కాలుష్య రహిత విద్యుత్‌ ఉత్పాదనలో తొలిస్థానంలో ఏపీ: సీఎం జగన్‌ | CM Jagan Virtually Lay Foundation Stone To 3 Renewable Energy Projects - Sakshi
Sakshi News home page

పంప్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టులతో భవిష్యత్తు తరాలకు గ్రీన్‌ ఎనర్జీ: సీఎం జగన్‌

Published Wed, Aug 23 2023 12:09 PM | Last Updated on Wed, Aug 23 2023 1:49 PM

CM Jagan Virtually Lay Foundation stone To 3 Renewable Energy Projects - Sakshi

సాక్షి, తాడేపల్లి: మూడు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. నంద్యాల జిల్లాలో ఏర్పాటు కానున్న సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులకు బుధవారం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.

ప్రాజెక్టులతో ఉద్యోగ అవకాశాలు
ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. 8 వేల ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. పర్యావరణ హితంగా ఈ ప్రాజెక్టు ఉంటుందన్నారు. సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు వల్ల ఉద్యోగ అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు.  సోలార్‌ ఎనర్జీ కోసం రూ. 2.49 పైసలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టుల కోసం NHPCతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. రైతులకు ఉచిత విద్యుత్‌ విషయంలో ఇబ్బంది లేకుండా చూస్తున్నామని పేర్కొన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని, గ్రీన్‌ ఎనర్జీని ఉత్పత్తి చేసే విషయంలో దేశంలోనే ఆదర్శంగా నిలుస్తామని చెప్పారు.

భవిష్కత్తు తరాలకు గ్రీన్‌ ఎనర్జీ
►పంప్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టుల వల్ల భవిష్యత్తు తరాలకు గ్రీన్‌ ఎనర్జీ అందుతుంది. 
►కాలుష్య కారక విద్యుత్‌పై ఆధారపడే పరిస్థితి క్రమేణా తగ్గుతుంది. భవిష్యత్తులో పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులు కీలక పాత్ర పోషిస్తాయి. 
►వీటికి అనుబంధంగా సోలార్‌, విండ్‌ ప్రాజెక్టులు అనుసంధానం అవుతున్న తీరు గ్రీన్‌ ఎనర్జీలో విప్లవానికి దారితీస్తాయి.
►ఉదయం 6 నుంచి సాయంత్రం వరకూ సోలార్‌ వస్తుంది. సాయంత్రం నుంచి తెల్లవారుజామువరకు విండ్‌ ఎనర్జీని వాడుకోవచ్చు. 
►పీక్‌ అవర్స్‌లో పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులను  వినియోగించుకుంటాం.

► ఒక కృత్రిమ బ్యాటరీగా పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులు పనిచేస్తాయి.
►కాలుష్య రహిత విద్యుత్‌ ఉత్పాదనలో ఏపీ మొదటి స్థానంలో నిలిచేలా ఈ అడుగులు వేస్తున్నాం.
►ఏపీలో 8999 మెగావాట్లకు సంబంధించి సోలార్‌, విండ్‌ పవర్‌ ఉంది.
►రైతులకు ఉచితంగా పగటిపూటే విద్యుత్తు అందుబాటులోకి రావాలని, 7200 మెగావాట్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో రూ.2.49లకే ఒప్పందం కుదుర్చుకున్నాం.

ఉచిత కరెంట్‌కు ఢోకా లేకుండా..
►రైతులకు ఉచితంగా కరెంటును సమర్థవంతంగా కొనసాగించేందుకు, ఎలా ఢోకా లేకుండా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏర్పాటు చేసింది.
►తక్కువ ధరకే కరెంటు వస్తున్నందువల్ల ప్రభుత్వానికి, జెన్‌కోకు వెసులుబాటు కలుగుతుంది.
► ఇవన్నీ ఒకవైపున చేస్తుండగానే పంప్డ్‌ స్టోరేజీని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
► వేల మెగావాట్ల ప్రాజెక్టులకు సంబంధించి లొకేషన్లను గుర్తించాం.
►29 ప్రాజెక్టులకు సంబంధించి 33వేల మెగావాట్లకు పైగా ప్రాజెక్టు నివేదికలు సిద్ధం అయ్యాం.
► కొన్ని డీపీఆర్‌లు కూడా సిద్ధం అయ్యాయి.
►వివిధ కంపెనీలకు అలాట్‌మెంట్‌కూడా చేశాం.
► ఇందులో భాగంగానే ఇవాళ ఎన్‌హెచ్‌పీసీతో ఒప్పందం చేసుకుంటున్నాం.
► యాగంటిలో, కమలపాడులో దాదాపుగా 2వేల మెగావాట్లకు సంబంధించి రూ.10వేల కోట్లతో చెరిసగం వాటాతో ప్రాజెక్టుల నిర్మాణానికి ఎంఓయూ కుదుర్చుకుంటున్నాం.
►ఈరెండు సంస్థలూ మరింతగా అడుగులు ముందుకేసేందుకు మరో 3700 మెగావాట్లకు సంబంధించిన ఫీజబిలిటీ స్టడీలు జరగుతున్నాయి.

దేశానికే ఆదర్శం
►రాబోయే రోజుల్లో ఈప్రాజెక్టులను కూడా చేపడతాయి.
► ప్రభుత్వ సంస్థల విద్యుత్‌ ఉత్పాదన సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా, ప్రయివేటు కంపెనీలను కూడా ప్రోత్సహిస్తున్నాం.
► గ్రీన్‌ ఎనర్జీ విషయంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తాం.
►2300 మెగావాట్ల సౌరవిద్యుత్‌ గ్రీన్‌ కో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తున్నాం.
►2300 మందికి ఉద్యోగావకాశాలు వస్తాయి.
► ఆర్సెలర్‌ మిట్టల్‌ కూడా 1014 మెగావాట్ల సోలార్‌, విండ్‌ పవర్‌ పనులకు శంకుస్థాన చేస్తున్నాం. దాదాపు వేయి మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయి.
►ఎకోరన్‌ సంస్థ 2వేల మెగావాట్ల పునర్‌ ఉత్పాదక ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన చేస్తున్నాం. మరో 2 వేలమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

ప్రభుత్వానికి ఆదాయం
►ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో స్థానికంగా మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి.
►ప్రతి మెగావాట్‌ ఉత్పత్తికి ఆ ప్రాజెక్టుల లైఫ్‌ ఉన్నంతకాలం రాయల్టీ కింద రూ.1లక్ష చొప్పున వస్తుంది.
► జీఎస్టీ ఆదాయం కూడా ప్రభుత్వానికి వస్తుంది.
►సహకారం అందిస్తున్న రైతులకు, రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తిగా ఉంటూ ప్రతి ఎకరాకు ఏడాదికి రూ.30వేలు లీజు చొప్పున వస్తుంది.
► ప్రతి రెండేళ్లకు 5శాతం లీజు రుసుము పెరుగుతుంది.
►ఈ ప్రాజెక్టుల వల్ల రైతులకూ మంచి జరుగుతుంది
► దశాబ్దాలుగా నీళ్లకు కటకటలాడే ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టుల కారణంగా రైతులకు మంచి జరుగుతుంది.
►ఈ ప్రాజెక్టుల వల్ల వస్తున్న ఉపాధి రూపంలోనే కాకుండా, జీఎస్టీ ఆదాయమే కాకుండా, రైతులకూ, ప్రభుత్వానికి భూముల ఇచ్చినందుకు లీజు రూపంలో డబ్బు వస్తుంది.
► అన్నింటికంటే ముఖ్యంగా పర్యావరణానికి మేలు జరుగుతుంది.


చదవండి: చంద్రయాన్‌-3 ల్యాండింగ్‌: ఏపీ ‍ప్రభుత్వ బడుల్లో ప్రత్యక్ష ప్రసారాలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement