ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ వినియోగం పెరుగుతోంది. పునరుత్పాదక వనరులు వినియోగించుకుని విద్యుత్ తయారుచేయడంలో చాలాదేశాలు ఎంతో పురోభివృద్ధి సాధిస్తున్నాయి.
ప్రధానంగా సౌరశక్తి, పవనశక్తిని ఉపయోగించి కరెంట్ తయారుచేయడంలో ఎన్నో కంపెనీలు విభిన్నంగా ఆలోచిస్తున్నాయి. అందులో భాగంగా కొన్నిదేశాల్లో స్థలం వృధా కాకుండా కాలువలపై సోలార్ ఎనర్జీ ప్లేట్లను ఏర్పాటుచేస్తుంటే.. కొన్నిచోట్ల జలాశయాలపై వాటిని వినియోగించి కరెంట్‌ను తయారుచేస్తున్నారు. తాజాగా న్యూయార్క్ సిటీలో ఏకంగా 8,500 ఎకరాల్లో సోలార్‌ప్లేట్లతో పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటుచేశారు. న్యూయార్క్ సిటీలో పునరుత్పాదకత వనరులను వినియోగించుకునేలా అక్కడి జోనింగ్ చట్టాలను సడలించించడంతో ఇలాంటి చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల న్యూయార్క్ సిటీ కౌన్సిల్ ‘సిటీ ఆఫ్ యెస్ ఫర్ కార్బన్ న్యూట్రాలిటీ’ని ఆమోదించింది. అక్కడి జోనింగ్ కోడ్‌ను అప్‌డేట్ చేయడంతో క్లీన్ ఎనర్జీ, ఈవీ ఛార్జర్‌లను ఇంప్లిమెంట్ చేయడానికి స్థిరమైన కార్యక్రమాలు చేపట్టే అవకాశం కల్పిస్తున్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది.
న్యూయార్క్‌సిటీలో జోనింగ్ కోడ్‌ను ఆధునీకరించడం ద్వారా పరిశుభ్రమైన గాలి, వ్యర్థాల నిర్వహణ, ఈవీ వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు న్యూయార్క్ సిటీ మేయర్ ఎరిక్ ఆడమ్స్ తెలిపారు. గతంలో తక్కువ ఆదాయాలు కలిగిన ప్రజలు నివసిస్తున్న ప్రదేశాల్లో సోలార్‌ప్లేట్లకు సంబంధించిన మైక్రోగ్రిడ్‌లను ఇన్‌స్టాల్ చేసేందుకు అనుమతులుండేవి కాదు. కానీ ప్రస్తుతం తీసుకున్న నిర్ణయాలతో అక్కడి ప్రదేశాలతోపాటు పార్కింగ్ స్థలాల్లో సౌరఫలకలను ఏర్పాటు చేసుకునేలా అనుమతిస్తున్నట్లు ఆడమ్స్ తెలిపారు. ఇది సిటీలో పూర్తిగా కార్యరూపం దాలిస్తే దాదాపు 1,30,000 గృహాలకు తక్కువ ఖర్చుతో కరెంట్ లభిస్తుందని అన్నారు.
ఇదీ చదవండి: బ్యాంకులో పెట్టిన బంగారం పోతే ఎంతిస్తారంటే...
తాజాగా జోనింగ్ చట్టాల్లో తీసుకొచ్చిన మార్పుల వల్ల 8,500 ఎకరాల పార్కింగ్ స్థలాల్లో సోలార్ ఎనర్జీని తయారుచేస్తున్నారు. దాంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment