సాక్షి, నంద్యాల జిల్లా: పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రగతిపథంలో నిలిపేందుకు మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఇడుపులపాయ నుంచి ఎన్నికల ప్రచారభేరి మోగించారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి నివాళులు అర్పించారు. అనంతరం ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రను ప్రారంభించారు. తొలి రోజు బస్సు యాత్ర కడప పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో జరిగింది.
మేమంతా సిద్ధం బస్సు యాత్ర రెండో రోజు షెడ్యూల్ :
మేమంతా సిద్ధం బస్సు యాత్ర రేపు(గురువారం) నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ లోని రాత్రి బస చేసిన ప్రాంతం నుంచి ప్రారంభమవుతుంది. ఈ యాత్రలో భాగంగా సీఎం జగన్ ఉదయం 9 గంటలకు ఆళ్లగడ్డ నుంచి నల్లగట్ల, బత్తలూరు, ఎర్రగుంట్ల చేరుకొని గ్రామస్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం గోవిందపల్లి మీదగా చాబోలు శివారులో భోజన విరామం తీసుకుంటారు.
అనంతరం నూనేపల్లి మీదుగా నంద్యాల చేరుకుని గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం పాణ్యం, సుగాలిమిట్ట, హుస్సేనాపురం, ఓర్వకల్, నన్నూర్, పెద్దటేకూరు, చిన్నకొట్టాల, కె.మార్కాపురం క్రాస్, నాగలాపురం, పెంచికలపాడులో ఏర్పాటు చేయబడిన రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.
ఇదీ చదవండి: నాపై బురద జల్లేందుకు నా చెల్లెమ్మల్ని తీసుకొచ్చారు: సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment