
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రేపటి(శనివారం) ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్‌ను వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘరామ్ శుక్రవారం విడుదల చేశారు.
సీఎం జగన్ 4వ తేదీన ఎన్నికల ప్రచారాన్ని మూడు నియోజకవర్గాల్లో నిర్వహిస్తారు. శనివారం ఉదయం 10 గంటలకు హిందూపురం పార్లమెంట్ పరిధి హిందూపురం పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్‌లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు చిత్తూరు పార్లమెంట్ పరిధి పలమనేరు నియోజకవర్గ కేంద్రంలోని బస్టాండ్ సెంటర్‌లో జరిగే సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు పార్లమెంట్ పరిధి నెల్లూరు సిటీ గాంధీ విగ్రహం సెంటర్‌లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు.