ్యూటర్లు/ డీలర్లు, సిస్టమ్ ఇన్స్టాలర్లు, స్థానిక అధికారులు.. ఇలా రిన్యూవెబుల్ ఎనర్జీతో సంబంధం ఉన్న వివిధ విభాగాలకు చెందిన వారు పాల్గొనే అవకాశం ఉందని నిర్వాహకులు చెప్పారు. ఇదీ చదవండి: భారత కంపెనీలతో యాపిల్ ఒప్పందం.. ఎందుకంటే.. ఇన్ఫార్మా మార్కెట్స్ ఎండీ యోగేష్ ముద్రాస్ మాట్లాడుతూ..‘2030 నాటికి భారత్‌లో వెలువడే కర్బన ఉద్గారాలు 45 శాతం కంటే తగ్గించాలనే లక్ష్యం ఉంది. 2070 నాటికి దీన్ని సున్నాకు తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశంలో మొత్తం పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో దాదాపు సోలార్ ఎనర్జీనే 55శాతంగా ఉంది. ఇది మరింత పెరిగే అవకాశం కన్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం సైతం ఈ రెన్యూవెబుల్ ఎనర్జీ అవసరాన్ని గుర్తించి ‘సుర్యఘర్ యోజన పథకం’ను కూడా ప్రారంభించింది. ఇందులో భాగంగా దాదాపు 1కోటి ఇళ్లకు సోలార్ రూఫ్‌టాప్ సౌకర్యాన్ని కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రంగం సమీప భవిష్యత్తులో మరింత వృద్ధి చెందనుంది. ఈమేరకు ‘రెన్యూఎక్స్ 2024’ కార్యక్రమం వ్యాపారులు తమ ఉత్పత్తులను మరింత వైవిధ్యంగా మార్చేలా ఉపయోగపడుతుంది’ అని ఆయన వివరించారు. ఆసక్తి ఉన్న సందర్శకులు సంబంధిత వెబ్సైట్లో పూర్తి వివరాలు అందించి తమ పేరు నమోదుచేసుకోవాల్సి ఉంటుంది. -
పునరుత్పాదక విద్యుత్‌లో అదానీ గ్రీన్ ఎనర్జీ రికార్డు
న్యూఢిల్లీ: దేశీయంగా 10,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని సాధించిన తొలి కంపెనీగా తమ సంస్థ నిలి్చందని అదానీ గ్రీన్ ఎనర్జీ (ఏజీఈఎల్) తెలిపింది. గుజరాత్‌లోని ఖావ్డా సోలార్ పార్క్‌లో 2,000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంటు ఏర్పాటు ద్వారా దీన్ని సాధించినట్లు సంస్థ వివరించింది. ప్రస్తుతం కంపెనీ పోర్ట్‌ఫోలియోలో 7,393 మెగావాట్ల సౌర విద్యుత్, 1,401 మెగావాట్ల పవన విద్యుత్, 2,140 మెగావాట్ల విండ్–సోలార్ హైబ్రిడ్ ప్లాంట్లు (మొత్తం 10,934 మెగావాట్ల ) ఉన్నాయి. 2030 నాటికల్లా 45 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలని కంపెనీ నిర్దేశించుకుంది. -
మూత్రం నుంచి విద్యుత్
పాలక్కడ్: కాలుష్యకారక శిలాజ ఇంథనాలకు బదులు పునరుత్పాదక ఇంథనంపై ప్రపంచం దృష్టిపెట్టాలన్న ఆకాంక్షల నడుమ ఐఐటీ పాలక్కడ్ పరశోధకులు పునరుత్పాదక ఇంథనాన్ని మూత్రం నుంచి ఉత్పత్తిచేసి ఔరా అనిపించారు. సంబంధిత పరిశోధనా పత్రాన్ని ప్రముఖ ఆన్లైన్ జర్నల్ ‘సపరేషన్ అండ్ ప్యూరిఫికేషన్ టెక్నాలజీ’లో ప్రచురించారు. ఈ పునరుత్పాదక విద్యుత్ తయారీ కోసం వారు కొత్తగా ఎలక్ట్రో కెమికల్ రిసోర్స్ రికవరీ రియాక్టర్(ఈఆర్ఆర్ఆర్)ను తయారుచేశారు. ఇందులో మూత్రాన్ని నింపి ఎలక్ట్రోరసాయనిక చర్యల ద్వారా విద్యుత్‌ను, సహజ ఎరువును ఉత్పత్తిచేస్తారు. ఈ విద్యుత్‌తో స్మార్ట్ఫోన్లును చార్జ్చేయొచ్చు. విద్యుత్ దీపాలను వెలిగించవచ్చు. రీసెర్చ్ స్కాలర్ వి.సంగీత, ప్రాజెక్ట్ సైంటిస్ట్ డాక్టర్ శ్రీజిత్ పీఎం, డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్‌లో రీసెర్చ్ అసోసియేట్ రీను అన్నా కోషీల బృందం ఈ పరిశోధన చేపట్టింది. ఈఆర్ఆర్ఆర్ ద్వారా నైట్రోజన్, ఫాస్పరస్, మెగ్నీషియంలు ఎక్కువగా ఉండే సహజ ఎరువునూ పొందొచ్చని ఐఐటీ పాలక్కడ్ ఒక ప్రకటనలో పేర్కొంది. అమ్మోనియా సంగ్రహణి, క్లోరినేషన్ గది, ఎలక్ట్రికల్ గొట్టాల సమన్వయంతో ఈ రియాక్టర్ పనిచేస్తుంది. ఇందులో మెగ్నీషియంను ఆనోడ్‌గా, గాలి కార్భన్ను కాథోడ్‌గా వాడతారు. థియేటర్లు, షాపింగ్ మాల్స్ ప్రాంగణాల్లో మూత్ర విసర్జన ఎక్కువ. ఇలాంటి చోట్ల ఈ రియాక్టర్ల ద్వారా ఎక్కువ స్థాయిలో విద్యుత్‌ను ఉత్పత్తిచేసి అక్కడి విద్యుత్దీపాలను వెలిగించవచ్చు. ప్రస్తుతం ఈ సాంకేతికత ప్రయోగ దశలోనే ఉందని ఐఐటీ పాలక్కడ్ స్పష్టంచేసింది. ఈ టెక్నాలజీపై పేటెంట్ కోసం బృందం ఇప్పటికే దరఖాస్తు చేసుకుంది. ప్రాజెక్టుకు కేంద్రమే నిధులిచ్చింది. -
Project Gagan: అయిదేళ్లలో లక్ష ఎలక్ట్రిక్ ఆటోలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రెన్యువబుల్ ఎనర్జీ సొల్యూషన్స్ సంస్థ జీరో21 తాజాగా ప్రాజెక్ట్ గగన్‌ను ప్రారంభించింది. దీని కింద వచ్చే అయిదేళ్లలో 1 లక్ష ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలను ఆవిష్కరించాలని నిర్దేశించుకుంది. సంప్రదాయ ఇంధనాలతో నడిచే వాహనాలను రెట్రో ఫిట్టింగ్ ప్రక్రియ ద్వారా ఎలక్ట్రిక్‌కి మార్చడం లేదా కొత్త ఎలక్ట్రిక్ వాహనాలకు ఎక్సే్చంజ్ చేయడం ద్వారా దీన్ని సాధించాలని భావిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా కన్వర్షన్ కిట్‌ను రూపొందించినట్లు సంస్థ వ్యవస్థాపకులు రాణి శ్రీనివాస్ తెలిపారు. దీనితో ఏదైనా ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్‌తో (ఐసీఈ) నడిచే త్రీ–వీలర్లను కేవలం నాలుగు గంటల్లోనే ఎలక్ట్రిక్ వాహనంగా మార్చవచ్చని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల నిర్వహణ ఖర్చులు తగ్గి, డ్రైవర్లకు దీర్ఘకాలికంగా ఆర్థిక ప్రయోజనం లభించగలవని శ్రీనివాస్ వివరించారు. ప్రధానంగా ఆటో రిక్షా యజమానులు, ఫ్లీట్ ఆపరేటర్లను దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్ట్ గగన్‌ను చేపట్టినట్లు ఆయన చెప్పారు. రోడ్‌సైడ్ అసిస్టెన్స్ (ఆర్ఎస్ఏ)ని కూడా ప్రవేశపెట్టినట్లు వివరించారు. ఎలక్ట్రిక్ వాహనాలతో వాయు, ధ్వని కాలుష్యం తగ్గగలదని శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా పని చేసే జీరో21 సంస్థ ప్యాసింజర్, లోడ్ క్యారియర్ సెగ్మెంట్లలో ఎలక్ట్రిక్ త్రీ వీలర్లను తయారు చేస్తోంది. అలాగే రెట్రోఫిట్ కిట్లను కూడా అందిస్తోంది. -
వ్యర్థాల ప్లాంట్.. వినోదాల స్పాట్!
నగరాల్లో ఇంటింటి నుంచి చెత్తను సేకరించి ఓ ప్రదేశంలో కాల్చేయడమో లేదా రీసైక్లింగ్ చేయడమో జరుగుతూ ఉంటుంది. తీవ్ర దుర్గంధభరితమైన, అత్యంత కాలుష్యమయమైన ఆ ప్రాంతానికి పొరపాటున కూడా వెళ్లే సాహసం చేయలేం కదా? కానీ అలాంటి ప్రదేశానికి వెళ్లి సేద తీరడమే కాదు.. ఆడొచ్చు.. పాడొచ్చు.. ఇంకా కావాల్సింది సుష్టుగా తినొచ్చు. అవాక్కవుతున్నారా? నిజంగా ఇది నిజం. మరి అ అందమైన చెత్త వినోద కేంద్రం ఎక్కడుంది, దాని విశేషాలేంటో చూద్దామా? డెన్మార్క్ రాజధాని కోపెన్హాగన్.. రాజరిక వారసత్వం, ఆధునిక వాస్తుశిల్పాన్ని మిళితం చేసిన పర్యావరణ అనుకూలమైన అందమైన నగరం. 2017లో కోపెన్‌హాగన్‌ను ప్రపంచంలోని గ్రీన్‌సిటీగా ప్రకటించారు. ఇది ప్రధానంగా పునరుత్పాదక శక్తిని పెంపొందించడం, క్లీనర్ మొబిలిటీపై దృష్టి పెట్టింది. దీంతో నగరంలోని వ్యర్థాలను మొత్తం విద్యుత్‌గా మార్చే ఒక పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని ఇక్కడ చేపట్టారు. కేవలం ప్లాంటు ఒకటే ఏం బాగుంటుందని అనుకున్నారు డెన్మార్క్ అధికారులు. అంతే వ్యర్థాల శుద్ధి కేంద్రానికి వినోదపు టచ్ ఇవ్వాలని నిర్ణయించారు. ఆ మేరకు అదిరిపోయే డిజైన్‌తో ఈ ప్లాంట్ నిర్మించారు. కోపెన్‌హాగన్‌లోని ఎత్తైన భవనాల్లో ఒకటైన ఈ ఆర్కిటెక్ట్ అద్భుతాన్ని అమేజర్ బక్కే లేదా కోపెన్హిల్గా పిలుస్తారు. కార్పొరేట్ ఆఫీసులను తలదన్నేలా ఉన్న ఈ భవ నాన్ని చూస్తే ఇది వ్యర్థ శుద్ధి కేంద్రమా అనే సందేహం కలగక మానదు. 100 మీటర్ల ఎత్తైన ఈ భవనంపైన అనేక కార్యకలాపాలతో కూడిన డైనమిక్ కమ్యూనిటీని ఏర్పాటు చేశారు. ఇందులో స్కైయింగ్, హైకింగ్, క్లైంబింగ్ వంటి వినోద సదుపాయాలు ఉన్నాయి. దీంతో ఇది వ్యర్థాలను ప్రాసెస్ చేసే ప్లాంట్‌గానే కాకుండా.. వినోదాలు పంచే విహారాల స్పాట్‌గా కూడా ప్రత్యేకతను సొంతం చేసుకుంది. కార్బన్ న్యూట్రల్ సిటీగా.. 2025 నాటికి ప్రపంచంలోనే మొట్టమొదటి కార్బన్ న్యూట్రల్ సిటీగా కోపెన్హాగన్ అవతరించాలనే లక్ష్యంతోనే ఈ ప్లాంట్ నిర్మాణం చేపట్టారు. వ్యర్థాలను భూగర్భంలో ఉండే ఓ బాయిలర్‌లో ప్రాసెస్ చేయడం ద్వారా ప్లాంట్ పనిచేస్తుంది. రోజుకు 300 ట్రక్కుల వ్యర్థాలను వెయ్యి డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద మండిస్తారు. ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు వాతావరణంలోకి 250 కిలోగ్రాముల కార్బన్‌డైఆక్సైడ్ నీటి ఆవిరి రూపంలో 124 మీటర్ల చిమ్నీ ద్వారా బయటకు వస్తుంది. ఏటా 4,40,000 టన్నుల వ్యర్థాలను మండించడం ద్వారా 1,50,000 గృహాల విద్యుత్ అవసరాలను ఈ ప్లాంట్ తీరుస్తోంది. పర్వతారోహకులకు పండుగే.. పర్యాటకులు ఈ ప్లాంట్ పై స్కైయింగ్ చేయొచ్చు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 85 మీటర్ల క్లైంబింగ్ వాల్‌ను ఈ ప్లాంట్‌లో ఏర్పాటు చేశారు. దీంతో ఇక్కడకు వచ్చే పర్వతారోహకులు బాగా ఎంజాయ్ చేస్తారు. చిన్నపిల్లలు కింది భాగంలో గ్లైడింగ్ ప్రాక్టీస్ చేసే సదుపాయం కూడా ఉంది. ఇక రిసార్ట్స్ తరహాలో ఇక్కడ కెఫే, బార్ కూడా ఉన్నాయండోయ్.. రూఫ్‌టాప్ కెఫేలో వేడి వేడి కాఫీ, చల్లని శీతలపానీయాలతో సేద తీరొచ్చు. సముద్రాన్ని చూస్తూ మీకు నచి్చన ఫుడ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఎప్పుడైనా డెన్మార్క్ వెళితే ఈ ప్లాంట్‌ను ఓ లుక్కేసి రండి. -
పార్కింగ్ ప్లేస్ పైకప్పులుగా సోలార్ ప్యానెల్స్.. వేల ఎకరాల్లో ఏర్పాటు!
ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ వినియోగం పెరుగుతోంది. పునరుత్పాదక వనరులు వినియోగించుకుని విద్యుత్ తయారుచేయడంలో చాలాదేశాలు ఎంతో పురోభివృద్ధి సాధిస్తున్నాయి. ప్రధానంగా సౌరశక్తి, పవనశక్తిని ఉపయోగించి కరెంట్ తయారుచేయడంలో ఎన్నో కంపెనీలు విభిన్నంగా ఆలోచిస్తున్నాయి. అందులో భాగంగా కొన్నిదేశాల్లో స్థలం వృధా కాకుండా కాలువలపై సోలార్ ఎనర్జీ ప్లేట్లను ఏర్పాటుచేస్తుంటే.. కొన్నిచోట్ల జలాశయాలపై వాటిని వినియోగించి కరెంట్‌ను తయారుచేస్తున్నారు. తాజాగా న్యూయార్క్ సిటీలో ఏకంగా 8,500 ఎకరాల్లో సోలార్‌ప్లేట్లతో పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటుచేశారు. న్యూయార్క్ సిటీలో పునరుత్పాదకత వనరులను వినియోగించుకునేలా అక్కడి జోనింగ్ చట్టాలను సడలించించడంతో ఇలాంటి చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల న్యూయార్క్ సిటీ కౌన్సిల్ ‘సిటీ ఆఫ్ యెస్ ఫర్ కార్బన్ న్యూట్రాలిటీ’ని ఆమోదించింది. అక్కడి జోనింగ్ కోడ్‌ను అప్డేట్ చేయడంతో క్లీన్ ఎనర్జీ, ఈవీ ఛార్జర్లను ఇంప్లిమెంట్ చేయడానికి స్థిరమైన కార్యక్రమాలు చేపట్టే అవకాశం కల్పిస్తున్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. న్యూయార్క్‌సిటీలో జోనింగ్ కోడ్‌ను ఆధునీకరించడం ద్వారా పరిశుభ్రమైన గాలి, వ్యర్థాల నిర్వహణ, ఈవీ వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు న్యూయార్క్ సిటీ మేయర్ ఎరిక్ ఆడమ్స్ తెలిపారు. గతంలో తక్కువ ఆదాయాలు కలిగిన ప్రజలు నివసిస్తున్న ప్రదేశాల్లో సోలార్ప్లేట్లకు సంబంధించిన మైక్రోగ్రిడ్లను ఇన్స్టాల్ చేసేందుకు అనుమతులుండేవి కాదు. కానీ ప్రస్తుతం తీసుకున్న నిర్ణయాలతో అక్కడి ప్రదేశాలతోపాటు పార్కింగ్ స్థలాల్లో సౌరఫలకలను ఏర్పాటు చేసుకునేలా అనుమతిస్తున్నట్లు ఆడమ్స్ తెలిపారు. ఇది సిటీలో పూర్తిగా కార్యరూపం దాలిస్తే దాదాపు 1,30,000 గృహాలకు తక్కువ ఖర్చుతో కరెంట్ లభిస్తుందని అన్నారు. ఇదీ చదవండి: బ్యాంకులో పెట్టిన బంగారం పోతే ఎంతిస్తారంటే... తాజాగా జోనింగ్ చట్టాల్లో తీసుకొచ్చిన మార్పుల వల్ల 8,500 ఎకరాల పార్కింగ్ స్థలాల్లో సోలార్ ఎనర్జీని తయారుచేస్తున్నారు. దాంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. -
అధిక ఆర్థిక వృద్ధితోనే..
న్యూఢిల్లీ: పునరుత్పాదక ఇంధన వనరులపై పెట్టుబడులు పెట్టడానికి భారతదేశం అధిక ఆర్థిక వృద్ధి రేటు సాధించాలి్పన అవసరం ఉందని ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) వీ అనంత నాగేశ్వరన్ పేర్కొన్నారు. బొగ్గు నుండి పునరుత్పాదక ఇంధనం వైపు మళ్లేందుకు దేశానికి మరింత సమయం పడుతుందని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, నేషనల్ డిటరై్మండ్ కాంట్రిబ్యూషన్స్ (ఎన్డీసీ) లక్ష్యాన్ని చేరుకోవడంలో భారతదేశం ఇతర జీ20 గ్రూప్ దేశాల కంటే చాలా ముందుందని అన్నారు. భూమి సగటు ఉష్ణోగ్రత పెరుగుదలను పారిశ్రామిక పూర్వ (1985–1900) స్థాయిలతో పోలిస్తే రెండు డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయడానికి వివిధ దేశాలు అనుసరించిన జాతీయ కార్యాచరణ ప్రణాళికలను ఎన్డీసీలుగా పరిగణిస్తున్న సంగతి తెలిసిందే. పేద దేశాలకు ఇబ్బందే.. అయితే అసలే కోవిడ్ ప్రతికూల ప్రభావాల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతూ, తక్కువ వృద్ధి సాధిస్తూ, అప్పుల వలయంలో ఉన్న కొన్ని దేశాలకు ఎన్డీసీ లక్ష్యాల సాధనకు పెట్టుబడులు పెట్టడం కష్టంగా మారిందని నాగేశ్వరన్ అన్నారు. పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని మూడు రెట్లు పెంచుతామని కాప్28 వాతావరణ శిఖరాగ్ర సమావేశంలో చేసిన డిక్లరేషన్‌పై సంతకాలు చేయడానికి ఈ నెల ప్రారంభంలో భారత్, చైనాలు తిరస్కరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ దిశలో అడుగులు వేయాలన్న జీ20 నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు భారత్ ఉద్ఘాటించింది. పర్యావరణ పరిరక్షణపై దుబాయ్‌లో ఐక్యరాజ్యసమితి నిర్వహించిన చర్చల సందర్భంగా, 2030 నాటికి ప్రపంచ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని మూడు రెట్లు పెంచడానికి కట్టుబడి ఉన్నట్లు 118 దేశాలు ఉద్ఘాటించాయి. ఈ ప్రతిష్టాత్మక సమావేశం ప్రపంచంలోని మొత్తం శక్తి ఉత్పత్తిలో శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. డిక్లరేషన్‌కు మద్దతు ఇచి్చన దేశాల్లో జపాన్, ఆ్రస్టేలియా, కెనడా, చిలీ, బ్రెజిల్, నైజీరియా, బార్బడోస్ ఉన్నాయి. ఈ డిక్లరేషన్‌లో శిలాజ ఇంధనాల వినియోగం తగ్గడంతో పాటు పునరుత్పాదక ఇంధన ఉత్పత్లి పెంచడం కూడా కీలక అంశంగా ఉంది. నిరంతర బొగ్గు విద్యుత్‌ను దశలవారీగా తగ్గించాలని, కొత్త బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్ల నిధులకు స్వస్తి పలకాలని కాప్28 సదస్సు ప్రతినబూనింది. -
సోలార్ రూఫ్.. రేటు టాప్!
సాక్షి, అమరావతి: థర్మల్, హైడల్, విండ్, గ్యాస్, బయోమాస్ ద్వారా ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌తో పోల్చితే.. ఇళ్ల పైకప్పులపై పెట్టుకునే సోలార్ రూఫ్‌టాప్ ఖరీదే ఎక్కువని తాజాగా ఓ అధ్యయనం తేచ్చింది. పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించడం కోసం ఇళ్ల పైకప్పులపై దాదాపు 40 గిగావాట్ల సౌర పలకలను అమర్చాలని కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో కలిపి రూఫ్‌టాప్ సామర్థ్యం 11 గిగావాట్లు కాగా, నివాస గృహాలపై ఉన్నది 2.7 గిగావాట్లు మాత్రమే. దీనికి కారణం ఖర్చు ఎక్కువ కావడమేనని అధ్యయనంలో వెల్లడైంది. ఏపీ సహా 21 రాష్ట్రాల్లోని 14వేల గృహాలపై అధ్యయనం చేసిన థింక్ ట్యాంక్ కౌన్సిల్ ఫర్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ (ఢిల్లీ) పరిశోధకులు దేశంలో సబ్సిడీలు ఇస్తున్నా సోలార్ రూఫ్‌టాప్ సిస్టం ఏర్పాటు ఇప్పటికీ ఖరీదైనదిగానే ఉందని తెలిపారు. రూఫ్‌టాప్ ఖర్చు, సబ్సిడీ ఇలా.. విద్యుత్ వినియోగదారుల్లో దాదాపు 85 శాతం మంది ఏడాదికి 1,200 యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. ఎవరైనా తమ ఇంటిపై రూఫ్‌టాప్ సిస్టం ఏర్పాటు చేయాలంటే ప్రతి కిలోవాట్‌కు 100 చ.అ. స్థలం ఉండాలి. ఒక కిలోవాట్‌కు రూ.50 వేలు, ఒక కిలోవాట్‌పైన 2 కిలోవాట్ల వరకు కిలోవాట్‌కి రూ.47 వేలు, 2 కిలోవాట్ల పైబడి 3 కిలోవాట్ల వరకు కిలోవాట్‌కు రూ.45 వేలు, 3 కిలోవాట్ల పైన 10 కిలోవాట్ల వరకు కిలోవాట్‌కి రూ.44 వేలు, 10 కిలోవాట్ల పైబడి 100 కిలోవాట్ల వరకు కిలోవాట్‌కి రూ.38,000, వంద కిలోవాట్లపైన 500 కిలోవాట్ల వరకు కిలోవాట్‌కు రూ.36 వేలు ఖర్చవుతుంది. వీటికి అదనంగా దరఖాస్తు రుసుం 5 కిలోవాట్ల వరకు రూ.1,000, ఆ పైన రూ.5వేలు చొప్పున చెల్లించాలి. మీటరింగ్ చార్జీలు అదనం. ఈ ధరలు చెల్లించిన వారికి సోలార్ రూఫ్ టాప్ ప్లాంట్ల రూపకల్పన, సరఫరా, ఏర్పాటు చేసి ఇవ్వడంతో పాటు బీమాతో సహా ఐదేళ్ల వారంటీ లభిస్తుంది. 3 కిలోవాట్ల వరకు 40%, 3 కిలోవాట్ల పైబడి 10 కిలో వాట్ల కంటే ఎక్కువ సోలార్ రూఫ్‌టాప్ వ్యవస్థలపై 20% సబ్సిడీ వస్తుంది. రూఫ్‌టాప్ సోలార్ యోజన స్కీం ను 2026 మార్చి 31 వరకు కేంద్రం పొడిగించింది. మన దగ్గర మెరుగు ప్రజలు తమ గృహ, వాణిజ్య అవసరాలకు సౌర విద్యుత్‌ను వినియోగించుకునేందుకు వీలుగా సోలార్ రూఫ్ టాప్ పాలసీ(ఎస్ఆర్టీ)ని రాష్ట్ర ప్రభుత్వం తెచ్చింది. దీనికి అనుగుణంగా ఎవరైనా తమ నివాస, వాణిజ్య భవనంపై సోలార్ పలకలు పెట్టుకోవచ్చు. సోలార్ పలకలు బిగించాక ఉత్పత్తి అయిన విద్యుత్‌ను వారి అవసరానికి వాడుకోగా, మిగిలినది గ్రిడ్‌కు ఎగుమతి చేయొచ్చు. దానిని డిస్కంలు తమ మీటరు ద్వారా రికార్డ్ చేస్తాయి. వినియోగదారుడు ఎగుమతి చేసిన యూనిట్లకు ఏపీఈఆర్సీ నిర్ణయించిన పూల్ కాస్ట్ ధర(రూ.4.60 పైసలు)ను డిస్కంలు చెలి్లస్తున్నాయి. దీనివల్ల రూఫ్‌టాప్ నిర్వాహకులకు ప్రయోజనం చేకూరుతోంది. అటు డిస్కంలు కూడా నెట్ మీటరింగ్ ద్వారా రూఫ్‌టాప్ సోలార్ సిస్టంల నుంచి ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను ‘రెన్యూవబుల్ పవర్ పర్చేజ్ ఆబ్లిగేషన్ (ఆర్పీఓ) లక్ష్యంలో చూపించుకునే వెలుసుబాటు మన రాష్ట్రంలో ఉంది. -
2030 నాటికి పతాకస్థాయికి చేరనున్న శిలాజ ఇంధనాలు
శిలాజ ఇంధనాల క్షీణత, ముడిచమురు ధరల్లో అస్థిరత, కఠినమైన పర్యావరణ నిబంధనలు వంటి సవాళ్లను ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటోంది. ప్రపంచవ్యాప్తంగా చమురు, సహజ వాయువు, బొగ్గుకు గరిష్ఠ స్థాయిలో డిమాండ్ నెలకొనడం చరిత్రలో ఇదే మొదటిసారి. గ్లోబల్‌గా శిలాజ ఇంధన డిమాండ్ 2030 నాటికి పతాకస్థాయికి చేరుకుంటుందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ(ఐఈఏ) 2023 నివేదిక తెలిపింది. ఎలక్ట్రానిక్ వాహనాల అమ్మకాలు వేగంగా పుంజుకుంటున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అణు, సౌర, పవన విద్యుత్తుకు అధిక గిరాకీ ఉంటుందని నివేదిక తెలియజేసింది. అందులోని వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. బొగ్గు, పెట్రోలియం, సహజవాయువు, అణుశక్తి తరిగిపోయే శక్తివనరులు. వాటిని ఒకసారి వినియోగిస్తే, మళ్లీ ఉపయోగించడం కుదరదు. నీరు, గాలి, సూర్యరశ్మి, సముద్ర తరంగాల శక్తి, భూతాపశక్తి, జీవశక్తి తదితరాలు ఎన్నటికీ తరిగిపోనివి. అందుకే వాటిన సంప్రదాయేతర లేదా తరిగిపోని ఇంధన వనరులు అంటారు. శాస్త్రవిజ్ఞానం, నవీన ఆవిష్కరణల ద్వారా వాటి వినియోగాన్ని పెంచుతున్నారు. (ఇదీ చదవండి: రూ.240కే ‘ఎక్స్’ సబ్స్క్రిప్షన్.. ఫీచర్లు ఇవే..) తగ్గుతున్న శిలాజ ఇంధన డిమాండ్ బొగ్గు, చమురు, సహజ వాయువులను శిలాజ ఇంధనాలు అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాలవారీగా వీటి డిమాండ్ ఆధారపడుతుంది. అనేక దశాబ్దాలుగా విద్యుత్ ఉత్పత్తి, రవాణా, పారిశ్రామిక అవసరాలకు వీటిని వాడుతున్నారు. పట్టణీకరణ, జనాభా పెరుగుదల కారణంగా వీటికి మరింత డిమాండ్ పెరిగింది. కానీ వీటిని మండించడం ద్వారా పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం తగ్గించాలనే ఉద్దేశంతో వివిధ దేశాలు కఠిన చట్టాలు తీసుకొచ్చాయి. 2030 నాటికి శిలాజ ఇంధనాలకు గరిష్ట స్థాయిలో డిమాండ్ ఉంటుందని అంచనా. ప్రభుత్వాలు అనుసరిస్తున్న కొన్ని విధానల ద్వారా క్రమంగా వీటి వాడకం తగ్గనుంది. వీటిస్థానే క్లీన్ ఎనర్జీ టెక్నాలజీవైపు అడుగులు వేసే అవకాశం ఉంది. క్షీణిస్తున్న బొగ్గువాడకం ప్రపంచ బొగ్గు డిమాండ్ అనేది ప్రధానంగా విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లపై ఆధారపడుతుంది. ఇతర మార్గాల ద్వారా కరెంట్ ఉత్పత్తి అవుతుంటే క్రమంగా బొగ్గుకు డిమాండ్ తగ్గుతుంది. అయితే 65శాతం బొగ్గును ప్రస్తుతం కరెంట్ తయారీకే వాడుతున్నారు. థర్మల్‌పవర్ ప్లాంట్లు సిస్టమ్ సేవలు ఉపయోగిస్తున్నాయి. దాంతో బొగ్గు వినియోగం కొంతమేర తగ్గుతుంది. అయితే పారిశ్రామిక డిమాండ్, ఉక్కు తయారీ, సిమెంట్ పరిశ్రమల కోసం వాడే బొగ్గు వినియోగం స్థిరంగా ఉంది. పునరుత్పాదక వనరులపై మక్కువ సౌరశక్తి, పవన శక్తి, జలశక్తి, సముద్ర తరంగాల శక్తి, భూతాపశక్తి, జీవశక్తి వాడకంపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన ఏర్పడింది. వాటిని వినియోగించే దేశాల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ప్రస్తుతం 140కి పైగా దేశాలు వీటిని విరివిగా వాడుతున్నాయి. 2010తో పోలిస్తే 2022 వరకు సౌరశక్తి వల్ల 90శాతం, పవనశక్తి ద్వారా 70శాతం, ఆఫ్‌షోర్ విండ్ ద్వారా 60శాతం విద్యుత్ ధరలు తగ్గాయి. (ఇదీ చదవండి: ఇకపై లోన్ రికవరీ ఏజెంట్ల సమయం ఇదే..) క్లీన్ ఎనర్జీ వైపు..ప్రపంచం చూపు క్లీన్ ఎనర్జీ టెక్నాలజీ విస్తరణ వల్ల సౌర, పవన శక్తి వాడకం ఎక్కువైంది. దాంతో ప్రపంచ వ్యాప్తంగా ఉద్గారాలు తగ్గనున్నాయి. 2030 వరకు సోలార్‌ఎనర్జీ వల్ల దాదాపు 3 గిగాటన్నుల ఉద్గారాలు తగ్గుతాయని అంచనా. ఇది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రోడ్డుపై ఉన్న అన్ని కార్ల నుంచి వెలువడే ఉద్గారాలకు సమానం. పవన శక్తి వల్ల మరో రెండు గిగాటన్నుల ఉద్గారాలు తగ్గనున్నాయి. -
G20 Summit: డిక్లరేషన్‌పై తొలగని ప్రతిష్టంభన
జీ20 శిఖరాగ్ర సదస్సుకు సర్వం సిద్ధమై అగ్రరా జ్యాధినేతలు విచ్చేసి భేటీకి సిద్ధమవుతున్న వేళ ఢిల్లీ డిక్లరేషన్‌పై ఇంకా ప్రతిష్టంభన తొలగలేదు. శిఖరాగ్ర సదస్సులో దేశాధినేతల మధ్య విస్తృత స్థాయి చర్చలు పూర్తయ్యాక చివరి రోజున ఉమ్మడి తీర్మానం(ఢిల్లీ డిక్లరేషన్) విడుదల చేస్తారు. ఆ తీర్మానంలో ఏఏ అంశాలపై ఉమ్మడి నిర్ణయాలు ప్రకటించాలనే దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. డిక్లరేషన్‌లో పొందుపరచాల్సిన అంశాలపై ఇప్పటికే ఆయా దేశాధినేతల తరఫున అధికారిక ప్రతినిధు(షెర్పా) లు పలుమార్లు కలిసికట్టుగా అంతర్గత చర్చలు జరిపారు. ఈ మంతనాల్లో ఇంతవరకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఎలాంటి ఉమ్మడి నిర్ణయాలు తీసుకో లేదు. శిఖరాగ్ర సదస్సులో అధినేతలు ఏమేం అంశాలు చర్చించాలనేది ముందే నిర్ణయం అయిపో తుంది. సదస్సు అత్యంత సాఫీగా సాగేందుకు వీలుగా ఆయా అంశాలపై అధినేతల నుంచి ఉమ్మ డి నిర్ణయాలు వెలువడేందుకుగాను ముందే షెర్పా లు భారీ కసరత్తు చేస్తారు. సభ్య దేశాల అధినేతల అధికారిక ప్రతినిధులైన ఈ షెర్పాలు దౌత్యమార్గంలో అంతర్గతంగా ముందే అందరూ చర్చించుకుంటారు. దీంతో శిఖరాగ్ర సదస్సులో అధినేతలు నేరుగా కలిసి మాట్లాడేటపుడు ఆయా అంశాల లోతుల్లోకి వెళ్లరు. సూత్రప్రాయ అంగీకారం మాత్రమే తెలుపుతారు. మిగిలిన పని అంతా ముందే ఏర్పాటు చేసిపెడతారు కాబట్టి ఆతర్వాతి ప్రక్రియ సులువు అవుతుంది. అయితే, తాజాగా షెర్పాల మధ్య జరిగిన చివరి రౌండ్ చర్చల్లోనూ కొన్ని కీలక అంశాలపై సయోధ్య కుదరనే లేదు. వాటిల్లో పర్యావరణ మార్పు, ఉక్రెయిన్ యుద్ధం వంటి ప్రధాన అంశాలు ఉన్నాయి. ఉక్రెయిన్ యుద్ధాన్ని పేర్కొంటూ ఒక పేరాగ్రాఫ్‌లో భారత్ చేసిన ప్రతిపాదనలపై షెర్పాల చిక్కుముడి పడింది. ఉక్రెయిన్‌లో రష్యా ఆగడాలను అడ్డుకునేలా చర్యలు ఆ పేరాగ్రాఫ్‌లో లేవని అమెరికా, బ్రిటన్, యురోపియన్ యూనియన్లు వేలెత్తిచూపాయి. ఢిల్లీ డిక్లరేషన్‌లో ఉక్రెయిన్ యుద్ధం అంశంపై ఏకాభిప్రాయం తెలపాలంటే తమ డిమాండ్లు నెరవేర్చాలని అటు పశ్చిమ దేశాలు, ఇటు రష్యా–చైనా పక్ష దేశాలు పట్టుబడుతున్నాయి. దీంతో ఈ అంశంపై సమ్మతి సాధ్యపడలేదు. ఇలాంటి పరిస్థితి రాకూడదనే ముందుగానే జకార్తాలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌లు చర్చలు జరిపి డిక్లరేషన్ సంబంధ అంశాలపై చర్చించినా ఫలితం లేకపోయింది. భారత నాయకత్వ ప్రతిష్టకు సవాల్ తొలిసారిగా జీ20 కూటమి సారథ్య బాధ్యతలు తీసుకున్న భారత్ ఈ సదస్సు తర్వాత ఎలాగైనా సరే ఉమ్మడి తీర్మానం ప్రకటించాలని చూస్తోంది. అయితే అటు పశ్చిమ దేశాలు, ఇటు రష్యా–చైనా పక్ష దేశాలు ఎవరి మంకుపట్టు వారు పట్టడంతో ఉ మ్మడి తీర్మానం సాధ్యమయ్యేలా లేదు. అదే జరిగి తే అంతర్జాతీయంగా భారత ప్రతిష్టకు భంగం వా టిల్లే ప్రమాదం ఉంది. సంయుక్త ప్రకటన సాధ్యంకాని పక్షంలో జీ20 అధ్యక్ష హోదాలో మోదీ కేవలం సారాంశ ప్రకటన విడుదల చేస్తారు. వాతావరణ మార్పు: ఇదే అసలైన అవరోధం చర్చల్లో ఏకాభిప్రాయానికి ప్రధాన అవరోధంగా వాతావరణ మార్పు విధానం నిలుస్తోంది. శిలాజ ఇంధనాల వినియోగాన్ని క్రమక్రమంగా తగ్గించుకోవడం, పునరుత్పాదక ఇంథనాల వైపు మళ్లడం, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సామర్థ్యాల పెంపునకు లక్ష్యాలను నిర్దేశించుకోవడం, గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారాలను తగ్గించుకోవడం వంటి అంశాల్లో జీ20 సభ్య దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇది షెర్పాల భేటీలో స్పష్టంగా కనిపించింది. 2030 కల్లా పునరుత్పాదక ఇంధన సామర్థ్యాలను క్రమంగా పెంచుకోవాలని, 2035 ఏడాదికల్లా గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారాల స్థాయిని తగ్గించుకోవాలని పశ్చిమ దేశాలు చేసిన ప్రతిపాదనలను భారత్, రష్యా, చైనా, సౌదీ అరేబియాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. శిలాజ ఇంధన ఆధారిత ఆర్థికవ్యవస్థ కలిగిన సౌదీ అరేబియా అయితే ఈ ప్రతిపాదలను ఒప్పుకునేది లేదని తెగేసి చెప్పింది. జ్ఞానాధారిత రంగాలు, ఇతర సెక్టార్ల వైపు మళ్లేందుకు తమకు దశాబ్దాల కాలం పడుతుందని వాదిస్తోంది. వెలువడుతున్న కర్భన ఉద్గారాలు, ప్రకృతిలోకి శోషించబడుతున్న కర్భన ఉద్గారాల నిష్పత్తి సమంగా ఉండేలా అంటే కార్బన్ నెట్ జీరో(కర్భన స్థిరత్వం) సాధించేందుకు జీ7 దేశాలు తొందర పెడుతున్నాయి. శిలాజ ఇంధనాల ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, వాటి ద్వారా వచ్చే విద్యుత్ సాయంతోనే ఆర్థిక వ్యవస్థలో సుస్థిరాభివృద్ధి సాధిస్తామని ధీమాగా ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశాలు.. ఈ జీ7 దేశాల ప్రతిపా దనలను తప్పుబడుతున్నాయి. ‘దశాబ్దాలుగా శిలా జ ఇంధనాలను విపరీతంగా వాడేసి పారిశ్రా మిక విప్లవంతో పశ్చిమ దేశాలు సంపన్న దేశాలుగా అవ తరించాయి. ఇప్పుడు మాకు ఆ అవకాశం ఇవ్వండి. వాతావరణ మార్పుల మాటున అభివృద్ధిని అడ్డుకో కండి’ అని భారత్‌సహా దేశాలు వాదిస్తు న్నాయి. 2020కల్లా వాతావరణ మార్పులను సమర్థంగా ఎదుర్కొనేందుకు పేద దేశాలకు ఏటా 100 బిలి యన్ డాలర్ల నిధులను ఇస్తామన్న సంపన్న దేశాలు ఆ వాగ్దానాన్ని నెరవేర్చనేలేదు. ఎప్ప టికల్లా సాయం చేస్తాయనేదీ స్పష్టంచేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో క్లైమేట్ పాలసీపై ఉమ్మడి నిర్ణయం ఆశించడం కష్టమే. ఇలాంటి తరుణంలో మొదలవు తున్న జీ20 సదస్సు క్లిష్టమైన కూడలిలో నిల్చుంద నే చెప్పాలి. దేశ ప్రయోజనా లను పక్కనబెట్టి మానవాళి శ్రేయస్సు కోసం అగ్రనేతలు ఏ మేరకు ఉమ్మడి వాగ్దానాలు చేస్తారనేది బిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. జీ20లో ఏకాభిప్రాయం కుదరక పోతే త్వరలో యునైటెడ్ అరబ్ ఎమిరే ట్స్‌లో జరగ బోయే కాప్28 సదస్సులోనూ మేలైన ఫలితాలను ఆశించడం అత్యాశే అవుతుంది. –సాక్షి నేషనల్‌డెస్క్ -
కాలుష్య రహిత విద్యుత్ ఉత్పాదనలో తొలిస్థానంలో ఏపీ: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: మూడు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. నంద్యాల జిల్లాలో ఏర్పాటు కానున్న సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులకు బుధవారం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టులతో ఉద్యోగ అవకాశాలు ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. 8 వేల ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. పర్యావరణ హితంగా ఈ ప్రాజెక్టు ఉంటుందన్నారు. సోలార్ పవర్ ప్రాజెక్టు వల్ల ఉద్యోగ అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. సోలార్ ఎనర్జీ కోసం రూ. 2.49 పైసలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టుల కోసం NHPCతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. రైతులకు ఉచిత విద్యుత్ విషయంలో ఇబ్బంది లేకుండా చూస్తున్నామని పేర్కొన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని, గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేసే విషయంలో దేశంలోనే ఆదర్శంగా నిలుస్తామని చెప్పారు. భవిష్కత్తు తరాలకు గ్రీన్ ఎనర్జీ ►పంప్ స్టోరేజ్ ప్రాజెక్టుల వల్ల భవిష్యత్తు తరాలకు గ్రీన్ ఎనర్జీ అందుతుంది. ►కాలుష్య కారక విద్యుత్‌పై ఆధారపడే పరిస్థితి క్రమేణా తగ్గుతుంది. భవిష్యత్తులో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులు కీలక పాత్ర పోషిస్తాయి. ►వీటికి అనుబంధంగా సోలార్, విండ్ ప్రాజెక్టులు అనుసంధానం అవుతున్న తీరు గ్రీన్ ఎనర్జీలో విప్లవానికి దారితీస్తాయి. ►ఉదయం 6 నుంచి సాయంత్రం వరకూ సోలార్ వస్తుంది. సాయంత్రం నుంచి తెల్లవారుజామువరకు విండ్ ఎనర్జీని వాడుకోవచ్చు. ►పీక్ అవర్స్‌లో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులను వినియోగించుకుంటాం. ► ఒక కృత్రిమ బ్యాటరీగా పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులు పనిచేస్తాయి. ►కాలుష్య రహిత విద్యుత్ ఉత్పాదనలో ఏపీ మొదటి స్థానంలో నిలిచేలా ఈ అడుగులు వేస్తున్నాం. ►ఏపీలో 8999 మెగావాట్లకు సంబంధించి సోలార్, విండ్ పవర్ ఉంది. ►రైతులకు ఉచితంగా పగటిపూటే విద్యుత్తు అందుబాటులోకి రావాలని, 7200 మెగావాట్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో రూ.2.49లకే ఒప్పందం కుదుర్చుకున్నాం. ఉచిత కరెంట్‌కు ఢోకా లేకుండా.. ►రైతులకు ఉచితంగా కరెంటును సమర్థవంతంగా కొనసాగించేందుకు, ఎలా ఢోకా లేకుండా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏర్పాటు చేసింది. ►తక్కువ ధరకే కరెంటు వస్తున్నందువల్ల ప్రభుత్వానికి, జెన్కోకు వెసులుబాటు కలుగుతుంది. ► ఇవన్నీ ఒకవైపున చేస్తుండగానే పంప్డ్ స్టోరేజీని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ► వేల మెగావాట్ల ప్రాజెక్టులకు సంబంధించి లొకేషన్లను గుర్తించాం. ►29 ప్రాజెక్టులకు సంబంధించి 33వేల మెగావాట్లకు పైగా ప్రాజెక్టు నివేదికలు సిద్ధం అయ్యాం. ► కొన్ని డీపీఆర్‌లు కూడా సిద్ధం అయ్యాయి. ►వివిధ కంపెనీలకు అలాట్‌మెంట్‌కూడా చేశాం. ► ఇందులో భాగంగానే ఇవాళ ఎన్‌హెచ్‌పీసీతో ఒప్పందం చేసుకుంటున్నాం. ► యాగంటిలో, కమలపాడులో దాదాపుగా 2వేల మెగావాట్లకు సంబంధించి రూ.10వేల కోట్లతో చెరిసగం వాటాతో ప్రాజెక్టుల నిర్మాణానికి ఎంఓయూ కుదుర్చుకుంటున్నాం. ►ఈరెండు సంస్థలూ మరింతగా అడుగులు ముందుకేసేందుకు మరో 3700 మెగావాట్లకు సంబంధించిన ఫీజబిలిటీ స్టడీలు జరగుతున్నాయి. దేశానికే ఆదర్శం ►రాబోయే రోజుల్లో ఈప్రాజెక్టులను కూడా చేపడతాయి. ► ప్రభుత్వ సంస్థల విద్యుత్ ఉత్పాదన సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా, ప్రయివేటు కంపెనీలను కూడా ప్రోత్సహిస్తున్నాం. ► గ్రీన్ ఎనర్జీ విషయంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తాం. ►2300 మెగావాట్ల సౌరవిద్యుత్ గ్రీన్ కో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తున్నాం. ►2300 మందికి ఉద్యోగావకాశాలు వస్తాయి. ► ఆర్సెలర్ మిట్టల్ కూడా 1014 మెగావాట్ల సోలార్, విండ్ పవర్ పనులకు శంకుస్థాన చేస్తున్నాం. దాదాపు వేయి మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయి. ►ఎకోరన్ సంస్థ 2వేల మెగావాట్ల పునర్ ఉత్పాదక ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన చేస్తున్నాం. మరో 2 వేలమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వానికి ఆదాయం ►ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో స్థానికంగా మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ►ప్రతి మెగావాట్ ఉత్పత్తికి ఆ ప్రాజెక్టుల లైఫ్ ఉన్నంతకాలం రాయల్టీ కింద రూ.1లక్ష చొప్పున వస్తుంది. ► జీఎస్టీ ఆదాయం కూడా ప్రభుత్వానికి వస్తుంది. ►సహకారం అందిస్తున్న రైతులకు, రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తిగా ఉంటూ ప్రతి ఎకరాకు ఏడాదికి రూ.30వేలు లీజు చొప్పున వస్తుంది. ► ప్రతి రెండేళ్లకు 5శాతం లీజు రుసుము పెరుగుతుంది. ►ఈ ప్రాజెక్టుల వల్ల రైతులకూ మంచి జరుగుతుంది ► దశాబ్దాలుగా నీళ్లకు కటకటలాడే ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టుల కారణంగా రైతులకు మంచి జరుగుతుంది. ►ఈ ప్రాజెక్టుల వల్ల వస్తున్న ఉపాధి రూపంలోనే కాకుండా, జీఎస్టీ ఆదాయమే కాకుండా, రైతులకూ, ప్రభుత్వానికి భూముల ఇచ్చినందుకు లీజు రూపంలో డబ్బు వస్తుంది. ► అన్నింటికంటే ముఖ్యంగా పర్యావరణానికి మేలు జరుగుతుంది. చదవండి: చంద్రయాన్-3 ల్యాండింగ్: ఏపీ ప్రభుత్వ బడుల్లో ప్రత్యక్ష ప్రసారాలు -
45 గిగావాట్లు లక్ష్యం! అదానీ గ్రీన్ ఎనర్జీ ప్రణాళిక
న్యూఢిల్లీ: బిలియనీర్ గౌతమ్ అదానీ పునరుత్పాదక ఇంధన సంస్థ 2030 నాటికి 45 గిగావాట్ల (జీడబ్ల్యూ)పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఉద్గారాలను తగ్గించి, భారత్ తన కార్బన్ న్యూట్రాలిటీ లక్ష్యాన్ని చేరుకోవడానికి తన వంతు సహాయ సహకారాలను అందించాలని సంస్థ భావిస్తున్నట్లు అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ వర్గాలు తెలిపాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ 8,316 మెగావాట్ల (8.3 జీడబ్ల్యూ) పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని ప్రస్తుతం కలిగి ఉంది. మరో 12,118 మెగావాట్ల సామర్థ్యం నిర్మాణ దశలో ఉందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఇందు కోసం ప్రతి సంవత్సరం సౌర, పవన శక్తి నుంచి 3 గిగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారయి. ఫ్రెంచ్ ఎనర్జీ దిగ్గజం టోటల్ ఎనర్జీస్ అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌లో 19.7 శాతం వాటాను కలిగి ఉంది. ఇటీవల యూఎస్ పెట్టుబడి సంస్థ జీక్యూజీ పార్ట్నర్స్ కంపెనీలో 6.8 శాతం వాటాను, ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ మరో 2.8 శాతం వాటాను కొలుగోలు చేశాయి. -
విద్యుత్ వ్యవస్థకు పునరుత్పాదక‘శక్తి’ కావాలి!
న్యూఢిల్లీ: భారత్ వాతావరణ (పర్యావరణ పరిరక్షణ) లక్ష్యాలను చేరుకోవడానికి విద్యుత్ వ్యవస్థలో మరింత పునరుత్పాదక శక్తిని అనుసంధానం చేయడం చాలా కీలకమని ఇన్స్టిట్యూట్ ఫర్ ఎనర్జీ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ (ఐఈఈఎఫ్ఏ) తెలిపింది. దేశ విద్యుత్ వ్యవస్థలో క్లీన్ ఎనర్జీ వాటాను పెంచడానికి వివిధ చర్యలను కూడా సూచించింది. 2030 నాటికి ఉద్గారాల తీవ్రత తగ్గింపు లక్ష్యాన్ని చేరుకోవడానికి భారత్ పునరుత్పాదక ఇంధనంపై అత్యధిక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇందుకు అనుగుణంగా తన విద్యుత్ వ్యవస్థలో క్లీన్ ఎనర్జీ వాటాను పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఐఈఈఎఫ్ఏ ఎనర్జీ అనలిస్ట్, నివేదిక రచయిత చరిత్ కొండా తెలిపారు. 2030 నాటికి నాన్–ఫాసిల్ ఫ్యూయల్ పవర్ ఇన్స్టాల్ కెపాసిటీ వాటాను 50 శాతానికి పెంచడం ఎంతో ముఖ్యమని కొండా పేర్కొన్నారు. 2005 స్థాయిల నుండి 2030 నాటికి దాని ఆర్థిక వ్యవస్థ యొక్క ఉద్గారాల తీవ్రతను 45 శాతానికి తగ్గించడానికి విద్యుత్ వ్యవస్థలో వేరియబుల్ పునరుత్పాదక శక్తిని పెంచడం అవసరమన్నారు. స్థిరమైన టారిఫ్‌లకు బదులుగా ఎఫెక్టివ్ టైమ్–ఆఫ్–యూజ్ (టీఓయూ) విద్యుత్ టారిఫ్‌లను ప్రవేశపెట్టడం, విద్యుత్ రంగానికి మరింత పునరుత్పాదక ఇంధన అనుసంధానం వల్ల భారీ ప్రయోజనాలు ఒనగూరుతాయని, ముఖ్యంగా వినియోగ విధానాల్లో గణనీయమైన మార్పును చూడవచ్చని నివేదిక తెలిపింది. టీఓయూ ప్రైసింగ్ వల్ల పీక్ డిమాండ్ (కీలక సమాయాల్లో విద్యుత్ వినియోగం) 5 నుంచి 15 శాతం తగ్గుతుందని నివేదిక అభిప్రాయడింది. -
అదానీ గ్రీన్ నిధుల సమీకరణకు సై
న్యూఢిల్లీ: పునరుత్పాదక ఇంధన రంగ కంపెనీ అదానీ గ్రీన్ ఎనర్జీ నిధుల సమీకరణ ప్రణాళికలు ప్రకటించింది. షేర్ల విక్రయం ద్వారా రూ. 12,300 కోట్లు సమీకరించే ప్రతిపాదనకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచి్చనట్లు గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీ తాజాగా వెల్లడించింది. అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల విక్రయం(క్విప్) మార్గంలో నిధులను సమకూర్చుకోనున్నట్లు తెలియజేసింది. కంపెనీ విస్తరణ ప్రణాళికలకు అవసరమయ్యే పెట్టుబడుల కోసం ఈ నిధులను వినియోగించనున్నట్లు తెలియజేసింది. కాగా.. ఇటీవల గ్రూప్‌లోని మరో రెండు కంపెనీలు సైతం నిధుల సమీకరణ ప్రణాళికలు ప్రకటించిన సంగతి తెలిసిందే. క్విప్ ద్వారా అదానీ ఎంటర్ప్రైజెస్ రూ. 12,500 కోట్లు, అదానీ ట్రాన్స్మిషన్ రూ. 8,500 కోట్లు చొప్పున సమకూర్చుకోనున్నట్లు ఇప్పటికే తెలియజేశాయి. ప్రధానంగా యూరప్, మధ్యప్రాచ్యం నుంచి ఇన్వెస్టర్లు అదానీ గ్రూప్ షేర్ల కొనుగోలుకి ఆసక్తి చూపుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. యూఎస్ షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ ఆరోపణల నివేదిక వెలువడిన తదుపరి అదానీ గ్రూప్ కంపెనీలు పెట్టుబడుల సమీకరణ, కొత్త ప్రాజెక్టులతో విస్తరణకు తెరతీశాయి. హిండెన్‌బర్గ్ ఆరోపణలను తోసిపుచి్చన గ్రూప్ ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని మరింత పెంచేందుకు వీలుగా ముందస్తు రుణ చెల్లింపులకు ప్రాధాన్యమిస్తున్న విషయం విదితమే. -
ఏపీయే స్ఫూర్తి
సాక్షి, అమరావతి : ఏ దేశమైనా, రాష్ట్రమైనా ఆర్థికాభివృద్ధిని సాధించిందని చెప్పడానికి ఉపయోగపడే ప్రధాన సూచికల్లో విద్యుత్ వినియోగం ఒకటి. అందుకే విద్యుత్ వినియోగం ఎంత ఎక్కువగా ఉంటే అక్కడ పారిశ్రామిక, వాణిజ్య రంగాలు, జీవన ప్రమాణాలు అభివృద్ధి పథంలో ఉన్నాయని లెక్కిస్తుంటారు. అలాంటి విద్యుత్ సరఫరాకు దీర్ఘకాలంగా ఆటంకం ఏర్పడితే ఆర్థిక వ్యవస్థ మందగించే ప్రమాదం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రభుత్వాలు భవిష్యత్ విద్యుత్ సరఫరాకు ముందుగానే ప్రణాళికలు వేస్తుంటాయి. ఈ విషయంలో మన రాష్ట్ర ప్రభుత్వం దేశానికి మరోసారి ఆదర్శంగా నిలిచింది. ఏపీ చర్యలను స్ఫూర్తిగా తీసుకుని అన్ని రాష్ట్రాలూ పదేళ్ల విద్యుత్ వినియోగానికి ముందుగానే ప్రణాళికలు వేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు తొమ్మిదేళ్ల ముందుగానే విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకోవాలని నిర్దేశించింది. జల విద్యుత్ కొనాలంటే తొమ్మిదేళ్ల ముందు, థర్మల్‌కు ఏడేళ్ల ముందు, పంప్డ్ స్టోరేజీ ప్లాంట్లకు ఐదేళ్లు, పవన విద్యుత్‌కు మూడేళ్లు, సౌర విద్యుత్‌కు రెండేళ్ల ముందు ఒప్పందాలు కుదుర్చుకోవాలని కేంద్రం వెల్లడించింది. 2031 నాటికి రెట్టింపు వినియోగం.. రాష్ట్రంలో రోజువారీ విద్యుత్ డిమాండ్ ఆధారంగా రానున్న పదేళ్లలో వినియోగం ఎంత ఉంటుందో అంచనా వేయాలని కేంద్రం కోరింది. దీంతో.. 2031 నాటికి ఏపీలో ఇంధన వినియోగం రెట్టింపు అవుతుందని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) తన 20వ ఎలక్ట్రిక్ పవర్ సర్వే (ఈపీఎస్) నివేదికలో ఇప్పటికే వెల్లడించగా, ఇటీవల జాతీయ విద్యుత్ ప్రణాళిక కమిటీ దానిని ధుృవీకరించింది. ఇక రాష్ట్రంలో 2021–22 ఏడాదిలో విద్యుత్ వినియోగం 60,495 మిలియన్ యూనిట్లు ఉండగా, 2031–32 నాటికి 1,21,798 మిలియన్ యూనిట్లకు చేరుతుందని అధ్యయనాలు పేర్కొన్నాయి. దానికి తగ్గట్లుగా రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కూడా మరో 13,510 మెగావాట్లు పెరగనుంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా.. థర్మల్ విద్యుత్ సామర్థ్యాన్ని పెంచేందుకు ఇప్పటికే కృష్ణపట్నంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్కేంద్రంలో 800 మెగావాట్లను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతికి అంకితమిచ్చారు. అలాగే, ఈ నెలలోనే డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్లో మరో 800 మెగావాట్ల యూనిట్ వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఇంధన శాఖ, ఏపీ జెన్కో సన్నాహాలు చేస్తున్నాయి. పునరుత్పాదక విద్యుత్‌కు పెద్దపీట.. ఇక 2030 నాటికి వినియోగించే విద్యుత్‌లో 50 శాతం పునరుత్పాదక విద్యుత్ ఉండాలని కేంద్రం స్పష్టంచేసింది. ఈ విషయంలోనూ రాష్ట్రం ముందంజలోనే ఉంది. వ్యవసాయానికి ఏకంగా ముప్పై ఏళ్ల పాటు పగటివేళలోనే 9 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరాను అందించేందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంలు ఇప్పటికే యూనిట్‌కు రూ.2.49 పైసల చొప్పున ఒప్పందం చేసుకున్నాయి. సెకీ నుంచి తీసుకుంటున్న 7 వేల మెగావాట్ల విద్యుత్ సౌర విద్యుత్ కావడం విశేషం. దీంతోపాటు 44,250 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో రూ.9.47 లక్షల కోట్ల విలువైన పునరుత్పాదక ప్రాజెక్టుల స్థాపనకు ఒప్పందాలు కూడా చేసుకుంది. -
వెదురు నుంచి జీవ ఇంధనాలు!
ఆధునిక యుగంలో ప్రపంచవ్యాప్తంగా శిలాజ ఇంధనాల వినియోగం నానాటికీ పెరిగిపోతోంది. సరైన ప్రత్యామ్నాయ ఇంధనాలు విరివిగా అందుబాటులో లేకపోవడంతో పెట్రోల్, డీజిల్, బొగ్గు వంటి వాటిపై అనివార్యంగా ఆధారపడాల్సి వస్తోంది. వీటివల్ల వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయని, పర్యావరణానికి, భూగోళంపై మానవళి మనుగడకు ముప్పు ఏర్పడుతోందని తెలిసినప్పటికీ మరో దారిలేక ప్రమాదకరమైన ఇంధనాలపైనే అధికంగా ఆధారపడాల్సి వస్తోంది. మరోవైపు పునరుత్పాదక ఇంధనాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి ఆశించిన స్థాయిలో ఊపందుకోవడం లేదు. జల విద్యుత్ ఉత్పత్తికి కొన్ని పరిమితులున్నాయి. ఇలాంటి తరుణంలో హంగేరీలోని ‘హంగేరియన్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ లైఫ్ సైన్సెస్’ పరిశోధకులు తీపి కబురు అందించారు. అడవుల్లో సహజసిద్ధంగా, విస్తృతంగా పెరిగే వెదురు(బ్యాంబూ)తో బయో ఇథనాల్, బయో గ్యాస్ వంటి జీవ ఇంధన ఉత్పత్తులు తయారు చేయవచ్చని తమ అధ్యయనంలో తేల్చారు. సమీప భవిష్యత్తులో పునరుత్పాదక ఇంధన రంగంలో వెదురు ఒక విప్లవమే సృష్టించబోతోందని చెబుతున్నారు. శిలాజ ఇంధనాలకు కాలుష్యానికి తావులేని ఇలాంటి ఇంధనాలే సరైన ప్రత్యామ్నాయం అవుతాయని అంటున్నారు. ఈ అధ్యయనం వివరాలను ‘జీసీబీ బయో ఎనర్జీ’ జర్నల్‌లో ప్రచురించారు. ► ఇతర చెట్లతో పోలిస్తే వెదురు చాలా వేగంగా పెరుగుతుంది. ఇదొక విలువైన సహజ వనరు. కాలుష్యాన్ని కట్టడి చేసే విషయంలో వెదురును ‘సూపర్ స్పాంజ్’గా పరిగణిస్తుంటారు. కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుంటుంది. వాతావరణంలోకి ప్రాణవాయువు(ఆక్సిజన్) ను అధికంగా విడుదల చేస్తుంది. ► ప్రమాదకరమైన గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాన్ని అరికట్టడంలో వెదురు పాత్ర చాలా కీలకం. భూమిపై వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. ► ప్రకృతిలో వెదురు ప్రాధాన్యతను గుర్తించిన పరిశోధకులు దాని నుంచి పునరుత్పాదక ఇంధనాల తయారీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ► కిణ్వ ప్రక్రియ(ఫెర్మెంటేషన్), అధిక ఉష్ణోగ్రతల వద్ద కుళ్లిపోయేలా చేయడం(పైరోలిసిస్)తోపాటు హైడ్రోథర్మల్ లిక్విఫాక్షన్, అనెయిరోబిక్ డైజేషన్ వంటి ప్రక్రియల ద్వారా ముడి వెదురు నుంచి బయో ఇథనాల్, బయోగ్యాస్ ఉత్పత్తి చేయవచ్చని కనిపెట్టారు. ► పరిశుద్ధమైన, స్థిరమైన ఇంధన వనరులను అందించగల సామర్థ్యం వెదురుకు ఉందని గుర్తించారు. ► కొన్ని జాతుల వెదురు నుంచి అధికంగా బయో ఇంధనం ఉత్పత్తి అవుతుందని చెబుతున్నారు. వేర్వేరు జాతులు వేర్వేరుగా రసాయన చర్య జరపడమే ఇందుకు కారణమని పేర్కొంటున్నారు. ► వెదురులో సెల్యూలోజ్లు, హెమిసెల్యూలోజ్ లో అధిక మోతాదులో ఉంటాయి. వీటి నుంచి బయో ఇథనాల్, బయోగ్యాస్తోపాటు బయోచర్ అనే ఎరువు కూడా ఉత్పత్తి అవుతుంది. ► వెదురు నుంచి ప్రత్యామ్నాయ ఇంధనాలను తయారు చేసుకుంటే శిలాజ ఇంధనాలపై ఆధారపడాల్సిన అవసరం గణనీయంగా తగ్గిపోతుందని, తద్వారా కాలుష్యాన్ని, వాతావరణ మార్పులను నియంత్రించవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు. వెదురు నుంచి జీవ ఇంధనాల ఉత్పత్తి ప్లాంట్లకు పెద్దగా పెట్టుబడి అవసరం లేదని చెబుతున్నారు. ఇది పూర్తిగా సురక్షితమైన ప్రక్రియ అని పేర్కొంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రిలయన్స్‌కు పునరుత్పాదక ఇం‘ధనం’
న్యూఢిల్లీ: దేశీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ .. పునరుత్పాదక ఇంధన వ్యాపారం ద్వారా 2030 నాటికి 1015 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని అందుకునే అవకాశం ఉంది. అయితే ఈ విభాగంలో పరిమిత స్థాయిలోనే అనుభవం ఉన్నందున.. సదరు రంగ కంపెనీలను కొనుగోలు చేయడం లేదా భాగస్వామ్యాలను కుదుర్చుకోవాల్సి రానుంది. బ్రోకరేజ్ సంస్థ సాన్ఫోర్డ్ సి బెర్న్‌స్టీన్ ఈ మేరకు ఒక నివేదిక రూపొందించింది. స్వచ్ఛ ఇంధనమనేది (సౌర, బ్యాటరీ, ఎలక్ట్రోలైజర్లు, ఫ్యూయల్ సెల్స్ మొదలైనవి) రిలయన్స్‌కు కొత్త వృద్ధి చోదకంగా నిలవనుందని నివేదిక తెలిపింది. 2050 నాటికి భారత్‌లో వీటిపై 2 లక్షల కోట్ల డాలర్ల పైగా పెట్టుబడులు రానున్నట్లు వివరించింది. 2030 నాటికి ప్యాసింజర్, కమర్షియల్ వాహనాల విభాగంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ వాటా 5 శాతానికి, ద్విచక్ర వాహనాల్లో 21 శాతానికి చేరవచ్చని అంచనా వేసింది. అప్పటికి మొత్తం స్వచ్ఛ ఎనర్జీ మార్కెట్ (టీఏఎం) 30 బిలియన్ డాలర్లుగా (ప్రస్తుతం 10 బిలియన్ డాలర్లు) ఉండొచ్చని తెలిపింది. 2050 నాటికల్లా టీఏఎం 200 బిలియన్ డాలర్లకు, మొత్తం పెట్టుబడులు 2 లక్షల కోట్ల డాలర్లకు చేరవచ్చని నివేదిక పేర్కొంది. ‘2030 నాటికి రిలయన్స్ .. సౌర ఇంధన మార్కెట్లో 60 శాతం, బ్యాటరీలో 30 శాతం, హైడ్రోజన్ విభాగంలో 20 శాతం వాటా దక్కించుకోవచ్చు. ఈ కొత్త ఇంధనాల వ్యాపారంతో రిలయన్స్ 1015 బిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జించవచ్చని అంచనా వేస్తున్నాం‘ అని నివేదిక వివరించింది. నివేదికలోని మరిన్ని అంశాలు.. ► రిలయన్స్ ఇండస్ట్రీస్ శిలాజ ఇంధనాల నుంచి క్రమంగా వైదొలిగే క్రమంలో సౌర, హైడ్రోజన్ ఇంధనాల వైపు మళ్లుతోంది. 2035 నాటికి కార్బన్ ఉద్గారాలకు సంబంధించి తటస్థ స్థాయికి చేరుకోవాలని రిలయన్స్ నిర్దేశించుకుంది. ఇందుకోసం సౌర, బ్యాటరీలు, హైడ్రోజన్ వంటి విధానాల ద్వారా పూర్తి స్థాయి పునరుత్పాదక శక్తి వ్యవస్థను రూపొందిస్తోంది. 2030 నాటికి 100 గిగావాట్ల సౌర విద్యుదుత్పత్తి సామరŠాధ్యన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది భారత్ నిర్దేశించుకున్న 280 గిగావాట్ల సామర్ధ్యంలో 35 శాతం. ► రిలయన్స్‌కు పటిష్టమైన ఆర్థిక వనరులు, సంబంధాలు ఉన్నప్పటికీ .. ఈ విభాగంలో విజయం సాధించడానికి అవసరమైన సాంకేతికత, తయారీ నైపుణ్యాలు అంతగా లేవు. కాబట్టి ఇందుకోసం తగిన సంస్థలతో చేతులు కలపాల్సి ఉంటుంది. ► సౌర, బ్యాటరీ ప్లాంట్లు 2024లో అందుబాటులోకి రానున్న నేపథ్యంలో 2025 ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త ఇంధన వ్యాపారాల నుంచి రిలయన్స్‌కు ఆదాయాలు రానున్నాయి. ► 2030 నాటికి సౌర విద్యుత్ టీఏఎం 13 బిలియన్ డాలర్లుగా, హైడ్రోజన్ 10 బిలియన్ డాలర్లు, బ్యాటరీల టీఏఎం 7 బిలియన్ డాలర్లుగా ఉంటుంది. సోలార్‌లో రిలయన్స్‌కు 8 బిలియన్ డాలర్లు, బ్యాటరీల్లో 3 బిలియన్ డాలర్లు, హైడ్రోజన్ నుంచి 3 బిలియన్ డాలర్ల వరకు ఆదాయం రావచ్చు. ► సోలార్‌లో 2030 నాటికి రిలయన్స్ 100 గిగావాట్ల స్థాపిత సామరŠాధ్యన్ని సాధించగలదు. అలాగే, బ్యాటరీల మార్కెట్లో 50 గిగావాట్పర్అవర్ (జీడబ్ల్యూహెచ్) సామర్ధ్యంతో సుమారు 36 శాతం మార్కెట్ వాటాను దక్కించుకోవచ్చు. హైడ్రోజన్ విభాగంలో టీఏఎం 81 గిగావాట్లుగా ఉండనుండగా.. రిలయన్స్ 16 గిగావాట్లతో 19 శాతం వాటా దక్కించుకునే అవకాశం ఉంది. -
పునరుత్పాదక విద్యుదుత్పత్తి పెంపుపై కేంద్రం కసరత్తు
న్యూఢిల్లీ: పునరుత్పాదక విద్యుదుత్పత్తి సామర్థ్యాలను మరింత పెంచుకోవడంపై కేంద్రం దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా కొత్తగా వచ్చే బొగ్గు లేదా లిగ్నైట్ ఆధారిత థర్మల్ ప్లాంట్లు తప్పనిసరిగా తమ ప్లాంటు సామర్థ్యంలో కనీసం 40 శాతం పునరుత్పాదక విద్యుదుత్పత్తి సామర్థ్యాలను ఏర్పాటు చేసుకోవాలని నిర్దేశించింది. ఒకవేళ అలా చేయలేకపోతే అంత స్థాయిలో హరిత శక్తిని కొనుగోలు చేయాలని పేర్కొంది. సదరు సంస్థలు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 40 శాతం మేర పునరుత్పాదక విద్యుత్‌ను కొనుగోలు చేయడాన్ని తప్పనిసరి చేస్తూ (ఆర్జీవో) 2016 టారిఫ్ పాలసీని కేంద్ర విద్యుత్ శాఖ ఈ మధ్యే సవరించింది. వీటి ప్రకారం 2023 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31లోగా వాణిజ్యపరమైన కార్యకలాపాలు ప్రారంభించే (సీవోడీ) ప్లాంట్లు 2025 ఏప్రిల్ 1 నాటికి 40 శాతం ఆర్జీవో నిబంధనను పాటించాల్సి ఉంటుంది. 2025 ఏప్రిల్ 1 దాటిన తర్వాత వచ్చే ప్లాంట్లు వాణిజ్యపరమైన కార్యకలాపాలు ప్రారంభించిన తేదీ నుంచే దీన్ని పాటించాల్సి ఉంటుంది. కేంద్రం సూచించిన దానికి అనుగుణంగా పునరుత్పాదక విద్యుత్‌ను కొనుగోలు చేయడాన్ని బట్టి క్యాప్టివ్ థర్మల్ ప్లాంట్లకు కొంత మినహాయింపు ఉంటుంది. 2030 నాటికల్లా 500 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలని భారత్ భారీ లక్ష్యం నిర్దేశించుకుంది. -
నూతన, పునరుత్పాదక ఇంధన శాఖకు రూ.37,828.15 కోట్లు
న్యూఢిల్లీ: కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన శాఖకు బడ్జెట్లో ప్రభుత్వం రూ.37,828.15 కోట్లు కేటాయించింది. గత ఏడాది బడ్జెట్లో సవరించిన అంచనా(రూ.27,547.47 కోట్లు)తో పోలిస్తే ఇది 37 శాతం అధికం. ఈ శాఖ ఆధ్వర్యంలోని రెండు సంస్థలకు బడ్జెట్లో కేంద్రం భారీ కేటాయింపులు చేసింది. తాజా బడ్జెట్లో ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ(ఐఆర్ఈడీఏ)కి రూ.35,777.35 కోట్లు కేటాయించారు. అలాగే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఈసీఐ)కి రూ.2,050.80 కోట్లు కేటాయించారు. ఇంధన రంగంలో కొత్త ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందజేయడానికి ఐఆర్ఈడీఏ 1987లో ఏర్పాటయ్యింది. నేషనల్ సోలార్ మిషన్(ఎన్ఎస్ఎం) అమలు, ఈ రంగంలో లక్ష్యాల సాధన కోసం ఎస్ఈసీఐని 2011లో నెలకొల్పారు. -
3 గిగావాట్ల సామర్థ్యానికి ఎన్టీపీసీ
న్యూఢిల్లీ: పునరుత్పాదక విద్యుత్ రంగంలో 3 గిగావాట్ల సామర్థ్యానికి చేరుకున్నట్టు ఎన్టీపీసీ వెల్లడించింది. రాజస్తాన్‌లోని బికనీర్ వద్ద నోఖ్రా సోలార్ పీవీ ప్రాజెక్టులో 100 మెగావాట్లు తోడవడంతో డిసెంబర్ 20న ఈ ఘనతను సాధించామని ప్రకటించింది. 2022 జూన్ 24న ఎన్టీపీసీ గ్రూప్ 2 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకుంది. 12 రాష్ట్రాల్లో సంస్థ ఖాతాలో 36 ప్రాజెక్టులకుగాను 3,094 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. కొత్తగా 4.8 గిగావాట్ల సామర్థ్యంగల ప్రాజెక్టులు ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయి. టెండర్ల ప్రక్రియలో మరో 7.3 గిగావాట్ల ప్రాజెక్టులు ఉన్నాయి. 2032 నాటికి 60 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకోవాలన్నది ఎన్టీపీసీ లక్ష్యం. -
‘ఆర్బీఐ‘ టాప్ టెన్ రాష్ట్రాల్లో ఏపీ
సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా గ్రిడ్–ఇంటరాక్టివ్ పునరుత్పాదక విద్యుత్ మొత్తం స్థాపిత సామర్థ్యంలో రాష్ట్రాల జాబితాను ప్రకటిస్తూ గణాంకాల హ్యాండ్‌బుక్ 2021–22ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) తాజాగా విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో సౌర, పవన, జల వంటి పునరుత్పాదక విద్యుదుత్పత్తికి ప్రభుత్వం ఇస్తున్న అత్యధిక ప్రాధాన్యతకు గుర్తింపుగా ఆర్బీఐ తన తాజా నివేదికలో మొదటి పది రాష్ట్రాల్లో ఏపీకి స్థానం కల్పించింది. దేశంలో 2040 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం.. ఈ ఏడాది చివరి నాటికి 175 గిగావాట్లు పూర్తి చేయాలనుకుంటోంది. ఇందుకోసం 2023–2030 మధ్య 24.61 శాతం నుంచి 43.33 శాతం వరకూ రెన్యువబుల్ పవర్ పర్చేజ్ ఆబ్లిగేషన్(ఆర్పీవో)ను పెంచుతోంది. ఈ చర్యలతో పునరుత్పాదక రంగం 2030 నాటికి 1 ట్రిలియన్, 2070 నాటికి 15 ట్రిలియన్ డాలర్ల టర్నోవర్‌కు చేరుకుంటుందని కేంద్రం అంచనా వేస్తోంది. దీనికి తోడ్పాటునందిస్తున్న మొదటి 12 రాష్ట్రాల్లో ఏపీ(ఆరో స్థానం)తో పాటు కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఉన్నాయి. కాగా ఏపీలో పునరుత్పాదక విద్యుత్ స్థాపిత సామర్థ్యం 10,825.28 మెగావాట్లకు చేరింది. ఇందులో 4,096.65 మెగావాట్లు పవన, 4,390.48 మెగావాట్లు సౌర, 1,610 మెగావాట్లు భారీ జల విద్యుత్, 566.04 మెగావాట్లు బయో పవర్, 162.11 మెగావాట్లు చిన్న జల విద్యుత్, 900.72 మెగావాట్లు ఇతర పునరుత్పాదక ప్రాజెక్టులున్నాయి. ఇప్పటికే ప్రాధాన్యం 2029–30 నాటికి, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి వాటా 18 శాతం నుంచి 44 శాతం వరకు పెరుగుతుందని, థర్మల్ పవర్ 78 శాతం నుంచి 52 శాతం వరకు తగ్గుతుందని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఇటీవల(సీఈఏ) అంచనా వేసింది. కేంద్రం నిర్దేశం మేరకు 2022–23 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కంలు) కొనుగోలు చేసే విద్యుత్‌లో పునరుత్పాదక విద్యుత్ వాటా 18 శాతం ఉండాలని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) నిర్ణయించింది. గతేడాది ఇది 17 శాతంగా ఉండేది. 2026–27 నాటికి మొత్తం విద్యుత్‌లో 24 శాతం పునరుత్పాదక విద్యుత్ ఉండాలని ఏపీఈఆర్సీ ఇటీవల ప్రకటించిన ఆర్పీవో నిబంధనల్లో వెల్లడించింది. కానీ రాష్ట్రంలోని మొత్తం విద్యుదుత్పత్తి సామర్థ్యంలో పునరుత్పాదక విద్యుత్ వాటా సుమారు 37 శాతంతో ఏపీ ఇప్పటికే ముందంజలో ఉంది. -
గ్రీన్‌కోతో సెరెంటికా జట్టు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పారిశ్రామిక క్లయింట్లకు నిరాటంకంగా పునరుత్పాదక విద్యుత్‌ను సరఫరా చేసే దిశగా గ్రీన్కో గ్రూప్‌తో సెరెంటికా రెన్యువబుల్స్ చేతులు కలిపింది. ఈ ఒప్పందం ప్రకారం గ్రీన్కో గ్రూప్‌కి సంబంధించి 1500 మెగావాట్ అవర్ పునరుత్పాదక విద్యుత్ నిల్వ సామర్థ్యాన్ని వినియోగించుకోనుంది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్‌లోని పిన్నాపురంలో, మధ్యప్రదేశ్‌లోని గాంధీ సాగర్‌లో అందుబాటులోకి వస్తున్న ఆఫ్ స్ట్రీమ్ క్లోజ్డ్ లూప్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ (ఓసీపీఎస్పీ) ఉపయోగపడ నున్నాయి. వివిధ క్లయింట్లకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేందుకు ఈ ఒప్పందం సహా యపడగలదని సెరెంటికా రెన్యువబుల్స్ డైరెక్టర్ ప్రతీక్ అగర్వాల్ తెలిపారు. ట్విన్‌స్టార్ ఓవర్సీస్కు 100% అనుబంధ సంస్థగా సెరెంటికా 2022లో ఏర్పాటైంది. ట్విన్స్టార్కి స్టెరిలైట్ పవర్ ట్రాన్స్మిషన్, స్టెరిలైట్ టెక్నాలజీస్‌లో నియంత్రణ స్థాయి వాటాలు ఉన్నాయి. గ్రీన్కో గ్రూప్‌నకు సౌర, పవన, హైడ్రో జనరేషన్ టెక్నాజీలవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో సుమారు 7.5 గిగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉంది. -
సెరెంటికాలో కేకేఆర్ పెట్టుబడి
ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కేకేఆర్ తాజాగా పునరుత్పాదక ఇంధన రంగంలో ఉన్న సెరెంటికా రెనివేబుల్స్లో రూ.3,280 కోట్ల పెట్టుబడి చేస్తోంది. మూడు దీర్ఘకాలిక విద్యుత్ పంపిణీ ఒప్పందాలను చేసుకున్న సెరెంటికా ప్రస్తుతం 1,500 మెగావాట్ల సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తోంది. కర్నాటక, రాజస్తాన్, మహారాష్ట్రలో ఇవి నెలకొన్నాయి. మధ్యకాలిక లక్ష్యంలో భాగంగా 5,000 మెగావాట్ల ప్రాజెక్టులను అందుబాటులోకి తేవాలని కంపెనీ భావిస్తోంది. ఏటా 1,600 కోట్ల యూనిట్ల స్వచ్చ విద్యుత్‌ను అందించాలని కృతనిశ్చయంతో ఉంది. స్టెర్లైట్ పవర్ ట్రాన్స్మిషన్, స్టెర్లైట్ టెక్నాలజీస్‌లో మెజారిటీ వాటా కలిగిన ట్విన్స్టర్ ఓవర్సీస్ అనుబంధ కంపెనీయే సెరెంటికా. చదవండి: ఏం జరుగుతోంది, ఊడిపోతున్న ఉద్యోగాలు.. ఫేస్బుక్లో 11వేల మందిపై వేటు! -
గుజరాత్లో అతి పెద్ద పవన విద్యుత్ టర్బైన్
న్యూఢిల్లీ: పునరుత్పదాక విద్యుత్ విభాగంలో కార్యకలాపాలు మరింతగా విస్తరించే క్రమంలో అదానీ న్యూ ఇండస్ట్రీస్ .. గుజరాత్‌లోని ముంద్రాలో అత్యంత భారీ పవన విద్యుత్ టర్బైన్ జనరేటర్ (డబ్ల్యూటీజీ)ని ఏర్పాటు చేసింది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన సమైక్యతా విగ్రహం (సర్దార్ వల్లభాయ్ పటేల్) కన్నా ఎత్తయినదని కంపెనీ తెలిపింది. టర్బైన్ బ్లేడ్ల వెడల్పు చూస్తే జంబో జెట్ రెక్కల పొడవు కన్నా ఎక్కువగా ఉంటుందని వివరించింది. పూర్తి అనుబంధ సంస్థ ముంద్రా విండ్‌టెక్ (ఎండబ్ల్యూఎల్) దీన్ని ఇన్స్టాల్ చేసినట్లు పేర్కొంది. 200 మీటర్ల ఎత్తు ఉండే ఈ విండ్ టర్బైన్ .. సుమారు 4,000 గృహాలకు సరిపడేలా 5.2 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయగలదు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన సమైక్యతా విగ్రం ఎత్తు 182 మీటర్లు. ఈ టర్బైన్ బ్లేడ్లు 78 మీటర్ల పొడవుంటాయి. -
పునరుత్పాదక ఇంధనంతో అపార అవకాశాలు
న్యూఢిల్లీ: పునరుత్పాదక ఇంధన రంగంలో మరింతగా వృద్ధి చెందడానికి, ప్రపంచానికే సరఫరాదారుగా ఎదగడానికి భారత్‌కు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ చెప్పారు. పరికరాల దశ నుండి ఆవిష్కరణలు, కొత్త టెక్నాలజీల వరకూ పునరుత్పాదక ఇంధన సరఫరా వ్యవస్థను ఆసాంతం సమర్ధంగా నిర్వహించుకోగలిగేలా ఉండాలని పరిశ్రమకు ఆయన సూచించారు. పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్‌ను గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఐఐ నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. ఇంధన రంగానికి అవసరమైన నాణ్యమైన ఉత్పత్తులు, సేవలు అందించేందుకు చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) శిక్షణనివ్వాలని, మరింతగా టెక్నాలజీని వినియోగించాలని గోయల్ సూచించారు. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్: ఊహించని షాక్.. తలలు పట్టుకుంటున్న ఐటీ కంపెనీలు! -
అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ విస్తరణ
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం అదానీ గ్రీన్ ఎనర్జీ పునరుత్పాదక ఇంధన విభాగంలో కార్యకలాపాలు మరింత విస్తరించింది. తాజాగా పూర్తి అనుబంధ సంస్థ అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ హోల్డింగ్ ఫోర్ లిమిటెడ్ ద్వారా మూడు అనుబంధ సంస్థల ఏర్పాటుకు తెరతీసింది. పునరుత్పాదక ఇంధన బిజినెస్ కోసమే వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ హోల్డింగ్‌కు ఇవి అనుబంధ సంస్థలుగా వ్యవహరించనున్నట్లు తెలియజేసింది. వీటి ద్వారా ప్రధానంగా పవన విద్యుత్, సౌర విద్యుత్‌సహా వివిధ పునరుత్పాదక ఇంధన మార్గాల ద్వారా విద్యుత్ ప్రసారం, అభివృద్ధి, పంపిణీ, విక్రయం తదితరాలను చేపట్టనున్నట్లు వివరించింది. ఈ వార్తల నేపథ్యంలో అదానీ గ్రీన్ ఎనర్జీ షేరు ఎన్ఎస్ఈలో 8 శాతం పతనమై రూ. 2,088 వద్ద ముగిసింది. -
పునరుత్పాదక ఇంధన రంగంలో ఏపీ చర్యలు భేష్
సాక్షి, అమరావతి: పునరుత్పాదక ఇంధన రంగాన్ని ప్రోత్సహించడంలో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉందని కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ(బీఈఈ) డైరెక్టర్ జనరల్ అభయ్ బాక్రే ప్రశంసించారు. రాష్ట్ర ఇంధన శాఖ, ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) అధికారులతో బాక్రే ఆదివారం వర్చువల్‌గా సమీక్ష నిర్వహించారు. తొలుత ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పునరుత్పాదక ఇంధన రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టినట్లు అభయ్ బాక్రేకు వివరించారు. రాష్ట్రంలో మొత్తం విద్యుత్ ఉత్పాదక సామర్థ్యం 18.8 గిగావాట్లు ఉండగా, అందులో 40 శాతం (7.5 గిగా వాట్లు) పునరుత్పాదక ఇంధన ఉత్పత్తే అని తెలిపారు. ఈ రంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లి ఇతర రాష్ట్రాలకు కూడా పునరుత్పాదక ఇంధనాన్ని ఎగుమతి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అనంతరం అభయ్ బాక్రే మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంధన పరిరక్షణ, ఇంధన సామర్థ్య రంగాలను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా స్టేట్ డిజిగ్నేటెడ్ ఏజెన్సీని ఏర్పాటు చేయడాన్ని అభినందించారు. ఏపీ, కేరళ తరహాలో అన్ని రాష్ట్రాలు ఇంధన సామర్థ్య విభాగాలను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా పర్యవేక్షించాలన్నారు. పర్యావరణ పరిరక్షణ, ఇంధన సామర్థ్యం తదితర అంశాలపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని ఏపీఎస్ఈసీఎం అధికారులకు బాక్రే సూచించారు. ఈ సమావేశంలో ఏపీఎస్ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి, ఇంధన శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
భారత్‌లో మరిన్ని పెట్టుబడులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత్‌లో పునరుత్పాదక విద్యుత్ విభాగంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు సెంబ్‌కార్ప్ ఇండస్ట్రీస్ సీఈవో (దక్షిణాసి యా) విపుల్ తులి తెలిపారు. దేశీయంగా మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్లు వివరించారు. భారత్‌లో కేవలం తమ థర్మల్ పోర్ట్‌ఫోలియోనే విక్రయిస్తున్నామని, దేశం నుంచి నిష్క్రమించే యోచనేదీ లేదని ఆయన స్పష్టం చేశారు. బొగ్గు ఆధారిత విద్యుత్ ప్రాజెక్టుల్లో ఇన్వెస్ట్ చేయబోమంటూ 2020లో చేసిన ప్రకటనకు అనుగుణంగానే థర్మల్ పోర్ట్‌ఫోలియో నుంచి తప్పుకుంటున్నామని పేర్కొన్నారు. ఒమన్‌కి చెందిన తన్వీర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సెంబ్‌కార్ప్ ఎనర్జీ ఇండియా (ఎస్ఈఐఎల్)లో పూర్తి వాటాలు విక్ర యించడం వల్ల సంస్థ ఉద్యోగులపై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని ఆయ న స్పష్టం చేశారు. కొత్త యా జమాన్యం కింద వారు యథాప్రకారం కొనసాగుతా రని తులి వివరించారు. ఈ లావాదేవీ పూర్తయ్యాక తమ సంస్థ పునరుత్పాదక విద్యుదుత్పత్తి సామ ర్థ్యం 1730 మెగావాట్లుగా ఉంటుందని, 700 మెగావాట్ల ప్రాజెక్టులు అభివృద్ధి దశలో ఉన్నాయని ఆయ న పేర్కొన్నారు. ఈ డీల్‌తో వచ్చే నిధుల్లో కొంత భాగాన్ని పునరుత్పాదక విద్యుత్ పోర్ట్‌ఫోలియోను అభివృద్ధి చేసుకోవడం కోసం వినియోగించనున్న ట్లు వివరించారు. అగ్రగామి పవన విద్యుత్ సంస్థ ల్లో ఒకటిగా ఉన్న తమ కంపెనీ, సౌర విద్యుత్ విభాగంలోనూ శక్తివంతమైన పోర్ట్‌ఫోలియోను నిర్మించు కునే ప్రయత్నాల్లో ఉన్నట్లు తులి చెప్పారు. అలాగే విద్యుత్ స్టోరేజీ, గ్రీన్ హైడ్రోజన్ వంటి విభాగాల్లో నూ అవకాశాలు పరిశీలిస్తున్నామన్నారు. -
భారత్‌పై రష్యా దిగ్గజ కంపెనీ కన్ను, భారీ పెట్టుడులతో..
సాస్నొవీ బోర్(రష్యా): న్యూక్లియర్ ఎనర్జీ రంగ రష్యన్ దిగ్గజం రొజాటమ్ దేశీ మార్కెట్లో పెట్టుబడులపై దృష్టి పెట్టింది. ప్రధానంగా పునరుత్పాదక ఇంధనం, కార్బన్ ఫైబర్ విభాగాలపై కన్నేసినట్లు కంపెనీ అధికారి ఒకరు తెలియజేశారు. అపార అవకాశాలున్న దేశీ మార్కెట్లో విభిన్న విభాగాలలో కార్యకలాపాలు చేపట్టాలని భావిస్తున్నట్లు వివరించారు. ఈ బాటలో న్యూక్లియర్ మెడిసిన్, రేడియేషన్ టెక్నాలజీస్, ఎనర్జీ స్టోరేజీ రంగాలలో అవకాశాలను అన్వేషించనున్నట్లు పేర్కొన్నారు. తమిళనాడులోని కుందకుళం న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌ను కంపెనీ అభివృద్ధి చేస్తోంది. ఒక్కొక్కటీ 1,000 మెగావాట్ల సామర్థ్యంగల ఆరు రియాక్టర్లతో ప్లాంటును ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో రెండు యూనిట్లు ఇప్పటికే కార్యకలాపాలను ప్రారంభించాయి. కేవలం న్యూక్లియర్ ఎనర్జీపైనేకాకుండా పలు విభాగాలలో సహకారానికి రొజాటమ్ సిద్ధంగా ఉన్నట్లు రుజాటమ్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ ప్రెసిడెంట్ వడీమ్ టిటోవ్ తెలియజేశారు. వెరసి కార్బన్ ఫైబర్, పవన విద్యుత్ తదితర రంగాలలో దేశీ భాగస్వాములతో చేతులు కలిపేందుకు రొజాటమ్ ఆసక్తిగా ఉన్నట్లు వెల్లడించారు. విదేశీ మార్కెట్లలో రొజాటమ్ డివిజన్ల కార్యకలాపాలకు రుజాటమ్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ మద్దతిస్తుంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. -
బీపీసీఎల్ ‘నెట్ జీరో’ 2040
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ బీపీసీఎల్.. పునరుత్పాదక ఇంధనాల తయారీపై భారీ ప్రణాళికలతో ఉంది. 2040 నాటికి 10 గిగావాట్ల పోర్ట్‌ఫోలియోను సమకూర్చుకోవాలని, సున్నా కర్బన ఉద్గారాల స్థాయికి (నెట్ జీరో) చేరుకోవాలని అనుకుంటున్నట్టు సంస్థ చైర్మన్ అరుణ్ కుమార్ సింగ్ తెలిపారు. కంపెనీ వాటాదారుల వార్షిక సమావేశాన్ని ఉద్దేశించిన ఆయన మాట్లాడారు. బీపీసీఎల్ ఇతర వ్యాపారాల్లోకి విస్తరిస్తున్నట్టు చెప్పారు. ఇది చమురు, గ్యాస్ వ్యాపారంలో ఆదాయ క్షీణతకు హెడ్జింగ్‌గా, అదనపు ఆదాయానికి మార్గం కల్పిస్తుందన్నారు. ‘‘ఆరు వ్యూహాత్మక విభాగాలను గుర్తించాం. పెట్రోకెమికల్స్, గ్యాస్, పునరుత్పాదక ఇంధనాలు, నూతన వ్యాపారాలు (కన్జ్యూమర్ రిటైలింగ్, ఈ మొబిలిటీ) భవిష్యత్తు వృద్ధికి మూల స్తంభాలుగా నిలుస్తాయి. వాటాదారులకు స్థిరమైన విలువను తీసుకొస్తాయి. ప్రధాన వ్యాపారమైన ఆయిల్ రిఫైనింగ్, పెట్రోలియం ఉత్పత్తుల మార్కెటింగ్ ఎప్పటి మాదిరే స్థిరంగా కొనసాగుతుంది’’అని సింగ్ వివరించారు. భిన్న వ్యాపారాలు.. పునరుత్పాదక ఇంధనంలో ప్రస్తుతం గిగావాట్ కంటే తక్కువ ఉత్పాదక సామర్థ్యం ఉందని.. దీన్ని 2040 నాటికి 10 గిగావాట్లకు తీసుకెళ్లనున్నట్టు అరుణ్ కుమార్ సింగ్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా సంస్థకు ఉన్న 20వేల ఫ్యుయల్ స్టేషన్లు, 6,200 ఎల్పీజీ పంపిణీదారుల నెట్వర్క్ అండతో కన్జ్యూమబుల్స్, డ్యురబుల్స్ విక్రయాలు చేపట్టే ఆలోచనతో ఉన్నట్టు తెలిపారు. జాతీయ రహదారుల వెంట చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటును కూడా ప్రస్తావించారు. ప్రయోగాత్మక విధానంలో చెన్నై–తిరుచ్చి–మధురై హైవే 900 కిలోమీటర్లను తాము దత్తత తీసుకున్నామని, ప్రతి 100 కిలోమీటర్లకు చార్జింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేసినట్టు వివరించారు. బినా, కోచి రిఫైనరీల వద్ద పెట్‌కెమ్ ప్రాజెక్టులు చేపట్టామని, ఇవి కార్యకలాపాలు ప్రారంభిస్తే.. ప్రస్తుతం ఒక శాతంగా ఉన్న మార్కెట్ వాటా 8 శాతానికి చేరుకుంటుందన్నారు. కొత్తగా 8 భౌగోళిక ప్రాంతాల్లో గ్యాస్ పంపిణీ లైసెన్స్‌లను సొంతం చేసుకున్నట్టు చెప్పారు. -
మూడో వంతు పునరుత్పాదక విద్యుత్తే!
సాక్షి, హైదరాబాద్: తప్పనిసరిగా పునరుత్పాదక విద్యుత్ కొనుగోళ్లు (రెన్యూవబుల్ పవర్ పర్చేజ్ ఆబ్లిగేషన్/ఆర్పీఓ) విషయంలో రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం భారీ లక్ష్యాలను విధించింది. కేంద్రం ప్రకటించిన లక్ష్యాల ప్రకారం 2022–23లో రాష్ట్రా ల విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు కొనుగోలు చేసే మొత్తం విద్యుత్‌లో ఏకంగా 24.61 శాతం తప్పనిసరిగా పునరుత్పాదక విద్యుత్ ఉండాల్సిందే. ఏటా క్రమంగా కొనుగోళ్ల శాతాన్ని పెంచుకుంటూ 2029–30 నాటికి 43.33 శాతానికి చేరాల్సి ఉంటుంది. 2022–23 నుంచి 2029–30 మధ్య తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సిన పునరుత్పాదక విద్యుత్ లక్ష్యాలను తాజాగా కేంద్ర విద్యుత్ శాఖ ప్రకటించింది. ఏటా ఎంత శాతం మేరకు పవన, జల, ఇత ర పునరుత్పాదక విద్యుత్ కొనుగోళ్లు చేయాలో ఇందులో పొందుపర్చింది. ‘ఇతర పునరుత్పాదక వి ద్యుత్’ కేటగిరీలో సౌర విద్యుత్‌తోపాటు చిన్న, మధ్యతరహా జలవిద్యుత్ ప్రాజెక్టులు రానున్నాయి. విద్యుత్ కోసం బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ ప్లాంట్లపై అధిక శాతం ఆధారపడుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం పెరిగిపోతోంది. దీంతో థర్మల్ విద్యుత్ ప్లాంట్ల వాడకాన్ని తగ్గించి ప్రత్యామ్నాయంగా కాలుష్యరహిత సౌర, పవన, జలవిద్యుత్ వంటి పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని పెంచాలని ‘ప్యారిస్ ఒప్పందం’పేరుతో ప్రపంచ దేశాలు తీర్మానించాయి. ఈ క్రమంలోనే కేంద్రం రాష్ట్రాలకు భారీ ఆర్పీఓ లక్ష్యాలను నిర్దేశించింది. రాష్ట్రాల అభ్యంతరాలను కాదని..: నిర్దేశిత వార్షిక లక్ష్యాల మేరకు తప్పనిసరిగా పునరుత్పాదక విద్యుత్ కొనుగోళ్లు జరపాలని లేకుంటే కొనుగోళ్ల లో ఎంత లోటుంటే ఆ మేరకు జరిమానాలు చెల్లించాలనే నిబంధనను కేంద్రం అమలుచేస్తోంది. ఇప్పటికే ఉన్న ఆర్పీఓ లక్ష్యాలపై తెలంగాణ సహా పలు రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండగా తాజా గా కేంద్రం లక్ష్యాలను మరిన్ని పెంచింది. ఆర్పీఓ లక్ష్యాలకు తగ్గట్లు సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవడానికి తెలంగాణలో సరిపడ స్థలాల్లేవని, లక్ష్యా లు పూర్తి చేయనందుకు జరిమానాలు విధిస్తే డిస్కంలు భారీగా నష్టపోవాల్సి వస్తుందని రాష్ట్రం ఇప్పటికే కేంద్రానికి అభ్యంతరం తెలియజేసింది. శ్రీశైలం, సాగర్ కరెంట్ లెక్కలోకి రాదు.. పాత జలవిద్యుత్ ప్రాజెక్టుల విద్యుత్‌ను తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సిన పునరుత్పాదక విద్యుత్‌గా పరిగణించబోమని కేంద్రం కొత్త నిబంధనను తీసుకొచ్చింది. 25 మెగావాట్లు, ఆపై ఉత్పత్తి సామర్థ్యంగల, 2019 మార్చి 8 తర్వాత నిర్మితమైన భారీ జలవిద్యుత్ కేంద్రాలు, పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల విద్యుత్‌నే ఆర్పీఓ లక్ష్యాలుగా లెక్కిస్తామని పేర్కొంది. దీంతో ఏపీ, తెలంగాణ పరిధిలోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల వంటి జలవిద్యుత్ కేంద్రాల నుంచి ఏటా భారీగా విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్న తెలుగు రాష్ట్రాల డిస్కంలకు ఈ నిబంధన తీవ్ర నష్టాన్ని కలిగించనుంది. మరోవైపు 2022 మార్చి 31 తర్వాత పూర్తైన పవన విద్యుత్ ప్రాజెక్టుల నుంచి కొన్న విద్యుత్‌నే ఆర్పీఓ లక్ష్యం కింద లెక్కిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. 100 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టుతో గతంలో ఒప్పందం చేసుకున్న తెలంగాణ డిస్కంలకు ఈ నిబంధనతో తీవ్ర నష్టమే జరగనుంది. ఇక విద్యుత్ నిల్వలు తప్పనిసరి: విద్యుత్ నిల్వలను కేంద్రం తప్పనిసరి చేసింది. రాష్ట్రానికి సరఫరా చేసే మొత్తం విద్యుత్‌లో 2022–23లో కనీసం ఒక శాతం నిల్వ చేసిన పవన, సౌర విద్యుత్‌లు ఉండాల్సిందే. 2029–30 నాటికి నిల్వ చేసిన సౌర, పవన విద్యుత్ వాడకం 4 శాతానికి పెరగాలి. బ్యాటరీలు లేదా పంప్డ్ స్టోరేజీ పద్ధతిలో నిల్వ చేసే విద్యుత్‌నే ఈ కేటగిరీ కింద లెక్కిస్తామని కేంద్రం తెలిపింది. -
గాలి నుంచి నీరు.. బెంగళూరు కుర్రాళ్ల సక్సెస్ స్టోరీ
ఆరుబయట అలా నిలబడినప్పుడు గాలి వచ్చి పలకరిస్తుంది. ఎంత చల్లని గాలి! ఈ చల్లని గాలికి చల్లని మనసు కూడా ఉంది. తన నుంచి నీటిని మనకు అందిస్తుంది. అదే ఎయిర్ వాటర్! గాలి నుంచి నీరు తయారుచేసే కంపెనీలు మన దేశంలో కొత్త కాదు. అయితే బెంగళూరు కేంద్రంగా ఈ కుర్రాళ్లు మొదలుపెట్టిన వాటర్‌టెక్ స్టార్టప్ ఉరవు ‘పవర్’ విషయంలో తనదైన ప్రత్యేకతను చాటుకుంటుంది... భవిష్యత్‌లో నీటికరువు అనేది ఎంత పెద్ద సమస్య కానుందో ప్రపంచ ఆరోగ్య సంస్థ, నీతి ఆయోగ్ ‘కంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్’ చెబుతున్న లెక్కలు ముచ్చెమటలు పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వర్షం, జలాశయాలపై ఆధారపడకుండా ప్రత్యామ్నాయ మార్గాలలో నీటిని సృష్టించే సాంకేతికప్రయోగాలు జరిగాయి. జరుగుతున్నాయి. అందులో ఒకటి గాలిలోని తేమ నుంచి నీటిని తయారుచేసే విధానం. ‘ఫలానా దేశంలో అక్కడెక్కడో గాలి నుంచి నీరు తయారుచేస్తున్నారట’ అని ఆశ్చర్యపడి తేరుకునేలోపే అలాంటి కంపెనీలు మన దేశంలోనూ మొదలయ్యాయి. ఉదా: వాటర్ మేకర్స్ ఇండియా,వాయుజల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఆక్వో...మొదలైన కంపెనీలు. అట్మాస్ఫెరిక్ వాటర్ జనరేటర్ (ఏడబ్ల్యూజీ)లతో గాలి నుంచి నీరు సృష్టిస్తూ ఈ కంపెనీలు అబ్బురపరుస్తున్నాయి. వీటికి దేశ, విదేశాల్లో మంచి ఆదరణ దక్కుతుంది. ఎయిర్–కండిషనింగ్ ఎఫెక్ట్ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే కంపెనీలు ఇవి. ఇక బెంగళూరు కుర్రాళ్ల ‘ఉరవు ల్యాబ్స్’ విషయానికి వస్తే.... గాలి నుంచి నీరు తయారుచేసే ఎన్నో కంపెనీలు మన దేశంలో ఉండగా ‘ఉరవు’ యూఎస్పీ ఏమిటి? అనేది తెలుసుకునేముందు కాస్త వెనక్కి వెళదాం... నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్), కాలికట్లో చదువుకునే రోజుల్లో స్వప్నిల్, వెంకటేష్‌లకు ‘నీటి కరువు’ అనేమాట తరచుగా వినబడేది. నిజానికి ఆ తీరప్రాంతంలో అధిక వర్షాలు అనేవి సాధారణం. తాగడానికి మాత్రం సురక్షితమైన నీరు దొరికేది కాదు. ఈ విషయంపై తరచుగా మాట్లాడుకునేవారు. 2016లో గ్రాడ్యుయేషన్ పూర్తయిన తరువాత ‘గాలి నుంచి నీరు’ అనే కాన్సెప్ట్ గురించి సీరియస్‌గా దృష్టి పెట్టారు. ఒక సంవత్సరం తరువాత... విద్యుత్ ఆధారిత సంప్రదాయ అట్మాస్ఫెరిక్ వాటర్ జనరేటర్(ఏడబ్ల్యూజీ) తయారు చేశారు. బాగానే పనిచేసింది. అయితే దీనికి అధిక విద్యుత్ కావాలి. పైగా విద్యుత్ ఆధారిత కంపెనీలు మార్కెట్లో ఉండనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమదైన ప్రత్యేకత గురించి ఆలోచించారు. అదే...‘వందశాతం పునరుత్పాదకమైన శక్తి’ తమ ఆలోచనను సాకారం చేసుకోవడానికి ఇంధన సంబంధిత విషయాలలో మంచి సాంకేతిక నైపుణ్యం ఉన్న ప్రదీప్ గార్గ్‌ను బెంగళూరులో కలుసుకున్నారు. స్వప్నిల్, వెంకటేష్‌లు ప్రదీప్‌తో కలిసి ‘రీనెవబుల్ వాటర్ టెక్నాలజీ’పై కలిసిపనిచేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు వారికి కావాల్సింది ప్రతిభ ఉన్న ప్రాడక్ట్ డెవలపర్. అట్టి ప్రతిభ వారికి బాలాజీలో కనిపించింది. ఒక్కో అడుగు వేస్తు ఈ బృందం ‘ఉరవు ల్యాబ్స్’కు శ్రీకారం చుట్టింది. మెకానికల్, ఎలక్ట్రికల్, ఆర్కిటెక్చర్...మొదలైన రంగాలలో నిష్ణాతులైన 15 మందితో ఒక టీమ్ ఏర్పాటయింది. టాలెంట్ సంగతి సరే, మరి ఫండింగ్ సపోర్ట్? అదృష్టవశాత్తు ఎప్పటికప్పుడూ రకరకాల గ్రాంట్స్ అందడంతో కంపెనీకి ఇబ్బంది కాలేదు. ప్రతిష్ఠాత్మకమైన ‘వాటర్ అబాన్డెన్స్ ఎక్స్‌ప్రైజ్’ గ్లోబల్ లీస్ట్ టాప్ 5 ఫైనలిస్ట్‌లలో ఒకరిగా నిలిచారు. ఇది వారికి మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. గాలీ నుంచి నీటిని తీయడానికి సంబంధించి తొంబై శాతం కంపెనీలు ఎయిర్–కండిషనింగ్ ఎఫెక్ట్ టెక్నాజీపై ఆధారపడుతున్నాయి. విద్యుత్‌రంగానికి సంబంధించి సౌర విద్యుత్, పవన విద్యుత్‌లాంటి ప్రత్యామ్నాయాలు ఉన్నాయిగానీ ఈ రంగంలో మాత్రం ప్రత్యామ్నాయ ఆలోచనలు అరుదైపోయాయి. దీంతో ‘హండ్రెడ్ పర్సెంట్ రీనెవబుల్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్’ అంటూ రంగంలోకి దిగింది ఉరవు ల్యాబ్స్. ‘పవర్డ్ బై సోలార్ హీట్’ ‘పవర్డ్ బై వేస్ట్–హీట్ ఆఫ్ ఇండస్ట్రీస్’ ‘పరర్డ్ బై బయోమాస్ వేస్ట్’....అంటూ నినదిస్తున్న ‘ఉరవు’ గాలి నుంచి నీటి తయారీ ప్రక్రియలో చుక్కనీరు కూడా వృథా కాకుండా చూడడం తన లక్ష్యం అని చెబుతుంది. ‘సాంకేతిక విషయాలలో మాకు ఎలాంటి తడబాట్లు లేవు. తయారీ ప్రక్రియకు సంబంధించిన ఫిజిక్స్, ఇంజనీరింగ్‌ను బాగా అర్థం చేసుకున్నాం’ అంటున్నాడు ఫౌండర్స్‌లో ఒకరైన ప్రదీప్ గార్గ్. చిన్నస్థాయిలో 20–100 లీటర్లు, పెద్దస్థాయిలో 10,000 లీటర్ల సామర్థ్యం ఉన్న పరికరాలపై దృష్టి సారించింది ఉరవు. అనుకున్న స్థాయిలో ఈ కంపెనీ విజయం సాధిస్తే వాటర్ ఇండస్ట్రీలో గేమ్‌ఛేంజర్ అవుతుంది’ అంటున్నారు విశ్లేషకులు. ‘మన గ్రహంపై ఎక్కడైనా గాలి నుంచి నీరు తీసుకునే అవకాశం ఉంది. ఇదే సమయంలో భూమిపై ప్రతి ఒక్కరికీ సురక్షితమైన నీరు అందాలి’ అంటున్నారు ఇన్వెస్టర్, వీసి ఫండ్ సీనియర్ సలహాదారు షిగేరు సుమిటోమో. -
డీకార్బనైజ్డ్ మెకానిజంలో ఏపీ కొత్త ట్రెండ్ సెట్ చేసింది: సీఎం జగన్
డీకార్బనైజ్డ్ మెకానిజంపై వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో జరిగిన సదస్సులో సీఎం జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఇటీవల కర్నూలులో ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్ పంప్డ్ స్టోరేజ్ రెన్యువబుల్ ప్రాజెక్ట్ గురించిన వివరాలను సీఎం జగన్ తెలియజేశారు. ఏపీలో ఏర్పాటు చేసిన కర్బన రహిత పవర్ ప్రాజెక్టు ద్వారా విండ్, హైడల్, సోలార్ విద్యుత్‌ను నిరంతరాయంగా ఉత్పత్తి చేయవచ్చని తెలిపారు. ఈ విధానంలో తక్కువ ఖర్చుతో ఎటువంటి కాలుష్యం లేకుండా సుస్థిరమైన విద్యుత్‌ను సాధించవచ్చన్నారు. అంతేకాకుండా హైడ్రోజన్, అమ్మోనియంలను కూడా పొందవచ్చని సీఎం వెల్లడించారు. షోకేస్‌గా కర్నూలు ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి పెద్దదైన కర్బన రహిత పవర్ ప్రాజెక్టు పనులు ఇటీవలే కర్నూలులో మొదలయ్యాయని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. మరి కొద్ది రోజుల్లో ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుందన్నారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి విషయంలో ఏపీ కొత్త ట్రెండ్‌ను నెలకొల్పిందన్నారు. అంతేకాదు గ్రీన్ ఎనర్జీ ప్రొడక్షన్‌కు సంబంధించి షోకేస్‌గా కర్నూలు ప్రాజెక్టు నిలుస్తుందన్నారు. కేవలం పంప్డ్ స్టోరేజీ ద్వారానే 1650 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం సాధారణ విషయం కాదన్నారు. ఏపీ ఆహ్వానిస్తోంది కర్నూలులో నిర్మిస్తోన్న విండ్, హైడల్, సోలార్ పవర్ ప్రాజెక్టులో అనుసరిస్తున్న టెక్నాలజీతో 33,000 మెగా వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే అవకాశం ఏపీలో ఉందన్నారు. ఈ మహాత్తర కార్యక్రమంలో భాగస్వాములయ్యేందుకు ఏపీ తరఫున పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తున్నట్టు సీఎం జగన్ తెలిపారు. పర్యావరణం పట్ల ప్రేమ ఉన్నవారు, బిగ్ థింకింగ్ ఉన్న వారికి ఏపీలో అపారమైన అవకాశాలు ఉన్నాయని సీఎం జగన్ మరోసారి తెలిపారు. ఏపీ ఆదర్శం ఈ కార్యక్రమంలో పాల్గొన్న నీతి అయోగ్ చైర్మన్ అమితాబ్‌కాంత్ మాట్లాడుతూ... కర్బణ రహిత పవర్ ఉత్పత్తికి ఇండియాలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాటిని ఏపీ ఒడిసిపట్టుకుందని ఆయన అన్నారు. కర్నూలు ప్రాజెక్టులో పంప్డ్ స్టోరేజీ ద్వారానే 1650 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడం గొప్ప విషయం అన్నారు. ఈ రోజు ఏపీ అమలు చేస్తున్న టెక్నాలజీ రేపు ప్రపంచం అంతా అనుసరించక తప్పదన్నారు. ఏపీ అమలు చేస్తోన్న కర్బన రహిత పారిశ్రామిక విధానంపై ప్రశంసలు కురిపించారు. గ్రీన్ ఎనర్జీ కోసం ఏపీ సీఎం అమలు చేస్తున్న పాలసీ బాగుందని ఆయన అన్నారు. ఏపీ అనుసరిస్తున్న విధానాన్నే ఇతర దేశాలు కూడా కొనసాగించాలని సూచించారు. ఏపీలో పెట్టుబడులు 27 దేశాలను పరిశీలించిన తర్వాత ఏపీలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించినట్టు ఆర్సెల్లార్ తరఫున ఆదిత్య మిట్టల్ తెలిపారు. రాబోయే రోజుల్లో తమ పెట్టుబడులు రెట్టింపు చేస్తామన్నారు. స్టీల్ ఉత్పత్తి సెక్టార్ నుంచి 8 శాతం కార్బన్ విడుదల అవుతోంది. కానీ ఏపీలో ఉత్పత్తి చేయబోతున్న హైడ్రోజన్‌ను స్టీలు పరిశ్రమలో ఉపయోగించడం ద్వారా స్టీల్ సెక్టార్లో కర్బన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తామన్నారు. త్వరలో ఏపీలో తొలి పునరుత్పాదక పవర్ ప్రాజెక్టును ప్రారంభిస్తామన్నారు. విదేశాలకు ఎగుమతి కర్నూలు ప్రాజెక్టు ద్వారా విద్యుత్‌తో పాటు భారీ ఎత్తున అమ్మోనియం ఉత్పత్తి అవుతుందన్నారు గ్రీన్కో సీఈవో అనిల్ చలమల శెట్టి. దేశీ అవసరాలకు పోను మిగిలిన అమ్మోనియాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తామన్నారు. కర్బన రహిత పవర్ ఉత్పత్తి సమర్థంగా చేయాలంటే డిజిటలేజేషన్ తప్పనిసరి. అందుకోసం ప్రపంచ స్థాయి టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్టు దస్సాల్ట్ సిస్టమ్స్ వైస్ ప్రెసిడెంట్ ఫ్లోరెన్స్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నీతి అయోగ్ సీఈవో అమితాబ్‌కాంత్, ఆదిత్యమిట్టల్, గ్రీన్కో సీఈవో అనిల్ చలమల శెట్టి, డస్సెల్ట్ సిస్టమ్స్ ఈవీవీ ఫ్లోరెన్స్‌లు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: Integrated Renewable Energy Project: ప్రపంచంలోనే మొదటి ప్రాజెక్టు.. శంకుస్థాపనకు సీఎం జగన్ -
ప్రపంచంలోనే మొదటి ప్రాజెక్టు.. శంకుస్థాపనకు సీఎం జగన్
కర్నూలు(సెంట్రల్): ప్రపంచంలోనే మొట్ట మొదటి ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఎనర్జీ పవర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఓర్వకల్లు మండలం గుమ్మితం తండాకు రానున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో గుమ్మితం తండాలో చేయాల్సిన ఏర్పాట్లపై ఆదివారం అధికారులు, గ్రీన్కో ప్రతినిధులతో కలెక్టర్ కోటేశ్వరరావు సమావేశమయ్యారు. పోలీసు బందోబస్తు, కార్యక్రమ నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలని ఎస్పీ సీహెచ్ సుధీర్ కుమార్‌రెడ్డి, ఇతర అధికారులను ఆదేశించారు. గ్రీన్కో ప్రతినిధులతో సమన్వయం చేసుకుని ప్రోటోకాల్ ప్రకారం ఏర్పాట్లు చేయాలన్నారు. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులో ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్ కోటేశ్వరరావు, ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి 5,410 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యంతో గ్రీన్ కోఎనర్జీస్ లిమిటెడ్ నిర్మించే పవర్ ప్రాజెక్టు నుంచి సోలార్, విండ్, హైడల్ విద్యుత్ ఉత్పత్తి అవుతుందన్నారు. ఇలా ఒకే ప్లాంట్ నుంచి మూడు రకాల విద్యుత్ ఉత్పత్తి అయ్యే ప్రాజెక్టు ప్రపంచంలోనే మొట్టమొదట కర్నూలు జిల్లాలో నిర్మితం అవుతుండటం సంతోషకరమన్నారు. అనంతరం కలెక్టర్, ఎస్పీలు ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులో సీఎం పర్యటన ఏర్పాట్లపై డైరెక్టర్ విద్యాసాగర్‌తో చర్చించారు. ఏర్పాట్లలో ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో కర్నూలు ఆర్డీఓ హరిప్రసాదు, ఆర్అండ్బీ ఎస్ఈ శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు. చదవండి: (గుమ్మటం తండాలో పర్యటించనున్న సీఎం జగన్.. షెడ్యూల్ ఇదే..) 800 మంది పోలీసులతో బందోబస్తు కర్నూలు (టౌన్): సీఎం పర్యటనకు 800 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ సుధీర్‌కుమార్ రెడ్డి ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, 19 మంది సీఐలు, 43 మంది ఎస్ఐలు, 122 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, 283 మంది కానిస్టేబుళ్లు, 28 మంది మహిళా పోలీసులు, 169 మంది హోంగార్డులు, 03 ప్లటూన్ల ఏఆర్ సిబ్బంది, 02 ప్లటూన్ల ఏపీఎస్పీ సిబ్బంది, 7 స్పెషల్ పార్టీ బృందాలను బందోబస్తు విధులకు కేటాయించినట్లు తెలిపారు. -
Kurnool: గుమ్మటం తండాలో పర్యటించనున్న సీఎం జగన్
సాక్షి, కర్నూలు (సెంట్రల్): సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 17న జిల్లాకు రానున్నారు. ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లి మజరా గ్రామం గుమ్మటం తండాలో పర్యటించనున్నారు. రూ.15 వేల కోట్ల పెట్టుబడితో 5,410 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదనే లక్ష్యంగా గ్రీన్కో ఎనర్జీస్ లిమిటెడ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. దీంతో సీఎం పర్యటన కోసం జిల్లా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. చదవండి: (Konaseema: ఆటే శ్వాస... సాధనే జీవితం.. ఫైనల్స్‌కు చేరిన భారత జట్టులో) సీఎం పర్యటన వివరాలు.. ►మంగళవారం ఉదయం 9.35 గంటలకు విజయవాడలోని ఆయన నివాసం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయలుదేరుతారు. ►10 గంటలకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానం ద్వారా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు బయలుదేరుతారు. ►10.50 గంటలకు ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ►11.15 గంటలకు ఓర్వకల్లు మండలం గుమ్మటం తండా హెలిప్యాడ్‌కు హెలికాప్టర్లో వస్తారు. ►11.15 నుంచి 11.30 గంటల మధ్య స్థానిక నేతలతో మాట్లాడతారు. ►11.35 గంటలకు ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఎనర్జీ పవర్ ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుంటారు. ►11.35 నుంచి 12.15 గంటలకు ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఎనర్జీ పవర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు ►12.40 గంటలకు తిరిగి ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు ►12.50 గంటలకు ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం బయలుదేరి వెళ్తారు. చదవండి: (నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్ ) -
రాబోయే రోజుల్లో ఆ రంగంలో 80 వేల మెగావాట్ల విద్యుత్!
బొగ్గు కొరత కారణంగా దేశవ్యాప్తంగా విద్యుత్ కొరత సమస్య వేధిస్తోంది. మరోవైపు కర్బణ ఉద్ఘారాలు తగ్గించాలంటూ ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఈ రెండింటికి విరుగుడుగా కాలుష్య రహితంగా గ్రీన్ ఎనర్జీకి కేంద్రం ప్రాధాన్యత ఇస్తోంది. రాబోయే రోజుల్లో 50,000 మెగావాట్ల సోలార్ విద్యుత్, విండ్ పవర్ ద్వారా 30,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు జర్మన్ ఇంజనీరింగ్ కంపెనీలో చర్చిస్తున్నట్టు తెలిపింది. -
ఐటీ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో పెట్టుబడులకు ఆసక్తి
సాక్షి, హైదరాబాద్: ఐటీ, లైఫ్ సైన్సెస్, రెన్యువల్ ఎనర్జీ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆస్ట్రేలియా కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని ఆస్ట్రేలియా–ఇండియా ఇన్స్టిట్యూట్ సీఈవో లిసాసింగ్ వెల్లడించారు. గురువారం ఇక్కడ ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌తో లిసాసింగ్ సమావేశమయ్యారు. భేటీ సందర్భంగా తెలంగాణ, ఆస్ట్రేలియా నడుమ వ్యాపార, వాణిజ్య సంబంధాల బలోపేతంపై చర్చించారు. భారత్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని, తెలంగాణతో వాణిజ్య సంబంధాల బలోపేతానికి తాము సిద్ధంగా ఉన్నామని లిసాసింగ్ పేర్కొన్నారు. భారత్– ఆస్ట్రేలియా మధ్య వ్యాపార, వాణిజ్య ఒప్పందాలపై చర్చ నడుస్తున్న సందర్భంగా ఇక్కడ పెట్టుబడులకున్న అవకాశాలను పరిశీలించేందుకు త్వరలోనే ఒక ప్రతినిధి బృందం భారత్‌లో పర్యటిస్తుందని చెప్పారు. ప్రగతిశీల తెలంగాణలో ఉన్న పరిస్థితులను ఆస్ట్రేలియా పారిశ్రామిక వర్గాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్నారు. -
ఐవోసి మాస్టర్ ప్లాన్.. అంబానీ, అదానీలకు పోటీగా..
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), ఇంజనీరింగ్, మౌలిక రంగ దిగ్గజం ఎల్అండ్టీ, పునరుత్పాదక ఇంధన రంగంలోని రెన్యూ పవర్.. గ్రీన్ హైడ్రోజన్ తయారీకి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించాయి. దీంతో గ్రీన్ హైడ్రోజన్ తయారీపై భారీ ప్రణాళికలను ప్రకటించిన రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ గ్రూపునకు ఈ జాయింట్ వెంచర్ గట్టీ పోటీనివ్వనుంది. సంయుక్తంగా గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల అభివృద్ధికి గాను ఒప్పందంపై ఈ మూడు సంస్థలు సంతకాలు చేశాయి. అలాగే, ఐవోసీ, ఎల్అండ్టీ విడిగా మరో జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయనున్నాయి. దీని ద్వారా అవి గ్రీన్ హైడ్రోజన్ తయారీకి అవసరమైన ఎలక్ట్రోలైజర్లను తయారు చేయనున్నాయి. ఐవోసీ–ఎల్అండ్టీ–రెన్యూపవర్ ఐవోసీకి చెందిన మధుర, పానిపట్ రిఫైనరీల వద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల ఏర్పాటుపై దృష్టి సారిస్తాయని సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో అవి పేర్కొన్నాయి. గ్రీన్ హైడ్రోజన్ తయారీకి అవసరమైన పునరుత్పాదక ఇంధనాన్ని రెన్యూ పవర్ సరఫరా చేసే అవకాశం ఉంది. ‘‘మూడు సంస్థల మధ్య జాయింట్ వెంచర్ ఏర్పాటు వల్ల.. ప్రాజెక్టుల డిజైన్, నిర్మాణంలో ఎల్అండ్టీకి ఉన్న అనుభవం, పెట్రోలియం రిఫైనరీలో ఐవోసీకి ఉన్న అనుభవం, ఇంధన చైన్ పట్ల అవగాహన, పునరుత్పాదక ఇంధనంలో రెన్యూపవర్కు ఉన్న అనుభవం కలసివస్తాయి’’ అని ఈ ప్రకటన తెలియజేసింది. చదవండి: గ్రీన్ ఎనర్జీలో దూసుకుపోతున్న రిలయన్స్.. మరో కీలక నిర్ణయం -
Telangana: పరిశ్రమలకు షాక్! .. కంపల్సరీ కొనాల్సిందే..!
సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు డిస్కంలకే పరిమితమైన పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు నిబంధన ఇక ఓపెన్ యాక్సెస్, కాప్టివ్ ప్లాంట్ల ద్వారా విద్యుత్ కొనేవాళ్లకూ వర్తించనుంది. డిస్కంలతో పాటు ఓపెన్ యాక్సెస్, కాప్టివ్ వినియోగదారులూ ఏటా తప్పనిసరిగా నిర్దేశిత పరిమాణంలో రెన్యువబుల్ విద్యుత్ కొనుగోలు చేయాల్సి రాబోతోంది. ఇందుకు సంబంధించి తప్పనిసరిగా పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు (రెన్యూవబుల్ పవర్ పర్చేజ్ ఆబ్లిగేషన్/ఈఆర్పీపీఓ) ముసాయిదా నిబంధనలను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) తాజాగా ప్రకటించింది. 2020–23 నుంచి 2026–27 వరకు ఈ నిబంధనలు అమల్లో ఉండనున్నాయి. డిస్కంలు, ఓపెన్ యాక్సెస్ వినియోగదారులు.. వాళ్లు కొనే మొత్తం విద్యుత్‌లో 8.5 శాతం పునరుత్పాదక ఇంధనాన్ని 2022–23లో కొనాలి. ఆ తర్వాత క్రమంగా ఏటా ఒక శాతం పెంచుకుంటూ 2026–27 నాటికి 13 శాతానికి పునరుత్పాక ఇంధన సరఫరాను పెంచాల్సి ఉంటుంది. పరిశ్రమలకు షాక్! పెద్ద మొత్తంలో విద్యుత్ వాడే భారీ పరిశ్రమలు ఓపెన్ యాక్సెస్‌లో తక్కువకే దొరికే విద్యుత్ కొంటుంటాయి. సిమెంట్, పేపర్ వంటి కొన్ని భారీ పరిశ్రమలు కాప్టివ్ థర్మల్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుని స్వయంగా విద్యుదుత్పత్తి చేసుకుంటుంటాయి. ఓపెన్ యాక్సెస్ విధానం ద్వారా రాష్ట్రంలోని 700కు పైగా పారిశ్రామిక వినియోగదారులు విద్యుత్ కొంటున్నారు. ఈఆర్సీ తాజా ముసాయిదాతో వీళ్లకు విద్యుత్ కొనుగోలు భారంగా మారే అవకాశం ఉంది. వచ్చే ఐదేళ్లకు నిబంధనలు ప్రస్తుతం అమల్లో ఉన్న పునరుత్పాదక విద్యుత్ నిబంధనల గడువు 2021–22తో ముగియనుండటంతో రానున్న ఐదేళ్లకు కొత్త ముసాయిదా నిబంధలను ఈఆర్సీ ప్రకటించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం 2021–22లో రాష్ట్ర డిస్కంలు 8 శాతం పునరుత్పాదక విద్యుత్‌ను కొనాలి. ఇందులో 7.1 శాతం సౌర విద్యుత్, 0.9 శాతం సౌరేతర పునరుత్పాదక విద్యుత్ ఉండేలా చూసుకోవాలి. గతంలో డిస్కంలకే వర్తించిన ఈ నిబంధనలు తాజాగా ఓపెన్ యాక్సెస్, కాప్టివ్ వినియోగదారులకూ వర్తించనున్నాయి. డిస్కంలు, ఓపెన్ యాక్సెస్, కాప్టివ్ వినియోగదారులు కొనే మొత్తంలో విద్యుత్‌లో పునరుత్పాక విద్యుత్ శాతం ఎంత ఉండాలో ఈ కింది పట్టికలో చూడవచ్చు. లక్ష్యం చేరకుంటే జరిమానాలు పునరుత్పాదక విద్యుత్ కొనుగోళ్ల సమాచారాన్ని స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఎల్డీసీ) నుంచి ఈఆర్సీ సేకరించనుంది. నిర్దేశించిన లక్ష్యం మేరకు పునరుత్పాదక విద్యుత్‌ను కొనుగోలు చేయకపోతే డిస్కంలు, ఓపెన్ యాక్సెస్, కాప్టివ్ ప్లాంట్ల విద్యుత్ వినియోగదారులపై ఈఆర్సీ జరిమానా విధించనుంది. జరిమానాలు ఎంత విధించాలో బహిరంగ విచారణలో నిర్ణయం తీసుకోనుంది. జరిమానాలకు తోడు లక్ష్యం కంటే తక్కువ కొన్న పునరుత్పాదక విద్యుత్‌కు సంబంధించిన వ్యయాన్ని ప్రత్యేక ఫండ్‌గా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. లక్ష్యం కంటే తక్కువ కొన్న వినియోగదారులు కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి (సీఈఆర్సీ) జారీ చేసే రెన్యువబుల్ ఎనర్జీ సర్టిఫికెట్‌ను కొని లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఏంటీ పునరుత్పాదక విద్యుత్ శక్తి? సౌర, పవన, జల, బయోమాస్ విద్యుత్‌ను పునరుత్పాదక విద్యుత్ అంటారు. బొగ్గు, ఆయిల్, సహజ వాయువులు వంటి శిలాజ ఇంధనాల నుంచి ఉత్పత్తి చేసే సాంప్రదాయ విద్యుత్‌తో కాలుష్యం పెరిగి పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతోంది. ఈ నేపథ్యంలో క్రమంగా ఈ రకం విద్యుత్ వినియోగాన్ని తగ్గించి పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని పెంచాలన్న ఉద్దేశంతో జరిమానాలు విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, కేంద్రంతో పాటు పొరుగు రాష్ట్రాలతో పోల్చితే రాష్ట్రంలో తక్కువగా లక్ష్యాలను నిర్దేశించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. -
5 మిలియన్ టన్నుల హరిత హైడ్రోజన్ ఉత్పత్తి
న్యూఢిల్లీ: పర్యావరణ అనుకూలమైన హరిత హైడ్రోజన్ ఉత్పత్తిని 2030 నాటికి 5 మిలియన్ టన్నుల స్థాయికి పెంచుకోవాలని కేంద్రం నిర్దేశించుకుంది. ఇందుకోసం ఉపయోగించే పునరుత్పాదక విద్యుత్ పంపిణీపై పాతికేళ్ల పాటు అంతర్రాష్ట్ర చార్జీల నుంచి మినహాయింపు లభించనుంది. జాతీయ హైడ్రోజన్ విధానం తొలి భాగాన్ని ఆవిష్కరించిన సందర్భంగా కేంద్ర విద్యుత్, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి రాజ్ కుమార్ సింగ్ ఈ విషయాలు తెలిపారు. కొత్త విధానాన్ని వివరించేందుకు త్వరలో పరిశ్రమ వర్గాలతో సమావేశం కానున్నట్లు ఆయన చెప్పారు. హరిత హైడ్రోజన్, అమోనియాల వినియోగం పెరిగితే పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు. సాధారణంగా వివిధ ఉత్పత్తుల తయారీ కోసం చమురు రిఫైనరీలు మొదలు, ఉక్కు ప్లాంట్ల వరకూ చాలా సంస్థలకు హైడ్రోజన్ అవసరమవుతుంది. ప్రస్తుతం సహజ వాయువు లేదా నాఫ్తా వంటి శిలాజ ఇంధనాల నుంచి దీన్ని ఉత్పత్తి చేస్తున్నారు. అయితే, ఈ ప్రక్రియలో కర్బన ఉద్గారాలు వెలువడి కాలుష్య కారకంగా మారుతున్నందున పర్యావరణ అనుకూలమైన పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి హరిత హైడ్రోజన్, అమోనియా ఉత్పత్తిపై దృష్టి పెడుతున్నారు. ఇందులో భాగంగానే తాజా విధానాన్ని రూపొందించినట్లు మంత్రి తెలిపారు. రెండో విడతలో దశలవారీగా ప్లాంట్లు హరిత హైడ్రోజన్, హరిత అమోనియా వినియోగించడాన్ని తప్పనిసరి చేయనున్నట్లు చెప్పారు. ఎక్కడైనా ప్లాంటు..: కేంద్ర ప్రభుత్వ విధానం ప్రకారం.. పునరుత్పాదక వనరుల నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ప్లాంట్లను కంపెనీలు దేశంలో ఎక్కడైనా సొంతంగానైనా లేదా డెవలపర్ ద్వారానైనా ఏర్పాటు చేసుకోవచ్చు. ఎక్సే్చంజీల నుంచి కూడా కొనుగోలు చేయొచ్చు. ఈ విద్యుత్‌ను హైడ్రోజన్ ఉత్పత్తి చేసే ప్లాంటు వరకు ట్రాన్స్మిషన్ గ్రిడ్ ద్వారా ఉచితంగా పంపిణీ చేయవచ్చు. ఇందుకోసం పాతికేళ్ల పాటు అంతర్రాష్ట్ర చార్జీల నుంచి మినహాయింపు ఉంటుంది. 2025 జూన్ 30 లోగా ఏర్పాటైన ప్రాజెక్టులకు ఇది వర్తిస్తుంది. అలాగే వినియోగించుకోని పునరుత్పాదక విద్యుత్‌ను గ్రీన్ హైడ్రోజన్, అమోనియా తయారీదారులు.. 30 రోజుల పాటు పంపిణీ సంస్థ వద్దే అట్టే పెట్టుకుని, అవసరమైనప్పుడు తిరిగి పొందవచ్చు. -
పునరుత్పాదక విద్యుత్ రంగంలో ఏటా రూ.లక్ష కోట్లు
సాక్షి, అమరావతి: పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి రంగంలో పెట్టుబడులను పెంచడానికి, సకాలంలో ఉత్పత్తి ఖర్చులను తిరిగి పొందడానికి కేంద్రం తాజాగా కొత్త నిబంధనలను ప్రకటించింది. రాష్ట్రాలు, విద్యుత్ పంపిణీ సంస్థల నుంచి క్రమం తప్పకుండా ఇంధన కొనుగోలుకు హామీ ఇచ్చింది. దీనికోసం దేశంలో 2030 నాటికి 450 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అప్పటివరకూ ఏటా రూ.లక్ష కోట్లు (ట్రిలియన్) పెట్టుబడి పెట్టనుంది. నెలవారీ టారిఫ్‌లో సర్దుబాటు 2019 నుంచి సోలార్ మాడ్యూల్స్ ధర అత్యధికంగా పెరిగింది. దాదాపు అన్ని రకాల మాడ్యూల్స్‌ను చైనా నుండి దిగుమతి చేసుకుంటుండగా.. విద్యుత్ సంక్షోభం కారణంగా అక్కడి ఫ్యాక్టరీలు పరిమిత రోజుల్లో మాత్రమే నడుస్తున్నాయి. దానివల్ల దేశంలో పునరుత్పాదక విద్యుత్ జనరేటర్లకు వాటిని సకాలంలో అందించలేని పరిస్థితి ఏర్పడింది. ఇది పునరుత్పాదక విద్యుత్ రంగం వృద్ధిపై ప్రభావం చూపుతోంది. ఇప్పుడు కేంద్రం మార్చిన నిబంధనల వల్ల నెలవారీ టారిఫ్‌లో సర్దుబాటును లెక్కించడానికి అవకాశం ఏర్పడుతుంది. తద్వారా ఉత్పత్తి సంస్థలు సకాలంలో ఖర్చులను రాబట్టుకోవచ్చు. నిరంతరం గ్రిడ్‌కు అనుసంధానం పునరుత్పాదక ఇంధన కర్మాగారాన్ని తప్పనిసరిగా నడపాల్సిన అవసరం లేదని నోటిఫైడ్ నియమాలు నిర్దేశించాయి. పవర్ ప్లాంట్ నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్‌ను గ్రిడ్‌లో ఏదైనా సాంకేతిక అవరోధం ఏర్పడినప్పుడు, విద్యుత్ గ్రిడ్ భద్రతా కారణాల వల్ల మాత్రమే నియంత్రిస్తారు. మిగతా అన్ని సమయాల్లో గ్రిడ్‌కు అనుసంధానం చేయవచ్చు. ఇది పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించేందుకు సహాయపడుతుందని విద్యుత్ మంత్రిత్వ శాఖ చెబుతోంది. -
పునరుత్పాదక విద్యుత్ తప్పనిసరి!
సాక్షి, హైదరాబాద్: పరిశ్రమలు, ఇతర సంస్థలు తమ మొత్తం వినియోగంలో కనీస వాటా మేర పునరుత్పాదక విద్యుత్(సౌర, పవన లాంటి)ను తప్పనిసరిగా వినియోగించాల్సిందే. లేని పక్షంలో జరిమానా తప్పదు. నిర్దేశించిన లక్ష్యాల మేరకు పునరుత్పాదక విద్యుత్‌ను వినియోగించిన వారికి ప్రోత్సాహకాలు సైతం లభించనున్నాయి. ఇంధన సంరక్షణ చట్టానికి కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు సవరణలు తీసుకురాబోతోంది. విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతుండటం, పర్యావరణ మార్పులు వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని పునరుత్పాదక ఇంధన వినియోగ స్థాయిలను పెంచడానికి ఈ సవరణలు తీసుకువస్తున్నామని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. పరిశ్రమలు, భవనాలు, రవాణా తదితర రంగాల్లో పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని పెంచడానికి ఈ సవరణలను ప్రతిపాదించింది. రంగాలవారీగా ఎంత శాతం మేర పునరుత్పాదక విద్యుత్‌ను వినియోగించాలన్న అంశాలను ఈ సవరణల ద్వారా కేంద్రం తెలపనుంది. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేలా పునరుత్పాద విద్యుత్‌ను వినియోగించే సంస్థలకు ‘కార్బన్ సేవింగ్ సర్టిఫికెట్’రూపంలో ప్రోత్సాహకాలను ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలపై ఇప్పటికే విద్యుత్ మంత్రిత్వశాఖ వివిధ వర్గాల వినియోగదారులతో పాటు సంబంధిత ప్రభుత్వ శాఖల నుంచి అభిప్రాయాలు, సూచనలను స్వీకరించింది. ఈ సవరణలు అమల్లోకి వస్తే దేశంలో శిలాజాల(పెట్రో, డీజిల్ లాంటి) ఇంధన వనరుల వినియోగం తగ్గి పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుంది. గ్రిడ్ ద్వారా నిర్దేశిత పరిమాణంలో పునరుత్పాదక విద్యుత్ సరఫరా జరగనుంది. కర్బణ ఉద్గారాల తగ్గింపే లక్ష్యం.. పారిస్ ఒడంబడిక ప్రకారం.. దేశంలో 2030 నాటికి కర్బణ ఉద్గారాల విడుదలను 33–35 శాతం మేరకు తగ్గించాలి. 2030 నాటికి మొత్తం ఇంధన అవసరాల్లో 40 శాతం అవసరాలను శిలాజయేతర ఇంధన వనరులను ద్వారా తీర్చాలని లక్ష్యంగా పెట్టుకుని కేంద్రం ఈ సవరణలను తీసుకొస్తోంది. 2030 నాటికి కార్బన్ డయాక్సైడ్ విడుదలను 550 మెట్రిక్ టన్నులకు తగ్గించాలన్నది కేంద్రం లక్ష్యం. శిలాజాల ఇంధనవనరుల వినియోగం తగ్గించి గ్రీన్ హైడ్రోజన్ ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రతిపాదిత సవరణలో ప్రత్యేక నిబంధనలు ఉండనున్నాయి. చట్ట పరిధిలో భారీ నివాస భవనాలు.. వాతావణం కలుషితం చేయని విధంగా ఇంధన వనరులను వినియోగించే సంస్థలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంతో ప్రైవేట్ రంగం సైతం భాగం కానుంది. భారీ నివాస భవనాలను కూడా ఈ చట్టం పరిధిలోకి తీసుకొచ్చి పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని తప్పనిసరి చేయనుంది. భారీ భవనాలకు భవిష్యత్‌లో సోలార్ రూఫ్‌టాప్ లేదా ప్రత్యామ్నాయ మార్గంలో పునరుత్పాదక విద్యుత్ వినియోగం తప్పనిసరి కానుంది. -
‘ఆర్ఈ’ పెట్టుబడుల్లో భారత్‌కు 3వ స్థానం
న్యూఢిల్లీ: పునరుత్పాదక విద్యుత్ (ఆర్ఈ) రంగంలో పెట్టుబడులకు ఆకర్షణీయమైన దేశాల సూచీలో (ఆర్‌ఈసీఏఐ) టాప్ 3 దేశాలు ఈసారి కూడా తమ స్థానాలను నిలబెట్టుకున్నాయి. అమెరికా అగ్రస్థానంలో ఉండగా, చైనా రెండో స్థానంలోనూ, భారత్ యథాప్రకారం 3వ స్థానంలోనూ కొనసాగుతున్నాయి. ఆర్‌ఈసీఏఐకి సంబంధించి కన్సల్టెన్సీ సంస్థ ఈవై విడుదల చేసిన 58వ ఎడిషన్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఆర్ఈ విభాగంలో పెట్టుబడి అవకాశాలకు ఆకర్షణీయంగా ఉన్న టాప్ 40 దేశాలతో ఈవై ఈ జాబితా రూపొందించింది. పర్యావరణ, సామాజిక, గవర్నెన్స్ అంశాలకు కంపెనీలు, ఇన్వెస్టర్లు పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో పర్యావరణహిత విద్యుత్ విభాగానికి కార్పొరేట్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ), వృద్ధి చోదకాలుగా నిలుస్తున్నాయని సంస్థ పేర్కొంది. ఈసారి పునరుత్పాదక విద్యుత్ కొనుగోళ్లలో ఆకర్షణీయతకు కొలమానంగా కొత్తగా పీపీఏ సూచీని కూడా ప్రవేశపెట్టినట్లు వివరించింది. దీనికి సంబంధించి టాప్ 30 పీపీఏ మార్కెట్లలో భారత్‌కు ఆరో ర్యాంక్ దక్కినట్లు పేర్కొంది. స్వావలంబన సాధించే లక్ష్యంతో విధానపరంగా సమగ్రమైన నిర్ణయాలు తీసుకోవడం, పునరుత్పాదక విద్యుత్ మార్కెట్లో సానుకూల పరిస్థితులు, పెట్టుబడులు.. టెక్నాలజీపరమైన పురోగతి తదితర అంశాలు, భారత్‌లో పర్యావరణహిత విద్యుత్ విభాగం కొత్త శిఖరాలకు చేరుకోవడానికి తోడ్పడుతున్నాయని ఈవై తెలిపింది. అయితే, వేగవంతమైన వృద్ధిని దెబ్బతీసే అవరోధాలను ఈ రంగం జాగ్రత్తగా అధిగమించాల్సి ఉంటుందని హెచ్చరించింది. -
విధిగా గ్రీన్ ఎనర్జీ!.. కేంద్రం చేతిలో ఓపెన్ యాక్సెస్
సాక్షి, హైదరాబాద్: డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీలు, ఓపెన్ యాక్సెస్, క్యాప్టివ్ వినియోగదారులు విధిగా నిర్దేశిత మొత్తంలో పునరుత్పాదక విద్యుత్ (గ్రీన్ ఎనర్జీ) కొనుగోలు చేయాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకోసం కొత్తగా గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ రూల్స్–2021 ముసాయిదాను ప్రకటించింది. వచ్చే నెల 14లోగా దీనిపై అభ్యంతరాలు, సలహాలు, సూచనలు తెలపాలని రాష్ట్రాలను కోరింది. దీనిప్రకారం విధిగా గ్రీన్ ఎనర్జీ కొనుగోలు బాధ్యత (రెన్యూవబుల్ పర్చేజ్ ఆబ్లిగేషన్/ఆర్పీఓ)ను అందరిపై ఏకరీతిన ఉండనుంది. డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీలు, ఓపెన్ యాక్సెస్, క్యాప్టివ్లకు ఈ నిబంధనలు తుది నోటిఫికేషన్ జారీ తేదీ నుంచి వర్తించనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వరంగ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు మాత్రమే డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ కలిగి ఉన్నాయి. విద్యుత్ పంపిణీ రంగం ప్రైవేటీకరణలో భాగంగా ప్రైవేటు డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీలను తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ఈ తరుణంలో ఈ నిబంధనలను తీసుకురావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సొంతంగా పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్ పెట్టుకోవచ్చు... ►తప్పనిసరి అయినా, కాకపోయినా ఏదైనా సంస్థ తమ అవసరాల కోసం పునరుత్పాదక ఇంధనాన్ని దిగువ పేర్కొన్న ఏదైనా పద్ధతిలో కొనుగోలు చేసి వాడుకోవచ్చు. ►సొంత వినియోగం కోసం ఏర్పాటు చేసుకొనే పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల స్థాపిత సామర్థ్యంపై ఎలాంటి పరిమితి ఉండకూడదు. అయితే విద్యుత్‌ను గ్రిడ్‌కు సరఫరా చేయరాదు. దీనిని ‘బిహైండ్ ద మీటర్’వినియోగం అంటారు. ఈ విద్యుత్ కొనాల్సిన బాధ్యత డిస్కంలకు ఉండదు. ఈ విద్యుత్ ప్లాంట్‌ను సొంతంగా లేదా డెవలపర్ ద్వారా పెట్టించుకోవచ్చు. డెవలపర్‌తో దీర్ఘకాల/మధ్యకాల విద్యుత్ కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. ►ఒప్పందం ద్వారా ఓపెన్ యాక్సెస్ విధానంలో డెవలపర్ నుంచి పునరుత్పాదక ఇంధనాన్ని సమీకరించుకోవచ్చు. కేంద్రం చేతిలో ఓపెన్ యాక్సెస్ ఓపెన్ యాక్సెస్‌లో పునరుత్పాదక విద్యుత్ కొనుగోళ్లకు అనుమతులు ఇకపై నేరుగా కేంద్రం నుంచి లభించనున్నాయి. కేంద్రం ఏర్పాటు చేసే నోడల్ ఏజెన్సీ ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించి సింగిల్ విండో విధానం ద్వారా సంబంధిత ఈఆర్సీలకు వాటిని పంపిస్తుంది. ఆ ఈఆర్సీ అనుమతులు ఇస్తుంది. ►ఓపెన్ యాక్సెస్ దరఖాస్తులను తిరస్కరిస్తే కారణాన్ని రాతపూర్వకంగా తెలపాలి. పునరుత్పాదక విద్యుత్ కావాలని విజ్ఞప్తి చేయవచ్చు... ►ఏదైనా సంస్థ తమ అవసరాల్లో కొంత శాతం మేరకు లేదా పూర్తిగా పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు చేసి వాడుకోవచ్చు. ఈ మేరకు పునరుత్పాదక విద్యుత్‌ను సమీకరించి సరఫరా చేయాలని డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు విజ్ఞప్తి చేయవచ్చు. ►క్యాప్టివ్ విద్యుత్ ప్లాంట్ లేదా ఓపెన్ యాక్సెస్ ద్వారా అందుబాటులో ఉన్న పునరుత్పాదక విద్యుత్‌ను రెన్యూవబుల్ పర్చేజ్ ఆబ్లిగేషన్‌తో సంబంధం లేకుండా కొనుగోలు చేయవచ్చు. ►విధిగా కొనుగోలు చేయాల్సిన దానికన్నా అధిక మొత్తం/వాటాలో పునరుత్పాదక ఇంధ నాన్ని వినియోగదారులు స్వచ్ఛందంగా కొనుగోలు చేసుకోవచ్చు. కనీసం 50%, 75%, 100% పునరుత్పాదక ఇంధనాన్ని కొనొచ్చు. ►సంబంధిత విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) పునరుత్పాదక విద్యుత్ టారిఫ్‌ను ఖరా రు చేస్తుంది. పునరుత్పాదక విద్యుత్ సమీకరణ సగటు ధర, క్రాస్ సబ్సిడీ చార్జీలు, సర్వీ సు చార్జీల ఆధారంగా టారిఫ్ నిర్ధారిస్తారు. ►పునరుత్పాదక విద్యుత్ కోసం డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీ చేసే విజ్ఞప్తి కనీసం ఏడాది కాలం కోసం ఉండాలి. ఏడాది పాటు కొంటామని ముందే సూచించాలి. ►డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీ నుంచి వినియోగ దారులు కొనుగోలు చేసిన పునరుత్పాదక విద్యుత్‌ను, ఆ కంపెనీ విధిగా కొనుగోలు చేయాల్సిన విద్యుత్ (ఆర్బీఓ) కింద లెక్కి స్తారు. ప్రతినెలా డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీ స్థాయిలో పునరుత్పాదక విద్యుత్ సరఫరాను లెక్కిస్తారు. ►విధిగా కొనాల్సిన పునరుత్పాదక విద్యుత్ లక్ష్యాలను అందుకోవడానికి రెన్యూవబుల్ ఎనర్జీ సర్టిఫికెట్లను కొనుగోలు చేసుకోవచ్చు. ►పునరుత్పాదక విద్యుత్ ఉపయోగించి ఉత్ప త్తి చేసిన ‘గ్రీన్ హైడ్రోజన్’ను పరిశ్రమలు, ఇతర సంస్థలు కొనుగోలు చేయడం ద్వారా విధిగా కొనుగోలు చేయాల్సిన పునరుత్పాదక విద్యుత్ లక్ష్యాలను చేరుకోవచ్చు. ►ఓపెన్ యాక్సెస్‌లో పునరుత్పాదక విద్యుత్ కొనుగోళ్లకు వచ్చే దరఖాస్తులన్నింటినీ 15 రోజుల్లోగా పరిష్కరించాలి. 100 కిలోవాట్స్, ఆపై కాంట్రాక్టెడ్ లోడ్, శాంక్షన్డ్ లోడ్ ఉన్న వినియోగదారులకు మాత్రమే ఓపెన్ యాక్సెస్ అనుమతి. -
పెట్రోకెమ్, రెన్యూవబుల్స్‌పై గెయిల్ దృష్టి
న్యూఢిల్లీ: పెట్రోకెమికల్స్, స్పెషాలిటీ కెమికల్స్, రెన్యూవబుల్స్ విభాగాలలో విస్తరణపై దృష్టి పెట్టినట్లు పీఎస్‌యూ దిగ్గజం గెయిల్ ఇండియా చైర్మన్ మనోజ్ జైన్ తాజాగా పేర్కొన్నారు. సహజవాయువు కాకుండా ఇతర విభాగాలలో బిజినెస్‌ను విస్తరించే కొత్త ప్రణాళికల్లో ఉన్నట్లు తెలియజేశారు. ‘2030 వ్యూహాలు’ పేరుతో మెరుగుపరచిన భవిష్యత్ ప్రణాళికలను అనుసరించనున్నట్లు వివరించారు. వచ్చే దశాబ్దానికిగాను సరికొత్త ప్రయాణాన్ని సాగించనున్నట్లు తెలియజేశారు. పరిశ్రమలో వస్తున్న మార్పులు, తద్వారా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడంలో ఈ వ్యూహాలు సహకరించనున్నట్లు వివరించారు. అంతేకాకుండా కొత్త విభాగాలలో విస్తరణ, వృద్ధికి దోహదం చేయగలవని అభిప్రాయపడ్డారు. కంపెనీ దేశీయంగా 70 శాతం గ్యాస్‌ను 13,340 కిలోమీటర్ల పరిధిలో గల ట్రంక్ పైప్‌లైన్ ద్వారా వివిధ ప్రాంతాలకు రవాణా చేసే సంగతి తెలిసిందే. దేశీయంగా మొత్తం సహజవాయువు అమ్మకాల్లో 55 శాతం వాటా కంపెనీదే. 17.5 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. రూ. 8,800 కోట్లు మహారాష్ట్ర రాయిగఢ్ జిల్లాలోని ఉసార్‌లోగల ఎల్పీజీ ప్లాంటును పాలీప్రొపిలీన్ కాంప్లెక్స్‌గా మార్పిడి చేస్తోంది. ఇందుకు రూ. 8,800 కోట్ల పెట్టుబడులను వెచ్చిస్తోంది. తద్వారా 2022–23కల్లా 5 లక్షల టన్నుల తయారీ సామర్థ్యాన్ని అందుకోనుంది. దీనిలో భాగంగా పాలీఎథిలీన్, పాలీప్రొపిలీన్‌లకు భవిష్యత్‌లో పెరగనున్న డిమాండును అందుకునే అవకాశాలను అందిపుచ్చుకోవాలని భావిస్తోంది. ఇక మరోవైపు కంపెనీకి గల 120 మెగావాట్ల పవన, సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యాలను 1 గివావాట్‌కు పెంచుకునే ప్రణాళికలు వేసింది. ఇందుకు రానున్న మూడు, నాలుగేళ్లలో రూ. 4,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఇతర రంగాలలో విస్తరిస్తున్నప్పటికీ గ్యాస్ బిజినెస్ కీలక విభాగంగా నిలవనున్నట్లు మనోజ్ పేర్కొన్నారు. వెరసి జాతీయ గ్యాస్ గ్రిడ్‌లో భాగంగా ప్రాధాన్యతగల సెక్షన్ల ఏర్పాటుకు రూ. 32,000 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలియజేశారు. 7,500 కిలోమీటర్లమేర ఏర్పాటు చేయనున్న లైన్లలో దేశ తూర్పు ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు వెల్లడించారు. -
ఎంచక్కా విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవచ్చు!
పాడైపోయిన కూరగాయలు.. వ్యవసాయ వ్యర్థాలకూ... సౌరశక్తికీ మధ్య సంబంధం ఏమిటి? మామూలుగా ఆలోచిస్తే అసలేం కనిపించదు. కానీ... కార్వే మైగుయి అనే 27 ఏళ్ల ఫిలిప్పీన్స్ ఇంజనీర్ మాత్రం.. ఈ రెండింటి సాయంతో కొత్త రకం సోలార్ ప్యానెల్స్ తయారు చేశాడు! ఫలితం... ఇంటి కిటికీలు మొదలుకొని భవనాలకు బిగించే అద్దాల వరకూ.. అన్నీ సౌరశక్తి ఘటకాలే.. విద్యుదుత్పత్తి కేంద్రాలే! సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ వ్యర్థాలను, కుళ్లిపోయిన కూరగాయలను బయోగ్యాస్ ప్లాంట్‌లో వేస్తే వంటకు వాడుకోగల బయోగ్యాస్ ఉత్పత్తి అవుతుందని మనకు తెలుసు. కానీ ఈ వ్యర్థాల్లోంచి వేరు చేసిన ఓ వినూత్న పదార్థం.. సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలను పీల్చేసుకొని విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలవని కార్వే మైగుయికి మాత్రమే తట్టింది. సాధారణ సోలార్ ప్యానెల్స్ కేవలం కంటికి కనిపించే దృశ్యకాంతినే ఒడిసిపడతాయి. మైగుయి తయారు చేసిన పదార్థపు పొరను గాజు కిటికీలకు బిగిస్తే చాలు.. ఎక్కడ కావాలంటే అక్కడ ఎంచక్కా విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవచ్చునన్న మాట. నీడ ఉన్నా సరే.. భవనాల గోడను తాకి ప్రతిఫలించే అతినీలలోహిత కిరణా లను ఈ పదార్థం ఉపయోగించుకుం టుంది. ఈ ఆలోచనకు ఈ ఏడాది అంతర్జాతీయ స్థాయి పోటీ జేమ్స్ డైసన్ అవార్డు దక్కింది. వెలుగునిచ్చే పదార్థం... భూమిపై అయస్కాంత ధ్రువ ప్రాంతాల్లో రాత్రివేళ చిత్ర విచిత్రమైన రంగులు కొన్ని కనిపిస్తుంటాయి. అరోరా అని పిలిచే ఈ దృగ్విషయమే అతినీలలోహిత కిరణాలను ఒడిసిపట్టే వ్యవస్థ తయారీకి స్ఫూర్తి అని కార్వే మైగుయి తెలిపారు. సేంద్రియ పదార్థాల్లో ఉండే వెలుగునిచ్చే పదార్థం (బయోల్యూమినిసెన్స్)ను వేరు చేయడం ద్వారా తాను అరోరా రెన్యూ వబుల్ ఎనర్జీ అండ్ యూవీ సీక్వెస్ట్రేషన్ (ఔరియస్)ను తయారు చేశానని డైసన్ అవార్డు అందు కున్న సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్వే వివరించారు. మిణుగురు పురుగులు కూడా ఈ బయో ల్యూమినిసెన్స్ కారణంగానే చీకట్లో వెలుగులు చిమ్ముతాయి. వ్యవసాయ వ్యర్థాలు, పాడైపోయిన కాయగూరల్లోంచి ఈ బయోల్యూమినిసెన్స్ పదార్థపు పొర అతినీల లోహిత కిరణాల శక్తిని మాత్రమే శోషించుకుంటాయి. ఆ శక్తిని దృశ్యకాంతిగా మార్చి విడుదల చేస్తాయి. పొర లోపల ఈ కాంతి వెనక్కు, ముందుకు ప్రతిఫలిస్తూ.. ఒక చివరకు చేరతాయి. ఆ ప్రాంతంలో సోలార్ సెల్స్ ఏర్పాటు చేస్తే ఆ కాంతి డీసీ విద్యుత్‌గా మారుతుంది. రెగ్యులేటరీ సర్క్యూట్ల సాయంతో వోల్టేజీని నియంత్రిం చుకుంటూ ఈ విద్యుత్‌ను బ్యాటరీల్లో నిల్వ చేసు కోవచ్చు లేదా నేరుగా వాడుకోవచ్చు. ఎన్నో లాభాలు నగరాల్లో అతినీలలోహిత కిరణాల తాకిడి కాస్త ఎక్కువగా ఉంటుంది. చర్మ సంబంధిత సమస్యలకూ కారణమైన ఈ కిరణాలను సద్వినియోగం చేసుకొనేం దుకు ఈ ఔరియస్ వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతుంది. వ్యవసాయ వ్యర్థాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా రైతులకు ఎంతో కొంత అదనపు ఆదాయం లభించేలా చేయవచ్చు. సాధా రణ సోలార్ ప్యానెల్స్‌ను ఎప్పుడూ సూర్యుడికి అభిము ఖంగా ఉంచాల్సి ఉండగా.. ఈ కొత్త వ్యవస్థలో ఆ అవసరం ఉండ దు. కాంక్రీట్ గోడలు, ఫుట్‌పాత్‌లపై పడ్డ సూర్యరశ్మి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలను కూడా ఔరియస్ వాడుకోగలగడం దీనికి కారణం. దాదాపు 9 రకాల పంటల నుంచి బయోల్యూమినిసెన్స్ పదార్థాన్ని వేరు చేయవచ్చని కార్వే గుర్తించారు. ఉపయోగించే పదార్థాలన్నీ చౌకగానే లభ్యమవుతున్న కారణంగా ఔరియస్ కూడా తక్కువ ధరకే అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం తాము ఎరుపు, నారింజ, పసుపు, పచ్చ, నీలి రంగులతో కూడిన పదార్థాన్ని వెలికితీస్తున్నామని, నీలి రంగుకు ప్రత్యామ్నా యాన్ని కనుక్కోగలిగితే మరింత ప్రయోజనం ఉంటుం దని కార్వే మైగుయి వివరించారు. వాహనాలపై కూడా ఔరియస్ను వాడుకోవచ్చని తెలిపారు. -
పునరుత్పాదక ఇంధనాలదే భవిష్యత్
తెయూ(డిచ్పల్లి): కెమిస్ట్రీ, ఫార్మా కెమిస్ట్రీ రంగాలలో పరిశోధనలకు దక్షిణాఫ్రికా దేశంలో అపార అవకాశాలున్నాయని దక్షిణాఫ్రికాలోని క్వాజుల్ నటాల్ యూనివర్సిటీ కెమిస్ట్రీ ప్రొఫెసర్ సుబూసింగ్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా శిలాజ ఇంధనాలకు కాలం చెల్లుతుందని, రాబోయే రోజులన్నీ పునరుత్పాదక ఇంధనాలదేనన్నారు. తెలంగాణ యూనివర్సిటీ ఫార్మాస్యూటికల్ విభాగం ఆధ్వర్యంలో బుధవారం ‘భవిష్యత్ ఇంధనాలు’ అనే అంశంపై సుబూసింగ్ ప్రత్యేక ప్రసంగం చేశారు. పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాల నిల్వలు తరిగిపోతున్నాయని, వాటి వాడకం వల్ల పర్యావరణం కలుషితమై భూతాపం పెరిగిందన్నారు. పర్యావరణ పరిరక్షణ జరగాలన్నా, సుస్థిర అభివృద్ధి, ఇంధన స్వయం సమృద్ధి సాధించాలన్నా పునరుత్పాదక ఇంధనాల వినియోగం, ఉత్పత్తి పెరగాలని ఆయన సూచించారు. శిలాజ ఇంధనాలు రాజకీయ, భౌగోళిక, ఆర్థిక కారణాలతో సరఫరా ఆగిపోయే పరిస్థితి ఉంటుందన్నారు. హైడ్రోజన్ ఆధారిత ఇంధనాల అభివృద్ధి దిశగా తాము ప్రయోగాలు చేస్తున్నామని, ఇది భవిష్యత్ అవసరాలకు అనువుగా ఉంటుందన్నారు. దక్షిణాఫ్రికాలో పరిశోధనలకు విస్తృత అవకాశాలున్నాయని, ఆసక్తి గల విద్యార్థులు ఎంఎస్, పీహెచ్డీ, పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్‌లో చేరవచ్చన్నారు. అనంతరం సుమారు రెండు గంటల పాటు నిర్వహించిన ముఖాముఖిలో ఆయన విద్యార్థుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. సుబూసింగ్ డర్బన్‌లోని క్వాజుల్ నటాల్ యూనివర్సిటీలో మూడు దశాబ్దాలుగా కెమిస్ట్రీ విభాగంలో పరిశోధనలు చేస్తున్నారు. టూటా అధ్యక్షుడు రాజారాం, కార్యదర్శి పున్నయ్య, పరీక్షల నియంత్రణాధికారి యాదగిరి, ఫార్మా విభాగం హెడ్ చంద్రశేఖర్, ప్రిన్సిపల్ శిరీష, సత్యనారాయణ, నాగరాజు, సాయిలు తదితరులు సుబూసింగ్‌ను సత్కరించారు. -
జీఎస్టీ వద్దంటూ అప్పుడే లాబీయింగ్
పార్లమెంట్ ఇటీవలే ఆమోదించిన ప్రతిష్ఠాత్మకమైన బిల్లు జీఎస్టీపై భయాందోళనలు ప్రారంభమయ్యాయి. ఇన్నాళ్లూ పన్ను మినహాయింపును ఎంజాయ్ చేసిన కొన్ని రంగాలు జీఎస్టీ రాకతో తమపై పడే భారాన్ని లెక్కలేసుకుంటున్నాయి. ఈ పన్ను నుంచి తమను మినహాయింపు ఇవ్వాలని కోరుతూ అప్పుడే లాబీయింగ్ కూడా మొదలు పెట్టేశాయట. ఈ లాబీయింగ్‌లో ఎక్కువగా పరికరాలను దిగుమతి చేసుకునే పునరుత్పాదక ఇంధన రంగం ముందంజలో ఉంది. ఇప్పటివరకు జీరో కస్టమ్ డ్యూటీని ఎంజాయ్ చేసిన సౌర విద్యుత్ పరికరాల సంస్థలు.. జీఎస్టీ రాకతో దిగుమతిచేసుకోబోయే సోలార్ ప్యానళ్లపై 18 శాతం పన్నులను భరించాల్సి ఉంటుంది. దీంతో సౌర విద్యుత్ ధర కూడా యూనిట్‌కు రూపాయి వరకు పెరగనున్నట్టు రీన్యూ పవర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో రవి సేత్ తెలిపారు. పునరుత్పాదక విద్యుత్ రంగాన్ని జీఎస్టీ నుంచి మినహాయించాలని కోరుతూ ఇప్పటికే ప్రభుత్వం ముందు ఓ ప్రతిపాదనను ఉంచినట్టు తెలిపారు. అయితే జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటుచేశాక దీనిపై ఆ కౌన్సిలే నిర్ణయం తీసుకుంటుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారని హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ సీఈవో సునీల్ జైన్ పేర్కొన్నారు. ఇప్పటివరకు ఈ రంగానికి వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీల నుంచి మినహాయింపు ఉంది. జీఎస్టీ రాకతో పన్నులన్నింటిలో మార్పులు సంభవించి, టారిఫ్ కనీసం 10 శాతం ఎగిసే అవకాశాలున్నట్టు ఈ రంగ నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా టెలికాం రంగం సైతం జీఎస్టీ నుంచి తమను మినహాయించాలని ప్రభుత్వాన్ని కాకా పడుతోందట. జీఎస్టీ విధింపుతో వినియోగదారులు చార్జీల భారం భరించాల్సి ఉన్నట్టు ఆ రంగం నిపుణులు చెబుతున్నారు. జీఎస్టీ విధింపుతో పెట్రో ఉత్పత్తులు, విద్యుత్ చార్జీలు పెరిగి.. వీటిని బాగా వాడుకునే టెలికాం టవర్లపై ప్రభావం చూపగలవని అంచనా వేస్తున్నారు. అయితే జీఎస్టీ కౌన్సిల్ తప్పనిసరిగా తమ భయాందోళనలు అర్థంచేసుకుని నిర్ణయం ప్రకటిస్తుందని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఇండియా డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పర్యాటక రంగం సైతం జీఎస్టీ నుంచి మినహాయింపును డిమాండ్‌ను చేస్తోంది. ఎయిర్ లైన్ సెక్టార్లో 5.6 శాతం నుంచి 9 శాతంగా ఉన్న సర్వీసు టాక్స్ రేంజ్ జీఎస్టీ రాకతో మరింత పెరగనుంది.