
మేమంతా సిద్ధం 8వ రోజు గురువారం (ఏప్రిల్ 4) షెడ్యూల్‌ను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం బుధవారం విడుదల చేశారు.
సాక్షి, చిత్తూరు/నెల్లూరు: మేమంతాసిద్ధం 8వ రోజు గురువారం (ఏప్రిల్ 4) షెడ్యూల్‌ను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం బుధవారం విడుదల చేశారు. ఈ యాత్రలో భాగంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉదయం 9 గంటలకు గురవరాజుపల్లె రాత్రి బస చేసిన ప్రాంతం దగ్గర నుంచి బయలుదేరుతారు.
మల్లవరం, ఏర్పేడు మీదగా పనగల్లు, శ్రీకాళహస్తి బైపాస్ మీదగా చిన్న సింగమల సమీపంలో 11 గంటలకు చేరుకుని లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లతో ముఖాముఖిలో పాల్గొంటారు. అనంతరం చావలి చేరుకొని భోజన విరామం తీసుకుంటారు.
సాయంత్రం 3:30 గంటలకు నాయుడుపేటలో నుంచి చెన్నై జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం ఓజిలి క్రాస్, బుదనం, గూడూరు బైపాస్, మనుబోలు, నెల్లూరు బైపాస్ మీదుగా చింతరెడ్డి పాలెం వద్ద రాత్రి బసకు చేరుకుంటారు.
ఇదీ చదవండి: చంద్రబాబు, ప్రజలకు మధ్య యుద్ధం ఇది: సీఎం జగన్